biography
-
ఈ తెలుగాయన ఆఫ్రికాని జయించాడు!
విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అనుకోవటం వేరు.. విజయాన్ని అందుకోవడం వేరు!. ఆటంకాలకు అవకాశాలుగా మార్చుకుని.. పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించిన గాథల్లో మోటపర్తి శివరామ వర ప్రసాద్(MSRV Prasad) సక్సెస్‌కు చోటు ఉంటుంది. ఆయన ఎదుగుదలా క్రమమే ‘అమీబా’గా ఇప్పుడు పాఠకుల ముందుకు వచ్చింది.చీకటి ఖండంగా పేరున్న ఆఫ్రికాలో.. అదీ అననుకూల పరిస్థితుల నడుమ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఓ తెలుగోడి ఆత్మకథే అమీబా. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) దీనిని రచించడం ఇక్కడ ఒక విశేషం కాగా.. తెలుగులో ఇది తొలిక్రైసిస్ మేనేజ్మెంట్ బుక్ కావడం మరో ప్రత్యేకత. నవ సాహితి బుక్ హౌజ్ పబ్లికేషన్స్ అచ్చేసిన ఈ బయోగ్రఫీ బుక్.. ఈ మధ్యే జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులు పాల్గొన్న ఓ ఈవెంట్లో లాంఛ్ అయ్యింది.పశ్చిమ గోదావరిలో కొవ్వలి అనే కుగ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి మోరపాటి జన్మించారు. ఆటంకాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సాగిన ఆయన ప్రయాణం.. ప్రస్తుతం సంపద విలువను రూ. 12 వేల కోట్లకు చేర్చింది. Warangal NIT లో మెటలర్జి చదివారు. గుజరాత్ లో పని చేసి, హైదరాబాద్‌లో ఫౌండ్రి పెట్టారు. తర్వాత ఆ వ్యాపారాన్ని ఘనాలో విస్తరించాడు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ స్టీల్, సిమెంట్, కెమికల్స్, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్, గార్మెంట్స్ పరిశ్రమలను స్థాపించారాయన. వాటి ద్వారా 20 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. శ్రమ, ముందు చూపు, జ్ఞానం.. తన విజయానికి కారణాలని చెప్తున్నారు. అన్నట్లు.. సారధి స్టూడియోకు ప్రస్తుతం చైర్మన్ ఈయనే. మోటపర్తి శివరామ వర ప్రసాద్ విజయ ప్రయాణం.. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, చాతుర్యం వంటి వాటికి నిదర్శనం. ఉద్యోగి సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది.:::డాక్టర్ జయప్రకాష్ నారాయణAMOEBA.. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుని.. నిర్దేశించని ప్రాంతాలను జయించిన వ్యక్తికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనం. గొప్ప విజయాల్ని అందుకోవాలనుకునేవాళ్లెందరికో ఆయన జీవితం ఓ ఆశాజ్యోతి. :::రచయిత యండమూరి వీరేంద్రనాథ్రూ.400 జీతగాడిగా(మెటాలర్జిస్ట్గా) మొదలైన ఓ తెలుగు ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం.. ఇప్పుడు సాధన సంపత్తి, అపారమైన సంపద, ఓ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించడం ఎంతైనా స్ఫూర్తిదాయకం కాదంటారా?. -
అక్షరాలై వెలిగారు
కాలక్షేప సాహిత్యానికి కాలం చెల్లిన కాలం ఇది. ఈ ఉరుకు పరుగుల కాలంలో పుస్తకం నిలబడాలంటే సత్తా ఉండాలి. సామాజిక అంశాలు ఉండాలి. అలాంటి సత్తా ఉన్న పుస్తకాలతో ఈ సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు మన మహిళా రచయిత్రులు. లింగవివక్ష నుంచి స్త్రీ సాధికారత వరకు... అట్టడుగు శ్రామిక జీవితాలను నుంచి లౌకికవాదం వరకు... ఎన్నో అంశాలపై ప్రామాణికమైన పుస్తకాలు రాశారు...రెజ్లర్ టు రైటర్సాక్షి మాలిక్ (Sakshi Malik) పేరు వినబడగానే ‘స్టార్ రెజ్లర్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. రెజ్లర్ సాక్షి కాస్తా ‘విట్నెస్’తో (Witness) రైటర్‌గా మారింది. సాక్షి మాలిక్‌ది నల్లేరు మీద నడక కాదు. ఘర్షణ లేకుండా ఆమె నడక లేదు. ఆ ఘర్షణలో పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేయడం కూడా ఒకటి. పేదరికాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నతస్థాయికి చేరడానికి తాను పడిన కష్టాలకు జోనాథన్ సెల్వరాజ్‌తో (Jonathan Selvaraj) కలిసి ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం ఇచ్చింది సాక్షి మాలిక్. ఆటలో పడి లేవడం సాధారణం. అయితే పడిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడం సాక్షి శైలి. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ‘నేను తల్లి అయిన తరువాత భవిష్యత్తులో ఏదో ఒకరోజు గోడకు వేలాడుతున్న ఒలింపిక్ మెడల్‌ను చూస్తూ అది ఏమిటి? అని నా బిడ్డ నన్ను అడగవచ్చు. నేను ఆ మెడల్‌ను బిడ్డ చేతిలో పెట్టి అది ఏమిటో, అది గెలవడానికి ఎంతదూరం ప్రయాణించాల్సి వచ్చిందో వివరంగా చెబుతాను’ అంటుంది సాక్షి మాలిక్.విట్నెస్ – సాక్షి మాలిక్జ్ఞాపకాల జ్ఞాన సముద్రంఇది పుస్తకం అనడం కంటే నాలుగు తరాల జ్ఞాపకాల సంపుటి అనడం సబబుగా ఉంటుంది. ఎంతో పరిశోధిస్తే కాని ఇలాంటి పుస్తకం రాయలేము. పరిశోధనకు తోడు నుస్రత్ ఎఫ్ జాఫ్రీలోని (Nusrat Fatima Jafri) అద్భుత సృజనాత్మకత పుస్తకానికి మంచి పేరు వచ్చేలా చేసింది. తన పూర్వీకుల మతమార్పిడి అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఈ పుస్తకంలో వివరిస్తుంది జాఫ్రీ. ‘నా బంధువులు వారి జీవితంలో వివిధ సందర్భాలలో కొత్త మతాలను స్వీకరించాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ కారణాలలో రాజకీయం(Politics) నుంచి సామాజికం వరకు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి మత మార్పిడి ప్రయాణం ప్రత్యేకమైనది’ అంటుంది జాఫ్రీ. అయితే వారి కుటుంబ చరిత్ర అంతా దేశ విస్తృత చరిత్రతో లోతుగా ముడిపడినందు వల్లే పుస్తకం ప్రత్యేకంగా నిలిచింది, వలస పాలన, స్వాతంత్య్రపోరాటం, వలసానంతర రాజకీయాలు... మొదలైనవి ‘దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్’లో కనిపిస్తాయి.దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్: ది స్టోరీ ఆఫ్ ఏ ఫ్యామిలి, క్యాస్ట్, కన్వర్జేషన్స్ అండ్ మోడర్న్ ఇండియా – నుస్రత్ ఎఫ్.జాఫ్రీఇదేం భాష?!న్యూయార్క్‌లోని హంటర్ కాలేజిలో ‘ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్’లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రూపాల్ ఓజా రాసిన పుస్తకం ఎమియోటిక్స్ ఆఫ్ రేప్. బాధితురాలు, సర్వైవర్లాంటి పదాలకు అతీతంగా లైంగిక హింస కేసులకు సంబంధించిన భాషలో మూసధోరణులు, పితృస్వామిక భావజాలాన్ని ఈ పుస్తకంలో విశ్లేషిస్తుంది రూపా ఓజా. ప్రభుత్వ అధికారుల నుంచి గ్రామ వార్డు మెంబర్లు, కుల సంఘాల వరకు అత్యాచార కేసులను లైంగిక విషయాలపై చర్చించే వేదికలుగా ఎలా చూస్తారో ఈ పుస్తకంలో వివరిస్తుంది రుపాల్ ఓజా.ఎమియోటిక్స్ ఆఫ్ రేప్: సెక్సువల్ సబ్జెక్టివిటీ అండ్ వయొలేషన్ ఇన్ రూరల్ ఇండియా– రూపాల్ ఓజాఉద్యమమే జీవితమై..ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అరుణ దిల్లీ సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీకి సెక్రటరీగా ఉన్నతోద్యోగాలు చేసినా ‘ఉద్యమ నాయకురాలు’గానే ఆమె సుపరిచితురాలు. సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్ (బేర్‌ఫుట్ కాలేజీ)తో మొదలైన ఆమె ప్రయాణం ఎంతోదూరం వెళ్లింది. ఎన్నో మలుపులు తిరిగింది. తన ఉద్యమజీవితాన్ని, ఉద్యమాల బాటలో తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’లో రాసింది అరుణా రాయ్. ఉద్యమం అనే మహా పాఠశాలలో తాను నేర్చుకున్న పాఠాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ది పర్సనల్ ఈజ్ పొలిటికల్: యాన్ యాక్టివిస్ట్ మెమోయిర్ – అరుణా రాయ్అట్టడుగు కోణం నుంచి...దేశంలోని అత్యంత మారుమూల, అణగారిన వర్గాల గురించి బేలా భాటియా రాసిన పుస్తకం ఇది. మన దేశంలోని నిరుపేద ప్రజలపై జరిగే హింసాకాండపై వెలుగును ప్రసరిస్తుంది. వర్గ, లింగ, భౌగోళిక అంశాలను మేళవించి రాసిన పుస్తకం ఇది.ఇండియాస్ ఫర్గాటెన్ కంట్రీ: ఏ వ్యూ ఫ్రమ్ ది మార్జిన్స్– బేలా భాటియాహింస ధ్వనిమన దేశంలోని తాజా రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. భీమా– కోరేగావ్ ఘటనలో కొందరిని కేసులో ఎలా ఇరికించారో, సాక్ష్యాధారాలు ఎలా సృష్టించారో, కేసు లేకపోయినా రాజకీయ కారణాలతో ఎలా హింసించారో ఈ పుస్తకంలో అల్పా షా రాసింది.భీమా–కోరేగావ్ అండ్ ది సెర్చ్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇండియా: అల్పా షాఎర్రజెండ నీడలో... 1920 దశకంలో భారత రాజకీయాల్లో కమ్యూనిజం స్పష్టమైన అస్తిత్వంగా మారడం నుంచి కమ్యూనిస్ట్ మహిళల జీవితాలను సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంలో విశ్లేషించడం వరకు ఎంతో సమాచారం ‘రెవల్యూషనరీ డిజైర్స్’లో కనిపిస్తుంది.ఎన్నో జీవితాల గురించిరెవల్యూషనరీ డిజైర్స్: ఉమెన్ కమ్యూనిజం అండ్ ఫెమినిజం ఇన్ ఇండియా – అనియా లూంబాశ్రామిక జనజీవన చిత్రంసాధారణ శ్రామిక వర్గ భారతీయురాలి జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపే ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ నేహా దీక్షిత్ రాసింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సైదా ఎక్స్ బెనారస్ నుంచి దిల్లీకి వెళుతుంది. దిల్లీలో బతకడానికి రోజుకు ఎన్నో ఉద్యోగాలు చేస్తుంది. ఒక రోజు సెలవు తీసుకుంటే కూడా ‘రేపు బతకడం ఎలా’ అనే భయం నుంచి రాత్రి, పగలు కష్టపడిన సైదా కథ ఈ పుస్తకంలో కనిపిస్తుంది, దిల్లీలోని చాందిని చౌక్‌లో రిక్షా తొక్కే కార్మికుడు ఉగ్రవాదుల బాంబు పేళుళ్లలో మరణిస్తాడు. ‘ది మెనీ లివ్స్ ఆఫ్...’లో సయిదా, బాంబు పేలుళ్లలో చనిపోయిన అమాయక రిక్షాకార్మికుడిలాంటి ఎంతోమంది సామాన్యుల, శ్రామికుల జీవితాలు కనిపిస్తాయి.ది మెనీ లైవ్స్ ఆఫ్ సైదా ఎక్స్ – నేహా దీక్షిత్స్వతంత్రభారత స్వరంఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పుస్తకం స్వతంత్ర భారత దేశ సంక్షిప్త చరిత్ర. జాతీయవాదంలోని అనేక అంశాల గురించి తన భావాలను వెల్లడి చేస్తుంది నందిత హక్సర్. మన దేశం ఎలా ముందుకు సాగాలనే దాని గురించి కౌమార దశలో తన అమాయక ఆలోచనలు ఈ పుస్తకంలో గుర్తు తెచ్చుకుంది నందిత. అమాయక ఆలోచనల నుంచి వాస్తవికదృష్టితో ఆలోచించడం వరకు తన ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పును గురించి కూడా ‘ది కలర్స్ ఆఫ్ నేషనలిజం’లో రాసింది నందితా హక్సర్‌ది కలర్స్ ఆఫ్ నేషనలిజం– నందితా హక్సర్‘తమాషా’ వెనుకఎంత విషాదమో!మహారాష్ట్రలోని తమాషా డ్యాన్సర్ల గురించి రాసిన పుస్తకం ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే తమాషా కళాకారుల సామాజిక, మేధోచరిత్రను రికార్డ్ చేసిన మొదటి పుసక్తంగా చెప్పుకోవచ్చు. హిస్టరీప్రొఫెసర్ అయిన డా. శైలజ పైక్ తొలి పుస్తకం... దళిత్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడ్రన్ ఇండియా: డబుల్ డిస్క్రిమినేషన్. నలుగురు ఆడపిల్లల్లో ఒకరిగా యెరవాడ మురికి వాడలోని ఒకేగది ఇంట్లో పెరిగిన శైలజకు పేదల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆ అనుభవ జ్ఞానంతోనే మహారాష్ట్రలోని తమాషా కళాకారుల జీవితానికి అద్దం పట్టేలా ‘ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్’ పుస్తకం రాసింది.ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్ – శైలజ పైక్ -
60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్ ఇసాక్‌మన్ సక్సెస్ స్టోరీ
అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్టించాక పాలనలో పలు మార్పులు తీసుకువస్తున్నారు. ప్రతిష్టత్మక పదవులలో నూతన నియామకాలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే అధ్యక్షుడు ట్రంప్ తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చీఫ్‌గా 41 ఏళ్ల బిలియనీర్ జారెడ్ ఇసాక్మన్ను నియమించారు.ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ స్పేస్ ఎక్స్ సాయంతో అంతరిక్షంలోకి మొదటి ప్రైవేట్ ట్రిప్ చేసిన వ్యక్తి ఇసాక్‌మన్. 2009లో ఇసాక్‌మన్ 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 16 ఏళ్ల వయసులో చదవును విడిచిపెట్టి, నేడు నాసాకు చీఫ్‌గా నియమితులయ్యే వరకూ ఇసాక్‌మన్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇసాక్‌మన్ అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగానూ గుర్తింపుపొదారు.ఇసాక్‌మన్ 1983, ఫిబ్రవరి 11న న్యూజెర్సీలో డొనాల్డ్,సాండ్రా మేరీ ఐజాక్మన్ దంపతులకు జన్మించారు. నలుగురు తోబుట్టువులలో ఇసాక్‌మన్ చిన్నవాడు. ఆయన కిండర్ గార్టెన్ నుండి ఆరవ తరగతి వరకు వెస్ట్‌ఫీల్డ్‌లోని విల్సన్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాడు. ఇసాక్మన్కు 12 ఏళ్లు ఉన్నప్పుడు అతని కుటుంబం న్యూజెర్సీలోని బెర్నార్డ్స్ టౌన్‌షిప్‌లోని లిబర్టీ కార్నర్ విభాగానికి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఇసాక్‌మన్ విలియం అన్నీన్ మిడిల్ స్కూల్లో చదువుకున్నారు.హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఇసాక్‌మాన్ తన స్నేహితునితో కలిసి తన ఇంటిలో క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ కంపెనీ షిఫ్ట్ 4ను ప్రారంభించారు. 1999లో ఇసాక్‌మన్ పాఠశాల చదువును మధ్యలోనే విడిచిపెట్టారు. అయితే హైస్కూల్ డిప్లొమాకు సమానమైన జీఈడీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం కంపెనీ షిఫ్ట్ 4 కంపెనీ విలువ దాదాపు 7.4 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ హిల్టన్, కేఎఫ్‌సీ వంటి బ్రాండ్లకు చెల్లింపు ప్రాసెసింగ్ చేస్తుంది.ఇసాక్‌మన్ ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెషనల్ ఏరోనాటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. 2011లో ఈ డిగ్రీని పొందిన ఇసాక్మన్కు సైనిక విమానాలను నడిపేందుకు అవసరమైన లైసెన్స్ కూడా ఉంది. అతని దగ్గర దాదాపు 100 యుద్ధ విమానాలు ఉన్నాయి. అతని కంపెనీ అమెరికా, నాటో దేశాల వైమానిక దళాల ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇస్తుంది. ఇసాక్‌మన్ అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతని ఆస్తుల నికర విలువ 1.9 అమెరికన్ బిలియన్ డాలర్లు. 2021లో పొలారిస్ ప్రోగ్రామ్ కింద ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ సహాయంతో చారిత్రక అంతరిక్ష యాత్ర చేశాడు. ఈ పర్యటన కోసం ఇసాక్‌మన్ 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు.ఇది కూడా చదవండి: భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్ వైఖరి? -
అభిమానులకు నయనానందకరం
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హీరోయిన్ నయనతార జీవితంపై రూపొందిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.తెర మీద కనపడే తారలపై ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. మరీ ముఖ్యంగా సినీ ప్రేక్షకులు ఈ తారలపై అపరిమిత అభిమానాన్ని పెంచుకుంటూ వారి వ్యక్తిగత జీవితాలను గురించి కూడా తెలుసుకోవాలని ఆరాటపడతుంటారు. ప్రస్తుత వినోద రంగంలో వాణిజ్య విప్లవమైన ఓటీటీ వేదికలు అడపాదడపా కొంతమంది కళాకారుల వ్యక్తిగత జీవితాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నాయి.వీటికి సదరు నటీనటులకు ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో పారితోషికం ముట్టజెప్పి డాక్యుమెంటరీలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రముఖ నటి నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ రిలీజ్ అయింది. బెంగళూరు నగరంలో పుట్టిన నయనతార అనతి కాలంలోనే తన సినిమా కెరీర్లో అత్యున్నత స్థాయికి ఎదిగారని చెప్పవచ్చు. సౌత్ ఇండియా క్వీన్ అని ఫ్యాన్స్ పిలుచుకునే ఈ బ్యూటీ ప్రతిష్ఠాత్మక పత్రిక ఫోర్బ్స్‌లో ‘ఇండియాలో సెలబ్రిటీ 100 లిస్ట్’లో ప్రచురింపబడ్డ ఒకే ఒక్క దక్షిణాది నటి.అంతటి నటి డాక్యుమెంటరీ అంటే ఇక చెప్పేదేముంది అభిమానులకు పండగే. ఈ డాక్యుమెంటరీ మొత్తం నయనతార జీవితాన్ని చూసినట్టుగా కాదు, అనుభూతి పొందినట్టుగా ఉంటుంది. నయనతార పుట్టుక నుండి తన పెరుగుదల, చదువు ఆ తరువాత తన సినిమా ప్రస్థానం ఇవన్నీ ఎంతో చక్కగా చూపించారు. వీటితో పాటు నయనతార గురించి సినీ ప్రముఖులు, ఆమె ఆప్తుల అభిప్రాయాలతో కూడిన విశ్లేషణ ఇవ్వడం మరో హైలైట్. జీవితమంటే సాఫీగా సాగే ప్రయాణమే కాదు.ఒడిదుడుకులుంటాయి. సినిమా స్టార్ అయినా సాధారణ మనిషైనా ఎవ్వరికైనా జీవితం జీవితమే. అలాగే నయనతార ఎంత ఎత్తుకు ఎదిగినా తన జీవితంలో కూడా ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా తానే వివరిస్తూ తన సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ప్రేక్షకులకు సవివరంగా వివరించారు. నయనతార గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ టైటిల్లో ఉన్నట్లు ఈ డాక్యుమెంటరీ అంతకు మించి... అందుకే ఇది నయనానందకరం.– ఇంటూరు హరికృష్ణ -
Akshainie Reddy: నానమ్మ గురించి రాస్తా...
పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల్ల అమ్మాయి గురించి కథ రాస్తే ఎలా ఉంటుంది?! ఏడవతరగతి చదువుతున్న పన్నెండేళ్ల పట్లోళ్ల అక్షయినీ రెడ్డి రాసిన ‘ట్రైల్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్’ పుస్తకం ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలు అక్షయినీ రెడ్డి.‘‘మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో రోజూ చూస్తుంటాను. నానమ్మ, అమ్మ, నాన్న.. మా ఇంట్లోని వ్యక్తులే నాకు స్ఫూర్తి. నానమ్మ లైఫ్ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను...’ అంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.‘‘నాకు కథలపైన ఆసక్తి మొదలైందంటే అమ్మ చెప్పిన స్టోరీస్ వల్లే. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ రకరకాల కథలు చెబుతుంటుంది. తముణ్ణి, నన్ను బయటకు తీసుకెళ్లినప్పుడైనా, కాస్త టైమ్ దొరికినా ఏదో చిట్టి కథ ఉంటుంది. సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కథలు చెప్పి, వాటిని షార్ట్ ఫార్మ్‌లో రాసి చూపించమనేది. తర్వాత్తర్వాత పుస్తకాల్లోని కథలు చదివినా, వాటిని ఒక చిన్న పేరాలో రాసి చూపించేదాన్ని. ఈ అలవాటు నాకు పుస్తకాలంటే ఇష్టం పెరిగేలా చేసింది. ఇప్పుడు నా కోసం ఇంట్లో ఓ లైబ్రరీయే ఏర్పాటు చేశారు. ఎక్కువ భాగం ఇంగ్లిష్వే ఉంటాయి. ఫారినర్స్ రాసినవి, సుధామూర్తి రచనలు బాగా చదువుతాను. ఒక బుక్ చదివాక బాగా నచ్చితే ఆ బుక్ నుంచి మరొక స్టోరీ రాస్తాను. ‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ పుస్తకం అలా రాసిందే. నానమ్మ, నాన్న, అమ్మ, స్కూల్లో టీచర్స్, ఫ్రెండ్స్.. చాలా మెచ్చుకున్నారు.బలమైన వ్యక్తిత్వం‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ బుక్ లో పదహారేళ్ల అమ్మాయి పేరు ఆటమ్. ఆమె భావోద్వేగాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి. ఒక చిన్న వెకేషన్ కోసం తల్లిదండ్రులను ఒప్పించి మెక్సికోకు బయల్దేరుతుంది. అనుకోని సంఘటనలో తల్లి మరణిస్తుంది. తమ కుటుంబం నుంచి దూరమైన ఆంటోనియోను కలుసుకుంటుంది. క్షేమకరం కాని ఆ ్రపాంతంలో ఉండలేక మెక్సికో నుంచి వాళ్లు లండన్‌కు చేరుకుంటారు. అక్కడ జేమ్సన్ అనే వ్యక్తిని కలుస్తారు. జేమ్సన్ కుటుంబంతో ఉండటమూ క్షేమకరం కాదని అర్థమై తండ్రి, ఆంటోనియోలతో కలిసి జర్మనీకి వెళ్లిపోతుంది. జీవితమెప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే ఆటమ్ ప్రతినిత్యం సమస్యలతో చేసే ప్రయాణం గురించి ఈ కథ వివరిస్తుంది. ఆ అమ్మాయి స్నేహాలను ఎలా డెవలప్ చేసుకుంటుంది, ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, ఒకమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనే విషయాలు నేర్పిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ ఎండింగ్ తప్పక దొరుకుతుంది అనే హోప్‌ని ఇస్తుంది. నా ఫ్రెండ్స్ టైటిల్ విషయంలో, కవర్ పేజీ విషయంలో సాయం చేశారు. ఈ బుక్ కోసం ఏడాది పాటు వర్క్ చేశాను. నిజానికి 16 ఏళ్ల అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అనే విషయాలను గురించి అంతగా మ్యాచ్ చేయలేకపోవచ్చు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ బుక్స్ బాగా చదువుతారు. వారికి ఈ పుస్తకంలో స్నేహపూర్వక స్వభావం, స్ట్రాంగ్ విల్‌పవర్, వ్యక్తిత్వం బాగా నచ్చాయి. నా ఫ్రెండ్స్‌కు నేను రాసిన స్టోరీ నచ్చింది. నా ఫ్రెండ్స్ ఈ బుక్ కొని చాలా సపోర్ట్ చేశారు. స్కూల్లో అందరూ నన్ను అభినందించారు. కొందరు మంచి విమర్శలు కూడా చేశారు.ఎంతో నేర్చుకోవాలి...రచనలు చేయడంలో చాలా నేర్చుకోవాల్సి ఉందని నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసి వచ్చింది. వచ్చిన విమర్శల నుంచి కూడా నేర్చుకుంటున్నాను. స్టోరీలో ఒక పాత్రను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయాలి, స్టోరీ ΄్లాట్ ఎలా రాయాలి.. వంటివి నేర్చుకోవాలి. ఇదంతా తెలుసుకుంటూనే నా రచనల్లో వాటిని ఇంక్లూడ్ చేస్తూ వెళ్లాలని ఉంది. ముఖ్యంగా మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో చూస్తుంటాను. నానమ్మ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. అందుకు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. మంచి రైటర్‌గా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పేరుతెచ్చుకుంటూనే లాయర్ని అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటున్నాను. లాయర్‌గా న్యాయం కోసం పోరాటం చేస్తూనే, నా రచనల ద్వారా కొంతమందినైనా ప్రభావితం చేయాలనేది నా ముందున్న లక్ష్యం’’ అంటూ తెలిపింది ఈ బాల రచయిత్రి. టైమ్ క్రియేషన్ఈ బుక్ రిలీజ్ అయ్యాక మా ఫ్రెండ్స్‌తో సహా కొంతమంది నీకు టైమ్ ఎలా సరిపోతుంది అని అడిగారు. నేను టైమ్‌ను క్రియేట్ చేసుకున్నాను. రోజులో ఒక గంటసేపు ఈ బుక్ కోసం కేటాయించుకున్నాను. మొత్తం ఇరవై ఐదు వేల పదాలు. నేనే స్వయంగా టైప్ చేసి, ఎడిటింగ్ చేసుకుంటూ, తిరిగి మార్పులు చేసుకుంటూ రాశాను. దీనిని బుక్‌గా తీసుకురావడానికి అమ్మవాళ్లకు చెప్పకుండానే నలుగురు పబ్లిషర్స్‌తో మాట్లాడాను. వాళ్లు ఆశ్చర్యపోయారు. పబ్లిషర్స్ అమ్మ వాళ్లను అ్రపోచ్ అవడంతో... ఈ పని ఈజీ అయ్యింది. – నిర్మలారెడ్డిఫొటోలు: గడిగె బాలస్వామి -
నేటి బాలలే రేపటి మేధావులు!
నేటి బాలలే రేపటి పౌరులంటే అందరూ ఒప్పుకుంటారు. కానీ, నేటి బాలలే రేపటి మేధావులంటే అనుమానంగా చూస్తారు. పిల్లలందరూ జీనియస్‌లు ఎలా కాగలరు? అని ప్రశ్నిస్తారు. నాకో పదిమంది పిల్లలను ఇవ్వండి. వారు పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటే అదయ్యేలా పెంచగలనని అప్పుడెప్పుడో చెప్పాడు ప్రముఖ బిహేవియరల్ సైకాలజిస్ట్ జేబీ వాట్సన్.ఇదిగో వీరికి సాధ్యమైంది.. తల్లిదండ్రులు తలచుకుంటే, సరైన వాతావరణాన్ని సృష్టిస్తే ప్రతి బిడ్డా తానెంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరతాడనడానికి అనేక ఉదాహరణలున్నాయి. 1898లో పుట్టిన విలియమ్ జేమ్స్ సిడిస్ అనే బాలుణ్ని బాలమేధావిగా మార్చారు. రిచర్డ్స్ విలియమ్స్ అనే తండ్రి తన బిడ్డలిద్దరినీ ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణులు విలియమ్స్ సిస్టర్స్‌గా తీర్చిదిద్దాడు. లాజ్లో పోల్గార్ అనే టీచర్ తన ముగ్గురు బిడ్డలనూ చెస్ గ్రాండ్ మాస్టర్స్ పోల్గార్ సిస్టర్స్‌గా తీర్చిదిద్దాడు. పట్నాకు చెందిన నారాయణ్ తులసి అనే ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడు తథాగత్ అవతార్ తులసిని బాల మేధావిగా తీర్చిదిద్దాడు. తాజాగా కేరళకు చెందిన ఆవిర్భావ్ అనే ఏడేళ్ల బాలుడు సూపర్ స్టార్ సింగర్–3 విజేతగా నిలిచాడు. రెండేళ్ల వయసు నుంచే అతని చుట్టూ సంగీత ప్రపంచాన్ని సృష్టి్టంచడంతో అది సాధ్యమైంది. గట్టిగా అనుకుంటే అవుతుంది..మీరు తలచుకుంటే మీ బిడ్డనూ మేధావిగా పెంచవచ్చు. అందుకు చేయాల్సిందల్లా వారి మనసులోని అనేకానేక మ్యాట్రిక్స్లను బలోపేతం చేయడమే. కాగ్నిటివ్ మ్యాట్రిక్స్: పిల్లల మేధో వికాసానికి పునాది. సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో, ప్రతికూలతలను అధిగమించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఎందుకు’, ‘ఎలా’ వంటి ప్రశ్నలతో సంభాషణలను ప్రోత్సహించడం ద్వారా ఇన్వెంటివ్ మైండ్‌సెట్‌ని ప్రోత్సహించాలి.ఎమోషనల్ మ్యాట్రిక్స్: పిల్లలకు తెలివితేటలు ఎంత ముఖ్యమో భావోద్వేగాలు కూడా అంతే ముఖ్యం. భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఇది వారిలో ధైర్యాన్ని, ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.హెరిడిటరీ మ్యాట్రిక్స్: కుటుంబ వాతావరణం, సామాజిక పరిస్థితులు జన్యు వ్యక్తీకరణను ప్రభావితం చేయగలవని ఎపిజెనెటిక్స్ పరిశోధనలు చెబుతున్నాయి. ఇంట్లో సానుకూల, ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా జీన్స్ మ్యాట్రిక్స్‌ను అభివృద్ధి చేయవచ్చు. లాంగ్వేజ్ మ్యాట్రిక్స్: పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మనసులోని భావాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి భాష అవసరం. పిల్లలతో కలిసి కథలు చదవడం, చెప్పడం, చర్చించడం ద్వారా దీన్ని సుసంపన్నం చేయవచ్చు. బిహేవియర్ మ్యాట్రిక్స్: పిల్లల దీర్ఘకాల విజయంలో అలవాట్లు, సంకల్పం ప్రధానపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన రొటీన్లను సృష్టించడానికి పిల్లలకు సహాయం చేయడం ద్వారా దీన్ని బలోపేతం చేయవచ్చు. సోషల్ మ్యాట్రిక్స్: మనిషి సంఘజీవి. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో కుటుంబం, స్నేహితులు, పరిసరాల ప్రభావం ఉంటుంది. గౌరవం, దయ, సానుభూతి వంటి లక్షణాలను పిల్లలకు నేర్పడంలో ఆదర్శంగా ఉండాలి. మోరల్ మ్యాట్రిక్స్: పిల్లలు ఎదుగుతున్న కొద్దీ నైతిక భావనలు అభివృద్ధి చెందుతాయి. ఇవి వారి ప్రవర్తనను, నిజాయితీని, జీవితం పట్ల వారి ఉద్దేశాన్ని ప్రభావితం చేస్తాయి. న్యాయం, దయ, బాధ్యత గురించి పిల్లలతో చర్చించడం ద్వారా వారిలో బలమైన నైతిక చైతన్యాన్ని పెంపొందించవచ్చు.స్కూల్లో చేర్పించడంతో తల్లిదండ్రుల పాత్ర పూర్తికాదని గుర్తించాలి. వారి మనసులోని అనేకానేక మ్యాట్రిక్స్లను అభివృద్ధి చేయడం బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే బిడ్డ సంపూర్ణ సామర్థ్యంతో ఎదుగుతాడు. అతనిలోని జీనియస్ మ్యాట్రిక్స్ ఆవిష్కృతమవుతుంది. ఆ దిశగా ఈరోజే అడుగులు వేయండి. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి బిడ్డా మేధావే..పుట్టిన ప్రతి బిడ్డా జీనియస్ కాగలిగిన సామర్థ్యంతోనే పుడుతుంది. కానీ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పరిసరాలు, పాఠశాల, ఉపాధ్యాయులు, సమాజం ఆ బిడ్డ చుట్టూ కనిపించని పరిమితులను ఏర్పరుస్తారు. కనిపించని ఆ వలలో చిక్కుకున్నవారు అదే నిజమని నమ్మి, ఆ పరిమితుల్లోనే పనిచేసి, పరిమితమైన విజయాలతో సంతృప్తి చెందుతుంటారు. కొద్దిమంది మాత్రమే తమ చుట్టూ ఉన్న పరిమితులను అధిగమించి, తమలోని ప్రతిభను పూర్తిగా చాటడం ద్వారా జీవితాల్లో, సమాజంలో శాశ్వతమైన మార్పు తీసుకువస్తారు. అలాంటి వ్యక్తులనే జీనియస్ అంటారు. -
ఒక తాత ప్రధానమంత్రి.. ఇంకో తాతా జమీందారు..!
-
బహుముఖీన వైదుష్యానికి ప్రతీక!
రాంషా! ఈ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ‘అభిసారిక’ పత్రిక. దాని ప్రచురణకర్తగా, సంపాద కునిగా, పాఠకుల సెక్సు సమస్య లకు, సందేహాలకు ఆత్మీయ పరిష్కారాలు, సలహాలు సూచించే ఒక పెద్ద దిక్కు జ్ఞప్తికొ స్తుంది. అంతే కాదు ఆయన ఒక కమ్యూనిస్ట్, అభ్యుదయ కవి, నాటకకర్త, సాహితీ విమర్శకుడు; కథా, నవలా రచయిత, ముద్రాపకుడు! ఇవన్నీ కలగలసిన విశేష వ్యక్తిత్వమే రాంషా!‘రాంషా’ అసలు పేరు దర్భా వేంకటరామశాస్త్రి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో 1924 జూలై 30న జన్మించారు. కాకినాడ పిఠాపురం రాజావారి కాలేజీలో ఎఫ్.ఎ. (నేటి ఇంట ర్మీడియెట్) చదివే రోజుల్లోనే తొలిరచన ‘శిలా ప్రతిమ’ నాటికతో పేరు తెచ్చుకుని, 1948లో చోడవరం అఖిలాంధ్ర కవి పండిత పరిషత్తు నుంచి తొలి సన్మానం పొందారు. వేంకట రామశాస్త్రికి ‘రాంషా’ అనే లేఖినీ నామం ప్రదానం చేసింది ఆ కళాశాల అధ్యాపకులైన సాహితీ మూర్తి ‘కళాప్రపూర్ణ’ నిడదవోలు వెంకటరావు!తుర్గినేవ్ రాసిన చిన్నకథను ఆధారం చేసుకుని అల్లిన నవల – ‘కామేశ్వరి కథ’ 1948లో ప్రచురింపబడి ఎన్నో ప్రశంసల నందుకున్నది. లక్ష కాపీల వరకు ముద్రితమయింది. చరిత్రహీనుల, బాధోపహతుల జీవి తాల్ని చిత్రించిన రాంషా కథలెన్నో వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘గాంధీజీ పెట్టిన భిక్ష’, ‘ఎర్రజెండా’, ‘మత్తానయ్య మరణం’, ‘ఆడవాళ్ళ సంత’, ‘కిర్రు చెప్పులు’, ‘కారుణ్యం’ వంటి కథలు రాంషా మార్కు కథాకథన శిల్పానికి, వస్తు వైవిధ్యానికి, శైలీ విన్యాసానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. ‘లక్షింపతిగా రమ్మాయిలు’ అనే నాటకం కన్యాశుల్కం తరువాత చెప్పు కోదగ్గ నాటకంగా నాటి సమీక్షకులు పేర్కొన్నారు. కథా రచనా లక్షణాన్ని నిర్దేశిస్తూ, ‘కళలు–కథలు’ అనే విమర్శ వ్యాసాలు; అలాగే, నవల, నాటకం, కావ్యం, విమర్శవంటి సాహిత్య ప్రక్రియల మీద కూడా ప్రామాణిక వ్యాసాలు రచించారు. ‘కుళ్ళుసరుకు’ అనే ప్రబోదాత్మక సాంఘిక నాటకంలో ఒక ముఖ్య భూమికలో నటించి, నటుడిగా మరొక కోణాన్ని కూడా ఆవిష్కరించుకున్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పరిస్థితులకు రాంషా కలం జుళిపించారు. సోమసుందర్, శశాంకవంటి కవి మిత్రులతో చేయిచేయి కలిపి, కమ్యూనిస్ట్ కార్యకర్తగా శంఖం పూరించారు (1944 –1955). ప్రజా చైతన్యం ప్రజ్వలింపజేయడానికి ‘కళాకేళి – ధర్మసంగ్రామకేళి’ నినాదంతో ‘కళా కేళి ప్రచురణలు’ నెలకొల్పారు. సామ్యవాద ఉద్యమ ప్రతిధ్వనులైన ఆరుద్ర ‘త్వమేవాహం’, సోమసుందర్ ‘వజ్రాయుధం’ వంటి అగ్రశ్రేణి అభ్యుదయ కావ్యాలకి రాంషా సముచిత ప్రకాశి కలు రాసి ప్రచురించి, వాటికి అద్వితీయ ప్రాచుర్యం కల్పించారు. మరెన్నో గ్రంథాలను ప్రచురించారు.ఉద్యమ కాలంలో ప్రభుత్వం ‘వజ్రాయుధం’ కావ్యాన్ని నిషేధించి, పుస్తకాల్ని జప్తుచేసి, ప్రచురణకర్త రాంషా మీద, ముద్రాపకుల మీద కేసులు పెట్టింది. తీవ్ర నిర్బంధ విధానంలో అభ్యుదయవాదులైన సాహిత్య కారులు, కళాకారులు చెల్లాచెదరయ్యారు. ఆ పరిస్థితుల్లో రాంషా కూడా నిలదొక్కుకోడానికి అనేక కష్టనష్టాల నెదుర్కొన్నారు. అలాంటి సమయంలో ఆప్తమిత్రుడు ధనికొండ హనుమంతరావు కొంతకాలం నడిపి ఆపి వేసిన తన ‘అభిసారిక’ పత్రికను రాంషాకి అందించారు. ఆవిధంగా అభిసారిక పత్రికను స్వీకరించి మరో కొత్త జీవిత అధ్యాయానికి తెర తీశారు రాంషా (1960).రాంషా నేతృత్వంలో ‘అభిసారిక’ లైంగిక విజ్ఞాన మాస పత్రిక అచిరకాలంలోనే అసంఖ్యాక పాఠకుల మన్న నలు పొంది, బహుళ ప్రచారంలోకి వచ్చింది. మూఢ విశ్వాసాలు, ఛాందస భావాలతో, అజ్ఞానంలో, అంధకారంలో అల్లాడుతున్న అనేకమంది తెలుగు పాఠకులకు అది వేగుచుక్కగా రూపొందింది. అభిసారిక పత్రిక ద్వారా శాస్త్రీయంగా ‘సెక్సు విజ్ఞానాన్ని’ పాఠకుల కందజేస్తూ, ఆత్మవిశ్వాసం కోల్పోయి, అనేక మానసిక రుగ్మతలకు లోనై, అశాంతితో, అపోహలతో, సమస్య లతో, సంతాపాలతో సతమతమవుతున్న అసంఖ్యాక వ్యక్తులకు ఆశనీ, ఆత్మస్థైర్యాన్నీ కల్పించి, ఓదార్పునీ, నైతిక బలాన్నీ, నవజీవనాన్నీ ప్రోదిచేసి, వారిని తీర్చిదిద్దే మహోద్యమంలో రాంషా విజయం సాధించారు.ఆ కృషిలో భాగంగా 1960 నుంచి 1990 వరకు 30 ఏళ్ల కాలంలో ఎన్నో ఉత్తమ సెక్సు విజ్ఞాన గ్రంథాలు రచించారు. అభిసారికలో ‘అడగండి చెపు తాను’ శీర్షిక ద్వారా వేనవేలమంది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు సూచించారు. ‘మీట్ ది ఎడిటర్’ కార్య క్రమం ద్వారా ఆంధ్ర – ఆంధ్రేతర ప్రాంతాలు పర్యటిస్తూ సలహాలు – పరిష్కారాలు అందజేశారు.‘వాత్సాయన కామసూత్రాలు’, ‘కొక్కోకమ్’, ‘సెక్సు సైకాలజీ’ వంటి 40కి పైగా కామ పురుషార్థ గ్రంథాలు రాశారు. అలాగే మిగతా పురుషార్థాలైన ధర్మార్థమోక్షాల అమృత సారాన్ని కూడా గౌతమ, వశిష్ఠ ధర్మసూత్రాలూ ‘జ్ఞాన వాశిష్ఠం’, ‘న్యాయ దర్శనం’, ‘సాంఖ్యమ్’, ‘వైశే షికమ్’, ‘యోగశాస్త్రం’, ‘మోక్షశాస్త్రం’, ‘కౌటిలీయ అర్థ శాస్త్రం’ వంటి గ్రంథాల రూపంలో తెలుగు వారికి సులభ గ్రాహ్యంగా అందజేశారు. 1990 ఫిబ్రవరి 8న రాజమండ్రిలో ఒక రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా మృతి చెందారు రాంషా. అది అఖిల ‘అభిసారిక’ పాఠకులకు, సాహితీ మిత్రులకు తీరని లోటు మిగిల్చింది.– పూషా దర్భా, వ్యాసకర్త, మానసిక సెక్స్ సమస్యల నిపుణులు, ‘అభిసారిక’ పూర్వ సంపాదకులు -
పవన్ కళ్యాణ్ మూడో భార్య ఆస్తి వివరాలు
-
Mrunmayee Deshpande Photos: ఇండస్ట్రీలో సింగిల్ పీస్.. అందం,అభినయం కలబోసుకున్న వర్సటైల్ నటి
-
రతన్ టాటా బయోగ్రఫీ బుక్ లాంచ్ ఎప్పుడంటే..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్తలలో ఒకరైన 'రతన్ టాటా' జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రానున్నట్లు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. పుస్తక రచయిత 'మాథ్యూ' (Mathew) నవంబర్ 2022లో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2022లో రతన్ టాటా బయోగ్రఫీ బుక్ విడుదలవుతుందని ఎదురుచూసే అభిమానులకు అప్పుడు నిరాశే ఎదురైంది. ఆ తరువాత బుక్ లాంచ్ తేదీని 2023 మార్చి నెలకు మార్చారు, మళ్ళీ ఓసారి 2024 ఫిబ్రవరి అన్నారు. ఈ నెలలో కూడా బుక్ లాంచ్ సాధ్యంకాదని తేలిపోయింది. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ మార్చి 30 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి.. దాతృత్వానికి మారుపేరుగా నిలిచినా రతన్ టాటాకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉంది. ఇటీవలే రతన్ టాటా ఏకంగా 165 కోట్ల రూపాయలతో పెంపుడు జంతువుల కోసం హాస్పిటల్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. -
సూపర్ స్టార్.. సూపర్ కార్.. చివరికి, అంతులేని విషాదం!
ఒకపుడు సూపర్‌స్టార్, ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్‌గా పాపులర్. చెయ్యెత్తి దణ్నం పెట్టేంత అందం, అభినయం. కానీ భర్త చేతిలో అవమానాలు, హింసకు గురై, మద్యపానానికి అలవాటుపడి, కడు దయనీయ పరిస్థితిలో మరణించింది. ఇంతకీ ఎవరా మహానటి? లెజెండరీ నటి, రీల్ ట్రాజెడీ క్వీన్ గా పేరొందిన మీనా కుమారి జీవితం విషాదంగానే ముగిసింది. అందుకే మీనా కుమారి మరణం తరువాత మరో పాపులర్ నటి నర్గీస్ 'మౌత్ ముబారక్ హో మీనా, ఈ ప్రపంచం మీలాంటి వారి కోసం కాదు' అంటూ కామెంట్ చేసిందంటే.. ఆమె జీవితంలోని విషాదాన్ని అర్థం చేసుకోవచ్చు. మీనా కుమారి ఆగస్టు 1, 1933న జన్మించారు. ఆమె అసలు పేరు మహ్జబీన్ బనో. ఆమెకు ‘నాజ్’, ‘మున్నా’ అనే ముద్దు కూడా పేర్లున్నాయి. అందానికి అచ్చమైన నిదర్శనంగా ఉండే మీనాకుమారి నాలుగేళ్లకే నటనా జీవితంలోకి ప్రవేశించారు. బాలీవుడ్ సినిమాల్లో అంకితభావంతో పనిచేసి, నటనలో తనదైన ప్రతిభను చాటకున్నారు. నటిగా ఆమె కన్నీటి వాకిళ్లు, ఆమె జీవితంలో జలపాతాలయ్యాయంటే అతిశయోక్తికాదు. దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి దిగ్గజ నటులే ఆమె ముందు అభినయించడానికి జంకేవారట. సత్యజిత్ రే లాంటి దిగ్గజ దర్శకులు ఆమె అభినయ ప్రతిభకు ఫిదా అయిపోయేవారట. 30 ఏళ్ల కరియర్లో ఎన్నోమైలురాళ్లు, మరోన్నో బ్లాక్‌బస్లర్ సినిమాలు. దాదాపు అన్నీ క్లాసిస్ మూవీలే. బైజు బావరా, ఫాకీజా. సాహెబ్, బీబీ ఔర్ గులాం, మేరే అప్నే,పరిణీత, దిల్ అప్నా ఔర్ ప్రీత్, పరాయి, ఫుట్ పాత్, ఫూల్ ఔర్ పత్తర్, ఆజాద్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్లు. దాదాపు 90 సినిమాల్లో నటించారు. ఇక ప్రశంసలు, అవార్డులు, సంపదకు లెక్కే లేదు. ఆ రోజుల్లోనే ఇంపాలా కారు కొన్న ఏకైక నటి మీనా కుమారి. కానీ చిత్రనిర్మాత కమల్ అమ్రోహితో పెళ్లి మీనా కుమారి జీవితాన్ని అతలాకుతలం చేసింది. 1960లో కిషోర్ సాహు దర్శకత్వంలో కమల్ అమ్రోహి నిర్మించిన ‘దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయీ’ సినిమా పెద్ద మలుపు అని చెప్పవ చ్చు. అలా మొదలైన పరిచయం 1952లో వివాహానికి దారి తీసింది. అప్పటినుంచి మీనా కుమారి నటిస్తున్న చిత్రనిర్మాతలతో సినిమా స్క్రిప్ట్‌ల విషయంలో జోక్యం చేసుకునేవాడు కమల్. కెరీర్‌కు అనేక ఆటంకాలు, తదితర అనేక వైరుధ్యాలు తారాస్థాయికి చేరాయి. విడాకులకు దారి తీసింది. ముఖ్యంగా మీనా కుమారి దిలీప్ కుమార్ సరసన ఖరారైన తరువాత,ఆమె ఔట్ డోర్ షూటింగ్‌లకు రాదు అంటూ బిమల్ రాయ్ ఆఫీసుకెళ్లి మరీ బెదిరించాడు. దీంతో ఈ ఐకానిక్ పాత్ర సుచిత్రా సేన్ దక్కించుకుంది. చివరికి వివాహం అయిన 10 ఏళ్ల తరువాత 1964లో విడాకులు మీనా-కమల్ జంట తీసుకున్నారు. ఇక ఆ తరువాత ఆమె మద్యానికి బానిసైంది. డిప్రెషన్‌కు లోనైంది. నిద్ర పట్టక ఇబ్బంది పడేది. అపుడు కొద్దిగా బ్రాందీ తీసుకోమని డాక్టర్ సలహా ఇచ్చాడట. అదే కొంపముంచింది. ఆమె నటించిన చివరిదీ, సూపర్ డూపర్ మూవీ పాకీజా విడుదలైన మూడు వారాలకే మీనా కుమారి తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్లి పోయి 38 ఏళ్లకే 1972 మార్చి 31న ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. ఆసుపత్రి బిల్లు రూ. 3,500 చెల్లించేందుకు కూడా ఆమె వద్ద డబ్బులు లేని దుర్భర స్థితిలో సినిమా దేవత కన్నుమూయడం అంతులేని విషాదం. మరిన్ని సంగతులు ♦ కవయిత్రి అయిన మీనా కుమారి ‘నాజ్’ అనే మారుపేరుతో ఉర్దూ కవితలు రాసేది. ♦మీనా కుమారిని కమల్ అమ్రోహికి పరిచయం చేసిన కిషోర్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్. ♦ మీనా కుమారి మే 21, 1951లో యాక్సిడెంట్, నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో, ఆ సందర్బంగా ఇద్దరి మధ్యా ప్రేమ, ♦ 18 ఏళ్లకే ఫిబ్రవరి 14, 1952న మీనా సోదరి మహిలికా సమక్షంలో కమల్ అమ్రోహి తో రహస్య నిఖా ♦ కమల్‌కు అప్పటికే పెళ్లి, ముగ్గురు పిల్లలు -
Infosys Sudha Murty: పుస్తకం కలిపింది ఇద్దరినీ
1974. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మొదటిసారి సుధామూర్తి, నారాయణమూర్తి పూణెలో కలిశారు. వారి మధ్య ప్రేమ చిగురించడానికి దోహదం చేసింది పుస్తక పఠనం. ఆ ప్రేమ కథ ఏమిటో 50 ఏళ్ల తర్వాత ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’లో పంచుకున్నారు సుధామూర్తి. తమ సుదీర్ఘ వైవాహిక జీవితం సఫలం కావడానికి ఇద్దరూ తీసుకున్న జాగ్రత్తలు చెప్తూ ఈనాటి యువతకు అనుభవంతో నిండిన సూచనలు చేశారు. అందమైన ప్రేమకథలు, సఫలమైన ప్రేమకథలు తెలుసుకోవడం బాగుంటుంది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఫిబ్రవరి 5న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పాల్గొన్నారు. చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన బయోగ్రఫీ ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ డేస్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ విడుదలైన సందర్భంగా తనకు నారాయణమూర్తికీ మధ్య ఎలా ప్రేమ పుట్టిందో కొద్దిగా సిగ్గుపడుతూ, ముసిముసిగా నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేమ కథ వినండి. 1974 అక్టోబర్. పూణెలోని ‘టెల్కొ’లో మొదటి మహిళా ఇంజనీరుగా చేరిన సుధ రోజూ కంపెనీ బస్‌లో వచ్చి వెళుతుండేవారు. ప్రసన్న ఆమె కొలీగ్. అతను ఏదో ఒక పుస్తకం చదువుతుంటే ఏ పుస్తకమా అని సుధ తొంగి తొంగి చూసేవారు. అతను చదివే ప్రతి పుస్తకం మీద ఒకే పేరు ఉండేది... మూర్తి అని. ఒకరోజు ఉండబట్టలేక ‘ఎవరీ మూర్తి’ అని అడిగారు సుధ. ‘నా రూమ్మేటు. పుస్తకాల పిచ్చోడు. చాలా పుస్తకాలు చదువుతాడు’ అన్నాడు ప్రసన్న. ‘నీకూ పుస్తకాల పిచ్చేగా. కావాలంటే పరిచయం చేస్తానురా’ అన్నాడు. ‘అమ్మో... బేచిలర్ల రూముకు వెళ్లడమా’ అని సుధ జంకారు. కాని కుతూహలం పట్టలేక ‘ఫలానా రోజున ఐదు నిమిషాలకు వచ్చి వెళతా’ అని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగాయి. ఈ మూర్తి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడా... రింగుల రింగుల జుట్టుతో ఉంటాడా.. షోగ్గా (అప్పటికి హిందీ సినిమాల ఫ్యాన్ కాబట్టి) రాజేష్ ఖన్నాలా ఉంటాడా అని ఒకటే ఊహలు. తీరా రూముకు వెళ్లేసరికి దళసరి కళ్లద్దాల బక్కపలచటి యువకుడు ఎదురుపడ్డాడు. సుధని చూసి, ఆమెకు పుస్తకాలంటే ఇష్టమని తెలిసి తన దగ్గరున్న పుస్తకాలన్నీ చూపించాడు. ఆమె బయల్దేరే ముందు అబ్బాయిలు వేసే పాచిక ‘కావాలంటే తీసుకెళ్లి చదివి ఇవ్వు’ అన్నాడు. కొన్నిరోజుల తర్వాత ‘మనం డిన్నర్ చేద్దామా’ అని ఆహ్వానించాడు. దానికీ భయమే సుధకు. ‘వస్తా. కాని మన కామన్ఫ్రెండ్ ప్రసన్న కూడా మనతో ఉండాలి. నా వాటా బిల్లు డబ్బులు నేనే కడతా’ అందామె. వారి స్నేహం బలపడింది. ఒకరోజు నారాయణమూర్తి ధైర్యం చేసి సుధతో చెప్పాడు– ‘ఆరోజు నువ్వు మొదటిసారి నా రూమ్‌కు వచ్చి వెళ్లాక అంతవరకూ లేని వెలుగు వచ్చినట్టయ్యింది. జీవితం పట్ల ఇంత ఆసక్తి ఉన్న అమ్మాయిని నేను చూళ్లేదు’... ఆ మాటలే ప్రేమను ప్రపోజ్ చేయడం. ఆమె సంతోషంగా నవ్వడమే ప్రేమను అంగీకరించడం. ప్రేమ మొదలైన నాలుగేళ్లకు సుధ.. సుధామూర్తి అయ్యారు. ‘నారాయణమూర్తి, నేను భిన్నధృవాలం. నేను అన్నింటికీ మాట్లాడతాను. అతను అసలు మాట్లాడడు. నాకు అన్నింట్లో జోక్యం కావాలి. అతను అవసరమైతే తప్ప జోక్యం చేసుకోడు. మా జీవితంలో అనంగీకారాలు, ఆర్గ్యుమెంట్లు లేవని కాదు. ఇన్ఫోసిస్ మొదలెడుతున్నప్పుడు నువ్వు ఇందులో ఉండకూడదు అన్నాడు నారాయణమూర్తి. ఐదేళ్లు నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడప్పుడు కొంత చివుక్కుమంటూండేది. కాని తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా నేను సామాజిక సేవతో ఎందరి జీవితాలకో చేయూతనిచ్చి తృప్తి పొందాను. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఎవరిని వారులా ఉండనివ్వాలి. నారాయణమూర్తి కోరుకున్నట్టుగా నేను అతణ్ణి ఉండనిచ్చాను, నాలా నన్ను అతను ఉండనిచ్చాడు’ అన్నారామె. ‘ఇన్ఫోసిస్ పెట్టాక అతి కష్టమ్మీద ఒక క్లయింట్ దొరికాడు. కాని పేమెంట్స్ ఇష్టమొచ్చినప్పుడు ఇచ్చేవాడు. నారాయణమూర్తికి ఉద్యోగుల జీతాలు సమయానికి చెల్లించాలని నియమం. అతను టెన్షన్ పడుతుంటే– ఎందుకంత టెన్షన్... నగలు బ్యాంకులో కుదవ పెట్టి డబ్బు తెస్తాను. సర్దుబాటు చేసుకో అన్నాను. నారాయణమూర్తి కదిలిపోయాడు. ఎందుకంటే ఏదో అవసరం వచ్చి గతంలో తల్లి నగలు కుదువ పెట్టాల్సి వచ్చిందట. అవి విడిపించుకోలేకపోయారు. అది గుర్తొచ్చి వద్దు వద్దు అన్నాడు. ఏం పట్టించుకోకు.. లోను తీసుకోవడానికి సెంటిమెంట్లు ఏమిటి అని తెచ్చి ఇచ్చాను. ఆ రోజు గాజులు లేని నా బోసి చేతులను చూసి నారాయణమూర్తి చాలా బాధ పడ్డాడు. కొన్నాళ్లకు విడిపించాడనుకోండి. ఈ మాత్రం సర్దుబాట్లు కాపురంలో అవసరం’ అన్నారామె. వైవాహిక బంధం ఎలా నిలబడుతుంది? ఆడియెన్స్‌లో ఎవరో అడిగారు. ‘నమ్మకం, సహనం, సర్దుబాటుతనం వల్ల మాత్రమే. జీవితంలో సహనం ముఖ్యమైనది. సహనంగా ఉంటే జీవితం మనకు కావలసినవి ఇస్తుంది. వైవాహిక జీవితంలో అనుకున్నవన్నీ చేసే స్వేచ్ఛ, వీలు లేకపోవచ్చు. అప్పుడు ఉన్న పరిమితుల్లోనే ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ మొదలుపెట్టి బిజీగా ఉండగా నేను ఐదేళ్లూ పిల్లల్ని చూసుకుంటూ కూడా పుస్తకాలు రాసి సంతోషపడ్డాను. వీలైనంతగా కొత్త ప్రాంతాలు చూశాను. మగవాళ్లకు సాధారణంగా ఆడవాళ్లు తమ కంటే తెలివితక్కువగా ఉండాలని ఉంటుంది. అవసరమైతే వారిని అలా అనుకోనిచ్చేలా చేస్తూ స్త్రీలు తమ సామర్థ్యాలను వీలైనంత ఉపయోగించుకోవాలి. జీవితంలో, వైవాహిక జీవితంలో రాణించాలి’ అన్నారు సుధామూర్తి. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
ప్రశాంత్ వర్మ బయోగ్రఫీ..!
-
యండమూరి చేతుల్లో మెగాస్టార్ జీవిత చరిత్ర
మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్రను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్కు అప్పగించారు చిరంజీవి. ఈ విషయాన్ని వైజాగ్‌లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఎఎన్ఆర్ శత జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చిరంజీవి ఈ ప్రకటన చేశారు. లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యండమూరితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులకు అవార్డులు అందించారు ఫౌండేషన్ ప్రతినిధి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ల గురించి ప్రశంసాపూర్వక ప్రసంగం చేసిన చిరంజీవి తన బయోగ్రఫీ గురించి మాట్లాడుతూ.. తన బయోగ్రఫీ రాసేంత సమయం తనకు లేదని.. నా బయోగ్రఫీ రాసే సామర్ధ్యం ఒక్క యండమూరికి మాత్రమే ఉందని.. అందుకే ఆ బాద్యతను యండమూరికి అప్పగిస్తున్నాను అని అన్నారు. సమకాలీన రచయితల్లో యండమూరికి సాటి మరెవరూ లేరు. తెలుగులో ఉన్న ఏకైక స్టార్ రచయిత ఎవరన్నా ఉన్నారా అంటే అది యండమూరి మాత్రమే. అలాంటి గొప్ప రచయిత ఈ రోజు నా బయోగ్రఫీ రాస్తాను అనడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆయన రాసిన అభిలాష చిత్రంతోనే సినీ పరిశ్రమలో నా స్థానం పధిలమని అప్పుడే నిర్ణయించుకున్నాను అంటూ యండమూరిపై ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి. -
'నాలో మనిషిని నిద్రలేపింది'.. విశాల్ ట్వీట్ వైరల్!
ఇటీవలే విశాల్ మార్క్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకులను పలరించాడు. అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ కోలీవుడ్ స్టార్ హీరో రత్నం సినిమాలో నటిస్తున్నారు. ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించనుంది. కార్తికేయన్ సంతానం జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇప్పటికే మేకర్స్ విడుదల చేశారు. అయితే చెన్నైలో వరదలు రావడంతో బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. రత్నం మూవీతో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ జీవిత కథను చదివినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. బ్రిట్నీ స్పియర్స్ రాసిన పుస్తకం 'ఉమెన్ ఇన్ మీ' చదివాక నాలో మనిషిని నిద్రలేపిందని అన్నారు. ఇక నుంచి మహిళలను మరింత గౌరవించాలనుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆర్టిస్టుల మనోభావాలను అర్థం చేసుకోవడం తెలుసుకున్నానని అన్నారు. ఆమె యూత్ ఐకాన్ అయినప్పటికీ చాలా చిన్న వయస్సులో జీవిత ప్రయాణం.. ఎదుర్కొన్న ఇబ్బందులు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఆమె జీవితంలో సాధించిన విజయాలకు.. ముఖ్యంగా స్తీలకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నానని అన్నారు. మీ జీవితంలో సరైన ఎంపిక, ధైర్యంతో.. మిమ్మల్ని మీరు ప్రపంచం సరళంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలని విశాల్ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు మహిళలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ఉమెన్ ఇన్ మీ పుస్తకం.. ది ఉమెన్ ఇన్ మీ అనే పుస్తకాన్ని అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ రాశారు. ఈ బుక్ అక్టోబర్ 24, 2023న 26 భాషల్లో విడుదలైంది. ఉమన్ ఇన్ మి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. Well, the transformation from b/w to color is the mood in my mind by Reading #BritneySpears #TheWomanInMe brings out the Man in me. Honestly makes me wanna respect women more. Especially understanding the psyche of performing artistes. Truly inspiring to read her life journey and… pic.twitter.com/H88utzadzV — Vishal (@VishalKOfficial) December 22, 2023 -
‘తండ్రిని చూస్తే వణుకు’... ‘ఆత్మకథ’లో శరద్ పవార్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ 83వ ఏట అడుగుపెట్టారు. 1940 డిసెంబర్ 12 న ఆయన జన్మించారు. శరద్ పవార్ తల్లి కూడా 1911లో డిసెంబర్ 12నే జన్మించడం విశేషం. పవార్ తండ్రి పేరు గోవింద్ రావ్. నీరా కెనాల్ కోఆపరేటివ్ సొసైటీ (బారామతి)లో సీనియర్ అధికారి. గోవింద్‌రావ్ ఎంతో నిజాయితీతో మెలిగేవారు. పవార్ తల్లి శారదా బాయి వామపక్ష భావాలు కలిగిన కలిగిన రాజకీయ, సామాజిక కార్యకర్త. పూణే లోకల్ బోర్డుకు ఎన్నికైన మొదటి మహిళ. రాజ్‌కమల్ ప్రచురించిన తన ఆత్మకథ ‘ఆన్ మై ఓన్ టర్మ్స్’లో శరద్ పవార్ తన తండ్రి క్రమశిక్షణ గల వ్యక్తి అని పేర్కొన్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి ఆరు గంటలకే ఆరోజు చేయాల్సిన పనులకు సిద్ధమయ్యేవారని తెలిపారు. క్రమం తప్పక వార్తాపత్రిక చదివేవారని, విధులు ముగించాక రాత్రి 8 గంటలకు నిద్రపోయేవారని, చాలా తక్కువ మాట్లాడేవారని శరద్ పవార్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తన తండ్రి అనుసరించే కఠినమైన క్రమశిక్షణ కారణంగా పిల్లలు అతనికి దూరంగా ఉండేవారని పవార్ తెలిపారు. ‘మేము ఏదైనా తప్పు చేసినా లేదా చదువులో మంచి ఫలితాలు రాకపోయినా, నాన్నకు దూరంగా ఉండేవాళ్లం. చదువులో నా రికార్డు సరిగా లేదు. నెలవారీ రిపోర్ట్ కార్డ్‌పై నాన్న చేత సంతకం చేయించాలంటే చాలా భయం వేసేది. కానీ అమ్మ చేత సంతకం చేయించడం చాలా సులభం. అందుకే నేను రిపోర్టు కార్డుపై అమ్మ చేత సంతకం చేయించేవాడినని శరద్‌పవార్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మెట్రో రెయిలింగ్‌పై మహిళ హైడ్రామా.. మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ వివాదమే కారణమా?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చైర్మన్ 'ఎస్ సోమనాథ్' (S.Somanath) ‘నిలవు కుడిచ సింహగల్' (వెన్నెల తాగిన సింహాలు) పేరుతో మలయాళంలో తన ఆత్మకథను రాసారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను యువతరానికి అందించి వారిలో స్ఫూర్తి నింపడానికి ఈ పుస్తకం రాసారు. ప్రచురణకు సిద్దమైన ఈ పుస్తకం ఇప్పుడు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోమనాథ్ ఆత్మకథలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్‌పై కొన్ని విమర్శలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి రావడంతో సోమనాథ్ స్పందించారు. పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించారు. స్పేస్ కమిషన్ సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ పదవి వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ సమయంలో మరో డైరెక్టర్‌ను నియమిస్తే అలాంటి అవకాశాలు తగ్గుతాయని మాత్రమే పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. నా పబ్లిషర్ కొన్ని కాపీలను విడుదల చేసి ఉండవచ్చు.. కానీ ఈ వివాదం తర్వాత, ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను రాసిన పుస్తకం విమర్శనాస్త్రం కాదని, జీవితంలో సమస్యలను అధిగమించి తమ కలలను సాధించాలనుకునే వ్యక్తులకు స్ఫూర్తిదాయకమైన కథ అని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. -
సెల్యులాయిడ్‌పై సిద్ధూ మూసేవాలా జీవితం!
ముంబై: పంజాబ్ యువ గాయకుడు, దివంగత సిద్దూ మూసేవాలా జీవితగాథ త్వరలో సినిమాగా తెరకెక్కే అవకాశముంది. సిద్దూ మూసేవాలా తన జీవితంలో చవిచూసిన పేరుప్రఖ్యాతలు, గ్యాంగ్స్టర్ల బెదిరింపులు, విషాదం అన్నింటినీ స్పృశిస్తూ జుపిందర్జీత్ సింగ్ రాసిన ‘హూ కిల్డ్ మూసేవాలా? ది స్పైరలింగ్ స్టోరీ ఆఫ్ వాయలెన్స్ ఇన్ పంజాబ్’ పుస్తకంపై హక్కులను చిత్ర నిర్మాణరంగ సంస్థ మ్యాచ్బాక్స్ షాట్స్ కొనుగోలుచేసింది. మూసేవాలా జీవితాన్ని వెబ్ సిరీస్‌గా లేదంటే సినిమాగా తెరకెక్కించే అవకాశముంది. ‘శుభ్‌దీప్ సింగ్ సిద్దూ.. సిద్దూ మూసేవాలాగా ఎదిగిన క్రమాన్ని ఈ పుస్తకం అద్భుతంగా ఆవిష్కరించింది. పంజాబ్‌లో గ్యాంగ్స్టర్ల ఆధిపత్యం, వారి మధ్య మనస్పర్థలు, మాదకద్రవ్యాల వినియోగం, పంజాబ్‌లో సంగీత ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలనూ ఈ పుస్తకం చూపించింది’ అని మ్యాచ్బాక్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. -
వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?
ఈ డిజిటల్ ప్రపంచంలో దేని గురించి అయినా సమాచారం కావాంటే వెంటనే గూగుల్‌లో సర్చ్ చేస్తాం. ఔనా! వెంటనే ముందుగా వికీపీడియా ఆ తర్వాత మిగతా సైట్ల నుంచి దానికి సంబంధించిన సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తాయి. కానీ వికీపీడియా ప్రతిదాని గురించి సమాచారం ఇచ్చింది గానీ మహిళా శాస్త్రవేత్తల ప్రొఫైల్స్‌ను చాలా తక్కువగానే అందించింది. ఆ లోటు భర్తి చేసేలా మహిళా శాస్రవేత్తలు బయోగ్రఫీని వికీపీడియాలో ఉంచి అందరికీ తెలిసిలే చేసింది. ఈ రంగంలో మహిళలు ఎక్కువమంది వచ్చేలా ఇన్ఫర్మేషన్ ఉంచింది ఓ మహిళా. ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారా? అని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఎవరామె? ఎలా ఆ ఇన్ఫర్మేషన్ని సేకరించింది? బ్రిటన్‌కి చెందిన జెస్సికా వేడ్ తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో భౌతిక శాస్త్ర విభాగం మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత అందులోనే పీహెచ్డీ పూర్తి చేసింది. అప్పుడే ఆమెకు మహిళలు పీహెచ్డీ దాక వచ్చే వాళ్లే అరుదని అర్థమైంది. ఆ తర్వాత ఆమె భౌతిక శాస్త్రవేత్తగా, టెలివిజన్లు, సోలార్ ప్యానెల్లు వంటి ఆప్టికల్ ఎలక్ట్రానిక్ పరికరాలను మరింత శక్తిమంతంగా పనిచేసేలా కార్బన్-ఆధారిత సెమీ-కండక్టర్లను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేస్తుంది. తన పరిశోధనలకు సంబంధించి 15 మంది విస్తృత బృందంలో ఓ ఐదుగురు వ్యక్తుల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తుండగా అందులో తన తోపాటు మరొక మహిళా శాస్త్రవేత్త తప్పించి మిగతా అంతా పురుషులే. అప్పుడే ఆమెకు అస్సలు మహిళా శాస్త్రవేత్తలు ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న మెదిలింది. దీనికి తోడు వికీపీడియాలో కూడా మహిళా శాస్త్రవేత్తల గురించి ఆశించినంత స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతగా లేకపోవడం ఆమెను బాధించింది. అసలు దీనికి ప్రధాన కారణంగా తల్లిదండ్రలని ఆమెకు అనిపించింది. ఎందుకంటే ఏదో రకంగా డిగ్రీ సంపాదించి సెటిల్ అయితే చాలనుకుంటారు. పైగా వారే ఈ రంగంలోకి రానివ్వకుండా అడ్డకుంటున్నట్లు గమనించింది. ఆ జిజ్క్షాశ జెస్సికాను మహిళా శాస్త్రవేత్తల ఇన్ఫర్మేషన్ని వికీపీడియాలో ఉంచే ప్రాజెక్టును చేపట్టాలే చేసింది. ఇలా సుమారు వెయ్యికిపైగా మహిళా శాస్త్రవేత్తల ప్రొఫెల్స్‌ను అందించింది. ఇప్పటి వరకు ఆమె స్వయంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) తదితన నేపథ్యాలలో పనిచేస్తున్న అనేక మంది మహిళా శాస్త్రవేత్తలే కాకుండా ఉనికిలో లేని మహిళా శాస్త్రవేత్తలకు సంబంధించిన బయోగ్రఫీని కూడా ఉంచింది. సైన్సు వంటి రంగాల్లో మహిళలు లేరంటూ గగ్గోలు పెట్టడం కాదు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించి వారిని ఆన్లైన్లో కనపడేలా చేయాలి. దీన్ని చూసైనా యువత ఈ రంగాల్లో రావడానికి ఆయా మహిళా శాస్త్రవేత్తలను ఆదర్శంగా ఎంచుకోవచ్చు లేదా అందుకు దోహదపడొచ్చు అనే లక్ష్యంతోనే ఇలా శోధించి మరీ రాస్తున్నాను అని చెప్పుకొచ్చింది జెస్సికా. ఒక్కో ప్రొఫైల్ అందించాలంటే కొన్ని గంటల సమయం పడుతున్నప్పటికీ పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు కూడా సమానంగా ఉండాలనే ఎజెండాతోనే తాను ఇలా చేస్తున్నట్లు తెలిపింది. ఈ కృషికిగాను జెస్సికాను వికీపీడియా ఎన్నో అవార్డులు, పతకాలతో సత్కరించింది. (చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు) -
ఓ చాంపియన్ కథ
భారతదేశానికి 1980లలో ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి జీవితం ఆధారంగా రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘అర్జున్ చక్రవర్తి: జర్నీ ఆఫ్ యాన్ అన్సంగ్ ఛాంపియన్’. విజయ రామరాజు టైటిల్ రోల్లో, సిజా రోజ్ కీ రోల్లో విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల ఈ చిత్రాన్ని నిర్మించారు. -
క్రికెటర్ విహారి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్
-
Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్‌కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి... ‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా. గతంలో నటుడు సంజీవ్ కుమార్‌పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు. నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది. బలహీనులకు అందని విద్య ‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి. అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్‌వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి. ఆ ఇద్దరు ‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి. ఎన్నెన్నో అవమానాలు ‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి. -
రహస్యాలన్నీ బట్టబయలు.. ఎలాన్ మస్క్ బయోగ్రఫీలో ఏమేం ఉంటాయంటే
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ బయోగ్రఫీ కాపీలు హాట్ కేకుల్లో అమ్ముడు పోతున్నాయి. ‘ఎలాన్ మస్క్’ పేరుతో విడుదలైన మస్క్ బయోగ్రఫీ కాపీలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 92,560 అమ్ముడుపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా బయోగ్రఫీ పుస్తకాలు ఎన్ని అమ్ముడు పోయాయో సిర్కానా అనే మీడియా సంస్థ ట్రాక్ చేస్తుంది. ఆ కంపెనీ అందించిన సమాచారం మేరకు విడుదలైన వారంలో ఎక్కువ మొత్తంలో అమ్ముడు పోయిన పుస్తకాల్లో మొదటిది యాపిల్ కో- ఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ కాగా.. రెండోది ఎలాన్ మస్క్ బయోగ్రఫీయేనని సిర్కానా వెల్లడించింది. వారంలోనే అన్ని పుస్తకాల ప్రొఫెసర్, ఆథర్, ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ మాజీ సీఈవో వాల్టర్ సెఫ్ ఐజాక్సన్ (Walter Seff Isaacson) యాపిల్ కోఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీని రాశారు. అయితే, అక్టోబర్ 5, 2011లో స్టీవ్ జాబ్స్ మరణించిన వారం రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. విడుదలైన వారం రోజుల్లో 3,83,000 కాపీలు అమ్ముడుపోయాయి. మస్క్ బయోగ్రఫీ కోసం రెండేళ్ల సమయం వాల్టర్ మస్క్ బయోగ్రఫీ రాసేందుకు సుమారు రెండేళ్ల పాటు శ్రమించారు. మస్క్ అటెండ్ అయ్యే సమావేశాలు. ఇచ్చిన ఇంటర్వ్యూలు, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, మస్క్ అనుచరుల్ని, సలహాదారుల్ని ఇలా అందరి నుంచి సమాచారం సేకరించి బుక్ రాశారు. ఎలాన్ మస్క్ బయోగ్రఫీ బుక్ ఎప్పుడు విడుదలైంది? Walter Isaacson's biography of Elon Musk sold 92,560 copies in its first week on sale! 📚 pic.twitter.com/WkfgtByzp6 — Dima Zeniuk (@DimaZeniuk) September 22, 2023 ఎలాన్ మస్క్ బయోగ్రఫీని వాల్టర్ ఐజాక్సన్ రాశారు. సెప్టెంబర్ 12,2023న విడుదల చేశారు. మస్క్ బయోగ్రఫీ బుక్‌లో ఏముంటుంది? ఎలాన్ మస్క్! ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి టార్చ్ బేరర్ బాల్యం, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, పలువురి మహిళలతో నెరిపిన సంబంధాలు, తన తండ్రి ఎర్రోల్ మస్క్‌తో ఉన్న అనుబంధాలతో సహా బిలియనీర్ జీవితంలోని అనేక కోణాలను వెల్లడించింది. పలు నివేదికల ప్రకారం.. మస్క్ గర్ల్ ఫ్రెండ్లు, మాజీ భార్యలు, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌లు, పలువురి మహిళలతో సంతానం వంటి అనేక కొత్త విషయాలు మస్క్ జీవిత చరిత్రలో ఉన్నట్లు తేలింది. దీంతో పాటు టెస్లా కార్ల షేర్ల తగ్గింపు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపుకుడు బిల్‌గేట్స్‌తో వాగ్వాదం గురించి బయోగ్రఫీలో రాశారు. వాల్టర్ ఇప్పటికే వాల్టర్ ఇప్పటికే రాసిన ఐన్‌స్టీన్, బెంజిమన్ ఫ్రాంక్లిన్ పుస్తకాలు ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో నిలిచాయి. బయోగ్రఫీపై ఎలాన్ మస్క్ స్పందన Cool, although it’s kinda weird seeing so many close-up pics of my face 😂 — Elon Musk (@elonmusk) September 22, 2023 తన బయోగ్రఫీ కాపీలు ఊహించని విధంగా అమ్ముడుపోవడంపై మస్క్ స్పందించారు. ‘క్లోజప్‌లో నా ఫోటోలు చూడటానికి విచిత్రంగా ఉన్నప్పటికి చాలా బాగుంది అంటూ’ చమత్కరించారు. -
'టైగర్ నాగేశ్వరరావు' రియల్ స్టోరీ.. ఇంతకీ అతడెవరో తెలుసా?
'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని పేరు. మహా అయితే స్టువర్టుపురం గజదొంగ అని తెలిసి ఉంటుందేమో! ఇతడి జీవితం ఆధారంగా తెలుగులో ఓ సినిమా తీశారు. రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' పేరుతోనే దీన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ఇంతకీ 'టైగర్ నాగేశ్వరరావు' ఎవరు? ఆయన మంచోడా? చెడ్డోడా? ఎవరీ నాగేశ్వరరావు? విజయవాడ-చెన్నై రూట్లో బాపట్లకు దగ్గర్లో స్టువర్టుపురం అనే ఊరు ఉంటుంది. అప్పట్లో అంటే 1874 టైంలో దొంగల్ని, ఇతర నేరాలు చేసే వాళ్లపై నిఘా పెట్టేందుకు.. వాళ్లందరినీ తీసుకొచ్చి ఈ ఊరిలో నివాసం కల్పించారు. అలా దొంగతనాలు చేసుకునే కుటుంబంలో 1953-56 మధ్యలో నాగేశ్వరరావు పుట్టాడు. ఇతడికి ఇద్దరు అన్నలు ప్రసాద్, ప్రభాకర్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ప్రసాద్, ప్రభాకర్ దొంగతనాలు చేసేవారు. (ఇదీ చదవండి: టైగర్ నాగేశ్వరరావు టీజర్‌పై హైకోర్టు అసహనం) అలా దొంగగా మారి అయితే ఓ సారి ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసులు.. నాగేశ్వరరావుని స్టేషన్‌కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. చేయని నేరానికి చిత్రవధ అనుభవించిన ఇతడు.. తండ్రి, అన్నల బాటలో అది కూడా 15 ఏళ్లకే దొంగగా మారాడు. 1970లో తమిళనాడుకు వెళ్లిపోయి మారుపేర్లతో దొంగతనాలు చేశాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి బయటకొచ్చాక, అతడి గ్యాంగ్‌లో చేరిపోయాడు. చెప్పి మరీ దొంగతనాలు ఓసారి ఈ అన్నదమ్ముల్ని తమిళనాడులో తిరువళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తనని చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లో జైలు నుంచి పారిపోతానని.. నాగేశ్వరరావు సవాలు విసిరాడు. అన్న చెప్పినా సరే వినకుండా అలానే రెండు రోజుల తర్వాత జైలులో పోలీసులని కొట్టి మరీ పరారయ్యాడు. 'వచ్చే నెల మద్రాసులో దొంగతనం చేస్తాను, దమ్ముంటే పట్టుకోండి' అని సవాలు విసిరి మరీ దొంగతనాలు చేశాడు. దీంతో నాగేశ్వరరావు కాస్త టైగర్ నాగేశ్వరరావుగా మార్మోగిపోయాడు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు) 15 ఏళ్లపాటు దొంగతనాలు పోలీసుల తీరు వల్ల దొంగగా మారిన టైగర్ నాగేశ్వరరావు.. దాదాపు 15 ఏళ్లపాటు ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకలో దొంగతనాలు, దోపీడీలకు పాల్పడ్డాడు. పోలీసులని ముప్పతిప్పలు పెట్టాడు. 1974లో బనగానపల్లె బ్యాంకు దోపీడీ అయితే వేరే లెవల్. పోలీసు స్టేషన్ దగ్గరే ఉన్న ఆ బ్యాంక్‌ని నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది. మత్తు మందు ఇచ్చి అయితే నాగేశ్వరరావు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ పోలీసులు.. అతడిని ఎలా అయినాసరే మట్టుబెట్టాలని ఓ మహిళతో కలిసి అతడిని చంపడానికి ప్లాన్ చేశారు. అలా 1980 మార్చి 24న తెల్లవారుజామున.. ఆ మహిళ ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు మత్తుమందు కలిపిన పాలు తాగాడు. అలా నిద్రపోతుండగా పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తర్వాత దాన్ని ఎన్‌కౌంటర్‌గా మార్చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి రాఖీ సెలబ్రేషన్స్) దొంగనే కానీ మంచోడు అయితే స్టువర్టుపురం గజదొంగగా పేరు మోసిన టైగర్ నాగేశ్వరరావు.. పెద్దోళ్ల దోచుకున్నదంతా పేదలకు పంచిపెట్టేవాడు. చదువు, పెళ్లి, వైద్యం లాంటిది ఏదైనా సరే అవసరానికి మించిన సహాయం చేసేవాడు. అయితే ఎన్ని దొంగతనాలు, దోపీడీలు చేసినా సరే మహిళల పట్ల ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడి అన్నయ్య ప్రభాకర్.. ఓ సందర్భంలో చెప్పాడు. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) -
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ రెడీ
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించిన ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక క్రికెటర్) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఈ సినిమా ఆల్ ఇండియా పంపిణీ హక్కులను నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ముత్తయ్య మురళీధరన్గారు బాల్యం నుంచి పడిన ఇబ్బందులు, ఆయన జర్నీ మొత్తం ఈ సినిమాలో ఉంటుంది. సెప్టెంబర్‌లో ట్రైలర్, అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
యాంకర్ నుంచి నటిగా మారిన సంయుక్త.. అవార్డ్ విన్నర్
సొంత భాష చిత్రాల్లో కంటే కొంతమంది పరభాషా చిత్రాల్లో బాగా పాపులర్ అవుతుంటారు. ఆ కోవలోని నటే సంయుక్త హోర్నాడ్. తెలుగు సినిమాలతో పాటు వరుస సిరీస్‌లూ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న ఆమె పరిచయం బ్రీఫ్‌గా.. అవార్డ్ విన్నర్ సంయుక్త హోర్నాడ్ అసలు పేరు.. సంయుక్త బేలవాడి. వారిది కళాకారుల కుటుంబం. తల్లి సుధా బేలవాడి నటి. తండ్రి ఎమ్జీ సత్య రావు రచయిత. నానమ్మ భార్గవి నారాయణ్ మేకప్ ఆర్టిస్ట్. చదువు పూర్తి చేసిన వెంటనే యాంకర్‌గా మారింది. పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. 2011లో ‘లైఫూ ఇష్టనే’ కన్నడం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. మొదటి అవకాశంతోనే అదరగొట్టి, వరుసగా పలు భాషల్లో సినిమా అవకాశాలను అందుకుంది. ‘ఉలవచారు బిర్యాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, 2014 ‘ఉత్తమ సహాయ నటి’ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాలోనూ నటించింది. సంయుక్త జంతు ప్రేమికురాలు. మూగజీవుల సంరక్షకురాలిగా పలు స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సేవ చేస్తోంది. ఈ మధ్యనే ‘పీపుల్ ట్రీ ఫౌండేషన్’ సంస్థను స్థాపించి, పేద రోగులకు ఉచిత చికిత్స అందేలా చూస్తోంది. ప్రస్తుతం జీ5లో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’, ఆహాలో ‘ లాక్డ్’, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ‘ఝాన్సీ’ సిరీస్‌లతో అలరిస్తోంది. ఓటీటీతో మంచి, చెడు రెండూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంట్లోంచే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నారు. ఇది డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కలిగిస్తున్నా.. ఇప్పుడిప్పుడే సినీ ప్రయాణం ప్రారంభిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లకు, జూనియర్ ఆర్టిస్టులకు, చిన్న నిర్మాతలకు మేలు చేస్తోంది. –సంయుక్త హోర్నాడ్ -
పుస్తక రూపంలో 'పొన్నియిన్ సెల్వన్' రచయిత కల్కి బయోగ్రఫీ
పొన్నియిన్ సెల్వన్ చిత్ర కథా రచయిత, పత్రికా సంపాదకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన దివంగత కల్కి జీవిత చరిత్ర పుస్తకం రపంలో వెలువడనుంది. కల్కి మనవరాలు సీతా రవి, లక్ష్మి నటరాజన్ పుస్తకంగా తీసుకొస్తున్నారు. ప్రముఖ పాత్రికేయుడు ఎస్.చంద్రమౌళి కల్కీ పొన్నియిన్ సెల్వన్ సెల్వర్ పేరుతో కల్కీ జీవిత చరిత్రను రాశారు. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలతోపాటు పొన్నియిన్ సెల్వన్ నవలకు సంబంధింన విశేషాలు ఉన్నాయి. సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు తొలి ప్రతిని కల్కి మనవరాలు సీతా రవి, లక్ష్మి నటరాజన్‌కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ దివంగత గొప్ప రచయిత కల్కి రచనలు తరాలకతీతంగా ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. ఆయన రాసిన నవల ఆధారంగా రపొందింన పొన్నియిన్ సెల్వన్ చిత్రం గత ఏడాది చివర్లో విడుదలై మంచి విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. దానికి రెండో భాగం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా కల్కీ జీవిత చరిత్ర పుస్తకంగా రావడం సరైన తరుణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
పుస్తకంగా రానున్న శ్రీదేవి జీవిత చరిత్ర
దివంగత నటి శ్రీదేవిని ఎవరూ అంత తొందరగా మరచిపోరు. భారతీయ సినీ చరిత్రలో చెరగని ఒక పేజీ ఆమె పేరు. అందం, అభినయం కలిస్తే శ్రీదేవి. బాల నటిగా సినీ రంగప్రవేశం చేసిన ఆమె ఆ తరువాత కథానాయకిగా మారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సూపర్‌స్టార్‌గా రాణించారు. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 300లకు పైగా చిత్రాలు చేశారు. ప్రముఖ నటులందరితోనూ నటించారు. ఈమె నటనకు గానూ పద్మశ్రీ నుంచి పలు జాతీయ, రాష్ట్రీయ, ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. అలాంటి శ్రీదేవి సినీ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమె జీవిత చరిత్ర ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. శ్రీదేవి కుటుంబంతో ఎంతో అనుబంధం కలిగిన ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్ కుమార్ ఆమె బయోగ్రఫిని ‘‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’’ పేరుతో పుస్తకంగా రచించారు. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, నిర్మాత బోనీకపూర్ బుధవారం అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో శ్రీదేవికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు. దీన్ని ఈ ఏడాది చివరిలో వెస్ట్‌ల్యాండ్ బుక్ సంస్థ విడుదల చేయనున్నట్లు చెప్పారు. కాగా శ్రీదేవి బయోగ్రఫీని చిత్రంగా చేయాలని పలువురు దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా శ్రీదేవి బయోగ్రఫీలో నటించాలని పలువురు అగ్ర నటీమణులు ఆశపడుతున్నారు. కాగా ది లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్ పుస్తకం విడుదల అనంతరం శ్రీదేవి బయోపిక్ తెరకెక్కే అవకాశం ఉంటుందేమో చూడాలి. We are thrilled to announce that we will be publishing @AuthorDhiraj’s definitive biography of Sridevi—an iconic superstar and true legend. Out in 2023! pic.twitter.com/JVgaeYFR73— Westland Books (@WestlandBooks) February 8, 2023 చదవండి: పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషలు మాట్లాడాలి: శివ రాజ్‌కుమార్ -
ఆనంద్ మూవీ చైల్డ్ అర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకం చెప్పన్కర్లేదు. సినిమాలను తెరకెక్కించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన సినిమాలంటే ఎలాంటి యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. రియలస్టిక్కు దగ్గర ఉండే ఫీల్ గుడ్ లవ్‌స్టోరీస్ తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. పాత్రలతో ప్రయోగాలు చేస్తారు. సెన్సిబుల్ పాయింట్‌తో ధైర్యం చేస్తారు. అలా ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాల్లో ఆనంద్ ఒకటి. మంచి కాఫీ లాంటి సినిమా అనేది ఉప శీర్షిక. ఈ మూవీ వచ్చి 18 ఏళ్లు గుడుస్తున్న ఇందులోని పాత్రలు, పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. చదవండి: బాలయ్య ఫ్యాన్స్ చంపేస్తారేమోనని భయపడ్డా!: వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు వెండితెరపై రియల్ లైఫ్ పాత్రలను చూస్తున్నంత అనుభూతిని ఇచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కుటుంబ నేపథ్యంలో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత నిజంగానే ఓ మంచి కాఫీ లాంటి సినిమా అనిపించుకుంది. ఇక ఇందులో ప్రతి పాత్రకు ఆయా నటులు జీవం పోశారని చెప్పవచ్చు. అందులో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఆనంద్ ఆనంద్ అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ హీరో రాజా చూట్టు తిరిగే చిన్నారి రోల్ కూడా ఒకటి. హీరో లిటిల్ ఫ్రెండ్‌గా సమత రోల్ పోషించింది ఆ చిన్నారి. చెప్పాలంటే ఇందులో ప్రధాన పాత్రల్లో ఆ చిన్నారి రోల్ కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆనంద్ తర్వాత ఆ చిన్నారి తెరపై ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ చిన్నారి 18 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఆమె అసలు పేరు భకిత. ఇప్పుడు ఆమె వయసు 26 ఏళ్లు. ఒక్క సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న భకిత మిగతా చైల్డ్ ఆర్టిస్టుల మాదిరిగా తిరిగి సినిమాల్లోకి రాలేదు. తన రూటే సపరేటు అంటూ భవిష్యత్తును కాస్తా భిన్నంగా ప్లాన్ చేసుకుంది. చదువుకుంటూనే సమాజ సేవలో పాల్గొంటుంది. చదవండి: విజయ్ దూకుడు.. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ‘రౌడీ’ హీరో తన 17 ఏళ్ల వయసు నుంచి మహిళల హక్కుల కోసం, ఆడవాళ్ల హక్కులు గురించి పోరాడుతుంది. అంతేకాదు పిల్లలపై జరుగుతున్న దాడులు, అత్యచారాలు, అఘాత్యాయిలను ఖండిస్తూ వాటికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ ఉద్యమం చేస్తుందట. మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని భకిత పోరాటం చేస్తోంది. 18 ఏళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్‌గా ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న భకిత ఇప్పుడు సమాజ క్షేమం కోసం ఆమె ఉద్యమాలు చేస్తూ ఎంతో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. -
సాహసమే అతడి ఊపిరి
1962లో తొలి బాండ్ సినిమా ‘మిస్టర్ నో’ రిలీజ్ అయ్యింది. షేన్ కానరీ హీరో. తర్వాత నాలుగేళ్లకు అలాంటి సినిమా తీయాలని నిర్మాత డూండీకి అనిపించింది. హీరో ఎవరు? ఎన్.టి.ఆర్... ఊహూ. ఏ.ఎన్.ఆర్.. కాదు. ‘తేనె మనసులు’ సినిమా చూశాడాయన. క్లయిమాక్స్‌లో కారు చేజ్. స్కూటర్ వేగంగా నడుపుతున్న కొత్త హీరో నదురు బెదురు లేకుండా డూప్ జోలికి పోకుండా చేజ్ చేసి ఒక్క గెంతులో కారులో దూకాడు. డేరింగ్ డేషింగ్ స్టంట్. ఇతడే నా బాండ్ అనుకున్నాడు డూండీ. ‘గూఢచారి 116’ రిలీజైంది. స్కూటర్ మీద నుంచి కారు మీదకు గెంతిన ఒక్క గెంతు ఆ నటుణ్ణి సూపర్‌స్టార్‌ని చేసింది. షేన్ కానరీ గొప్పవాడు. 32 ఏళ్లకు బాండ్ అయ్యాడు. కృష్ణ మరీ గొప్పవాడు. 23 ఏళ్లకే బాండ్ అయ్యాడు. తెనాలిలో కుర్రకారు చూడాల్సిన సినిమాలంటే ఇంకేం ఉంటాయి. అయితే ఎన్.టి.ఆర్. లేకుంటే ఏ.ఎన్.ఆర్. కృష్ణ ఎన్.టి.ఆర్ ఫ్యాన్. ఏలూరులో ఫిజిక్స్ మెయిన్‌గా బిఎస్సీ చదువుతూ ఎన్.టి.ఆర్ సినిమాలు చూసి మైమరిచాడు. 60 సినిమాలు పూర్తి చేసుకున్న ఏ.ఎన్.ఆర్‌ను సి.ఆర్.రెడ్డి కాలేజీకి సన్మానానికి పిలిస్తే ఆయనకు దక్కిన రాజభోగం గమనించాడు. ‘సినిమాకు ఇంత యోగమా’ అనుకున్నాడు. చెప్పాలంటే తెనాలి గాలిలోనే ఏదో కళ ఉంది. కృష్ణ ఊరు– బుర్రిపాలెంకు అది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక గాలి గట్టిగా తగిలింది. సినిమా గాలి. ‘ఆడబతుకు’, ‘మంగమ్మ శపథం’, ‘దేవత’ 1965లో రిలీజైన ఎన్.టి.ఆర్ సినిమాలు. ‘ఆత్మగౌరవం’, ‘ప్రేమించి చూడు’, ‘సుమంగళి’ ఏ.ఎన్.ఆర్ చిత్రాలు. ఇద్దరూ 42 ఏళ్ల వయసులో ఉన్నారు. పోటాపోటీగా కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని అప్పటికే తరం మారి, తలకట్టు మారి, తెలుగు తెర కొత్త ముఖం కోసం ఎదురు చూస్తూ ఉంది. అభిమానులు సంఘాలు పెట్టుకోవడానికి కొత్త హీరో అన్వేషణలో ఉన్నారు. తెలుగు నేలపై గాలి మారిందని చెప్పడానికి ఒకడు రావాలి. అదే సంవత్సరం 22 ఏళ్ల కృష్ణ తొలి సినిమా ‘తేనె మనసులు’ రిలీజ్ అయ్యింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్లతో ‘తేనె మనసులు’ తీసి హిట్ కొట్టాడు. ఆశ్చర్యం. దేవ్ ఆనంద్ పోలికలున్న రామ్మోహన్‌కు పేరొచ్చింది. అచ్చెరువు. ఏ పోలికలు లేని ఒరిజనల్ రూపు, ఊపు ఉన్న నటుడికే ఆ తర్వాత పట్టం దక్కింది. పట్టం దక్కినవాడు కృష్ణ. ఎన్.టి.ఆర్కు ఒక సంస్థానం ఉంది. తమ్ముడు త్రివిక్రమరావు పక్కన ఉన్నాడు. పుండరీ కాక్షయ్య ఉన్నాడు. నిర్మాతల సమృద్ధి ఉంది. అక్కినేనికి దుక్కిపాటి, విక్టరీ మధుసూదనరావు, వి.బి.రాజేంద్రప్రసాద్, ఆదుర్తి ఉన్నారు. కృష్ణకు? ఉన్నవల్లా ధైర్యం, సాహసం, పట్టుదల, పంతం. రోజూ లేవగానే మేకప్ వేసుకుని సెట్లో ఉండాలి. చెవులకు యాక్షన్, కట్ వినిపించాలి. ఊళ్లో ఏదో ఒక హాల్లో తన సినిమా ఆడుతూ ఉండాలి. అందుకు ఏం చేయాలి? నిర్మాత నుంచి సినిమా పుడుతుంది. నిర్మాతకు ఇబ్బంది రాకపోతే తనకు ఏ ఇబ్బందీ రాదు. ఆ సూత్రం తెలిశాక కృష్ణ నిర్మాతల హీరో అయ్యాడు. రేపు షూటింగ్. డబ్బు లేదు. తానే ఏర్పాటు చేసేవాడు. రిలీజయ్యాక సినిమా పోయింది. రెమ్యూనరేషన్ వదులుకున్నాడు. ఎవరో నిర్మాత గొల్లుమంటున్నాడు. పిలిచి డేట్స్ ఇచ్చాడు. కృష్ణకు కూడా ఇప్పుడు మెల్లగా ఒక సంస్థానం ఏర్పడింది. ఇద్దరు తమ్ముళ్లు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు తోడు నిలిచారు. డూండీ, వి.రామచంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్, ఆరుద్ర, త్రిపురనేని మహారథి తన పక్షం అయ్యారు. నెక్స్›్ట ఏంటి? కృష్ణ ఒకటి గమనించాడు... ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు నిర్మాతలు వస్తే హీరోలుగా నటిస్తారు. రాకపోతే తామే నిర్మాతలై హీరోలుగా నటిస్తారు. అంటే వారు హీరోలుగా నటిస్తూనే ఉంటారు. తాను కూడా నిర్మాతగా మారితే? తన హీరోయిజంను తానే నిరూపించుకుంటే? అదిగో డెక్కల చప్పుడు చేస్తూ నురగలు కక్కుతూ దౌడు తీస్తున్న గుర్రం. పైన ఎర్ర టోపి, చేత రివాల్వర్‌తో కృష్ణ. సినిమా పేరు ఏమిటా అని పల్లెటూళ్లో పాదచారి ఆగి పోస్టర్ చూశాడు. మోసగాళ్లకు మోసగాడు! ‘అమరవీడు’ సంస్థానం ఫ్రెంచ్ సేనల వశం అయ్యాక ఇద్దరు విశ్వాసపాత్రులు ఆ సంస్థానం నిధిని అడవిలో దాచారు. దాని కోసం మోసగాళ్లు వేటాడుతున్నారు. వారిని తలదన్నే మోసం చేసి నిధిని ప్రజలకు చేర్చాలి. అదీ ‘మోసగాళ్లకు మోసగాడు’ కథ. మన దేశంలో ఆలమందల్ని పిల్లనగ్రోవితో కట్టడి చేస్తారు. అమెరికాలో గుర్రాలతో కాపు కాస్తారు. ఆ కౌబాయ్‌లు మనకు లేరు. ఆ వాతావరణం మనది కాదు. సినిమా జాతకం చిటికెలో తేల్చే చక్రపాణి ‘ఈ సినిమా ఎవరికి అర్థమవుతుందయ్యా’ అని చికాకు పడ్డాడు సెట్‌కొచ్చి. కాని తీసెడివాడు కృష్ణ. మన దేశంలో తొలి కౌబాయ్ సినిమా. అదీ కలర్లో. మద్రాసులో రైలుకు మూడు ప్రత్యేక డబ్బాలు తగిలించి యూనిట్ రాజస్థాన్‌కు చేర్చి షూటింగ్ జరిపితే గుర్రాలు సకలించాయి. తుపాకులు గర్జించాయి. రక్తం చిమ్మింది. శత్రువులు మట్టి కరిచారు. నిధి ప్రజలకు చేరింది. ‘మోసగాళ్లకు మోసగాడు’ 1971లో విడుదలైతే ప్రేక్షకులు గుప్పిళ్ల కొద్దీ చిల్లర, మడతలు పడ్డ రూపాయి నోట్లు కౌంటర్లో ఇచ్చి టికెట్లను పెరుక్కొని హాల్లో సీట్లు వెతుక్కోడానికి పరిగెత్తారు. చక్రపాణి జోస్యం తొలిసారి పొల్లుపోయింది. కృష్ణ ఇప్పుడెవరనుకున్నారు? ఆంధ్రా జేమ్స్‌బాండ్ కృష్ణ. ఆంధ్రా కౌబాయ్ కృష్ణ. డేరింగ్ డాషింగ్ కృష్ణ. ఘంటసాలకు నాటుమందు పడలేదు. ప్రాణం మీదకొచ్చింది. పరిస్థితి అర్థమైన అక్కినేని రామకృష్ణను కనుగొన్నాడు. ఘంటసాల స్థానంలో రామకృష్ణను అక్కినేని ఎంకరేజ్ చేస్తే శోభన్‌బాబు, కృష్ణంరాజు కూడా అతణ్ణే ఎంచుకున్నారు. ఎన్.టి.ఆర్కు ఈ టెన్షనే లేదు. రఫీనే రంగంలో దించగలడు. కాని కృష్ణకు ఒక గొంతు కావాలి. పాటల్లో తనకో సపోర్ట్ కావాలి. ఇండస్ట్రీకి ఎవరో కొత్త గాయకుడు వచ్చి స్ట్రగుల్ అవుతున్నాడని విని పిలిపించారు. ‘మీరు వర్రీ కాకండి. ఎంత లేదన్నా నాకు సంవత్సరానికి నాలుగు సినిమాలుంటాయి. అన్నిటికీ మీరే పాడండి. నా సింగర్‌గా ఉండండి’ అని హామీ ఇచ్చాడు. ఆ కొత్త గాయకుడు ఉత్సాహంగా కృష్ణకు పాడాడు. ‘విశాల గగనంలో చందమామా... ప్రశాంత సమయములో కలువలేమా’.... విన్న ప్రేక్షకులు, రేడియో శ్రోతలు తలలు ఊపారు. తనివి తీరడం లేదని కార్డు ముక్కలు రాసి పోస్ట్‌డబ్బాలో పడేశారు. ఆ కొత్త గాయకుడు ఇంకా ఉల్లాసంగా పాడాడు. ‘తనివి తీరలేదే... నా మనసు నిండలేదే’... అలా కృష్ణ, తర్వాతి కాలంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగా తెలిసిన ఆ కొత్త గాయకుడు స్థిరపడి అనేక జూబ్లీల కాలం ప్లాటినమ్ డిస్క్‌లతో గమకాలాడారు. ఎన్.టి.ఆర్కు ‘పాతాళభైరవి’ ఉంది. అక్కినేనికి ‘దేవదాసు’ ఉంది. స్టార్లుగా కొనసాగాలంటే ప్రయత్నం, కృషి సరిపోతుంది. కాని సుదీర్ఘకాలం నిలబడాలంటే నటుడుగా ప్రూవ్ చేసుకోవాలి. మాగ్నమ్ ఓపస్ ఉండాలి. తనకు అదేమిటి అనే ఆలోచన వచ్చింది కృష్ణకు. ‘అసాధ్యుడు’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా పాటలో కనిపించినప్పటి నుంచి ఆ పాత్ర మీద మనసు ఉంది. ఆ సినిమా తీయాలన్న సంకల్పం ఉంది. కాని అందుకు గేట్ అడ్డం ఉంది. ఆ గేట్ పేరు ఎన్.టి.ఆర్. ఎప్పటి నుంచో ఆయన అల్లూరి సీతారామరాజు తీస్తానంటున్నాడు. తీయడం లేదు. కృష్ణ ఆగదల్చుకోలేదు. కృష్ణ నటించు ‘అల్లూరి సీతారామరాజు’. ఈ వార్త ఇండస్ట్రీ అంతా గుప్పుమంది. ఆ తర్వాత వార్తలే వార్తలు. 30 రోజుల పాటు విశాఖ ఏజెన్సీలో షూటింగ్ అట. యూనిట్ కోసం చింతపల్లిలో 5 ఎకరాల జొన్నచేను కొని సాపు చేసి కాలనీ కట్టారట. ఫీల్డులోని కేరెక్టర్ ఆర్టిస్టులంతా ఇందులో నటిస్తున్నారట. మన్యం వీరుడి కోసం కృష్ణ ఎంతకైనా ఖర్చు చేయడానికి సిద్ధ పడ్డాడట. అన్నింటికి మించి సినిమా స్కోప్‌లో తీస్తున్నారట. 1973 డిసెంబర్లో షూటింగ్ మొదలైతే కారెక్టర్ ఆర్టిస్టులంతా చింతపల్లిలో ఉండటం చేత మద్రాసులో రెండువారాలు షూటింగులు ఆగిపోయాయి. అదీ ఆ సినిమా తడాఖా. మెల్లమెల్లగా పోస్టర్లు, అల్లూరి గెటప్ బయటకు వచ్చాయి. ఖాకీ చెడ్డీ, మోచేతుల వరకూ తెల్ల చొక్కా, పైన ముతక తువ్వాలు, చేతి బెత్తంతో జనులకు కనిపించిన అల్లూరి సీతారామరాజు తెలుగు వారికి మాత్రం సినిమా వారు తమ ఊహలకు తగ్గట్టుగా తీర్చిదిద్దిన ఆహార్యం వల్ల ఇప్పుడున్న రూపానికి మారిపోయాడు. ఎన్.టి.ఆర్ ప్రోద్బలంతో అల్లూరికి ఆ సినీ రూపం ఇచ్చిన ఆర్టిస్ట్ మాధవపెద్ది గోఖలే. అన్నట్టు అతనిదీ కృష్ణ ఊరే. తెనాలి. ‘ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలనే కోరికా? రూథర్‌ఫర్డ్... నేనే కాదు. మా భారతీయులు ఎవ్వరూ ఏనాడూ ఇతరులను జయించాలని రాజ్యాలను స్థాపించాలని కోరలేదు. ఎప్పుడూ ఇతరులే ఈ రత్నగర్భపై ఆశపడ్డారు. దుర్జన దండయాత్రలతో రణరక్తసిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు. రాళ్లల్లో కలిసిపోయారు. యవనులు, హూణులు, మ్లేచ్చుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర అలానే అంతమవుతుంది’... అల్లూరి సీతారామరాజు డైలాగులతో హాల్లో జనం ఉద్వేగపడుతున్నారు. కన్నీరు కారుస్తున్నారు. ఆవేశ పడుతున్నారు. పౌరుషంతో ఉప్పొంగుతున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి మావాడు. ఆ పాత్రకు జీవం పోసిన కృష్ణ మావాడు. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. కృష్ణ పేరు ముందు ఇప్పుడు ‘నట’ చేరింది. ‘నటశేఖర’ కృష్ణ. అక్కినేని, ఎన్.టి.ఆర్ నిర్మాతలుగా ఉంటూ కృష్ణతో సినిమాలు తీయలేదు. కృష్ణ తాను నిర్మాతగా అక్కినేని, ఎన్.టి.ఆర్‌లతో సినిమాలు తీశాడు. ఎన్.టి.ఆర్తో తీసిన ‘దేవుడు చేసిన మనుషులు’ పెద్ద హిట్. అక్కినేనితో ‘హేమాహేమీలు’ తీశాడు. అక్కినేని, ఎన్.టి.ఆర్‌లను ఫలానా సినిమా తీయవద్దని కృష్ణ ఎప్పుడూ అనలేదు. కాని కృష్ణ తీస్తున్న సినిమాల విషయంలో వారు ఇరువురూ అభ్యంతరం చెప్పారు. ఎన్.టి.ఆర్ కృష్ణను పిలిచి ‘అల్లూరి సీతారామరాజు’, ‘కురుక్షేత్రం’ సినిమాలు విరమించమని కోరాడు. కృష్ణ ‘దేవదాసు’ తీస్తే అక్కినేని పోటీగా తన ‘దేవదాసు’ను రీరిలీజ్ చేశాడు. కృష్ణతో నటించే సినిమాలలో తనకు ప్రాధాన్యం ఉండటం లేదని పేపర్ ప్రకటన ఇచ్చి మరీ శోభన్‌బాబు తప్పుకున్నాడు. కృష్ణ ఆగలేదు. ఆగడం కృష్ణకు తెలియదు. నూరవ చిత్రం... రెండు వందలవ చిత్రం... ఇప్పుడతడు సూపర్‌స్టార్ కృష్ణ. ‘బృహన్నల’ వేషం వేయడానికి బాడీ లాంగ్వేజ్ కోసం నృత్య శిక్షణ తీసుకున్నాడు ఎన్.టి.ఆర్. ‘దేవదాసు’ రూపం కోసం అన్నపానీయాలు మానేశాడు అక్కినేని. కృష్ణ అలాంటి నటుడు కాదు. అతడు ఎంతో అందమైన అమాయకమైన నటుడు. అప్పటికప్పుడు చేయదగింది చేసి ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తే చాలు అనుకుంటాడు. అందుకే మార్నింగ్ కాల్షీట్లో గూఢచారిగా మారి భూమి మీద స్కైలాబ్ పడకుండా కాపాడతాడు. మధ్యాహ్నం కాల్షీట్లో ఓడ కెప్టెన్‌గా సముద్రం అడుగున ఉన్న నిధిని బయటకు తీస్తాడు. ‘పాడిపంటల’ రైతు అతడే. ‘నేనొక ప్రేమపిపాసిని’ అని పాడే భగ్న ప్రేమికుడు అతడే. పాత్రను అమాయకపు నిజాయితీతో చేరవేస్తాడు కనుకనే ప్రేక్షకులు విపరీతంగా అభిమానించారు. ‘ఏకలవ్య’ సినిమాలో ‘మోగింది ఢమరుకం మేల్కొంది హిమనగం’ పాటలో శాస్త్రీయ నృత్యం చేస్తాడు కృష్ణ. అది చూసి ప్రేక్షకులు వచ్చీరాని నృత్యం చేసే సొంత పిల్లల్ని కావలించుకున్నట్టు కృష్ణను కావలించుకుంటారు. అదే కృష్ణ విజయం. నటులుగా ఉంటూ దర్శకులుగా పెద్ద హిట్స్ ఇచ్చిన రాజ్ కపూర్, ఎన్.టి.ఆర్ల వరుసలో కృష్ణ నిలుస్తాడు. ‘సింహాసనం’ అందుకు ఉదాహరణ. నటుడుగా ఉంటూనే నిర్మాతగా రెండు భాషల్లో (తెలుగు, హిందీ) కృష్ణ తీసినన్ని సినిమాలు తీసినవారు లేరు. ఎంత వయసు వచ్చినా ఇమేజ్ చెక్కు చెదరకుండా కాపాడుకోవడం కృష్ణకు సాధ్యమైంది. కారెక్టర్ ఆర్టిస్టుగా కృష్ణ కొన్ని సినిమాలు చేశాడు. కాని జనం మాత్రం ‘హీరో కృష్ణ’ అని మాత్రమే పిలిచారు. అనవసర వివాదాలు, వాచాలత్వాలు లేకుండా కృష్ణ జీవితం ఎంతో హుందాగా గడిచింది. ‘యాక్షన్’ అనగానే బెబ్బులిలా మారే ఈ నటుడు తెర వెనుక మితభాషిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. భార్య విజయ నిర్మలను ఇంటికి పరిమితం చేయాలనుకోక దర్శకురాలిగా ప్రోత్సహించి ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా నిలిపాడు. ఎక్కడ సంపాదించాడో అక్కడే ఖర్చు పెట్టాడు. కన్నపిల్లల్ని తిరిగి సినిమా రంగానికే అప్పజెప్పాడు. గాలివాటానికి దొర్లిపోయే మనుషులు చరిత్రలో నిలవ్వొచ్చు. కాని ఎదురుగాలిని సవాలు చేస్తూ చరిత్రను సృష్టిస్తారు కొందరు. కృష్ణది అలాంటి కోవ. చేవ. అందుకే తెలుగువారికి ఎప్పటికీ అతడు డేరింగ్ డాషింగ్ కృష్ణ. – కె. -
మిస్ యూ.. సూపర్‌స్టార్
-
పుస్తక రూపంలో భారత దిగ్గజ ఫుట్‌బాలర్ బయోగ్రఫీ..
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, గత తరం దిగ్గజాల్లో ఒకడైన విక్టర్ అమల్‌రాజ్ బయోగ్రఫీ పుస్తక రూపంలో వచ్చింది. ‘మిడ్‌ఫీల్డ్ మాస్ట్రో’ పేరుతో వచ్చిన ఈ పుస్తకాన్ని సీనియర్ క్రీడా పాత్రికేయులు అభిజిత్‌సేన్ గుప్తా రచించారు. హైదరాబాద్‌నుంచి 21 మంది ఫుట్‌బాలర్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించగా...అందులో ఆరుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిలో విక్టర్ అమల్‌రాజ్ కూడా ఒకరు. 80వ దశకంలో మిడ్‌ఫీల్డర్‌గా భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అమల్‌రాజ్... కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత క్లబ్‌లు ఈస్ట్‌బెంగాల్, మొహమ్మదాన్ క్లబ్‌లకు కూడా సారథ్యం వహించారు. -
Mahesh Babu Birthday Special: మహేశ్... సరిలేరు నీకెవ్వరు
వెబ్ డెస్క్: మహేశ్.. ఆ పేరులోనే ఓ మత్తు ఉంటుంది. అమ్మాయిలకు కలల రాకుమారుడు ‘అతడు’. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ‘రాకుమారుడు’. తనదైన నటనతో టాలీవుడ్ ‘యువరాజు’గా వెలుగొందుతున్నాడు. అంతేకాదు ‘టక్కరి దొంగ’గా మారి అమ్మాయిల మనసును దోచుకున్నాడు. ‘అతిథి’లా అప్పుడప్పుడు కాకుండా ‘దూకుడు’గా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘వన్’అండ్ ఓన్లీ ‘మహర్షి’. సినిమా కోసం ‘సైనికుడి’గా కష్టపడుతూ.. వరుస హిట్లతో నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్న పక్కా ‘బిజినెస్‌మేన్’ ఈ ఆరడుగుల అందగాడు. వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి, ఆ చిన్నారుల తల్లిదండ్రుల పాలిట దైవంగా పిలవబడుతున్న గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’ఈ సూపర్ స్టార్. నేడు(ఆగస్ట్ 09) మహేశ్ బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా మహేశ్ సినీ కెరీర్, జీవిత విశేషాలపై ఓ లుక్కెద్దాం. సూపర్‌స్టార్ కృష్ణ,ఇందిరదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న చెన్నైలో జన్మించాడు మహేశ్. 2005 ఫిబ్రవరి 10న ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు గౌతమ్ కాగా, కూతురి పేరు సితార. (చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’) ఇక మహేశ్ నటప్రస్థానం విషయానికి వస్తే.. తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టాడు. 1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు. ఆ తరువాత వరుసగా బాలనటుడిగా ‘శంఖారావం’, ‘బజార్ రౌడీ’,‘ముగ్గురు కొడుకులు’,‘గూడచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాల చంద్రుడు’, ‘అన్న తమ్ముడు’తదితర చిత్రాలతో బాలనటుడిగా రాణించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో ‘రాజకుమారుడు’(1999) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. (చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..) జయాపజయాలతో సంబంధం లేకుండా విలక్షణమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎదిగాడు. 2003లో వచ్చిన 'నిజం' సినిమాకు గాను మొదటి సారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011లో వచ్చిన దూకుడు, 2015లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు అందుకొని రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ‘సర్కారి వారి పాట’చిత్రంతో మరో హిట్‌ని తన ఖాతాలు వేసుకున్నాడు మహేశ్. ఇక ఇప్పుడు వరుసగా రెండు సినిమాలను లైన్లో పెట్టేశాడు. అందులో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది అయితే.. మరొకటి దర్శకధీరుడు రాజమౌళిది. మహేశ్ విజయాల పరంపర ఇలాగే కొనసాగుతూ.. మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ‘హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్’. -
గౌతమ్ అదానీ.. ఈ దేశాన్ని ఎలా మార్చారంటే?
న్యూఢిల్లీ: సంపన్న వ్యాపారవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ స్వీయ చరిత్ర (బయోగ్రఫీ) ఆధారంగా ఓ పుస్తకం ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ (పీఆర్‌హెచ్‌ఐ) సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ‘గౌతమ్ అదానీ: ద మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా’ పేరుతో ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ ఆర్ఎన్ భాస్కర్ రాశారు. గౌతమ్ అదానీ జీవితం గురించి తెలియని కొత్త అంశాలు కూడా ఈ పుస్తకంలో ఉంటాయని పెంగ్విన్ తెలిపింది. చిన్న నాటి విశేషాలు, వ్యాపారం ప్రారంభించడం, అవకాశాలను గుర్తించడం తదితర అంశాలకు చోటు ఇచ్చినట్టు పేర్కొంది. చదవండి: ‘టైమ్స్’అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో గౌతమ్ అదానీ..కరుణా! -
Aaditya Thackeray: మరాఠా రాజకీయాల్లో యువతార
మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన వంశం వారిది. అయినా మూడో తరం వరకు ప్రత్యక్షంగా పోటీ చేసిన దాఖలాలు లేవు. తాత స్థాపించిన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచి అరుదైన రికార్డు లిఖించిన ఘనత శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే సొంతం. శివసేన పార్టీ యూత్ ఐకాన్‌గా వర్తమాన రాజకీయాల్లో వెలిగిపోతున్న 32 ఏళ్ల ఆదిత్య ఠాక్రే.. తన తండ్రి కేబినెట్లో మంత్రిగా కొనసాగుతుండడం విశేషం. మహారాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. సోమవారం (జూన్ 13) ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. జననం: జూన్ 13, 1990 (బుధవారం) పుట్టిన ఊరు: ముంబై తల్లిదండ్రులు: ఉద్ధవ్, రష్మీ ఠాక్రే తమ్ముడు: తేజస్ ఠాక్రే (వన్యప్రాణుల పరిశోధకుడు) పూర్తి పేరు: ఆదిత్య రష్మీ ఉద్ధవ్ ఠాక్రే పాఠశాల విద్య: బాంబే స్కాటిష్ స్కూల్, ముంబై ఉన్నత విద్య: సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి బీఏ న్యాయ విద్య: కేజీ లా కాలేజీ నుంచి న్యాయ పట్టా ఆహారపు అలవాటు: నాన్వెజిటేరియన్ వ్యక్తిగత వివరాలు: ఇంకా పెళ్లి కాలేదు హాబీస్: కవితలు చదవడం.. రాయడం, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం ఆస్తుల విలువ: 16.05 కోట్లు (2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం) పొలిటికల్ జర్నీ: ► 2010లో రాజకీయ అరంగ్రేటం, శివసేన పార్టీలో చేరిక ► జూన్ 17, 2010లో శివసేన యూత్ విభాగం ‘యువ సేన’ స్థాపన ► యువసేన అధ్యక్షుడిగా తాత బాల్ ఠాక్రే చేతుల మీదుగా నియామకం ► రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, బిహార్, జమ్మూకశ్మీర్‌లకు యువసేన విస్తరణ ► 2018లో శివసేన జాతీయ కార్యవర్గ కమిటీలో స్థానం ► 2019 అక్టోబర్‌లో ముంబైలోని వర్లీ స్థానం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ ► 67,427 మెజారిటీతో ఎమ్మెల్యేగా ఘన విజయం ► డిసెంబర్ 30, 2019లో మహారాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం ► మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో యువ మంత్రిగా గుర్తింపు ► మహారాష్ట్ర పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణ వివాదాలు: ► రోహింటన్ మిస్త్రీ పుస్తకాన్ని ముంబై యూనివర్సిటీ సిలబస్ నుంచి తొలగించాలని 2010, అక్టోబర్‌లో ఆందోళన ► సుధీంద్ర కులకర్ణిపై 2015, అక్టోబర్ 12న శివసేన సిరా దాడి, సమర్థించిన ఆదిత్య ఠాక్రే ► 2014 మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా గుజరాతీలు, మరాఠేతరులపై ‘సామ్నా’లో వివాదాస్పద వ్యాఖ్యలు, క్షమాపణ మరికొన్ని: ► శివసేన యూత్ విభాగం యువసేన అధ్యక్షుడిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు ► ‘మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్’ పేరుతో 2007లో తన కవిత సంపుటి ప్రచురణ ► స్వంతంగా పాటలు రాసి 2008లో ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ రూపకల్పన ► బాల్ ఠాక్రే సమక్షంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మ్యూజిక్ ఆల్బమ్ విడుదల ► 2017లో ముంబై జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక చదవండి: ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది -
చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం
కొంతమంది మామూలు మనుషులు దేశికోత్తముల శిష్యరికం, నిరంతర అధ్యయనం, విసుగూ వేసటా లేని రచనా వ్యాసంగం, మహా విద్వాంసుల సాంగత్యాల వల్ల సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థాయికి ఎదుగుతారు. తాము చరిత్రను నడిపించామని గొప్పలు పోక, చరిత్ర తమను నడిపించిందని తలొంచుకొని వినమ్రత ప్రదర్శిస్తారు. అలాంటి వినయమోహనులైన వకుళాభరణం రామకృష్ణ ఆత్మకథ – ‘నన్ను నడిపించిన చరిత్ర’. వకుళాభరణం ‘జ్ఞాపకాలు ఎందుకు రాశాను?’ అని తనకు తానే ప్రశ్నించుకొని ఇలా సమాధానం ఇస్తారు – ‘‘గత జీవితపు నెమరువేత! నాతో నేను మాట్లాడుకొనే స్వీయ సంభాషణ నా తృప్తికోసం, మహా అయితే మా కుటుంబం, మిత్రుల కోసం, శ్రేయోభి లాషుల కోసం, భావి తరాల కోసం.’’ 84 ఏళ్ల వకుళా భరణం రామకృష్ణ సుమారు ఎనభై సంవత్సరాల గత స్మృతుల్ని తలపోసుకొన్నారు. వకుళాభరణం రామకృష్ణ నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా ‘పాకలపల్లె’ వీధిబడి నుంచి కావలిలోని ‘విశ్వోదయ’ (జవహర్ భారతి) కళాశాల దాకా సాగిన చదువు సాముల గురించి ఎన్నో తీపి, చేదు అనుభవాల్ని జ్ఞాపకాల దొంతర్లలో పేర్చారు. పల్లెపట్టుల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, అన్ని జాతుల వాళ్ల మధ్య అరమరికలు లేకుండా జీవించి, మురిసిపోయిన వకుళా భరణం సింహావలోకనం చేసుకుంటూ– ‘‘...మన సమాజం ఎంత దూరం వచ్చింది, చదువు, సంస్కారం, విజ్ఞానం ఒకవైపు పెరిగినా; మత దురహంకారం, అసహనం ఎలా పెరిగి పొయ్యాయి? మన సంకీర్ణ సంస్కృతి ఏమౌతున్నది?’’ అని తలపట్టుకొని వేదన పడ్డారు. రామకృష్ణ నెల్లూరు వీఆర్ కాలేజి (1953–55)లో ఇంటర్మీడియట్, కావలి విశ్వోదయ కాలేజి (1955– 57)లో బీఏ చదివారు. సింగరాయ కొండ ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లోనే రెబల్ టీచరు నల్లగట్ల బాలకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత మరో అధ్యాపకుడైన సింగరాజు రామకృష్ణయ్యల న్యాయ పక్షపాత దృష్టి, సామ్యవాద సిద్ధాంతాల ప్రభావం ఈయనపై పడింది. కేవీఆర్ శిష్యరికంతో ఈ ప్రభావం మరింత గాఢమైంది. వకుళాభరణం ‘గుంపులో మనిషిని కాని’ నేను (పేజి: 96) అని అన్నా... యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఇన్ ఇండియా (యూఎస్ఈఎఫ్ఐ) ద్వారా ఎన్నికై 1967లో అమెరికా వెళ్లి, అక్కడ బ్లూమింగ్టన్ లోని ‘ఎర్ల్ హామ్ కాలేజి’లో విద్యార్థి సేవల గురించి అధ్యయనం చేశారు. రెండు నెలలపాటు అక్కడి పది విశ్వవిద్యాలయాల్ని దర్శించి నేర్చుకొన్న పాఠాల్నీ, అనుభవాల్నీ ‘జవహర్ భారతి’ కళాశాలలో ఆచరణలోకి తెచ్చారు. ‘‘అమెరికా పర్యటన వల్ల నా జ్ఞాన నేత్రం మరింత విప్పారింది. నా చుట్టూ వున్న పరిసరాలను, మనుష్యులను సమ్యక్ రీతిలో అర్థం చేసుకోగల సామర్థ్యం పెరిగింది’’ (పేజి: 100) అని రాసుకున్నారు. అంతేకాదు, ఈ విదేశీ పర్య టన ‘గుంపులో మనిషి కాని’ వకుళాభరణాన్ని గుంపులో మనిషిగా తీర్చిదిద్దింది. (క్లిక్: కూడు పెట్టే భాష కావాలి!) ‘జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం’లో వకుళా భరణం పరిశోధకులుగా గడిపిన సుమారు నాలుగు సంవత్సరాల అవధి, ఉపన్యాసకులుగా పనిచేసిన ఏడాది కాలం ఆయన్ను రాటుదేలిన పరిశోధకులుగా, ఉత్తమ ఆచార్యులుగా రూపొందించాయి. ఆచార్యవర్యులైన సర్వేపల్లి గోపాల్, బిపిన్‌చంద్ర, రొమిలా థాపర్ల సాన్నిధ్య, సాన్నిహిత్యాలు ఆయన జ్ఞానతృష్ణ, పరిశోధనా పటిమలకు మెరుగులు దిద్దాయి. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంతోమంది చరిత్ర ఆచార్యుల, విద్వాంసుల సహాయ సహకారాలతో ‘ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర – సంస్కృతి’ 9 ఆంగ్ల సంపుటాల్నీ, 8 తెలుగు సంపుటాల్నీ 2003 నుంచి 2017 అవధిలో ప్రచురింపచేశారు. ఆచార్య రామకృష్ణ తమ ఆత్మకథ చివర్లో ‘కథ ముగిసింది’ (పేజి: 210) అని నిర్వేదం ప్రకటించారు. కథ ఇంకా ముగియ లేదు. ఆయన చేయవలసింది చాలా ఉంది! (క్లిక్: నవ్యచిత్ర వైతాళికుడు) – ఘట్టమరాజు సుప్రసిద్ధ విమర్శకులు -
శతక నీతి – సుమతి: మహనీయుల పుస్తకాలే మంచి నేస్తాలు
మనిషి తన జీవన ప్రయాణంలో అనుక్షణం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది...‘త్యజదుర్జన సంసర్గమ్ భజ సాధు సమాగమమ్’.. ప్రయత్న పూర్వకంగా మానేయవలసినది... దుర్జనులతో స్నేహం. అది ఎప్పటికయినా కొంప ముంచేస్తుంది. ఏదో ప్రమాదాన్ని తెస్తుంటుంది. అలాగే కోరికోరి చేయవలసిన పని... మంచి మార్గంలో నడిచేవారితో కలిసి మెలిసి ఉండడం. మంచి మనుషులు అంటే నాకెవరూ అందుబాటులో లేరని అనుకోవద్దు. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామిలాంటి మహనీయుల పుస్తకాలు, చంద్రశేఖర సరస్వతీ మహాస్వామివారి అనుగ్రహ భాషణాలవంటివి ఇంట్లో ఉంచుకుని వాటిని చదువుతూ, వింటూఉంటే వారు మనతో ఉన్నట్లే.. మనమూ వారివేలు పట్టుకుని నడుస్తున్నట్టే. సత్పురుషుల మాటలు వినడం, వారి జీవిత చరిత్రలు చదవడం, వారి జీవన విధానాన్ని పరిశీలించడం వంటివి క్రమం తప్పకుండా చేస్తుంటే... మనం మంచి మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన స్ఫూర్తిని అవి ప్రతి క్షణం కలిగిస్తుంటాయి. మారీచుడు రావణాసురుడితో ఓ మాటంటాడు – ‘కొన్ని తప్పులు చేస్తే కొన్నే పోతాయి. కానీ మహాత్ముల జోలికి వెళ్ళావనుకో ఎంత ప్రమాదం వస్తుందో తెలుసా! నీ ఒక్కడితో పోదు. నువ్వు పరిపాలిస్తున్న లంకా పట్టణం నాశనమయిపోతుంది. నిన్ను నమ్ముకున్నందుకు రాక్షసులు ఒక్కరు కూడా మిగలరు. ఆఖరికి నీ కొడుకులు, నీ తోడబుట్టినవారుకూడా పోతారు. నీ భార్యలతో నువ్వు సంతోషంగా హాయిగా బతకాలనుకుంటే సీతమ్మ జోలికి వెళ్ళకు’ అన్నాడు. రావణుడు వినకపోగా ఏమన్నాడంటే – ‘‘సీతాపహరణానికి సహకారం చేస్తే రాముడి చేతిలో చచ్చిపోతావు. నా మాట వినకపోతే నా చేతిలో చస్తావు. నీకు ఎవరి చేతిలో చావాలనుంది’’ అని అడిగాడు. దుర్మార్గుడయిన నీ చేతిలో చచ్చేకన్నా మహాపురుషుడు రాముడి చేతిలో చచ్చిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు మారీచుడు. ఏమయింది చివరకు ...? మారీచుడు చెప్పినట్టే ఒక్క దుర్మార్గుడి వల్ల మొత్తం లంకారాజ్యం అంతా నశించిపోయింది. రాక్షసులు నశించిపోయారు. కొడుకు ఇంద్రజిత్ పోయాడు. ఆఖరికి భార్య రావణాసురుడి శవాన్ని చూసి –‘‘అందరూ నిన్ను రాముడు చంపాడనుకుంటున్నారు, కాదు. నిజానికి నిన్ను చంపింది ఎవరో తెలుసా! నీ ఇంద్రియాలే, వాటి లోలత్వమే నిన్ను చంపేసాయి.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ముందు ఒక మేకల మంద వెడుతుంటుంది. వాటి వెనుక ఒక వ్యక్తి వెళ్లాడనుకోండి. మేకలను రక్షిస్తాడు. అలా కాక ఒక తోడేలో, నక్కో వెళ్లిందనుకోండి. అప్పుడు మేకలకు ప్రమాదం బయటినుంచేమీ ఉండదు. వాటికి రక్షణగా ఉన్నవే వాటిని భక్షించేస్తాయి. నీవు కూడా దుర్మార్గులతో కలిసి ఉంటే నిన్ను పాడుచేయడానికి బయటినుంచి ఎవరూ రానక్కరలేదు. ఆ దుర్మార్గులతో కలిసి ఉన్న కారణమే నిన్ను నాశనం చేసేస్తుంది. అదే ఒక సత్పురుషుడితో కలిసి ఉంటే నీవు మంచి పనులు చేస్తున్నా చేయకపోయినా నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతుంటాయి. సుమతీ శతకకారుడి ఆవేదనాభరిత సందేశం కూడా ఇదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సైన్స్‌ను జనం దరి చేర్చినవాడు
వైజ్ఞానిక స్ఫూర్తి సామాన్యులకు అందించడం కోసం, దేశంలో గొప్ప గొప్ప శాస్త్రీయ సంస్థల స్థాపనకు, అభివృద్ధికి కృషి చేసినవారు డాక్టర్ పుష్పా భార్గవ! ప్రజలను చైతన్య పరచడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. జన విజ్ఞాన వేదికకు ఆలంబనగా నిలిచిన గొప్ప సైన్సు కార్యకర్త. సైన్స్ ప్రచార కార్యక్రమాల్లో ఆ సంస్థను మున్ముందుకు నడిపిస్తూ– చేప మందు శాస్త్రీయతను ప్రశ్నించారు. న్యాయస్థానం వరకు వెళ్ళి, అది మందు కాదని నిరూపించారు. విశ్వ విద్యాలయాల్లో ప్రభుత్వం జ్యోతిషాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించారు. అలాగే, వాస్తు ప్రామాణికతను ప్రశ్నించారు. సమగ్రమైన చర్చ లేకుండా జీవ సాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్లోకి విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. డాక్టర్ పుష్పా మిత్ర భార్గవ (22 ఫిబ్రవరి 1928–1 ఆగస్టు 2017) రాజస్థాన్‌లోని అజ్మీర్ (అజయ్ మేరు)లో జన్మించారు. 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీ (సేంద్రియ రసాయన శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వెనువెంటనే 21 సంవత్సరాల చిరుప్రాయంలో లక్నో యూనివర్సిటీ నుండి పీహెచ్డీ స్వీకరించారు. కొంతకాలం లక్నో యూని వర్సిటీలోనే లెక్చరర్‌గా పనిచేసి, తర్వాత కాలంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా చేరి స్థిరపడ్డారు. అమెరికా, ఫ్రాన్స్, యూకేల్లో ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనల్లో పాల్గొన్నారు. యూకే నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (ఆర్ఆర్ఎల్)లో సైంటిస్ట్‌గా చేరారు. తర్వాత కాలంలో ఆ ప్రయోగశాల భారత రసాయన సాంకేతిక సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – ఐఐసీటీ)గా రూపాంతరం చెందింది. (చదవండి: నిజం... నిజం... డార్వినిజం) డాక్టర్ పీఎం భార్గవకు దేశ ప్రధానులందరితో దగ్గరి పరిచయాలుండేవి. అందువల్ల ఆయన హైదరాబాదులో ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలి క్యులర్ బయాలజీ’ (సీసీఎంబీ)ని స్థాపించగలిగారు. 1977–1990 మధ్య కాలంలో దానికి వ్యవ స్థాపక సంచాలకుడిగా ఉండి, ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు. మాలిక్యులర్ సెగ్మెంట్స్ తయారీ కోసం ఒక అణుశక్తి ప్రయోగశాలను నెలకొల్పారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బయోటెక్నాలజీ విభాగం నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని హైదరాబాద్‌లో ఆవిష్కరించి, నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పుకు కారణం అయ్యారు. ఒక సైంటిస్ట్‌గా, ఒక డైరెక్టర్‌గా వివిధ స్థాయులలో పనిచేస్తూ, దేశ విదేశాలలోని పరిశోధనా శాలల సమన్వ యంతో ఒకానొక సమయంలో దేశ వైజ్ఞానిక పరి శోధనా రంగానికి వెన్నెముకగా నిలిచిన భార్గవ కృషి చాలా విలువైంది. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది) డాక్టర్ భార్గవకు లభించిన దేశ విదేశాల అవార్డులు, గుర్తింపులూ ఎన్నో ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇచ్చే లీజియన్ డి ఆనర్ (1998) పొందిన ఘనత వీరిదే. ఈ మధ్య కాలంలో దేశంలో వ్యాపించిన మత ఛాందసత్వ అసహనం పట్ల – దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యల పట్ల కలత చెందిన భార్గవ, తన పద్మభూషణ్ పురస్కారాన్ని 2015లో భారత ప్రభుత్వానికి వాపస్ చేశారు. ఉత్తర భారతదేశం నుండి వచ్చి, హైదరాబాద్‌ను తన స్వస్థలంగా మార్చుకుని, ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో దీన్ని ఒక ముఖ్య కేంద్రంగా మార్చినవారు. సత్యాన్ని ప్రేమించి, దాని కోసం అన్ని విధాలా పోరాడే స్ఫూర్తిని మనమంతా ఆయన జీవితం నుండి పొందుతూనే ఉండాలి! - డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (ఫిబ్రవరి 22న పుష్పా భార్గవ జయంతి) -
సంగీత సరస్వతి... స్వర సామ్రాజ్ఞి
సరస్వతీ దేవిని ఆరాధించే ‘వసంత పంచమి’ ఘడియల్లో సప్త స్వరాలు మూగబోయాయి. లతా మంగేష్కర్తో పాటు సాక్షాత్ సరస్వతీ స్వరూపం మరో లోకానికి మరలిపోయింది. దేశ సంస్కృతి, చరిత్రల్లో లతాజీ ఒక అంతర్భాగం. అఖండ భారత దేశంలో తన గాన యాత్ర ప్రారంభించి, ఏకంగా 7 దశాబ్దాల పాటు అవిరామంగా ఆ యాత్రను సాగించిన సాంస్కృతిక సమున్నత చిహ్నం ఆమె. మరాఠీ నాటక రంగంలో గాయక– నటుడు దీనా నాథ్ ఐదుగురి సంతానంలో ప్రథమ సంతానం లత. తండ్రి ఆకస్మిక మరణంతో 13వ ఏట తన ముగ్గురు సోదరీమణులు, సోదరుడు హృదయనాథ్ల పోషణ, కుటుంబభారాన్ని ఆమె తనపై వేసుకున్నారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తోబుట్టువులంతా సంగీత రంగంలోనే రాణించడం విశేషమే. లత తన తండ్రి స్నేహితుడు, నటి నందా తండ్రి అయిన మాస్టర్ వినాయక్ (సంగీత దర్శ కుడు, దర్శకుడు) మార్గదర్శనంలో మరాఠీ సినిమాలలో నటించారు. పాటలు పాడడం మొదలు పెట్టారు. అప్పట్లో నూర్జహాన్, షంషాద్ బేగమ్‌ల తారస్థాయిలో పాడే విధానంతో పోలిస్తే, లత గొంతు కొంత పీలగా ఉందని సంగీత దర్శకులు నిరుత్సాహపరిచిన సందర్భాలున్నాయి. క్రమంగా జోహ్రాబాయి, అమీర్బాయి కర్నాటకీ, షంషాద్, సురయ్యాల మధ్య... సంగీత దర్శకుడు గులామ్ హైదర్ ప్రోద్బలం, ప్రోత్సాహంతో లత పాటలు పాడారు. సంగీత దర్శకులు అనిల్ బిశ్వాస్, నౌషాద్, హుస్న్‌లాల్ – భగత్రామ్ ద్వయం కూడా లతా మంగేష్కర్ ప్రతిభను గుర్తించి, పాడించారు. 1949లో బాంబే టాకీస్ నిర్మాణం ‘మహల్’లో పాట ‘ఆయేగా ఆయేగా’ పాట దేశమంతటా మారు మోగింది. అప్పట్లో సిలోన్ రేడియోలో ప్రతి రోజూ హిందీ సర్వీస్‌లో ఈ పాట ప్రసారం చేయమంటూ వేలల్లో ఉత్తరాలు వస్తుండేవట! ఆ ఉత్తరాల్లో గాయకురాలి పేరు కనుక్కోవడానికి వచ్చినవే ఎక్కువ. ఎందుకంటే, అప్పట్లో గ్రామ్‌ఫోన్ రికార్డులలో సినిమాలోని పాత్రధారి పేరే ఉండేది. (చదవండి: వంద వసంతాల హేతువాది) ఆ తరువాత రాజ్‌కపూర్ సొంత నిర్మాణంలో వచ్చిన ‘బర్సాత్’ చిత్రగీతాలతో దేశమంతా లతా ప్రభంజనం మొదలైంది. నాయికలు తమకు లతానే ప్లేబ్యాక్ పాడాలనే షరతు కాంట్రాక్ట్‌లో పెట్టడం వరకూ వెళ్లింది. సంగీత దర్శకులందరూ లత రికా ర్డింగ్ కోసం వేచి చూడడం, ట్రాక్ సింగర్లతో రికార్డ్ చేసి, పాట షూట్ చేసి, ఆ తర్వాత లతాజీతో ఒరిజినల్ వెర్షన్ పాడించిన సందర్భాలు కోకొల్లలు. మాతృభాష మరాఠీపై అభిమానంతో, ‘ఆనంద్ ఘన్’ అనే మారుపేరుతో సంగీత దర్శకత్వంతో పాటు కొన్ని సినిమాలను స్వయంగా నిర్మించి, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారామె. అది జోల పాట కానీ, భజన గీతం కానీ, విషాద గీతం కానీ, ప్రబోధ గీతం కానీ లత ఏర్పరిచిన ప్రమాణాలను వేరెవ్వరూ అందుకోలేనంతగా అన్ని భారతీయ భాషలలో పాడారు. అనిల్ బిశ్వాస్ చొరవతో శ్వాసను ఎక్కువ సేపు నిలిపేలా చేసిన సాధనతో ఆమె సాధించిన విజయాలెన్నో! భారత్–చైనా యుద్ధానంతరం ఆమె పాడిన ‘ఆయ్ మేరే వతన్ కే లోగో’ పాట దేశ ప్రధాని నెహ్రూతో పాటు యావత్ దేశాన్ని కన్నీరు పెట్టించింది. ఒక జాతీయ గీతం అంతటి స్థాయిని సాధించింది. ఈ పాటను కానీ, ‘ఆనంద్ మఠ్’లోని వందేమాతరం కానీ వినని భారతీయుడు ఉండడు! ప్రముఖ హిందుస్తానీ విద్వాంసుడు ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఒకానొక సందర్భంలో ‘అసలీవిడ అపశ్రుతిలో పాడదా?’ అంటూ ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఆమెకు ‘ఉస్తాదోంకా ఉస్తాద్’గా కితాబిచ్చారు. ఫిలింఫేర్ అవార్డులు, అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పుర స్కారం, జాతీయ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో పాటు దాదాపు అన్ని సంగీత, సాంస్కృతిక అవార్డులకూ లత ఓ చిరునామా. (చదవండి: ఆదర్శ జీవితానికి కొలమానం) క్రికెట్ అంటే లతాజీకి వీరాభిమానం. అందుకే, 1983లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు నజరానాలు అందించడానికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వద్ద నిధులు లేకపోవడంతో తనే పూను కొని, ఒక సంగీత విభావరి నిర్వహించారు. రూ. 20 లక్షలకు పైగా సేకరించడమే కాక, ఎల్పీ రికార్డును విడుదల చేసి, రాయల్టీ కూడా బీసీసీఐకి అందించిన ఔదార్యం లతాజీది. తరాలు మారినా 7 దశాబ్దాల పాటు అన్ని ట్రెండ్లలో తన ఉనికి చాటుకున్నారు. రోషన్–రాజేష్ రోషన్, చిత్రగుప్త– ఆనంద్ మిళింద్, ఎస్డీ బర్మన్ – ఆర్డీ బర్మన్ల తరాలను దాటి నేటి ఏఆర్ రెహమాన్ వరకూ స్వరాన్ని అందించారు. ‘ఆన్’, ‘ఉడన్ ఖటోలా’ చిత్రాలు తమిళంలో డబ్ అయినప్పుడు ఆ చిత్రంలోని పాటలన్నీ లతానే పాడారు. ఇక, తెలుగులో ‘సంతానం’ చిత్రంలోని అనిసెట్టి రచన ‘నిదురపోరా తమ్ముడా’, ‘ఆఖరి పోరాటం’లో ‘తెల్లచీరకు...’ పాటలు పాడారు. దర్శ కుడు వంశీ ‘గాలికొండాపురం రైల్వేగేటు’ నవలను సినిమాగా తీయాలనుకున్నప్పుడు, ఇళయరాజా సంగీతంలో లతాజీతో పాట రికార్డింగ్ చేయిం చారు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవ డంతో అందులోని ఆమె పాట వినే అదృష్టం తెలుగు అభిమానులు కోల్పోయారు. ఆమె తన 80వ ఏట అన్నమాచార్య కీర్తనలను టీటీడీ కోసం ఆలపించి, పారితోషికం స్వామికే సమర్పించడం విశేషం. హిందీ, బెంగాలీ, మరాఠీ, ప్రైవేట్ భజన్స్ ఏవైనా లతాజీ పాటల్లో అత్యుత్తమమైనవి ఎంపిక చేయడ మంటే సంద్రాన్ని దోసిట పట్టాలనుకోవడమే!‘నాకు ఒక హార్మోనియం, లతాని ఇవ్వండి. సంగీతం కంపోజ్ చేసిచ్చేస్తా’ అన్నది ఎస్డీ బర్మన్ మాట. నటి నర్గీస్ – ‘లతాజీ పాడిన విషాద గీతం అభినయించా లంటే గ్లిజరిన్ అవసరం రాలేదు. లతాజీ గొంతులో పలికే ఆ భావమే నాకు అప్రయత్నంగా కన్నీళ్ళు తెప్పించేది’. చలనచిత్ర సంగీతంలో లతాజీ ముద్ర చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు కొల్లలు. కవి జావేద్ అఖ్తర్ అన్నట్లు ‘ఈ భూగ్రహానికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే లతా!’ – రవి పాడి, రైల్వే ఉన్నతాధికారి అరుదైన గ్రామ్‌ఫోన్ రికార్డుల సేకర్త -
వాళ్లు అలా అనేసరికి లతా మంగేష్కర్ ఒక్కరోజే బడికెళ్లింది
ముంబై: పదినెలల చెల్లిని బడిలోకి తీసుకురావద్దన్నారన్న కోపంతో బడి ముఖమే చూడకూడదని పంతం పట్టింది ఒక చిన్నారి. అలా బడి మానేసిన చిన్నారి భారతరత్నగా ఎదగడంలో స్వయం కృషి ఎంతో ఉంది. లతా మంగేష్కర్ చిన్నతనంలో చెల్లెలు ఆశాను తీసుకొని స్కూలుకు వెళ్లింది. అయితే పసిపిల్లను బడిలోకి తేవద్దంటూ టీచర్ అభ్యంతరం పెట్టడంతో కోపంతో వెనక్కు వెళ్లిన లత మళ్లీ బడి ముఖం చూడలేదు. చిన్నప్పుడు మరాఠీ అక్షరాలు చదవడం, రాయడం ఇంట్లోనే పనిమనిషి సాయంతో నేర్చుకున్నట్లు లతా మంగేష్కర్.. ఇన్ హర్ ఓన్ వాయిస్ పుస్తకంలో చెప్పారు. మరీ పసితనంలో నర్సరీ క్లాసులకు వెళ్లానని, బోర్డు మీద రాసిన శ్రీ గణేశ్ జీ అనే అక్షరాలను అచ్చుగుద్దినట్లు దింపినందుకు అప్పుడు తనకు పదికి పది వచ్చాయని చెప్పారు. తన బంధువు వసంతి మ్యూజిక్ క్లాసులకు వెళ్లేదని, ఆమెతో పాటు వెళ్లిన తనను పాట ఆకర్షించిందని ఆమె చెప్పారు. తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తన ఆసక్తిని గమనించి అందరు టీచర్ల ముందు మ్యూజిక్టీచర్ పాడమన్నారని, అప్పుడు హిందోళంలో పాట పాడానని చెప్పారు. ఆ తర్వాత తనను బడికి రమ్మన్నారని, అక్కడకు ఆశాను తీసుకొని వెళ్లిన తనను టీచర్ అడ్డుకోవడంతో వెనక్కు వచ్చానని వివరించారు. కాలక్రమంలో బంధువులు, ప్రైవేట్ టీచర్ల సాయంతో హిందీ నేర్చుకున్నానన్నారు. తర్వాత కాలంలో ఉర్దూ, బెంగాలీ, కొంత మేర పంజాబీ నేర్చుకున్నానని, సంస్కృతం అర్థమవుతుందని, తమిళ్ అవగాహన చేసుకునే యత్నం చేశానని లత చెప్పారు. -
కోకిలమ్మ- లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జర్నీ
-
పరిశోధనలో ఆయన ఘనాపాఠి
ననుమాస స్వామి అనగానే గుర్తొచ్చేవి కుల పురాణాలు. ఎన్నో కులాల పుట్టుపూర్వోత్తరాలను ఆయన జానపద గా«థల ఆధారంగా తెలియజేశారు. ముఖ్యంగా వృత్తి పురాణాలపై ఆయన చేసిన పరిశోధన పండితుల ప్రశంసలను అందుకుంది. అలాగే ఆయన అనేక ఉద్యమ గీతాలను అందించి తెలంగాణ ఉద్యమానికి ఊపును తీసుకొచ్చారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించిన యోధుడు ననుమాసస్వామి (నమామి). అప్పటినుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తన భుజానెత్తిన తెలంగాణ జెండాను దించలేదు. 2013లో తెలంగాణ పోరాట యోధుల సంఘాన్ని స్థాపించారు. సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, శరద్ యాదవ్, ఏబీ బర్దన్ లాంటి నాయకులకు విజ్ఞా పన పత్రాలను అందించారు. 1969లోనే గాదు, 2001 నుండి తెలంగాణా ఉద్యమ గీతాలను రాసి పాడి తొలి తెలంగాణ ఉద్యమ వాగ్గేయ కారుడు అనిపించుకొన్నారు. 1969 లోనే ఉద్యమగీతాలు ‘అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్య’ లాంటి పాటతోపాటు మరో ఏడు పాటలను రాశారు. 2001లో తెరాస ఆవిర్భావసభ సందర్భంగా కూడా నాలుగు పాటలు రాసి 1969 నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటారు. నిరక్షరాస్యుల కుటుంబంలో పుట్టిన ననుమాస స్వామి మూడు డాక్టరేట్లు, ఒక ఎం.ఫిల్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూనే 1990లో ‘తెలుగు పరిశోధన’ పత్రికను స్థాపించి, పరిశోధన లను పదునెక్కించారు. ఎంతోమంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఆయన పర్యవేక్షణలో 21 మంది పరి శోధకులు పీహెచ్డీ పట్టాలనూ, తొమ్మండుగురు ఎం.ఫిల్ పట్టా లనూ సాధించారు. వృత్తి పురాణాల పరిశోధన కోసం ఆయన ఉభయ తెలుగురాష్ట్రాల్లో గ్రామగ్రామాన తిరిగి 14 చిత్రపటం కథా ప్రదర్శనలను, 34 వృత్తి కథా ప్రదర్శనలను వీడియో రూపంలో సేకరించారు. మడేల్, నాయీ, ముదిరాజ్, గౌడ పటంకథలతో సహా 12 పుస్తకాలను ప్రచురించారు. జానపద పురాణాలు, కుల పురాణం పేరుతో వివిధ పత్రికల్లో విస్తారంగా కాలమ్స్ రాశారు. ఇవి కొన్ని ఏళ్ల తరబడి కూడా కొనసాగాయి. వృత్తి దేవతలు పేరిట ఎస్వీ భక్తి చానల్లో ధారావాహిక నిర్వహించారు. ‘ఊసెత్తుతే చాలు ఉలిక్కిపడే పురాణాలు’ అంశం మీద 13 గంటలు ధారాళంగా ఉపన్యసించి ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్’ (2015)లోకి ఎక్కారు. అమె రికా, శ్రీలంక, యూకే లాంటి దేశాల్లో జరిగిన సదస్సులలో పాల్గొని, పరిశోధన పత్రాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధ్యా పక సంఘంలో 1995 నుండి 2011 దాకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అన్నింటా తెలుగు భోధన ఉండాలని ఉద్యమించి ప్రగతిని సాధించారు. 2011లో ‘భాషా పరిరక్షణ సమితి’ని స్థాపించి మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో, అంతర్జాతీయ యూనివర్సిటీలో తెలుగు శాఖలను ఏర్పాటు చేయించేందుకు చొరవ తీసుకున్నారు. – డా. నేతి మాధవి,జానపద పరిశోధకురాలు (నేడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ననుమాస స్వామి మూడు పుస్తకాలు – ప్రవహిస్తున్న జైలుగానం,గాడ్గే బాబా, తెలంగాణ బోనాలు – ఆవిష్కరణ కానున్నాయి) -
మహిళా మావోయిస్టుల జీవిత చరిత్రపై పుస్తకం
చర్ల: ప్రజాయుద్ధంలో 2005 నుంచి 2021 వరకు అసువులుబాసిన మహిళా అమరవీరుల జీవిత చరిత్రపై మావోయిస్టులు పుస్తకాన్ని తెచ్చారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ బుధవారం ఓ లేఖ ద్వారా వెల్లడించారు. 178 పేజీల పుస్తకం పీడీఎఫ్‌ను కూడా విడుదల చేశారు. దశాబ్దాల పోరు చరిత్రలో ఎందరో మహిళా గెరిల్లాలు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ప్రజాఉద్యమ చరిత్రలో తమ చెరగని ముద్రవేశారని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. త్యాగధనుల జీవిత చరిత్రలు సమాజానికి తరగని గనిలాంటివని భావిస్తూ ఈ పుస్తకాన్ని తెచ్చామని చెప్పారు. గతంలోనూ 2005లో మహిళా మావోయిస్టుల అమరులపై ఎన్టీ ఎస్‌జడ్‌సీ (ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ) ఒక పుస్తకాన్ని ప్రచురించగా, ఇప్పుడు రెండో పుస్తకాన్ని వెలువరించినట్లు జగన్ తెలిపారు. -
తనకు ఆ సమస్య ఉందని తెలిసి బాధపడ్డ సిరివెన్నెల
Sirivennela Seetharama Sastry: రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా... ఏకధాటిగా 30 ఏళ్లు పాటతోనే జీవించిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ‘అంతర్యామి అలసితి సొలసితి...’ అంటూ అక్షరాల నుంచి సెలవు తీసుకున్నారు. సిరివెన్నెలలు పంచడానికి వెన్నెల చెంత చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే 20న డా. చేంబోలు వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు కాగా సీతారామశాస్త్రి తొలి సంతానం. పదో తరగతి వరకూ అనకాపల్లిలో చదువుకున్న సీతారామశాస్త్రి కాకినాడలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐటీఐ కాలేజీ లెక్చరర్‌గా వెంకట యోగికి కాకినాడకు బదిలీ కావడంతో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదువు అక్కడే సాగింది. కాగా వెంకట యోగికి హోమియోపతి వైద్యంలో ప్రవేశం ఉండటంతో సీతారామశాస్త్రిని మెడిసిన్ చదివించాలనుకున్నారు. అలా విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో 1973లో ఎమ్బీబీఎస్లో చేరారు. అయితే ఎమ్బీబీఎస్లో చేరే ముందే కుటుంబ పోషణ విషయంలో ఇబ్బందిపడుతున్న తండ్రికి సాయం చేయాలని టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేశారు. కానీ ఎమ్బీబీఎస్లో చేరారు. అప్పటివరకు సీతారామశాస్త్రికి మొదటి బెంచ్‌లో కూర్చొనే అలవాటు ఉంది. కానీ ఎమ్బీబీఎస్లో చివరి బెంచ్ దొరికింది. పైగా లెక్చరర్స్ చెప్పే పాటలు అర్థం అయ్యేవి కావు. ఎందుకంటే అప్పుడు ఇంగ్లిష్‌లో సీతారామశాస్త్రికి అంతగా ప్రావీణ్యత లేదు. చివరి బెంచ్‌లో కూర్చున్న ఆయనకు బ్లాక్‌బోర్డ్ సరిగ్గా కనిపించకపోవడంతో, తనకు కంటి సమస్య ఉందని గ్రహించి, బాధపడ్డారు. ఇంగ్లిష్ సమస్య, ఐ సైట్... ఈ రెంటితో పాటు ఉమ్మడి కుటుంబ పోషణ విషయంలో తండ్రి ఇబ్బంది.... ఈ మూడు అంశాలు సీతారామశాస్త్రికి చదువుపై ఏకాగ్రత నిలవనివ్వకుండా చేశాయి. అదే సమయంలో టెలిఫోన్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరమని కబురు రావడంతో ఎమ్బీబీఎస్కి ఫుల్స్టాప్ పెట్టి, 300 రూపాయలకు టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్‌గా చేరారు. అయితే తండ్రికి మాత్రం తాను ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఆ తర్వాత బీఏ చేశారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో 40 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారమంతా సీతారామశాస్త్రిపై పడిపోయింది. తండ్రి హోమియోపతి వైద్యాన్ని సీతారామశాస్త్రి తమ్ముడు చూసుకున్నారు. ఆ తర్వాత సీతారామశాస్త్రి తమ్ముడికి ఉద్యోగం దొరికింది. సోదరీమణుల వివాహాలను ఈ ఇద్దరు అన్నదమ్ములు జరిపించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కాకినాడలో సాంస్కృతిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న సీతారామశాస్త్రికి ‘కళా సాహితి సమితి’తో పరిచయం కలిగింది. ఈ ప్రయాణంలో భాగంగానే సీవీ కృష్ణారావు, ఇస్మాయిల్, సోమసుందర్, ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ వంటి ప్రముఖ సాహితీవేత్తలతో సీతారామశాస్త్రికి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పుడే ‘భరణి’ అనే కలం పేరుతో సీతారామశాస్త్రి రాసిన రచనలు ఆంధ్రప్రభ, విజయ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఇదే టైమ్‌లో ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ సినిమాల్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. 1980లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా విజయోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఓ వేడుక ఏర్పాటు చేశారు. కె. విశ్వనాథ్‌కి ఓ స్వాగతగీతాన్ని రాయాల్సిందిగా సీతారామశాస్త్రిని కోరారు ఆకెళ్ల. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఓ సందర్భంలో కె. విశ్వనాథ్ పాల్గొన్న ఓ వేడుకలో సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను కె. విశ్వనాథ్ స్వాగత గీతంగా ఆలపిం చారు. విశ్వనాథ్‌కి ఈ పాట నచ్చింది. ఈ పాట ఎవరు రాశారో తెలుసుకోవాలని ప్రయత్నించగా ఆయనకు భరణి (సీతారామశాస్త్రి కలం పేరు) అని తెలిసింది. భరణి అనేది సీతారామశాస్త్రి కలం పేరు అని తెలుసుకున్న కె. విశ్వనాథ్ ఆయన్ను కలవాలనుకున్నారు. అంతేకాదు.. సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను తన సినిమా (బాలకృష్ణ హీరోగా నటించిన ‘జననీ జన్మభూమి)లో వినియోగించాలనుకుంటున్నట్లుగా కబురు పంపారు. ‘‘ఓ సందర్భంలో ‘గంగావతరణం’ పాటను మీ కోసమే రాశాను. ఇప్పుడు అది మీ చెంతకు చేరడం, మీ సినిమాలో వినియోగించుకోవాలనుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సీతారామశాస్త్రి. అయితే ఈ సినిమా పాటల రచయిత విభాగంలో క్రెడిట్ కావాలని విశ్వనాథ్‌ని కోరారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్ ఓకే అన్నారు. తాను గురువుగా భావించే వేటూరి సుందర రామమూర్తి పేరు కింద తన పేరు ‘చేంబోలు సీతారామశాస్త్రి (భరణి)’ అనే టైటిల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసుకుని ఆనందపడిపోయారు. ఇంటి పేరుగా మారిన ‘సిరివెన్నెల’ ‘సిరివెన్నెల’ (1986)తో సీతారామశాస్త్రి సినిమా కెరీర్ పూర్తిగా మొదలైంది. చిత్రదర్శకుడు కె. విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ కథ చెప్పి ఓ పాట రాయాల్సిందిగా కోరారు. ‘విధాత తలపున..’ అని రాశారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్‌కి చాలా బాగా నచ్చింది. అంతే.. ఈ చిత్రంలోని మొత్తం పాటలూ నువ్వే రాస్తున్నావని సీతారామశాస్త్రితో అన్నారు. అది మాత్రమే కాదు.. ఈ సినిమా పేరుతోనే విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని టైటిల్ కార్డ్ వేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ పాటల వెన్నెలలు పంచారు ‘సిరివెన్నెల’. ఆ సినిమాలోని ‘విధాత తలపున’ పాటకు సిరివెన్నెల అల్మరాలో ‘నంది’ కూడా చేరింది. ఆ తర్వాత విశ్వనాథ్–సిరివెన్నెల కాంబినేషన్లో పలు సూపర్ హిట్ పాటలు వచ్చాయి. అందుకు శ్రుతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం లాంటి చిత్రాల్లోని పాటలు ఓ ఉదాహరణ. మూడు దశాబ్దాల్లో ... ఒక్క విశ్వనాథ్ అనే కాదు.. సిరివెన్నెల ప్రతి దర్శకుడికీ హిట్ పాటలు ఇచ్చారు. ‘శివ’ సినిమాలో రామ్‌గోపాల్ వర్మకు ‘బోటనీ పాఠముంది..’ అని రాశారు. అదే వర్మకు ‘క్షణక్షణం’లో ‘కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా’, ‘గాయం’లో ‘అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు’, నంది అవార్డు సాధించిన ‘స్వరాజ్యమవలేని’ పాటలు రాశారు. మరోవైపు కృష్ణవంశీకి ‘గులాబి’ కోసం ‘ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావు..’, ‘ఏ రోజైతే∙చూశానో నిన్నూ..’ రాశారు. ‘సిరివెన్నెల’ రాసిన ‘జగమంత కుటుంబం నాది..’ పాట విని, ఆ పాట కోసమే సినిమా తీయాలని కృష్ణవంశీ తీసిన చిత్రం ‘చక్రం’. శివనాగేశ్వ రావు ‘మనీ’లో ‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..’ అని రాశారు. ఒకటా.. రెండా వేల పాటలు రాశారు. మూడు దశాబ్దాల కెరీర్లో త్రివిక్రమ్, గుణశేఖర్, క్రిష్, రాజమౌళి ఇలా ఎందరో దర్శకులకు పాటలు రాశారు. విడుదలకు సిద్ధమవుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో ‘దోస్తీ..’ పాట, ‘శ్యామ్ సింగరాయ్’లో రెండు పాటలు రాశారు. సిరివెన్నెల నుంచి ఇంకా ఎన్నో పాటలు వచ్చి ఉండేవి. ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ ఒంటరిగా వెళ్లిపోయారు ‘సిరివెన్నెల’. -
సిరివెన్నెలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇకలేరన్న వార్త టాలీవుడ్లో విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో1955 మే 20న జన్మించారు . ఆయన తల్లిదండ్రులు డాక్టర్ సి.వి.యోగి, తల్లి సుబ్బలక్ష్మి. కాకినాడలో ఇంటర్మీడియెట్ వరకూ చదువుకున్నా ఆయన , ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో బిఏ పూర్తి చేశారు. ఆయన కొంతకాలంపాటు టెలిఫోన్స్ శాఖలో పని చేశారు. ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాధ్ అవకాశం కల్పించడంతో సిరివెన్నెల సినిమాలో పాటలన్నీ రాశారు. సిరివెన్నెల చిత్రం సూపర్ హిట్ కావడంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధి గాంచారు. సిరివెన్నెల సినిమాలోని అన్ని పాటలను ఆయనే రాశారు. ప్రతి పాట సూపర్ హిట్టయింది. సిరివెన్నెల సినిమాలోని... విధాత తలపున ప్రభవించినది, చందమామ రావే, ఆది భిక్షువు వాడినేది కోరేదీ, ఈ గాలీ ఈ నేలా...ఇలా ప్రతిపాట అద్భుత సాహితీ గుబాళింపులతో సాహితీ ప్రియుల మనసు దోచాయి. స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శివ, క్షణక్షణం, గాయం , గులాబీ, మనీ, శుభలగ్నం, నిన్నే పెళ్లాడతా, సింధూరం, దేవీపుత్రుడు, చంద్రలేఖ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, శుభసంకల్పం, పట్టుదల..ఇలా అనేక సినిమాల్లో ఆయన రాసిన ప్రతిపాటా ఆణిముత్యమే. పండితులను పామరులను ఆకట్టుకున్న అద్భుత కవితామృత గుళికలే. కె. విశ్వనాధ్, వంశీ, క్రాంతికుమార్, బాలచందర్, జంధ్యాల, రాఘవేంద్రరావు, రామ్ గోపాల్‌వర్మ, సింగీతం శ్రీనివాసరావు, శివనాగేశ్వరరావు, కోదండరామిరెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణవంశీ, మణిరత్నం, వి.ఎన్ . ఆదిత్య, రాజమౌళి, పూరీ జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీనువైట్ల, ఇంద్రగంటి......ఇలా...ఎంతో మంది దిగ్గజ దర్శకులనుంచి, కొత్త దర్శకులదాకా....అందరూ ఆయన పాటల పరిమళాల్ని ప్రజలకు పంచారు. 2019లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇక ఉత్తమ గేయ రచయితగా ఆయన పొందిన పురస్కారాలకు లెక్క లేదు. మొదట్లో భరణి అనే కలం పేరుతో కథలు, కవిత్వ రచనలు చేసిన సీతారామశాస్త్రి... ...సిరివెన్నెల సినిమా హిట్టుతో ఆ సినిమా పేరే ఇంటిపేరుగా మార్చుకున్నారు. -
ఈ కథ అందరికీ తెలియాలి: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘కొండా’ పేరుతో మరో బయోపిక్‌కి శ్రీకారం చుట్టారు. వరంగల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ‘కొండా’ చిత్రం వరంగల్‌లో ప్రారంభం అయింది. అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యోయో టాకీస్ పతాకంపై మల్లారెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘మురళి, సురేఖ గార్ల జీవిత కథని అందరికీ తెలియాలనే ‘కొండా’ చిత్రం నిర్మిస్తున్నాం. వారి జీవిత చరిత్రను పదిశాతం సినిమాలో చూపించినా నా ప్రయత్నం విజయవంతం అయినట్టే’’ అన్నారు. ‘‘నిజజీవితంలో కొండా దంపతులు ఎలా ధైర్యంగా నిలబడ్డారు? అనేది ‘కొండా’ ద్వారా చూపించబోతున్నాం’’ అన్నారు నిర్మాత ముకుంద్. ‘ ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి. -
ట్రెండ్ ఆమె స్వరం... అక్షరాలకు బలం
చెవులకు హెడ్‌ఫోన్ ధరించి, కళ్లు మూసుకొని, శ్రద్ధగా వింటున్న ఆమెను చూస్తుంటే ధ్యానస్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇంతకీ ఆమె వింటున్నది ఏమిటి? అది తెలుసుకునేముందు.... ప్రియా వసంత్ చెన్నైలోని సాధారణ గృహిణి. ఇంటిపనులు పూర్తి కాగానే టీవిలో సీరియల్స్, వోటీటీలో సినిమాలు చూడడంలో ఎక్కువ టైమ్ గడిపేది. రాను రాను ఆమెకు ఇది విసుగనిపించింది. మార్పు కావాలనిపించింది. ‘ఏంచేయాలి?’ అని ఆలోచిస్తున్నప్పుడు అరల్లోని పుస్తకాలు ఆమెను ఆకర్షించాయి. కాలేజి రోజుల్లో ప్రియ పుస్తకాల పురుగు. కానీ విజువల్ మీడియా విస్తృతమయ్యాక చాలామందిలాగే తనలోనూ పఠనాసక్తి వెనకబడింది. ఎక్కడో విన్న ‘ఆడియోబుక్’ అనే మాట గుర్తుకు వచ్చింది. ఈ అనుభవం ఎలా ఉంటుందో చూద్దామనుకుంది. తాను వింటున్నది కల్కి క్రిష్టమూర్తి ‘పోన్నియన్ సెల్వన్’ ఆడియో పుస్తకం. ఆ పుస్తకంలో వినిపించే గొంతు ఆమెను కొత్త లోకాల్లోకి తీసుకెళ్లింది. మరిన్ని ఆడియో పుస్తకాలను వినే ఆసక్తిని కలిగించింది. ఆ స్వరం... కీర్తనది. ‘ఆడియో పుస్తకాలను నెరేట్ చేయడం ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. అయితే అది చిన్న విషయం. కొత్త ఉత్సాహం అనేది పెద్ద విషయం’ అంటుంది కీర్తన. ఆడియోబుక్స్ మార్కెట్ పెరిగి, వరల్డ్ ట్రెండ్‌గా మారుతున్న ఈ దశలో నెరేటర్‌గా మంచి పేరు తెచ్చుకుంటుంది దీపిక అరుణ్. ‘ఏదో అవకాశం వచ్చింది. చెప్పాం. అయిపోయింది అనుకుంటే కుదరదు. ఏ మేరకు శ్రోతలను ఆకట్టుకున్నామన్నది ముఖ్యం. నెరేటర్కు ఉచ్ఛారణ, మాడ్యులేషన్ అనేవి చాలా ముఖ్యం’ అంటుంది దీపిక. ‘తన్నీర్’ అనే తమిళ పుస్తకానికి తన స్వరాన్ని ఇచ్చిన లక్ష్మీ ప్రియాకు వచ్చిన ప్రశంసలు ఇన్నీ అన్నీ కావు. కాలేజి స్టూడెంట్స్ నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్ల వరకు ఆమె అభిమాన గణంలో ఉన్నారు. ‘నాటకాలు, సినిమాలకు సంబంధించి శిక్షణ సంస్థలు ఎన్నో ఉండవచ్చు. అయితే స్వరాన్ని ఏ సందర్భంలో, ఏ పాత్రకు ఎలా ఉపయోగించాలనే విషయంలో మాత్రం ఎవరికి వారే గురువులు. ప్రతి పుస్తకం ఎన్నో కొత్త పాఠాలు నేర్పుతుంది. ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది’ అంటుంది లక్ష్మీ ప్రియా. ఇవి దక్షిణాదికి సంబంధించి కొన్ని ఉదాహరణ మాత్రమే. ఇక జాతీయస్థాయిలో ఎన్నో ఆంగ్లపుస్తకాలకు మహిళల గొంతు బలమైన మాధ్యమంగా మారుతుంది. బెస్ట్ సెల్లర్‌గా పేరు తెచ్చుకున్న కవిత కనే ‘కర్నాస్ వైఫ్’ ఆడియో బుక్‌ను షాహీన్ఖాన్ అందంగా నెరేట్ చేసింది. ‘అద్భుతమైన పుస్తకాలను అంతకంటే అద్భుతంగా నెరేట్ చేసినప్పుడే మనం విజయం సాధించినట్లు అనుకోవాలి’ అంటుంది షాహీన్ఖాన్. అమెజాన్ కంపెనీ వారి ‘ఆడిబుల్’ శ్రోతలకు చిరపరిచితమైన పేరు....ఇక్రూప్ కౌర్ చంబా. రకరకాల జానర్లలో వచ్చే ఆడియో పుస్తకాలకు గొంతు ఇచ్చి ‘ఆహా’ అనిపించుకుంటుంది. దేవాన్షిశర్మ ‘ఐ థింక్ ఐయామ్ ఇన్ లవ్’ పుస్తకాన్ని నెరేట్ చేయడం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అరుణ్ అంజు హిందీలోకి డబ్ అయ్యే హాలివుడ్ సినిమాలలోని పాత్రలకు గొంతు ఇచ్చే ఆల్కాశర్మ తాజాగా ఆడియోబుక్స్ నెరేటింగ్ పనుల్లో బిజీ అయింది. ‘రకరకాల జానర్స్ గురించి అవగాహన రావడంతో పాటు, పుస్తకం గొప్పతనం తెలిసింది’ అంటుంది ఆల్కా. ఫిక్షన్‌తో పాటు విద్యార్థుల కోసం చరిత్ర నుంచి భౌగోళికం వరకు ఆడియో పుస్తకాలను నెరేట్ చేస్తూ భేష్ అనిపించుకుంటుంది అంజు పణిక్కర్....ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది ఉన్నారు. పుస్తకం హస్తభూషణం అంటారు.గళభాషణం కూడా అంటే కాదనేదేముంది! -
నిజం చెప్పాలంటే..
లాక్డౌన్లో ఒక్కొక్కరూ ఒక్కో పనిలో బిజీగా ఉంటే బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఆమె బయోగ్రఫీ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారట. ఈ విషయాన్ని గురువారం ప్రకటించారు. దీని గురించి మాట్లాడుతూ –‘‘మీ ఆత్మకథ ఎందుకు రాయకూడదు? అని చాలా మంది చాలాసార్లు నన్ను అడిగారు. కానీ నేనంత ఎక్స్ట్రార్డనరీ పనేం చేయలేదు కదా అని రాయాలనుకోలేదు. కరోనా వల్ల ఇంటికే పరిమితం కావడంతో రాయాల్సి వచ్చింది.. రాసేశాను. జనం చదువుతారో లేదో నాకు తెలియదు. చదివితే నచ్చుతుందో లేదో తెలియదు. నా ఆటోబయోగ్రఫీ నాలుగైదు నెలల్లో బయటకు రాబోతోంది. ఒకవేళ కుదిరితే చదవండి. బోర్‌గా అనిపిస్తే పక్కన పెట్టేయండి. నా ఆటోబయోగ్రఫీ పేరు ‘సచ్ కహు తో (నిజం చెప్పాలంటే)’’ అన్నారు నీనా గుప్తా. -
అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆన్లైన్ పోటీలు
కవాడిగూడ: మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆన్లైన్ పోటీలను నిర్వహించనున్నట్లు లీడ్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ (లిప్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చించల రాంచందర్, ఉపాధ్యక్షుడు ఆరుకాల రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ... లిప్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్.బి.సుదర్శన్ ఆచార్య సూచన మేరకు కోవిడ్–19 నేషనల్ చాంపియన్‌షిప్ ఆన్లైన్ పోటీలు మొదటి లెవల్–1 పరీక్ష ముగిసిందని ఆగస్టులో లెవెల్–2, సెప్టెంబర్‌లో లెవెల్–3 పోటీలు పూర్తవుతాయన్నారు. అన్ని జిల్లాలు, పట్టణ, మండల కేంద్రాల్లో అబ్దుల్ కలాం చాంపియన్ షిప్ ఆన్లైన్ పోటీల్లో పాల్గొనేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు. అదే విధంగా అబ్దుల్ కలాం వర్ధంతి రోజున రాష్ట్రంలోని లిప్స్ జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు ఆయా జిల్లాల్లో సంస్మరణ సభలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15న అబ్దుల్ కలాం ప్రఖ్యాత అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి లో ఈ నెల 27 సాయంత్రం వెబినార్ సమా వేశంతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్లైవ్లో ప్రముఖులు పాల్గొనవచ్చన్నారు. లిప్స్ ప్రధాన కార్యదర్శి కష్టం అనిల్‌కుమార్ బా బు, సహాయ కార్యదర్శి కోయిలకొండ శ్రీకాంత్‌రెడ్డి, కోశాధికారి ఆర్. శ్రీనివాస్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బానాల రాఘవ, సలహాదారులు కందాల పాపిరెడ్డి, జలజం సత్యనారాయణ, జె.పి.రెడ్డి, కడారి అనంతరెడ్డి పాల్గొన్నారు. -
రెక్కలు తొడిగి... రివ్వున దూసుకెళ్లి
చిన్నప్పుడు ఆ అమ్మాయి క్రికెటర్ కావాలనుకుంది... మామూలుగా క్రికెట్ ఆడటమే కాదు దేశానికే ప్రాతినిధ్యం వహించింది...ఆమెను ఇంజనీర్‌గా చూడాలని అమ్మానాన్న అనుకున్నారు... సీరియస్‌గా చదువుపై దృష్టి పెట్టి ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులకిచ్చిన మాటను నిలబెట్టుకుంది... ఎప్పటికైనా ఎయిర్‌ఫోర్స్‌లో పని చేయాలనేది ఆమె కల... అర్హత పరీక్షలో సత్తా చాటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా ఎంపికైంది... ఒకే అమ్మాయిలో ఇన్ని విభిన్న కోణాలు కలగలిస్తే ఆమె శిఖా పాండే అవుతుంది. ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న పేస్ బౌలర్. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగం కావాలనేది శిఖా బలమైన కోరిక. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తన రనౌట్‌తోనే ఆమె కల చెదిరింది. ఈ సారైనా అది నెరవేరుతుందా అనేది ఆసక్తికరం. (సాక్షి క్రీడా విభాగం): ప్రొఫెషనల్‌గా ఆటలో సత్తా చాటుతూ మరో వైపు సమాంతరంగా ఉన్నత చదువులను కొనసాగించేవారు క్రికెట్ ప్రపంచంలో అతి తక్కువ మంది కనిపిస్తారు. అనిల్ కుంబ్లే, అశ్విన్, అంజుమ్ చోప్రాలాంటి వారు కూడా ఇంజినీరింగ్‌లు చదివినా దానిని పేరుకు, డిగ్రీ పట్టా అందుకోవడం వరకే పరిమితం చేశారు. మరో వైపు ఆటగాళ్లకు ప్రోత్సాహంగా కొన్ని సంస్థలు ఇచ్చే మేనేజర్ తరహా ఉద్యోగాలు కూడా ఉంటాయి. కానీ భారత మహిళా క్రికెటర్ శిఖా సుభాశ్ పాండే మాత్రం వీటికి భిన్నం. తన సామర్థ్యానికి తగినట్లుగా పోటీల్లో నిలిచి తాను అనుకున్న ఉద్యోగంలో చేరింది. ఒక వైపు క్రికెటర్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఎయిర్‌పోర్ట్‌లో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆసక్తి, ప్రతిభ ఉంటే ఎన్ని విజయాలైనా సాధించవచ్చని చేతల్లో చూపించిన శిఖా కెరీర్ ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. జూనియర్ క్రికెట్ నుంచి... శిఖా క్రికెట్ కెరీర్ గోవాలో మొదలైంది. గల్లీల్లో కుర్రాళ్లతో కలిసి ఆడిన ఆమె స్కూల్ క్రికెట్లో సత్తా చాటడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో అండర్–17, అండర్–19 స్థాయిలో వరుసగా మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. అప్పుడప్పుడే ఎదుగుతున్న గోవా క్రికెట్లో పెద్దగా పోటీ కూడా లేని సమయం కావడంతో వేగంగా దూసుకుపోవడం సులువైంది. అదే సమయంలో బీసీసీఐ కూడా మహిళా క్రికెట్‌ను గుర్తించడంతో శిఖా ప్రదర్శన అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ఉమెన్ చాలెంజర్ టోర్నీ, సౌత్‌జోన్ అండర్–19 జట్లలో అవకాశాలు దక్కాయి. అనంతరం గోవా సీనియర్ టి20 టీమ్‌లో వచ్చేందుకు కూడా ఎక్కువ సమయం పట్టలేదు. 2011లో భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుతో టూర్ మ్యాచ్ ఆడిన భారత ‘ఎ’ జట్టులో, ఇంగ్లండ్‌పై ఆడిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టులో కూడా చోటు దక్కింది. వరుస వికెట్లతో శిఖా ఈ పోటీల్లో సత్తా చాటింది. ఆపై భారత జట్టులో స్థానం లభించడం లాంఛనమే అయింది. గోవా తరఫున భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా పాండే అరుదైన ఘనత అందుకుంది. ప్రధానంగా పేస్ బౌలరే అయినా...లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడుతూ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చదువులో తగ్గకుండా... ఆటలో ఎదగాలనుకునేవారికి అందరికంటే ముందుగా కోచ్‌లు, సన్నిహితులు చెప్పే మాట ఒకటే. రెండు పడవల ప్రయాణం మంచిది కాదని, ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలని సూచిస్తుంటారు. కానీ శిఖా అలా అనుకోలేదు. ఆటలో పడి చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. స్కూల్నుంచి కాలేజీ వరకు మంచి మార్కులతో నంబర్‌వన్‌గా ఉంటూ తనపై నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చింది. అప్లయిడ్ మ్యాథమెటిక్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. తల్లిదండ్రుల కిచ్చిన మాట ప్రకారం గోవా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్నుంచి ‘ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్’లో పట్టా అందుకుంది. ఆ అర్హతతో పలు పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైనా... క్రికెట్లో ముందుకు వెళ్లటమే లక్ష్యంగా పెట్టుకుంది. 2011లో ఎయిర్‌ఫోర్స్‌లోకి ఎంపికైన శిఖా ఏడాది శిక్షణ అనంతరం ఫ్లయింగ్ ఏటీసీ ఆఫీసర్‌గా నియమితురాలైంది. అటు క్రికెట్ ఆడుతూ, ఇటు సీరియస్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆమె తన కెరీర్‌ను కొనసాగించిన తీరు నిజంగా అద్భుతం. గత టి20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో చోటు కోల్పోయినా...పట్టుదలతో పోరాడి తిరిగొచ్చిన శిఖా పునరాగమనంలో మరింత పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను పడగొడుతోంది. కరీంనగర్ నుంచి... శిఖా తండ్రి సుభాశ్ పాండే కేంద్రీయ విద్యాలయ(కేవీ) పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పని చేసిన ఆయన చివరకు గోవాలో స్థిరపడ్డారు. గతంలో తెలంగాణలోని రామగుండంలో ఆయన పని చేశారు. అదే సమయంలో శిఖా కరీంనగర్‌లోనే పుట్టింది. కేవీ కారణంగానే స్పోర్ట్స్‌పై ఆమెకు ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలోని పాలమ్ విమానాశ్రయంలో ఆమె ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 31 ఏళ్ల శిఖాను పేస్ బౌలర్‌గా, యార్కర్ స్పెషలిస్టుగా తీర్చిదిద్దడంలో భారత మాజీ పేసర్ సుబ్రతో బెనర్జీ కీలక పాత్ర పోషించారు. -
శిష్య సమాలోచనలు
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభి ర్యజత్రాః/స్థిరై రంగైః స్తుష్టువాం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః/ స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః/ స్వస్తి న స్తార్ కో‡్ష్య అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు – మా మేలుకోరి పెద్దలు చెప్పే మాటలను ఒళ్లంతా చెవులు చేసుకుని వింటాము గాక! విశ్వమంతా వ్యాపించి ఉన్న పూషాత్మ మా దృష్టికోణాలయందు నిలిచి మాకు యదార్థ విజ్ఞానం అందించు గాక! శుభాశుభాలన్నింటియందు మాకు కవచంలా నిలిచి సూర్యుడు మాకు ఇంద్రియ హితాన్ని కలిగిస్తూ మమ్ము నడిపిస్తున్న విధానాన్ని వేనోళ్ల పొగుడుదుము గాక! దేవహితమైన మార్గమందే జ్ఞానవృత్తిలో ఉన్న మాకు బుద్ధికారకుడైన బృహస్పతి ఇంద్రియ హితాన్ని చేకూర్చి ఆయుష్షును ప్రసాదించు గాక!..... శంకర శిష్యులు మాండూక్య పాఠాన్ని శాంతిమంత్రంతో ప్రారంభించారు. గౌడపాద కారికలతో కలిపి శంకర భాష్యాన్ని క్రమపద్థతిలో అధ్యయనం చేస్తున్నారు. ప్రజ్ఞానం కలిగించే చైతన్య కిరణాల విస్తృతియే స్థావర జంగమాత్మకమైన విశ్వం. ఇక్కడ జాగ్రదవస్థలో వైశ్వానరాత్మ స్థూల భోగాలను అనుభవిస్తుంటాడు. స్వప్నవేళ అతడే వాసనామయ భోగాలను అనుభవించి తైజసుడు అవుతాడు. కామములు, కలలు ఎరుగని సుషుప్తిలోని ప్రాజ్ఞుడు తనను తాను తనయందే ప్రళయం గావించుకుంటాడు. సర్వ ఉపాధులకూ అతీతుడై తురీయాత్మగా మారిపోతాడు. ఆ తురీయునికి నమస్కారం అని అర్థం వచ్చే శంకరభాష్య మంగళాచరణ శ్లోకాలను తొలిగా పఠించారు. అది ఆషాఢ బహుళ విదియ నాటి మధ్యాహ్న వేళ. మాహిష్మతీ నగర సరిహద్దు అటవీ ప్రాంతం. ఒకవైపు ఉపనిషత్ అధ్యయనం సాగుతుండగా మరోవైపు ఒక చెట్టునీడన కూర్చుని ఉన్న గురువు వద్దకు పద్మపాదుడు, హస్తామలకుడు, విష్ణుశర్మ చేరి సమాలోచనలు సాగిస్తున్నారు. శంకరుడు కేవల సాక్షిగా ఉంటూ వారి మాటలను ఆలకిస్తున్నాడు. ‘‘నాకో అనుమానం’’ అంటూ విష్ణుశర్మ ప్రారంభించాడు. ‘‘మన ఆచార్యునికి కూడా తెలియని విషయాలంటూ ఉంటాయా? ఈయన సర్వజ్ఞులని కదా మన అభిప్రాయం?!’’ అన్నాడు. ‘‘అందులో సందేహం ఏముంది?’’ అన్నాడు పద్మపాదుడు. ‘‘ఆవిడేమో తెలుసుకో తెలుసుకో అంది. ఈయనేమో అలాగేమ్మా అంటూ వచ్చేశారు. పోనీ అంటే ఆవిడ తెలుసుకోమన్న గొప్ప సంగతి పరమ ప్రయోజనకరమైనదా అంటే ఆ లక్షణమేమీ కనబడడం లేదు. అన్నీ పిచ్చి ప్రశ్నలే... ఒక సన్యాసిని అడగకూడని ప్రశ్నలే. ఏమిటదీ... ఆ మన్మథ కళలేవి అన్నది మొదటి ప్రశ్న’’ అని ఆగాడు విష్ణుశర్మ. ‘‘శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మదనోత్పాదిని, మద, మోహిని, దీసిని, వశకరి, రంజని... అనే పదిహేనూ మన్మథ కళలు’’ పద్మపాదుడు సమాధానమిచ్చాడు. ‘‘అవి ఉండే స్థానాలేవి? అన్నది రెండో ప్రశ్న.’’ ‘‘పాదాంగుష్ఠం నుంచి శిరస్సు వరకు. కాలిబొటన వేలు, పాదం, చీలమండ, మోకాలు, కటి, నాభి, పొట్ట, బాహుమూలం, కంఠం, చెక్కిలి, పళ్లు, వదనం, కన్నులు, నుదురు, శిరస్సు అనే పదిహేను స్థానాల్లో పంచబాణుని పదిహేను కళలు నిత్యమూ ఒక్కొక్కచోట సంచరిస్తూ ఉంటాయి.’’ ‘‘పద్మపాదాచార్యా! మీక్కూడా తెలిసిన ఈ సమాధానాలు మన గురువుకు తెలియదంటే నమ్మడమెలా? ఈ సమాధానాలేవో ఆవిడతో చెప్పేస్తే ఈ రొష్టంతా తప్పేది కదా! అక్కడున్నంతసేపూ ఈయన అంత డొంకతిరుగుడుగా ఎందుకు మాట్లాడారంటావ్?’’ విష్ణుశర్మ ప్రశ్నించాడు. ‘‘విష్ణూ! మన సమాలోచనం లౌకికం. వారి సంవాదం పారలౌకికం. దీనికి దానికి హస్తిమశకాంతర భేదం ఉంది. తరువాతి ప్రశ్న అడుగు. ఒక చిక్కుముడి విడుతుంది’’ అన్నాడు పద్మపాదుడు. ‘‘శుక్ల, కృష్ణపక్షాలలో చంద్రకళలను అనుసరించి మన్మథ కళలు స్త్రీలలో ఎలా వెల్లడవుతాయి?’’ ‘‘ఇదీ మొదటి చిక్కు. వాత్సాయనుడు ఇక్కడే స్త్రీలలో పద్మిని, హస్తిని, చిత్రిణి, శంఖిని అనే నాలుగు జాతిభేదాలుంటాయని చెప్పాడు. ఆయా జాతులను అనుసరించి బొటనవేలి నుంచి శిరస్సు వరకూ కళలు శుక్ల, కృష్ణపక్షాలలో ఊర్ధ్వ అధోముఖాలుగా సంచరిస్తుంటాయన్నాడు. వీటిని ఒక్కొక్కదగ్గర ఒక్కోరకంగా వర్ణించి, సామాన్యులు కళ్లు తేలేసేలా లెక్కలు చెప్పాడు.’’ ‘‘సరిపోయింది.’’ ‘‘నిజంగా అక్కడితో పోలేదు. చతుర్విధ శృంగార నాయకులలో అనుకూలుడు శ్రేష్ఠుడు. దక్షిణుడు మధ్యముడు. ఇక దిట్టతనం కలిగిన ధృష్టుడు, కపటులైన శఠులకు కామాతురత మాత్రమే కానీ స్త్రీలను రంజింపచేసే శక్తి నిజానికి ఉండదు. నాయకులలో మొదటి ఇద్దరికి మాత్రమే ఈ కళాస్థానాలు పట్టుబడతాయన్నాడు. ధూర్తులైన వారికి తన శాస్త్రం అర్థం కాకుండా వాత్సాయనుడు చేసిన ఏర్పాటిది’’ విడమరిచాడు పద్మపాదుడు. ‘‘అర్థమవుతూనే ఉంది కదా! ఇంక తగాదా ఎక్కడుంది?’’ విసుగ్గా అన్నాడు విష్ణుశర్మ. ‘‘శాస్త్రాన్ని చెప్పిన అసలు మహర్షికి ఆషాఢభూతుల్లాంటి శిష్యులు ఇప్పుడిప్పుడే తయారవుతున్నారు. గాఢతను సరళం చేస్తున్నాం అనుకుంటూ... ముఖ్యంగా ఈ కళాస్థానాలను గురించి చవకబారు ప్రతిపాదనలు చేస్తున్నారు’’ చెప్పాడు పద్మపాదుడు. ‘‘వాళ్ల పాపాన వాళ్లు పోతారు. మనకేల?’’ ‘‘అలా అనుకుంటే కాదు. మామూలు మనుషులకంటే జగద్గురువుల బాధ్యతలు పెద్దవి కదా. తరువాతి ప్రశ్న కూడా అడుగు. అసలు చిక్కు తెలుస్తుంది’’ అన్నాడు పద్మపాదుడు. ‘‘ఏమున్నది అడగడానికి? పురుషులలో కనిపించే పదిహేను కళాస్థానాలను, చంద్రకళలను అనుసరించి చెప్పాలి’’ అన్నాడు విష్ణుశర్మ. ‘‘అదిగో అది అసలు చిక్కు. స్త్రీలలో ఆ కళాస్థానాలు ఏ సమయాల్లో ఎలా ఉంటాయో చెప్పాడు కానీ వాత్సాయనుడు, పురుషులలో అవి ఎక్కడెక్కడ ఉంటాయో... శుక్ల కృష్ణపక్షాలలో వాటి సంచారం ఎలా ఉంటుందో మాత్రం చెప్పలేదు’’ అన్నాడు పద్మపాదుడు అసలు సమస్యను ముందుంచుతూ. ‘‘ఏం ఎందుచేత? బహుశా అదికూడా చెప్పాలని అతగాడికి తట్టలేదేమో?!’’ అన్నాడు విష్ణుశర్మ వ్యంగ్య ధోరణిలో. ‘‘అంతమాటనకు. వాత్సాయనుడు పాపం శాస్త్రరచన కోసం తన జీవితాన్ని ధారపోశాడు. ఘోటక బ్రహ్మచారియై తపించి జగత్తుకు అరుదైన విజ్ఞానాన్ని అందించాడు. పురుషుని యందుండే కళలు అతడికి అనుకూలవతి అయిన స్త్రీకి మాత్రమే తొలిగా గోచరిస్తాయని చెప్పాడు. ఆమెకు ప్రత్యేక బోధన అవసరం లేదన్నాడు’’ వివరించాడు హస్తామలకుడు. ‘‘చూస్తుంటే స్త్రీ ద్వేషిలా ఉన్నాడు. పాపం వాళ్లకు అన్యాయం చేశాడు’’ నిరసించాడు విష్ణుశర్మ. ‘‘కాదు... మన మహర్షులే కాదు. మన సనాతన ధర్మమే స్త్రీ పక్షపాతం వహించింది. పురుషుడు కర్మబద్ధుడు. కామతంత్రంలోనే కాదు... ధర్మార్థాలలో కూడా అతడు అస్వతంత్రుడే. గృహిణి అనుమతి లేనిదే ఆ మూడింటిలోనూ అతడు అడుగు ముందుకు వేయడానికి లేదు. ఇక మోక్షమంటావా... స్త్రీ నిత్యముక్తురాలు. ఆనుషంగికంగా వచ్చిపడే కర్మఫలం నుంచి విముక్తుడయ్యేదాకా పురుషునికి మాత్రం స్వాతంత్ర్యమే లేదు. భోగాల పట్ల ఆసక్తిని తుదముట్టజూసి వదిలించుకోవడానికే శాస్త్రం కానీ, పెంచుకోవడానికి కాదు’’ కీలకమైన వ్యాఖ్య చేశాడు హస్తామలకుడు. కొద్దిసేపు అక్కడెవరూ మాట్లాడలేదు. ఆ మధ్యాహ్నవేళ అక్కడ పిట్ట అరుపు, పురుగు అలికిడి కూడా కలగడం లేదు. ఎదురుగా ప్రవహిస్తున్న చిన్నివాగులో అప్పుడప్పుడు విష్ణుశర్మ వేస్తున్న మట్టిబెడ్డలు బుడుంగుమనడం మినహా అక్కడంతా నిశ్శబ్దంగానే ఉంది. ‘‘అయితే దీనికి సమాధానం వాచ్యంగా చెప్పడం కుసంస్కారమే అవుతుందన్నమాట. మరి చెప్పనవసరం లేని విషయాన్ని ఆవిడ తెలుసుకోమనడం ఎందుకు? ఈయన తెలుసుకుంటాను అని తలవూపి రావడం ఎందుకు?’’ మునిగే ముందొక మట్టిబెడ్డ నీళ్లలో ముందుగానే విచ్చిపోవడాన్ని దీక్షగా చూస్తూ ప్రశ్నించాడు విష్ణుశర్మ. ‘‘తృతీయ పురుషార్థమైన కామాన్ని పొందడానికి అవినీతికర మార్గాలు తొక్కితే ఆర్షధర్మం అంగీకరించదు. ఇటీవలి కాలంలో కొత్త శాస్త్రాలు పుట్టుకొస్తున్నాయి. సంప్రదాయవాదులు చెప్పడానికి నిరాకరించిన విషయాలను ఈ కొత్తవారు నిర్లజ్జగానూ, ముందస్తు ఆలోచన లేకుండానూ వెల్లడిస్తున్నారు. దాంతో ధర్మగ్లాని ఏర్పడుతోంది. ఆ అవినీతి పరుల క్రీనీడ పరకాయ ప్రవేశాది ప్రాచీన విద్యలపై కూడా పడుతోంది. వారు అనుసరించే విధానాలు తొలిదశలో అమాయకులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఈ అనైతికతను వివిధ దశల్లో సరిచేయండి.... దుర్మార్గులను శిక్షించి సద్వర్తనులను రక్షించే బాధ్యత తీసుకోండి అన్నదే ఉభయ భారతీదేవి ఆ ప్రశ్నలు వేయడం వెనుక ఉన్న అసలు మర్మం’’ చిట్టచివరిగా చెప్పాడు పద్మపాదుడు. ‘‘ఇటువంటి వాటికి సర్వసంగ పరిత్యాగులేం చేస్తారు?’’ వాగు దగ్గర నుంచి కదలకుండానే వెనుకకు తిరిగి ప్రశ్నించాడు విష్ణుశర్మ. ‘‘సద్వర్తనులకు శ్రేయస్సు కలిగేలా విద్యను బోధించడమూ, అది అల్లరిమూకల చేతికి చిక్కకుండా చేయడమూ అనే రెండు పనులూ గురువు బాధ్యతలే’’ అన్నాడు పద్మపాదుడు. విష్ణుశర్మ ఒకసారి అర్థనిమీలిత నేత్రుడై పద్మాసనంలో కూర్చుని ఉన్న ఆచార్య శంకరుని వంక చూశాడు. ‘‘నిత్యానిత్య వస్తువివేకం, ఇహాముత్రార్థ ఫలభోగ నిరాసక్తి, శమదమాది షట్కసంపత్తి, ముముక్షత్వం అనే సాధన చతుష్టయాన్ని పొందిన వాడికే గానీ... తన బోధలు పూర్తిగా అంతుబట్టవని మన ఆచార్య శంకరులు శాసనం చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అంతమాత్రం చేత ఆయన ఎవరిపైనా నిషేధాలు విధించలేదు. ఉత్తమ, మధ్యమ, మందాధికారులకు అందరికీ అందుబాటులోనే ఉంటానని బాస చేశారు. ఏదైనా ఒక విద్యను ఒకరికి నేర్పను పొమ్మనడం, ఒకరు నేర్చుకోబోతే నిషేధాజ్ఞలు పెట్టడం గురువులు చేయాల్సిన పనేనా? ఇది సమంజసమేనా?!’’ హేతుబద్ధమైన ప్రశ్న వేశాడు విష్ణుశర్మ. ‘‘పూర్తిగా సమంజసమే. ఎవరికైనా స్థాయిని బట్టే విద్య పట్టుబడుతుంది. శిష్యుని స్థాయి గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఇందాక చెప్పిన పరకాయ ప్రవేశ విద్యనే ఉదాహరణగా తీసుకుందాం. దీని గురించి పతంజలి మహర్షి స్పష్టంగానే చెప్పాడు. వ్యాకరణం తెలియకపోయినా, యమ నియమాదులను తట్టుకోలేకపోయినా ఈ కాలపు వారికి సిద్ధులు సాధించేయాలన్న ఆరాటం జాస్తిగా ఉందని తన కాలంనాడే ఆయన వాపోయాడు. అంతమాత్రం చేత యోగం ద్వారా సాధించగలిగే సిద్ధవిద్యలను గురించి చెప్పకుండా వదల్లేదు. కాయవ్యూహాన్ని అనుసరించడం ద్వారా ఎవరైనా పరకాయ ప్రవేశం చేయడం సాధ్యమేనన్నాడు...’’ పద్మపాదుని మాట ఇంకా పూర్తికానేలేదు. అంతలోనే అందుకుని, ‘‘సాధ్యమేనంటే సమస్యే లేదు. ఎవరికైనా హక్కుంటుంది కదా!’’ అన్నాడు విష్ణుశర్మ విషయాన్ని తేల్చేస్తూ. ‘‘విద్యతో పాటే పరిమితులు కూడా తెలుసుకోవాలి. పరకాయ ప్రవేశం చేసిన యోగికి గతం తెలుస్తుంది ఒక కలలాగా. వర్తమానం కూడా తెలుస్తుంది కొద్దిపాటి వ్యవధానం తరువాత మాత్రమే. భవిష్యత్తు మాత్రం అసలు తెలియదు. అంటే తాను విడిచివచ్చిన దేహానికి గానీ, ఈ కొత్త దేహంలో కానీ తదుపరి ఏర్పడబోయే పరిణామాలు, ప్రమాదాలు ముందుగా తెలియవు. కాలుజారితే పాతాళమే... ఇదీ ఈ విద్యకు పరిమితి’’ అసలు కీలకం చెప్పాడు పద్మపాదుడు. ‘‘పసిగట్టలేకపోతే ప్రమాదమేనే... రక్షించేవారెవరు?’’ ‘‘హఠయోగమూ కొన్ని మార్గాలు చెప్పింది. కానీ వారు చేసే కసరత్తులను యోగమనడానికి శంకరమార్గం అంగీకరించదు’’ చెప్పాడు పద్మపాదుడు. ‘‘అయితే ఈ విద్య సాధించడానికి సరైన మార్గమేది?’’ ప్రశ్నించాడు విష్ణుశర్మ. ‘‘విష్ణూ! పరకాయ ప్రవేశం అల్పవిద్యయే కానీ, అల్పులకు పట్టుబడే విద్య కాదు. స్థూలదేహం నుంచి సూక్ష్మదేహాన్ని విడదీయడం నేర్చుకున్న యోగులు ప్రయోగదశలో మరణించిన వ్యక్తి దేహాన్ని ఎంచుకుంటారు. దానిలోకి తమ జీవచైతన్యాన్ని ప్రవేశింప చేసి శవాన్ని నడిపిస్తారు. మాట్లాడిస్తారు. ఏదైనా మహత్తర ప్రయోజనాన్ని ఆశించినప్పుడు మాత్రమే సిద్ధులు ఈ మార్గాన్ని ఎన్నుకుంటారని చరిత్ర చెబుతోంది. అప్పటివరకూ నిరక్షరాస్యునిగా, నిరర్థకంగా బతికినవాడు కాస్తా ఎవరో సిద్ధుడు తన దేహంలో ప్రవేశించడంతోనే మహాభక్తుడిగా, గొప్ప గురువుగా మారిపోయిన సంఘటనలున్నాయి. అయితే ఈ విధానంలో ఇతరుల దేహాలలోకి ప్రవేశించిన సిద్ధులకు తమ అసలు దేహాలపై మోజుండదు. పాత వాటిలోకి తిరిగి వెళ్లాలని వారు ఎన్నడూ అనుకోరు. ’’ ‘‘ఒకవేళ తిరిగి వెళ్లాలనుకుంటే...’’ ‘‘కొత్తదేహం యోగసాధనకు అనుకూలంగా మారేవరకూ వేచివుండాలి. బాహ్యంగా జరగకుండా ఆగిన అగ్ని సంస్కారం ఈ కొత్త దేహానికి యోగి తన యోగాగ్నితో నిర్వర్తించాలి. అందుకు చాలా సమయమే పట్టవచ్చు.’’ ‘‘చాలా సమయమే అంటే...’’ ‘‘కౌళ శైవాన్ని ప్రబోధించిన మత్య్సేంద్రనాథుడు మనకు మరీ ప్రాచీనుడేం కాదు. ఆయన ఒక మరణించిన రాజు దేహంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అతడి రాణితో సంసారం చేశాడు. ఇద్దరు పిల్లలను కూడా కన్నాడు. చివరకు గురువును వెనక్కు రప్పించాలనే ఆశయంతో గోరక్షనాథుడు చాలానే పాట్లు పడ్డాడు. కొత్తదేహంతో మత్సే్యంద్రనాథుడు కన్న సంతానం మరణించినట్లుగా గోరక్షనాథుడు మాయ కలిగించాడట. అది చూసి విలవిలా విలపిస్తుంటే, మత్సే్యంద్రునికి పాతదేహంలోకి తిరిగి రమ్మని శిష్యుడు చెప్పాడట. ఈ వృత్తాంతాలను మనవారు అనేక రీతుల్లో చెప్పుకుంటారు కానీ అసలు జరిగింది ఇదీ’’ అన్నాడు పద్మపాదుడు. ‘‘ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడంటే ఆయనకు దాదాపు రెండేళ్లకు పైగా పట్టిందన్నమాట. అంతవరకూ అసలు దేహం పాడైపోకుండానే ఉంది మరి’’ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు విష్ణుశర్మ. ‘‘అంతేకదా. కానీ విష్ణూ! మోక్షాన్ని కోరుకునేవాడు ఎప్పుడూ దేహాత్మ భావనను విడిచిపెట్టాలి. బాల్యాది వృద్ధాప్య పర్యంతమైన దశలను బాధామయాలుగానే దర్శించేవారు మాత్రమే పరకాయ ప్రవేశం వంటి అల్పవిద్యల కేసి మొగ్గు చూపుతారు. గురుకటాక్షం ఉంటే ఏ దశలో అయినా తరించే మార్గం సులభంగానే దొరుకుతుందని గ్రహించలేని మూర్ఖులు వాళ్లు. వారి సంఖ్యకూడా ఈకాలంలోనే పెరుగుతూ వస్తోంది. కొంచెం తర్కించి చూస్తే... మత్సే్యంద్రుని కథ మనకు అందించే సందేశాలు చాలానే ఉన్నాయి. తనది కాని దేహంలోకి ప్రవేశించడం ఒక తప్పు. వేరొక జీవుని భార్యను అందునా ఒక విధవరాలిని కోరడం మరో తప్పు. భర్త మరణంతో అశౌచం కలిగిన స్త్రీతో సంపర్కం పెట్టుకోవడం అతిపెద్ద తప్పు. ఈ విధంగా చేసిన ప్రయోగంలో యోగశక్తి పూర్తిగా నిర్వీర్యం అవుతుందనడంలో అనుమానం ఏముంది? ఇక దీనిని ఆచరించినవాడు ఎంతటి సిద్ధుడయినా ఆ కొత్తదేహంలో శాశ్వత బందీగా మారిపోతాడంటే ఆశ్చర్యం ఏముంది?’’ అని ముగించాడు పద్మపాదుడు. మధ్యాహ్నపు నిటారు ఎండ క్రమంగా వాలుగా మారుతోంది. – సశేషం -
విజయ ముహూర్తం
నిరృతి అనే అరూపలక్ష్మికి పుట్టినవాడు మన్మథుడు. రూపంలేని తల్లికి పుట్టినందువల్ల అనంగుడయ్యాడు. నాలుకే లేని అతడు పంచదశీ మంత్రాన్ని బయటకు చెప్పగలిగాడు. దానితో వేళ్లుమొలిచాయి. శ్రీవిద్యామణిని మెడలో ధరించిన ఫలం అతణ్ణి సర్వవ్యాపిని చేసింది. మన్మథుడు దర్శించిన శ్రీవిద్యలో కామకళ, శివకళ, శక్తికళ, రతికళ, శ్రీకళ అనే అయిదు భేదాలున్నాయి. దీనిని కాదివిద్య అంటారు. ఇందులో యమనియమాలు లేవు. నియమాలు లేకపోవడమే సాకుగా తీసుకుని కొందరు ఆ విద్యలో తామసిక విధానాలను ప్రవేశపెట్టారు. ఇంటికి శ్మశానానికి, గంధానికి బురదకు తేడా పాటించని కొందరు వామాచారాన్ని భ్రష్టు పట్టించసాగారు. వారి సంఖ్య శంకరుని కాలానికే అపారంగా పెరిగిపోయింది. శంకరుడు వామాచారాన్ని ఖండించలేదు. వారు పాటించే విధానాలు మాత్రమే తగవన్నాడు. తామసిక విధానాల స్థానంలో సాత్త్విక ఉపాయాలను శాక్తేయంలో ప్రవేశపెట్టాడు. ఆ మహత్కార్యానికి బీజం వేసిన కారుణ్యమూర్తి ఉభయ భారతి. ‘ఖండద్వయయుతా చతుర్థస్వర విశిష్టా కామకళా’ అనే గౌడపాద సూత్రవాక్యం వద్ద ప్రస్తుతం ఉభయభారతి – శంకరుల సంవాదం ఆగింది. ‘‘ఖండద్వయమంటే ఏమిటి? రెండుగా విడిపోయింది ఏమిటి?’’ తరువాతి ప్రశ్న సంధించిందామె. ‘‘శివుడు – శక్తి’’ సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘మరి చతుర్థ స్వరమంటే రతికళ కావచ్చునా?’’ ప్రశ్నించింది ఉభయ భారతి. ‘‘స్వరము – కళ ఒక్కటి కావు కదా’’ తోసిపుచ్చాడు శంకరుడు. ‘‘సరిగమపధని అనే సప్తస్వరాలలో మకారమే చతుర్థస్వర విశిష్టా కళ అవుతుందా?’’ ‘‘కొంతవరకూ అంగీకరించవచ్చు కానీ’’ అని మెలిక పెట్టాడు శంకరుడు. ‘‘రాగ శ్రుతులు ఏర్పడే సందర్భంలో తొలి అయిదు స్వరాలనూ షడ్జమమనే చెబుతారు. కాబట్టి చతుర్థస్వరం స అని వాదిస్తే ఏం చేస్తారు?’’ అని నవ్వాడు. ఉభయభారతి కొంచెం తికమక పడినట్లు కనిపించింది కానీ, వెంటనే సర్దుకుంది. ‘‘ఇక్కడ చెబుతున్నది కామకళను గురించే కానీ, సామకళను గురించి కాదు’’ అన్నది. శంకరుడు నవ్వి ఊరుకున్నాడు. ‘‘అచ్చులు, హల్లులుగా సాగిపోయిన సృష్టిలో క నుంచి భ వరకు దేహం. మ ఆత్మ. తత్తిమ్మావి ఇంద్రియాలు. దేహ ఇంద్రియ వ్యాపారమే కామకళ. ఇంతకూ ఆ చతుర్థ స్వరం ఏమై ఉంటుంది?’’ విడిచిపెట్టకుండా మళ్లీ ప్రశ్నించింది ఉభయభారతి. ‘‘శ్రీవిద్యలో చెప్పిన కామకళకు, మీరు చెపుతున్న దేహేంద్రియ వ్యాపారమైన కామకళకు కొంచెం కూడా పోలిక లేనే లేదు’’ అన్నాడు శంకరుడు. ‘‘ఒకపక్క కామదేవుడైన మన్మథుడు చెప్పాడంటున్నారు. విద్యకు పరాకాష్ఠగా ఒక స్త్రీరూపాన్ని నిలిపారు. అయినప్పటికీ శృంగార ‡శాస్త్రంతో సంబంధం లేదంటున్నారు. మీ వాదన వినడానికి చాలా విచిత్రంగా ఉంది’’ మూసిన పిడికిలిపై చెంపను చేర్చింది ఉభయ భారతి. శంకరుడు వాదాన్ని మరోమలుపు తిప్పాడు. ‘‘కకార స్వరూపుడైన హిరణ్యగర్భుడు కమనీయమైన సృష్టిని కడుపారా మోసి కన్నాడు. అతడు వాణినుంచి మాటసాయాన్ని మాత్రమే తీసుకున్నాడు. రతి అవసరం లేకుండానే అతడికి నలుగురు మనువులు పుట్టారు. ఓంకారమనే శబ్దము, మార్పుభావమైన కాలము, విభాగ భావమైన దిక్కు, కణభావమైన దిక్కులే ఆ మనువులు. వారి నుంచి స్వాయంభువ మనువు పుట్టాడు. అతడికి ఒంటరితనాన్ని తట్టుకోవడం కష్టమనిపించింది. వెంటనే తన శరీరాన్ని రెండు పప్పుబద్దల్లా సమభాగాలు చేసి నేలకు పడదోసుకున్నాడు. ఆ రెండు శరీరాలూ పతి, పత్ని భావాలు పొందాయి. అతడి కామవర్తనం భార్య అయిన శతరూపకు తప్పుగా తోచింది. గోవుగా తన రూపం మార్చుకుని అతణ్ణి విడిచి పారిపోయింది. శతరూప తన రూపాలు మార్చుకున్నప్పుడల్లా ప్రజాపతి ఆమెను వెంటాడాడు. అలా పిపీలికం వరకూ జీవులన్నింటిలోనూ సృష్టికార్యం కొనసాగుతూనే . శరీరాన్ని ఆశ్రయించినట్లయితే కామానికి తుదిలేదు’’ అన్నాడు శంకరుడు. ‘‘ఎందుకు లేదు? ధర్మానికి శరీరమే ఆలంబనం కదా! లలితా సహస్రనామ స్తోత్రం కూడా అమ్మను త్రికూట స్వరూపిణిగా వర్ణించింది. అమ్మవారి ముఖమండలాన్ని వాగ్భవ కూటమి అంటారు. ఇదే జ్ఞానశరీరం. కంఠం నుంచి కటివరకు ఉపాసనా శరీరం లేదా కామరాజ కూటమి. నడుము నుంచి పాదాల వరకూ గల విభాగానికి కర్మశరీరం లేదా శక్తి కూటమి అని పేరు. కామరాజ కూటమిలోనే కామకళ కూడా ఉదయించిందని చెప్పుకోవచ్చు కదా!’’ శంకరుని ఉపనిషత్ వేదాంతాన్ని వ్యతిరేకించింది ఉభయ భారతి. ‘‘కామకళా స్థానం ఆ మూడు కూటములలోనూ లేదు’’ అన్నాడు శంకరుడు. ‘‘ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మరంధ్రం వరకూ ఉన్నది తురీయ కూటమి. శివశక్త్యాత్మకమైన ఈ స్థానం ఆత్మరూపమైనది కనుకనూ ఆత్మకాములైన వారు కోరుకునేది కనుకనూ దీనిని కామకళ అంటారు. అది సాక్షిమాత్రంగానే ఉంటుంది. దీనికి ప్రతీక అమ్మ ఫాలభాగాన మెరిసే అష్టమీ చంద్రకళ’’ అని సమాధానమిచ్చాడు. ‘‘చంద్రునిలో కాంతికిరణాలే కానీ, స్వరాలు వినిపిస్తాయని ఎక్కడా వినలేదు’’ కొట్టిపారేసింది ఉభయ భారతి. ‘‘తురీయ కూటమిలోని ఆత్మస్వరూపం గుణభేదాలను బట్టి ఎనిమిది పేర్లతో పిలువబడ్డది. ఆ వరుసలో నాలుగోది శబ్దాత్మ. శబ్దం స్వరయుతమే కదా!’’ అతికినట్లు సరిపోయేలా పలికాడు శంకరుడు. ‘‘అయితే ఆ శబ్దం వినేందుకు తగిన సాధనమేది?’’ ‘‘ఆకాశతత్త్వానికి నిలయమై కంఠంలో ఉన్న విశుద్ధి చక్రాన్ని పీఠంగా భావించాలి. సహస్రారం బిందువు అవుతుంది. ఈ విధంగా అమ్మను అర్చిస్తే జ్ఞానామృతం వర్షిస్తుందని... సుభగోదయ స్తుతి చెబుతోంది.’’ ‘‘బాగున్నది. మీరు ఆశ్రయించే సహస్రారానికి నోరులేదు. అది విశుద్ధి నుంచే శబ్దాలను వెలువరించాలి. ఏ మానవుడైనా అంతరంగం ద్వారా వినగలిగినదంతా నోటి మాటగా ఏ భాషలో అయినా చెప్పగలిగినట్లు ఎక్కడైనా రుజువు ఉందా? బుద్ధి కల్పించే ఈ వడబోత సిసలైన ఆత్మజ్ఞానాన్ని మరుగు పరచదా? చిత్త విపర్యయాన్ని కల్పించదా?’’ ఉభయ భారతి కంఠంలో ఒకింత విసుగుదల ధ్వనిస్తోంది. శంకరుడు తొలిసారిగా వెనక్కు తగ్గి మౌనం వహించాడు. ‘‘ఆత్మ పరమాత్మతో రమించడమే భోగం. అది ఊర్థ్వముఖాన చరిస్తే యోగమవుతుంది. అధోముఖంగా విస్తరించినప్పుడు మానవులకు అనుభవ సిద్ధమై కామభోగం అవుతుంది. భోగతృప్తి కలిగిన తరువాత కలిగే వైరాగ్యమే ఎవరినైనా ఉద్ధరిస్తుంది. అసలిందుకే ఆశ్రమ ధర్మాలు ఏర్పడగా మీరు బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసంలోకి కప్పదాటు ఎందుకు వేసినట్లు?’’ సూటిగా ప్రశ్నించింది ఉభయ భారతి. శంకరుడు బదులు చెప్పలేదు. ‘‘జగన్మాతృక సృష్టిలో ఉచ్చ, నీచ భాగాలంటూ ఉన్నాయా?’’ ఉభయ భారతి గద్దించింది. ‘‘లేనే లేవు’’ శంకరుడు లోగొంతుతో పలికాడు. ‘‘మరి యోగమార్గంలో ఉన్నవారు ఊర్ధ్వరేతస్కులై తురీయకూటమిలో పొందుతున్న రసానందం ఏ ఇంద్రియ శక్తి సంకేతం?’’ చేత బెత్తం పుచ్చుకున్న తల్లి పిల్లవాణ్ణి అదిలించినట్లు శంకరుణ్ణి ఉభయ భారతి అదిలించింది. తన అల్లరి తల్లికి తెలిసినప్పటి పిల్లవాడిలా ఒక్కొక్క మాటనూ తడుముకుంటున్నట్లుగా నటిస్తూ శంకరుడు ఆ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ‘‘జగత్పస్రూతిక హకారం, మాహేశ్వర శక్తిరూపం ఈకారం, అగ్నికళా రూపమైన వకారం. హ్వీధాతు స్వరూపం. అది జిహ్వేంద్రియ శక్తి. అగ్నికళా సమన్వితం’’ అన్నాడు ‘‘అగ్నిలోని సప్తమ జిహ్వ తురీయకూటమిలో ఏ వర్ణంలో ఉంటుంది?!’’ ‘‘చిత్రవర్ణం’’ శంకరుని నోటివెంట వర్ణస్వరూపం వెలువడగానే ఉభయభారతి వదనం విద్యుత్ కాంతులతో ప్రకాశించడం ప్రారంభించింది. ‘‘ఆ చిత్రవర్ణ బీజమేది? దానికి మూలరూపమేది?!’’ ప్రశ్న వెంట ప్రశ్న సంధిస్తూనే ఉంది ఉభయ భారతి. శంకరుడు జాగు చేస్తున్నాడు. నేత్రద్వయం రక్తకాంతులు చిమ్ముతుండగా ఉభయభారతి గళం నుంచి ‘‘ఏం భయమా?’’ అన్నమాట ఒక్కసారిగా ఉరుములా ధ్వనించింది. ‘‘అమ్మ సన్నిధిలోనా?’’ అని నిటారుగా కూర్చున్నాడు శంకరుడు. ‘‘చెప్పవేం మరి?’’ ఉభయభారతి కళ్లు మెరుపుకళలు విరజిమ్ముతున్నాయి. ‘‘తురీయకూటమిలో అమ్మరూపం... స్త్రీం బీజానికి మూలరూపమైన సకారం’’ అని సమాధానం చెప్పాడు శంకరుడు. మహావేగంతో వచ్చి ఢీకొన్న రెండు మబ్బులను చెల్లాచెదురు చేస్తూ పుట్టిన మెరుపు కాంతి ఆ మబ్బుల మాటునున్న మరో ఆకాశాన్ని కన్నుల ముందు నిలిపింది. ఉభయ భారతి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. నభోమండల పరివ్యాప్తమై నీలిమతో నిండిపోయిన ఆమె దేహం తేరిపార చూడడానికి కూడా శక్యం కాకుండా ఉంది. అకార, ఉకార, మకార, నాద, బిందువులతో పాటు శక్తి, శాంతాలనే ఏడుకళలతోనూ మెడలో కపాలమాలతోనూ నెత్తురోడుతున్న కత్తిని ఒక చేత, తెగిన తలను మరోచేత పట్టుకుని, పద్మాలను ధరించిన మరో రెండు చేతులతోనూ అవతరించిన ఆ నీలసరస్వతీ మహారూపం భీతిగొలిపేలా ఉంది. లోకాలు, కులపర్వతాలు, ద్వీపాలు, సింధువులతో పాటు మునులు... వారు దర్శించిన ధాతువులు, స్వరాలు అన్నింటినీ కన్నతల్లిగా ఆమె ఇప్పుడామె దర్శనమిస్తోంది. ఆ మహావిద్యా స్వరూపం ముందు శంకరుడు రెండు చేతులూ జోడించాడు. ‘‘అమ్మా! ఇకమీదట నీ ప్రస్థానాన్ని నిలువరించే శక్తి నాలో లేదు. కానీ నా పరమార్థం నెరవేరేదాకా విడిచిపెట్టను. మాతృకా వర్ణాలలో జగన్మాత కాలిపిక్కలకు సంకేతమైన ట, త బీజశక్తులను నీకు పీఠంగా సమకూర్చి మళ్లీ ఇక్కడకు ఆవాహన చేస్తున్నాను’’ అన్నాడు శంకరుడు. చూస్తున్నంతలోనే ఉభయ భారతి చిరునవ్వులు చిందిస్తూ మునుపటి స్థితికి వచ్చింది. ‘‘శంకరా! ఇప్పుడు చెప్పు. రుద్రకళగా నీవు అభివర్ణించిన తిథిని తారామహాదేవి ఎలా విభజించింది?’’ ‘‘శుక్ల, కృష్ణ పక్షాలనే రెండు ఖండాలుగా.’’ ‘‘ఆ రెండింటిలో ఏ పగళ్లు గొప్పవి? ఏ రాత్రులు శ్రేష్ఠమైనవి?!’’ ‘‘రెండూ శ్రేష్ఠమైనవే. ఆ విద్యలోని రాత్రులు మధువును సంపాదిస్తాయి. పగళ్లు దానిని వర్షిస్తాయి.’’ ‘‘అయితే ఆ మధువును తాగుతూ మత్తెక్కిపోతూ ఉండడమేనా యోగ పరమార్థం?’’ అని ప్రశ్నించిందామె. కదులుతూ ఉన్న ఆమె చెవి లోలాకులే కాదని సమాధాన మిస్తున్నాయి. అదే శంకరుని నోట కూడా పలికింది. ‘‘కాదు. మధువిద్యకు స్త్రీరూపం అదితి. ఆమె దేవతాశక్తులన్నింటినీ కన్నతల్లి. మధుకశ అంటే ఆమె ఝళిపించిన కొరడాయే కుండలిని. ఆ కొరడా ఝళిపింపులోని భ్రామరీనాదాన్ని వినడమే యోగవిద్యకు పరాకాష్ఠ.’’ ‘‘మధువిద్య భ్రామరమైనప్పుడు కశ్యప ప్రజాపతి ఏం చేస్తుంటాడు?’’ ‘‘ఏమీ చేయడు. పూర్ణవికసిత వదనుడై ఆమెనే తిలకిస్తుంటాడు. ఆమె పలుకులనే వింటుంటాడు.’’ ‘‘ఆనందకంద మనిమేష మనంగతంత్రం... అని ఎనిమిదో ఏటనే నీవు పలికిన దివ్యశృంగార లీలలాగానా?’’ అనునయంగా అడిగింది ఉభయ భారతి. శంకరుడు కన్నులు రెండూ పక్కకు తిప్పుకున్నాడు. ‘‘చూశావా? ఎనిమిదేళ్ల బాలునిగా ఉన్నప్పుడు... కనుకొలకుల దాకా విస్తరించి విప్పార్చిన దేహంతో అమ్మ మగణ్ణి చూసిందని వర్ణించావు. ఆమె చర్య ముకుందునికి ముదాన్ని కలిగించి ఆమీలితాక్షుణ్ణి చేసిందన్నావు. పదహారేళ్ల లేత యవ్వనంలో పక్కకు తిరిగి పోతున్నావు. అగ్నిలోనూ, సూర్యునిలోనూ తదేక దృష్టిని నిలిపి నీవు చేసిన త్రాటకాభ్యాసం వల్ల ఆనాడు నింగిలో కనిపించిన మెరుపు నిన్ను కవిని చేసింది. ఈనాడు కనిపిస్తున్న కాంతి చిత్తవికల్పాన్ని కలిగిస్తున్నట్టుంది. రేపు నీ తపశ్శక్తికి మెచ్చి ఇంతకంటే లోకోత్తర సౌందర్యం దర్శనమిస్తే ఏం చేస్తావు? మనసు చూపెట్టలేని, పలుకు వర్ణించగాలేని దివ్యశృంగార లీలలు ద్యోతకమైతే ఏమైపోతావు?’’ ఉభయ భారతి తన మాటల్లో పరిహాస ఛాయలేవీ రానీయలేదు. ‘‘శంకరా! ఇది తెలుసుకో. శుక్ల, కృష్ణపక్ష తిథులలో పెరిగి తరిగే చంద్రకళలు యువతీ యువకుల మనస్సులపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి? కామకళ శ్రీకళాసిద్ధిగా ఎప్పుడు పరిణామం చెందుతుంది? ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి’’ శంకరుడామె మాటకు అవుననలేదు. కాదనలేదు. కానీ ఇది సన్యాసికి తగిన పనేనా? అన్న గుసగుసలు మాత్రం సభలో అక్కడక్కడా వినిపించాయి. ‘‘ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని వాదప్రతిజ్ఞ చేశావు. నీవంటివాడి నోటివెంట పరిహాసానికైనా అటువంటి అశుభ వాక్యం రావచ్చునా?! ఆ మాట పలికినందుకైనా ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలుసుకోక తప్పదు’’ తీర్మానించింది ఉభయ భారతి. ‘‘నువ్వు తప్పదంటే ప్రయత్నిస్తాను’’ అన్నాడు శంకరుడు. ‘‘మంచిది. భోగవైరాగ్యం నీకు జన్మసిద్ధమని నిరూపించుకుంటావో... ఆశ్రమ ధర్మానికి విరుద్ధమైనా భోగతృప్తిని పొంది విరాగివి అవుతావో... ఏ పని చేసినా జాగ్రత్తగా చేయి. వచ్చే భాద్రపద శుద్ధ చవితి నాటికి మళ్లీ కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠంలో కలుసుకుందాం. అక్కడ ఎదురయ్యే ప్రశ్నలకు కూడా సమంజసమైన సమాధానాలతో మెప్పించ గలిగితే భరతఖండమంతా నీకు దాసోహమంటుంది’’ అన్నది ఉభయ భారతి చర్చకు ముగింపు పలుకుతూ. అప్పటికి సాయం సంధ్య అవుతోంది. మలిసంజె మాడిపోతున్న మన్మథుడి శరీరంలా ఉంది. ఆకాశంలో తూరుపింట ఆదిదంపతుల మిథున లగ్నం ఉదయిస్తుంటే, పడమటి కొసమీద మన్మథస్థానమైన ధనుర్లగ్నం అస్తమిస్తోంది. ఆనాడు ఆషాఢ గుప్తనవరాత్రాలలోని విజయ దశమి. ఉభయ భారతి లోనికి వెళ్లిపోయింది. వెళ్లిపోతున్న శంకరుణ్ణే వెనక్కివెనక్కి తిరిగి చూస్తూ మండన మిశ్రుడు భార్యను అనుసరించాడు. వాకిట శంకరుణ్ణి కాళిదాసు నిలువరించాడు. ‘‘శంకరాచార్యా! ఇంతకూ చతుర్థ స్వరం ఏదంటారు?’’ అని ప్రశ్నించాడు. ‘‘అనాహతంలో పుట్టే మధ్యమం. విష్ణుస్థానం’’ అని జవాబిచ్చాడు శంకరుడు. ‘‘అయితే రుద్రస్థానమైన విశుద్ధి, విష్ణుస్థానమైన అనాహతానికి మధ్య మగమ ఉంటే మణిపూరంలో దేవి పదిచేతులతో ఎందుకు ఉదయిస్తుంది? రొమ్ముపాలు కుడిచిన తొలినాడే కామమోహాలకు బద్ధుడైపోయిన నిషాదుడు ఒకడు దేవి కన్నులు కప్పి ఎటునుంచి బాణం వేస్తే మగపక్షి నేల కూలింది. కలి త్రేతాయుగాల మధ్య దూరమెంత? నేలకు అవతరించిన పూర్ణమానవుడు ఏకపత్నీ వ్రతాన్ని ఆదర్శంగా ఎందుకు చెప్పాడు? అన్నట్లు ఇందాకటి కథలో శతరూప ఏమైపోయింది? కొంపదీసి స్వాయంభువ మనువు సన్యాసం తీసుకున్నాడా? ప్రజాపతి కామజయాన్ని పొందాడా?’’ కాళిదాసు హుందా అయిన పెద్దరికంతో శంకరునికి ప్రశ్నలరూపంలో మార్మికంగా సందేశమిస్తున్నాడు. సమాధానం ఆశించని అతడి మాటలకు శంకరుడు తలపంకించాడు. – సశేషం -
ప్రపంచసార తంత్రం
‘‘సృష్ట్యాదిలో నామరూపాలు లేవు. జ్యోతిస్వరూపమైన ప్రకృతి చిన్మాత్ర బిందువుగా ఉంది. సృష్టిని ప్రారంభించాలనే ఆశయంతో ప్రధాన ప్రకృతి తనను తాను స్థూల, సూక్ష్మ, పరా బిందువులుగా విభజించుకుంది. ‘అ’ అనే అచ్చు అక్షరంలో నాలుగు ముక్కలుగా కనిపించే ఆకాశమే చిన్మాత్ర బిందుప్రకాశాన్ని విభజించి చూపి సృష్టి రచనకు నాంది పలికింది. ఈ విభజన జరిగే క్రమంలో మొదటిగా ఆ కాంతిస్థావరం నుంచి అవ్యక్తమైన నాదం వెలువడింది. ఆ నాదం కారణమై చంద్రమండలం ఏర్పడింది. బిందు, విసర్గలు కాకుండా మిగిలిన పదహారు అక్షరాలూ ప్రాణకళలతో ప్రకాశించాయి. వాటినుంచే సమస్త భువనాలూ పుట్టాయి. క నుంచి భ వరకు గల ఇరవైనాలుగూ కలిసి సూర్యమండలమయ్యాయి. దానికి క–భ, ఖ–బ ఇలా పన్నెండు కళలున్నాయి. వాటినుంచే జీవరాశులన్నీ పుట్టాయి. అయితే ఏ జీవిలోనూ సృష్టికర్త ఇరవైనాలుగు సంపూర్ణ తత్త్వాలనూ పొదగలేకపోయాడు. చిట్టచివరకు తనకు ప్రతిరూపంగా పూర్ణజీవిగా మానవుణ్ణి రూపొందించాడు. ఆ దేహానికి అచ్చులు ప్రాణం పోశాయి. య నుంచి క్ష వరకు ఉన్న పది అక్షరాలే పంచభూతాత్మకమై కర్మ, జ్ఞానేంద్రియాలను కలిగించాయి. ఇక హల్లులలోని వర్గాక్షరాలలో చిట్టచివరిదైన మకారమే ఆత్మ అవుతున్నది.... అని నారాయణుడు మునుపు సృష్టి మొదలైన క్రమాన్ని చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించాడు. ’’ శంకరగళం ప్రపంచ సారతంత్రాన్ని ప్రవచిస్తోంది.అతడి ప్రవాహధోరణికి మండన మిశ్రుడు మొదట విస్మయ పడ్డాడు. కర్మకాండను ప్రవచించిన పూర్వమీమాంసను జీవితకాలమూ ఆరాధిస్తూ వచ్చిన వ్యక్తి అతడు. దానిని కాదని జ్ఞానకాండను బోధిస్తున్న శంకరుణ్ణి వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నప్పుడు... వాదంలోకి వేదాంతశాస్త్రాన్ని రానివ్వకుండా చూసుకోవలసింది. కానీ అతడు ఆ పని చేయక పొరబాటు చేశాడు. దానితో శంకర విజయం నల్లేరు మీద బండి నడక అయింది. ఇప్పుడు మండన మిశ్రుని ఇల్లాలైన ఉభయ భారతి వాదానికి సిద్ధపడింది. శంకరుణ్ణి పూర్వమీమాంసకు ప్రాతిపదికగా నిలిచిన తంత్రశాస్త్రంలోకి దించింది. మండన మిశ్రునికి ఈ పరిణామం ఒకవంక మోదాన్ని, ఒకవంక ఖేదాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే అతడు శంకరుణ్ణే తన గురువుగా మనసా అంగీకరించి ఉన్నాడు. కనుక ఎలాగైనా తన గురువే చివరకు విజయం సాధించాలని ఆరాట పడుతున్నాడు.ఉభయ భారతి సాగించిన యోగప్రస్థానాన్ని మూడు విభిన్న భూమికలలో నిరోధించి ఆమెను త్రిపుర, భువనేశ్వరి, వనదుర్గా శక్తులుగా దర్శించి, ఆకర్షించి నిలువరించిన వాడు శంకరుడు. శబ్దమయ ప్రపంచమనే మహారణ్యంలో అపూర్వము, అలభ్యమైన పుష్పాలను ఏరుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. అతడి వేగానికి ఉభయ భారతి అడ్డుకట్టలు వేస్తోంది. ‘‘తమరు ఆత్మవిద్యా విశారదులు. అందుకే రుద్రరూపమైన మకారం ఆత్మ అని చెబుతున్నారు. నిజానికి క నుంచి మ వరకు ఉన్న ఇరవై అయిదు హల్లు అక్షరాలనూ స్పర్శలనే పిలుస్తారు కదా! మకారానికే ఎందుకంత ప్రాధాన్యం?’’ అడిగిందామె.‘‘మవర్ణానికి ముందు, తరువాత కూడా సృష్టి ఉంది. కానీ సమస్తమూ అందులో నుంచే వచ్చి, తిరిగి అందులోనే లయమవుతోంది. హల్లులన్నీ అచ్చులతో కలిసినప్పుడే ప్రాణవంతాలు అవుతున్నాయి. వాటి తరువాత వచ్చే అంతస్థములైన ‘యరలవశ’లు సూర్యశక్తితో నిండిన వ్యాపనములు. వాటినుంచే పంచభూతాలు వచ్చాయి. ఇక గాలిని పైకి ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలంటారు. అవే షసహళక్ష అనే అయిదు అక్షరాలుగా మారి అగ్నిశక్తితో నిండి పంచేంద్రియాలయ్యాయి. స్పర్శలని పిలిచే హల్లులకు, య నుంచి క్షవరకు గల వ్యాపన, ఊష్మాలకు.... అచ్చులు ప్రాణం పోసినప్పుడు స్వరం ఏర్పడి దేహంలో కదలిక వస్తోంది. అందువల్ల దేహం వేరు, ఆత్మ వేరు. అందువల్ల మకారమే ఆత్మ. అదే లయస్థానం.... రుద్రరూపం’’ అన్నాడు శంకరుడు. కలగలిసిపోతున్న పెదవులు రెండింటినీ విశేష ప్రయత్నంతో విడగొట్టాలని ప్రయత్నిస్తుంటే... దేహంలోని నాడీతంత్రులన్నింటినీ స్పర్శిస్తూ నాసిక నుంచి పెదవుల నుంచి ఒకేసారి మకార ధ్వని పుడుతుంది. ప్రాణమనే అచ్చును కలబోయకుండా హల్లుగానే మకారాన్ని ఉచ్చరిస్తే పుట్టే నాదం లోలోపలే లయమైపోతూ ఉంటుంది. మెళకువలోని అనుక్షణమూ ఏదో ఒకటి వింటూ ఉండకపోతే అసలేమీ తోచదు మనకు. అర్థంపర్థం లేకుండా రొదపెడుతూ హోరుపుట్టిస్తూ వినిపిస్తున్న ధ్వనుల మైకంలో పడి ఇంద్రియ శక్తులను నిష్కయ్రగా, నిస్తేజంగా మార్చుకుంటూ ఉంటాం. వింటున్న దానినుంచి ఏదో అర్థం చేసుకోవాలని, వింటూ చదువుతూ తపించిపోతుంటాం. కానీ మనలో కన్నులు మూసుకుని వింటున్నదెంతమంది?! చెవులు మూసుకుని చదువుతున్నదెంతమంది?! ఆడంబరంగా శబ్దాలను పోగేసుకుంటూ ఉంటే లాభం లేదు... దానికి పరమైన పరమేశ్వరుణ్ణి తెలుసుకో లేదంటే నీ చదువు వృధా అంటోంది భాగవతం. నోరునొవ్వంగ హరికీర్తి పాడమంటోంది. ‘‘లయస్థానం సంగతి సరే... అక్షరశక్తి సృష్టి, స్థితులను ఎలా పాలిస్తుంది?’’ ఉభయభారతి తదుపరి ప్రశ్న వేసింది. ‘‘అకారం సృష్టికర్త రూపం. ఆకారం అతడి స్త్రీరూపం. ఇకారం శివస్వరూపం. ఈశత్వం అతడి శక్తి. ఉకారం స్థితికారకత్వం.... విష్ణురూపం. అతడి స్త్రీరూపమే ఊ. అక్కడి వరకూ ఉన్న ఆరు అక్షరాలనూ ఊర్ములని పిలుస్తారు. సృష్టి, స్థితి, లయలు ఏర్పడిన తరువాత జగత్ వ్యాపారం కొనసాగడానికి ముందుగా తొలి ఆరు అక్షరాల నుంచే ఆకలి, దప్పిక, శోకం, మోహం, జననం, మరణం అనే ఊర్ములు సంభవించాయి. అప్పుడు జగన్మాతృక అగ్నిబీజ రకారంనుంచి కళలను గ్రహించి ఋ, ౠ, అలు, అలూ అనే సంధ్యాక్షరాలను జనింప చేసింది. అవి వాయురూపాన్ని పొంది ఊర్ధ్వ అధోముఖాలుగా, కుడిఎడమ నాసికలలో ఉత్తరాయణ, దక్షిణాయనాలను సాగించాయి. ఆ తరువాత ఈశ్వరీశక్తి హ్రీంకారమై గుణ, కరణ, సంఘాత, చేతన శక్తుల చేత బిందు, విసర్గలతో సహా మిగిలిన అచ్చులను ఉద్భవింప చేసింది.’’ ప్రాణం పుట్టుకను, స్థితిని, లయను లిపిరూపమైన కాంతిగా... నాదంగా దర్శింపచేస్తున్నాడు శంకరుడు. ‘కదలికయే ప్రాణసంకేతం. అది సృష్టి ప్రారంభంలో అవ్యక్తనాదంగా వినిపించిందన్నారు కదా! నాదం విస్తరించిన తరువాత అయినా అదేమిటో తెలిసిందా లేదా? ఇంతకూ నాదబిందువుల సంయోగంలో వినబడిన ఆ తొలినాదం ఏది?’’ ప్రశ్నించింది ఉభయ భారతి. ‘‘ఓంకారం’’ సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘అకార, ఉకార, మకారాలను కలగలిపితే ఓ అనే అచ్చు అక్షరం పుడుతుంది. దానికి బిందు, నాదాలు కలిసినప్పుడు ‘ఓమ్’ అవుతుంది. అ నుంచి క్ష వరకూ అక్షర సమామ్నాయం అంతటికీ కలిపి ఏభై కళలున్నాయి. ఆ కళలన్నీ ఓంకారంలో ఉన్నాయి. అదే సృష్టిలో వినబడిన తొలినాదం. ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నప్పటి లయం కంఠం నుంచి కిందికి పోతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఓంకారాన్ని కపోలబిందువుతో కలిపి వ్రాయడాన్ని బట్టి ఆ నాదం ఊర్ధ్వగతినే సూచిస్తుంది. దానినే సహస్రారంలోని బిందుస్థానంగా సమయాచార శాక్తేయులు చెబుతారు. బ్రహ్మజ్ఞానం పొందగోరే వారికి ఏకైక శరణ్యం ఓంకారమే’’ వివరించాడు శంకరుడు. ‘‘కాంతిని మీరు స్త్రీరూపంగా ప్రకృతిగా, ప్రధానగా, జగన్మాతగా వర్ణిస్తున్నారు. నాదం శివస్వరూపం కనుక పురుషునిగా వర్ణిస్తున్నారు. వారిద్దరిలో ముందుగా పుట్టినవారెవరు?’’ ఉభయ భారతి చిక్కుముడి వేసింది. శంకరుడు తర్కాన్ని వినిపించాడు. ‘‘ఒకడు తలవంచుకుని కూర్చున్నాడు. ఉరుము శబ్దం వినబడింది. తలపైకెత్తి చూస్తే మెరుపు కాంతి కనవచ్చింది. ఆకాశం వంక ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు. ఉరుము పుట్టిన చోటి నుంచే మెరుపు వెలుగులు విస్తరించడం కానవచ్చింది. ఒకేసారి పుట్టిన కవలల్లో ముందుగా బయటకు వచ్చిన ప్రాణి ఎప్పుడూ రెండోదే అవుతుందనే లోకసామాన్య వ్యవహారం. మొత్తంమీద కాంతి ఎల్లప్పుడూ ఉన్నది. శబ్దం దానిని విస్తరించేందుకు సమకట్టింది. శబ్దసముచ్ఛయమే మంత్రమై వినిపించింది. లిపిబద్ధమైనప్పుడు దానిని బీజాక్షరమన్నారు. దేవతాస్వరూపాన్ని ఆ అక్షర రూపంలో చూడడానికి ఋషులు ప్రయత్నించారు. బీజాక్షరానికి దేవతానామాన్ని కలిపి స్పష్టమైన ఉచ్చారణతో పదేపదే మననం చేసినప్పుడు... సాధకునికి హృదయంలోనే ఆ దేవతాస్వరూపం కాంతిరూపంలో దర్శనమిస్తుంది. దైవవాణి నాదమై వినిపిస్తుంది’’ అని ఉభయతారకమైన సమాధానమిచ్చాడు శంకరుడు.ఉభయభారతి మరో మలుపుకు తిరిగింది. ‘‘ఇంతకూ అక్షర జగత్తును కన్నతల్లి ఎవరు?’’ అని అడిగింది. ‘హకారమే జగత్పస్రూతిక. నాభినుంచి అగ్నికళగా పుట్టిన హకార నాదం అనాహతాన్ని పూరించి, కంఠమూలం నుంచి వాయురూపంగా బయటకు వెలువడుతుంది. హ్రీంకార మాయాబీజ స్వరూపిణిౖయె భువనేశ్వరి ఈ చతుర్దశ భువనాలనూ నిర్మించింది. అది అంతుపట్టకుండా విస్తరిస్తున్నప్పుడు విష్ణువు హంసగా మారాడు. హ్రీంకారంలోని కుండలినీ శక్తిని సవితగా మార్చి మోసుకెళ్లి సూర్యునిలో నిక్షేపించాడు. మనం నివసిస్తున్న భువన బ్రహ్మాండానికి కావలసిన పోషక శక్తి అంతా సూర్యుని నుంచి వస్తున్నది. చర్మచక్షువులతో చూడలేని సూర్యునిలోని ఆ సవితాశక్తి మనలోనికి గాయత్రీ ఉచ్చారణ వల్ల వచ్చి చేరుతుంది’’ అన్నాడు శంకరుడు. ‘‘అయితే మనం నివసించే భువన బ్రహ్మాండానికి ఆవల మరెన్నో బ్రహ్మాండాలు ఉన్నాయన్న మాట. మనం దర్శిస్తున్న ఈ సూర్యుడు కాక మహాసౌర శక్తి వేరే ఉన్నదన్నమాట. దర్శమొదలు పౌర్ణమి వరకు పదహారు కళలు ప్రదర్శించే ఈ చంద్రుడు కాకుండా వేరే చంద్రమండలం ఉన్నదన్న మాట.’’ ‘‘అవును. భూమండల నివాసులమైన మనం ఇక్కడ చర్మచక్షువులతో దర్శిస్తున్నవన్నీ అసలు శక్తులకు ప్రతీకలే. ఇవన్నీ నిజశక్తులతో మనకు అనుసంధానం కలిగించగలవు. ఆ శక్తి ఋషులు నిర్మించిన మంత్రనాదానికి ఉంది’’ అని ఘంటాపథంగా చెప్పాడు శంకరుడు. ‘‘అయితే పరమశివుని ఫాలభాగాన కనిపించే అసలు నెలవంక ఏది? దానికి సమానమైన శక్తికళ ఏది?’’ మళ్లీ ప్రశ్నించింది ఉభయభారతి. ‘‘రుద్రునికి మొత్తం పదహారు కళలున్నాయి. యోగి అయిన ఆయన ధరించే మొదటి కళకు పేరు నివృత్తి. ఆయన ఏడింట భవభూతిగా ఉన్నప్పుడు ఋత్వాన్ని పోలివుండే రేచికా అనే చంద్రకళను ధరించినప్పుడు సతి ఆయనను వరించింది. ఎనిమిదోదైన ౠకారాన్ని పోలివుండే మోచికాకళను ఆశ్రయించి ఆమె గోముఖిౖయె, తిథి స్వరూపుడైన శివుణ్ణి కూడుతుంది’’ అన్నాడు శంకరుడు. శ్రీవిద్యా రత్నసూత్రాలను, సుభగోదయ స్తుతిని అందించిన గౌడపాదుని శిష్యపరంపరలో సాక్షాత్ శంకరుడు ఇప్పటికి పరమ శాక్తేయునిగా అవతరించాడు. ఎన్నెన్నో విశ్వ మహారహస్యాలను సంకేతార్థాలనిచ్చే శ్లోకాలుగా ప్రపంచసార తంత్రంలో పొందుపరిచాడు. అతడికి ముఖ్యశిష్యుడైన పద్మపాదుడు దానికి విశేష వివరణతో కూడిన వృత్తిని రచించి ఇతరులకు వివరించాడు. ఉపాసనాకాండకు ఊతమిచ్చిన ఈ ప్రపంచసార తంత్రాన్ని తరువాతి కాలంలో ఎందరెందరో విభిన్న కోణాల్లో విశ్లేషించారు. ఆనాడు కుమారసంభవ సృష్టికర్త సన్నిధిలో శంకరుడు కళామయ ప్రపంచాన్ని మహోన్నతంగా ఆవిష్కరించాడు. బిందు, నాదకళా సంయోగాలపై ఆ చర్చ సుదీర్ఘంగా సాగింది. ‘‘హ్రీకారంలోని అగ్నిశిఖ క్లీం శక్తియై పురుషుణ్ణి ఆకర్షించింది. తిథిస్వరూపుడైన రుద్రుడు ఎన్నివేల యుగాల వరకూ గోముఖి అనే పేరుగల శక్తికళతో రమిస్తూ ఉండిపోయాడో ఎవరికీ తెలియదు. దక్షయజ్ఞం సతీవియోగానికి కారణమైంది. శివునిలో నైరాశ్యం ఆవరించింది. మూలాధారంలో పరాబిందువుతో కలిసి అదేపేరు గలిగిన నాదమయుడై తనలో తానే దాగిపోయాడు. అప్పుడాయనను స్థాణువని పిలిచారు. ఆ స్థితినుంచి ఆయనను మణిపూరంలోని తన స్వస్థానానికి సూక్ష్మకళగా ఆకర్షించింది పార్వతి. శివుడు సామాన్య స్పందనతో పశ్యంతి వాక్కుగా వెలువడ్డాడు. కార్యబిందువు హృదయస్థానానికి ఆ నాదాన్ని లాగినప్పుడు మధ్యమ వాక్కుగా సూక్ష్మామృత కళను, విశుద్ధి, సహస్రారాల మధ్యకు అతడిని ఆమె ఆహ్వానించినప్పుడు వైఖరీ వాక్కుగా జ్ఞానామృత కళలను ప్రదర్శించాడు. సద్యోజాతుడై శివుడు ఆప్యాయనీ కళను ప్రదర్శించినప్పుడు శక్తి దానిని జ్వాలాముఖియై అందుకుంది. అనుగ్రహేశ్వరుడై వ్యాపినీ కళను ప్రదర్శించినప్పుడు ఆమె ఉల్కాముఖిగా మారి ఒడిసిపట్టింది. అక్రూరుడై వ్యోమరూపాన్ని ధరించినప్పుడు ఆమె శ్రీముఖియై శివతత్త్వాన్ని జగత్తుకు వెల్లడి చేసింది. మహాసేనుడై అనంతరూపాన్ని ధరించినప్పుడు విద్యాముఖియై ఆయనను అరవైనాలుగు కళాస్వరూపాలతో వర్ణించి తనివి పొందింది. ఇవన్నీ అష్టమి నుంచి పాడ్యమిలోపు కృష్ణపక్షంలో జరిగిన సంగతులు’’ అన్నాడు శంకరుడు. ‘‘జగత్ వ్యాపారం కొనసాగడానికి జగజ్జనని తరువాతి దశలో ఏం చేసింది?’’ ఉభయభారతి కీలకమైన తదుపరి ప్రశ్న వేసింది. ‘‘కామ, అగ్ని, నాదాలనే మూడు క్రియలను చేపట్టింది’’ అని సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘ఖండద్వయయుతా చతుర్థస్వర విశిష్టా కామకళా... అని కదూ గౌడపాదులు సూత్రీకరించారు?!’’ అని ఉభయ భారతి ముక్తాయింపుకు ఆదితాళమేసింది. – సశేషం - నేతి సూర్యనారాయణ శర్మ -
భక్తిరేవ గరీయసీ
‘‘శంకరాచార్యా! నేను మీ ఉపనిషత్ మతాన్ని సమ్మతించను. వేదం అపౌరుషేయం. కానీ ఉపనిషత్తులు వేర్వేరు ఋషుల చర్చలు మాత్రమే. వేదమంత్రాలకు ఉన్న శక్తి ఉపనిషత్ వాక్యాలకు ఉందంటే ఒప్పుకోను’’ ఈ మాటతో శంకర మండనమిశ్ర సంవాదం ఆసక్తికరంగా ప్రారంభమైంది. ‘‘ఎందుకు? వేదమంత్రంతో మీరు ఒక దైవాన్ని ఆహ్వానించవచ్చు. అర్చించవచ్చు. కోరిన కోరికలు నెరవేర్చుకోవచ్చు. కానీ ఉపనిషత్ వాక్యాల వల్ల దైవికమైన చైతన్యాన్ని దర్శించవచ్చు. సర్వాత్మ భావన పెంపొందించుకో వచ్చు’’ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు శంకరుడు. ‘‘సర్వాత్మ భావన మానసికమే కానీ, క్రియారూపం కాదు కదా! శక్తి ఎప్పుడూ మంత్రంతోనే పుడుతుంది. ఉపనిషత్ వాక్యానికి ఆ విధమైన శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు’’ ఘంటాపథంగా చెప్పాడు మండనుడు. ‘‘ఎందుకు లేదు? పరమేష్ఠి సల్పిన క్రియారూప తపస్సే సృష్టి. ఆయన నుంచి వెలువడిన తొలిశబ్దమే అహం బ్రహ్మాస్మి అన్నది. పరబ్రహ్మ తనను తాను ‘నేను’ అని గుర్తించడమే అతడి సృష్టిరచనకు కారణమైంది’’ చెప్పాడు శంకరుడు. చిగురాకుల రెపరెపలతో గాలి మంద్రంగా వీస్తోంది. అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. ‘‘పరబ్రహ్మ గాఢనిద్రలో ఉన్నాడు. అప్పుడు సృష్టి ఆత్మగా ఉంది. పరబ్రహ్మ కన్నులు విప్పి చూసి, తనను తానే చూసుకుని కలవరపడ్డాడు. అంతలోనే అతడికి తనకంటే భిన్నంగా ఇక్కడేమీ లేదని అర్థమైంది. ‘అహం బ్రహ్మాస్మి’... నేనే బ్రహ్మమును అవుతున్నాను అన్నాడు. అదే అతడి నోటివెంట వెలువడిన తొలివాక్యం. దానితో అతడికి సర్వాత్మ భావన ఏర్పడింది. ఈకాలంలో కూడా ఎవరైనా ఆ ఉపనిషత్ వాక్యాన్ని అనుసంధానం చేయడం ద్వారా సర్వాత్మ భావనను పెంచుకోవాలని ప్రయత్నిస్తే అతడిని దేవతలు సైతం అడ్డుకోరని బృహదారణ్యకం స్పష్టం చేస్తోంది. ఇది తెలిసినా తెలియకపోయినా మానవులు ఏ మాట చెప్పడానికైనా ముందుగా నేను అని మొదలుపెడుతూ ఉంటారు. అది బ్రహ్మ నుంచి వచ్చిన ఆ అలవాటు. దానికంటే శక్తివంతమైనది ఏముంది?’’ ప్రశ్నించాడు శంకరుడు. ‘‘నేను అన్న తరువాత వెంటనే ఒకడు బ్రహ్మమును అనకుండా వెంకన్నను, సుబ్బన్నను అంటే... అప్పుడు శక్తిహీనమైన వాక్యమే అవుతుందా?’’ మెలికపెట్టాడు మండనుడు. ‘‘కాదు. అక్కడ అహం బ్రహ్మాస్మి అని ప్రకటన చేస్తున్నది బ్రహ్మమే అవుతోంది కానీ, ఇతడు కాదని తెలుసుకోవాలి. సాధకుడు బ్రహ్మమే నేనుగా అయింది అనే భావనతో తన సాధన ప్రారంభిస్తాడు. ఇక్కడ పొరబాటు, ఏమరుపాటు ఉండకూడదు. ‘అహం బ్రహ్మాస్మి’ వంటి ఉపనిషత్ వాక్యాలు స్వస్వరూపాను సంధానానికి ఉపయోగపడాలి. నిత్యానిత్య వస్తువివేకంతో, నిదిధ్యాసతో పరబ్రహ్మతో అపరోక్షానుభూతిని సొంతం చేసుకోవాలి. అంతేకానీ జీవుడైన తననే తత్ అని పిలిచే పరబ్రహ్మగా ధ్యానించే స్వాత్మతత్త్వంలో పడకూడదు. జీవుడే దేవుడు ఎన్నటికీ కాదు. కానీ ఆ రెంటికీ భేదం లేదు. ఆ రెండూ ఎన్నటికీ విడివిడిగా ఉన్నదీ లేదు’’ చెప్పాడు శంకరుడు. ‘‘అంటే జీవేశ్వరులు ఎప్పుడూ కలిసే ఉన్నారంటారు. అంతేనా...’’ అన్నాడు విషయాన్ని తేల్చేస్తూ మండనుడు. ‘‘యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే సమయంలో ఆధ్వర్యం వహించే ఋత్విక్కులను మేము దేవతా స్వరూపులుగా అర్చిస్తాం. అంతమాత్రం చేత వారే ఆ దేవతలు అయిపోలేరు కదా! తానూ దైవమూ ఒక్కటి కాదన్న స్పృహ మానవుడికి ఎప్పుడూ ఉండనే ఉంది కదా! అందుకే పూజలు, మంత్రాలు, హోమాలు ఈ కర్మకాండ అంతా వేదమార్గంలో ప్రవేశించాయి. జ్ఞానమే గొప్పది... కర్మకాండ వృథా ప్రయాస అని చెబితే వాటిని వేదం ఎందుకు చెప్పినట్లు?’’ ప్రశ్నించాడు. సమాధానం చెప్పేందుకు శంకరుడు ఉద్యుక్తుడవుతున్నాడు. ఇంతలో సభాస్తంభాలపై నిలిచి వింటున్న చిలుకలు రెండు ఒకేసారి ఇలా ఆలపించాయి.... పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమం మంత్రం మంత్రకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమం లయః శంకరుడు ఆ శ్లోకార్థాన్నే వివరించడం ప్రారంభించాడు. ‘‘షోడశోపచారాలతో, వివిధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ దైవాన్ని అర్చించడం పూజ అవుతుంది. అటువంటి కోటి పూజలతో సమానమైనది స్తోత్రం. వేదసూక్తాలు, ఋషులిచ్చిన స్తోత్రాలు భగవత్ తత్త్వసారాన్ని ఒంటపట్టిస్తాయి. అతివిస్తారమైన ఆ తత్త్వాన్ని అనేక కోణాల నుంచి అర్థం చేసుకోవడానికి మానవుడు చాలానే శ్రమపడాల్సి వస్తుంది. తెలియని వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే ఆ మాటల లోకాన్ని కల్పించడం జరిగింది. ఆ లోకంలో ప్రవేశించినవాడు పరమార్థాన్ని అన్వేషించడం ప్రారంభిస్తాడు. అటువంటి వారికే శబ్దబ్రహ్మను బీజాక్షారాలలో నిక్షిప్తం చేస్తూ కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఆ మంత్రాన్ని మననం చేస్తున్న కొద్దీ పుడుతున్న శక్తి సాధకునికి కాంతిరూపంలో సాక్షాత్కరిస్తుంది. క్రమంగా పెదవులు మంత్రాన్ని జపించడం మానివేస్తాయి. సాధకుని మనస్సు మంత్రాధిదేవతను తన ముందు ఉంచుకుని నడవడం మొదలుపెడుతుంది. అలా దేవతా చైతన్యంతో నిండిన మనస్సు నీరవ నిశ్శబ్దస్థితిలో చేసేదే ధ్యానం. అది తదేకలగ్నం అయ్యే కొద్దీ మనోభూమిక సైతం రద్దయిపోతుంది. అమనస్కయోగి సాధన లయయోగంలో ప్రవేశించడంతో బ్రహ్మజ్ఞానం అందుకోవడానికి తగిన అర్హతను సాధిస్తుంది.’’ అన్నాడు. ‘‘జ్ఞానమేం చేస్తుంది స్వామీ! ప్రారబ్ధ కర్మను తప్పించగలదా? మానవుడు తాను అప్పటివరకూ పడుతున్న కష్టాలను తొలగించగలదా? అలా జరగనప్పుడు బతుకు దుర్భరమైపోదా? సామాన్యుడికి ఈ జ్ఞానంతో పనేమిటి?’’ మండనుడి వాదన అడ్డగోలుగా తిరిగింది. ‘‘ఇది బ్రహ్మజ్ఞానంలోని వైవిధ్యాన్ని తెలుసుకోనందువల్ల వచ్చిన అపవాదు. బ్రహ్మజ్ఞానం ఏకైక స్వరూపమే. కానీ బ్రహ్మసాక్షాత్కారం కలిగిన జ్ఞానులు పొందే సమాధినిష్ఠలో తారతమ్యాలున్నాయి. జ్ఞానాన్ని పొందగోరి సత్త్వాపత్తి అనే సమాధి నిష్ఠలో ఉన్నవారిని బ్రహ్మవేత్తలంటారు. వారికి జ్ఞాన ప్రారబ్ధాలలో వర్తమానంలో ఆచరిస్తున్న ప్రారబ్ధమే బలవత్తరంగా ఉంటుంది. ఆ ప్రారబ్ధకర్మను అనుభవం చేత క్షీణింప చేసుకుంటారు. ఆత్మను బ్రహ్మయందు లీనం చేసి, గతజన్మలలోనూ ఈ జన్మలోనూ మూటగట్టుకున్న సంచిత కర్మలను నశింప చేసుకుంటారు. తాము నిష్క్రియాత్మ స్వరూపులమనే దృఢనిశ్చయం తెచ్చుకున్న వారు కనుక వారిని ఆగామి కర్మలు అంటుకోవు’’ నిలకడగా చెప్పాడు శంకరుడు. ‘‘ఇప్పుడు అనుభవిస్తున్న ప్రారబ్ధ కర్మలు కొద్దిపాటివి మాత్రమే. కానీ మనకు తెలియకుండానే మూటగట్టుకున్న సంచిత కర్మలు అనంతాలు కదా! వాటినేం చేస్తారు?’’ విసుగు ప్రదర్శించాడు మండనుడు. ‘‘దానిని దహించివేసే అగ్ని సమ్యక్ జ్ఞానమే. ఆత్మను ఆ అగ్నిలో ప్రకాశింప చేసుకోవడమే సన్యాసం. అక్కడ అప్పటికప్పుడు అనుభవిస్తూ నశింపచేసుకుంటున్న ప్రారబ్ధ కర్మలే కానీ, వెనుక నుంచి తెచ్చుకున్నవి, ముందు అనుభవించాల్సినవి ఏమీ ఉండవు. ఆ కర్మలను సన్యాసి స్థితప్రజ్ఞతో నిర్వహిస్తున్నప్పుడు బ్రహ్మవిద్వరుడు అవుతాడు. ఇతడి సమాధి నిష్ఠను అసంసక్తి అని పిలుస్తారు’’ శంకరుడింకా పూర్తి చేయలేదు. ‘సత్సంగత్వే నిస్సంగత్వం’ అంటూ రామచిలుకలు భజగోవిందాన్ని పాడాయి. ‘‘అందుకే ఏ సంగత్వమూ లేకుండా పోవడానికే సన్యాసులు ఇల్లు, పెళ్లి, పిల్లలనే బంధాలను విడిచిపెట్టేస్తారు. కొందరు అడవులు పట్టిపోతారు. మరికొందరు ఇదిగో ఇలా దేశంమీద పడి గృహస్థుల లౌకిక వ్యవహారాలను చెడగొడుతూ ఉంటారు’’ మండనుడి ముఖంలో వైషమ్యభావం సెగలు కక్కుతోంది. ‘‘బ్రహ్మజ్ఞానం తాలూకు సమాధినిష్ఠలో మూడోదశ ఉంది. అదే పదార్థాభావన అని పిలిచే బ్రహ్మవిద్వరీయసుని స్థితి. ఆ స్థితిని చేరుకోవడానికి ఎవరైనా సన్యాసాశ్రమంలోనే చేరనక్కరలేదు. మీ కర్మమార్గం తెచ్చిపెట్టే ఆరాటాన్ని జయిస్తే గృహస్థుగానూ పొందవచ్చు. బ్రహ్మవిద్వరీయసునికి చేసినది, చేస్తున్నది, చేయాల్సింది అంటూ కర్మలేమీ ఉండవు. బ్రహ్మచైతన్యం పురిగొల్పినప్పుడు దానికో పనిముట్టుగా చేయాల్సిందేదో చేస్తుంటాడు. లేనప్పుడు ఏమీ చేయకుండానే ఊరుకుంటాడు. తనంత తానుగా నిష్ఠ నుంచి వెలికిరాడు’’ మూసివుంచిన కన్నులముందు శంకరునికి భక్త ప్రహ్లాదుడు దర్శనమిచ్చాడు. ‘‘నీ తిండి నువ్వు సంపాదించుకోవు. నీ శరీరాన్ని పోషించే బాధ్యతకూడా పక్కవాడిమీదే పెట్టినప్పుడు నిశ్చింత కాక మరేమిటి వస్తుంది? ఎవరోవచ్చి అయ్యోపాపమని తినబెడితే తింటావు. లేనప్పుడు ఊరుకుంటావు. నీ సొమ్మేం పోయింది’’ మండనుడి విమర్శ అధమస్థాయికి జారుతోంది. సభాసదులలో ముఖ్యపీఠాన్ని అధిరోహించిన కాళిదాసు అతడిని వారించాడు. ‘‘ఆర్య మండనమిశ్రా! తమరు వ్యక్తిగత విమర్శలకు దిగవద్దు. శాస్త్రచర్చను నీరుకార్చ వద్దు. మీస్థాయికి తగిన రీతిలో ప్రవర్తించండి’’ అన్నాడు. మండనుడు సర్దుకుని కూర్చుని, మౌనం వహించాడు. శంకరుడు కొనసాగించాడు. ‘‘కట్టకడపటిదైన తుర్యగ్ స్థితి ఉన్నది. అది బ్రహ్మవిద్వరిష్ఠుని స్థితి. ఆ స్థితిలోనే జీవుడు బ్రహ్మమయుడు అవుతాడు. అది నిర్గుణ పరబ్రహ్మ స్థానము. దానికంటే పైకి వెళ్లాల్సిన అవసరం కానీ, క్రిందికి దిగి జన్మకు రావాల్సిన అవసరం కానీ ఉండదు. ఆ సిద్ధుడు అనుకుంటే రావడం, పోవడమే. జన్మరాహిత్యమంటే అదే’’ అన్నాడు. ‘‘మరి ఈ సిద్ధులన్నీ సాధించలేని మామూలు మానవుడి గతి ఏమిటి? వాడికి ముక్తి లభించే మార్గమే లేదా? ఎప్పటికీ అధోగతి తప్పదా?’’ మండన మిశ్రుడు తదుపరి ప్రశ్న వేశాడు. ‘‘దానినే మాయ అంటున్నాం. ఆ మాయను తరించడానికి కర్మమార్గమూ, జ్ఞానమార్గమూ అంగీకరించే ఒకే ఒక శక్తికి పేరు భక్తి. భావన బలంగా ఉండాలే కానీ, భక్తి సాధించలేనిది ఏమీ లేదు’’ అన్నాడు శంకరుడు. భక్తిప్రాధాన్యాన్ని ఇలా విస్తరించాడు. మోక్షకారణసామగ్య్రాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసన్ధానం భక్తిరిత్యభిధీయతే అపరోక్షానుభూతిని అందించేది భక్తి. ద్వైదీభావాన్ని నశింపచేసి ఆత్మను అద్వితీయ పరబ్రహ్మ సాక్షాత్కారానికి ఆయత్తం చేస్తుంది. బ్రహ్మాత్మల ఏకత్వ స్థితి ఎల్లవేళలా ఉంటుంది. ఇది దర్శించి తెలుసుకోవలసిందే. దీనికి అందరూ అర్హులే. అసమానమైన భక్తిని హృదయం నిండా నింపుకున్నవాడికి ఆరువిధాలుగా ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సాయుజ్యము అంటే భగవంతునికి దగ్గరగా వెళ్లడం. సాలోక్యము అంటే భగవత్ లోకానికి చేరుకోవడం. సామీప్యము అంటే భగవంతుని చేరువలో నిలిచే అర్హత సాధించుకోవడం. సారూప్యము అంటే భగవత్ రూపాన్ని తాను పొందడం. సామ్యము అంటే భగవంతునితో సమానుడు కావడం. బ్రహ్మలీనుడు ఆయనలోనే లీనమైపోవడం. ఈ చిట్టచివరి స్థితిని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ భావనాబలాన్ని సాధించడంలోనే వెనుకంజ వేస్తుంటారు. ఎడతెగని కర్మలను నిర్వహిస్తూ ఆరాటం పెంచుకుంటారు. ముక్తి కోరుకుంటే వెంటనే లభించి తీరుతుంది. అంతటి విశ్వాసం ఉండాలి ముందుగా. దానికి భక్తి మాత్రమే చక్కని మార్గం వేయగలుగుతుంది. కామోత్కంఠత వల్ల గోపికలు, భయంతో కంసుడు, వైరం పూనిన శిశుపాలాదులు, శ్రీకృష్ణదేవుడు జన్మించినందువల్ల వృష్ణి వంశం, ప్రేమతో పాండవులు, భక్తితో నారదాదులు విష్ణు సాయుజ్యాన్ని పొందారు. అటువంటి ఏదో ఒక మార్గాన్ని సాధకుడు ఎంచుకోవాలి. ’’ ‘‘సరేలెండి స్వామీ! మీ వరస చూస్తుంటే పరలోకం ఒకటుందని కూడా ఒప్పుకునేట్లు లేరు. ముక్తిని కూడా నేలమీదకు లాక్కొచ్చి నిలబెట్టేలా ఉన్నారు. దాని సంగతి తర్వాత చూద్దాం. మీరు బోధించే జ్ఞానమార్గంలో కూడా దుష్టజ్ఞానం, అజ్ఞానం, సంశయం అనే మూడు దశలుంటాయి. ఆ మూడింటినీ దాటిన తరువాత కదా మానవుడు భక్తి పరుడు కావడం. నేటి మానవుడికి భక్తితోనూ, చివరకు భగవంతునితోనూ కూడా పనిలేదు. కావలసిందల్లా కోరిక నెరవేరడం. నిన్నమొన్నటి ద్రుపదరాజు హోమగుండం నుంచి నేరుగా సంతానాన్ని పొందాడు. సకల వస్తు సంపదలను, సంతానాన్ని, సమస్త వాంఛితార్థాలను హోమగుండమే అందిస్తుంది. భక్తిలోపం కలిగినా పరవాలేదు కానీ, కర్మలోపం చేయకుండా ఉంటే ఫలితం దానంతట అదే పుడుతుంది. ఇదే అచ్చంగా అందరికీ కావలసింది. కోరిన కోరిక నెరవేరాలి’’ పూర్వమీమాంసా దర్శనాన్ని కాచివడబోశాడు మండనుడు. ‘‘భక్తుని కోరిక నెరవేర్చడమే భగవంతునికి అభీష్టం. అందులో సందేహమేమీ లేదు. కానీ కోరుకోవడమే భక్తునికి తెలియదు. రెండింతలు మూడింతలుగా దొరికే అనుగ్రహాన్ని భక్తుడు అల్పమైన కోరికతో సరిపెట్టేసుకుంటాడు కర్మనిష్ఠుడు’’ అని సెలవిచ్చాడు శంకరుడు. ‘‘కావచ్చు. కానీ మాకు మా లౌకిక వ్యవహారాలు సజావుగా నడవడమే కావలసింది. మా పాతకాన్ని జపం పోగొడుతుంది. వాంఛితాన్ని అగ్నిహోత్రం ఇస్తుంది. లయసమాధులను సాధించే మీరంతా నివృత్తి మార్గం పట్టి సన్యాసులై పోతుంటే లోకవృత్తం అస్తవ్యస్తమవుతుంది. ఇందుకు మేం అంగీకరించం’’ అన్నాడు మండన మిశ్రుడు. ‘‘అగ్నిముఖంగా వెలువడుతున్న చైతన్యమంతా భగవద్దత్తమే. అగ్ని ఆరాధన అప్రయోజనమని మేమూ చెప్పడం లేదు. కానీ మీ గృహస్థుల తరహాలో కామ్యకర్మలను చేయకుండా విడిచిపెట్టేశాం అంతే...’’ చెప్పాడు శంకరుడు. ‘‘అయితే కర్మకాండ అవశ్యం అనుసరణీయమేనని అంగీకరించనట్లేనా?’’ అడిగాడు మండనుడు. ‘‘వ్యక్తి సంక్షేమం కోసం, సమాజక్షేమం కోసం నిత్యకర్మలను ప్రతి ఒక్కరూ చేయవలసిందే. ఇక సందర్భానుసారంగా చేయవలసినవి నైమిత్తిక కర్మలు. జన్మకు వచ్చినందుకు వాటిని అనుసరించడం మన బాధ్యత. కానీ కర్తృత్వాన్ని మనపై పెట్టుకోకూడదు. అంటే నేను చేస్తున్నది భగవంతుని పని అనే భావనతో నిమిత్తమాత్రంగా ఉండి కర్మ నిర్వహణ చేయాలి. చివరిగా కామ్యకర్మలను పూర్తిగా విడిచిపెట్టాలి. కోరికలతో సత్కర్మలను ఆచరించ కూడదు. జనన మరణ చక్ర పరిభ్రమణం నుంచి విడుదలయ్యేలా ప్రారబ్ధ, సంచిత, ఆగామి, కర్మలు నిశ్శేషమయ్యేలా నిష్కామ కర్మలను మాత్రమే తప్పక ఆచరించాలి’’ విశదీకరించాడు శంకరుడు. ‘‘కోరికలే లేకపోతే తమరు ముక్కుమూసుకుని తపస్సు చేసుకోండి. ప్రజల మధ్యకు రావడం ఎందుకు? ఆకలి దప్పికల వేళ, ఆలిని కూడే వేళ, పుత్రాదులను పొందేవేళ కామపురుషార్థాన్ని ధర్మయుతంగా సాధించే గృహస్థుకంటే మోక్షానికి అర్హుడెవ్వడు?’’ మండనమిశ్రుని గుండెల్లోని ఆరాటం అతడి మెడలో వేలాడుతున్న పూలమాలకు అర్థమవుతోంది. – సశేషం -
పరమహంస యోగానంద
సాధారణమైన వ్యక్తుల కథ కేవలం అక్షరాలతో తయారవుతుంది. కాని యోగుల ఆత్మకథలు మాత్రం అనుభవాలతో కూడి తరువాతి తరాలకు మార్గదర్శకాలవుతాయి. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. భారతీయ సంస్కృతికి గౌరవాన్ని ఇనుమడింపచేసి చరిత్రపుటల్లో నిలిచిన యోగిగురువులు పరమహంస యోగానంద. వీరు సనాతన ధ్యాన ప్రక్రియ అయిన క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తం చేసి భారతీయ యోగసమున్నతిని విశ్వమంతా చాటారు. భక్తిభావం... క్రియాయోగం ఎంతోమంది మహనీయులకు జన్మనిచ్చిన గోరఖ్‌పూర్ ప్రపంచానికి అందించిన యోగిరత్నమే ముకుందలాల్ ఘోష్. బాల్యం నుంచే భక్తిభావాలతో యోగవిద్యను తెలుసుకునేందుకు పలువురు సాధువులను, సన్యాసులను కలుసుకునే సందర్భంలో పదిహేడో ఏట కోల్‌కతాలో ఓ సాధువును కలిశారు. వారే యుక్తేశ్వరగిరి. వీరివద్దే సన్యాసాశ్రమ స్వీకారం చేసి స్వామియోగానందగా గుర్తింపుపొందారు. క్రియాయోగ సాధనలో మెలకువలనూ నేర్చారు. యోగవిద్యకు ప్రాచుర్యం అనంతరం పశ్చిమబెంగాల్లో తొలి యోగ పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే రాంచీలో మరో యోగ పాఠశాలను స్థాపించగా, తర్వాతి కాలంలో అదే భారత యోగా సత్సంగంగా రూపొందింది. పిమ్మట ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలలో పర్యటించి భారతీయ యోగవిద్యకు విశేష ప్రచారం కల్పించారు. వీరి ప్రభావంతో క్రియాయోగం వైపు మళ్లిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వినోదం, విజ్ఞానం... కలిస్తే ఒక పుస్తకం ఖండాంతర కీర్తికలిగిన యోగానంద మహానుభావుని జీవిత చరిత్రను ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో గ్రంథరూపంలో ప్రకటించారు. ఈ గ్రంథం 20వ శతాబ్దపు 100 అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటిగా పేరుగాంచి నేటివరకు ఎన్నో ముద్రణలను పొందుతూ భారతదేశపు ప్రాచీన విజ్ఞానసారాన్ని ప్రపంచానికి అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు భాషల్లోకి అనువదించబడిన ఈ పుస్తకం ఎంతోమంది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను తీర్చుతోంది. కృషియే సాధనం మనిషి చేసే మానసిక ఆధ్యాత్మిక కృషికి మాత్రమే శాశ్వతమైన విలువ ఉంటుందనీ, మనిషి తనశక్తిని సరిగ్గా ఉపయోగించగలిగితే భౌతికంగా ఎదురయ్యే ఎన్నో అవరోధాలను జయించగలడనీ వీరి జీవితం ద్వారా మనం గ్రహించగలం. చెడును మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, క్రూరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించగలమనే వీరి సందేశం శిరోధార్యం. మానవ అస్తిత్వపు అంతిమ మర్మాలను విడమరిచే యోగానందుల జీవితాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే మనిషి జీవితం ఉన్నతమవుతుంది. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
పుస్తక రూపంలో శ్రీదేవి జీవితం
అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని, తన అభిమానులను విడిచి వెళ్లి సంవత్సరం దాటిపోయిన ఆ విషయాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం ఈ లెజెండరీ స్టార్ జయంతి సందర్భంగా మరోసారి ఆమెను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పబ్లిషర్స్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త బోనికపూర్ అనుమతితో పుస్తక రూపంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ‘శ్రీదేవి : గర్ల్ ఉమెన్ సూపర్ స్టార్’ పేరుతో తయారవుతున్న ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సత్యార్థ నాయక్ రాస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓ అభిమానిగా నేను ఎప్పుడు శ్రీదేవిని ఆరాధించేవాడిని. ఈ రోజు నాకు భారతీచయులకు ఎంతో నచ్చిన ఓ సూపర్ స్టార్ కథను చెప్పే అవకాశం దక్కింది. ఎన్నో ఏళ్లోగా శ్రీదేవితో కలిసి పనిచేసిన తారలు కలుసుకోవటం ఆనందంగా ఉంది. అవన్ని కలిపి ఓ చిన్నారి భారత తొలి లేడీ సూపర్ స్టార్ ప్రయాణంగా పుస్తకరూపంలో తీసుకురావటం ఓ గొప్ప అనుభూతి’ అన్నారు. ఈ పుస్తకాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఒక్క రాత్రిలో వేయి పడగలు
మా బడిలో తరగతుల ముందు విశాలమైన ఖాళీ స్థలం, తూర్పున రెండవ గదిముందు ఒక చేదబావి, బావి ప్రక్కన ఒక తుత్తురు చెట్టు ఉండేది. దప్పి వేసిన పిల్లలు దాని దగ్గరకు వచ్చి నీరు చేదుకుని త్రాగేవారు. బావికి దూరంగా మరో తుత్తురుచెట్టు, దానికి ఉత్తరంగా పెద్ద అంజూర, ఇంకా బొప్పాయి చెట్లు ఉండేవి. మేము గంట అయి తరగతి మారే అపుడా తుత్తురు చెట్ల పండ్లకెగబడేవారం. మా గదుల ముందు గల ఖాళీస్థలంలో కూర మడులకు కావలసినంత స్థలముండేది. ఇద్దరం లేదా ముగ్గురం కలిసి ఒక్కొక్క మడిని తీసుకుని చదును చేసి బాగా త్రవ్వి అందులో ఎరువు తెచ్చి వేసేవారం. కూరగాయల విత్తనాలు ఉపాధ్యాయులే ఇచ్చేవారు. మే దినదినం లేదా రెండు దినాలకొక పర్యాయం నీరు పోసేవారం. మడులు బాగా పెరిగిన పిమ్మట ఉపాధ్యాయులు తనిఖీ చేసి ఎవరి మడి బాగా పెరిగితే వారిని మెచ్చుకునేవారు. తర్వాత కోసిన కూరగాయలు సగం పంతులు గారికి ఇచ్చి, సగం మేం ఇండ్లకు పట్టుకుని వెళ్లేవారం. మా అమ్మమ్మగారింటిలో ఎప్పుడూ పేలప్పిండి రెడీగా ఉంచేది. ఆమె ఉదయం నీటిలో ఇంత బెల్లం కూడా నానవేసేది. ఆకలి వేసినవారా నీటిలో పేలప్పిండిని కలుపుకొని ఒక గ్లాసు త్రాగేవారు. మొలకమామిడిలో ఉన్నప్పుడే కిశోర్‌బాబు జననం జరిగి మా శ్రీమతి అత్తవారింటిలోనే ఉండేది. అందుచే విశారద పరీక్షకు తయారీ ప్రారంభించాము. ఆనాడు దానికి సిలబస్‌లో బాలవ్యాకరణమున్నది. పరీక్షలు వ్రాయడానికి నాగర్ కర్నూలు వచ్చినాము. రెండు పరీక్షలు నడిచినవి. చివరి పరీక్షకు విశ్వనాథ వారి వేయి పడగలు నవల ఉన్నది. ఆ పుస్తకము నాకు దొరకక చదవలేదు. నాతోబాటు పరీక్ష రాయడానికి వచ్చిన దాసుపల్లి కృష్ణారెడ్డి గారి దగ్గర వేయి పడగలు ఉండేది. ఆయన్ను ‘మీరు చదివారా’ అని అడిగినాను. ‘లేదు’ అన్నాడు. ‘అయితే ఈ రాత్రికి ఇవ్వండి. చదివి మీకు మళ్లీ ఉదయమే ఇస్తాను’ అన్నాను. కృష్ణారెడ్డి ‘ఒక్కరాత్రిలో ఏం చదువుతావు? ఇది చదివితే నీ బుర్రలో ఉన్నదంతా పోతుంది’ అన్నాడు. అయినా నవల తీసుకుని రాత్రి 8 గంటలకు టీ తాగి ఎక్కడా విడవకుండా తెల్లవారి నాలుగు గంటల వరకు చదవడం పూర్తి చేశాను. నాకు ఏ పుస్తకమైనా పీఠిక నుండి చదవటం అలవాటు. దానికి పీఠిక లేదు. ఒకటి రెండు ఘట్టాలు పునరావృతం చేసుకొని పుట సంఖ్యలు గుర్తు పెట్టుకున్నాను. కథ అన్నా కన్నుల ముందు తిరుగుతూనే ఉంది. గిరిక, ధర్మారావుల గురించి ప్రశ్నలు వచ్చినవి. దాసుపల్లి కృష్ణారెడ్డి ఒక్క రాత్రిలో ఎలా చదివినావని ఆశ్చర్యపోయాడు. ఆ సంవత్సరం నేను, వెంకటనారాయణ, కృష్ణారెడ్డి అందరం విశారద పరీక్షలో ఉత్తీర్ణులయ్యాము. ఈ విశారద పరీక్షనే నా ఉద్యోగ ప్రవేశానికి నాంది అయింది. (నాగర్‌కర్నూలు జాతీయ పాఠశాలలో కపిలవాయి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశారు.) (డాక్టర్ కపిలవాయి లింగమూర్తి ఆత్మకథ ‘సాలగ్రామం’ నుంచి; ప్రచురణ: హైదరాబాద్ బుక్ ఫెయిర్, అడుగు జాడలు పబ్లికేషన్; పేజీలు: 208; వెల: 150; ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు) -
అఫ్రిది ‘గేమ్ చేంజర్’
కరాచీ: పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ‘గేమ్ చేంజర్’ పేరుతో వస్తున్న ఈ ఆటోబయోగ్రఫీ ఈ నెల 30న విడుదలవుతుంది. పాత్రికేయుడు వజాహత్ ఖాన్‌తో కలిసి అఫ్రిది ఈ పుస్తకాన్ని రాశాడు. 16 ఏళ్ల వయసులో 1996లో తన తొలి ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (37 బంతుల్లో) నమోదు చేసిన అఫ్రిది అరంగేట్రం సంచలన రీతిలో మొదలైంది. ఆ తర్వాత 20 సంవత్సరాలు కెరీర్లో విధ్వంసకర ఆటగాడిగా అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పాకిస్తాన్ తరఫున అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20లు ఆడటంతో పాటు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. -
నా బిడియమే నన్ను కాపాడింది
గాంధీజీ తన ఆత్మకథను 1925–1929 వరకు గుజరాతీ భాషలో రాశారు. ఆంగ్లంలోకి మహదేవ్ దేశాయ్ అనువదించారు. దాని తెలుగు అనువాదంలోంచి మహాత్ముడికి ఉండిన స్టేజ్ ఫియర్ గురించి చెప్పే కొంతభాగం. సౌజన్యం: పి.రాజేశ్వరరావు, ప్రగతి పబ్లిషర్స్. అన్నాహార మండల కార్యనిర్వాహక సమితికి మెంబరుగా ఎన్నుకోబడి ప్రతి మీటింగుకు హాజరవుతూ ఉండేవాణ్ణి. కానీ మాట్లాడటానికి నోరు తెరుపుడు పడేది కాదు. డాక్టర్ ఓల్డ్‌ఫీల్డు యీ విషయం గమనించి ‘‘నీవు నాతో బాగా మాట్లాడతావు కానీ సమావేశంలో ఎన్నడూ నోరు తెరవవు. అందువల్ల నీకు మగ తేనెటీగ అనే పేరు పెట్టవచ్చు’’ అని అన్నాడు. నాకు ఆయన వ్యంగ్యం అర్థమైంది. ఆడతేనెటీగలు ఎప్పుడూ శ్రమపడుతూ వుంటాయి. కానీ మగతేనెటీగ తినడం తాగడమేగానీ పనిచేయదు. సోమరిపోతన్నమాట. కమిటీ మీటింగులో అంతా తమతమ అభిప్రాయాలు చెబుతూ వుండేవారు. కానీ నేను మాత్రం నోరు తెరిచేవాణ్ణి కాదు. మాట్లాడాలనే కాంక్ష లేక కాదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడాలి? నాకంటే మిగతా మెంబర్లంతా ఎక్కువ తెలిసిన వారుగా కనబడేవారు. ఒక్కొక్కప్పుడు విషయం మీద మాట్లాడాలని సిద్ధపడేవాణ్ణి కానీ యింతలో మరో విషయం మీద చర్చ ప్రారంభమయ్యేది. నేను ఒకసారి వెంటసన్ అనే ఊరు వెళ్లాను. నా వెంట మజుందార్ కూడా వున్నారు. ‘‘ది ఎథిక్స్ ఆఫ్ డైట్’’ గ్రంథం రచించిన హోవర్డు గారు కూడా అక్కడే నివసిస్తున్నారు. ఆయన శాకాహార ప్రవర్తక సభలో ఉపన్యసించమని మమ్మల్ని ఆహ్వానించారు. అట్టి సభలో రాసుకొని వెళ్లి చదవడం తప్పుకాదని తెలుసుకున్నాను. పరస్పర సంబంధం పోకుండా వుండేందుకు, ప్రసంగం క్లుప్తంగా వుండేందుకుగాను చాలామంది అలాచేస్తారని తెలిసింది. ఆశువుగా ఉపన్యసించడం అసంభవం. అందువల్ల అనుకున్న విషయమంతా రాసి తీసుకువెళ్లాను. ఒక ఫుల్‌స్కేపు ఠావు కంటే అది ఎక్కువగా లేదు. కానీ లేచి నుంచునే సరికి కళ్లు తిరిగాయి. వణుకు పట్టుకుంది. అప్పుడు మజుందార్ నా కాగితం తీసుకొని చదివారు. ఆయన ప్రత్యేకించి ఉపన్యాసం కూడా చేశారు. అపుడు శ్రోతలు కరతాళ ధ్వనులు చేశారు. నాకు బాగా సిగ్గేసింది. నా అసమర్థతకు విచారం కూడా కలిగింది. ఆంగ్లదేశం విడిచి వచ్చేటప్పుడు చివరి ప్రయత్నం కూడా చేశాను. అప్పుడు కూడా అంతా అస్తవ్యస్తం అయింది. శాకాహారులైన మిత్రులకు హాల్‌బార్న్ రెస్టారెంటులో డిన్నర్ ఏర్పాటు చేశాను. ఆలోచించి ఆలోచించి మాట్లాడదలచిన విషయాన్ని కొన్ని వాక్యాల్లో ఇముడ్చుకొని మాట్లాడటం ప్రారంభించాను. మొదటి వాక్యంతో ప్రసంగం ఆగిపోయింది. రెండో వాక్యం నోట వెలువడలేదు. అంతా మరిచిపోయాను. చివరికి తమరు దయతో విచ్చేసినందుకు వందనాలు అంటూ ముగించివేశాను. నన్నుయీ బిడియం చాలా కాలం వదలలేదు. దక్షిణాఫ్రికా వెళ్లిన తరువాత అక్కడ చాలావరకు తగ్గిపోయింది. ఆశువుగా నేను మాట్లాడలేను. కొత్తవారిని చూస్తే నాకు సంకోచం కలుగుతుంది. మాట్లాడకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించేవాణ్ణి. యిప్పటికి కూడా గాలి పోగుచేసి మాట్లాడటం నాకు చేతగాదు.సామాన్యంగా అబద్ధం చెప్పడం, అతిశయోక్తులు పలకడం, సత్యాల్ని మరుగుపరచడం మనిషికి కలిగే సహజ దౌర్బల్యం. అయితే మితభాషి అర్థం లేని మాటలు మాట్లాడడు. ప్రతి మాట ఆచి తూచి మాట్లాడతాడు. మాట్లాడటానికి ఆరాటపడే వారిని మనం చూస్తుంటాం. మేమంటే మేము అని అధ్యక్షుణ్ణి ఒత్తిడి చేస్తుంటారు. అనుమతి ఇవ్వగానే వక్త సామాన్యంగా సమయాన్ని అతిక్రమించడం జరుగుతుంటుంది. యిలా మాట్లాడే వారివల్ల మేలేమీ జరగదు. పైగా కాలహరణం జరుగుతుంది. అందువల్ల నా బిడియం నన్ను కాపాడింది. సత్యశోధనకు అది ఎంతగానో సహకరించింది. -
పుస్తక రూపంలో చెన్నారెడ్డి జీవిత చరిత్ర
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకువచ్చి భవిష్యత్ తరాలకు తెలియజేయాలని పలువురు రాజకీయ, ప్రముఖ వక్తలు అభిప్రాయపడ్డారు. గొప్ప పరిపాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడైన చెన్నారెడ్డిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో ఉన్న మర్రి చెన్నారెడ్డి రాక్‌గార్డెన్‌లో చెన్నారెడ్డి మ్యూజియం ఏర్పాటు చేయాలని అన్నారు. ఆదివారం ఇందిరాపార్కు రాక్‌గార్డెన్‌లో చెన్నారెడ్డి శత జయంతి (100) ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభలో ప్రతిపక్షాల దాడిని సైతం హుందాగా స్వీకరించే ముఖ్యమంత్రుల్లో స్వర్గీయ చెన్నారెడ్డి ఒకరని కితాబిచ్చారు. చెన్నారెడ్డి జీవితం పట్టువిడుపులా ఉండేదని, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని తెలిపారు. గొప్ప వ్యక్తిత్వం గల బహుముఖ ప్రజ్ఞశాలి చెన్నారెడ్డి అని కొనియాడారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ.. చెన్నారెడ్డి కొందరివాడు కాదని, అందరి వాడని, తనతో విభేదించే వారిని కూడా ఆమోదింపజేసుకునే విలక్షణ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ గవర్నర్లు రోశయ్య, రాంమోహన్‌రావు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, కొండా విశ్వేశ్వరరెడ్డి, నంది ఎల్లయ్య, టి.సుబ్బరామిరెడ్డి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డీకే అరుణ, సమర సింహారెడ్డి, ఉమావెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, గడ్డం ప్రసాద్‌కుమార్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, కిష్టయ్య, దైవజ్ఞశర్మ, ఏఐసీసీ సభ్యుడు ఎం.సూర్యనాయక్, మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయన సమాధి, విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. -
మృదుస్పర్శ ఎరిగినవాడు
గ్రేట్ రైటర్ మనిషి స్వతహాగా బలహీనుడని నమ్ముతాడు డాజై ఒసాము (1909–1948). ఎదుటివాడి బలహీనతను ఎరిగి, మృదువుగా స్పందించడం ద్వారా వారికి సాంత్వన అందించగలమని చెబుతాడు. దీనికోసం ఆయన ఎన్నుకున్న ఒక మార్గం, జీవితపు కర్కశత్వానికి బలైపోయిన బలహీన పాత్రలను సృష్టించి, వాటిపట్ల పాఠకుల్లో ప్రగాఢమైన సానుభూతిని రేకెత్తించడం. ఈ మృదుస్పర్శ లేనివాడే ఆయన ఉద్దేశంలో దుష్టుడు. ఈ స్పర్శ లేదనిపించినప్పుడు ఆయన ఇతరుల రచనలను తిరగరాయడానికి కూడా వెనుకాడలేదు. అలాగే, రాయడం అంటే నిజాయితీ అని కూడా డాజై విశ్వాసం. వ్యక్తిగత జీవితాన్ని అత్యంత పారదర్శకంగా కనబరిచే ఆత్మకథాత్మక నవలలుగా ఆయన ‘ద సెట్టింగ్ సన్’, ‘నో లాంగర్ హ్యూమన్’ జపాన్‌లో కొనియాడబడుతున్నాయి. అప్రయత్నంగా రాసే రచయితగా, అతి చిన్న విషయాలను గురించి పట్టించుకునే రచయితగా కూడా ఆయనకు పేరు. అయితే, కేవలం వాస్తవాన్ని ప్రతిబింబించడం పట్ల కూడా డాజైకి అభ్యంతరాలున్నాయి. ఎదుటివారిలో ఆర్ద్రతను మేల్కొల్పని వాస్తవికవాదాన్ని నిరసించాడు. వాస్తవం కన్నా సత్యం వైపు మొగ్గుచూపాడు. మనిషిగా బతకడంలో సంఘర్షణ ఎదుర్కొని, మద్యానికి బానిసై, అనారోగ్యం పాలై, సంబంధాలను చెడగొట్టుకుని, 39వ పుట్టినరోజు ఇంకా ఆరు రోజులుందనగా సహచరితో కలిసి కాలువలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి ఆయన తలపెట్టి పూర్తిచేయకుండా వదిలేసిన నవలిక పేరు ‘గుడ్‌బై’. -
కుంబ్లేతో డ్యాన్స్ చేయించా
సాక్షి, హైదరాబాద్: వీవీఎస్ లక్ష్మణ్ పేరు చెప్పగానే మరో ఆలోచనకు తావు లేకుండా ప్రతీ క్రికెట్ అభిమాని దృష్టిలో 2001 నాటి కోల్‌కతా టెస్టు ఇన్నింగ్స్ కళ్ల ముందు మెదులుతుంది. ఆస్ట్రేలియాపై ఫాలోఆన్‌లో లక్ష్మణ్ చేసిన 281 పరుగులతో ఆ మ్యాచ్ నెగ్గిన భారత్ ఆ తర్వాత సిరీస్ కూడా గెలుచుకుంది. భవిష్యత్తులో భారత క్రికెట్ రాతను కూడా ఈ మ్యాచ్ మార్చేసింది. అయితే స్వయంగా లక్ష్మణ్ దృష్టిలో మాత్రం దీనికంటే ముందు సిడ్నీలో తాను చేసిన 167 పరుగుల ఇన్నింగ్స్‌కే తొలి స్థానం దక్కుతుంది. గురువారం తన ఆత్మకథ ‘281 అండ్ బియాండ్’ ఆవిష్కరణ సందర్భంగా అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘టెస్టుల్లో అడుగుపెట్టి మూడేళ్లు దాటిపోయినా తొలి సెంచరీ నమోదు చేయలేకపోయాను. అలాంటి స్థితిలో 2000 జనవరిలో సిడ్నీలో సాధించిన శతకం నేనూ అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలబడగలననే నమ్మకాన్ని కలిగించింది. అక్కడి పిచ్, ఎదుర్కొన్న బౌలర్లు, నా ఫామ్ ప్రకారం చూస్తే రెండో ఇన్నింగ్స్‌లో చేసిన ఆ సెంచరీ గొప్పతనం ఎక్కువ. నాటి మ్యాచ్ స్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఈడెన్ గార్డెన్స్‌లో చేసిన 281 పరుగులకు చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని అంగీకరిస్తాను. అయితే ఆ మ్యాచ్‌లో నా ఆట నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అంతకుముందు దాదాపు ఏడాది కాలంగా దేశవాళీలో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం అలవాటుగా మార్చుకున్నాను. నా ఫిట్నెస్ కూడా అద్భుతంగా మలచుకున్నాను. కాబట్టి ఏమాత్రం అలసట తెలీకుండా రెండు రోజులు ఆడేశాను’ అని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. ఓపెనర్ స్థానంలో ఆడేందుకు అంగీకరించకపోవడం తన కెరీర్లో కఠిన నిర్ణయమని వీవీఎస్ చెప్పాడు. మూడేళ్ల పాటు మిడిలార్డర్లో స్థానం లేక ఇక భారత్ తరఫున ఆడాలనే విషయాన్ని మర్చిపోయి దేశవాళీపైనే దృష్టి పెట్టినట్లు అతను పేర్కొన్నాడు. ఆటగాడిగా ఉన్నప్పుడు అంతర్ముఖుడిగా కనిపించిన లక్ష్మణ్... తాను కూడా సహచరులతో చాలా సరదాగా గడిపే వాడినని వెల్లడించాడు. గంభీరంగా ఉండే అనిల్ కుంబ్లేతో కూడా 2008 నాగపూర్ టెస్టు తర్వాత టేబుల్ పైన డ్యాన్స్ చేయించగలగడం తనకే సాధ్యమైందని లక్ష్మణ్ నవ్వుతూ చెప్పాడు. అమెరికాలో అనుసరించా... పుస్కకావిష్కరణకు అతిథిగా వచ్చిన రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మాట్లాడుతూ... క్రికెట్ వీరాభిమానినైన తాను కోల్‌కతా ఇన్నింగ్స్ సమయంలో అమెరికాలో ఉన్నానని, ప్రస్తుతం ఉన్న తరహాలో నెట్లో వీక్షించే సదుపాయం లేకపోవడంతో రెడిఫ్లో వచ్చే సంక్షిప్త సమాచారం ఆధారంగా మ్యాచ్‌ను అనుసరించానని గుర్తు చేసుకున్నారు. లక్ష్మణ్ సహచర హైదరాబాదీ కావడం గర్వంగా ఉందని భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ వ్యాఖ్యానించగా... అండర్–16 స్థాయిలో వీవీఎస్‌ను ప్రోత్సహించిన రోజులను మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. లక్ష్మణ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన చాలా సందర్భాల్లో తాను ఇచ్చిన బ్యాట్లనే వాడాడని వెంకటపతిరాజు చెప్పగా... టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేయలేకపోవడం, వరల్డ్ కప్ ఆడలేకపోవడం వీవీఎస్ కెరీర్లో లోటుగా మిగిలిపోయానని అతని మేనమామ, మెంటార్ బాబా కృష్ణమోహన్ అన్నారు. -
కావాలని వివాదాలు చేర్చలేదు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో సాగిన 16 ఏళ్ల కెరీర్లో స్టయిలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు. జెంటిల్మన్ క్రికెటర్‌గానే ఆటను ముగించాడు. ఇప్పుడు లక్ష్మణ్ కెరీర్, విజయాలు, వైఫల్యాలు, వ్యక్తిగత అంశాలతో అతని ఆత్మ కథ అందుబాటులోకి వస్తోంది. ‘281 అండ్ బియాండ్’ పేరుతో వస్తున్న ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. సీనియర్ క్రీడా పాత్రికేయుడు ఆర్. కౌశిక్ సహ రచయితగా ఉన్న ఈ పుస్తకాన్ని వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో తన పుస్తకం విశేషాల గురించి లక్ష్మణ్ మాట్లాడాడు. పుస్తకాన్ని సంచలనంగా మార్చేందుకు ఎలాంటి మసాలాలు దట్టించలేదని అతను అన్నాడు. చాలా ఆత్మ కథల తరహాలో పనిగట్టుకొని వివాదాలు సృష్టించే ప్రయత్నం చేయలేదని వీవీఎస్ చెప్పాడు. ‘నా పుస్తకంలో కావాలని చొప్పించిన వివాదాస్పద అంశాలు ఏవీ ఉండవు. అయితే ఇందులో ప్రతీ అక్షరం నిజాయితీగా రాశానని చెప్పగలను. అయితే నాడు స్పందించలేకపోయిన కొన్ని సందర్భాల గురించి మాత్రమే స్పష్టంగా ప్రస్తావించాను. 2000లో ముంబైలో దక్షిణాఫ్రికాతో టెస్టు తర్వాత నన్ను అనూహ్యంగా జట్టు నుంచి తప్పించడం, ఇకపై ఓపెనర్‌గా ఆడనంటూ కచ్చితంగా చెప్పేసిన విషయం, 2003 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై నేను పడిన వేదనలాంటివి ఇందులో ఉన్నాయి. వివాదం అనే మాటను వాడను కానీ నా మనసులో అనుకున్న విషయాలు మాత్రం నిజాయితీగా వెల్లడిస్తున్నాను’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు. చిన్నప్పుడు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం నుంచి రిటైర్మెంట్ వరకు అనేక ఆసక్తికర అంశాలతో పాటు రిటైర్మెంట్ తర్వాతి జీవితం, కుటుంబం తదితర విశేషాలు ఇందులో ఉన్నాయని అతను వెల్లడించాడు. కేవలం క్రికెటర్లకే కాకుండా... చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రులకు కూడా తన అనుభవాలు ఉపయోగపడతాయని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. వీవీఎస్ లక్ష్మణ్ అనగానే అందరికీ కోల్‌కతా 281 ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది కాబట్టి దానిని టైటిల్‌గా పెట్టామని వీవీఎస్ స్పష్టం చేశాడు. -
వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్లో ఆంతర్యమేమిటో?
హైదరాబాద్: వీవీఎస్ లక్ష్మణ్.. క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన క్రికెట్ కెరీర్లో ‘వెరీ వెరీ స్పెషల్’గా గుర్తింపు పొందిన వీవీఎస్ తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతోంది. త్వరలోనే వెరీ వెరీ స్పెషల్ స్టోరీ రాబోతుందంటూ లక్ష్మన్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే వెరీ వెరీ స్పెషల్‌గా రాబోతున్నది ఏంటాని క్రికెట్ ప్రేమికుల్లో చర్చ సాగుతోంది. అతని జీవిత కథ ఆధారంగా ఒక పుస్తకాన్ని వీవీఎస్ లక్ష్మణ్ తీసుకు రాబోతున్నాడా? లేక ఈ పేరుతో ఏమైనా సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడా? అనేది ఆసక్తికరం. ఈ వెరీ వెరీ స్పెషల్ స్టోరీ అంటూ లక్ష్మణ్ చేసిన ట్వీట్లో ఉన్న ఆంతర్యమేమిటో అతనే చెప్పాలి. రక్త మూలకణ దాతగా వీవీఎస్ లక్ష్మణ్ బ్లడ్ స్టెమ్‌సెల్ డోనర్ (రక్త మూలకణ దాత)గా పేరును నమోదు చేయించుకున్నాడు. స్వచ్ఛంద సంస్థ దాత్రి నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ ప్రతి ఒక్కరు బ్లడ్ స్టెమ్‌సెల్ దానం చేయవచ్చని, మరొకరి జీవితం పొడిగింపునకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నాడు. లాభాపేక్ష లేకుండా రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడాలని పిలుపునిచ్చాడు.మంచి పనికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని లక్ష్మణ్ కోరాడు. A very very special announcement - coming soon ! pic.twitter.com/ReuOdfI08l — VVS Laxman (@VVSLaxman281) 30 October 2018 -
లవ్‌స్టోరీ వివాదం.. నటుడి కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: తన జ్ఞాపకాలను పుస్తకంగా రాస్తే దానిలో అభూత కల్పనలే ఉంటాయని బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నారు. ‘ఆన్ ఆర్డినరీ లైఫ్’ పేరిట గతేడాది తాను రాసిన ఆత్మకథలో ఐదు పేజీలు తన ప్రేమాయణం గురించి రాయడంపై విచారం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో తమ కలను సాకారం చేసుకునేందుకు చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి ప్రేరణగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకం రాసినట్టు ‘బాలీవుడ్ హంగామా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 209 పేజీలున్న ఈ పుస్తకంలో 5 పేజీలు మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్, సునీత రాజ్వర్లతో సాగించిన ప్రేమాయణం గురించి నవాజుద్దీన్ పూసగుచ్చారు. సిద్ధిఖీ మొత్తం అబద్ధాలే చెప్పాడంటూ అతని మాజీ ప్రేయసిలు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో ఈ పుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు గతేడాది అక్టోబర్‌లో ప్రకటించారు. అంతేకాదు క్షమాణలు కూడా చెప్పారు. ఈ వివాదం జరిగి ఏడాదైన సందర్భంగా మాట్లాడుతూ.. ‘పుస్తకంలో మొత్తం 209 పేజీలున్నాయి. కేవలం 5 పేజీల కారణంగా నా ప్రయత్నాన్ని వృధా చేస్తారా? నా ప్రేమకథను బయపెట్టినందుకు వివాదం చెలరేగుతుందని ఊహించలేదు. వాస్తవాలను చెప్పాలని మాత్రమే అనుకున్నాను. ఎవరి జీవితంలోనైనా వాస్తవం అనేది కథలా ఉండద’ని నవాజుద్దీన్ అన్నారు. ఇక ముందు తన జీవిత చరిత్ర రాస్తే అందులో అబద్దాలే ఉంటాయని చెప్పారు. -
కరుణానిధి ప్రస్థానం...
-
కరుణానిధి ప్రస్థానం...
సాక్షి, చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి శకం ముగిసింది. ఆయన ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయటమేకాదు.. 13 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కరుణానిధి మరణంతో తమిళనాడు వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కరుణానిధి ప్రస్థానం... జూన్ 3, 1924న అప్పటి అవిభక్త తంజావూర్ జిల్లాలోని తిరుకువళైలోని ఓ నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు ముత్తు వేలన్, తల్లిపేరు అంజుగమ్మ. తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చెందిన కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. వీరి పూర్వికులు ప్రకాశం జిల్లా నుంచి వచ్చినట్లుగా చెబుతుంటారు. ద్రావిడోద్యమంలో భాగంగా హేతువాదులైన ద్రావిడ నాయకులు మతపరమైన పేర్లను త్యజించిన తరుణంలో ఆయన సొంత పేరును కరుణానిధిగా మార్చుకున్నారు. కరుణకు షణ్ముగ సుందరాంబాళ్, పెరియనాయమ్మాళ్ అనే చెల్లెళ్లుండేవారు. 8వ తరగతివరకు మాత్రమే చదువుకున్న కరుణకు ఆది నుంచి ఉద్యమాలన్నా, సాహిత్యమన్నా ఎనలేని మక్కువ. మూఢ విశ్వాసాల నుంచి, తనకు తెలిసిన ప్రపంచం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన చిన్ననాటి నుంచే రకరకాల నాటికలు వేసేవారు. నాటికల రచనతో పాటు తన స్నేహితులతో కలిసి స్వయంగా నాటికల ప్రదర్శన చేసేవారు కూడా. జస్టిస్ పార్టీ నాయకుడు అళగిరిస్వామి ప్రసంగాలకే ఉత్తేజితుడై 14 ఏళ్ల ప్రాయంలోనే ఆయన హిందీ వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. హిందీకి వ్యతిరేకంగా నిరసన కార్య క్రమాలు చేపట్టి పలుమార్లు అరెస్టయ్యారు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఈ.వి.రామస్వామి నాయకర్ అనుయాయి. పెరియార్ ద్రావిడ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆయన బాటలో నడిచారు. 1949లో పెరియార్‌తో విభేదించిన ఆయన అనుంగు శిష్యుడు సి.ఎన్.అన్నాదురై.. ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) స్థాపించారు. డీఎంకే వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి ఒకరు. ఆ పార్టీ కోశాధికారిగా కరుణానిధిని అన్నాదురై నియమించారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి సీమాంధ్ర ప్రాంతం విడిపోయిన అనంతరం తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికలలో 1957లో తొలిసారి డీఎంకే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కరుణానిధి కుళితలై నియోజక వర్గం నుంచి పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు 33 సంవత్సరాలు. అప్పటి నుంచి ఓటమెరుగని యోధుడిలా తన ప్రస్థానాన్ని ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు. 1967 డీఎంకే తొలిసారి తమిళనాట అధికారం చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి అన్నాదురై కేబినెట్లో ప్రజాపనుల శాఖ మంత్రిగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు. 1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగాను, ద్రవిడ మున్నేట్ర కజగం అధ్యక్షునిగాను బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 45 ఏళ్లు. 1971 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే సాధించిన విజయాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. ద్రవిడ మున్నేట్ర కగజం అధ్యక్షుడిగా దాదాపు 50 ఏళ్లపాటు కరుణానిధి కొనసాగుతూ వచ్చారు. ఆ తర్వాత కరుణానిధితో విభేధాల కారణంగా డీఎంకే నుంచి ఎంజీఆర్ విడిపోవటం.. అన్నాడీఎంకే.. వైగో విడిపోయి ఎండీఎంకే.. ఇలా పలు పార్టీలు కరుణానిధి హయాంలోనే పుట్టుకొచ్చి అరవ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాయి. ఇక తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్నీ (40) లోక్ సభ స్థానాలలో యూపీఏ జెండా ఎగరవేయటంలో ఆయనదే కీలక పాత్ర. సాహిత్యపిపాసి.. తమిళ సాహిత్యంలో కరుణానిధి తనదైన ముద్రను వేసుకున్నారు. తండ్రి వద్ద బాల్యదశలో కొంతకాలం కరుణానిధి నాదస్వరం కూడా నేర్చుకున్నారు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. దక్షిణ భారత చలన చిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధినే. పెరియార్ నిర్వహించిన కుడియరసు పత్రికలో ఉప సంపాదకుడిగా చేరారు. ఎన్నో వ్యాసాలు రాశారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించారు. ద్రావిడ భావజాలం, హేతువాద సిద్ధాంతాల పట్ల కరుణానిధికి ఉన్న నిబద్ధత, ఆయనకున్న వాక్పటిమ, రచనా పాటవం కారణంగా అనతికాలంలోనే డీఎంకేలోని అగ్రశ్రేణి నాయకులలో ఒకరుగా ఆయన ఎదిగారు. -
శతపద్మం
ఆమె డెబ్బయ్ ఏళ్లకు పైగా వైద్యం చేస్తున్నారు. మీరు చదివింది నిజమే!ఆమెకు డెబ్బయ్ ఐదేళ్లు కాదు డెబ్బయ్ ఐదేళ్లుగా వైద్యం చేస్తున్న డాక్టర్ ఆమె. మరి ఆమెకిప్పుడు ఎన్నేళ్లు? వందేళ్లు దాటాయి! ఎల్లుండి బుధవారానికి 102లోకి అడుగు పెడతారు. పేరు డాక్టర్ ఎస్.ఐ. పద్మావతి. దేశంలో తొలి మహిళా కార్డియాలజిస్ట్ ఆమె. వేల గుండెల్ని కాపాడిన చెయ్యి ఆమెది. అంతకంటే ముందు.. యుద్ధం... ఆమె జీవితంలో కల్లోలాన్ని రేపింది. ఆ అలజడిని తట్టుకున్న ‘గుండె’ ఆమెది. డాక్టర్ ఎస్. ఐ. పద్మావతి నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. అఖిల భారత జాతీయ హార్ట్ ఫౌండేషన్‌కి స్థాపకాధ్యక్షురాలు కూడా. పద్మావతి రంగూన్ (బర్మా రాజధాని)లో ఎం.బి.బి.ఎస్ చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం రేపిన కల్లోలంతో కొంత విరామం. ఆ తర్వాత 1949లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఫెలోషిప్తో లండన్‌కు వెళ్లారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ, హార్వర్డ్ మెడికల్స్కూల్లో చదివారు. లండన్‌లో కార్డియాలజిస్టుగా ప్రాక్టీస్ చేశారు. స్వీడన్లో అడ్వాన్స్డ్ కోర్స్ చేసి 1953లోఇండియాకి వచ్చి ఢిల్లీలో మహిళల కోసం మహిళలే డాక్టర్లుగా సేవలందించిన లేడీ హార్డింగే మెడికల్ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేరారు. ఢిల్లీలో క్లినిక్ ప్రారంభించి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అప్పటికి మనదేశంలో గుండె వ్యాధులకు సరైన వైద్యం లేకపోవడమే కాదు, వ్యాధుల గురించిన అవగాహన కూడా ఉండేది కాదు. ఆ సమయంలో ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి తొలి అడుగు వేశారామె. వైద్యాన్ని తెచ్చారు మనదేశంలో కార్డియాలజీ విభాగంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (డిఎమ్)కోర్సును ప్రవేశపెట్టడం పద్మావతి చొరవతోనే సాధ్యమైంది. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ, జి.బి.పంత్ హాస్పిటల్లో కార్డియాలజీకి విడిగా డిపార్డ్మెంట్ ఏర్పాటు చేశారామె. 1978లో రిటైరయిన తర్వాత నేషనల్ హార్ట్ ఫౌండేషన్ స్థాపించారు. అంతకుముందు ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ కూడా స్థాపించారు. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో ఇప్పటికీ ఆమె గౌరవ ఆచార్యులు (ఎమెరిటస్ ప్రొఫెసర్)గా విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న వైద్యప్రక్రియలను ఔపోశన పట్టారామె. మనదేశానికి తెలియని వైద్య సేవలను అందుబాటులోకి తేవడానికి జీవితాన్ని అంకితం చేశారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్ అంటే విదేశాలకు వెళ్లాల్సిందే, అమెరికా, లండన్‌లకు వెళ్లి ఆపరేషన్ చేయించుకోగలిగిన సంపన్నులు మాత్రమే గుండె జబ్బుల నుంచి బతికి బట్టకట్టేవాళ్లు. అలాంటి గుండె వైద్యం ఇండియాకి వచ్చి, పట్టణాలకూ విస్తరించడంలో చొరవ చూపిన దార్శనికత పద్మావతిది. టెక్స్పీరియెన్స్ టెక్నాలజీకి ఎక్స్‌పీరియెన్స్ తోడయితే డాక్టర్ పద్మావతిలా ఉంటుంది. ఆమె చదువుకున్నప్పటి కంటే ఇప్పటి విజ్ఞానం ఎన్నో రెట్లు మెరుగైంది. కొత్త టెక్నాలజీని అందుకోవడంలో తాను నిత్య విద్యార్థినేనంటారామె. ఆమె అనుభవం హృద్రోగ విభాగంలో అధ్యయనానికి దోహదం చేస్తోంది, కొత్త టెక్నాలజీ ముందున్న సవాళ్లేంటో చెబుతోంది. రెండు తరాలను చూసిన ఆమె అనుభవం... కొత్త విద్యార్థులకు... ఔషధాల వాడకం– వాటి సైడ్ఎఫెక్ట్స్ మీద సంపూర్ణమైన అవగాహన కలగడానికి దోహదం చేస్తోంది. తండ్రి బర్మాలో వేల గుండెల్ని కాపాడిన పద్మావతి జీవితంలో గుండెల్ని అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన గతం ఉంది. యుద్ధం చిన్నాభిన్నం చేసేది దేశాల్ని మాత్రమే కాదు. అనేక జీవితాలు అల్లకల్లోలానికి గురవుతాయన్నారు డాక్టర్ పద్మావతి. ఆమె 1917, జూన్ 20వ తేదీన బర్మాలో (మయన్మార్) పుట్టారు. ఎంబీబీఎస్ పూర్తయ్యే నాటికి రెండవ ప్రపంచ యుద్ధం ఉధృతమైంది. ‘ఇరవై నాలుగ్గంటల్లో ఖాళీ చేయండి’ అనే హుకుంతో ఆమె తండ్రి భార్యాపిల్లలను ఇండియాకు పంపించేశారు. అలా 1942లో ఉన్నఫళంగా బర్మాను వదిలి స్వస్థలం కోయంబత్తూర్‌కి వచ్చేసింది వారి కుటుంబం. ఆ తర్వాత మూడేళ్లకు ఆయన కోయంబత్తూర్‌కి వచ్చారు. ఆ మూడేళ్ల కాలంలో ఆయన ఆచూకీ కుటుంబానికి తెలియదు. బర్మాకి తొలి డాక్టరమ్మ పద్మావతి చదువుకున్న రోజుల్లో చదువులు, ఉద్యోగాల్లో మహిళలను వేళ్ల మీద లెక్కపెట్టుకోవాల్సిందే. ఈ తరానికి ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ, రంగూన్ మెడికల్కాలేజ్లో ఎంబీబీఎస్‌లో చేరిన తొలి మహిళ ఆమె. స్విమ్మింగ్ హాబీ! తన ఆరోగ్య రహస్యం అడిగితే ఆమె నిశ్శబ్దంగా నవ్వుతారు. బర్మాలో మొదలైన స్విమ్మింగ్ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. ఢిల్లీలోని ఫోర్డ్ ఫౌండేషన్ స్విమ్మింగ్ పూల్ ఆమె స్విమ్మింగ్ పాయింట్. ఏడాదిలో ఆరు నెలలు రోజూ స్విమ్మింగ్ చేస్తారు. శీతాకాలంలో వాకింగ్ చేస్తారు. స్విమ్మింగ్, వాకింగ్‌తోపాటు బుక్ రీడింగ్ ఆమె హాబీలు. ఆమె సౌత్ ఢిల్లీలో ఉన్న నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లైబ్రరీకి కస్టోడియన్ కూడా. వందేళ్ల జీవనానికి మాత్రం తాతల నుంచి జన్యువులే కారణమంటారు. ఆమె తాతగారు (తండ్రికి తండ్రి) 103 ఏళ్లు జీవించారు. పూర్వికులు జన్యుపరమైన నిధిని ఇస్తారు. అది గొప్ప అదృష్టం. దేహానికి తగినంత శ్రమనిస్తూ మనమే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆ జాగ్రత్త లేకపోతే అనారోగ్యాలతో స్నేహం చేయకతప్పదంటారు పద్మావతి. రోజుకు 12 గంటలు ఇప్పటి కార్పొరేట్ హాస్పిటళ్లలాగ గంటకు ఎంతమందిని చూడాలనే లెక్కలు తెలియదు పద్మావతికి. పేషంట్ ఆరోగ్య స్థితిని బట్టి టైమ్ పెరుగుతూ పోతుంటుంది. రోజుకు పన్నెండు గంటల సమయం పేషెంట్లతోనే ఉంటారు. అలా వారానికి ఐదు రోజులు. అంత దీక్షగా పని చేయడంతోపాటు ఆమెలో మరో గొప్పతనం పేషెంట్ల భాషలు నేర్చుకోవడం. ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, బర్మా, జర్మన్, ఫ్రెంచ్భా భాషలు మాట్లాడతారామె. పేషెంట్ తన బాధను ఉన్నదున్నట్టుగా చెప్పుకోగలిగేది సొంత భాషలోనే. తమ బాధను సరిగ్గా చెప్పలేకపోతే సరైన వైద్యం అందదు, అందుకే ఆమె దగ్గరకు ఎక్కువగా వచ్చే పేషెంట్ల భాషలు నేర్చుకున్నారు. పద్మావతి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆమె కుటుంబం గురించిన ఆసక్తి కలుగుతుంది ఎవరికైనా. అదే మాట అడిగిన వాళ్లతో ‘నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోనందుకు నేనేమీ బాధపడడం లేదు. పేషెంట్లు, రీసెర్చ్‌లో నిమగ్నమై ఉంటాను. ఇందులో నాకు సంపూర్ణమైన తృప్తి ఉంది. నా జీవితం నేను కోరుకున్నట్లే సాగుతోంది’ అంటారు డాక్టర్ పద్మావతి. రికార్డులు ♦ దేశంలో తొలి కార్డియాలజీ క్లినిక్ స్థాపన ∙కార్డియాలజీలో ‘డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్’ కోర్సును ప్రవేశ పెట్టడం ♦ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, జిపి పంత్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్థాపన ♦ ఢిల్లీ లో ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ స్థాపన ♦ ఐదవ ప్రపంచ కార్డియాలజీ కాంగ్రెస్‌కు అధ్యక్షత ♦ పద్మభూషణ్ (1967) పద్మవిభూషణ్ (1992) పేషెంట్లే పాఠాలు (36 ఏళ్ల వయసులో.. లేడీ హార్డింగే మెడికల్ కాలేజ్‌లో...) నేను పేషెంట్‌ను తాకి, వారు చెప్పేది మొత్తం నా చెవులతో విని, నా కళ్లతో పేషెంట్‌ను నిశితంగా చూసి వైద్యం చేస్తాను. టెక్నాలజీ ఎంత ఎదిగినా పేషెంటుకి సంతోషం కలిగేది డాక్టర్ చూపించే శ్రద్ధతోనే.∙ఆ అలవాటు కారణంగానే మా మెడికల్ టెక్ట్స్‌బుక్స్‌లో లేని అనేక రోగాలను తెలుసుకోగలిగాను. వాటి మీద రీసెర్చ్ చేసే అవకాశం కూడా వచ్చింది. నేనందుకున్న అనేక పురస్కారాలకు మూలం ఆ అబ్జర్వేషనే. ఇన్నేళ్ల అనుభవంలో నేను చెప్పేదొక్కటే... మందులు మనిషి అదుపులో ఉండాలి, అంతే తప్ప అవి మనిషి మీద స్వారీ చేయకూడదు. మనకు జీవనశైలిలో క్రమశిక్షణ లేకపోతే మందులే మనిషికి యజమానులవుతాయి. – డాక్టర్ పద్మావతి, సీనియర్ కార్డియాలజిస్ట్ – వాకా మంజులారెడ్డి -
నా పుస్తకంలో అన్నీ వాస్తవాలే: రెహమ్ ఖాన్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఆత్మకథపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే తన పుస్తకం‘ టెల్-ఆల్’లో ఉన్న విషయాలన్నీ వాస్తవాలేనని ఆమె చెప్పుకొచ్చారు. సామాజిక వేత్త, జర్నలిస్టు అయిన రెహామ్ ఖాన్ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ‘నా ఆత్మకథ నుంచి కొన్ని విషయాలు బహిర్గతమై వివాదాస్పదమయ్యాయి. కానీ అవన్నీ వాస్తవాలే. అందరికీ నిజాలు తెలియాలనే ఈ పుస్తకాన్ని రాసాను. ఈ పుస్తక విడుదల విషయంలో నాకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ నేను వాటికి భయపడే వ్యక్తిని కాదు’ అని తెలిపారు. తన పుస్తకం ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోందని, ముఖ్యంగా వైఫల్యాలను ఎలా అధిగమించాలో తెలియజేస్తోందన్నారు. ‘ఈ పుస్తకంలో నా జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని రాసుకొచ్చాను. నా బాధలు, ఒడిదుడుకులు, వాటిని ఎలా అధిగమించాననే విషయాన్ని పేర్కొన్నాను. నా పుస్తకం చదివిన తర్వాత చాలా మంది మహిళలకు వారి జీవితంలోని కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు ఇతరులకు జరగవద్దని కోరుకుంటున్నాను. వైఫల్యాలను ఎలా అధిగమించాలో ఈ పుస్తకం తెలియజేస్తోంది. దీనిలో మొత్తం నా జీవిత ప్రయాణం వివరించాను. నా జర్నలిజం లైఫ్, యాంకర్‌గా మారడం, గ్లామరస్ లైఫ్ అన్ని విషయాలు ప్రస్తావించాను. చాలా నిక్కచ్చిగా అన్ని విషయాలు పేర్కొన్నాను. ఈ పుస్తకం పట్ల భయపడుతున్నావారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నా జీవితం గురించే మాత్రమే.’ అని చెప్పుకొచ్చారు. ఈ పుస్తకంలో ఇమ్రాన్ ఖాన్ ఓ గే అని, పెళ్లికి ముందే తనను వేధించాడని పేర్కొనడం.. వసీం అక్రమ్ సతీమణి గురించి రాసిన విషయాలు బయటకి రావడం తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఇమ్రాన్‌ఖాన్ ఈ పుస్తకాన్ని పాకిస్తాన్లో విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించారు. -
ఇమ్రాన్ ఖాన్ ఓ గే!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు అతని మాజీ భార్య జర్నలిస్ట్ రేహమ్ ఖాన్ ఓ పెద్ద తలనొప్పిగా మారారు. పెళ్లికి ముందే తనను లైంగికంగా వేధించాడని, ఇమ్రాన్ ఓ హోమోసెక్సువల్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. నటుడు హమ్జా అలీ అబ్బాసీ, పీటీఐ సభ్యుడు మురాద్ సయీద్‌లు, ఇమ్రాన్‌కు హోమోసెక్సువల్ భాగస్వాములని తెలిపారు. ఈ విషయాలను త్వరలో విడుదలకానున్న తన ఆటోబయోగ్రఫీలో రేహమ్ రాసుకొచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను మురాద్ సయీద్ రేహమ్ ట్విటర్ వేదికగా ఖండించారు. రోత మనుషులు చేసిన ఆరోపణలకు తాను స్పందించాల్సిన అవసరంలేదన్నారు. ఆమె ఎవరి చేతిలో పావుగా మారి.. ఆ ఆరోపణలు చేస్తున్నదో తనకు తెలుసని ట్వీట్లో మురాద్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇమ్రాన్, అలీ అబ్బాసీలు ఇంకా స్పందించలేదు. ఇక రెండు రోజుల క్రితం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సతీమణి గురించి రేహమ్ ఖాన్ తన పుస్తకంలో రాసిన వివాదస్పద ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. వసీం శృంగార అనుభవాల కోసం తన మాజీ, దివంగత సతీమణి ఓ నల్ల జాతీయుడితో సెక్స్ చేసేలా చేశాడని, ఆ తతంగాన్ని మొత్తం దగ్గరుండి చూశాడని పేర్కొంటూ ఆమె ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో లీక్ అవ్వడంతో తీవ్ర దుమారం రేగింది. తన చనిపోయిన భార్య గురించి అవమానకరంగా మాట్లాడిందని పేర్కొంటూ వసీం అక్రమ్ లాయరు ద్వారా రేహమ్ఖన్కు నోటీసులు కూడా పంపించాడు. -
వివాదంలో హీరో ‘అనధికార’ బయోగ్రఫీ
ముంబై: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా అనధికారికంగా విడుదలైన ‘ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బాడ్ బాయ్’ పుస్తక రచయిత, పబ్లిషర్స్‌పై సంజయ్ దత్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమతున్నారు. త్వరలోనే నిజమైన, అధికారిక బయోగ్రఫీ విడుదల అవుతుందని సంజయ్ దత్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. బాలీవుడ్స్ బాడ్ బాయ్స్ పుస్తక రచయిత యాస్సర్ ఉస్మాన్‌కు, పబ్లిషర్ జుగ్గర్నాట్కు నోటీసులు పంపారు. అలాగే వీరికి తాను తన బయోగ్రఫీ రాసేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. పుస్తకంలో తాము ఎటువంటి సమాచారం జొప్పించలేదని, కేవలం పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం మాత్రమే ప్రచురించడానికి ఉపయోగించామని పబ్లిషర్ జుగ్గర్‌నాట్ తెలిపింది. గతంలో పత్రికల్లో ప్రచురితమైన సమాచారం, తాను ఇచ్చిన ఇంటర్వ్యూలు, 1990 దశకంలో గాసిప్ మ్యాగజైన్లు రాసిన ఊహాజనితమైన సమాచారం ఆధారంగా చేసుకుని పుస్తకం రాశారని, అందులో తప్పుడు సమాచారం ఉందని సంజయ్ పేర్కొన్నారు. ఈ విషయం తనను, తన కుటుంబసభ్యులకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. సునీల్ దత్, నర్గీస్ ఎలా, ఎప్పుడు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సంజయ్ దత్ జననం, బోర్డింగ్ స్కూల్లోసంజయ్ దత్ జీవనం, తల్లి నర్గీస్ మరణం, సోదరి,తండ్రితో సంజయ్ బంధం, మాదక ద్రవ్యాలకు బానిస కావడం, వాటి నుంచి బయటపడటం, సంజయ్ పెళ్లి, అండర్‌వరల్డ్‌తో సంబంధాలు, ముంబై బాంబు పేలుళ్ల కేసు, ప్రస్తుతం సంజయ్ దత్ పరిస్థితి తదీతర విషయాలు ‘ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బాడ్ బాయ్’లో చర్చకు వచ్చాయి. -
ఉయ్యాలవాడ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు కేవీఆర్ కళాశాల అధ్యాపకులు ఇమానుయేల్, ఆనందారెడ్డి రచించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి తుగ్గలిలో శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సేవాదళ్ నాయకుడు సత్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో మిథాలీ రాజ్ ఆత్మకథ
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్వీయచరిత్ర పుస్తక రూపం దాల్చనుంది. బ్యాట్ పట్టి పరుగుల వరద సృష్టించే ఈ సీనియర్ క్రికెటర్ ఇప్పుడు ఆత్మకథ రాసేందుకు కలం పట్టింది. ఇందులో ఆమె తన వ్యక్తిగత, వృత్తిగత (కెరీర్) విషయాలను వెల్లడించనుంది. తన జీవిత చరిత్రను అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందని మిథాలీ రాజ్ తెలిపింది. ప్రచురణ హక్కులను పెంగున్ ర్యాండమ్ హౌజ్ అనే పబ్లికేషన్ సంస్థ చేజిక్కించుకుంది. వచ్చే ఏడాది ఈ పుస్తకం అందుబాటులోకి రానుందని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. -
మన అక్కినేని... మన కళ్లకు కట్టినట్లు!
‘‘తెలుగువారు మరచిపోలేని, మరచిపోకూడని, మరచిపోని గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అటువంటి గొప్ప వ్యక్తిపై ‘మన అక్కినేని’ పేరుతో చక్కటి పుస్తకాన్ని సంజయ్ కిశోర్ తీసుకు రావడం చాలా సంతోషం’’ అన్నారు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రముఖ సినీ పరిశోధకులు సంజయ్ కిశోర్ రచించి, సేకరించి, రూపొందించిన ‘మన అక్కినేని’ ఫొటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణ వేడుకకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ– ‘‘అక్కినేనిగారు అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్నీ, వారి జీవితంలో వివిధ పార్శా్వలను చిత్రసమేతంగా మన కళ్ళకు కట్టినట్లు ఈ పుస్తకంలో చూపించారు. ఏయన్నార్ గొప్పతనాన్నీ, నాటి తెలుగు సినిమా వైభవాన్నీ ప్రజలంతా చూసుకునే అవకాశాన్ని ఈ పుస్తకం ద్వారా కల్పించిన సంజయ్ కిశోర్‌ని అభినందిస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఒక పుస్తకమే.. ఆయన విడాకులకు కారణం
టాలెంట్ ఉన్నవారి వెనుక వివాదాలు కూడా ఉంటాయి. అందులోనూ సెలబ్రిటీల విషయంలో అయితే వాటికి కొదవే లేదు. ప్రముఖ జర్నలిస్టు అయిన తన భార్య నందితా పురి నుంచి ఓంపురి విడిపోవడం కొన్నేళ్ల క్రితం పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. ఓంపురి జీవిత చరిత్రను 'అన్లైక్లీ హీరో: ఓంపురి' పేరుతో నందిత రాశారు. 14 ఏళ్ల వయసులోనే ఓంపురి నెరపిన శృంగారలీలల గురించి అందులో రాశారు. ఈ పుస్తకం 2009లో బయటకు వచ్చింది. అయితే, పుస్తకంలో ఆమె రాసిన విషయాలకు తాను తన ఆమోదం తెలపలేదని ఓంపురి అన్నారు. తన కేర్‌టేకర్‌గా ఉండే మహిళతో 14 ఏళ్ల వయసులో ఓంపురి తొలిసారి శృంగార అనుభవాన్ని పొందారని ఆ పుస్తకంలో నందిత రాశారు. లక్ష్మి అనే మహిళతో కూడా ఆయనకు చాలా కాలం సంబంధం ఉండేదని అందులో పేర్కొన్నారు. అయితే లక్ష్మి గురించి నందిత చాలా అసహ్యంగా రాశారని, ఆమె తన పిల్లలను, తన సోదరుడి అనాథ పిల్లలను పెంచారని ఆ తర్వాత ఓంపురి చెప్పారు. ఆమె తన పట్ల ఎంతో విశ్వాసంతో ఉండేవారని కూడా తెలిపారు. ఈ పుస్తకం కారణంగానే ఓంపురి-నందిత విడిపోయారని ఇద్దరికీ సన్నిహితంగా ఉండే కొందరు చెప్పారు. పుస్తకం ప్రింటింగ్‌కు వెళ్లడానికి ముందు స్క్రిప్టు తనకు చూపించమంటే నందిత చూపించలేదన్నది అప్పట్లో ఓంపురి వాదన. ఓంపురి తొలుత అన్నూకపూర్ సోదరి సీమా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ, 1991లో వాళ్లు పెళ్లయిన 8 నెలల తర్వాతే విడిపోయారు. 1993లో నందితను పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరికీ ఇషాన్ అనే కొడుకు ఉన్నాడు. నిజాయితీగా ఉండటాన్ని ఓంపురి ఇష్టపడతాడు గానీ, చాలాసార్లు అది ఎంచుకున్న నిజాయితీయే అవుతుందని నందిత ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల క్రితం ఓంపై నందిత గృహహింస కేసు పెట్టారు. ఆ తర్వాత 2003లో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఓంపురి అంత్యక్రియలను ఆయన కొడుకు ఇషాన్ నిర్వహించాడు. మాజీ భార్య అయిన నందిత కూడా ఆ అంత్యక్రియలకు హాజరయ్యారు. -
మహానటిసావిత్రిగా...
తెలుగుతెరపై కథానాయికల ప్రస్తావన వస్తే... సావిత్రికి ముందూ, సావిత్రికి తర్వాత అనే స్థాయిలో ఆ మహానటి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అందంలోనూ, అభినయంలోనూ సావిత్రికి ఎవరూ సాటి రాలేరని ఆమె అభిమానులు చెబుతుంటారు. ఇప్పటికీ ఎవరైనా కథానాయిక అద్భుతంగా నటిస్తే ఆమెతో పోలుస్తారు. అటువంటి మహానటి జీవితకథ ఆధారంగా సినిమా తీయనున్నట్టు ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినప్పట్నుంచీ సావిత్రిగా ఎవరు నటిస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది. ఆ అదృష్టం సమంతకు దక్కిందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘తెలుగులో కొత్త చిత్రాలకు సంతకం చేశా. అవేంటో ఇప్పటికిప్పుడు చెప్పేయాలనిపిస్తోంది’’ అని ఇటీవల సమంత పేర్కొన్నప్పటికీ, అసలు విషయం చెప్పలేదు. ఆమె పేర్కొన్న చిత్రాల్లో ‘సావిత్రి’ జీవితకథ ఒకటని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మించనున్నారు. అన్నట్లు.. నాగ అశ్విన్, ప్రియాంకా దత్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. -
సచిన్ ‘ఆత్మకథ’కూ అవార్డు
న్యూఢిల్లీ: ఇప్పుడు తన ఆత్మకథతో కూడా అవార్డు దక్కించుకున్నాడు. రెండేళ్ల క్రితం విడుదలైన అతని స్వీయచరిత్ర ‘ప్లేరుుంగ్ ఇట్ మై వే’ అభిమానులు, పుస్తక ప్రియుల ఆదరణతో తాజా గా రేమండ్ క్రాస్‌వర్డ్ పాపులర్ అవార్డును సొంతం చేసుకుంది. అమ్మకాల రికార్డుతో ఈ ఏడాది ఆరంభంలో ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్న ఈ ఆత్మకథకు ఇప్పుడు పాపులర్ చారుుస్ అవార్డు లభించడం పట్ల క్రికెట్ దిగ్గజం... ప్రచురణ కర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. -
చాలిక..దిగండి..?
-
పాతికేళ్ల షారూఖ్
కెరీర్‌ని మొదలెట్టిన పాతికేళ్ల తర్వాత కూడా కింగ్ కింగ్‌లానే ఉన్నాడు. బంటు కాలేదు. బంట్రోతు కాలేదు. కొత్త నీరు ఎంతొచ్చినా వైరి పక్షాలు ఎందరిని నిలబెట్టినా నేటికీ షారుఖ్ నం.1గానే ఉన్నాడు. ఆమిర్, సల్మాన్ ఎన్ని సక్సెస్‌లు కొట్టినా ఎప్పుడూ క్రీజ్‌లో ఒక అడుగు ముందున్నాడు. ఇటీవలే 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న షారూఖ్ ఈ నెల 23న ‘డియర్ జిందగీ’ సినిమాతో ముందుకు రానున్నాడు. ఆలియా భట్ హీరోయిన్. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’కు దర్శకత్వం వహించిన గౌరీ షిండే దర్శకురాలు. ఈ నేపథ్యంలో అతడి పాతికేళ్ల సినీ జీవితంపై ‘ఎస్ఆర్కె 25 ఇయర్స్ ఆఫ్ లైఫ్’ బయోగ్రఫీ విడుదల కావడం అతడికి ఆనందాన్నిచ్చింది. దర్శకుడు సమర్ఖాన్ దీని రచయిత. ముంబైలో ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న షారూఖ్ ‘ఢిల్లీ నుంచి నా వంటి సాదాసీదా కుర్రాడు వచ్చి ఇంతదాకా ఎదగడం ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చూడటానికి పెద్దగా బాగోను. నా మాట కూడా స్పీడ్‌గా ఉంటుంది. అయినా ఇంతవాణ్ణయ్యానంటే దర్శక నిర్మాతలు, అభిమానులే కారణం’ అన్నాడు.