WWE Hall of Famer planning on remarrying his wife 23 years after their divorce - Sakshi
Sakshi News home page

#WWE'The Snake' Roberts: వద్దనుకొని 23 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఆమెతోనే పెళ్లి

Jun 13 2023 4:15 PM | Updated on Jun 13 2023 4:30 PM

WWE Hall-of-Fame-Planning-Remarry-His-Wife-23-Years After-Their Divorce - Sakshi

డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) లెజెండ్‌, హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జేక్‌ రాబర్ట్‌(ముద్దుగా The Snake) 68 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడు. ఇక్కడ విచిత్రమేంటంటే 23 ఏళ్ల క్రితం విడాకులు ఇచ్చిన తన భార్యనే మళ్లీ వివాహమాడనున్నాడు. ఈ విషయాన్ని ది స్నేక్‌ రాబర్డ్‌ స్వయంగా చెప్పుకొచ్చాడు. 

విషయంలోకి వెళితే.. జేక్‌ రాబర్ట్స్‌ 1984లో చెరిల్‌ హాగ్‌వుడ్‌ను ప్రేమించి పెళ్లి పెళ్లిచేసుకున్నాడు. ఈ జంటకు నలుగురు పిల్లలు. 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ ఇద్దరు 2000వ సంవత్సరంలో విడిపోయారు. ఆ తర్వాత జేక్‌ రాబర్ట్స్‌ 2006లో జూడీ లిన్‌ను వివాహామాడాడు. 2011లో వీరిద్దరికి విడాకులయ్యాయి. అప్పటినుంచి జేక్‌ రాబర్ట్స్‌ ఒంటరిగానే ఉంటున్నాడు.

తాజాగా జేక్‌ రాబర్ట్స్‌ తన మనసులోని మాటన బయటపెట్టాడు. ''23 ఏళ్ల క్రితం నా భార్య చెరిల్‌ హాగ్‌వుడ్‌కు విడాకులు ఇచ్చాను. ఇన్నేళ్లు మేము విడిగానే ఉంటున్నా ఫ్రెండ్లీగానే ఉంటూ వచ్చాం. అయితే ఈ మధ్యనే తనను కలిసి మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆమె నుంచి తొలుత స్పందన రాకపోయినప్పటికి తర్వాత పాజిటివ్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  నిజంగా మాది ఒక అద్బుత లవ్‌స్టోరీ. 23 ఏళ్లు మేం విడిపోయాం అంటే నమ్మలేకుండా ఉన్నా. దేవుడు నాకు ఇ‍వ్వబోతున్న సెకెండ్‌ చాన్స్‌ను ఉపయోగించుకుంటా. చెరిల్‌ హాగ్‌వుడ్‌ను ఈసారి కష్టపెట్టను.. ఆమెను బాగా చూసుకోగలను అనే నమ్మకం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌గా పేరు పొందిన జేక్‌ రాబర్ట్స్‌ అనగానే ముందు గుర్తుకు వచ్చేది అతని మెడలో ఒక కొండచిలువను వేసుకొని రింగ్‌లోకి అడుగుపెడుతుండేవాడు. అందుకే ది స్నేక్‌ మాస్టర్‌(The Snake) పేరుతో పాపులర్‌ అయ్యాడు. ఇక 2014లో డబ్ల్యూడబ్ల్యూఈ హాల్‌ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించిన జేక్‌ రాబర్ట్స్‌ ప్రస్తుతం ఆల్‌ ఎలైట్‌ రెజ్లింగ్‌(AEW Pro Wrestling)లో లాన్స్‌ ఆర్చర్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు.

చదవండి: స్కూల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడనున్న సీఎస్‌కే స్టార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement