
సిద్దిపేట : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ భర్త తన ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్దిపేట టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించే తేలు సత్యం ముదిరాజ్ (48) తేలు శిరీష (26) భార్యభర్తలు. వాళ్లిద్దరికి అశ్వన్ నందన్(7), త్రివర్ణ (5) ఇద్దరు పిల్లలు. కానీ విధికి ఆ చింతలేని కుటుంబాన్ని చూసి కన్నుకుట్టింది. హాయిగా సాగిపోతున్న సంసారంలో మనస్పర్ధలు చిచ్చు పెట్టాయి. దీంతో రెండో భార్య తేలు శిరీష కొన్నినెలల క్రితం భర్త సత్యంను వదిలి పుట్టింటికి వెళ్లింది.
పలు మార్లు కాపురానికి రావాలని కోరినా.. శిరీష కనికరించలేదు. దీంతో మనోవేధనకు గురైన సత్యం ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తాను ప్రాణాలు తీసుకుంటే పిల్లలు అనాధలవుతారని భావించిన సత్యం.. తన పిల్లలు (రెండో భార్య పిల్లలు) అశ్వన్ నందన్, త్రివర్ణలతో కలిసి సిద్దిపేట చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
తండ్రి పిల్లలు కలిసి చింతల చెరువులో దూకడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చింతల చెరువులో దూకి బాధితుల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ముగ్గురి ప్రాణాలు అనంతలోకాల్లో కలిసిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment