ప్రపంచంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ‘చిన్న కుటుంబం- చింతలు లేని కుటుంబం’ విధానాన్ని పాటించాలని అన్ని ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. దీనితోడు పెరుగుతున్న ధరలకు బెంబేలెత్తిపోయి తల్లిదండ్రులంతా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే న్యూయార్క్‌కు చెందిన ఒక మహిళ తనకు 12 మంది పిల్లలు ఉన్నా ఇంకా సంతృప్తి చెందడం లేదు.
వెరోనికా అనే ఈ మహిళ 14 ఏళ్ల వయసులోనే తల్లయ్యింది. ఆ తరువాత వరుసగా పిల్లలను కంటూ వచ్చింది. 2021లో ఆమె తన రెండవ భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు 37 ఏళ్ల వయసుకు చేరుకున్న ఆమె మరో వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. అయితే తనకు కాబోయే భర్తకు ఇప్పుటికీ 10 మంది పిల్లలు ఉండాలనే కండీషన్ పెట్టింది. అప్పుడు తమ పిల్లల సంఖ్య 22 అవుతుందని పేర్కొంది.
ఫేస్‌బుక్ మాధ్యమంలో తన భావాలను వ్యక్తపరిచిన ఆమె..‘తాను ఇంకా అధికంగా పిల్లలను కావాలనుకుంటున్నానని, అందుకే తగిన భర్త కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. అయితే ఇప్పటికే 10 మంది పిల్లలున్న పురుషుని కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. అప్పుడు తమ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుందని తెలిపింది. ఇందుకోసమే తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. వెరోనికా తమది బ్రిటన్‌లో అతిపెద్ద కుటుంబమై ఉండాలని కోరుకుంటోంది.
ఇది కూడా చదవండి: కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా?
Comments
Please login to add a commentAdd a comment