మరికొద్ది రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. అయితే ఎన్నికల ముందు ఇమ్రాన్ మీద వచ్చినన్ని ఆరోపణలు ఇంక ఎవరిమీద వచ్చిండవు. ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ అయితే ఇమ్రాన్ ఖాన్ గురించి ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేశారు. కానీ ఇవేవి ఇమ్రాన్ ఖాన్ గెలుపుకు ఆటంకం కాలేదు. ఎన్నికల్లో ఆయన పార్టీ మెజారిటీ స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల విజయంతో ఇమ్రాన్ సంతోషంగా ఉన్నారు కానీ ఆయన అభిమానులు మాత్రం ఇమ్రాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్‌ను విమర్శించడం మానడం లేదు.తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. లండన్‌లో రెహమ్ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేస్తుండగా తీసిన వీడియో ఇది. ఈ వీడియోలో రెహమ్ ఖాన్ ఇంటర్వ్యూలో ఉండగా అనుకోకుండా ఒక యువతి వచ్చి తన మాటలతో ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది. కానీ రెహమ్ ఖాన్ మాత్రం సహనం కోల్పోకుండా.. ఆ యువతి అడిగిన ప్రశ్నలకు సమాధానలు చెప్పారు.