సీనియర్ నటి, అపర సీత అంజలీదేవి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
సీనియర్ నటి, అపర సీత అంజలీదేవి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణంతో తెలుగు చలన చిత్ర రంగం తొలితరానికి చెందిన ఆణిముత్యాన్ని కోల్పోయిందని ఆయన ఓ ప్రకటనలో అన్నారు.
తెలుగు ప్రేక్షకులకు సీతమ్మగా అంజలీదేవి ఎప్పటికీ గుర్తుండి పోతారని చెబుతూ, ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.