reham khan
-
పరేషాన్లో ఇమ్రాన్! పూర్తిగా గాలి తీసేసిన మాజీ భార్య రెహమ్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో తాజా పరిస్థితులపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇమ్రాన్ ఇప్పుడో గత చరిత్ర అని, నయా పాకిస్థాన్ పేరుతో పేర్చిన చెత్తను శుభ్రం చేయాలని, దీని కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆమె అన్నారు. ఇమ్రాన్‌కు సామర్థ్యం, తెలివి లేదని రెహమ్ విమర్శించారు. ఇమ్రాన్ చేసిన ప్రసంగాన్ని రెహమ్ తీవ్రంగా విమర్శిస్తూ.. మీరు ప్రధాని కానప్పుడే పాక్ ఉన్నతంగా ఉందని కామెంట్స్ చేశారు. ఇమ్రాన్‌కు మూడు పెళ్లిళ్లు.. ఇమ్రాన్‌కు రెహమ్ ఖాన్.. రెండో భార్య. కాగా, 1995లో బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడిన ఇమ్రాన్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. 2015 జనవరిలో బీబీసీ జర్నలిస్ట్ రెహమ్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నా ఇమ్రాన్.. ఆమెతో అక్టోబర్‌లో విడిపోయింది. తొమ్మిది నెలలకే వీరి వివాహ బంధం తెగిపోయింది. ఇక మూడోదిగా మతగురువైన బుష్రా మనేకాను ఇమ్రాన్ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే బుష్రా.. ఇమ్రాన్‌తో విడిపోయారు. మరోవైపు.. అవిశ్వాస తీర్మానం నుంచి ఇమ్రాన్ ఖాన్ గట్టెక్కడం కష్టతరంగా మారినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సభ్యుల ఓట్లు అవసరం ఉండగా.. ప్రస్తుతం ఇమ్రాన్ ప్రభుత్వానికి 163 మంది సభ్యుల బలముంది. ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేసే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి ఎలాగైనా దింపేందకు అవసరమైన బలాన్ని విపక్షాలు కూడగడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ దిగిపోతే ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్ షహబాజ్ షరీఫ్.. పాక్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఆ దేశ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. Imran is history!! I think we should focus on standing together for cleaning the mess Naya Pakistan has left. https://t.co/2Bp04ZDbqY — Reham Khan (@RehamKhan1) April 1, 2022 -
‘అలా చూస్తున్నావేంటి.. చంపుతావా?’
ఇస్లామాబాద్ : మరికొద్ది రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. అయితే ఎన్నికల ముందు ఇమ్రాన్ మీద వచ్చినన్ని ఆరోపణలు ఇంక ఎవరిమీద వచ్చిండవు. ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ అయితే ఇమ్రాన్ ఖాన్ గురించి ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేశారు. కానీ ఇవేవి ఇమ్రాన్ ఖాన్ గెలుపుకు ఆటంకం కాలేదు. ఎన్నికల్లో ఆయన పార్టీ మెజారిటీ స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల విజయంతో ఇమ్రాన్ సంతోషంగా ఉన్నారు కానీ ఆయన అభిమానులు మాత్రం ఇమ్రాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్‌ను విమర్శించడం మానడం లేదు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. లండన్‌లో రెహమ్ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేస్తుండగా తీసిన వీడియో ఇది. ఈ వీడియోలో రెహమ్ ఖాన్ ఇంటర్వ్యూలో ఉండగా అనుకోకుండా ఒక యువతి వచ్చి తన మాటలతో ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది. కానీ రెహమ్ ఖాన్ మాత్రం సహనం కోల్పోకుండా.. ఆ యువతి అడిగిన ప్రశ్నలకు సమాధానలు చెప్పారు. వీడియోలో ఉన్న దాన్ని ప్రకారం సదరు యువతి రెహమ్‌ను ఉద్దేశిస్తూ ‘బుష్రి బీబీ పాకిస్తాన్ తొలి మహిళ కాబోతున్నారు. ఇప్పుడ ఆమెను చూస్తే మీకు ఈర్ష్య కలుగుతుందా’ అంటూ ప్రశ్నించింది. రెహమ్ ఖాన్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేలోపే సదరు యువతి ‘మీరు కేవలం కెమెరా ముందు మాత్రమే దుపట్టా కప్పుకుంటారు, మీరు హిపోక్రాట్’(కపటి వేషదారి) అంటూ రెహమ్ని దూషించడం ప్రారంభించింది. ఆ యువతి తనను ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా రెహమ్ ఖాన్ మాత్రం సహనం కోల్పోలేదు. చివరిగా రెహమ్ ఖాన్ సదరు యువతితో ‘మీరు నాతో అయిన మాట్లాడండి లేదా నన్నయినా మాట్లాడన్విండి’ అన్నారు. కానీ ఆ యువతి రెహమ్ ఖాన్ మాటలను పట్టించుకోకుండా ఆమె కుమారున్ని ఉద్దేశిస్తూ ‘ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు.. చంపుతావా ఏంటి’ అంటూ ప్రశ్నించింది. అందుకు రెహమ్ ‘నువ్వు తన తల్లి పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ, ఆమెను ఇబ్బంది పెడుతున్నావు అందుకే అలా చూస్తున్నాడు’ అంటూ సమాధానమిచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువతి ప్రవర్తనను తప్పుపడుతూ.. రెహమ్ ఖాన్‌ను అభినందిస్తున్నారు. You can disagree with Reham, don't believe what she writes or says but there is simply no reason to harrass her in public spaces. Rude and fascist beahviour. pic.twitter.com/TvHtEHOvWf — Raza Ahmad Rumi (@Razarumi) August 7, 2018 -
‘అలా చూస్తున్నావేంటి.. చంపుతావా?’
-
తగని ప్రశ్న తగిన జవాబు
ప్రశ్న: మీ పూర్వపు భర్త ఇమ్రాన్‌ఖాన్ లైంగిక అవలక్షణాలపై మీరు పుస్తకం రాశారు. కానీ అదేమీ పాకిస్తాన్ ఓటర్లపై ప్రభావం చూపినట్లు లేదు. ఆయనిప్పుడు పాక్ ప్రధాని కాబోతున్నారు. మీరు ఆశించినట్లు జరగనందుకు నిరాశకు లోనయ్యారా? రెహమ్ ఖాన్ : నా పుస్తకం అతడి గెలుపును అడ్డుకుంటుందన్న భ్రమ నాకు లేదు. ఇప్పుడైనా అది అతడి గెలుపు కాదు. మిలటరీ డైరెక్షన్లో అతడిదొక పాత్ర. అంతే. యూత్‌కి అతడు ఒక రాంగ్ రోల్ మోడల్. అతడి ప్లేబాయ్ ఇమేజ్ అతడిని ఓడించకపోవడానికి కారణం.. సమాజంలో పురుషుడంటే ఉన్న ఎక్కువ భావనే, స్త్రీ అంటే ఉన్న తక్కువ భావన తప్ప ఇంకొటి కాదు. -
ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య తీవ్ర ఆరోపణలు
ఇస్లామాబాద్: తాజా పాకిస్థాన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహం ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడం వల్లే ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో గెలిచారని ఆమె ఆరోపించారు. పాక్ సైన్యం నుంచి ఇమ్రాన్ లబ్ధి పొందాడని, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశాక విదేశాంగ శాఖ సైన్యం చేతిలోకి వెళ్లిపోతుందని ఆమె పేర్కొన్నారు. తాజాగా పాకిస్థాన్‌లోని 270 స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ 115 స్థానాలు గెలుపొందినట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్ సమాయత్తమవుతున్నారు. త్వరలోనే పాక్ ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీఎన్ఎన్-న్యూస్ 18తో రెహాం ఖాన్ మాట్లాడారు. ‘పాక్ ఎన్నికలు ఆశ్చర్యపరచలేదు. ఫలితాలు ఊహించినవే. చాలామంది ఇమ్రాన్‌ను ప్రోత్సహించారు. ఆయనపై ఎంతో పెట్టుబడి పెట్టారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. ఆర్మీ ఇప్పుడు పాక్ విదేశాంగ శాఖను నిర్వహించబోతోంది’ అని రెహం ఖాన్ అన్నారు. -
బాలీవుడ్ హీరోకు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య ప్రశంస
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ తన ఆత్మకథలో సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె తన ఆటోబయోగ్రఫీని విడుదల చేయడంతో ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. తన మాజీ భర్త ఒక మత్తు బానిస అని, అతడి స్నేహితుడితో శారీరక సంబంధం కలిగి ఉండేవారని, ఆయనకు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారంటూ ఇలా తన ఆత్మకథలో ఎక్కువ భాగం ఇమ్రాన్ ఖాన్‌ను విమర్శిస్తూనే రాశారు. అంతేకాకుండా తన పైశాచికత్వంతో భార్యను వేధించాడంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రంపై కూడా వివాదాస్పద ఆరోపణలు చేశారు. అయితే పలువురు వ్యక్తులను కటువైన పదజాలంతో విమర్శిస్తూ రాసుకొచ్చిన రేహమ్... 445 పేజీలతో కూడిన తన ఆత్మకథలో కేవలం ఒకే ఒక వ్యక్తిని పొగడటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంతో మర్యాద కలిగిన వ్యక్తి అంటూ రెహమ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. అసలైన వ్యక్తిత్వం అంటే ఇదే.. గతంలో ఒక ప్రఖ్యాత చానల్లో జర్నలిస్టుగా పని చేసిన రెహమ్ ఖాన్.. ఓ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో కాసేపు ముచ్చటించారట. ‘2008లో డోంట్ డిలే... క్లెయిమ్ టుడే అనే కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్, భారత్ నుంచి కొంత మంది ప్రముఖ వ్యక్తుల ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వచ్చింది. అందరిలోనూ ప్రధాన ఆకర్షణగా ఉన్న షారుఖ్ ఖాన్‌తో మాట్లాడాను. వృత్తి పట్ల అతడి నిబద్ధత అమోఘం. అంత పెద్ద సెలబ్రిటీ అయినా కొంచెం కూడా పొగరు లేదు. అతడి ప్రొఫెషనలిజం చూస్తే నాకు ముచ్చటేసింది. మధ్య తరగతి నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన తన మూలాల్ని మర్చిపోలేదు. నిజమైన వ్యక్తిత్వం అంటే అదే. షారుఖ్ ఎంతో మర్యాదస్తుడు’ అంటూ రేహమ్ ఖాన్ తన పుస్తకంలో రాశారు. -
నీకసలు సిగ్గుందా.?
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ నిప్పులు చెరిగారు. రెహమ్ ఖాన్ ఆత్మకథ ‘టెల్-ఆల్’ నుంచి లీకైన కొన్ని వాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఓ మహిళవై ఉండి ఇలాంటి రాతలు రాయడానికి సిగ్గుండాలని ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఏపీఎంఎల్) ట్వీట్ చేయగా ముషార్రఫ్ రీట్వీట్ చేశారు. ‘రెహమ్ ఖాన్‌ను పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (పీఎంఎల్ఎన్) తమ ఎజెండా కోసం ఉపయోగించుకుంటుంది. వాట్సాప్‌లో ఆమె పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలను చదివాను. ఇలాంటి రాతలు రాయడానికి ఆమెకు సిగ్గుండాలి. ఇలాంటి చెత్త రాతలను ప్రత్యేకించి మహిళలు రాయకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. Retweeted APML (Official) (@APMLOfficial_): Reham khan is being used by PMLN i have read some content in whatsapp messages she should be quite ashamed of herself you don't write such things and specially a lady... https://t.co/QIgKIbZvVv — Pervez Musharraf (@P_Musharraf) June 15, 2018 మహిళలు ఏం మాట్లాడాలి? ముషర్రాఫ్ వ్యాఖ్యలపై రెహమ్ ఖాన్ ఘాటుగా స్పందించారు. మరీ మహిళలు ఏం మాట్లాడాలో నిర్ణయించేది ఎవరని ప్రశ్నించారు. ‘ముషర్రాఫ్ చేసిన ట్వీట్ ఎలా ఉందంటే.. మహిళలు ఏం మాట్లాడవద్దు. పురుషులు ఏం చేసినా సహిస్తూ.. గమ్మునుండాలి. మహిళలు ఏం రాయాలి, ఏం మాట్లాడాలి అని నిర్ణయించాడానికి వీళ్లేవరు. ఇది చాలా తప్పు’ అని ఈ మాజీ జర్నలిస్టు మండిపడ్డారు. పీఎంఎల్ఎన్ పార్టీతో తనకు సంబంధం ఉన్నట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ‘నాకు నవాజ్ షరీఫ్ పార్టీ (పీఎంఎల్ఎన్)తో ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన చాలా ధృడమైన వ్యక్తి. వారి ఎజెండాలో భాగంగా నా పుస్తకం రావడం లేదు. ఇంకా నా పుస్తకం విడుదల కూడా కాలేదు. వారి ఎజెండా ప్రకారం నేను నడుచుకోవడం లేదు.’’ అని ఆమె స్పష్టం చేశారు. రెహమ్ ఖాన్ తన పుస్తకంలో ఇమ్రాన్ ఖాన్ ఓ గే అని, పెళ్లికి ముందే తనను వేధించాడని.. మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ శృంగార అనుభవాల కోసం తన మాజీ, దివంగత సతీమణి ఓ నల్ల జాతీయుడితో సెక్స్ చేసేలా చేశాడని, ఆ తతంగాన్ని మొత్తం దగ్గరుండి చూశాడని పేర్కొనడం తీవ్ర దుమారాన్ని రేపింది. పుస్తకం విడుదల చేయడం వెనుక మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హస్తం ఉందని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్ ఈ పుస్తకాన్ని పాకిస్తాన్లో విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోర్టును సైతం ఆశ్రయించారు. చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఓ గే! -
నా పుస్తకంలో అన్నీ వాస్తవాలే: రెహమ్ ఖాన్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఆత్మకథపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే తన పుస్తకం‘ టెల్-ఆల్’లో ఉన్న విషయాలన్నీ వాస్తవాలేనని ఆమె చెప్పుకొచ్చారు. సామాజిక వేత్త, జర్నలిస్టు అయిన రెహామ్ ఖాన్ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ‘నా ఆత్మకథ నుంచి కొన్ని విషయాలు బహిర్గతమై వివాదాస్పదమయ్యాయి. కానీ అవన్నీ వాస్తవాలే. అందరికీ నిజాలు తెలియాలనే ఈ పుస్తకాన్ని రాసాను. ఈ పుస్తక విడుదల విషయంలో నాకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ నేను వాటికి భయపడే వ్యక్తిని కాదు’ అని తెలిపారు. తన పుస్తకం ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోందని, ముఖ్యంగా వైఫల్యాలను ఎలా అధిగమించాలో తెలియజేస్తోందన్నారు. ‘ఈ పుస్తకంలో నా జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని రాసుకొచ్చాను. నా బాధలు, ఒడిదుడుకులు, వాటిని ఎలా అధిగమించాననే విషయాన్ని పేర్కొన్నాను. నా పుస్తకం చదివిన తర్వాత చాలా మంది మహిళలకు వారి జీవితంలోని కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు ఇతరులకు జరగవద్దని కోరుకుంటున్నాను. వైఫల్యాలను ఎలా అధిగమించాలో ఈ పుస్తకం తెలియజేస్తోంది. దీనిలో మొత్తం నా జీవిత ప్రయాణం వివరించాను. నా జర్నలిజం లైఫ్, యాంకర్‌గా మారడం, గ్లామరస్ లైఫ్ అన్ని విషయాలు ప్రస్తావించాను. చాలా నిక్కచ్చిగా అన్ని విషయాలు పేర్కొన్నాను. ఈ పుస్తకం పట్ల భయపడుతున్నావారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నా జీవితం గురించే మాత్రమే.’ అని చెప్పుకొచ్చారు. ఈ పుస్తకంలో ఇమ్రాన్ ఖాన్ ఓ గే అని, పెళ్లికి ముందే తనను వేధించాడని పేర్కొనడం.. వసీం అక్రమ్ సతీమణి గురించి రాసిన విషయాలు బయటకి రావడం తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఇమ్రాన్‌ఖాన్ ఈ పుస్తకాన్ని పాకిస్తాన్లో విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించారు. -
ఇమ్రాన్ ఖాన్ ఓ గే!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు అతని మాజీ భార్య జర్నలిస్ట్ రేహమ్ ఖాన్ ఓ పెద్ద తలనొప్పిగా మారారు. పెళ్లికి ముందే తనను లైంగికంగా వేధించాడని, ఇమ్రాన్ ఓ హోమోసెక్సువల్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. నటుడు హమ్జా అలీ అబ్బాసీ, పీటీఐ సభ్యుడు మురాద్ సయీద్‌లు, ఇమ్రాన్‌కు హోమోసెక్సువల్ భాగస్వాములని తెలిపారు. ఈ విషయాలను త్వరలో విడుదలకానున్న తన ఆటోబయోగ్రఫీలో రేహమ్ రాసుకొచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను మురాద్ సయీద్ రేహమ్ ట్విటర్ వేదికగా ఖండించారు. రోత మనుషులు చేసిన ఆరోపణలకు తాను స్పందించాల్సిన అవసరంలేదన్నారు. ఆమె ఎవరి చేతిలో పావుగా మారి.. ఆ ఆరోపణలు చేస్తున్నదో తనకు తెలుసని ట్వీట్లో మురాద్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇమ్రాన్, అలీ అబ్బాసీలు ఇంకా స్పందించలేదు. ఇక రెండు రోజుల క్రితం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సతీమణి గురించి రేహమ్ ఖాన్ తన పుస్తకంలో రాసిన వివాదస్పద ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. వసీం శృంగార అనుభవాల కోసం తన మాజీ, దివంగత సతీమణి ఓ నల్ల జాతీయుడితో సెక్స్ చేసేలా చేశాడని, ఆ తతంగాన్ని మొత్తం దగ్గరుండి చూశాడని పేర్కొంటూ ఆమె ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో లీక్ అవ్వడంతో తీవ్ర దుమారం రేగింది. తన చనిపోయిన భార్య గురించి అవమానకరంగా మాట్లాడిందని పేర్కొంటూ వసీం అక్రమ్ లాయరు ద్వారా రేహమ్ఖన్కు నోటీసులు కూడా పంపించాడు. -
రెహమ్ పుస్తకం : పాకిస్తాన్ గగ్గోలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ పుస్తకంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. ఇమ్రాన్ ఖాన్, రెహమ్ ఖాన్ల దాంపత్య జీవితం గురించి పుస్తకంలో రెహమ్ రాసినట్లు ఆ దేశానికి చెందిన డాన్ పత్రిక పేర్కొంది. పుస్తకంలోని కాంట్రవర్సీ అంశాలను తొలగించాలని పీటీఐ డిమాండ్ చేసింది. లేకపోతే రెహమ్పై క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించింది. శృంగార సంబంధిత అంశాలను రెహమ్ పుస్తకంలో రాశారని, ఈ పుస్తకం విడుదల కావడం వల్ల కుటుంబ విలువలు దెబ్బతింటారని పార్టీ సెక్రటరీ వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో రెహమ్ ఈ పుస్తకాన్ని విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెహమ్ ఈ సమయంలో పుస్తకం విడుదల చేయడం వెనుక మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హస్తం ఉందని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, 2015లో రెహమ్, ఇమ్రాన్ ఖాన్లు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2018 జనవరిలో ఇమ్రాన్ బుష్రా మాలిక్‌ను వివాహమాడారు. అయితే, పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత ఈ విషయాన్ని ఇమ్రాన్ బయటపెట్టారు. తనను పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా ఇమ్రాన్ ఇలానే కొన్నాళ్లు రహస్యంగా ఉంచారని రెహమ్ పేర్కొన్నారు. తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను పుస్తకంలో రాసినట్లు రెహమ్ తెలిపారు. అయితే, ఇమ్రాన్‌పై కోపం పెట్టుకుని, ఆ కక్షతో పుస్తకం రాయలేదని చెప్పారు. -
‘ఇమ్రాన్‌ఖాన్‌కు నీతి, నిజాయితీ లేదు’
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్‌కు అసలు నీతి, నిజాయితీ లేదంటూ మండిపడ్డారు. తనను రెండో వివాహం చేసుకున్నసంగతిని దాచిపెట్టిన ఇమ్రాన్‌ఖాన్.. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టు రెహంఖాన్ను 2015లో పెళ్లిచేసుకున్నఇమ్రాన్.. పదినెలలకే ఆమెతో విడిపోయి మరో పెళ్లి చేసుకున్నా ఆ కాపురం రెండు నెలలే సాగింది. ఎన్నికలకు ముందే ఇమ్రాన్ వ్యవహారంపై పుస్తకం తెచ్చేపనిలో ఉన్నారు రెహమ్ ఖాన్. అయితే రెహమ్ ఖాన్ ఆటో బయోగ్రఫీని అడ్డుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఏది ఏమైనా ఆ పుస్తకాన్ని బయటకు తెస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు రెహమ్ ఖాన్. 1995లో బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడిన ఇమ్రాన్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. 2015లో బీబీసీ జర్నలిస్ట్ రెహమ్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నా తొమ్మిది నెలలకే ఆ బంధమూ తెగిపోయింది. ఇక మూడోదిగా మతగురువైన బుష్రా మనేకాను ఇమ్రాన్ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే బుష్రా.. ఇమ్రాన్‌తో విడిపోయారు. -
‘ఇమ్రాన్ పచ్చి మోసగాడు, నా ముందే ఆమెతో..!’
లాహోర్ : మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లిపై రెండో భార్య రేహమ్ ఖాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్ పచ్చి మోసగాడని, వివాహేతర సంబంధాల్లో ఆరితేరాడని ఆరోపించారు. ‘టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేహమ్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. మూడో పెళ్లి ప్రకటన ఓ నాటకం : ‘‘నేను భార్యగా ఉన్నప్పుడే అతనికి బుష్రాతో వివాహేతర సంబంధం ఉంది. నా ముందే ఆమెతో చనువుగా ఉండేవాడు. అందుకే 10 నెలలు తిరక్కుండానే అతనికి విడాకులు ఇచ్చేశా. మొన్న ఆదివారం ఇమ్రాన్ మూడో పెళ్లి చేసుకున్నట్లు పీటీఐ పార్టీ ప్రకటించింది. కానీ నిజమేంటంటే.. ఆ తంతు నెలన్నర కిందటే జరిగింది. విచిత్రమేంటో తెలుసా? నా పెళ్లప్పుడు కూడా ఇలానే జరిగింది. మేం పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత ఆ ఫొటోలు, ప్రకటనను మీడియాకు ఇచ్చారు. ఇమ్రాన్ లాంటి నీతిమాలిన వ్యక్తిని నా జీవితంలో చూడలేదు’’ అని రేహమ్ వ్యాఖ్యానించారు. కౌంటర్ ఇవ్వబోయి అడ్డంగా బుక్కయ్యారు : రేహమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలపై స్పందించిన ఇమ్రాన్ అభిమానులు.. కౌంటర్ ఇచ్చేందుకు విఫలయత్నం చేశారు. ‘రేహమ్ వ్యాఖ్యలు వాస్తవాలేనని నమ్ముతున్నారా?’ అని ట్విటర్లో పోల్ క్వశ్చన్ పెట్టారు. ప్రతిగా రేహమ్ సైతం తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టారు. గడిచిన మూడేళ్లుగా ఇమ్రాన్- బుష్రాలు కలిసే ఉంటున్నట్లు స్వయంగా బుష్రా మాజీ భర్తే చెప్పినట్లు పేర్కొన్నన్నారు. ‘ఇమ్రాన్-బుష్రాలు జనవరిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ మొన్ననే పెళ్లైనట్లు పార్టీ ప్రకటించడం దారుణం’ అని నెటిజన్లు సైతం వ్యాఖ్యానించారు. దీంతో ఖంగుతిన్న ఇమ్రాన్ వర్గీయులు ‘వంద మంది కుట్రదారులు వచ్చినా మా గెలుపును ఆపలేరు’అంటూ కవరింగ్ ఇచ్చారు. 1992లో పాక్ జట్టుకు క్రికెట్ ప్రపంచ కప్ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్.. తొలుత బ్రిటిష్ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. ఇప్పుడు తాజాగా మత గురువైన బుష్రాను మూడో పెళ్లి చేసుకురు. -
పాక్‌ను వీడిన ఇమ్రాన్ మాజీ భార్య
ఇస్లామాబాద్ : తెహ్రాక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్, ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య రెహాం ఖాన్ పాకిస్తాన్‌ను విడిచివెళ్లారు. రెహాం ఖాన్ సిబ్బందికి పలుమార్లు బెదిరింపు కాల్స్ రావడంతో ఆదివారం రాత్రి ఆమె పాకిస్తాన్‌ను వీడివెళ్లారు. పాక్‌కు చెందిన ఓ టెలివిజన్ చానెల్‌కు ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. తన కుమార్తె పాఠశాల విద్యను అభ్యసిస్తున్నా బెదిరింపుల నేపథ్యంలో అనివార్యంగా పాక్‌ను వీడాల్సివచ్చిందని బ్రిటిష్ పాకిస్తానీ జర్నలిస్ట్ అయిన రెహాం ఖాన్ (44) ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రెహాం రాకను ఇమ్రాన్ వ్యతిరేకించడంతో వీరిరువురి వివాహ బంధానికి బ్రేక్ పడింది. ఇమ్రాన్‌ఖాన్ తొలుత జెమినా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడి ఏడేళ్లు కలిసిఉన్న తర్వాత 2004లో ఆమెతో తెగతెంపులు చేసుకున్న అనంతరం రెహాం ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. -
తనివి తీరలేదే...!
కలిసి ఉన్నప్పుడు జీవితంలో చాలా సాయంత్రాలు చూసి ఉంటారు. కానీ విడిపోయాక... ఎవరి సాయంత్రం వారిదే.. అయితే పాక్ మాజీ స్టార్ ఇమ్రాన్ ఖాన్ మాత్రం చాలా ఏళ్ల తర్వాత ఈడెన్‌లో ఓ అందమైన సాయంత్రాన్ని ఆస్వాదించారు. రాజకీయాలతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇండో-పాక్ మ్యాచ్ చూడటానికి కోల్‌కతా వచ్చిన ఆయన ముందర మాజీ భార్య రెహమ్ ఖాన్ ప్రత్యక్షం కావడం ఓ మధురానుభూతిగా మిగిలిపోయింది. ఇద్దరు ఒకరినొకరు తనివితీరా చూసుకుంటూ హుషారుగా పాక్ ఆటగాళ్లతో కబుర్లు చెబుతూ గడిపారు. -
కాక్ పిట్ లో మాజీ క్రికెటర్ భార్య
లాహోర్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. విమానం కాక్ పిట్ లోకి వెళ్లి పైలట్ ను చిక్కుల్లో పడేశారు. లండన్ నుంచి లాహోర్ కు వస్తున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ) విమానంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పీఐఏ దర్యాప్తు చేపట్టింది. కాసేపు కాక్ పిట్ లో కూర్చుంటానని రెహమ్ ఖాన్ అడగ్గా పైలట్ అంగీకరించాడు. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆమె కాక్ పిట్ లో కూర్చుంది. దీనిపై పీఐఏ కన్నెర్ర జేసింది. పైలట్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అనధికారిక వ్యక్తులకు కాక్ పిట్ లో ప్రవేశం లేదని, నిబంధనలకు ఉల్లంఘించిన పైలట్ పై చర్య తప్పదని తెలిపింది. టీవీ జర్నలిస్టుగా పనిచేసిన రెహమ్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లాడింది. పది నెలలు గడవకుండానే ఇద్దరూ విడిపోయారు. తాము విడిపోతున్నట్టు అక్టోబర్ 30న ప్రకటించారు. తన రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంతో రెహమ్ ఖాన్ కు ఇమ్రాన్ విడాకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. -
చపాతీలు చెయ్యమన్నాడని...
క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఇమ్రాన్ ఖాన్ ఎంతో ముచ్చటపడి చేసుకున్న పెళ్లి ఎందుకు విఫలమైందో తెలుసా? టీవీ జర్నలిస్టు రేహమ్ ఖాన్ (42) అతడి నుంచి ఎందుకు విడాకులు తీసుకుందో తెలుసా? తనను వంటింట్లో చపాతీలు చెయ్యమన్నాడని, బయట కనిపించకూడదని ఆర్డర్ చేసేవాడని ఆమె తెలిపింది. విడాకులు తీసుకున్న పది రోజుల తర్వాత ఆమె ఈ విషయాలు వెల్లడించింది. తాను రాజకీయాల్లోకి వద్దామనుకుంటే ఇమ్రాన్ ఖాన్ వద్దన్నాడంటూ అక్టోబర్ 30వ తేదీన వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు అంతకుముందు జెమీమా గోల్డ్‌స్మిత్ అనే బ్రిటిష్ మహిళతో పెళ్లయ్యింది. వాళ్లిద్దరూ 2004లోనే విడాకులు తీసుకున్నారు. బీబీసీలో జర్నలిస్టుగా పనిచేసే రేహమ్ ఖాన్‌కు కూడా అంతకుముందే పెళ్లయ్యింది, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. తనను మాత్రం బయటకు రానీయకుండా, వంటింటి కుందేలులా ఉంచేయాలని అనుకున్నాడని ఆమె చెబుతోంది. తన చిన్నకూతురు పెషావర్‌లోని వీధి పిల్లలకు అంబాసిడర్‌గా అయినప్పటి నుంచి ఆమె చదువు అటకెక్కిందని కూడా రేహమ్ తెలిపింది. గృహహింసకు మీరు బలయ్యారా అని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. తాను అబద్ధం చెప్పదలచుకోలేదని, బలయ్యానని చెప్పింది. ఈ విషయమై ఇమ్రాన్ ఖాన్‌ను మీడియా ఎంత ప్రశ్నించినా.. మౌనమే సమాధానం అయ్యింది. తన గతం గురించి ఇమ్రాన్‌కు తెలిసినా, దాని గురించి మాత్రం ఆలోచిస్తూనే ఉండేవాడని రేహమ్ చెప్పింది. ఇంటికొచ్చే అతిథులకు ఏమీ పెట్టేవాడు కాదని, అతడు కూడా రోజుకు కేవలం ఒక్క చపాతీ మాత్రమే తినేవాడని తెలిపింది. తాను ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉండేదాన్ని గానీ ఆయన మాత్రం నోరు విప్పేవాడు కాదంది. ఇంట్లో కర్టెన్ల రంగు గురించి కూడా ఆయనతో మాట్లాడకూడదని, కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడాలని వివరించింది. అలాగే బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడకూడదని, తాను ఎంతగా ప్రయత్నించానో దేవుడికే తెలుసని రేహమ్ చెప్పింది. ప్రస్తుతం రెండు సినిమాలు నిర్మిస్తున్న ఆమె.. పాకిస్థాన్‌లో వీధిబాలల సంక్షేమం కోసం పని చేస్తూనే ఉంటానంది. -
నకిలీ డిగ్రీ వివాదంలో మాజీ క్రికెటర్ భార్య
ఇస్లామాబాద్: నకిలీ డిగ్రీ వివాదంతో పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఇమ్రాన్ ఖాన్ భార్య రెహమ్ ఖాన్ డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని బ్రిటన్ దినప్రతిక వెల్లడించడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్ లోని నార్త్ లిండ్సే కాలేజీలో బ్రాడ్ కాస్ట్ జర్నలిజంలో డిగ్రీ చదినట్టు రెహమ్ ఖాన్ చెప్పుకున్నారు. అసలు ఆ కాలేజీలో బ్రాడ్ కాస్ట్ జర్నలిజం కోర్సు లేదని, రెహమ్ ఖాన్ పేరుతో ఎవరూ చదవలేదని 'ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' దినపత్రిక వెల్లడించింది. తన క్వాలిఫికేషన్ పై రెహమ్ ఖాన్ అబద్దం చెప్పారని 'డైలీ మెయిల్' పేర్కొంది. పాకిస్థాన్ చానళ్లు ఈ వార్తను పదేపదే ప్రచారం చేయడంతో రెహమ్ ఖాన్ మండిపడ్డారు. ఈ వార్తలు నిరాధారమని ఆమె కొట్టిపారేశారు. -
ఇమ్రాన్ ఖాన్ కు చేదుఅనుభవం
పెషావర్: కొత్తగా పెళ్లాడిన పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కు పెషావర్ లో చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదుల దాడికి గురైన పెషావర్ సైనిక పాఠశాలను సతీసమేతంగా సందర్శించేందుకు వచ్చిన ఆయనను విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దాడిని రాజకీయం చేయడానికి వచ్చారంటూ మండిపడ్డారు. పెళ్లి వేడుకల్లో మునిగి తేలి తీరిగ్గా ఇప్పుడు వస్తారా అంటూ విరుచుకుపడ్డారు. ఆర్మీ స్కూల్ విద్యార్థులను కలుకుసుకునేందుకు తన బార్య రెహామ్ ఖాన్ కలసి బుధవారమిక్కడకు వచ్చినప్పుడు ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది. పెషావర్ ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 134 మంది విద్యార్థులతో సహా 150 మంది మృతి చెందారు. దాడి జరిగిన కొన్ని వారాల తర్వాత సోమవారం ఈ పాఠశాల తిరిగి ప్రారంభమైంది. -
62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి
లేటువయసులో ఘాటుప్రేమ అంటే ఇదేనేమో. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ అత్యంత రహస్యంగా గతంలో బీబీసీలో పనిచేసిన ఓ యాంకరమ్మను పెళ్లి చేసుకున్నాడట. ఆమె పేరు రెహమ్ ఖాన్. 62 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు 41 ఏళ్ల వయసున్న రెహమ్ ఖాన్‌ను గతవారమే పెళ్లి చేసుకున్నాడట. ఆమెకు గతంలో పెళ్లయింది, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. ఇంతకు ముందు పెళ్లి పెటాకులు కావడానికి ముందు ఆమె బ్రిటన్‌లో పెళ్లి చేసుకుంది. బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించేది. గతంలో జెమీమా ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. ఆమెకు 2004లోనే వలిడాకులు ఇచ్చేశాడు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. ఇప్పుడీ కొత్త పెళ్లికి ఇమ్రాన్ ఖాన్ అక్కచెల్లెళ్లతో పాటు పలువురు బంధువులు విముఖంగా ఉన్నారని సమాచారం.