62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి | imran khan marries again at the age of 62 | Sakshi
Sakshi News home page

62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి

Published Thu, Jan 1 2015 7:01 PM | Last Updated on Sat, Mar 23 2019 8:00 PM

62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి - Sakshi

62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి

లేటువయసులో ఘాటుప్రేమ అంటే ఇదేనేమో. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ అత్యంత రహస్యంగా గతంలో బీబీసీలో పనిచేసిన ఓ యాంకరమ్మను పెళ్లి చేసుకున్నాడట. ఆమె పేరు రెహమ్ ఖాన్. 62 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు 41 ఏళ్ల వయసున్న రెహమ్ ఖాన్ను గతవారమే పెళ్లి చేసుకున్నాడట.  ఆమెకు గతంలో పెళ్లయింది, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది.

ఇంతకు ముందు పెళ్లి పెటాకులు కావడానికి ముందు ఆమె బ్రిటన్లో పెళ్లి చేసుకుంది. బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించేది. గతంలో జెమీమా ఖాన్ను పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. ఆమెకు 2004లోనే వలిడాకులు ఇచ్చేశాడు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. ఇప్పుడీ కొత్త పెళ్లికి ఇమ్రాన్ ఖాన్ అక్కచెల్లెళ్లతో పాటు పలువురు బంధువులు విముఖంగా ఉన్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement