కన్న తల్లిని కోల్పోయాను: చంద్రమోహన్ | I feel I've lost my mother: Chandramohan on Anjali Devi | Sakshi
Sakshi News home page

కన్న తల్లిని కోల్పోయాను: చంద్రమోహన్

Published Wed, Jan 15 2014 10:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

కన్న తల్లిని కోల్పోయాను: చంద్రమోహన్

కన్న తల్లిని కోల్పోయాను: చంద్రమోహన్

తెలుగు తెర సీతమ్మ అంజలీ దేవి మరణం తాను జీర్ణించుకోలేక పోతున్నానని ప్రముఖ నటుడు చంద్రమోహన్ వెల్లడించారు. అంజలీదేవి మరణంతో తన కన్న తల్లిని  కోల్పోయానని ఆయన ఆవేదన చెందారు. 1966లో వచ్చిన రంగుల రాట్నం చిత్రంలో అంజలి దేవి, తాను తల్లి కొడుకులుగా నటించామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆనాటి నుంచి అంజలీదేవి తనను కన్న కొడుకులా చూసుకునే వారని, ఆ తర్వాత కాలంలో తమ తల్లికొడుకుల అనుబంధం మరింత పెనవేసుకుందని వివరించారు.

 

చలన చిత్ర సీమలో అంజలీదేవి మకుటం లేని మహారాణి అని అభివర్ణించారు. తనకు ఎక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అక్కడ అంజలీదేవి తప్పకుండా హాజరయ్యేవారని పేర్కొన్నారు. అంజలీ దేవి చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. ఆమె అంత్యక్రియలు గురువారం చెన్నైలో జరుగుతాయి. ఆమె గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement