Anjali Devi
-
స్త్రీలోక సంచారం
50 మీటర్ల మహిళల బ్యాక్ స్ట్రోక్ స్విమ్మింగ్‌లో ఇప్పటి వరకు ఉన్న 27 సెకన్ల ప్రపంచ రికార్డును.. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రస్తుతం జరుగుతున్న ‘ఏషియన్ గేమ్స్’లో 26.98 సెకన్లలో బ్రేక్ చేసిన 21 ఏళ్ల ల్యూ జియాంగ్.. చైనా దేశపు కొత్త ‘అందాల దేవత’గా అవతరించారు. ల్యూ జియాంగ్కి ప్రపంచంలోని టాప్ మోడల్స్‌లో ఒకరైన చైనా అందాల రాశి ల్యూ వెన్‌తో దగ్గరి పోలికలు ఉండడంతో.. ‘వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు కాదు కదా’ అంటూ ఆ దేశపు యువకులు.. ల్యూ జియాంగ్ బంగారు పతకం సాధించిన మరుక్షణం నుంచే ఆమెను ‘స్విమ్మింగ్ గాడెస్’గా ఆరాధించడం మొదలుపెట్టారు! ఏషియన్ గేమ్స్‌లో గత ఇరవై ఏళ్లుగా మహిళల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం కోసం నిరీక్షిస్తూ ఉన్న జపాన్ టీమ్.. 3–1 తేడాతో చైనాపై విజయం సాధించి వరుసగా గత ఐదు ఏషియన్ గేమ్స్‌లో విజేతగా నిలుస్తూ వస్తున్న చైనా జైత్రయాత్రను బ్రేక్ చేసింది! చైనాను ఆరవ టైటిల్ గెలవనివ్వకుండా చేసిన ఈ టీమ్ గేమ్‌లో జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహరా కీలక పాత్ర పోషించారు. కెనడా మహిళ ఒకరు.. కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వాగ్వాదంలో ప్రవాస భారతీయుడైన రాహుల్ కుమార్ అనే వ్యక్తిని.. ‘‘పెంట మొహమోడా! నీ దేశానికి వెళ్లిపో. వెళ్లిపోరా దౌర్భాగ్యుడా.. పాకీ వాడా’’ (లూజర్, షిట్–కలర్డ్ స్కిన్, పాకీ.. గో బ్యాక్ టు యువర్ కంట్రీ) అని దూషించడం వివాదం అయింది. దీనిపై అక్కడి సి.టీవీ ప్రతినిధి.. ఆ మహిళతో.. ‘‘ఇవి జాతి, వర్ణ వివక్షలతో కూడిన వ్యాఖ్యలు కదా’’ అన్నప్పుడు.. ‘‘కోపంలో అలా అనేశాను తప్ప, నాకెలాంటి వివక్షలూ లేవు’’అని ఆమె సమాధానమిచ్చారు. గుక్క పట్టి ఏడుస్తున్న ఒక పసిబిడ్డకు చనుబాలిచ్చి ఊరడించిన సెలెస్ట్ జాక్వెలీన్ అయాలా అనే సాధారణ పోలీసుకు అర్జెంటీనా ప్రభుత్వం పోలీసు అధికారిగా పదోన్నతి కల్పించింది. గస్తీ విధుల్లో భాగంగా జాక్వెలీన్.. తన వాహనంలో బెరిసో ప్రాంతంలోని ఆసుపత్రి సమీపానికి వచ్చినప్పుడు పౌష్టికాహార లేమితో ఆకలికి ఏడుస్తున్న బిడ్డ ఏడుపు వినిపించి, అక్కడికి వెళ్లి, ఆ ఏడుస్తున్నది.. తల్లి వదిలేసి వెళ్లిన బిడ్డ అని తెలుసుకుని, ఆసుపత్రి అధికారుల అనుమతితో ఆ బిడ్డకు తన స్థన్యం ఇచ్చి ఆకలి తీర్చడం స్థానికుల అభిమానానికి, పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలకు ఆమెను పాత్రురాలిని చేసింది. నిండు గర్భిణి అయిన న్యూజిలాండ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రి జూలీ యాన్ జెంటర్.. గత ఆదివారం పురుటి నొప్పులు వస్తుండగా తనే స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ అక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఎలాంటి హడావిడీ, అధికార ఆర్భాటమూ లేకుండా, నొప్పులొస్తున్నప్పుడు గర్భిణికి ఉండే సర్వసాధారణమైన భయాన్ని కూడా కనబరచకుండా ఆదర్శంగా నిలిచిన ఒక మంత్రి తనొక్కరే, అదికూడా సైకిల్ మీద పెడలింగ్ చేస్తూ వెళ్లి ఆసుపత్రిలో చేరడం ఆ దేశంలో ఇప్పుడొక విశేషం అయింది. జెన్ సదావర్తె అనే పదేళ్ల బాలిక చూపిన సమయస్ఫూర్తి.. ముంబై దాదర్ ప్రాంతంలోని 17 అంతస్తుల నివాస భవనం ‘క్రిస్టల్ టవర్స్’లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నుంచి అనేకమందిని కాపాడగలిగింది. డాన్ బాస్కో స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న జెన్.. మూడో తరగతిలో ఉండగా స్కూలు ప్రాజెక్టులో తను నేర్చుకున్న టిప్స్ కొన్నింటిని (ఉదా: దూది, నీళ్లు, గుడ్డ ముక్కలతో ప్యూరిఫయర్లను తయారు చేసి చుట్టూ ఉన్న వాళ్లకు ఇవ్వడం) గుర్తుపెట్టుకుని తాము ఉంటున్న 16ల అంతస్తులో ఉన్నవారందరికీ అందించడం ద్వారా మృతుల సంఖ్యను నాలుగుకు, గాయపడిన వారి సంఖ్యను పదహారుకు పరిమితం చేయగలిగింది. నాలుగేళ్ల క్రితం.. 86 ఏళ్ల వయసులో జనవరి 13న గుండెపోటుతో మరణించిన తెలుగు సినీ నటీమణి అంజలీదేవి జయంతి నేడు. 1927లో ఇదే రోజు పెద్దాపురంలో ఆమె అంజనీకుమారిగా జన్మించగా, సినిమాల్లోకి వచ్చాక దర్శకులు పి. పుల్లయ్య ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు. సంగీత దర్శకులు, నిర్మాత, గీత రచయిత అయిన పి.ఆదినారాయణ రావు ఆమె భర్త. అంజలీదేవి దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించగా.. అనార్కలి, సువర్ణసుందరి, చెంచులక్ష్మి, జయభేరి.. వంటి చిత్రాలు ఆమెకు అవార్డులను తెచ్చిపెట్టాయి. ూ ఇంట్లో ఒక్కతే ఉన్న గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నప్పుడు.. బయటికి వెళ్లిన ఆమె తల్లిదండ్రులు ఆకస్మాత్తుగా తిరిగి రావడంతో, తనకు వేరే దారిలేక ఆ గర్ల్‌ఫ్రెండ్ బట్టల బీరువాలో దాక్కుని తలుపు వేసుకున్నానని, అయితే.. వస్తున్న తుమ్మును తను ఆపుకోలేకపోవడంతో గుట్టు బట్టబయలు అయినప్పటికీ, తన వినయ విధేయతలు వారికి నచ్చడంతో తనను ఏమీ అనలేదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. వచ్చే శుక్రవారం విడుదల అవుతున్న హారర్ కామెడీ ఫిల్మ్ ‘స్త్రీ’ (ఇందులో సల్మాన్ నటించలేదు) ప్రమోషన్ షోలో భాగంగా ఆ చిత్రం హీరో హీరోయున్లు రాజ్‌కుమార్‌రావ్, శ్రద్ధాకపూర్లతో పై సంఘటనను సల్మాన్‌ఖాన్ షేర్ చేసుకున్నారు. -
అంజలీదేవికి నివాళి
పెద్దాపురం : నటనతో ప్రజలందరినీ మెప్పించిన కలియుగ సీత అంజలీ దేవి అని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. పెద్దాపురం పట్టణ ఆడపడుచు అంజలీ దేవి మూడో వర్ధంతిని బుధవారం సాయంత్రం నిర్వహించారు. అంజలీదేవి ఫౌండేష¯ŒS చైర్మ¯ŒS, ప్రముఖ పారిశ్రామిక వేత్త గోలి రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆమెను నేటి కళాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గోలి రామారావు మాట్లాడుతూ అంజలీదేవి పెద్దాపురం పట్టణంలో జన్మించిడం గర్వకారణమన్నారు. అంజలిదేవి తనయుడు పీయూఎస్ చిన్నారావు మాట్లాడుతూ తన తల్లిపై పట్టణ ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలను చూస్తే గర్వకారణంగా ఉందన్నారు. ఫౌండేష¯ŒS కన్వీనర్ పొలమరశెట్టి సత్తిబాబు, అంజలిదేవి మేనల్లుళ్లు గోళ్ల బాబీ, గోళ్ల శ్రీను మాట్లాడారు. తొలుత అంజలీదేవి విగ్రహానికి ఎమ్మెల్సీ బొడ్డు, గోలి తదితరులు క్షీరాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వి.ముని రామయ్య, మున్సిపల్ వైస్ చైర్మ¯ŒS త్సలికి సత్య భాస్కరరావు, కౌన్సిలర్లు వాసంశెట్టి గంగ, గోకిన ప్రభాకరరావు, విజ్జపు రాజశేఖర్, తూతిక రాజు, పాగా సురేష్‌కుమార్, అభిమాన సంఘం కార్యదర్శి వెలగల కృష్ణ పాల్గొన్నారు. -
ఇంటింటి రాట్నం
గిర్రుమని తిరుగుతుంది రంగులరాట్నం.గిర్రుమని తిరుగుతాయి... కళ్లలో నీళ్లు.ఒకసారి ప్రేమ పైనుంటుంది.మరోసారి పగ పైనుంటుంది.కానీ ఈ జీవితరాట్నం... తిరిగినంతసేపూ ఏదీశాశ్వతంగా పైన ఉండదు అని అర్థం అవుతుంది.మన ఇళ్లల్లో కూడా ఇలాంటి తల్లి, తండ్రి,అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, కొడుకులు కోడళ్లు, వాళ్ల ఆత్మీయతలు, అపార్థాలు, మనస్పర్థలు కనబడతాయి.సినిమాలో చివరికి రాజకీయం ఓ పెద్ద ఘట్టంలాకనబడుతుంది. కానీ సినిమా అంతటా కుటుంబంలో ఉన్న రాజకీయం కీలక పాత్ర పోషిస్తుంది.ఎవరూ చెడ్డవాళ్లు కాదు. అందరూ మంచివాళ్లే.కానీ ఒకరికొకరు ఎల్లవేళలా మంచివాళ్లు కాదు.అది.. ఈ రంగులరాట్నం మనందరికీ తిరుగులేకుండా చెప్పేది.మనల్ని తిరిగి తిరిగి ఆలోచించేలా చేసేది. ‘తల్లీ, తరతరాలుగా మా కుటుంబాన్ని చల్లగా చూశావ్. ఈనాడు కాని దేశాలకు ప్రయాణం చేయిస్తున్నావ్. మమ్మల్ని ఒక కంట కనిపెట్టి కాపాడే భారం నీదే తల్లి’.గ్రామదేవతను వేడుకుంది అంజలీదేవి. అమె భర్త సుందర్రామయ్య (కృష్ణమూర్తి), పెద్ద కొడుకు సూర్యం (రామ్మోహన్), చిన్న కొడుకు వాసు (చంద్రమోహన్), కూతురు జయ (విజయనిర్మల).. అంతా దేవతకు దండం పెట్టుకున్నారు.ఒకప్పుడు పదిలక్షల ఆస్తికి వారసుడైన సుందర్రామయ్య వాటాలో ఇప్పుడు అప్పులు పోగా మిగిలిన ఆస్తి మూడెకరాలు. ఆ మూడెకరాలను అమ్ముకుని, పిల్లలకైనా చదువు చెప్పించుకుని ప్రయోజకులను చేద్దామన్న ఆశతో భార్యాబిడ్డల్ని తీసుకుని పట్టణానికి బయల్దేరాడు. శ్రీ మోహన విలాస్ కాఫీ హోటల్లో వాడుకగా నూనె డబ్బాలు వేస్తున్నాడు సుందర్రామయ్య. సడన్‌గా ఆ హోటల్ యజమాని దివాలా తీశాడు. సుందర్రామయ్యకు కుప్పకూలిపోయి, గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబ భారం అంజలీదేవిపై పడింది. ‘సీతమ్మా.. మన ఊరొచ్చెయ్’ అన్నారు బంధువులు. అంజలీదేవికి భర్త మాటలు, సూర్యపై ఆయన పెట్టుకున్న ఆశలు గుర్తొచ్చాయి. ‘రాను. నేను ఈ ఊరు విడిచి రాను. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ ఊరు వచ్చారో... అది నెరవేరి తీరాలి. అది నెరవేరి తీరాలి’ అంది. భర్త ఆశయం ప్రకారం అక్కడే ఉండి సూర్యాన్ని లాయర్ని చేయాలని తీర్మానించుకుంది. అందుకోసం ఎంత కష్టాన్నయినా భరించాలనుకుంది. పాలు అమ్ముతోంది. దోసెలు పోస్తోంది. సూర్య చక్కగా చదువుకుంటున్నాడు. కానీ తల్లిపడే కష్టమే తెలియడం లేదు. వాసు చదువుకుంటూనే, తల్లి కష్టానికి చేదోడుగా ఉంటున్నాడు. వాసుకు స్పోర్ట్స్‌లో, కుస్తీ పోటీల్లో బోలెడన్ని కప్పులు, మెడల్స్! వాటన్నిటినీ ప్రాణ సమానంగా చూసుకుంటున్నాడు. వ్యాయామశాల ప్రొఫెసర్ శంకర్రావుకు వాసు ప్రియశిష్యుడు. వాళ్ల అమ్మాయికి (పెద్దయ్యాక వాణిశ్రీ) వాసు అంటే అభిమానం. అంజలీదేవి కష్టపడుతోంది. దగ్గుతూ వాకిలి ఊడుస్తోంది. దగ్గు ఎక్కువైంది. జ్వరం వచ్చింది. పని చేయలేకపోతోంది. సూర్య తల్లిదగ్గరకు వచ్చాడు. ‘అసలీ దోసెలు వ్యాపారం వల్లే నీకు జ్వరం వచ్చింది. మీ అమ్మ దోసెలు అమ్ముతోందని అంతా నన్ను ఎగతాళి చేసేవారే’ అన్నాడు. ‘నీకోసం ఈ దోసెల వ్యాపారమే కాదు, ఇంటింటా ముష్టెత్తమన్నా సంతోషంగా చేస్తానయ్యా.. సూరీ’ అంది ఆ అమ్మ. పరీక్ష ఫీజు 50 రూపాయలు రేపే కట్టాలన్నాడు సూర్య. పాతబాకీ కోసం ఎన్నాళ్లని తిరగనూ అన్నాడు అప్పులిచ్చిన కిట్టయ్య అప్పుడే వచ్చి. ‘రేపట్లోగా 150 చెల్లించాలి. లేకుంటే చెంబూ తపేళా పడేస్తాను’అన్నాడు కిట్టయ్య. ‘అంతవరకు రానివ్వను. ఎలాగైనా డబ్బు తెస్తాను’ అన్నాడు వాసు. అన్నట్టే డబ్బు తెచ్చాడు! ‘ఎక్కడిదిరా ఇంత డబ్బు?’... అన్న అడిగాడు. ‘నువ్వేం కంగారు పడకు ఎక్కడా కన్నం వేయలేదులే’.. తమ్ముడు చెప్పాడు. ‘ఇంత డబ్బు ఎక్కడ తెచ్చావురా’.. అమ్మ భయంగా అడిగింది. ‘కప్పులు, మెడల్స్ అమ్మేశాను’ ఏడుస్తూ చెప్పాడు. ‘వాసూ... నా చిట్టి తండ్రీ... ఊరుకో’ అంది అమ్మ. సూర్య లాయర్ అయ్యాడు. మున్సిపల్ చైర్మన్ అప్పలస్వామి (రమణారెడ్డి) సూర్యను తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. లాయర్ అండ ఉంటే తన అక్రమ వ్యాపారాలు సక్రమంగా సాగుతాయని అతడి ప్లాన్. అన్నకొడుకు సుబ్బారాయుడి చేత కూతురికి చెప్పించాడు... సూర్యను చేసుకుంటే వచ్చే లాభం ఏమిటో. ఆమె కూడా తన లాభం తను చూసుకుంది. పెళ్లికి ముందు అతనితో కొన్ని షరతులు మాట్లాడాలి అంది. నా వ్యక్తిత్వానికి భంగం రాకూడదు. నేచెప్పినట్లు అతను నడుచుకోవాలి. అతను మనింట్లో ఉండాలే కానీ వాళ్లింటికి నేను వెళ్లను. అత్త ఆడబిడ్డ నా చెప్పుచేతల్లో ఉండాలి. నాకు తెలీకుండా వాళ్ల బంధువులెవరూ మనింటికి రాకూడదు. సపోజ్ వచ్చారనుకో... మనం చెప్పినట్లు నడుచుకోవాలి. కోర్టులో ఎన్ని పనులున్నా రోజూ క్లబ్బులకి, సినిమాలకి నాతో రావాలి. ఈ షరతులన్నిటికీ అతను ఒప్పుకుంటాడేమో కనుక్కో అంది. కనుక్కోనవసరం లేదన్నాడు సుబ్బారాయుడు. అక్కణ్ణుంచి సూర్య దగ్గరకు వెళ్లాడు. ‘వనజ మా బాబాయికి ఒక్కతే కూతురు. బోలెడంత ఆస్తి. చచ్చేటంత పలుకుబడి. మరో రహస్యం. ఈ రోజుల్లో మగాడు పైకి రావాలీ అంటే పెళ్లాం ఫార్వార్డ్ అండ్ ఫ్యాషనబుల్‌గా ఉండాలి. మా వనజలాంటి పెళ్లామే ఉంటే నీకు ఏనాటికైనా విదేశీ యాత్ర. ఏమంటావ్’ అన్నాడు. ఏమంటాడు? ఒకే అన్నాడు సూర్య. అమ్మను కూడా ఒప్పించాడు. పెళ్లయిపోయింది. అప్పలస్వామి హ్యాపీ. సూర్యం, అతడి భార్య, తల్లి, తమ్ముడు, చెల్లి వేరే కొత్తింట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఇంకో ట్రాక్‌లో సూర్య చెల్లికి, ఆమె స్నేహితురాలు అన్నయ్య అయిన వేణుకి మనసులు కలిసాయి. మరో ట్రాక్‌లో చంద్రమోహన్‌కి, ప్రొఫెసర్ శంకర్రావు కూతురు వాణీశ్రీకి మధ్య ప్రేమ. కోటీశ్వరుడి కొడుకైన వేణుతో విజయనిర్మల పెళ్లి జరిగింది. మెట్టినింటికి వెళ్లిపోయింది. తన భర్త ఫొటోని స్టోర్ రూమ్‌లో పడేయడంతో కలత చెందిన అంజలీదేవి కూడా ఇల్లొదిలి వెళ్లి చిన్న కొడుకు చంద్రమోహన్ దగ్గర ఉంది. చంద్రమోహన్ ఉండేది తన గురువుగారి దగ్గర పార్క్ వీధి ఇంట్లో. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. వాసుని కన్విన్స్ చేసి అతడి చేత నామినేషన్ వేయించారు గురువు శంకర్రావు దగ్గరుండే అతడి శ్రేయోభిలాషులు.అప్పలస్వామి మీద అదే వార్డుకి నిలబడ్డాడు వాసు. అప్పలస్వామి, సుబ్బరాయుడు. ఐడియా వేశారు. వాసు మీదకి అతడి అన్న సూర్యాన్ని పోటీగా నిలబెట్టారు. ‘సూర్యం నెగ్గితే మనం నె గ్గినట్టే. సూర్యం ఓడితే ఇక అన్నదమ్ములు మొహమొహాలు చూసుకోరు. ఇక ఆ దెబ్బతో వాసుగాడి పీడా విరగడైపోతుంది’ ఇదీ పథకం. ‘‘అమ్మా... అన్నయ్యల మధ్య ఈ పోటీ ఆపాలమ్మా. అన్నయ్యలిద్దరూ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దెబ్బలాట కూడా జరగొచ్చంటున్నారు. నాకేదో భయంగా ఉందమ్మా’ అంది విజయనిర్మల. ‘భయపడి చేసేదేముందమ్మా... ఇది అన్నదమ్ముల మధ్య పోటీ కాదు. భగవంతుడు నాకు పెట్టిన పరీక్ష అని ఆ తల్లి హృదయం ఆక్రోశించింది. వాసు గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఖరి నిమిషంలో రమణారెడ్డి మరో పథకం వేశాడు. సూర్యం చేత తల్లికి చెప్పించి ఎన్నికల నుంచి వాసు ఉపసంహరించుకునేలా చేశాడు. ‘ఈ ఎలక్షన్ నుంచి వాసు తప్పుకుంటాడు’ అని చంద్రమోహన్ గురువు ప్రకటించాడు. సూర్య ఏకగ్రీవం అయ్యాడు. మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యాడు.మిగిలింది చంద్రమోహన్, వాణిశ్రీల పెళ్లి. ముహూర్తం రోజు రానే వచ్చింది. చంద్రమోహన్, వాణిశ్రీల పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి సూర్యం రాలేదు. నోటీసులు వచ్చాయి! శంకర్రావు ఇల్లు జప్తు. పార్క్ లెసైన్సు రద్దు. ఇదీ సారాంశం. పెళ్లయిపోయింది. నోటీసులు చూసి గురూజీ కుప్పకూలిపోయాడు. ‘వాడు మనిషో, రాక్షసుడో ఇప్పుడే తెలుస్తాని అని అన్న దగ్గరికి బయల్దేరాడు వాసు. ‘మీ పాదాల పట్టుకుని ప్రమాణం చేసి చెప్తున్నాను. పార్క్ నోటీసు రద్దన్నా కావాలి. లేదా మా అమ్మకు ఒక్కడే కొడుకు మిగలాలి’ అని బయల్దేరాడు. అతడి వెనకే జనం. అన్నదమ్ములిద్దరూ కొట్టుకుంటున్నారు. రక్తాలు కారుతున్నాయి. తల్లి పరుగెత్తుకొచ్చింది. సూర్య విసిరిన టీపాయ్ తల్లి తలకు తగిలింది. ఆమె నేలపై ఒరిగిపోయింది. సూర్యంలో పరివర్తన మొదలైంది. కొడుకులిద్దరి రక్తాన్ని చూసి ఆ తల్లి దుఃఖించింది. ఈ ఘోరం చూడ్డానికేనా నన్ను బ్రతికించావు అని దేవుడిని అడిగింది. ‘ఈ పాపమంతా నాదేనమ్మా,. నిన్ను గాయపరిచిన ఈ చేతులు... ’ అంటూ రోదిస్తున్నాడు సూర్యం. ‘ఇది ఏపాటి గాయం నాయనా. ద్వేషాలతో, ఈర్ష్యలతో, స్వార్థాలతో, స్వాభిమానాలతో, పగలతో, ప్రతీకారాలతో, పశుప్రాయులై ఏనాడు మీ బ్రతుకును నరకంగా చేసుకున్నారో ఆ నాడే మీ తల్లి హృదయం గాయపడింది నాయనా... ’‘అమ్మా... నన్ను క్షమించమని కోరే అర్హత కూడా లేకుండా చేసుకున్నానమ్మా’ ఏడుస్తున్నాడు సూర్యం. ‘ఈ క్షణం నుంచి నీ పలుకే నాకు వేదవాక్కు. నీ పాదాలకు ప్రమాణం చేస్తున్నానమ్మా. ఆజ్ఞాపించమ్మా..’ అన్నాడు సూర్యం. ‘తల్లి తనకోసం ఏం కోరుతుంది నాయనా. ఏది కోరినా తన బిడ్డల కోసం. వాళ్ల ఆనందం కోసం. ముగ్గురు బిడ్డలను కన్న మీ తల్లి మొదలు 40 కోట్ల ప్రజలను కన్న భరతమాత వరకు ఏ తల్లయినా మనసారా వాంఛించేది ఒక్కటే. తన బిడ్డల అభ్యున్నతి. వాళ్ల ఆనందం. ఐకమత్యం. అన్యోన్యత’ అంది తల్లి. అదే ఊరు. అదే గ్రామదేవత. ఆమె ఆశీర్వాదం కోసం ఈ తల్లీ కొడుకులు ఆ దేవత ఎదుట నిలుచుని ఉన్నారు.మళ్లీ అదే పాట.. ‘కలిమి నిలవదు.. లేమి మిగలదు.. కలకాలం ఒక రీతి గడవదు. ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నము’ సినిమా ఎండ్. పాటలు 1. నడిరేయి ఏ జాములో స్వామి నినుచేరదిగివచ్చునో... 2. కనరాని దేవుడే కనిపించినాడే 3. వెన్నెల రేయి చందమామ వెచ్చగ ఉన్నది మావా 4. కోయిల కోయ్ అని పిలిచినది... ఓయ్ అని నా మది పలికినది. 5. కన్నుల దాగిన అనురాగం మన పెదవులకందని నవరాగం నటీ నటులు అంజలీదేవి (సీతమ్మ) చంద్రమోహన్ (వాసు), రామ్మోహన్ (సూర్య) వాణిశ్రీ (జమునారాణి), సుకన్య (సూర్య భార్య) రమణారెడ్డి (అప్పలస్వామి) పుష్పవల్లి (అప్పలస్వామి భార్య) కృష్ణమూర్తి (సుందర్రామయ్య) విజయనిర్మల (సూర్య, వాసుల చెల్లెలు) త్యాగరాజు (వస్తాదు శంకర్రావు) వివరాలు-విశేషాలు విడుదల: 1966 దర్శకత్వం: బి.ఎన్.రెడ్డి సంగీతం: ఎస్.రాజేశ్వర్‌రావు, బి.గోపాలం మాటలు: డి.వి.నరసరాజు నేపథ్యగానం: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, ఎస్. జానకీ తదితరులు పాటలు: కొసరాజు, దాశరథి, సి.నారాయణరెడ్డి -
వారంతా చిరంజీవులే!
గత సంవత్సర కాలంగా సినీ ప్రముఖులు అనేక మంది ఎన్నడు లేని విధంగా వరుసగా అసువులు బాయడం బాధాకరమైన విషయం. చిత్రపరిశ్రమ దిగ్ధంతులు ఒక్కొక్కరు అర్ధాంతరంగా, సహజంగా, అసహజంగా తెరమరుగవుతున్నారు. దీంతో సినీ అభిమానులు తమ ఆప్తులను కోల్పోయినట్లు విచారంలో మునుగుతున్నారు. మహా నటీనటులు అంజలిదేవి, అక్కినేని నాగేశ్వరరావు, దర్శకులు, రచయిత వి.బి.రాజేంద్రప్రసాద్, బాపు, బాలచందర్, గణేశ్ పాత్రో, యువ కథానాయకుడు ఉదయ్‌కిరణ్, క్యారెక్టర్ యాక్టర్ పి.జె.శర్మ, శ్రీహరి, ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి, ప్రేక్షకులను తమ హాస్య సంభాషణ, నటనలతో ఉర్రూతలూగించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ లాంటి తమకు తామే సాటైన హాస్యనటులు ఈ భూప్రపంచం నుండి, సినిమాలోకం నుండి జారిపోవడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో మన కళాకారులందరికీ ఒక విన్నపం. వారు ఆరోగ్యాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ జన్మలన్నీ అపురూపమైనవి. ఆ జిలుగుల ప్రపంచంలో ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. ఇకనైనా నటీనటులు ఆరోగ్యం కోసం జాగ్రత్త పడాలి. భౌతికంగా కనిపించకపోయినా వారు తీసిన సినిమాలు, చూపిన ప్రతిభ, అందించిన సంగీతం, నేడు మనకు కనిపించకపోయినా ఆయా చిత్రాలలో లీనమై చేసిన పాత్రలు ఎన్నటికీ జీవించే ఉంటాయి. ఎన్ని తరాలు గడిచినా కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. ఆ రకంగా వారు ఎప్పుడూ చిరంజీవులే. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. - జి.వి. రత్నాకర్‌రావు వరంగల్ -
వారంతా చిరంజీవులే!
గత సంవత్సర కాలంగా సినీ ప్రముఖులు అనేక మంది ఎన్నడు లేని విధంగా వరుసగా అశువులు బాయడం బాధాకరమైన విషయం. చిత్ర పరిశ్రమ దిగ్ధంతులు ఒక్కొక్కరు అర్థాంతరంగా, సహజంగా, అసహ జంగా తెరమరుగవుతున్నారు. దీంతో సినీ అభిమానులు తమ ఆప్తు లను కోల్పోయినట్లు విచారంలో మునుగుతున్నారు. మహానటీనటులు అంజలిదేవి, ఎ.నాగేశ్వరరావు, దర్శకులు, రచయిత బి.రాజేంద్ర ప్రసాద్, బాపు, బాలచందర్, గణేశ్ పాత్రో, యువ కథా నాయకుడు ఉదయ్‌కిరణ్, క్యారెక్టర్ యాక్టర్ పి.జె.శర్మ, శ్రీహరి, ఆహుతి ప్రసాద్, తెలంగాణా శకుంతల, సంగీత దర్శకుడు గాయకుడు చక్రి, ప్రేక్షకులను తమ హాస్య సంభాషణ, నటనలతో ఉర్రూతలూగించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ లాంటి తమకు తామే సాటైన హాస్యనటులు ఈ భూప్రపంచం నుండి, సినిమాలోకం నుండి జారిపోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. వారు భౌతి కంగా కనిపించకపోయినా వారు తీసిన సినిమాలు, అందించిన సం గీతం, వారు నేడు మనకు కనిపించకపోయినా వారు ఆయా పాత్రలతో లీనమైన సినిమాలు జీవించే ఉంటాయి. ఆ రకంగా వారు ఎప్పుడూ చిరంజీవులే. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. - జి.వి.రత్నాకర్‌రావు వరంగల్ -
సినీ నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ
పెద్దాపురం: అలనాటి మేటి నటి, నిర్మాత అంజలీదేవి విగ్రహాన్ని ఆమె కుమారుడు చెన్నారావు సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లవకుశ చిత్రంలో లవ, కుశ పాత్రలు పోషించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజలీదేవి స్మృతులను గుర్తు చేసుకున్నారు. గత ఏడాది జనవరి 12న అంజలీదేవి చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. వెండితెర సీతకు ప్రేక్షకులను అలరించిన అంజలీదేవి పెద్దాపురంలో జన్మించారు. -
వైఎస్ఆర్సిపి ఎంపిటిసి కుటుంబం కిడ్నాప్
హైదరాబాద్: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం నెమలపురి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ వేముల అంజలిదేవి కుటుంబాన్ని టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ ఏపీ అడిషనల్ డీజీపీ ఠాకూర్‌ను కలిశారు. వేముల అంజలీదేవి కుటుంబాన్ని కిడ్నాపర్ల నుంచి విడిపించాలని వారు ఠాకూర్‌కు వినతి పత్రం అందజేశారు. అధికారం కోసం కొందరు నేతలు కిడ్నాప్‌లకు తెగబడుతున్నారు. బలం లేకపోయినా దౌర్జన్యంగానైనా జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్ పదవుల కోసం కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. ఎంపీటీసీల బంధువులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డిని కలిసి టిడిపి నేతలపై ఫిర్యాదు కూడా చేశారు. టిడిపి నేతలపై కేసు నమోదు చేశారు. -
మోడరన్ అమ్మలు..గ్లామరస్ అత్తలు..!
కన్నాంబ, రుష్యేంద్రమణి, శాంతకుమారి, సూర్యకాంతం, హేమలత... ఒకప్పటి సినీ స్వర్ణయుగంలో అమ్మ పాత్రయినా, అత్త పాత్రయినా వాళ్లు చేయాల్సిందే! ఆ తర్వాత అంజలీదేవి, సావిత్రి, నిర్మలమ్మ, శారద, వాణిశ్రీ, అన్నపూర్ణ, శ్రీవిద్య లాంటి మేటి తారలు అమ్మలుగా, అత్తమ్మలుగా వెండితెరను అలరించారు. వీరిలో కొందర్ని మినహాయిస్తే.. మిగిలిన అందరూ తొలుత వెండితెరపై నాయికలుగా వెలిగినవారే. అయితే.. అమ్మ పాత్రల్లోకి టర్న్ అయ్యాక వారి దృక్కోణంలో మార్పొచ్చింది. వారి ఆలోచనంతా... ఆయా పాత్రల ఔచిత్యంపైనే. దానికి తగ్గట్టే బిహేవ్ చేసేవారు. వారి దృష్టిలో అక్కడ అందానికి స్థానం లేదు. అయితే... పోనుపోనూ జనరేషన్లో మార్పొచ్చింది. దానికి తగ్గట్టే దర్శకుల ధోరణి కూడా మారింది. అందం హీరోయిన్లకేనా? అమ్మలు, అత్తమ్మలు అందంగా ఉండకూడదా? అనే కొత్త వాదన వెలుగులోకొచ్చింది. ఇంకేముంది... మోడరన్ అమ్మలు, గ్లామరస్ అత్తల ట్రెండ్ మొదలైంది. వెండితెరపై ఓ రేంజ్లో గ్లామర్‌ని ఒలికించిన కథానాయికలందరూ తమ ఇన్నింగ్స్ ముగిశాక.. గ్లామర్ మదర్స్‌గా కనిపించడం మొదలుపెట్టారు. గ్లామర్ మదర్స్ అంటే మొన్నటిదాకా లక్ష్మి, జయప్రద, జయసుధ, సుహాసిని, భానుప్రియ, రమ్యకృష్ణ, శరణ్య, దేవయాని, ప్రగతి, కుష్బూ, రోజా.. తదితర కథానాయికల పేర్లే వినిపించేవి. అయితే.. సినిమాను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌లుక్‌లో ప్రెజెంట్ చేయాలని తపించే కొంతమంది దర్శకులు... కథానాయికల విషయంలోనే కాక, నయా ఆంటీల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండటం మొదలుపెట్టారు. కొత్తనీరు రావడం, పాతనీరు కొట్టుకుపోవడం కామనే కదా! పైగా ‘అత్తారింటికి దారేది’తో ఆంటీ పాత్రలకు అమాంతం క్రేజ్ వచ్చేసింది. మోడ్రన్ మదర్‌గా నదియా అందరికంటే ముందు వరుసలో నిలబడ్డారు. సినిమాకు యాభై లక్షల రూపాయలు పైనే వసూలు చేస్తూ... అత్త పాత్రలకు కొత్త పాపులార్టీ తీసుకొచ్చారు. మరి నదియాకు ప్రత్యామ్నాయం ఎవరు? ప్రస్తుతం ఫిలింనగర్లో ఇదే చర్చ. ఆ చర్చకు తెరదించుతూ... మేమున్నామంటూ నలుగురు నయా ఆంటీలు ముందుకొచ్చారు. వారే... మీనా, రవీనా టాండన్, సిమ్రాన్, పూర్ణిమ. తెలుగుతెరపై మీనాది ఓ శకం అంటే తప్పేం కాదు. అగ్రహీరోలందరితో జతకట్టడమే కాక, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి సత్తా చాటారు మీనా. దాదాపు పదిహేనేళ్ల పాటు కథానాయికగా కొనసాగిన మీనా.. 2009లో వివాహం చేసుకున్నారు. తెలుగులో కథానాయికగా ఆమె చివరి సినిమా ‘తరిగొండ వెంగమాంబ’. పెళ్లి తర్వాత కూడా చిన్నాచితకా పాత్రలు పోషించినా... పూర్తిస్థాయిలో మాత్రం నటనపై దృష్టి పెట్టలేదు. అయితే... మలయాళంలో మోహన్‌లాల్‌తో నటించిన ‘దృశ్యం’ చిత్రం ఆమె ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చింది. ఇక నుంచి గ్లామర్ మదర్‌గా రాణించాలని మీనా భావిస్తున్నట్లు సమాచారం. ‘దృశ్యం’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌కు జోడీగా, మాతృకలో పోషించిన పాత్రనే పోషిస్తున్నారు మీనా. పెళ్లీడొచ్చిన ఇద్దరు పిల్లలకు తల్లిగా ఇందులో కనిపిస్తారామె. పైగా మీనా, వెంకటేష్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం... ఇలా అన్నీ వందరోజుల సినిమాలే. మళ్లీ ఈ సినిమాతో మీనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంతో మళ్లీ తెలుగుతెరపై తళుక్కున మెరిశారు రవీనా టాండన్. ఒకప్పుడు రవీనా అంటే యువతరం గుండె చప్పుడు. బాలీవుడ్ తెరపై ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బంగారుబుల్లోడు, ఆకాశవీధిలో, రథసారధి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారామె. ఇన్నాళ్ల తర్వాత కూడా తరగని అందంతో ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో కనిపించారు. ఆ గ్లామర్‌లో ఏ మాత్రం వన్నె తగ్గలే దని ఇక్కడి యువతరం కితాబులు ఇచ్చేశారు కూడా. తెలుగులో మంచి పాత్రలు చేయాలని ఉందని ఇటీవల మీడియా సాక్షిగా చెప్పారు. అంటే, త్వరలో నయా ఆంటీగా రవీనా హవా మొదలవ్వబోతోందన్నమాట. సిమ్రాన్ కూడా అమ్మగా, అత్తమ్మగా కనిపించడానికి రెడీ అయిపోయారు. 2009లో బాలయ్యతో కలిసి ‘ఒక్కమగాడు’లో నటించినా... సిమ్రాన్‌కి పెద్దగా కలిసిరాలేదు. కృష్ణభగవాన్‌తో ‘జాన్ అప్పారావు 40 ప్లస్’ చేశాక మళ్లీ తెలుగులో నటించలేదు సిమ్రాన్. అయితే... ప్రస్తుతం నడుస్తున్న గ్లామర్ ఆంటీల ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకొని తాను కూడా అందాల అంటీగా కనిపించడానికి రెడీ అయిపోయారు. నాని హీరోగా రూపొందుతోన్న ‘ఆహా కళ్యాణం’ సినిమాతోనే ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. మున్ముందు అంతా తన హవానే అని ధీమాగా చెబుతున్నారు సిమ్రాన్. ఇక పూర్ణిమ వీళ్లందరికంటే కాస్త సీనియర్. ముద్దమందారం, నాలుగుస్థంభాలాట, ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య, మా పల్లెలో గోపాలుడు... ఈ చిత్రాలను తలచుకుంటే... ముందు గుర్తొచ్చేది పూర్ణిమే. గ్లామర్ తారగా కంటే... నటిగానే ఎక్కువగా ప్రేక్షకాభిమానాన్ని పొందారు తను. ఆమె కూడా ఇప్పుడు గ్లామర్ మదర్‌గా కనిపించడానికి సిద్ధం అవుతున్నారు. పెళ్లయ్యాక... చాలాకాలంగా తెరకు దూరంగా ఉన్న పూర్ణిమ... ‘గ్రాడ్యుయేట్’, ‘తొలిసారిగా’, ‘మిస్టర్ లవంగం’, ‘33 ప్రేమకథలు’, ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’ తదితర చిత్రాల్లో అమ్మగా చేశారు. మొత్తానికి... ఈ సరికొత్త ట్రెండ్ మన సీనియర్ కథానాయికల సెకండ్ ఇన్నింగ్స్‌కి బాగా కలిసొచ్చింది. హీరోయిన్లతో పోటీపడుతూ గ్లామరస్‌గా కనబడటం వాళ్లకూ సంతోషమే కదా! పేరుకి పేరు... గ్లామర్‌కి గ్లామర్..! -
చుక్కల్లోకెక్కినారు
-
అంజలికి ‘అంతిమ’ వీడ్కోలు
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : వెండితెర సీతమ్మగా బాసిల్లిన అలనాటి మేటి నటి అంజలీ దేవికి గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె భౌతికకాయానికి గురువారం అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. లవకుశ చిత్రంలో సీతమ్మ తల్లి అపనిందను మోస్తూ అడవిలో అష్టకష్టాలు పడినా బాధ్యతలకు దూరంకాకుండా తన కడుపులో పెరుగుతున్న శ్రీరామచంద్రుని వారసుల్ని కని పెంచి విద్యాబుద్దులు, విలువిద్యలు నేర్పించి వారిని తండ్రి చెంతకు చేర్చిన తరువాతే ఆ సాధ్వి తల్లి అయిన భూదేవి ఒడికి చేరుతుంది. ఆ సన్నివేశంలో అత్యంత సహజంగా నటించి రక్తికట్టించిన అంజలీదేవి నిజ జీవితంలోనూ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. నటిగా ఎంతో ఖ్యాతిగాంచిన అంజలీదేవి చివరి రోజుల్లో ఆధ్యాత్మిక బాటలో పయనించి ధన్యురాలయ్యూరు. ఈ నట శిరోమణికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, సినీ ప్రముఖులు అంతిమవీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో సంప్రదాయ బద్ధంగా అంజలి అంత్యక్రియలు నిర్వహించారు. అంజలీ దేవి భౌతిక కాయాన్ని సందర్శించడానికి అభిమానులు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. -
అంజలీదేవికి కన్నీటి వీడ్కోలు
తమిళసినిమా, న్యూస్‌లైన్: ప్రఖ్యాత నటి అంజలీదేవికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం కన్నుమూసిన అంజలీదేవి అంత్యక్రియలు గురువారం చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో సాయంత్రం 4.30 గంటలకు జరిగాయి. ఉదయం ఇక్కడి అడయార్‌లోని అంజలీదేవి స్వగృహంలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచారు. కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికకాయూనికి నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, తమిళనాడు మంత్రులు వళర్మతి, మాధవరం మూర్తి తదితరులు పుష్పాంజలి ఘటించారు. ప్రముఖ నటీమణులు వైజయంతి మాలా బాలి, సచ్చు, కాంచన, రాజశ్రీ, శరత్‌బాబు, గాయని పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత మురారి, సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు, రచయితలు వెన్నెలకంటి, భువనచంద్ర, డాక్టర్ సి.ఎం.కె. రెడ్డి తదితర ప్రముఖులు అంజలీదేవికి నివాళులర్పించారు. -
అంజలీదేవికి అంతిమ వీడ్కోలు
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : వెండితెర సీతమ్మగా బాసిల్లిన అలనాటి మేటి నటి అంజలీ దేవికి గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె భౌతికకాయానికి గురువారం అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. లవకుశ చిత్రంలో సీతమ్మ తల్లి పాత్రలో జీవించిన అంజలి నిజ జీవితంలోనూ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. చివరి రోజుల్లో ఆధ్యాత్మిక బాటలో పయనించి ధన్యురాలయ్యూరు. ఈ నట శిరోమణికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, సినీ ప్రముఖులు అంతిమవీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంజలీ దేవి భౌతిక కాయాన్ని సందర్శించడానికి అభిమానులు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. మహోన్నత నటి రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య, అంజలీ దేవి భౌతికకాయాన్ని దర్శించి పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ జాతస్య మరణం ధృవం అన్నది సత్యం. అయితే మరణించిన తరువాత కూడా మన మధ్య చిరకాలం నిలిచిపోయే నటి అంజలీదేవి. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో పాత్రలకు జీవం పోసిన నటి. హిందీ, కన్నడం వంటి ఇతర భాషల్లో కొన్ని చిత్రాలు చేసినా అద్భుత నటిగా ఖ్యాతిగాంచారు. నేను గవర్నర్‌గా చెన్నైకి వచ్చిన తరువాత ఐదారుసార్లు అంజలీదేవిని కలిశాను. చివరి రోజుల్లో ఆమె ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. అలాంటి మహోన్నత నటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని చెప్పారు. అత్యంత ఆప్తురాలు ప్రఖ్యాత నటి వైజయంతి మాల బాలి అంజలీదేవికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ, ‘‘అంజలీదేవి నాకు అత్యంత ఆప్తురాలు. ఏవీఎం సంస్థ నిర్మించిన పెణ్ (తెలుగు సంఘం) చిత్రంలో మేమిద్దరం కలిసి నటించిన అనుభవం మరపురానిది. ఆ చిత్రంలో నాకు అవకాశం రావడానికి కారణం అంజలినే. ఆమె చాలా స్నేహశీలి. మేము తరచు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అంజలీదేవి 80వ జన్మదినోత్సవానికి నన్ను ఆహ్వానించారు. నేను వేడుకలో పాల్గొన్నాను. చాలా మధురమైన రోజది. అలాంటి గొప్ప నటి కన్నుమూయడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అంజలీ దేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని అన్నారు. ఆది నుంచే అనుబంధం : సుశీల ‘‘అంజలీదేవితో నాకు మొదటి నుంచే అనుబంధం ఉంది. నేనే కార్యక్రమాన్ని తలపెట్టినా ఆమె సలహా తీసుకుంటాను. పుట్టపర్తి సాయిబాబా దర్శనం కూడా అంజలిదేవి సాయంతోనే కలిగింది. ఆమె కుటుంబంలో నేను ఒక సభ్యురాలినయినందుకు గర్వంగా ఉంది. అంజలిదేవి దైవ స్వరూపిణి. ఆమె ఆత్మ ఎప్పుడో భగవంతునిలో కలిసి పోయింది. అంజలి దేవిని చూసి నేర్చుకోవలసింది, ఆచరించవలసింది ఎంతో ఉంది అన్నారు.’’ ప్రఖ్యాత గాయని పి.సుశీల. సినిమాకు పెద్ద ఆభరణం: బాలు ‘‘ముందుతరం వారు చాలా సంస్కారవంతులు. వారిని చూసి పెరుగుతూ నేర్చుకుంటూ ఎదిగిన వాళ్లం మేము. అలాంటి వారిలో అంజలిదేవి ఒకరు. నిజమయిన తల్లికి ప్రతీక అంజలీదేవి. ఎంత వయసు వచ్చినా భారతీయ సినిమాకు ఆమె పెద్ద ఆభరణం.’’ ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం. ఇంత గౌరవం ఎవరికీ లభించదు ‘‘అప్పట్లో మహా నటి సావిత్రి కన్నుమూసినప్పుడు లక్షలాది మంది అభిమానులు ఆమె పార్థివదేహాన్ని చూడటానికి వచ్చారు. ఆ తరువాత అంతగా అభిమానం పొందిన నటి అంజలి దేవీనే. ఇంత గౌరవం ఏ నటికీ లభించదు. నేను నిర్మించిన నారీనారీ నడుమ మురారి చిత్రంలో అంజలి దేవి నటించారు. అలాంటి గొప్ప నటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’’ అన్నారు సీనియర్ నిర్మాత మురారి. అంజలిదేవి ఒక అధ్యాయం ‘‘తెలుగు సినీ చరిత్రలో అంజలి దేవి ప్రస్థానం ఒక సువర్ణాధ్యాయం. సీతమ్మ అంటే అంజలినే. బాబా చరిత్ర తో మెగా సీరియల్‌గా రూపొందించినప్పుడు అందులో రెండు పాటలు రాసే అవకాశం కలిగింది. అలా ఆమెతో పరిచయం భాగ్యం కలిగింది. ఆ తరువాత నేను ప్రతిభ కోటేశ్వరరావు అబ్బాయినని తెలిసి ఎంతగానో అభినందించారు. అలాంటి ఉన్నత మూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను,’’ అన్నారు సీనియర్ గీత రచయిత వెన్నెలకంటి. సినిమానే జీవితం ‘‘80 ఏళ్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో 70 ఏళ్లుగా విశేష సేవలందించిన నటి అంజలీ దేవి ఆ తరం తారల మాటకు కట్టుబడి ఉండేవారు. సినిమానే జీవితంగా భావించేవారు. అలా సినిమా విలువ పెంచిన నటి అంజలీదేవి. 1950లో ఒకే ఏడాదిలో 13 చిత్రాల్లో నటించిన ఏకైక నటి అంజలీదేవి. నటుడు శివాజీగణేశన్, ఎస్.వీ.రంగారావు, నటి జయంతి వంటి పలువురిని సినిమాకు పరిచయం చేసిన ఘనత ఆమెదే.’’ అన్నారు ప్రముఖగీత రచయిత భువన చంద్ర. ఇంకా నటి సచ్చు, నటుడు శరత్‌బాబు, తమిళ నటుడు రాజేష్, డాక్టర్ సీఎంకే రెడ్డి, జెమినీ గణేశన్ కూతురు డాక్టర్ కమల సెల్వరాజ్, మంత్రులు వలర్మతి, మాధావరం మూర్తి తదితరులు అంజలీ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అమ్మపేరుతో క్లినిక్ అమ్మంటే మాకు చాలా గౌరవం. ఆమె మమ్మల్ని ప్రేమగా పెంచారు. తల్లి బాధ్యతల్ని ఎప్పుడూ విస్మరించలేదు. మమ్మల్ని సినిమా వాతావరణానికి దూరంగా పెంచినా సినిమాకు అమ్మ విశేష సేవలందించడం గర్వకారణం. అదే విధంగా ప్రజలకు పలు సేవలందించారు. వాటిని కొనసాగించాలని ఆశ. నేను అమెరికాలో డాక్టరుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నాను. అమ్మ పుట్టపర్తి బాబా జీవిత ఇతివృత్తాన్ని సీరియల్‌గా తీసి తద్వారా వచ్చిన ఆదాయాన్ని బాబా ట్రస్టుకే అందించారు. నేను అమెరికాలో సాయి కృప ఇంటర్నేషనల్ ట్రస్టును నెలకొల్పి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. అలాగే అమ్మపేరుతో ఒక క్లీనిక్‌ను ప్రారంభించి వైద్య సేవలందించాలనుకుంటున్నాను అని అంజలిదేవి రెండో కొడుకు డాక్టర్ నిరంజన్‌రావు తెలిపారు. అంజలీ దేవి అంతిమ యాత్రలో అశేష జనం పాల్గొన్నారు. -
స్వగృహానికి అంజలీదేవి భౌతికకాయం
-
స్వగృహానికి అంజలీదేవి భౌతికకాయం
చెన్నై : ఈనెల 12వ తేదీన కన్నుమూసిన అంజలీదేవి భౌతికకాయాన్ని అడయార్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. నేడు అంజలీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. అవయవదానం కోసం ఆమె పార్థివదేహాన్ని చెన్నైలోని వడపళనిలోని విజయా ఆస్పత్రి నుంచి పోరూర్ శ్రీరామచంద్ర ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం అంజలీదేవి అడయార్‌లోని ఆమె స్వగృహానికి తీసుకు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం ఉంచుతారు. అనంతరం బీసెంట్ నగర్‌లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ అంత్యక్రియలకు తమిళనాడు సీఎం జయలలితతోపాటు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయి. -
నేడు అంజలీదేవి అంత్యక్రియలు
సాక్షి, చెన్నై: అలనాటి మేటి నటి అంజలీదేవి అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. ఈ నెల 12న ఆమె చెన్నైలో కన్నుమూసిన విషయం విదితమే. అదేరోజున ఆమె భౌతికకాయాన్ని పోరూర్‌లోని శ్రీరామచంద్ర ఆస్పత్రికి తరలించడమూ తెలిసిందే. భౌతికకాయాన్ని గురువారం ఉదయం 9 గంటలకు అడయార్‌లోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనకోసం ఉంచుతారు. అనంతరం బీసెంట్ నగర్‌లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ అంత్యక్రియలకు తమిళనాడు సీఎం జయలలితతోపాటు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయి. -
అంజలీదేవి ఆత్మకథ
‘‘అంజలీదేవి ఆత్మకథను సకాలం పూర్తచేయలేకపోవడం బాధిస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా తన కథకు పుస్తకరూపం కల్పించడానికి నాతో కలిసి అంజలి ఎంతో కృషి చేశారు. ఈ పుస్తక యజ్ఞం పూర్తి కాకముందే అర్ధాంతరంగా ఆమె తనువు చాలించడం దురదృష్టకరం’’ అని రావికొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. అంజలితో కలిసి గత కొన్ని రోజులుగా అంజలి ఆత్మకథ రాసే పనిలో నిమగ్నమై ఉన్నాయాన. ఈ పుస్తకం వివరాలను ఆయన విలేకరులతో వెలిబుచ్చారు. ‘‘ఇది అంజలీదేవి ఆత్మకథ. ఇందులో ఏ మాత్రం సందేహం అనవసరం. ఆమె అనుభవాల్ని, ఆలోచనల్ని ఆమె సాక్షిగా రాసిన పుస్తకం ఇది. దీనికి పుస్తకరూపం కల్పించడం మాత్రమే నా పాత్ర’’ అని తెలిపారు రావి. మరికొన్ని విశేషాలు చెబుతూ -‘‘తన జీవితంలో చోటు చేసుకున్న ఉత్థాన పతనాలను, వ్యక్తిగత విషయాలను ఈ పుస్తకం కోసం స్వయంగా వెల్లడించారు అంజలి. ఆమె జీవితంలో చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితుల్లో చిత్ర రంగానికి చెందిన వ్యక్తుల వాటా చాలా ఉంది. ఆ విశేషాలన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి. అంజలీదేవి కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ పుస్తకాన్ని పూర్తి చేస్తాను’’ అని తెలిపారు. ఇంకా పుస్తకానికి పేరు ఖారారు కాలేదని.. త్వరలోనే మంచి పేరును ఫైనలైజ్ చేస్తామన్నారు ఈ సందర్భంగా రావి కొండలరావు వెల్లడించారు. -
నటి అంజలీదేవి ఇకలేరు
-
కన్న తల్లిని కోల్పోయాను: చంద్రమోహన్
తెలుగు తెర సీతమ్మ అంజలీ దేవి మరణం తాను జీర్ణించుకోలేక పోతున్నానని ప్రముఖ నటుడు చంద్రమోహన్ వెల్లడించారు. అంజలీదేవి మరణంతో తన కన్న తల్లిని కోల్పోయానని ఆయన ఆవేదన చెందారు. 1966లో వచ్చిన రంగుల రాట్నం చిత్రంలో అంజలి దేవి, తాను తల్లి కొడుకులుగా నటించామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆనాటి నుంచి అంజలీదేవి తనను కన్న కొడుకులా చూసుకునే వారని, ఆ తర్వాత కాలంలో తమ తల్లికొడుకుల అనుబంధం మరింత పెనవేసుకుందని వివరించారు. చలన చిత్ర సీమలో అంజలీదేవి మకుటం లేని మహారాణి అని అభివర్ణించారు. తనకు ఎక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అక్కడ అంజలీదేవి తప్పకుండా హాజరయ్యేవారని పేర్కొన్నారు. అంజలీ దేవి చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. ఆమె అంత్యక్రియలు గురువారం చెన్నైలో జరుగుతాయి. ఆమె గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. -
‘వెండితెర సీతమ్మ’ జ్ఞాపకాలు సజీవం
పెద్దాపురం రూరల్, న్యూస్‌లైన్ : దేశం గర్వించదగ్గ నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సినీనటి అంజలిదేవి మరణం ఆమె జన్మస్థలమైన పెద్దాపురం పట్టణాన్ని విషాదంలో ముంచింది. వెండితెరపై లవకుశ చిత్రంలో సీతాదేవిగా ఆమె నటనను ఎన్నటికీ మరువలేమని పలువురు పేర్కొన్నారు. పెద్దాపురం ప్లీడర్ల వీధిలోని మృదంగ విద్వాంసుడు కాళ్ల నూకయ్య సత్యవతి దంపతుల పెంపుడు కుమార్తె అంజలీదేవి. తండ్రి మార్గదర్శకత్వంలో చిన్నప్పుడే నృత్యం నేర్చుకున్న అంజలీదేవి 15 ఏళ్ల ప్రాయంలోనే నృత్య ప్రదర్శనలు, సాంఘిక నాటకాల్లో పాత్రల ద్వారా తక్కువ కాలంలోనే ప్రాచుర్యం పొందారు. తరువాత మద్రాసు వెళ్లి చలన చిత్ర రంగంలో ప్రవేశించా రు. ప్లీడర్ల వీధిలో ఆమె బాల్యం గడచిన పెం కుటింటిని కాలక్రమం లో అమ్మేశారు. ఇప్పు డా స్థలంలో ఓ ప్రైవే టు ఆస్పత్రి నడుస్తోం ది. దస్తావేజు లేఖరి పి. బోగరాజు వీధిలోని ఉన్న ఖాళీ స్థలం అమ్మివేసి ఆ సొమ్మును అంజలీదేవి స్థానికంగా సాయిబాబా మందిరానికి విరాళం ఇచ్చారు. పెద్దాపురం పట్టణ పరిధిలోని ప్రజా నాట్యమండలి కళకారులు రాఘవ సేవా సమి తి పేరిట ప్రదర్శించిన రామ్, రహీమ్, తెలుగుతల్లి, మోడ్రన్ ఇండియా నాటకాల్లో అంజలిదేవి కథానాయకగా నటించారు. కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ ఆమెకు తమ నాటకా ల్లో నాయిక పాత్రలు ఇచ్చి ఆదరించింది. పెద్దాపురం శివాలయం వీధికి చెందిన గురుమూర్తి అప్పారావు ప్రోత్సాహం, సంగీత దర్శకుడు ఆదినారాయణరావు సహకారంతో ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. ముప్పన వారి కుటుంబంతో అంజలీదేవికి సాన్నిహిత్యం ఉండేది. 1960లో అప్పటి మున్సిపల్ చైర్మన్ ముప్పన రామారావు ఆధ్వర్యంలో పెద్దాపురంలో అంజలిదేవికి పౌర సన్మానంచేశారు. -
నటి అంజలీదేవి అస్తమయం
అనారోగ్యంతో కన్నుమూసిన వెండితెర సీతమ్మ 16న చెన్నైలో అంత్యక్రియలు 500కు పైగా చిత్రాల్లో అలరించిన మన ‘పల్లెటూరి పిల్ల’ సాక్షి, చెన్నై/ హైదరాబాద్: అలనాటి మేటి నటి, వెండితెర సీత అంజలీ దేవి (86) ఇక లేరు. అనారోగ్యంతో సోమవారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె కన్నుమూశారు. చెన్నై అడయార్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్న అంజలీ దేవి కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్యం కారణంగా శరీరం చికిత్సకు సహకరించక పోవడంతో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. శ్రీరామచంద్ర ఆసుపత్రికి ఆమె అవయవాల దానం చేశారు. అంత్యక్రియలు గురువారం చెన్నైలో జరగనున్నాయి. అంజలీ దేవి భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావు సుమారు దశాబ్దం క్రితమే మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు. అంజలీ దేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో విషాదఛాయలు అలముకున్నారుు. అంజలీ దేవి అసలు పేరు అంజనీ కుమారి. 1928 అక్టోబర్ 24న జన్మించారు. మృదంగ విద్వాంసుడు కాళ్ల నూకయ్య, సత్యవతి దంపతుల పెంపుడు కుమార్తె. బాల్యం కాకినాడలో గడిపిన ఆమె పన్నెండేళ్ల వయసులో రంగస్థల ప్రవేశం చేశారు. రామ్ రహీమ్, తెలుగుతల్లి, మోడ్రన్ ఇండియా వంటి పలు సాంఘిక నాటకాల్లో నటించారు. 13 ఏళ్ల వయస్సులోఆదినారాయణరావును వివాహమాడారు. ప్రముఖుల సంతాపం: అంజలీ దేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డి.కె.అరుణ, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. అంజలీ దేవి వంటి కళాకారులు అరుదుగా పుడతారని, ఆమె మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు తీరని లోటని రోశయ్య పేర్కొన్నారు. అంజలీ దేవి మరణంతో తెలుగు చలనచిత్ర రంగం తొలి తరానికి చెందిన ఒక ఆణిముత్యాన్ని కోల్పోయినట్లయిందని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కళామతల్లి సేవలో... 1955లో తన సొంత చిత్రం అనార్కలి చిత్ర నిర్మాతగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత వరుసగా సువర్ణసుందరి, చెంచులక్ష్మి, జయభేరి చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులను స్వీకరించారు. గుంటూరు నాగార్జున యూనివర్శిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. 2005లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు, 2008లో ఏఎన్నార్ జాతీయ అవార్డు అంజలీదేవిని వరించాయి. అంజలి పిక్చర్స్‌ను నెలకొల్పిన ఆదినారాయణరావు దంపతులు అనార్కలి, భక్త తుకారాం వంటి పలు కళాఖండాలను నిర్మించారు. ప్రఖ్యాత నటుడు చిత్తూరు నాగయ్య అంటే అంజలీ దేవి ఎనలేని అభిమానం కనబరిచేవారు. చిత్తూరు నాగయ్య స్మారక ట్రస్టును నెలకొల్పి ప్రతి ఏటా ఉత్తమ కళాకారులకు అవార్డులను అందిస్తూ వచ్చారు. పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. చెన్నైలో తాను నివసిస్తున్న ఇంటిలో సగ భాగాన్ని ‘సుందరం’ పేరుతో బాబామందిరంగా మార్చారు. గొల్లభామతో సినీరంగ ప్రవేశం మద్రాసు వెళ్లి గొల్లభామ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన అంజలీ దేవి ఇందులో ప్రతి నారుుక పాత్ర పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన బాలరాజు, కీలుగుర్రం చిత్రాల్లోనూ ప్రతి నారుుక పాత్రల్లోనే నటించారు. అరుుతే తదనంతర కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల సరసన అనేక చిత్రాల్లో ఆమె హీరోరుున్‌గా రాణించడం విశేషం. ఎన్టీఆర్ నటించిన పల్లెటూరి పిల్ల చిత్రం ద్వారా తొలిసారి కథానాయికగా పరిచయమైన అంజలీ దేవి ఇక వెనుతిరిగి చూడలేదు. తెలుగుతో పాటు తమిళ , కన్నడ, హిందీ భాషల్లో 500కు పైగా సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించారు. తెలుగు సినీ జగత్తులో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు వంటి మేటి నటులతో పాటు తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి నట దిగ్గజాలతోనూ కలసి నటించారు. పరదేశి, అనార్కలి, సువర్ణసుందరి, పాండురంగ మహత్మ్యం, చెంచులక్ష్మి, జయభేరి, జయసింహ, జయం మనదే, పల్నాటి యుద్ధం, భక్త ప్రహ్లాద వంటి ఆణిముత్యాలు ఆమె నటనా కౌశల్యానికి కొన్ని ఉదాహరణలు. ఇక లవకుశ సిని మాలో సీతగా నటించిన అంజలీ దేవి అఖిలాంధ్ర ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. సీత అంటేనే అంజలీదేవి గుర్తుకు వచ్చేంతగా అభిమానులను మైమరపింపజేశారు. -
వెండితెర సీత అంజలీదేవి ఇక లేరు!
సాక్షి, విజయవాడ: వెండితెర సీత అంజలీదేవి(86) సోమవారం కన్ను మూశారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా పెద్దపురంలో జన్మించినప్పటికీ విజయవాడతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమె నటించిన లవకుశ, సువర్ణసుందరి, అనార్కలీ, బండిపంతులు,భోగిమంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాలు విజయవాడలోని మారుతీటాకీస్, దుర్గాకళామందిరం, శ్రీనివాస్ మహాల్, సర్వస్వతి పిక్చర్ ప్యాలెస్, ఈశ్వరమహాల్ థియేటర్లలో వందేసి రోజులు ఆడాయి. ఆమె పుట్టపర్తిసాయిబాబాకు భక్తురాలు. నాటి ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్యే ఆమెను పుట్టపర్తి బాబాకు పరిచయం చేశారు. 2008లో ఆమె విజయవాడ వచ్చినప్పుడు సీతారాంపురంలోని సత్యసాయిబాబా మందిరానికి వెళ్లి అక్కడ బాబా భక్తులతో గడపటం విశేషం. నగరంలోని ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు తీసిన కన్నకొడుకు చిత్రంలో అంజలీదేవి సినీనటుడు నాగేశ్వరరావు తల్లిగా నటించి మన్ననలు పొందింది. నగరంలో అంజలీ పిక్చర్స్ కార్యాలయం... అంజలీదేవి నటిగానే కాకుండా చిత్ర నిర్మాత. అంజలీ పిక్చర్స్‌ను ప్రారంభించి అనేక చిత్రాలను ఆమె తీశారు. నగరంలోని దుర్గాకళామందిరం వెనుక అంజలీ పిక్చర్ కార్యాలయం ఉండేది. ఆమె భర్త ఆదినారాయణరావుతో కలిసి అమె అనేక సార్లు ఈ కార్యాలయానికి వచ్చేదని నాటి సినీ అభిమానులు చెబుతున్నారు. ఆమె తీసిన భక్త తుకారం చిత్రానికి అభినందన సభ విజయవాడలోని నటరాజ్ థియేటర్లో జరిగింది. ఈ సభకు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షత వహించడం విశేషం. అంజలీదేవి ఏ చిత్రం నిర్మించినా తుర్లపాటిని ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. 2008లో ఘన సన్మానం.... లవకుశ విడుదలై 46 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీ సోమనాధ నాట్యమండలి అధ్యక్షుడు బొలిశెట్టి రాధకష్ణమూర్తి అంజలీదేవి(సీత), కుశుడు(సుబ్రహ్మణ్యం), లవుడు(నాగరాజు)లను విజయవాడకు ప్రత్యేకంగా ఆహ్వానించి ఘంటసాల సంగీత కళాశాలలో 2008 జూన్ 8న ఘనంగా సన్మానించారు. రాధాకష్ణమూర్తి కోరిన వెంటనే ఆమె విజయవాడ రావడానికి అంగీకారం తెలిపారు. వయోభారం కుంగదీస్తున్నప్పటికీ నగరాకి వచ్చి ఆ చిత్రం విశేషాలను శ్రోతలకు వివరించడం విశేషం. -
వెండితెర సీతమ్మ ఇక లేరు
‘శ్రీరామచంద్రా... ఎంత నిర్దయుడవయ్యావ్. మనసు ఎలా రాయి చేసుకున్నావ్. ఇంకా నీకు నాపై అనుమానమేనా!’.. విషాదానికి పరాకాష్ట అంటే ఏంటో అప్పుడు చూశారు జనాలు. కన్నీరు కట్టలు తెగింది. తాము చూస్తున్నది సినిమా అన్న సంగతే మరచారు. సాక్షాత్తూ సీతనే చూస్తున్నట్లు ఫీలైపోయారు. ఆ గొప్పతనం ఎవరిది? ... ‘అంజలీదేవి’ది. ఏ పాత్రలో పోస్తే... ఆ పాత్రగా మారిపోయే అభినయామృతం అంజలి. తెలుగు తెరపై ఆమెది చెరగని సంతకం. పాత్ర పోషణలో శారీరకభాష ప్రాధాన్యత చాలా ఉంటుంది. అందుకే... అన్నీ పాత్రలూ అందరికీ నప్పవ్. కానీ ఆ విషయంలో అంజలి మినహాయింపు. ఆమె చేయని పాత్ర లేదు. ఆ మాటకొస్తే చేయలేని పాత్ర కూడా లేదు. ఓ సారి అంజలి కెరీర్‌ని విశ్లేషించుకుంటే.. అది ఎంత నిజమో అర్థమవుతుంది.‘గొల్లభామ’(1945) చిత్రంతో అంజలి సినీ ప్రస్థానం మొదలైంది. కాంచనమాల, భానుమతి రాజ్యమేలుతున్న రోజులవి. ‘డాన్స్’ అనే ప్రక్రియను కథానాయికలు అప్పుడప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి టైమ్‌లో వచ్చిన అంజలి... డాన్స్ అంటే ఏంటో తెరకు రుచి చూపించారు. ‘నాట్యతార’గా వినుతికెక్కారు. అంజలి కెరీర్లో మేలి మలుపు అంటే ‘కీలుగుర్రం’(1949) సినిమానే. అందులో చేసిన మోహిని పాత్ర అంజలిని స్టార్‌ని చేసేసింది. కథ రీత్యా అందులో ఉంటే మూడు రాక్షసుల్లో అంజలి ఓ రాక్షసి. దాంతో ప్రేక్షకుల హృదయాల్లో ‘అందాల రాక్షసి’గా నిలిచిపోయారామె. ‘పరదేశి’(1951) తర్వాత అంజలి పిక్చర్స్ పతాకంపై ఆమె భర్త ఆదినారాయణరావు ‘అనార్కలి’(1955) చిత్రాన్ని నిర్మించారు. ప్రేమించిన పాపానికి జీవసమాధికి గురయ్యే ప్రేమికురాలు అనార్కలిగా అంజలి నటించిన తీరు ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేసింది. ‘కీలుగుర్రం’లోని పాత్రకు ఇది పూర్తి భిన్నమైన పాత్ర. నటిగా అంజలిలోని మరో కోణం ‘సువర్ణసుందరి’(1957). తెలుగు, తమిళ, హిందీ... మూడు భాషల్లోనూ విజయదుందుభి మోగించిన సినిమా ఇది. ఓ వైపు దేవకన్యగా, మరోవైపు మహాసాధ్విగా, ఇంకోవైపు ఓ బిడ్డకు తల్లిగా రకరకాల డైమన్షన్లను చూపించారు ఇందులో అంజలి. సాధ్విగా నటించి మెప్పించడం ఓ ఎత్తు. అందుకు పూర్తి భిన్నంగా నెగిటివ్ రోల్‌తో ‘అందాల రాక్షసి’గా మెరిపించడం ఓ ఎత్తు. కానీ... ఈ రెండింటి మధ్య ఉండే పాత్ర... మామూలు గృహిణి పాత్ర. నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నా ఆస్తి. ఈ క్రమంలో అత్తమామల్ని కూడా నిర్లక్ష్యం చేస్తుందా పాత్ర. అటు మంచిది అనలేం, ఇటు చెడ్డదీ అనలేం. నిజంగా కత్తిమీద సామే. కానీ అంజలికి ఏ పాత్రయినా కరతలామలకం. అందుకు నిదర్శనమే ‘పాండురంగ మహాత్మ్యం’(1957) చిత్రంలో పుండరీకుని భార్య పాత్ర. ‘చెంచులక్ష్మి’(1958)లో శ్రీమహాలక్ష్మిగా అంజలిని చూస్తే... అచ్చంగా కేలండర్లో లక్ష్మీదేవిలాగే ఉంటారు. అందులో కూడా లక్ష్మిగా, చెంచులక్ష్మిగా రెండు కోణాలను సమర్థవంతంగా ఆవిష్కరించారామె. ‘జయభేరి’(1959) అంజలి నటవైదుష్యానికో మెచ్చుతునక.‘భట్టి విక్రమార్క’(1960)లో ప్రభావతిగా అంజలీదేవి అభినయం నిజంగా అనితర సాధ్యమే. విక్రమార్కుని ప్రేయసిగా అంజలి అభినయం ఒక ఎత్తు అయితే... శాపకారణంగా మాటలు రాని వృద్ధురాలిగా మారినప్పుడు ఆమె పలికించిన ఆర్థ్రతాపూరిత అభినయం మరో ఎత్తు. అంజలి చేసిన ఛాలెంజింగ్ రోల్స్ అంటే ముందు చెప్పుకోవాల్సింది.. ‘భీష్మ’(1962) సినిమాలో శిఖండి పాత్ర. ఆ కేరక్టర్లో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఆ టైమ్‌లో ఏ కథానాయిక కూడా ఆ పాత్ర చేయడానికి ముందుకు రాలేదు. దటీజ్ అంజలి. ఇక ‘లవకుశ’(1963)లో ‘సీత’ పాత్ర సరేసరి. తెలుగువారికి సీత అంటే అంజలే. ఆ పాత్రను ఎంతమంది పోషించినా.. ఆమె దరిదాపులక్కూడా రాలేకపోయారు. ‘బడిపంతులు’(1972) చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి ఆమె పలికించిన అభినయాన్ని కూడా తేలిగ్గా మరిచిపోలేం. తెలుగు సినిమా స్వర్ణయుగం చూస్తున్న రోజుల్లో ‘లేడీ హీరోలు’ ఇద్దరు ఉండేవారు. వారిలో ఒకరు భానుమతి రామకృష్ణ అయితే... రెండోవారి అంజలీదేవి. ఆ రోజుల్లోనే పలు స్త్రీ ప్రాధాన్యతా చిత్రాల్లో నటించిన ఘనత వీరిద్దరిది. అంజలీదేవి- ఎన్టీఆర్, అంజలీదేవి- ఏఎన్నార్ అని టైటిల్స్ పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ తొలి హీరోయిన్ అంజలీదేవే. ‘పల్లెటూరి పిల్ల’ వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం. అలాగే నిర్మాతగా ఎన్టీఆర్ తొలి విజయం ‘జయసింహ’లో కథానాయిక అంజలీదేవి. మరో విషయం ఏంటంటే... తొలినాళ్లలో అక్కినేని, ఆదినారాయణరావు కలిసి ‘మాయలమారి’ చిత్రాన్ని నిర్మించారు. అంటే... నిర్మాతగా అక్కినేని తొలి నాయిక కూడా అంజలీదేవే. ఆ విధంగా ఎన్టీఆర్, ఏఎన్నార్లకు విజయతార అంజలి. అంజలీదేవి సరసన ఎక్కువ చిత్రాల్లో నటించిన కథానాయకుడు ఎన్టీఆర్ అయితే... ఆమె సొంత నిర్మాణ సంస్థ ‘అంజలి పిక్చర్స్’లో ఎక్కువ చిత్రాల్లో నటించిన కథానాయకుడు మాత్రం అక్కినేనే. అనార్కలి(1955), సువర్ణసుందరి(1957), రుణానుబంధం(1960), భక్తతుకారం(1975), మహాకవి క్షేత్రయ్య(1976) లాంటి చిత్రాలను అక్కినేని కథానాయకునిగా తన భర్త ఆదినారాయణరావుతో కలిసి నిర్మించారు అంజలి. ఎన్టీఆర్ నటించిన ఏకైక అంజలి పిక్చర్స్ చిత్రం ‘స్వర్ణమంజరి’(1962). తెలుగులో అంజలీదేవి కథానాయకులు అంటే... ఎన్టీఆర్, ఏఎన్నార్ పేర్లనే ఎవరైనా చెబుతారు. వారిద్దరి సరసనే ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించారు కూడా. కానీ అంజలి మరొకరికి కూడా హిట్ పెయిర్. ఆయనే ఎస్వీరంగారావు. ‘భట్టివిక్రమార్క’లో ప్రచండుడుగా ఎస్వీఆర్, ప్రభావతిగా అంజలి నటించిన తీరు ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేసింది. ‘బాలనాగమ్మ’లో టైటిల్ రోల్ అంజలిది అయితే... ఎస్వీఆర్ మాయలపకీర్. అయితే... ఈ రెండు సినిమాల్లో అంజలి కథానాయిక, ఎస్వీఆర్ విలన్. వాటి తర్వాత భక్తప్రహ్లాద(1967), లక్ష్మీనివాసం(1968), తాతామనవడు(1972)... తదితర చిత్రాల్లో అంజలి, ఎస్వీఆర్ భార్యాభర్తలుగా నటించారు. ఒకరికొకరికి ఏమాత్రం ఇక పొంతన లేని నటులకు హిట్ పెయిర్‌గా నిలిచిన ఘనత కూడా అంజలీదేవిదే. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళంలో ఎమ్జీఆర్, శివాజి గణేశన్, జెమినీ గణేశన్‌లతో కలిసి ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించారామె. కథానాయికలందరూ కాలక్రమంలో కేరక్టర్ ఆర్టిస్టులే. అయితే... కేరక్టర్ అర్టిస్టులైన తర్వాత కూడా హీరోయిన్ల పోకడలు చాలామందిని విడిచిపెట్టవ్. ఆ విషయంలో కూడా అంజలి మినహాయింపే. కాలంతో ప్రయాణం చేయడం, కాలానుగుణంగా మారడం అంజలికి మాత్రమే సాధ్యమైంది. కేరక్టర్ నటిగా కూడా అత్యద్భుతమైన ప్రస్థానాన్ని సాగించారామె. ఏ హీరోల పక్కన కథానాయికగా నటించారో, అదే హీరోలకు తల్లిగా, అక్కగా, వదినగా నటించి మెప్పించారు. నటిగా అంజలీదేవి చివరి సినిమా చిరంజీవి ‘బిగ్‌బాస్’(1995). ఆ సినిమా తర్వాత మళ్లీ అంజలి తెరపై కనిపించలేదు. సాధ్విగా, భక్తురాలిగా, ప్రేమికురాలిగా, యువరాణిగా, ప్రతినాయకురాలిగా, సాధారణ గృహిణిగా, అక్కగా, వదినగా, అమ్మగా, అమ్మమ్మగా... ఎన్నో రూపాల్లో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించి, పరవశింపజేశారు మహానటి అంజలి. ‘ఆ మహానటి ఇక లేరు...’ అనే మాట తెలుగు ప్రేక్షకులకు నిజంగా శరాఘాతమే. 86ఏళ్ల నిండు వయసులో... హృదయ సంబంధిత సమస్యల కారణంగా చెన్నయ్‌లో సోమవారం తుదిశ్వాస విడిచారు అంజలి. ఆ నట శిరోమణి మరణం భారతీయ సినిమాకే తీరని లోటు. సినిమా ఉన్నంతకాలం అంజలి జ్ఞాపకాలు బతికే ఉంటాయి. అద్భుతనటి అంజలీదేవి తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రతి కుటుంబంలో అనుబంధం కలిగిన అద్భుతనటి అంజలీదేవిగారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోలు. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాత-మనవడు’లోని అమ్మ పాత్రను అద్భుతంగా పోషించి ఆ సినిమా అపూర్వ విజయం సాధించడానికి తానూ ఓ కారణం అయ్యారు. ఇక అప్పటి నుంచి నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లో 25కి పైగా ఆమె నటించారు. తెలుగు చిత్రరంగంలో కొన్ని తరాలకు ప్రతినిధిగా ఆమె పోషించని పాత్రంటూ లేదు. హీరోయిన్గా, అమ్మగా, అక్కగా, చెల్లిగా... ఇలా ఎన్నో విభిన్న పాత్రలను పోషించారామె. ‘లవకుశ’ చిత్రంలో పోషించిన సీత పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’. - డాక్టర్ దాసరి నారాయణరావు -
రెండు రోజుల తరువాత అంజలీదేవి అంత్యక్రియలు
చెన్నై: అలనాటి సినీ నటి, నిర్మాత అంజలీదేవికి రెండు రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె పెద్ద కుమారుడు చిన్నారావు తెలిపారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న అంజలీదేవి విజయ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. అంజలిదేవి మృతదేహంను 2 రోజులపాటు భద్రపరచేందుకు శ్రీరామచంద్ర వైద్యకళాశాలకు తరలించారు. కుటుంబ సభ్యులకు ఆఖరి చూపు దక్కేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మనవడు, మనవరాలు అమెరికా నుంచి రావాలసి ఉంది. -
చిత్రాంజలి
-
తెలుగు వారి 'సీత' అంజలీదేవి
అభినవ సీతమ్మగా ప్రసిద్ది చెందిన అలనాటి సినీ నటి, నిర్మాత అంజలీదేవి(86) ఇకలేరు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అంజలీదేవి చెన్నైలోని విజయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. తన నటనా జీవితాన్ని 8 సంవత్సరాల వయసులోనే రంగస్థలంపై ప్రారంభించిన అంజలి 1947లో గొల్లభామ సినిమాతో చిత్రపరిశ్రలో అడుగుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 1927 ఆగస్ట్ 27న జన్మించిన అంజలీదేవి అసలు పేరు అంజనీకుమారి. మంచి నర్తకి కూడా అయిన అంజలీదేవి 28 హిందీ, 11 తమిళ సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ,కన్నడ, హిందీ భాషలలో దాదాపు 500 సినిమాలలో నటించారు. వాటిలో 400 వరకు హీరోయిన్‌గానే నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు పి. ఆదినారాయణ రావును ఆమె వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమా ఉత్సదశలో ఉండగా అంజలీదేవి హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. లవకుశ చిత్రంలోని సీత పాత్ర ద్వారా మంచిగుర్తింపు పొందారు. ఈ సినిమాలో సీత పాత్రకు ఉత్తమ నటిగా ఆమె రాష్ట్రపతి గోల్డ్‌మెడల్ అందుకున్నారు. ఇప్పటికీ శ్రీరాముడి భార్య సీత అంటే తెలుగు, తమిళ ప్రేక్షకులకు అంజలీదేవి గుర్తుకు వస్తారు. పౌరాణిక పాత్రలలో ముఖ్యంగా సీతగా, రుక్మిణిగా ఆమె నటన అద్భుతం. ఆమె హీరోయిన్గా నటించిన బాలరాజు, అనార్కలి, కీలుగుర్రం, లక్ష్మమ్మ కథ, స్వర్ణసుందరి, రక్షరేఖ వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. సొంత నిర్మాణ సంస్థ 'అంజలీ పిక్చర్స్'ను స్థాపించి తెలుగు, తమిళం, హిందీ భాషలలో దాదాపు 28 సినిమాలను నిర్మించారు. అనార్కలి, చండీప్రియ, సువర్ణసుందరి, స్వర్ణమంజరి, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారాం వంటి చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ సినిమాలంటే సంగీత ప్రధానమైనవిగా గుర్తింపు పొందాయి. అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీ రామారావు, ఎమ్జీఆర్, శివాజీగణేషన్ వంటి అలనాటి మహామహులతో ఆమె నటించారు. మహాకవి క్షేత్రయ్య చిత్రం రాష్ట్రప్రభుత్వ బంగారు నంది అవార్డును గెలుచుకుంది. వయసు మీదపడిన తరువాత ఆమె హీరోయిన్గా నటించడం మానివేశారు. ఆ తరువాత వదినగా, తల్లిగా అద్బుతంగా నటించి మెప్పించారు. అక్కినేని, ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించి అంజలీదేవి ఆ తరువాత కొన్ని చిత్రాలలో వారికి తల్లిగా, వదినగా కూడా నటించారు. 2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం, 2008లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు. అనార్కలి (1955), సువర్ణ సుందరి (1957), చెంచులక్ష్మి (1958), జయభేరి (1959) చిత్రాలకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నటనా శిరోమణి, కలై సెల్వి, అరిగ్నార్ అన్న అవార్డు, లైఫ్ టైమ్ అచ్చీవ్మెంట్ అవార్డులతో సత్కరించింది. అంజలీదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్న అంజలీదేవి చనిపోయిన తరువాత కూడా శ్రీరామచంద్ర వైద్య కళాశాలకు అవయవదానం చేసి పలువురురికి కొత్తజీవితాన్ని ప్రసాదించారు. ఆదర్శంగా నిలిచారు. ఆమె నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు: అనార్కలి, చండీప్రియ ,బాలరాజు, కీలు గుర్రం, రక్షరేఖ, స్వప్నసుందరి, శ్రీ లక్ష్మమ్మ కథ, పల్లెటూరి పిల్ల, స్త్రీ సాహసం,మర్మయోగి, సంఘం, రేచుక్క, అన్నదాత, బంగారు భూమి, రాణీ రత్నప్రభ, జయసింహ, జయం మనదే,చరణదాసి, ఇలవేల్పు , భక్త తుకారాం, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, కుటుంబ బంధం, మాంగల్య బలం, శ్రీ వాసవీ కన్యకపరమేశ్వరీ మహత్యం,శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యం ,శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, కురుక్షేత్రము,సతీ సావిత్రి, సీతారామ వనవాసం, మహాకవి క్షేత్రయ్య, మాయదారి మల్లిగాడు, బడి పంతులు, కాలం మారింది, పండంటి కాపురం, తాత మనవడు, వంశోద్ధారకుడు, విచిత్రబంధం, సుపుత్రుడు, దసరాబుల్లోడు, అగ్నిపరీక్ష, అమ్మకోసం, దేశమంటే మనుషులోయ్, నిర్దోషి, ఆదర్శ కుటుంబం, భలే మాస్టారు, చల్లని నీడ, లక్ష్మీనివాసం, భక్త ప్రహ్లాద, చదరంగం, ప్రైవేటు మాస్టర్, రహస్యం, సతీ సుమతి, స్త్రీ జన్మ, భక్త పోతన, చిలకా గోరింక, డాక్టర్ ఆనంద్, పల్నాటి యుద్ధం, రంగుల రాట్నం, శ్రీకృష్ణ తులాభారం, సతీ సక్కుబాయి, సతీ సావిత్రి, వారసత్వం, పరువు ప్రతిష్ఠ, లవకుశ, స్వర్ణమంజరి, భీష్మ, సతీ సులోచన , భక్త జయదేవ, పచ్చని సంసారం, భట్టి విక్రమార్క , కులదైవం, రుణానుబంధం, బాలనాగమ్మ, జయభేరి, పెళ్ళిసందడి, రాజ నందిని, చెంచులక్ష్మి , సువర్ణ సుందరి, అల్లావుద్దీన్ అద్భుత దీపం, పాండురంగ మహత్యం, పెద్దరికాలు, సతీ అనసూయ. -
అంజలీదేవి మృతికి జగన్ సంతాపం
సీనియర్ నటి, అపర సీత అంజలీదేవి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణంతో తెలుగు చలన చిత్ర రంగం తొలితరానికి చెందిన ఆణిముత్యాన్ని కోల్పోయిందని ఆయన ఓ ప్రకటనలో అన్నారు. తెలుగు ప్రేక్షకులకు సీతమ్మగా అంజలీదేవి ఎప్పటికీ గుర్తుండి పోతారని చెబుతూ, ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
అంజలీదేవి మృతికి సోషల్ మీడియాలో నివాళులు
వెండితెర సీతగా పేరుగాంచిన ప్రముఖ నటి అంజలీ దేవి సోమవారం కన్నుమూశారు. లవకుశ, సువర్ణ సుందరి, అనార్కలీ, బండిపంతులు, బోగి మంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందిన అంజలీ దేవి నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు, 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారం, 2008లో ఎఎన్నాఆర్ అవార్డులను అందుకున్నారు.అంజలీ దేవి మృతికి పలువురు సోషల్ మీడియాలో ట్విటర్ లో నివాళలర్పించారు. Chiranjeevi garu expresses shock and sends his condolences over the demise of veteran Telugu actress Anjali Devi garu. — Jai Chiranjeeva (@CHIRU_NEWS) January 13, 2014 We are deeply saddened to hear the demise of the legendary Anjali devi. Our heartfelt condolences to the family.May her soul rest in peace. — AVM Productions (@ProductionsAvm) January 13, 2014 Piluvakura alugakura nalugurilo nanu o raaja..!!! The wonderful 'Suvarna Sundari' is no more. R.I.P Anjali Devi. — Naga Pavan Kumar (@TikkiTweets) January 13, 2014 Very sad to hear about passing of great actress Anjali Devi garu. RIP.... Seetha ga mimmalni ellakalam gurthinchukuntam.... :( — sri harsha (@modukuriharsha) January 13, 2014 An irreplaceable loss...Rest in Peace Anjali Devi garu! — Neelima Tirumalasett (@TheNeelima) January 13, 2014 Really Sorry to hear the news about the passing away of Veteran Actress Anjali Devi.. A Towering Personality in South! May her soul RIP! — Ramesh Bala (@rameshlaus) January 13, 2014 RIP Anjali Devi. Passed away in Vijaya hospital in Chennai sometime back. I watched her Bhakta Prahlada yesterday :( — Haricharan Pudipeddi (@pudiharicharan) January 13, 2014 Veteran actress Anjali Devi is no more. RIP — idlebrain jeevi (@idlebrainjeevi) January 13, 2014 R.I.P Anjali Devi Garu... The Beloved "SITA" Of South India ... U'l Be Remembered Forever — Miss U SACHIN ♥ (@Cherry_ravi) January 13, 2014 Very sad to hear about passing of great actress Anjali Devi garu. RIP. — SSRajamouli FC (@ssrajamouliFC) January 13, 2014 Not many could bring out the dignity and grace in Sita, as well as Anjali Devi did in Lava Kusa, may god bless her soul. — Ratnakar Sadasyula (@ScorpiusMaximus) January 13, 2014 Ramudu ante NTR and Sita anagane gurthoche 1st name Anjali Devi garu. — Teja (@Urshanthitej) January 13, 2014 Anjali Devi no more !! RIP — Shiva (@ourtrulymahesh) January 13, 2014 Renowned Telugu actress Anjali Devi died in a private hospital today. The 86- year-old was suffering from heart- related problems. #Rip — Rahul Raz (@iamrahulraz) January 13, 2014Telugu Film Industry's eternal Seetha(mma) is no more. R.I.P Anjali Devi Garu. http://t.co/iGJinKsqD5— Vijay Saradhi (@vjeedigunta) January 13, 2014 -
నటి అంజలీదేవి కన్నుమూత
-
సినిమా పరిశ్రమ కొనఊపిరితో ఉంది!
నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్. కామెడీ రూపంలో ఆ టానిక్ని ప్రేక్షకులకు అందిస్తున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యంని ‘నవ్వుల డాక్టర్’ అంటే అతిశయోక్తి కాదు. హాస్య నటుడిగా, కేరక్టర్ నటుడిగా ఆయన స్కోర్ ఏడువందల యాభై సినిమాలు. ఇక, ఆయన వ్యక్తిగత స్కోర్‌కి వస్తే... నేటితో 60వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ధర్మవరపుతో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ... *** 60 ఏళ్ల ఈ జీవన ప్రయాణం మీకెలా అనిపిస్తోంది? వ్యక్తిగతంగానే కాదు... వృత్తిపరమైన ప్రయాణం కూడా సంతృప్తికరంగానే ఉంది. *** 750 చిత్రాల్లో నటించారు కదా.. ఇంకా ఫలానా పాత్ర చేయాలనే కోరికేమైనా ఉందా? తీరని కోరికలు తీరే సమయం కాదిది. సినిమా పరిశ్రమ ఊహకందని వేగంగా వెళుతోంది. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడంలేదు. ఇలాంటి పరిస్థితిలో ఫలానాది చేయాలనే కోరికలు పెట్టుకోవడం సరికాదు. *** పరభాషల నటీనటులను తెలుగుకి తీసుకురావడం పట్ల మీ అభిప్రాయం? కచ్చితంగా బాధాకరమే. నాలాంటి ఓ ఆరేడు మందికి అవకాశాలకు కొదవ లేదు. కానీ, అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య చాలానే ఉంది. అలాంటప్పుడు మనవాళ్లకి అవకాశం కల్పించకుండా ఎక్కడో బాలీవుడ్ నుంచో మరో భాష నుంచో తారలను తీసుకురావడం ఎంతవరకు సమంజసం? కళకు భాషతో సంబంధం లేకపోయినా ఇతర భాషలవాళ్లు ఇక్కడికి రావడంవల్ల మనవాళ్లు ఇబ్బందులకు లోనవుతున్నారు కదా. ఇప్పుడసలు హీరోయిన్ అంటే.. మన తెలుగమ్మాయి ఎక్కడ కనిపిస్తోంది. అంతా బాలీవుడ్వాళ్లే. అంజలీదేవి, జమునలాంటి నటీమణులు జనహృదయాల్లో నిలిచిపోయారు. ఇప్పటి హీరోయిన్లు ఎప్పటికీ మనసుల్లో నిలవరు. *** పరభాషల నుంచి మీకు అవకాశాలు వచ్చినప్పుడు చేశారు కదా? రెండు, మూడు తమిళ చిత్రాల్లోనూ రెండు కన్నడ సినిమాల్లోనూ చేశాను. అది కూడా పెద్ద దర్శకులు అడగడంతో చేశాను. మనకి ఇక్కడ బాగున్నప్పుడు అంత దూరం వెళ్లి సినిమాలు చేయాల్సిన అవసరం ఏంటి? అనిపించింది. *** రాష్ర్టంలో నెలకొన్న రాజకీయాల కారణంగా ఫ్యూచర్లో సినిమా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందేమో... సినిమా అనేది మంచి వినోద సాధనం. దానిపై రాజకీయాల ప్రభావం పడటం బాధ కలిగించే విషయం. నిర్మాతలు, పంపిణీదారులు.. ఇలా చాలామంది నష్టాలపాలవుతున్నారు. ఆస్తులు అమ్ముకుంటున్నారు. అసలే జయాపజయాలతో పరిశ్రమ కుంటుతోంది. కుంటుతూ నడుస్తున్న పరిశ్రమపై ఉద్యమాలు పడుతున్నాయి. ఈ కారణంగా పరిశ్రమ కొన ఊపిరితో ఉందనిపిస్తోంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. *** గతంలో ‘తోకలేని పిట్ట’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మళ్లీ డెరైక్షన్ చేయకపోవడానికి కారణం? ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తే, నటుడిగా పది సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. అవి వదులుకోవడం ఇష్టం లేక డెరైక్షన్ వదిలేశా. *** ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆ మధ్య కాస్త అనారోగ్యంపాలయ్యాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. రెండు నెలల్లో పూర్తిగా కోలుకుంటా. *** ‘సాక్షి’ టీవీకి ‘డిండ్ డాంగ్’ షో చేస్తున్నారు కదా? అది చాలా ఇష్టపడి చేస్తున్న ప్రోగ్రామ్. అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు ‘గో ఎ హెడ్’ అన్నారు. ఎవర్నీ కించపరచకుండా అందర్నీ హాయిగా నవ్వించే కార్యక్రమం ఇది. జాతీయ స్థాయిలో బెస్ట్ న్యూస్ ప్రోగ్రామ్‌గా అవార్డులొచ్చాయి. అందుకే ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాను. రోజు రోజుకీ ‘డింగ్ డాంగ్’ మీద ఇంకా మోజు పెరుగుతోంది. -
లాహిరి లాహిరి - అంజలీదేవి