Childreens
-
మూడో పెళ్లికి 12 మంది పిల్లల తల్లి.. 10 మంది పిల్లల తండ్రి కోసం ఎదురుచూపు!
ప్రపంచంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ‘చిన్న కుటుంబం- చింతలు లేని కుటుంబం’ విధానాన్ని పాటించాలని అన్ని ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. దీనితోడు పెరుగుతున్న ధరలకు బెంబేలెత్తిపోయి తల్లిదండ్రులంతా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే న్యూయార్క్‌కు చెందిన ఒక మహిళ తనకు 12 మంది పిల్లలు ఉన్నా ఇంకా సంతృప్తి చెందడం లేదు. వెరోనికా అనే ఈ మహిళ 14 ఏళ్ల వయసులోనే తల్లయ్యింది. ఆ తరువాత వరుసగా పిల్లలను కంటూ వచ్చింది. 2021లో ఆమె తన రెండవ భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు 37 ఏళ్ల వయసుకు చేరుకున్న ఆమె మరో వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. అయితే తనకు కాబోయే భర్తకు ఇప్పుటికీ 10 మంది పిల్లలు ఉండాలనే కండీషన్ పెట్టింది. అప్పుడు తమ పిల్లల సంఖ్య 22 అవుతుందని పేర్కొంది. ఫేస్బుక్ మాధ్యమంలో తన భావాలను వ్యక్తపరిచిన ఆమె..‘తాను ఇంకా అధికంగా పిల్లలను కావాలనుకుంటున్నానని, అందుకే తగిన భర్త కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. అయితే ఇప్పటికే 10 మంది పిల్లలున్న పురుషుని కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. అప్పుడు తమ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుందని తెలిపింది. ఇందుకోసమే తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. వెరోనికా తమది బ్రిటన్‌లో అతిపెద్ద కుటుంబమై ఉండాలని కోరుకుంటోంది. ఇది కూడా చదవండి: కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా? -
పిల్లల ఫేమస్ కోసం తల్లి తాపత్రయం.. ఊహకందని చేదు అనుభవం ఎదురయ్యేసరికి..
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలామంది తమకు లభించే ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. తమ వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ కూడా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు తమ పిల్లలను ఫేమస్ చేసేందుకు తపన పడుతుంటారు. పిల్లలు పుట్టినది మొదలు వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చాలామంది తమకు పిల్లలకు పుట్టగానే వెంటనే ఫొటోతీసి, దానిని తమ చిన్నారి తొలి ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే వారి పేరుతో ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో అకౌంట్ క్రియేట్ చేసి, వారి ఫొటోలు షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్స్‌గా చూడాలనుకుని.. న్యూయార్క్ పోస్టులోని ఒక రిపోర్టు ప్రకారం కత్రీనా స్ట్రోడ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తమకు పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్చేస్తూ వస్తోంది. తమ పిల్లలను సోషల్ మీడియా స్టార్స్‌గా చూడాలనుకుంది. కత్రీనాకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు 4 ఏళ్లు, కుమారునికి 3 ఏళ్లు. ఆమె తన ఇద్దరు పిల్లలను టిక్‌టాక్, ఇన్స్టాగ్రమ్లోఫేమస్ చేసింది. టిక్‌టాక్ యూజర్ చేసిన పనికి.. తమ పిల్లలను ఆడుకుంటున్నప్పటి ఫొటోలు, వీడియోలు, స్విమ్మింగ్ చేస్తున్నప్పటి వీడియోలను కత్రీనా తరచూ పోస్టు చేస్తుంటుంది. అయితే కత్రీనా 2022లో ఉన్నట్టుండి తమ పిల్లల ఫొటోలను, వీడియోలను షేర్ చేయడం మానివేసింది. టిక్‌టాక్ యూజర్ ఒకరు కత్రీనా కుమారుని ఫోటోను ఉపయోగించి, ఒక పోస్టు క్రియేట్ చేసి, ఆ పిల్లాడు తన కుమారుడు అని పేర్కొన్నాడు. చిన్నారుల ఫొటోలను సేవ్ చేసుకుని.. అమెరికాలోని కరోలినాలో ఉంటున్న కత్రీనా తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుతూ ‘మా పిల్లల మాదిరిగానే చాలామంది పిల్లలకు ఇలాంటి ముప్పు ఎదురవుతోంది. చాలామంది సోషల్ మీడియాలో షేర్ అయ్యే చిన్నారుల ఫొటోలను సేవ్ చేసుకుని దుర్వినియోగం చేస్తున్నాన్నారని’ తెలిపింది. ఈ విషయాన్ని తన భర్తకు కూడా తెలియజేశానని పేర్కొంది. కత్రీనా తాను ఇన్నాళ్లూ చేస్తూ వచ్చిన పనికి పశ్చాత్తాప పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి.. ఈ చేదు అనుభవం ఎదురైన తరువాత ఆమె సోషల్ మీడియాలోని తమ పిల్లల ఫొటోలను, వీడియోలను తొలగించింది. 2021లో అమెరికాకు చెందిన ఒక రిపోర్టు ప్రకారం 77శాతం తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. పలువురు కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి చిన్నారుల ఫొటోలను, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారని పలు ఉదంతాలు నిరూపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: సీమా, సచిన్‌ల స్టోరీని తలపించే ఇక్రా, ములాయం లవ్ స్టోరీ.. చివరికి? -
పిల్లలకు కరోనా టీకా ఎలా?
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు కరోనా టీకా వేయించడం ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారింది. 12–18 ఏళ్ల వయసు వారికి టీకా వేయాలంటే తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి. కానీ పిల్లలకు కరోనా వ్యాప్తి పెద్దగా లేదన్న అభిప్రాయంతో చాలామంది తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించేందుకు ముందుకు రావడం లేదు. గతంలో వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వేలను చూస్తే, అమెరికాలో 50 శాతం మంది తమ పిల్లలకు టీకా ఇవ్వడానికి ఆసక్తి చూపగా, మిగిలిన సగం మందిలో సందిగ్ధత, నిరాసక్తత కనిపించాయి. కెనడాలో 63 శాతం మంది, టర్కీలో 36 శాతం ఆసక్తి చూపారు. మిగిలినవారిలో నిరాసక్తత, సందిగ్ధత నెలకొన్నాయి. ఇక భారత్‌లో ఎయిమ్స్ సంస్థలు, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి, ముంబైకి చెందిన క్రాంతి మెడికల్ కాలేజీలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ సర్వే చేపట్టాయి. పిల్లలకు కరోనా టీకా వేయించే విషయంపై జరిగిన మొదటి సర్వే ఇదే కావడం గమనార్హం. పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించడంపై 45.5 శాతం మంది సందిగ్ధంలో ఉన్నట్లు వెల్లడికాగా.. 21 శాతం మంది తమ పిల్లలకు టీకా వద్దే వద్దంటున్నారు. కేవలం 33.5 శాతం మందే టీకాపై ఆసక్తి చూపించారు. సర్వే నివేదిక మెడ్ ఆర్ఎక్స్ఐవీ మేగజైన్లో ప్రచురితమైంది. టీకా సామర్థ్యంపై అపనమ్మకం దేశంలో అక్టోబర్ 25 నాటికి 100 కోట్ల మంది కనీసం ఒక డోస్ టీకా తీసుకున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు రెండో డోస్ వ్యాక్సినేషన్ వేగంగా నడుస్తోంది. 12–18 ఏళ్ల వయసు గల పిల్లలకు వ్యాక్సినేషన్‌పై ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకట్రెండు టీకా తయారీ కంపెనీలకు అనుమతి కూడా ఇచ్చారు. త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే పిల్లలకు టీకా వేయించేందుకు ఎంతమంది ముందుకు వస్తారన్న నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రులు 30 నుంచి 49 ఏళ్లలోపువారున్నారు. అందులో 23 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు. 32 శాతం మంది ఆదాయం రూ.50 వేలపైనే ఉంటుంది. 41 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారున్నారు. సగం మంది సామాజికంగా ఉన్నతస్థాయిలో ఉన్నారు. భారతీయ వ్యాక్సిన్‌పై 39 శాతం మంది విశ్వాసం వ్యక్తంచేయగా, నమ్మకం లేనివారు 25 శాతం ఉన్నారు. 36 శాతం మంది తటస్థంగా ఉన్నారు. పిల్లలకు వ్యాక్సిన్ వద్దనేందుకు కారణాలు వ్యాక్సిన్ల భద్రత, సామర్థ్యంపై 85 శాతం మందికి అవగాహన లేదు. ► సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా అన్న దానిపై 78 శాతం మందికి అవగాహన లేదు. ► 65 శాతం మందికి కరోనా డోస్‌ల మీద అవగాహన లేదు. ► 62 శాతం మంది వ్యాక్సిన్‌తో రిస్క్ ఉంటుందని భావిస్తున్నారు. ► 50 శాతం మందికి కరోనాకు సంబంధించి శాస్త్రీయమైన సమాచారం అందుబాటులో లేదు. ► చిన్నపిల్లలు కరోనాకు పెద్దగా ప్రభావితం కావడం లేదన్న భావనలో 50 శాతం మంది ఉన్నారు. భయాలను పారదోలాలి తల్లిదండ్రులకు పిల్లల వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి. వారికున్న భయాలను పారదోలాలి. చదువుకున్నవారు మాత్రం టీకాపై మంచి అభిప్రాయంతో ఉన్నారు. కానీ చిన్న పిల్లలకు వేయించడంపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న దానిపై అనుమానాలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం పోగొట్టాలని సర్వే సూచించింది. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
ఇద్దరు బాలికలను మింగిన చెరువు..
ఆ చెరువు తన మృత్యు దాహం తీర్చుకుంది. ఒక బాలిక చావు నుంచి తప్పించుకుందని సంతోషించే లోపు ఇద్దరిని మింగేసింది. చెల్లి ప్రాణాలను తిరిగి ఇచ్చినట్టే ఇచ్చి అక్కను తీసుకెళ్లిపోయింది. సరదాగా స్నానం చేయడానికి వచ్చిన నలుగురిలో ఇద్దరిని చంపేసి మిగ తా ఇద్దరికి జీవిత కాల భయాన్ని అందించింది. బిడ్డలను అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. సాక్షి,శ్రీకాకుళం(లావేరు): మండల పరిధి యాతపేట గ్రామంలో ని జగ్గు చెరువులో మునిగి పెంటమాని వనజ (9), వనుము యమున(9) అనే ఇద్దరు బాలిక లు బుధవారం మృతి చెందారు. లావేరు స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల మేరకు.. యాతపేట గ్రామానికి చెందిన పెంటమా ని వనజ(9), వనుము యమున(9), పెంటమా ని యషశ్రీ, శిరీషలు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. బుధవారం మ ధ్యాహ్నం బడి విడిచిపెట్టాక పూజ సామాన్లు చెరువులో కలపడం కోసం వీరు నలుగురు గ్రా మంలోని జగ్గు చెరువుకు వెళ్లారు. పూజ సామాన్లు కలిపేసిన తర్వాత స్నానానికి దిగారు. వనజ, శిరీషలు ఒడ్డునే స్నానం చేస్తుండగా.. యమున, యషశ్రీలు కాస్త లోపలకు వెళ్లారు. అయితే వీరికి ఈత రాకపోవడంతో లోలోపలకు వెళ్లిపోయారు. దీన్ని గమనించిన యషశ్రీ అక్క వనజ వెంటనే స్పందించి చెరువు లోపలకు వెళ్లి చెల్లిని ఒడ్డుకు తీసుకువచ్చింది. యమునను కూ డా కాపాడదామని ప్రయత్నించి విఫలమై ఆమె తో పాటు లోపలకు వెళ్లిపోయింది. వీరు ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో ఒడ్డునే ఉన్న పిల్లలు పరుగున వెళ్లి కుటుంబ సభ్యులకు విష యం చెప్పారు. వారు హుటాహుటిన చెరువు వద్దకు వచ్చి స్థానికులతో కలిసి వెతకగా మునిగిన చోటే ఇద్దరూ దొరికారు. వెంటనే 108లో వీరిని శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే ఇద్దరూ చనిపోయారని వైద్యులు పరీక్షించి నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వెంటనే లావే రు స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ రాజేష్, హెచ్‌సీ రామారావులు యాతపేట గ్రామానికి వెళ్లి చెరువును పరిశీలించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల ను ప్రమాదం ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. గుండెలవిసేలా రోదన.. వనజ, యమునలు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసే లా రోదించారు. పెంటమాని పైడిరాజు, రాజు దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె వనజ. ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె చెరువులో పడి మృతి చెందడంతో వారి రోదన ఆపడం ఎవరి తరం కా లేదు. వనుము రాజారావు, రాములు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నా రు. ఒక్కగానొక్క కుమార్తె అయిన యమున ఇలా చిన్న వయసులోనే చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అత్త హత్య కేసులో కోడలి అరెస్ట్ -
మంటల్లో బాలుడి ఆహుతి..
సాక్షి,గుంటూరు(రొంపిచర్ల): విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఇంటికి నిప్పంటుకోవడంతో గదిలో నిద్రిస్తున్న అన్నదమ్ముల్లో ఒకరు మంటలకు ఆహుతయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి జరిగిన ఈ హృదయవిదారక ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సంతగుడిపాడు గ్రామానికి చెందిన భువనగిరి ఏసు, దేవీ దంపతులు బతుకు తెరువుకోసం పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. అక్కడే నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం పాఠశాలలు తెరవడంతో వారి ఇద్దరు కుమారులు భువనగిరి లక్ష్మీప్రసన్న కుమార్, నాగేంద్రబాబు(12) స్వగ్రామానికి వచ్చారు. బుధవారం రాత్రి కుండపోతగా వర్షం కురవటంతో అన్నదమ్ములు తలుపులు వేసుకొని ఇంట్లో నిద్రపోయారు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఇద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. పెద్దపెట్టున కేకలు వేశారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పేందుకు యతి్నంచారు. దగ్గరలోని ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. బలవంతంగా ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నాగేంద్రబాబు కాలిపోయి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. లక్ష్మీప్రసన్నకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 అంబులెన్స్ ద్వారా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. మంటలకు ఇంట్లోని దుస్తులు, పుస్తకాలు, విలువైన వస్తువులు, గృహోపకరణాలు కూడా దగ్ధమయ్యాయయి. ఎస్ఐ పి.హజరత్తయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కాలనీ వాసులు ఆరోపించారు. ప్రమాద సమయంలో ఫోన్‌చేస్తే స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చారు. ఒక కుమారుడు దుర్మరణం పాలవడం, మరో కుమారుడు మృత్యువుతో పోరాడుతుండడంతో గుండెలవిసేలా రోదించారు. నాగేంద్రబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చదవండి: రాహుల్ హత్య కేసు: వ్యాపార లావాదేవీలే కారణం -
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ..ఆపై
సాక్షి, విశాఖపట్నం (గాజువాక): కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం యారాడలో సంచలనం రేపింది. బంధువులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొల్లి శ్రీను కుటుంబంతో యారాడలో నివాసం ఉంటున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య మొల్లి సంధ్య కూడా కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. శ్రీను ఐదు నెలలుగా పనులకు వెళ్లడం లేదు. భార్య సంపాదనపైనే ఆధారపడుతున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన శ్రీను తన 14 ఏళ్ల కుమార్తె అనూష, పదేళ్ల కుమారుడు చరణ్‌లకు బాదం పాలల్లో పురుగు మందు ఇచ్చి తాను కూడా తాగాడు. దీంతో వారందరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. బంధువులు గమనించి వెంటనే వారిని గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన తెలిసిన వెంటనే న్యూపోర్టు పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పిల్లల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యతోనే చిన్నారుల సమగ్ర అభివృద్ధి: బిశ్వభూషణ్ హరిచందన్
సాక్షి, అమరావతి: బాల్యం నుంచే సంపూర్ణ విద్యను అందించటం ద్వారా చిన్నారుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సంపూర్ణ విద్యతో జీవితంలో శ్రేష్ఠత’ అనే అంశంపై ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం నిర్వహించిన అంతర్జాతీయ విద్యా సదస్సులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా వర్చవల్ విదానంలో రాజ్ భవన్ నుంచి పాల్గొన్నారు. గవర్నర్ మట్లాడుతూ ఆలోచనాపరులు, తత్వవేత్తలు ఊహించినట్లుగా కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రపంచం, మనం ఇంతకు ముందు చూసిన ప్రపంచానికి భిన్నంగా మారుతుందన్నారు. సంపూర్ణ అభివృద్ధి సాధించిన పిల్లలు మేధో, మానసిక, శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సామర్థ్యాలను కలిగి ఉండటం ద్వారా రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్దంగా ఉంటారని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పిల్లలలో నెలకొంటున్న ఒత్తిడి, ఆందోళన వారిలో అనిశ్చితికి దారితీస్తుందని, వారు నిర్బంధ వాతావరణంలో పెరగటం వల్లే ఈ పరిస్ధితులు ఏర్పడుతున్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు తల్లిదండ్రులకు తమ చిన్నారుల భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. భయం, ఆందోళన, అనిశ్చితి ఉన్న ఈ కాలంలో జీవితాన్ని ఇచ్చే విద్య అన్న అంశంపై దృష్టి పెడుతూ ఆధ్యాత్మిక, నైతిక విలువలను బోధించడం ద్వారా సమాజంలో దైవత్వాన్ని వ్యాప్తి చేయడానికి బ్రహ్మ కుమారిస్ చేస్తున్న కృషిని ప్రశంసనీయమన్నారు. చదవండి: షాకింగ్: భార్యను చెల్లిగా పరిచయం చేస్తూ పెళ్లి, ఆ పై.. -
చిన్నారులను మింగిన పెళ్లి భోజనం
నార్నూర్(ఆసిఫాబాద్): విందు భోజనం వికటించి ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, 21 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నార్నూర్ మండలంలోని కొలాంగూడలో బుధవారం చోటు చేసుకుంది. కళ్ల ముందే పసి పిల్లల ప్రాణాలు పో తుండడంతో కొలాంగూడ ఆర్తనాదలతో ముని గితేలింది. సరైన సమయంలో 108 వాహనం రాకపోవడంతోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటన నార్నూర్ పీహెచ్సీ వైద్యం తీరు, అధికారుల వైఫల్యాన్ని ఎత్తిచూపింది. జరిగింది ఇది... మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలాంగూడ(గణపతిగూడ)లో 20 కొలాం గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరంతా పూరి గూడిసెలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన లక్ష్మిబాయి ఇంట్లో మంగళవారం పెళ్లి జరిగింది. దీంతో గ్రామస్తులంతా అక్కడే భోజనం చేశారు. మరుసటి రోజు బుధవారం ఉదయం కూడా అక్కడే భోజనం చేశారు. కాసేపటికే వివాహ విందు భోజనం తిన్న 24 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏడాది వయస్సు ఉన్న చింటు అక్కడికక్కడే మృతిచెందాడు. స్పందించని 108 వాహనం.. చిన్నా, పెద్ద అస్వస్థతకు గురికావడంతో ఆందోళనకు గురైన గిరిజనులు సర్పంచ్ రామేశ్వర్‌కు ఫోన్లో సమాచారం అందించారు. ఆయన వెంటనే గ్రామానికి చేరుకుని 108కి సమాచారం అందించారు. కాని వారు స్పందించకపోవడంతో ప్రైవేట్ ఆటోలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక్కడే అందరికీ వైద్యం అందించేందుకు ప్రయత్నం చేశారు. కాని పీహెచ్సీలో డాక్టర్ తప్పా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. దీంతో ఉట్నూర్, రిమ్స్‌కు రెఫర్ చేశారు. ఈసారి కూడా 108 వాహనం సకాలంలో రాకపోవడంతో మరో ఇద్దరు చిన్నారులు అయ్యు(06), కొడప ముత్తు(01) ఆసుపత్రిలోనే గిలగిలా కొట్టుకుని మృతిచెందారు. మరో 21 మందిని ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లారు. గిరిజనుల ఆగ్రహం.. పీహెచ్సీలో సకాలంలో వైద్యం అందకపోవడం పట్ల గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108కి స మాచారం అందించినా గంటసేపు అయినా రాకపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పీహెచ్సీ ఆవరణంలో 108 అంబులెన్స్ ఉన్నా డ్రై వర్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అంతలోనే వేరే కేసు నిమిత్తం పీహెచ్‌సీకి వచ్చిన 108 అం బులెన్స్ ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో వచ్చే వరకూ మృతదేహాలను తీసుకెళ్లేది లేదని తెల్చిచెప్పారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్, గాదిగూడ ఎస్సై సుబ్బారావులు అక్కడకు చేరుకుని గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో.. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య కొలాంగూడను సందర్శించి వివరాలు సేకరించా రు. అస్వస్థతకు గురైనా గిరిజనులకు మెరుగైనా వై ద్యం అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంతరావును ఆదేశించారు. ఘటనపై ఆరా తీశారు. ఐటీడీఏ తరుపున అన్నిరకాల సహాయ, సహకాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలి పారు. గ్రామంలో వైద శిబిరం ఏర్పాటు చేయాల ని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ డేవిడ్, జిల్లా వైద్యాధికారి రాజీవ్‌రాజ్ తదితరులున్నారు. -
‘ప్రైమరీ స్కూల్ పిల్లలకు బ్యాగ్ అవసరం లేదు’
చండీగఢ్: ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హర్యానా ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఒకటి, రెండో తరగతి చదువుతున్న పిల్లలు పాఠశాలకు బ్యాగ్‌లు తీసుకురావల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశాలు జరిచేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్‌బిలాస్ శర్మ శుక్రవారం ప్రకటన చేశారు. గతకొంత కాలంగా ప్రైమరీ స్కూల్ పిల్లల బ్యాగుల బరువు తగ్గించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్వర్వులను అమలు చేయలని హర్యానా ప్రభుత్వం భావించింది. ప్రైమరీ స్కూల్ పిల్లలకు బరువైన బ్యాగులు, అధిక హోం వర్కుల నుంచి ఉపశమనం కల్పించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించాలని మే 30న మద్రాస్ హైకోర్టు సిఫారస్సు చేసిన విషయం తెలిసిందే. పిల్లల బరువులో పదిశాతానికి మించి బ్యాగ్ బరువు ఉండకూదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ ఆదేశాలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి ఆదేశించారు. -
టాటావాళ్లే ఫ్లాటయ్యారు
చిన్నప్పుడు సెలవులొస్తే అమ్మమ్మ ఊరో, నానమ్మ ఊరో మనకు వేసవి విడిది. అయితే ఈ చిన్నారి ఉన్న చోటనే ఉండి, రోజూ చల్లటి కథల పుస్తకాలను పిల్లలకు పంచిపెడుతూ చుట్టుపక్కల తండాలన్నిటినీ వేసవి విడిదులుగా మార్చేస్తోంది! ‘‘అమ్మా... జూదం చెడ్డ ఆట కదా?’’.. జుట్టు దువ్వుతున్న తల్లిని అడిగింది తొమ్మిదేళ్ల కోమల్ పవార్.‘అవును’’ పోనీ టెయిల్‌కు రబ్బర్ బ్యాండ్ పెడుతూ అంది తల్లి. ‘ధర్మరాజు ఆ ఆట ఆడాడు కాబట్టే కౌరవులు, పాండవులు యుద్ధం చేసుకోవాల్సి వచ్చింది కదా..’’ మళ్లీ కోమల్ ప్రశ్న. ‘‘ఊ’’ అంటూ కూతురిని తన వైపుకి తిప్పుకుంటూ ఆ అమ్మాయి చుబుకం పట్టుకొని నుదిటి మీద ముద్దుపెట్టుకుంది తల్లి. ‘అందుకే కౌరవులు ఎంత చెడ్డవాళ్లో జూదమాడిన ధర్మరాజూ అంతే చెడ్డవాడమ్మా..’’ నేల మీదున్న పుస్తకాల బ్యాగ్‌ను ఆయాసంతో భుజానికి తగిలించుకుంటూ అంది కోమల్!బిడ్డ ఆలోచనకు సంబరపడిపోతూనే ‘‘అంత బరువు మోయకపోతేనేం.. కొన్ని కొన్ని తీసుకెళ్లొచ్చు కదా’’ అంది తల్లి.‘‘ఇవన్నీ బస్తీ పిల్లల ఫర్మాయిష్ పుస్తకాలమ్మా! తీసుకెళ్లాలి. లేకపోతే బాధపడ్తారు పాపం.. అయినా సాయి వస్తాడు కదా.. వాడికీ ఇస్తాను కొన్నిమోయమని’’ జవాబు చెప్తూనే గడపదాటింది కోమల్. ‘జాగ్రత్త ఎండలో..’’ హెచ్చరించింది అమ్మ. బడికే ఇన్స్పిరేషన్! మహారాష్ట్రలోని సతారా జిల్లా హెకల్వాడీలో కోమల్ దినచర్య ఇది. నాలుగో తరగతి చదువుతోంది ఆ అమ్మాయి. పాఠ్యపుస్తకాలంటే ఇష్టం. కథల పుస్తకాలంటే ప్రాణం. కథలు చదవడం.. ఇదిగో ఇలా తన సందేహాలను అమ్మతో పంచుకోవడం..! తను చదివే హెకల్వాడీ జిల్లా పరిషత్ స్కూల్లో చిన్న లైబ్రరీ ఉంది. అందులోని పుస్తకాలను చదవడమే కాకుండా.. యేడాది కిందటి ఎండాకాలంలో తనకు నచ్చిన కథలను చేత్తో రాసి రెండు మూడు పుస్తకాల ప్రతులను తయారు చేసింది. వాటిని ఆ సెలవుల్లో తన ఊరు చుట్టూ ఉన్న తండాల్లో కథలంటే ఇష్టం ఉన్న పిల్లలకు పంచింది. స్కూళ్లు తెరిచాక ఈ విషయం టీచర్లకు తెలిసి కోమల్‌ను ప్రశంసించారు. వారే ఈ ఎండాకాలం ఓ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో కూడా స్కూల్ లైబ్రరీని తెరిచే ఉంచాలని! ఎండల్లో తండాలకు హెకల్వాడీ చుట్టూ నాలుగు తండాలున్నాయి. ఉదయం పూట పుస్తకాలను తండాలకు పంచి తిరిగి సాయంకాలం వాటిని స్కూల్ లైబ్రరీకి చేర్చాలి. కొన్నాళ్లు ఈ బాధ్యతను ఆ స్కూల్ లైబ్రేరియన్ తీసుకున్నారు. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొనసాగించలేకపోయారు. అప్పుడు ఇదిగో ఈ చిట్టి కోమలే ముందుకు వచ్చింది. పొద్దున్నే స్కూల్‌కి వెళ్లి కథల పుస్తకాలను సంచీలో సర్దుకొని ఇంటికెళ్లి రెడీ అయి మండే ఎండలను కూడా లెక్క చేయకుండా తండాలకు బయలుదేరుతుంది. తన ఈడు పిల్లలకు కథల పుస్తకాలు పంచడం, వాళ్లు ఆ పుస్తకాలను చదివేలా చూడ్డం అంటే ఆ పిల్లకు పండుగే. ఈ అమ్మాయి ఉత్సాహం, ఆమె జిల్లా పరిషత్ స్కూల్ ఇస్తున్న ప్రోత్సాహం గురించి తెలిసీ టాటా ట్రస్ట్ వాళ్లు ఈ పిల్లలకు బోలెడు పుస్తకాలను తెచ్చిచ్చారు. అలాగే చిన్న లైబ్రరీని కాస్తా పెద్దగా మార్చారు ఈ యేడు. ఛోటీ గ్రంథపాల్ కోమల్‌ను చూసి ఇప్పుడు వాళ్లింటి చుట్టుపక్కల ఉన్న పిల్లలూ ఆమె సాయంగా తండాలు తిరుగుతున్నారు పుస్తకాలు పట్టుకొని. పొలాల్లో, అంగన్వాడీల్లో, చెరువు గట్ల మీద, వాకిళ్లలో, ఇలా పిల్లలు ఎక్కడ కనపడితే అక్కడ పుస్తకాలు ఇస్తూ, వాళ్లు అవి చదివేలా చేస్తోంది కోమల్ అండ్ టీమ్. పైగా కిందటి రోజు చదివిన కథల గురించి తెల్లవారి చిన్న సైజు గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయట. ‘‘నాకు రామాయణ, మహాభారతం నుంచి నీతికథలు.. అన్ని.. అన్నీ ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా వాటన్నిటినీ చదవాలి. కథలు చదివితే ఇంకో ప్రపంచంలోకి వెళ్తా..’’ అంటుంది ఈ ఛోటీ గ్రంథపాల్. అన్నట్టు కోమల్‌కు తండాలవాళ్లు ఇచ్చిన పేరు అది. బుజ్జి లైబ్రేరియన్ అని! – శరాది -
పిండి పదార్థం పెరిగితే పిల్లల్లో ఎదుగుదల!
పిల్లల్లో ఎదుగుదల లోపాలను నివారించేందుకు రెసిస్టెంట్ స్టార్చ్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆఫ్రికాకు చెందిన పిల్లల వ్యర్థాలను విశ్లేషించడం ద్వారా అరటిపండుతోపాటు వేర్వేరు బీన్స్‌ల ద్వారా శరీరానికి లభించే పిండిపదార్థం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తించారు. పిల్లల్లోని బ్యాక్టీరియా ఈ రకమైన పిండిపదార్థం పూర్తిగా జీర్ణం కాకుండా పేవుల్లో పులియబెట్టి కొన్ని రకాల కొవ్వుల ఉత్పత్తికి సహకరిస్తాయని, ఈ కొవ్వులు కాస్తా కడుపులో వాపు/మంటలు రాకుండా నిరోధిస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. గర్భంలో ఫలదీకరణం చెందింది మొదలు.. పుట్టిన తరువాత రెండేళ్లకాలం వారి ఎదుగుదలకు ఎంతో కీలకమని.. ఈ తొలి వెయ్యి రోజుల కాలంలో పౌష్టికాహారం తీసుకుంటే జీవితాంతం మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చునని ఇప్పటికే జరిగిన అనేక పరిశోధనలు చెబుతున్నాయి. భారత్‌తోపాటు, ఆఫ్రికాలోనూ లక్షల సంఖ్యలో సవజాత శిశువులు పోషకాహార లోపం బారిన పడటమే కాకుండా.. పూర్తిస్థాయిలో ఎదగలేకపోతున్న నేపథ్యంలో ఈ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. కడుపు/పేవుల్లో వాపు/మంటల్లాంటివి లేకపోతే పోషకాలు శరీరానికి ఒంటబట్టి ఎదుగుదల మెరుగవుతుందని అంచనా. పసిపిల్లలకు అందించే ఆహారంలో రెసిస్టెంట్ స్టార్చ్‌ను పెంచడమే కాకుండా.. వండే పద్ధతుల్లో మార్పులు చేయడం ద్వారా ఈ పిండిపదార్థం శరీరంలోకి ఎక్కువగా చేరేలా చేయవచ్చునని వీరు సూచిస్తున్నారు. -
ఆడితే జీవితం అంధకారమే
► చెడు అలవాట్లకు దగ్గరయ్యేలా ఉంటున్న మొబైల్ గేమ్స్ ►పిల్లల్లో అవాంఛనీయ మానసిక మార్పులకు అవకాశం ►తల్లిదండ్రులు జాగ్రత్తపడాలంటున్న నిపుణులు ►జిల్లాలో శ్రుతి మించితున్న విష సంస్కృతి తిరుపతి : బ్లూవెల్ చాలెంజ్.. ప్రపంచాన్నే వణికిస్తున్న ఆన్లైన్ క్రీడ ఇది. చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడేలా ఉసిగొలుపుతున్న మృత్యువల ఇది. అందులో లీనమైతే బ్లేడ్‌తో శరీర భాగాలను కోసుకోవడంతో పైత్యం ప్రారంభమై.. బలవర్మణానికి పాల్పడే వరకు ఎన్నో ఘోరాలు చేయిస్తుంది. ‘‘ఆ భవనంపై మీద నుంచి దూకు ..’’, ‘‘ ఈ నీళ్లల్లో మునుగు’’, .. ‘‘ఆ వంతెన చివర నిలుచుకుని సెల్ఫీ తీసుకుని పంపు’’.. అంటూ పిల్లలను మానసికంగా మెలిపెడుతూ టాస్క్‌లను నిర్వాహకులు (క్యూరేటర్లు) ఇస్తుంటారు. చివరగా ‘‘ నీవు ఆత్మహత్య చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’’ .. అంటూ ఆఖరు టాస్క్‌ను నిర్దేశిస్తా రు. అంతే ఆ చిన్నారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిపే ఘోరమైన ఆట ఇది. ప్రపంచవ్యాప్తంగా వెల్తువెత్తుతున్న నిరసనతో ప్రస్తుతం దీనికి అడ్డుకట్టపడిందనే చెప్పవచ్చు. కానీ పిల్లల మనస్సులను ఇంచుమించు ఇదే స్థాయిలో కలుషితం చేస్తున్న మిగతా క్రీడల మాటేమింటి?, అసలు మన పిల్లలు ఆడాల్సింది ఇలాంటి ఆటలా..?, వారు నేర్చుకోవాల్సింది ఇంతటి ప్రమాదకరమైన విషయాలా? ఇంతకంటే ఆనందాలను ఇచ్చే క్రీడలు లేవా? ఇప్పుడు అందరి తల్లిదండ్రులను తొలిచివేస్తున్న ప్రశ్న ఇది. జిల్లాలోని పిల్లలు విచ్చలవిడిగా ఈ గేమ్‌ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. పాఠశాలల్లో, ఇంటి పరిసరాల్లో ఈగేమ్లకు సంబంధించిన మాటలే వినిపిస్తుంటాయని అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు మిత్రులను జూసి ఈ జాడ్యానికి అలవాటు పడుతున్నారని చెబుతున్నారు. → పిల్లలను ఆకట్టుకునేలా ఆటను డిజైన్ చేయడం, గ్రాఫిక్స్‌తో కట్టిపడేయడం,ఒక లెవల్ ఆడగానే మరో లెవల్పై ఉత్సాహం పెరిగేలా చేయడం.. ఇలా మానసికంగా పిల్లలు గేమ్‌ల వలలోకి లాగుతున్నారు. → రైళ్ల మీద పరుగులు పెట్టడం, కత్తులతో ఎదుటవా రిపై దాడిచేయడం, అడ్డువచ్చిన ప్రతి ఒక్కరిని కాల్చి వేయడం, రాక్షసుల్లాంటి వారితో పోరాటాలు చేసి వారిని తుదిముట్టించడం, బాంబులు విసరడం వం టి అసంబద్ధ చర్యలవైపు పిల్లలను పురిగొల్పుతున్నారు. →పెద్దల కోసం ఉన్న రమ్మీలాంటి ఆటలను ఇప్పుడు పాఠశాల పిల్లలు కూడా ఆడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎదుటి ముఠాను తుదముట్టించి దొరికినవి దోచుకెళ్లడం వంటి వికృత ఆటలను పిల్లలు ఆడేస్తున్నట్టు చెబుతున్నారు. జీవితం పక్కదారి: మొబైల్లో ఏఆట ఆడారో దానిని ఎక్కువగా తలచుకోవడం, నిద్ర సమయంలో బాగా కలవరించడం, కలలోకూడా గేమ్‌ల పాత్రలనే ఊహించుకోవడం దీని చర్యల ద్వారా పిల్లల ధ్యాస చదువు నుంచి పక్కదారి పడుతుందంటున్నారు. ఎలాంటి ధ్రువీకరణ ఉండడం లేదు మొబైల్ గేమ్‌ల్లో ఏవి మంచివి, ఏవి ఇబ్బంది కలిగించేవి, ఇందులో పిల్లలకు ఉపయోగపడేవి ఏవి అనేవి అంశాలకు సంబంధించి గూగుల్ప్లేస్స్టోర్లో ఎలాంటి ధ్రువీకరణ ఉండడంలేదని నిపుణులు అంటున్నారు. ఈ తరహా పద్ధతిని ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవరసం ఉంటుందంటున్నారు. చేటును ఎలా గుర్తించాలి మొబైల్ గేమ్‌తో 15 నుంచి 20 నిమిషాలు పిల్లలు నిర్విరామంగా మునిగి తేలుతుంటే కచ్చితంగా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. ఇంట్లోవారితో కాకుండా బయటి స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడం మరో కారణంగా భావించవచ్చు. పిల్లల అలవాట్లను మార్చేలా ఉండే ఆటలను కచ్చితంగా తల్లిదండ్రులు గుర్తించాలి. ఇటీవల కాలంలో పాఠశాలలకు మొబైల్ తీసుకురావడం పెరిగిపోతోంది. ► తరగతి మధ్యలో విరామ సమయంలో ఆడటాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ► నగరంలోని పాఠశాలల్లో ప్రతి తరగతిలోని మొబైల్ గేమ్లును ఆడే వారి 5 నుంచి 10 శాతం ► గేమ్‌తో మానసిక వ్యాధుల బారిన పడుతున్న పిల్లల సంఖ్య 2 శాతంగా ఉంది. తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి పిల్లలు చెడుబాట పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల ముందు తల్లిదండ్రులు మొబైల్ ఎక్కువ వాడకూడదు. అంతేగాక పిల్లలు ఎలాంటి గేమ్‌లు ఆడుతున్నారో, అందులో మంచి చెడులు ఏమిటో గుర్తించాలి. వాటిని పూర్తిగా ఒకేసారి మాన్పించడానికి ప్రయత్నించకుండా మంచి మార్గంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులే కౌన్సిలర్లుగా వ్యవహరించాలి. మొబైల్గేమ్లు శృతిమించితే వెంటనే మానసిక నిపుణులకు చూపించాలి. – డాక్టర్ ఎన్ఎన్ రాజు, మానసిక నిపుణులు