remarriage
-
మూడో పెళ్లికి 12 మంది పిల్లల తల్లి.. 10 మంది పిల్లల తండ్రి కోసం ఎదురుచూపు!
ప్రపంచంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ‘చిన్న కుటుంబం- చింతలు లేని కుటుంబం’ విధానాన్ని పాటించాలని అన్ని ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. దీనితోడు పెరుగుతున్న ధరలకు బెంబేలెత్తిపోయి తల్లిదండ్రులంతా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే న్యూయార్క్‌కు చెందిన ఒక మహిళ తనకు 12 మంది పిల్లలు ఉన్నా ఇంకా సంతృప్తి చెందడం లేదు. వెరోనికా అనే ఈ మహిళ 14 ఏళ్ల వయసులోనే తల్లయ్యింది. ఆ తరువాత వరుసగా పిల్లలను కంటూ వచ్చింది. 2021లో ఆమె తన రెండవ భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు 37 ఏళ్ల వయసుకు చేరుకున్న ఆమె మరో వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. అయితే తనకు కాబోయే భర్తకు ఇప్పుటికీ 10 మంది పిల్లలు ఉండాలనే కండీషన్ పెట్టింది. అప్పుడు తమ పిల్లల సంఖ్య 22 అవుతుందని పేర్కొంది. ఫేస్బుక్ మాధ్యమంలో తన భావాలను వ్యక్తపరిచిన ఆమె..‘తాను ఇంకా అధికంగా పిల్లలను కావాలనుకుంటున్నానని, అందుకే తగిన భర్త కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. అయితే ఇప్పటికే 10 మంది పిల్లలున్న పురుషుని కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. అప్పుడు తమ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుందని తెలిపింది. ఇందుకోసమే తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. వెరోనికా తమది బ్రిటన్‌లో అతిపెద్ద కుటుంబమై ఉండాలని కోరుకుంటోంది. ఇది కూడా చదవండి: కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా? -
వద్దనుకొని 23 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఆమెతోనే పెళ్లి
డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) లెజెండ్, హాల్ ఆఫ్ ఫేమ్ జేక్ రాబర్ట్(ముద్దుగా The Snake) 68 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడు. ఇక్కడ విచిత్రమేంటంటే 23 ఏళ్ల క్రితం విడాకులు ఇచ్చిన తన భార్యనే మళ్లీ వివాహమాడనున్నాడు. ఈ విషయాన్ని ది స్నేక్ రాబర్డ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. విషయంలోకి వెళితే.. జేక్ రాబర్ట్స్ 1984లో చెరిల్ హాగ్వుడ్ను ప్రేమించి పెళ్లి పెళ్లిచేసుకున్నాడు. ఈ జంటకు నలుగురు పిల్లలు. 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ ఇద్దరు 2000వ సంవత్సరంలో విడిపోయారు. ఆ తర్వాత జేక్ రాబర్ట్స్ 2006లో జూడీ లిన్‌ను వివాహామాడాడు. 2011లో వీరిద్దరికి విడాకులయ్యాయి. అప్పటినుంచి జేక్ రాబర్ట్స్ ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా జేక్ రాబర్ట్స్ తన మనసులోని మాటన బయటపెట్టాడు. ''23 ఏళ్ల క్రితం నా భార్య చెరిల్ హాగ్వుడ్కు విడాకులు ఇచ్చాను. ఇన్నేళ్లు మేము విడిగానే ఉంటున్నా ఫ్రెండ్లీగానే ఉంటూ వచ్చాం. అయితే ఈ మధ్యనే తనను కలిసి మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆమె నుంచి తొలుత స్పందన రాకపోయినప్పటికి తర్వాత పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. నిజంగా మాది ఒక అద్బుత లవ్‌స్టోరీ. 23 ఏళ్లు మేం విడిపోయాం అంటే నమ్మలేకుండా ఉన్నా. దేవుడు నాకు ఇవ్వబోతున్న సెకెండ్ చాన్స్‌ను ఉపయోగించుకుంటా. చెరిల్ హాగ్వుడ్ను ఈసారి కష్టపెట్టను.. ఆమెను బాగా చూసుకోగలను అనే నమ్మకం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌గా పేరు పొందిన జేక్ రాబర్ట్స్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది అతని మెడలో ఒక కొండచిలువను వేసుకొని రింగ్‌లోకి అడుగుపెడుతుండేవాడు. అందుకే ది స్నేక్ మాస్టర్(The Snake) పేరుతో పాపులర్ అయ్యాడు. ఇక 2014లో డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన జేక్ రాబర్ట్స్ ప్రస్తుతం ఆల్ ఎలైట్ రెజ్లింగ్(AEW Pro Wrestling)లో లాన్స్ ఆర్చర్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: స్కూల్ఫ్రెండ్ను పెళ్లాడనున్న సీఎస్కే స్టార్ -
మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళకు ఆస్తి దక్కదు!
బిలాస్పూర్: చనిపోయిన భర్త తరఫు ఆస్తిపై మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళ తన హక్కును కోల్పోతుందని చత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. అయితే, ఆ మహిళ మరో పెళ్లి చేసుకున్నట్లు చట్టప్రకారం నిరూపితం కావాలని స్పష్టం చేసింది. వరుసకు తనకు అన్న అయిన ఘాసీ భార్య కియబాయి.. ఘాసీ మరణానంతరం స్థానిక సంప్రదాయం ప్రకారం మరో పెళ్లి చేసుకుందని, అందువల్ల చనిపోయిన తన అన్న ఆస్తి ఆమెకు చెందకూడదని ఆదేశాలివ్వాలని కోరుతూ లోక్‌నాథ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కే అగర్వాల్ తాజాగా పై ఆదేశాలిచ్చారు. ‘హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్, 1856లోని సెక్షన్ 6 ప్రకారం పునర్వివాహానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు నిరూపితం కావాల్సి ఉంటుంది. పునర్వివాహం చట్టప్రకారం నిరూపితమైతే.. ఆ మహిళకు తొలి భర్త ద్వారా లభించిన ఆస్తిపై హక్కు ఇకపై ఉండదు’ అని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. స్థానిక చుడి సంప్రదాయం(గాజులు ఇవ్వడం ద్వారా ఒక మహిళను పెళ్లి చేసుకోవడం) ప్రకారం కియాబాయి పునర్వివాహం చేసుకుందని లోక్‌నాథ్ వాదించారు. కియాబాయి మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేవని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. -
ఇది ఆదర్శవంతమైన అత్త కథ
భువనేశ్వర్ : ఈ రోజుల్లో అత్తాకోడళ్లు ఎప్పుడూ పాము ముంగీసల్లా కలహించుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ కోడళ్లు చాలా మంది ఉన్నారు. ఒక కుటుంబంలో అత్తా కోడళ్ల మధ్య కలహాలు పక్కింట ముచ్చటగా మారడం సర్వసాధారణంగా కనబడుతోంది. తానూ ఒకప్పుడు కోడలినే అన్న విషయం మరిచి అందరిని వదులుకొని వచ్చిన ఓ ఇంటి ఆడపిల్లను కనికరం లేకుండా కష్ట పెడుతుంటారు అత్తలు. అత్తలు అంటే ఇలానే హింసిస్తారు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఏర్పడింది. కానీ ఆ అభిప్రాయానికి చరమగీతం పాడుతూ... అత్తలో కూడా అమ్మ దాగి ఉంటుందని నిరూపించింది ఓ మహిళ. తల్లిలా మారి వితంతు కోడలికి మరో పెళ్లి చేసి అత్తలకు ఆదర్శంగా నిలిచింది. తన కుమారుడి అకాల మరణంతో ఒంటరిగా మారిన కోడలికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఓ ఇంటి ఆడపిల్ల గురించి పెద్ద మనసుతో ఆలోచించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు ఒడిశాలోని అంగుల్ జిల్లా గోబరా గ్రామానికి చెందిన ప్రతిమా బెహరా. ఆమె ఆ గ్రామానికి ఒకప్పటి సర్పంచు కూడా. ఫిబ్రవరిలో పెళ్లి.. జూలైలో మృతి ప్రతిమ పెద్దకొడుకు రష్మీరంజన్, తురంగ గ్రామానికి చెందిన లిల్లీ బెహర్‌కు గత ఫిబ్రవరిలో అంగరంగా వైభవంగా వివాహం జరిగింది. కూతురిని సంతోషంగా అత్తింటికి పంపించారు లిల్లీ తల్లిదండ్రులు. తనకు మంచి భర్త దొరికాడని లిల్లి.. అందమైన భార్య దొరికిందని రష్మిరంజన్ ఆనందంగా తమ వైవివాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలోనే విధి వారి దాంపత్యాన్ని చూసి ఓర్వలేకపోయింది. పెళ్లయిన అయిదు నెలల్లోనే వారి ఆనందాలను బొగ్గు గని మింగేసింది. గత జూలైలో బొగ్గు గని ప్రమాదంలో రష్మిరంజన్ మృతి చెందాడు. దీంతో ప్రతిమ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. చెట్టంత కొడుకు పోయాడని ప్రతిమ.. భర్త ఇక లేడు అన్న విషయం లిల్లీ జీర్ణించుకోలేకపోయారు. కనీసం కోడలు జీవితం అయినా బాగుండాలని.. పోయిన కొడుకు ఎలాగో తిరిగి రాలేదు.. కనీసం తన కోడలి జీవితం అయినా బాగు చేయాలని ఆలోచించుకుంది ప్రతిమ. ఎవరు ఏమైనా అనుకున్న సరే తన కోడలికి మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. తన బంధువు కొడుకు సంగ్రామ్ బెహరాకు లిల్లీని ఇచ్చి వివాహం చేస్తానని, ఇందుకు ఒప్పకోవాల్సిందిగా ఆయన తల్లిదండ్రులను కోరింది. దీనికి సంగ్రామ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు. దీంతో వితంతువైన లిల్లీ పెళ్లిని ఈ నెల11న ఓ దేవాలయంలో ఘనంగా చేశారు. లిల్లీకి తల్లిగా మారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి చేశారు ప్రతిమ. ‘నా కొడుకు ఎలాగో తిరిగిరాడనే విషయం నాకు తెలుసు. నా కొడుకు లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఈ కష్టాన్ని నా కోడలు పడొద్దు. తనకు ఇప్పుడు కేవలం 20 ఏళ్లే. ఒంటరిగా ఎన్ని ఏళ్లు అని జీవిస్తుంది. తన జీవితం అయినా బాగుండాలి అని మరో పెళ్లి చేశాను. తన జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను’ అని ప్రతిమా పేర్కొంది. కాగా ప్రతిమా చేసిన పనికి సామాజిక కార్యకర్త సుభాశ్రీ దాస్‌తో పాటు మరో పలువురు ప్రశంసిస్తున్నారు. అమ్మలా మారి అత్తలకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
దురాచారం తెల్లబోయింది
మగ మహారాజుల రాజ్యంలో ఏమైనా చెల్లుతుంది. దురాచారం కూడా ఆచారం అయిపోతుంది. బుజ్జి బంగారు తల్లులతో వృద్ధులక రెండోపెళ్లి జరుగుతుంది. అతడు కాలం చేస్తే ఈ బంగారు తల్లి భవిష్యత్తుకు కాలం చెల్లుతుంది. భార్య చనిపోయిన వృద్ధుడికి పునర్వివాహం చెల్లుతుంది. కానీ ముసలి మొగుడు చనిపోయినా... ముక్కుపచ్చలారని చిన్నారికి తెలుపే మిగులుతుంది. ఎదురొస్తే అపశకునం! వేడుకలకు అశుభం!! అలాంటి ‘మగ’వంచితులకు రంగుల పండుగ వచ్చింది. సాక్షాత్తూ ఆ దేవుడి సమక్షంలో బృందావనానికి...వసంతం వచ్చింది! హోలీ రంగ హోలీ... రంగుల రంగేళి! తెలుపుతో సప్తవర్ణాలూ సమ్మేళనం కావాలని తపనపడుతున్నాయి. గులాల్ తొలి అడుగేసింది. ఉత్సాహంతో శ్వేతవర్ణాన్ని ఆలింగనం చేసుకుంది. తనలో కలిపేసుకుంది. ఈ ఉత్సవానికి హోలీ సందర్భం అయితే వారణాసిలోని గోపీనాథ్ ఆలయం వేదిక అయింది. దాదాపు నాలుగువందల ఏళ్లుగా ఏలుబడిలో ఉన్న ఓ అనాచారం... ‘వితంతువులు పంచవన్నెలకు దూరంగా ఉండాలి’ అన్న ఆచారం... దహనమైపోయింది. అన్ని రంగులనూ ఆస్వాదించాలన్న వితంతువుల ఆశలకు ఆ గుడి గంటలు శుభం పలికాయి! సాక్షాత్తు ఆ గోపీనాథుడే ఈ సంబరానికి సాక్షి అయ్యాడు. వారి సంతోషాల్లో భాగమయ్యాడు. వింతంతువులతో కలిసి ఆ స్వామివారు కూడా హాలీ ఆడాడా అన్నంతగా అక్కడ అనందం వెల్లివిరిసింది. వారణాసి. సిటీ ఆఫ్ విడోస్! వితంతువుల నగరం. ఆధ్యాత్మిక కీర్తితోపాటు.. ఇది ఆ ఊరు తెచ్చుకున్న అపకీర్తి కూడా. వందల యేళ్ల కిందటి నుంచి దేశంలో ఏ మూలనో ఉన్న వితంతువులను తన దరికి తెచ్చుకుంటోంది వారణాసి. ప్రస్తుతం దాదాపు 38 వేల మంది వితంతువులు ఇక్కడి వృందావన్లోని పలు ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శతాబ్దం కిందట వితంతువుల విషయంలో ఎలాంటి వైఖరి ఉండేదో ఇప్పటికీ అలాంటి అనాగరిక వైఖరినే అవలంబిస్తున్నారు. తెల్లచీర.. శిరోముండనం, ఒంటిపూట భోజనంతో ప్రకృతిలోని రంగులకు దూరంగా సహజకర్మలను త్యజించి అసహజమైన జీవనశైలిని పాటిస్తున్నారు. పొద్దున్నే సూర్యోదయం కాకముందే ఎవరికంటా పడకుండా.. ఏ ఇంటికీ ఎదురురాకుండా బిక్కుబిక్కుమంటూ గంగాస్నానం చేసి ఆశ్రమం చేరాలి. అంతే. ఇక భోజనం.. భజన.. మాటా, మంతి.. కష్టం, సుఖం అన్నీ ఆ ఆవరణలోనే.. తోటి వితంతువులతోనే! పదిహేనేళ్ల పసిపిల్లల నుంచి కాటికి కాళ్లు చాపిన వృద్ధుల దాకా.. అందరూ కలిసే ఉంటారు. అందరిదీ ఒకటే రకమైన జీవన విధానం... జీవితం! ఒకరిని చూస్తే ఒకరికి ఎక్కడలేని నిస్పృహ.. నిర్లిప్తత. శాంతికి చిహ్నం తెలుపు అంటారు కానీ ఇక్కడ ప్రశాంతతను భగ్నంచేసే పాత్ర ఆ రంగుది. చుట్టూ ఉన్న చెట్లూ పచ్చని బతుకును కాంక్షిస్తున్నట్టుండవ్. శ్వేతమనే శూన్యాన్ని తలపోస్తున్నట్టుంటాయ్. ఇది ఏళ్లనాటి పాత చిత్రం కాదు.. ఇప్పుడు ఈ క్షణం వెళ్లి చూసినా కనిపించే సజీవదృశ్యం! దేశంలో ఎక్కడైనా అంతే! భర్త పోతే పసుపు కుంకుమలతో బతికే హక్కులేదని పురాణాలు పెట్టిన పిచ్చిభ్రమల్లో వారణాసి వితంతువులే కాదు, మన దగ్గరి బంధువులూ కొట్టుమిట్టాడుతున్నారు. కన్నకొడుకు పెళ్లిలో అక్షింతలు వేసి దీవించాలని తపిస్తున్న వితంతు తల్లి ఆశనూ చంపేస్తున్నారు. గాజుల చేతుల హారతులే శుభం అంటూ పదిమంది కూడి చేసుకునే పండగల్లో భాగం లేకుండా చేస్తున్నారు. నలుగురిలో కలిస్తే నష్టమని వితంతువు మొహం మీద నవ్వును మాయం చేస్తున్నారు. పదిమంది ఉన్న ఇంట్లో అయితే వంటిల్లునే ఆమె స్థానంగా ఖరారు చేస్తున్నారు. వండిపెట్టడం తప్ప ఇంకో ధ్యాస లేని బానిసగా మారుస్తున్నారు. వాళ్ల జీవితాల్లో వసంతం లేకుండా చేస్తున్నారు. మూడేళ్ల క్రితం.. ఇలాంటి సంస్కృతిని మూడేళ్ల కిందట బ్రేక్ చేసింది ‘సులభ్ ఇంటర్నేషనల్’ అనే స్వచ్చంద సంస్థ! దానికి వారణాసినే కేంద్రంగా మలచుకుంది. వేలసంఖ్యలో ఉన్న వితంతువులకు అందరిలా హాయిగా.. ప్రకృతిలోని అన్ని వర్ణాలనూ ఆస్వాదిస్తూ బతికే హక్కు ఉందని తెలియజెప్పాలనుకుంది. మూడేళ్ల కిందట.. హోలీనాడు.. ముందుగా వాళ్లమీద రంగుచల్లింది. శూన్యంలో రంగుల వెలుగును చూశారు అక్కడి స్త్రీ మూర్తులు. ఆ ఇంద్రధనుస్సు కొత్త జీవితం మీద ఆశను పెంచింది. ఉక్కిరిబిక్కిరయ్యారు. వృందావన్లోని గోపీనాథుడితోనే రంగులాడాలని ఆరాటపడ్డారు. ఈ ఏడాది కూడా వసంతం ఆ కేళీని మోసుకొచ్చింది. కర్తగా సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను నిలబెట్టింది. నాలుగువందల యేళ్ల సంకెళ్లను బద్దలు కొట్టించి మరీ గోపీనాథుడి ఆలయంలోకి ఆ వితంతువులను తీసుకెళ్లింది. తడిసి ముద్దయ్యారు గులాల్.. హరా... పసుపు.. ఎరుపు.. వంగరంగు.. కెంజాయం... నీలం.. పిచ్కారీలో తడిసిముద్దయిపోయారు... ఆ వసంత కేళీలో కృష్ణుడితో ఆడి అలసిపోయారు. వృందావనం కొత్త శోభను సంతరించుకుంది. ఎవరి సంతోషాలను ఎవరూ హరించరు.. ఎవరూ ఎవరికి అశుభం కారు.. అపశకునం ఊసే లేదు. ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి ప్రకృతి ఒడిలో పరవశించాల్సిందే! తాను అందరి జీవితాల్లో నిండాల్సిందే.. అన్న సత్యాన్ని బోధించడానికే వచ్చింది ఈ వసంతం.... అందుకు వృందావనే సాక్ష్యం! వితంతువుల నుదుట చంద్రుడిని నిలిపి... ఒంటిని అంటిపెట్టుకున్న తెలుపుని రంగులమయం చేసింది.. వృందావనంలో స్త్రీలు... స్వావలంబన, సాధికారత దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.. వారికి చేయూతనందించే పనిలో ఉంది సులభ్ ఇంటర్నేషనల్! తెలుపుతో సప్తవర్ణాలూ సమ్మేళనం కావాలని తపనపడుతున్నాయి. గులాల్ తొలి అడుగేసింది. ఉత్సాహంతో శ్వేతవర్ణాన్ని ఆలింగనం చేసుకుంది. తనలో కలిపేసుకుంది. ఈ ఉత్సవానికి హోలీ సందర్భం అయితే వారణాసిలోని గోపీనాథ్ ఆలయం వేదిక అయింది. దాదాపు నాలుగువందల ఏళ్లుగా ఏలుబడిలో ఉన్న ఓ అనాచారం... ‘వితంతువులు పంచవన్నెలకు దూరంగా ఉండాలి’ అన్న ఆచారం... దహనమైపోయింది. అన్ని రంగులనూ ఆస్వాదించాలన్న వితంతువుల ఆశలకు ఆ గుడి గంటలు శుభం పలికాయి! సాక్షాత్తు ఆ గోపీనాథుడే ఈ సంబరానికి సాక్షి అయ్యాడు. వారి సంతోషాల్లో భాగమయ్యాడు. వింతంతువులతో కలిసి ఆ స్వామివారు కూడా హాలీ ఆడాడా అన్నంతగా అక్కడ అనందం వెల్లివిరిసింది. వారణాసి. సిటీ ఆఫ్ విడోస్! వితంతువుల నగరం. ఆధ్యాత్మిక కీర్తితోపాటు.. ఇది ఆ ఊరు తెచ్చుకున్న అపకీర్తి కూడా. వందల యేళ్ల కిందటి నుంచి దేశంలో ఏ మూలనో ఉన్న వితంతువులను తన దరికి తెచ్చుకుంటోంది వారణాసి. ప్రస్తుతం దాదాపు 38 వేల మంది వితంతువులు ఇక్కడి వృందావన్లోని పలు ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శతాబ్దం కిందట వితంతువుల విషయంలో ఎలాంటి వైఖరి ఉండేదో ఇప్పటికీ అలాంటి అనాగరిక వైఖరినే అవలంబిస్తున్నారు. తెల్లచీర.. శిరోముండనం, ఒంటిపూట భోజనంతో ప్రకృతిలోని రంగులకు దూరంగా సహజకర్మలను త్యజించి అసహజమైన జీవనశైలిని పాటిస్తున్నారు. పొద్దున్నే సూర్యోదయం కాకముందే ఎవరికంటా పడకుండా.. ఏ ఇంటికీ ఎదురురాకుండా బిక్కుబిక్కుమంటూ గంగాస్నానం చేసి ఆశ్రమం చేరాలి. అంతే. ఇక భోజనం.. భజన.. మాటా, మంతి.. కష్టం, సుఖం అన్నీ ఆ ఆవరణలోనే.. తోటి వితంతువులతోనే! పదిహేనేళ్ల పసిపిల్లల నుంచి కాటికి కాళ్లు చాపిన వృద్ధుల దాకా.. అందరూ కలిసే ఉంటారు. అందరిదీ ఒకటే రకమైన జీవన విధానం... జీవితం! ఒకరిని చూస్తే ఒకరికి ఎక్కడలేని నిస్పృహ.. నిర్లిప్తత. శాంతికి చిహ్నం తెలుపు అంటారు కానీ ఇక్కడ ప్రశాంతతను భగ్నంచేసే పాత్ర ఆ రంగుది. చుట్టూ ఉన్న చెట్లూ పచ్చని బతుకును కాంక్షిస్తున్నట్టుండవ్. శ్వేతమనే శూన్యాన్ని తలపోస్తున్నట్టుంటాయ్. ఇది ఏళ్లనాటి పాత చిత్రం కాదు.. ఇప్పుడు ఈ క్షణం వెళ్లి చూసినా కనిపించే సజీవదృశ్యం! దేశంలో ఎక్కడైనా అంతే! భర్త పోతే పసుపు కుంకుమలతో బతికే హక్కులేదని పురాణాలు పెట్టిన పిచ్చిభ్రమల్లో వారణాసి వితంతువులే కాదు, మన దగ్గరి బంధువులూ కొట్టుమిట్టాడుతున్నారు. కన్నకొడుకు పెళ్లిలో అక్షింతలు వేసి దీవించాలని తపిస్తున్న వితంతు తల్లి ఆశనూ చంపేస్తున్నారు. గాజుల చేతుల హారతులే శుభం అంటూ పదిమంది కూడి చేసుకునే పండగల్లో భాగం లేకుండా చేస్తున్నారు. నలుగురిలో కలిస్తే నష్టమని వితంతువు మొహం మీద నవ్వును మాయం చేస్తున్నారు. పదిమంది ఉన్న ఇంట్లో అయితే వంటిల్లునే ఆమె స్థానంగా ఖరారు చేస్తున్నారు. వండిపెట్టడం తప్ప ఇంకో ధ్యాస లేని బానిసగా మారుస్తున్నారు. వాళ్ల జీవితాల్లో వసంతం లేకుండా చేస్తున్నారు. మూడేళ్ల క్రితం.. ఇలాంటి సంస్కృతిని మూడేళ్ల కిందట బ్రేక్ చేసింది ‘సులభ్ ఇంటర్నేషనల్’ అనే స్వచ్చంద సంస్థ! దానికి వారణాసినే కేంద్రంగా మలచుకుంది. వేలసంఖ్యలో ఉన్న వితంతువులకు అందరిలా హాయిగా.. ప్రకృతిలోని అన్ని వర్ణాలనూ ఆస్వాదిస్తూ బతికే హక్కు ఉందని తెలియజెప్పాలనుకుంది. మూడేళ్ల కిందట.. హోలీనాడు.. ముందుగా వాళ్లమీద రంగుచల్లింది. శూన్యంలో రంగుల వెలుగును చూశారు అక్కడి స్త్రీ మూర్తులు. ఆ ఇంద్రధనుస్సు కొత్త జీవితం మీద ఆశను పెంచింది. ఉక్కిరిబిక్కిరయ్యారు. వృందావన్లోని గోపీనాథుడితోనే రంగులాడాలని ఆరాటపడ్డారు. ఈ ఏడాది కూడా వసంతం ఆ కేళీని మోసుకొచ్చింది. కర్తగా సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను నిలబెట్టింది. నాలుగువందల యేళ్ల సంకెళ్లను బద్దలు కొట్టించి మరీ గోపీనాథుడి ఆలయంలోకి ఆ వితంతువులను తీసుకెళ్లింది. తడిసి ముద్దయ్యారు గులాల్.. హరా... పసుపు.. ఎరుపు.. వంగరంగు.. కెంజాయం... నీలం.. పిచ్కారీలో తడిసిముద్దయిపోయారు... ఆ వసంత కేళీలో కృష్ణుడితో ఆడి అలసిపోయారు. వృందావనం కొత్త శోభను సంతరించుకుంది. ఎవరి సంతోషాలను ఎవరూ హరించరు.. ఎవరూ ఎవరికి అశుభం కారు.. అపశకునం ఊసే లేదు. ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి ప్రకృతి ఒడిలో పరవశించాల్సిందే! తాను అందరి జీవితాల్లో నిండాల్సిందే.. అన్న సత్యాన్ని బోధించడానికే వచ్చింది ఈ వసంతం.... అందుకు వృందావనే సాక్ష్యం! వితంతువుల నుదుట చంద్రుడిని నిలిపి... ఒంటిని అంటిపెట్టుకున్న తెలుపుని రంగులమయం చేసింది.. వృందావనంలో స్త్రీలు... స్వావలంబన, సాధికారత దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.. వారికి చేయూతనందించే పనిలో ఉంది సులభ్ ఇంటర్నేషనల్! -
62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి
లేటువయసులో ఘాటుప్రేమ అంటే ఇదేనేమో. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ అత్యంత రహస్యంగా గతంలో బీబీసీలో పనిచేసిన ఓ యాంకరమ్మను పెళ్లి చేసుకున్నాడట. ఆమె పేరు రెహమ్ ఖాన్. 62 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు 41 ఏళ్ల వయసున్న రెహమ్ ఖాన్‌ను గతవారమే పెళ్లి చేసుకున్నాడట. ఆమెకు గతంలో పెళ్లయింది, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. ఇంతకు ముందు పెళ్లి పెటాకులు కావడానికి ముందు ఆమె బ్రిటన్‌లో పెళ్లి చేసుకుంది. బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించేది. గతంలో జెమీమా ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. ఆమెకు 2004లోనే వలిడాకులు ఇచ్చేశాడు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. ఇప్పుడీ కొత్త పెళ్లికి ఇమ్రాన్ ఖాన్ అక్కచెల్లెళ్లతో పాటు పలువురు బంధువులు విముఖంగా ఉన్నారని సమాచారం. -
కోడలికి మళ్లీ పెళ్లి.. మామ గిఫ్ట్ వందకోట్లు!
కోడళ్లను రాచి రంపాన పెట్టే అత్తమామలను చూశాం. పెళ్లయిన తర్వాత కొడుకు ఏదైనా కారణంతో మరణిస్తే.. అందుకు కోడలిదే తప్పంటూ మెడపట్టి బయటకు గెంటేసేవాళ్లను కూడా చూశాం. అయితే.. కొడుకు మరణించిన తర్వాత కోడలికి మళ్లీ పెళ్లి చేయించడానికి భారీగా కట్నకానుకలు ఇచ్చే అత్తమామలు ఎక్కడైనా ఉంటారా? ఉన్నారు.. గుజరాత్‌లోని పోర్బందర్ ఎంపీ విఠల్ రాడాడియా ఇలా చేశారు. తన కోడలికి ఆయన బహుమతిగా ఇచ్చిన ఆస్తి విలువ అక్షరాలా వంద కోట్ల రూపాయలు!! బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన రాడాడియా.. పోర్బందర్ ప్రాంతంలోని రైతు నాయకుడు. ఆయన కుమారుడు కల్పేష్ రాడాడియా ఏడు నెలల క్రితం గుండె పోటుతో మరణించారు. ఆయనకు మనీషా అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు మరణించిన దుఃఖాన్ని దిగమింగుకున్న విఠల్ రాడాడియా.. అప్పటినుంచే తన కోడలికి మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని అందించాలని భావించారు. అప్పటినుంచి ప్రయత్నించి.. చివరకు తన మరో కొడుకు లలిత్ స్నేహితుడైన హర్దిక్ చోవాటియాతో మనీషా పెళ్లి నిశ్చయించారు. రాజ్‌కోట్ జిల్లాలోని జామ్కండోర్నా పట్టణంలో ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి కోసం కోడలికి వంద కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని విఠల్ రాడాడియా ఇచ్చారు. ఆయన మరో కుమారుడు జయేష్ రాడాడియా జేఠ్పూర్ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వంలో పర్యాటక శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. -
భార్య కోరిక తీర్చేందుకు.. 90 ఏళ్ల వృద్దుడికి పెళ్లి
తొమ్మిది పదుల వృద్దాప్యంలో ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. చనిపోయిన భార్య కోరిక తీర్చేందు కోసం ఆయన కుమార్తెలే తగిన వధువును చూసి వివాహం జరిపించారు. ఈ సంఘటన సౌదీ అరేబియాలో జరిగింది. 90 ఏళ్ల ఫతీస్ అల్ తఖాఫీ భార్య ఇటీవలే అనారోగ్యంతో మరణించింది. ఈ దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఏడుగురు కుమారులు. పెళ్లి చేసుకునేందుకు మొదట్లో తఖాపీ అంగీకరించలేదు. అమ్మ ఆత్మ శాంతించాలంటే పెళ్లి చేసుకోవాల్సిందేనని పిల్లలు పట్టుపట్టడంతో అంగీకరించాడు. కూతుళ్లు మూడు నెలల పాటు సంబంధాలు చూసి చివరకు 53 ఏళ్ల వితంతువును తగిన జోడీగా ఎంపిక చేశారు. వధువుకు శుల్కంగా దాదాపు నాలుగు లక్షల రూపాయలు చెల్లించారు. పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు హాజరై తఖాఫీ పెళ్లిని ఘనంగా జరిపించారు. మొత్తానికి సెంచరీకి చేరువలో మళ్లీ పెళ్లికొడుకయ్యాడు.