
సినీ నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ
పెద్దాపురం: అలనాటి మేటి నటి, నిర్మాత అంజలీదేవి విగ్రహాన్ని ఆమె కుమారుడు చెన్నారావు సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లవకుశ చిత్రంలో లవ, కుశ పాత్రలు పోషించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజలీదేవి స్మృతులను గుర్తు చేసుకున్నారు. గత ఏడాది జనవరి 12న అంజలీదేవి చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. వెండితెర సీతకు ప్రేక్షకులను అలరించిన అంజలీదేవి పెద్దాపురంలో జన్మించారు.