అంజలీదేవి ఆత్మకథ | Raavi Kondala Rao regrets not completing Anjali Devi`s biography | Sakshi
Sakshi News home page

అంజలీదేవి ఆత్మకథ

Published Wed, Jan 15 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

అంజలీదేవి ఆత్మకథ

అంజలీదేవి ఆత్మకథ

 ‘‘అంజలీదేవి ఆత్మకథను సకాలం పూర్తచేయలేకపోవడం బాధిస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా తన కథకు పుస్తకరూపం కల్పించడానికి నాతో కలిసి అంజలి ఎంతో కృషి చేశారు. ఈ పుస్తక యజ్ఞం పూర్తి కాకముందే అర్ధాంతరంగా ఆమె తనువు చాలించడం దురదృష్టకరం’’ అని రావికొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. అంజలితో కలిసి గత కొన్ని రోజులుగా అంజలి ఆత్మకథ రాసే పనిలో నిమగ్నమై ఉన్నాయాన. ఈ పుస్తకం వివరాలను ఆయన విలేకరులతో వెలిబుచ్చారు. ‘‘ఇది అంజలీదేవి ఆత్మకథ. ఇందులో ఏ మాత్రం సందేహం అనవసరం. ఆమె అనుభవాల్ని, ఆలోచనల్ని ఆమె సాక్షిగా రాసిన పుస్తకం ఇది. దీనికి పుస్తకరూపం కల్పించడం మాత్రమే నా పాత్ర’’ అని తెలిపారు రావి. 
 
 మరికొన్ని విశేషాలు చెబుతూ -‘‘తన జీవితంలో చోటు చేసుకున్న ఉత్థాన పతనాలను, వ్యక్తిగత విషయాలను ఈ పుస్తకం కోసం స్వయంగా వెల్లడించారు అంజలి. ఆమె జీవితంలో చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితుల్లో చిత్ర రంగానికి చెందిన వ్యక్తుల వాటా చాలా ఉంది. ఆ విశేషాలన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి. అంజలీదేవి కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ పుస్తకాన్ని పూర్తి చేస్తాను’’ అని తెలిపారు. ఇంకా పుస్తకానికి పేరు ఖారారు కాలేదని.. త్వరలోనే మంచి పేరును ఫైనలైజ్ చేస్తామన్నారు ఈ సందర్భంగా రావి కొండలరావు వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement