
నేడు అంజలీదేవి అంత్యక్రియలు
సాక్షి, చెన్నై: అలనాటి మేటి నటి అంజలీదేవి అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. ఈ నెల 12న ఆమె చెన్నైలో కన్నుమూసిన విషయం విదితమే. అదేరోజున ఆమె భౌతికకాయాన్ని పోరూర్‌లోని శ్రీరామచంద్ర ఆస్పత్రికి తరలించడమూ తెలిసిందే. భౌతికకాయాన్ని గురువారం ఉదయం 9 గంటలకు అడయార్‌లోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు.
మధ్యాహ్నం 2 గంటల వరకు సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనకోసం ఉంచుతారు. అనంతరం బీసెంట్ నగర్‌లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ అంత్యక్రియలకు తమిళనాడు సీఎం జయలలితతోపాటు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయి.