దురాచారం తెల్లబోయింది | holly special | Sakshi
Sakshi News home page

దురాచారం తెల్లబోయింది

Published Wed, Mar 23 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

దురాచారం  తెల్లబోయింది

దురాచారం తెల్లబోయింది

మగ మహారాజుల రాజ్యంలో ఏమైనా చెల్లుతుంది. దురాచారం కూడా ఆచారం అయిపోతుంది. బుజ్జి బంగారు తల్లులతో వృద్ధులక  రెండోపెళ్లి జరుగుతుంది. అతడు కాలం చేస్తే ఈ బంగారు తల్లి భవిష్యత్తుకు కాలం చెల్లుతుంది. భార్య చనిపోయిన వృద్ధుడికి పునర్వివాహం చెల్లుతుంది. కానీ ముసలి మొగుడు చనిపోయినా... ముక్కుపచ్చలారని చిన్నారికి తెలుపే మిగులుతుంది. ఎదురొస్తే అపశకునం! వేడుకలకు అశుభం!! అలాంటి ‘మగ’వంచితులకు రంగుల పండుగ వచ్చింది. సాక్షాత్తూ ఆ దేవుడి సమక్షంలో బృందావనానికి...వసంతం వచ్చింది! హోలీ రంగ హోలీ... రంగుల రంగేళి!
 
తెలుపుతో సప్తవర్ణాలూ సమ్మేళనం కావాలని తపనపడుతున్నాయి. గులాల్ తొలి అడుగేసింది. ఉత్సాహంతో శ్వేతవర్ణాన్ని ఆలింగనం చేసుకుంది. తనలో కలిపేసుకుంది. ఈ ఉత్సవానికి హోలీ సందర్భం అయితే వారణాసిలోని గోపీనాథ్ ఆలయం వేదిక అయింది. దాదాపు నాలుగువందల ఏళ్లుగా ఏలుబడిలో ఉన్న ఓ అనాచారం... ‘వితంతువులు పంచవన్నెలకు దూరంగా ఉండాలి’ అన్న ఆచారం... దహనమైపోయింది. అన్ని రంగులనూ ఆస్వాదించాలన్న వితంతువుల ఆశలకు ఆ గుడి గంటలు శుభం పలికాయి! సాక్షాత్తు ఆ గోపీనాథుడే ఈ సంబరానికి సాక్షి అయ్యాడు. వారి సంతోషాల్లో భాగమయ్యాడు. వింతంతువులతో కలిసి ఆ స్వామివారు కూడా హాలీ ఆడాడా అన్నంతగా అక్కడ అనందం వెల్లివిరిసింది.
   
వారణాసి. సిటీ ఆఫ్ విడోస్! వితంతువుల నగరం. ఆధ్యాత్మిక కీర్తితోపాటు.. ఇది ఆ ఊరు తెచ్చుకున్న అపకీర్తి కూడా. వందల యేళ్ల కిందటి నుంచి దేశంలో ఏ మూలనో ఉన్న వితంతువులను తన దరికి తెచ్చుకుంటోంది వారణాసి. ప్రస్తుతం దాదాపు 38 వేల మంది వితంతువులు ఇక్కడి వృందావన్‌లోని పలు ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శతాబ్దం కిందట వితంతువుల విషయంలో ఎలాంటి వైఖరి ఉండేదో ఇప్పటికీ అలాంటి అనాగరిక వైఖరినే అవలంబిస్తున్నారు. తెల్లచీర.. శిరోముండనం, ఒంటిపూట భోజనంతో ప్రకృతిలోని రంగులకు దూరంగా సహజకర్మలను త్యజించి అసహజమైన జీవనశైలిని పాటిస్తున్నారు. పొద్దున్నే సూర్యోదయం కాకముందే ఎవరికంటా పడకుండా.. ఏ ఇంటికీ ఎదురురాకుండా బిక్కుబిక్కుమంటూ గంగాస్నానం చేసి ఆశ్రమం చేరాలి. అంతే. ఇక భోజనం.. భజన.. మాటా, మంతి.. కష్టం, సుఖం అన్నీ ఆ ఆవరణలోనే.. తోటి వితంతువులతోనే! పదిహేనేళ్ల పసిపిల్లల నుంచి కాటికి కాళ్లు చాపిన వృద్ధుల దాకా.. అందరూ కలిసే ఉంటారు. అందరిదీ ఒకటే రకమైన జీవన విధానం... జీవితం! ఒకరిని చూస్తే ఒకరికి ఎక్కడలేని నిస్పృహ.. నిర్లిప్తత. శాంతికి చిహ్నం తెలుపు అంటారు కానీ ఇక్కడ ప్రశాంతతను భగ్నంచేసే పాత్ర ఆ రంగుది.  చుట్టూ ఉన్న చెట్లూ పచ్చని బతుకును కాంక్షిస్తున్నట్టుండవ్. శ్వేతమనే శూన్యాన్ని తలపోస్తున్నట్టుంటాయ్. ఇది ఏళ్లనాటి పాత చిత్రం కాదు.. ఇప్పుడు ఈ క్షణం వెళ్లి చూసినా కనిపించే సజీవదృశ్యం!

దేశంలో ఎక్కడైనా అంతే!
భర్త పోతే పసుపు కుంకుమలతో బతికే హక్కులేదని పురాణాలు పెట్టిన పిచ్చిభ్రమల్లో వారణాసి వితంతువులే కాదు, మన దగ్గరి బంధువులూ కొట్టుమిట్టాడుతున్నారు. కన్నకొడుకు పెళ్లిలో అక్షింతలు వేసి దీవించాలని తపిస్తున్న వితంతు తల్లి ఆశనూ చంపేస్తున్నారు. గాజుల చేతుల హారతులే శుభం అంటూ పదిమంది కూడి చేసుకునే పండగల్లో భాగం లేకుండా చేస్తున్నారు. నలుగురిలో కలిస్తే నష్టమని వితంతువు మొహం మీద నవ్వును మాయం చేస్తున్నారు. పదిమంది ఉన్న ఇంట్లో అయితే వంటిల్లునే ఆమె స్థానంగా ఖరారు చేస్తున్నారు. వండిపెట్టడం తప్ప ఇంకో ధ్యాస లేని బానిసగా మారుస్తున్నారు. వాళ్ల జీవితాల్లో వసంతం లేకుండా చేస్తున్నారు.
 
మూడేళ్ల క్రితం..
 ఇలాంటి సంస్కృతిని మూడేళ్ల కిందట బ్రేక్ చేసింది ‘సులభ్ ఇంటర్నేషనల్’ అనే స్వచ్చంద సంస్థ! దానికి వారణాసినే కేంద్రంగా మలచుకుంది. వేలసంఖ్యలో ఉన్న వితంతువులకు అందరిలా హాయిగా.. ప్రకృతిలోని అన్ని వర్ణాలనూ ఆస్వాదిస్తూ బతికే హక్కు ఉందని తెలియజెప్పాలనుకుంది. మూడేళ్ల కిందట.. హోలీనాడు.. ముందుగా వాళ్లమీద రంగుచల్లింది. శూన్యంలో రంగుల వెలుగును చూశారు అక్కడి స్త్రీ మూర్తులు. ఆ ఇంద్రధనుస్సు కొత్త జీవితం మీద ఆశను పెంచింది. ఉక్కిరిబిక్కిరయ్యారు. వృందావన్‌లోని గోపీనాథుడితోనే రంగులాడాలని ఆరాటపడ్డారు.
 ఈ ఏడాది కూడా వసంతం ఆ కేళీని మోసుకొచ్చింది. కర్తగా సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను నిలబెట్టింది. నాలుగువందల యేళ్ల సంకెళ్లను బద్దలు కొట్టించి మరీ గోపీనాథుడి ఆలయంలోకి ఆ వితంతువులను తీసుకెళ్లింది.
 
తడిసి ముద్దయ్యారు

గులాల్.. హరా... పసుపు.. ఎరుపు.. వంగరంగు.. కెంజాయం... నీలం.. పిచ్‌కారీలో తడిసిముద్దయిపోయారు... ఆ వసంత కేళీలో కృష్ణుడితో ఆడి అలసిపోయారు. వృందావనం కొత్త శోభను సంతరించుకుంది. ఎవరి సంతోషాలను ఎవరూ హరించరు.. ఎవరూ ఎవరికి అశుభం కారు.. అపశకునం ఊసే లేదు. ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి ప్రకృతి ఒడిలో పరవశించాల్సిందే! తాను అందరి జీవితాల్లో నిండాల్సిందే.. అన్న సత్యాన్ని బోధించడానికే వచ్చింది ఈ వసంతం.... అందుకు వృందావనే సాక్ష్యం!
 వితంతువుల నుదుట చంద్రుడిని నిలిపి... ఒంటిని అంటిపెట్టుకున్న తెలుపుని రంగులమయం చేసింది.. వృందావనంలో స్త్రీలు... స్వావలంబన, సాధికారత దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.. వారికి చేయూతనందించే పనిలో ఉంది సులభ్ ఇంటర్నేషనల్!    
 
 తెలుపుతో సప్తవర్ణాలూ సమ్మేళనం కావాలని తపనపడుతున్నాయి. గులాల్ తొలి అడుగేసింది. ఉత్సాహంతో శ్వేతవర్ణాన్ని ఆలింగనం చేసుకుంది. తనలో కలిపేసుకుంది. ఈ ఉత్సవానికి హోలీ సందర్భం అయితే వారణాసిలోని గోపీనాథ్ ఆలయం వేదిక అయింది. దాదాపు నాలుగువందల ఏళ్లుగా ఏలుబడిలో ఉన్న ఓ అనాచారం... ‘వితంతువులు పంచవన్నెలకు దూరంగా ఉండాలి’ అన్న ఆచారం... దహనమైపోయింది. అన్ని రంగులనూ ఆస్వాదించాలన్న వితంతువుల ఆశలకు ఆ గుడి గంటలు శుభం పలికాయి! సాక్షాత్తు ఆ గోపీనాథుడే ఈ సంబరానికి సాక్షి అయ్యాడు. వారి సంతోషాల్లో భాగమయ్యాడు. వింతంతువులతో కలిసి ఆ స్వామివారు కూడా హాలీ ఆడాడా అన్నంతగా అక్కడ అనందం వెల్లివిరిసింది.
   
 వారణాసి. సిటీ ఆఫ్ విడోస్! వితంతువుల నగరం. ఆధ్యాత్మిక కీర్తితోపాటు.. ఇది ఆ ఊరు తెచ్చుకున్న అపకీర్తి కూడా. వందల యేళ్ల కిందటి నుంచి దేశంలో ఏ మూలనో ఉన్న వితంతువులను తన దరికి తెచ్చుకుంటోంది వారణాసి. ప్రస్తుతం దాదాపు 38 వేల మంది వితంతువులు ఇక్కడి వృందావన్‌లోని పలు ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శతాబ్దం కిందట వితంతువుల విషయంలో ఎలాంటి వైఖరి ఉండేదో ఇప్పటికీ అలాంటి అనాగరిక వైఖరినే అవలంబిస్తున్నారు. తెల్లచీర.. శిరోముండనం, ఒంటిపూట భోజనంతో ప్రకృతిలోని రంగులకు దూరంగా సహజకర్మలను త్యజించి అసహజమైన జీవనశైలిని పాటిస్తున్నారు. పొద్దున్నే సూర్యోదయం కాకముందే ఎవరికంటా పడకుండా.. ఏ ఇంటికీ ఎదురురాకుండా బిక్కుబిక్కుమంటూ గంగాస్నానం చేసి ఆశ్రమం చేరాలి. అంతే. ఇక భోజనం.. భజన.. మాటా, మంతి.. కష్టం, సుఖం అన్నీ ఆ ఆవరణలోనే.. తోటి వితంతువులతోనే! పదిహేనేళ్ల పసిపిల్లల నుంచి కాటికి కాళ్లు చాపిన వృద్ధుల దాకా.. అందరూ కలిసే ఉంటారు. అందరిదీ ఒకటే రకమైన జీవన విధానం... జీవితం! ఒకరిని చూస్తే ఒకరికి ఎక్కడలేని నిస్పృహ.. నిర్లిప్తత. శాంతికి చిహ్నం తెలుపు అంటారు కానీ ఇక్కడ ప్రశాంతతను భగ్నంచేసే పాత్ర ఆ రంగుది.  చుట్టూ ఉన్న చెట్లూ పచ్చని బతుకును కాంక్షిస్తున్నట్టుండవ్. శ్వేతమనే శూన్యాన్ని తలపోస్తున్నట్టుంటాయ్. ఇది ఏళ్లనాటి పాత చిత్రం కాదు.. ఇప్పుడు ఈ క్షణం వెళ్లి చూసినా కనిపించే సజీవదృశ్యం!
 దేశంలో ఎక్కడైనా అంతే!
 భర్త పోతే పసుపు కుంకుమలతో బతికే హక్కులేదని పురాణాలు పెట్టిన పిచ్చిభ్రమల్లో వారణాసి వితంతువులే కాదు, మన దగ్గరి బంధువులూ కొట్టుమిట్టాడుతున్నారు. కన్నకొడుకు పెళ్లిలో అక్షింతలు వేసి దీవించాలని తపిస్తున్న వితంతు తల్లి ఆశనూ చంపేస్తున్నారు. గాజుల చేతుల హారతులే శుభం అంటూ పదిమంది కూడి చేసుకునే పండగల్లో భాగం లేకుండా చేస్తున్నారు. నలుగురిలో కలిస్తే నష్టమని వితంతువు మొహం మీద నవ్వును మాయం చేస్తున్నారు. పదిమంది ఉన్న ఇంట్లో అయితే వంటిల్లునే ఆమె స్థానంగా ఖరారు చేస్తున్నారు. వండిపెట్టడం తప్ప ఇంకో ధ్యాస లేని బానిసగా మారుస్తున్నారు. వాళ్ల జీవితాల్లో వసంతం లేకుండా చేస్తున్నారు.
 
మూడేళ్ల క్రితం..
 ఇలాంటి సంస్కృతిని మూడేళ్ల కిందట బ్రేక్ చేసింది ‘సులభ్ ఇంటర్నేషనల్’ అనే స్వచ్చంద సంస్థ! దానికి వారణాసినే కేంద్రంగా మలచుకుంది. వేలసంఖ్యలో ఉన్న వితంతువులకు అందరిలా హాయిగా.. ప్రకృతిలోని అన్ని వర్ణాలనూ ఆస్వాదిస్తూ బతికే హక్కు ఉందని తెలియజెప్పాలనుకుంది. మూడేళ్ల కిందట.. హోలీనాడు.. ముందుగా వాళ్లమీద రంగుచల్లింది. శూన్యంలో రంగుల వెలుగును చూశారు అక్కడి స్త్రీ మూర్తులు. ఆ ఇంద్రధనుస్సు కొత్త జీవితం మీద ఆశను పెంచింది. ఉక్కిరిబిక్కిరయ్యారు. వృందావన్‌లోని గోపీనాథుడితోనే రంగులాడాలని ఆరాటపడ్డారు.
 
ఈ ఏడాది కూడా వసంతం ఆ కేళీని మోసుకొచ్చింది. కర్తగా సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను నిలబెట్టింది. నాలుగువందల యేళ్ల సంకెళ్లను బద్దలు కొట్టించి మరీ గోపీనాథుడి ఆలయంలోకి ఆ వితంతువులను తీసుకెళ్లింది.
 
తడిసి ముద్దయ్యారు
 గులాల్.. హరా... పసుపు.. ఎరుపు.. వంగరంగు.. కెంజాయం... నీలం.. పిచ్‌కారీలో తడిసిముద్దయిపోయారు... ఆ వసంత కేళీలో కృష్ణుడితో ఆడి అలసిపోయారు. వృందావనం కొత్త శోభను సంతరించుకుంది. ఎవరి సంతోషాలను ఎవరూ హరించరు.. ఎవరూ ఎవరికి అశుభం కారు.. అపశకునం ఊసే లేదు. ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి ప్రకృతి ఒడిలో పరవశించాల్సిందే! తాను అందరి జీవితాల్లో నిండాల్సిందే.. అన్న సత్యాన్ని బోధించడానికే వచ్చింది ఈ వసంతం.... అందుకు వృందావనే సాక్ష్యం! వితంతువుల నుదుట చంద్రుడిని నిలిపి... ఒంటిని అంటిపెట్టుకున్న తెలుపుని రంగులమయం చేసింది.. వృందావనంలో స్త్రీలు... స్వావలంబన, సాధికారత దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.. వారికి చేయూతనందించే పనిలో ఉంది సులభ్ ఇంటర్నేషనల్!    
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement