వైఎస్ఆర్సిపి ఎంపిటిసి కుటుంబం కిడ్నాప్ | YSRCP MPTC family kidnapped | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సిపి ఎంపిటిసి కుటుంబం కిడ్నాప్

Published Tue, Jul 1 2014 4:31 PM | Last Updated on Fri, Aug 3 2018 2:51 PM

YSRCP MPTC family kidnapped

హైదరాబాద్: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం నెమలపురి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ వేముల అంజలిదేవి కుటుంబాన్ని  టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ ఏపీ అడిషనల్‌ డీజీపీ ఠాకూర్‌ను కలిశారు. వేముల అంజలీదేవి కుటుంబాన్ని కిడ్నాపర్ల నుంచి విడిపించాలని వారు  ఠాకూర్‌కు వినతి పత్రం అందజేశారు.

అధికారం కోసం కొందరు నేతలు కిడ్నాప్లకు తెగబడుతున్నారు. బలం లేకపోయినా దౌర్జన్యంగానైనా జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్ పదవుల కోసం కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు.  ఎంపీటీసీల బంధువులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డిని కలిసి టిడిపి నేతలపై   ఫిర్యాదు కూడా చేశారు. టిడిపి నేతలపై కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement