ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ గే! | Reham Khan Shocking Claim Imran Khan Is A Homosexual | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 12 2018 9:53 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

Reham Khan Shocking Claim Imran Khan Is A Homosexual - Sakshi

రేహమ్‌ ఖాన్‌, ఇమ్రాన్‌ ఖాన్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఐ ఇన్‌సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు అతని మాజీ భార్య జర్నలిస్ట్‌ రేహమ్‌ ఖాన్‌ ఓ పెద్ద తలనొప్పిగా మారారు. పెళ్లికి ముందే తనను లైంగికంగా వేధించాడని, ఇమ్రాన్‌ ఓ హోమోసెక్సువల్‌ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. నటుడు హమ్జా అలీ అబ్బాసీ, పీటీఐ సభ్యుడు మురాద్‌ సయీద్‌లు, ఇమ్రాన్‌కు హోమోసెక్సువల్‌ భాగస్వాములని తెలిపారు. ఈ విషయాలను త్వరలో విడుదలకానున్న తన ఆటోబయోగ్రఫీలో రేహమ్‌ రాసుకొచ్చినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను మురాద్‌ సయీద్‌ రేహమ్‌ ట్విటర్‌ వేదికగా ఖండించారు. రోత మనుషులు చేసిన ఆరోపణలకు తాను స్పందించాల్సిన అవసరంలేదన్నారు. ఆమె ఎవరి చేతిలో పావుగా మారి.. ఆ ఆరోపణలు చేస్తున్నదో తనకు తెలుసని ట్వీట్‌లో మురాద్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇమ్రాన్‌, అలీ అబ్బాసీలు ఇంకా స్పందించలేదు.

ఇక రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ సతీమణి గురించి రేహమ్‌ ఖాన్‌ తన పుస్తకంలో రాసిన వివాదస్పద ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. వసీం శృంగార అనుభవాల కోసం తన మాజీ, దివంగత సతీమణి ఓ నల్ల జాతీయుడితో సెక్స్ చేసేలా చేశాడని, ఆ తతంగాన్ని మొత్తం దగ్గరుండి చూశాడని పేర్కొంటూ ఆమె ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో లీక్‌ అవ్వడంతో తీవ్ర దుమారం రేగింది. తన చనిపోయిన భార్య గురించి అవమానకరంగా మాట్లాడిందని పేర్కొంటూ వసీం అక్రమ్ లాయరు ద్వారా రేహమ్‌ఖన్‌కు నోటీసులు కూడా పంపించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement