గత సంవత్సర కాలంగా సినీ ప్రముఖులు అనేక మంది ఎన్నడు లేని విధంగా వరుసగా అశువులు బాయడం బాధాకరమైన విషయం. చిత్ర పరిశ్రమ దిగ్ధంతులు ఒక్కొక్కరు అర్థాంతరంగా, సహజంగా, అసహ జంగా తెరమరుగవుతున్నారు. దీంతో సినీ అభిమానులు తమ ఆప్తు లను కోల్పోయినట్లు విచారంలో మునుగుతున్నారు. మహానటీనటులు అంజలిదేవి, ఎ.నాగేశ్వరరావు, దర్శకులు, రచయిత బి.రాజేంద్ర ప్రసాద్, బాపు, బాలచందర్, గణేశ్ పాత్రో, యువ కథా నాయకుడు ఉదయ్‌కిరణ్, క్యారెక్టర్ యాక్టర్ పి.జె.శర్మ, శ్రీహరి, ఆహుతి ప్రసాద్, తెలంగాణా శకుంతల, సంగీత దర్శకుడు గాయకుడు చక్రి, ప్రేక్షకులను తమ హాస్య సంభాషణ, నటనలతో ఉర్రూతలూగించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ లాంటి తమకు తామే సాటైన హాస్యనటులు ఈ భూప్రపంచం నుండి, సినిమాలోకం నుండి జారిపోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. వారు భౌతి కంగా కనిపించకపోయినా వారు తీసిన సినిమాలు, అందించిన సం గీతం, వారు నేడు మనకు కనిపించకపోయినా వారు ఆయా పాత్రలతో లీనమైన సినిమాలు జీవించే ఉంటాయి. ఆ రకంగా వారు ఎప్పుడూ చిరంజీవులే. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం.
- జి.వి.రత్నాకర్‌రావు వరంగల్
వారంతా చిరంజీవులే!
Published Tue, Feb 10 2015 1:05 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM
Advertisement
Advertisement