
సాక్షి, చెన్నై : భార్యను చితకొట్టిన బుల్లితెర నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలకి వెళితే స్థానిక తిరువాన్మయూర్, ఎల్‌బీ రోడ్డులో నటుడు ఐశ్వర్ రఘునాథన్ నివాసం ఉంటున్నారు. ఐశ్వర్ భార్య జయశ్రీ టీవీ నృత్య దర్శకురాలు. కాగా ఐశ్వర్ తన భార్యకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్‌ను కుదవ పెట్టి డబ్బు తీసుకున్నాడని సమాచారం. దీంతో భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడేవారు. అదే విధంగా శనివారం కూడా ఈ వ్యవహారంపై ఐశ్వర్ రఘునాథన్‌కు జయశ్రీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన ఐశ్వర్ రఘునాథన్ భార్యను కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన జయశ్రీ అడయార్‌లోని ఒక ప్రవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందింది. అనంతరం ఆమె అడయార్ మహిళా పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుల్లితెర నటుడు ఐశ్వర్ రఘునాథన్‌ను, అతడి తల్లిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment