‘అలా చూస్తున్నావేంటి.. చంపుతావా?’ | woman heckles former Reham Khan | Sakshi
Sakshi News home page

‘అలా చూస్తున్నావేంటి.. చంపుతావా?’

Published Thu, Aug 9 2018 3:44 PM | Last Updated on Thu, Aug 9 2018 4:04 PM

woman heckles former Reham Khan - Sakshi

రెహమ్‌ ఖాన్‌ (ఫైల్‌ ఫోటో)

ఇస్లామాబాద్‌ : మరికొద్ది రోజుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్తాన్‌ ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. అయితే ఎన్నికల ముందు ఇమ్రాన్‌ మీద వచ్చినన్ని ఆరోపణలు ఇంక ఎవరిమీద వచ్చిండవు. ఆయన మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌ అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ గురించి ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేశారు. కానీ ఇవేవి ఇమ్రాన్‌ ఖాన్‌ గెలుపుకు ఆటంకం కాలేదు. ఎన్నికల్లో ఆయన పార్టీ మెజారిటీ స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల విజయంతో ఇమ్రాన్‌ సంతోషంగా ఉన్నారు కానీ ఆయన అభిమానులు మాత్రం ఇమ్రాన్‌ మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌ను విమర్శించడం మానడం లేదు.

తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. లండన్‌లో రెహమ్‌ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేస్తుండగా తీసిన వీడియో ఇది. ఈ వీడియోలో రెహమ్‌ ఖాన్‌ ఇంటర్వ్యూలో ఉండగా అనుకోకుండా ఒక యువతి వచ్చి తన మాటలతో ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది. కానీ రెహమ్‌ ఖాన్‌ మాత్రం సహనం కోల్పోకుండా.. ఆ యువతి అడిగిన ప్రశ్నలకు సమాధానలు చెప్పారు.

వీడియోలో ఉన్న దాన్ని ప్రకారం సదరు యువతి రెహమ్‌ను ఉద్దేశిస్తూ ‘బుష్రి బీబీ  పాకిస్తాన్‌ తొలి మహిళ కాబోతున్నారు. ఇప్పుడ ఆమెను చూస్తే మీకు ఈర్ష్య కలుగుతుందా’ అంటూ ప్రశ్నించింది. రెహమ్‌ ఖాన్‌ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేలోపే సదరు యువతి ‘మీరు కేవలం కెమెరా ముందు మాత్రమే దుపట్టా కప్పుకుంటారు, మీరు హిపోక్రాట్‌’(కపటి వేషదారి) అంటూ రెహమ్‌ని దూషించడం ప్రారంభించింది. ఆ యువతి తనను ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా రెహమ్‌ ఖాన్‌ మాత్రం సహనం కోల్పోలేదు. చివరిగా రెహమ్‌ ఖాన్‌ సదరు యువతితో ‘మీరు నాతో అయిన మాట్లాడండి లేదా నన్నయినా మాట్లాడన్విండి’ అన్నారు.

కానీ ఆ యువతి రెహమ్‌ ఖాన్‌ మాటలను పట్టించుకోకుండా ఆమె కుమారున్ని ఉద్దేశిస్తూ ‘ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు.. చంపుతావా ఏంటి’ అంటూ ప్రశ్నించింది. అందుకు రెహమ్‌ ‘నువ్వు తన తల్లి పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ, ఆమెను ఇబ్బంది పెడుతున్నావు అందుకే అలా చూస్తున్నాడు’ అంటూ సమాధానమిచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువతి ప్రవర్తనను తప్పుపడుతూ.. రెహమ్‌ ఖాన్‌ను అభినందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement