సాక్షి, అమరావతి: బాల్యం నుంచే సంపూర్ణ విద్యను అందించటం ద్వారా చిన్నారుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సంపూర్ణ విద్యతో జీవితంలో శ్రేష్ఠత’ అనే అంశంపై ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం నిర్వహించిన అంతర్జాతీయ విద్యా సదస్సులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా వర్చవల్ విదానంలో రాజ్ భవన్ నుంచి పాల్గొన్నారు. గవర్నర్ మట్లాడుతూ ఆలోచనాపరులు, తత్వవేత్తలు ఊహించినట్లుగా కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రపంచం, మనం ఇంతకు ముందు చూసిన ప్రపంచానికి భిన్నంగా మారుతుందన్నారు.
సంపూర్ణ అభివృద్ధి సాధించిన పిల్లలు మేధో, మానసిక, శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సామర్థ్యాలను కలిగి ఉండటం ద్వారా రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్దంగా ఉంటారని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పిల్లలలో నెలకొంటున్న ఒత్తిడి, ఆందోళన వారిలో అనిశ్చితికి దారితీస్తుందని, వారు నిర్బంధ వాతావరణంలో పెరగటం వల్లే ఈ పరిస్ధితులు ఏర్పడుతున్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
ఈ పరిణామాలు తల్లిదండ్రులకు తమ చిన్నారుల భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. భయం, ఆందోళన, అనిశ్చితి ఉన్న ఈ కాలంలో జీవితాన్ని ఇచ్చే విద్య అన్న అంశంపై దృష్టి పెడుతూ ఆధ్యాత్మిక, నైతిక విలువలను బోధించడం ద్వారా సమాజంలో దైవత్వాన్ని వ్యాప్తి చేయడానికి బ్రహ్మ కుమారిస్ చేస్తున్న కృషిని ప్రశంసనీయమన్నారు.
చదవండి: షాకింగ్: భార్యను చెల్లిగా పరిచయం చేస్తూ పెళ్లి, ఆ పై..
Comments
Please login to add a commentAdd a comment