పీట్‌ హెగ్‌సెత్‌కు మహిళలంటే గౌరవం లేదు | Donald Trump defence nominee Pete Hegseth accused by mother of mistreating women | Sakshi
Sakshi News home page

పీట్‌ హెగ్‌సెత్‌కు మహిళలంటే గౌరవం లేదు

Published Sun, Dec 1 2024 6:05 AM | Last Updated on Sun, Dec 1 2024 6:05 AM

Donald Trump defence nominee Pete Hegseth accused by mother of mistreating women

వారితో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు  

అమెరికాకు కాబోయే రక్షణ మంత్రిపై సొంత తల్లి ఆరోపణలు  

వాషింగ్టన్‌:  అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. కీలక శాఖలకు మంత్రులుగా ఇప్పటికే పలువురి పేర్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీరంతా మంత్రులుగా మారబోతున్నారు. కానీ, ట్రంప్‌ ఎంపికల పట్ల విమర్శలు వస్తున్నాయి. 

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని, లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నవారిని ట్రంప్‌ మంత్రులుగా ఎంపిక చేశారంటూ అసంతృప్త స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నా యి. ఆయన వినిపించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అమెరికా రక్షణ శాఖ మంత్రిగా ఎంపికైన పెటీ హెగ్‌సెత్‌(44)పై ఆయన సొంత తల్లి పెనెలోప్‌ హెగ్‌సెత్‌ ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. 

తన కుమారుడికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని, చులకనగా చూస్తాడని ఆమె తప్పుపట్టారు. చాలాఏళ్లు మహిళలతో అతడు అభ్యంతకరంగా ప్రవర్తించాడని ఆక్షేపించారు. తన బిడ్డ ప్రవర్తన సరైంది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు 2018లో తన కుమారుడికి పెనెలోప్‌ పంపించిన ఈ–మెయిల్‌ను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక బహిర్గతం చేసింది. ‘‘నువ్వు(పీట్‌ హెత్‌సెత్‌) మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. వారిని చాలా చులకనగా చూడడం నీకు అలవాటు. 

ఆడవాళ్ల గురించి నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్తుంటావు. తప్పుడు ప్రచారం చేయడం నీకు ఇష్టం. అందుకే నిన్ను నేను ఎప్పటికీ గౌరవించలేను. ఒక తల్లిగా నీ ప్రవర్తన పట్ల మౌనంగా ఉండాలని ప్రయత్నించా. కానీ, నీ భార్యను ఘోరంగా వేధించావు. ఆమె చాలా మంచి అమ్మాయి. ఆమె అనుభవించిన బాధ ను తెలుసుకొని సహించలేకపోయాను. నీ ప్ర వర్తన పట్ల మేమంతా విసుగెత్తిపోయాం’’అని ఈ–మెయిల్‌లో పెనెలోప్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు. 

హెగ్‌సెత్‌ రక్షణ శాఖ మంత్రిగా ఎంపిక కావడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పెనెలోప్‌ స్పందించారు. కోపం, ఆవేశంతో అప్పట్లో తన కుమారుడిపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఈ–మెయిల్‌ పంపించానని, ఆ తర్వాత అతడికి క్షమాపణ చెప్పానని వెల్లడించారు. ఇదిలా ఉండగా, పీట్‌ హెగ్‌సెత్‌కు వివాహేతర సంభంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంబంధంతో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చినట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement