
స్వగృహానికి అంజలీదేవి భౌతికకాయం
చెన్నై : ఈనెల 12వ తేదీన కన్నుమూసిన అంజలీదేవి భౌతికకాయాన్ని అడయార్లోని ఆమె స్వగృహానికి తరలించారు. నేడు అంజలీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. అవయవదానం కోసం ఆమె పార్థివదేహాన్ని చెన్నైలోని వడపళనిలోని విజయా ఆస్పత్రి నుంచి పోరూర్ శ్రీరామచంద్ర ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
ఈరోజు ఉదయం అంజలీదేవి అడయార్‌లోని ఆమె స్వగృహానికి తీసుకు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం ఉంచుతారు. అనంతరం బీసెంట్ నగర్‌లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ అంత్యక్రియలకు తమిళనాడు సీఎం జయలలితతోపాటు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయి.