
అంజలీదేవి
చెన్నై: అలనాటి సినీ నటి, నిర్మాత అంజలీదేవికి రెండు రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె పెద్ద కుమారుడు చిన్నారావు తెలిపారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న అంజలీదేవి విజయ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు.
అంజలిదేవి మృతదేహంను 2 రోజులపాటు భద్రపరచేందుకు శ్రీరామచంద్ర వైద్యకళాశాలకు తరలించారు. కుటుంబ సభ్యులకు ఆఖరి చూపు దక్కేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మనవడు, మనవరాలు అమెరికా నుంచి రావాలసి ఉంది.