World Wrestling Entertainment- WWE
-
రెజ్లింగ్ పాటకు మొసలి హుషారు
90వ దశకంలో టీవీల్లో వచ్చే రెజ్లింగ్ క్రీడకు భారతీయ టీనేజర్లలో క్రేజీ అంతాఇంతా కాదు. అలాంటి క్రేజ్ ఇప్పుడు భారత్‌లో తగ్గిపోయినా అమెరికా తదితర దేశాల్లో ఇంకా ఉంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) అభిమానులకు ఒక మొసలి సైతం జతకలిసింది. స్టార్‌వార్స్ ప్రఖ్యాత థీమ్సాంగ్ అయిన ‘ది ఇంపీరియల్ మార్చ్’ పాట వినబడగానే ఈ మొసలి హుషారుగా కదలివస్తోంది. గంటలతరబడి కదలకుండా ఉండగలిగే మొసలిలో సైతం మా సాంగ్ కదలిక తెప్పిస్తోందని, మెప్పిస్తోందంటూ పలువురు రెజ్లింగ్ అభిమానులు సంబంధిత వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎవర్గ్లేడ్స్ హాలిడే పార్క్‌లో డార్త్ గేటర్ అనే మొసలి ఉంది. ఇది ఈ పాట వినగానే చేస్తున్న హంగామా చూసి గేటర్బాయ్స్ టీవీషో స్టార్ పౌల్ బేడార్ట్ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. స్వయంగా మొసలి సమీపానికి వెళ్లి మాంసం ముక్కలను పట్టుకుని థీమ్‌సాంగ్‌ను ప్లే చేయడం, మొసలి వచ్చి హుషారుగా ముక్కలను లటుక్కున మింగేయడం వీడియోలో రికార్డయింది. దీనిని ఇప్పుడు లక్షలాది మంది లైక్‌లు, షేర్లు కొడుతున్నారు. – న్యూయార్క్ -
7 డాలర్లే ఉన్నాయి.. ఏకంగా ఇంటినే ఇచ్చేశాడు! దయలోనూ కింగే!
డ్వేన్ డగ్లస్ జాన్సన్ అంటే గుర్తుపట్టకపోవచ్చేమో గానీ.. ‘ది రాక్’ అనగానే చాలా మందికి అతడి రూపం కళ్ల ముందు కదలాడుతుంది. ప్రొఫెషనల్ రెజ్లర్‌గా.. హాలీవుడ్ స్టార్‌గా అతడు సాధించిన.. సాధిస్తున్న విజయాలు స్ఫురణకు వస్తాయి. ఏకంగా ఎనిమిదిసార్లు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ చాంపియన్‌గా నిలిచిన ఘనత డ్వేన్ జాన్సన్ సొంతం. హాలీవుడ్‌లోనూ తన నటనతో స్టార్‌గా తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడతడు! కఠిన సవాళ్లను దాటుకుని కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మే 2, 1972లో జన్మించాడు డ్వేన్ జాన్సన్. అతడి తల్లిండ్రులు అటా జాన్సన్, రాకీ జాన్సన్. రాకీ ప్రొఫెషన్ రెజ్లర్. తండ్రిని చూసి చిన్ననాటి నుంచే రెజ్లింగ్‌పై ఇష్టం పెంచుకున్నాడు డ్వేన్. డబ్ల్యుడబ్ల్యుఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన తండ్రి, తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తానూ రెజ్లర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే, తండ్రి సంపాదనలో నిలకడ లేకపోవడంతో చిన్నతనం నుంచే ఆర్థికంగా కష్టాలు చవిచూశాడు. అద్దె కట్టలేని కారణంగా ఎన్నోసార్లు ఇళ్లు మారాల్సి వచ్చేది. This man @TheAnswerMMA is a very special human being. Themba is committed to three things: His family, his village and people in Africa, and becoming world champion in the @ufc. What an inspiration he is. Rooting for him all the way. ❤️ https://t.co/ZOOfOZLka4 — Dwayne Johnson (@TheRock) February 28, 2024 ఫలితంగా అప్పటికి రెజ్లర్‌గా మారాలన్న కలకు విరామం ఇచ్చాడు. స్కూళ్లో చదువుతున్న సమయంలో ఫుట్‌బాల్ కోచ్ డ్వేన్లో దాగిన ప్రతిభను గుర్తించి అవకాశమిచ్చాడు. క్రమక్రమంగా స్టార్ ఫుట్‌బాలర్‌గా పేరొంది పెద్ద క్లబ్బులకు ఆడే అవకాశాలు వచ్చినా గాయాల కారణంగా చేజారిపోయేవి. దీంతో మళ్లీ కథ మొదటికే వచ్చేది. అలాంటి సమయంలో అనూహ్యంగా ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో అడుగుపెట్టాడు డ్వేన్ జాన్సన్. ఆరంభంలో తండ్రి, తాత పేరు కలిసి వచ్చేలా రాకీ మైవియా పేరుతో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో కఠిన సవాళ్లు ఎదుర్కొని తనకంటూ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుని ‘ది రాక్’గా ఎదిగాడు. డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్‌స్టార్‌గా క్రేజ్ సంపాదించాడు. అంతటితో సంతృప్తి చెందక హాలీవుడ్లో నటుడిగా అదృష్టం పరీక్షించుకుని అక్కడా విజయవంతమయ్యాడు డ్వేన్ జాన్సన్. రెజ్లింగ్‌లోనే కాదు.. దయచూపడంలోనూ రాజే! ఇతరులకు సాయం చేయడంలోనూ తాను ముందే ఉంటానని నిరూపించాడు డ్వేన్ జాన్సెన్. అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రోత్సహించే అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో రాణించాలనుకుంటున్న ఆఫ్రికన్ వ్యక్తికి అందమైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. తన అకౌంట్లో కేవలం ఏడు డాలర్లే ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన అతడిని సర్ప్రైజ్ చేశాడు. ‘‘ఇతడు ఎంతో ప్రత్యేకమైన మనిషి. తెంబా జీవితంలో మూడు అత్యంత ముఖ్యమైనవి. తన కుటుంబం, సౌతాఫ్రికాలోని తన గ్రామం, అక్కడి ప్రజలు.. ఇంకా యూఎఫ్‌సీలో వరల్డ్ చాంపియన్ కావడం. ఎంతో మందికి తను స్ఫూర్తి’’ అంటూ సదరు వ్యక్తిని ప్రశంసించిన డ్వేన్ జాన్సెన్.. అతడికి ఇంటి తాళాలు అందించిన వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. తెంబా అంకితభావానికి ఫిదా అయి మియామిలో ఫుల్ ఫర్నిష్డ్ ఇంటిని కానుకగా అందించాడు. ఈ నేపథ్యంలో డ్వేన్ జాన్సన్ పెద్ద మనసు పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. The Rock gifted a UFC fighter a house after he tweeted he had $7 in his bank account pic.twitter.com/osT5Ve0GXC — Historic Vids (@historyinmemes) February 27, 2024 -
వద్దనుకొని 23 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఆమెతోనే పెళ్లి
డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) లెజెండ్, హాల్ ఆఫ్ ఫేమ్ జేక్ రాబర్ట్(ముద్దుగా The Snake) 68 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడు. ఇక్కడ విచిత్రమేంటంటే 23 ఏళ్ల క్రితం విడాకులు ఇచ్చిన తన భార్యనే మళ్లీ వివాహమాడనున్నాడు. ఈ విషయాన్ని ది స్నేక్ రాబర్డ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. విషయంలోకి వెళితే.. జేక్ రాబర్ట్స్ 1984లో చెరిల్ హాగ్వుడ్ను ప్రేమించి పెళ్లి పెళ్లిచేసుకున్నాడు. ఈ జంటకు నలుగురు పిల్లలు. 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ ఇద్దరు 2000వ సంవత్సరంలో విడిపోయారు. ఆ తర్వాత జేక్ రాబర్ట్స్ 2006లో జూడీ లిన్‌ను వివాహామాడాడు. 2011లో వీరిద్దరికి విడాకులయ్యాయి. అప్పటినుంచి జేక్ రాబర్ట్స్ ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా జేక్ రాబర్ట్స్ తన మనసులోని మాటన బయటపెట్టాడు. ''23 ఏళ్ల క్రితం నా భార్య చెరిల్ హాగ్వుడ్కు విడాకులు ఇచ్చాను. ఇన్నేళ్లు మేము విడిగానే ఉంటున్నా ఫ్రెండ్లీగానే ఉంటూ వచ్చాం. అయితే ఈ మధ్యనే తనను కలిసి మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆమె నుంచి తొలుత స్పందన రాకపోయినప్పటికి తర్వాత పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. నిజంగా మాది ఒక అద్బుత లవ్‌స్టోరీ. 23 ఏళ్లు మేం విడిపోయాం అంటే నమ్మలేకుండా ఉన్నా. దేవుడు నాకు ఇవ్వబోతున్న సెకెండ్ చాన్స్‌ను ఉపయోగించుకుంటా. చెరిల్ హాగ్వుడ్ను ఈసారి కష్టపెట్టను.. ఆమెను బాగా చూసుకోగలను అనే నమ్మకం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌గా పేరు పొందిన జేక్ రాబర్ట్స్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది అతని మెడలో ఒక కొండచిలువను వేసుకొని రింగ్‌లోకి అడుగుపెడుతుండేవాడు. అందుకే ది స్నేక్ మాస్టర్(The Snake) పేరుతో పాపులర్ అయ్యాడు. ఇక 2014లో డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన జేక్ రాబర్ట్స్ ప్రస్తుతం ఆల్ ఎలైట్ రెజ్లింగ్(AEW Pro Wrestling)లో లాన్స్ ఆర్చర్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: స్కూల్ఫ్రెండ్ను పెళ్లాడనున్న సీఎస్కే స్టార్ -
పొట్టి స్కర్ట్, హై హీల్స్‌తో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్.. 'మాకేంటీ కర్మ'
జాన్ సీనా(John-Cena).. డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు. తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ సూపర్‌స్టార్. 13సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిన దిగ్గజం.. మరో మూడుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా నిలిచాడు. సినిమాలతో బిజీ అయిన జాన్ సీనా కొంతకాలంగా రెజ్లింగ్‌కు దూరమయ్యాడు. తాజాగా వ్రెసల్‌మేనియా ద్వారా డబ్ల్యూడబ్ల్యూఈలో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. 20 ఏళ్ల రెజ్లింగ్ కెరీర్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న జాన్ సీనా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. ఇక జాన్ సీనా తన రెజ్లింగ్ కెరీర్లో చాలావరకు బ్యాగీ షార్ట్స్, పెద్ద చైన్లు, క్యాప్లతోనే కనిపించాడు. అయితే, తాజాగా అతను తొడల వరకే ఉండే పొట్టి లంగా, హై హీల్స్ చెప్పులతో దర్శనమిచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసిన ఆయన అభిమానులు ఎలా స్పందించాలో తెలియక.. '' మా సూపర్‌స్టార్‌కు ఇదేం కర్మరా బాబు'' అనుకుంటూ తల పట్టుకున్నారు. అయితే జాన్ సీనా మహిళలా పొట్టి లంగా, ఎత్తు మడమల చెప్పులు, మోకాళ్లదాకా సాక్షులు ఎందుకు ధరించాడని అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆయన ప్రస్తుతం ''రికీ స్టానికి'' అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఆ కామెడీ సినిమాలో తను పోషించబోయే పాత్ర కోసం జాన్ సినా మూవీ సెట్లో అలా విచిత్ర వేషధారణలో కనిపించాల్సి వచ్చింది. అదీ అసలు విషయం. Beyond excited to help bring these characters to life (both on and off screen) with an incredible cast, our director and producers and partners at @AmazonStudios @primevideo. #RickyStanicky is a best friend to all — can’t wait for you to meet him! https://t.co/DtLAsiwWQa — John Cena (@JohnCena) February 1, 2023 చదవండి: హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా-ఈ రేసింగ్.. విజేత ఎవరంటే? -
తల్లికి రోడ్డు ప్రమాదం.. డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఎమోషనల్
డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం, హాలీవుడ్ స్టార్.. ది రాక్(డ్వేన్ జాన్సన్) తల్లి ఆటా జాన్సన్ కారు ప్రమాదానికి గురవ్వడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. రాక్ తల్లి ఆటా జాన్సన్ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు ముందు బాగం బాగా దెబ్బతిన్నప్పటికి సకాలంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆటా జాన్సన్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎమర్జన్సీ బృందం ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని.. ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రాక్(డ్వేన్ జాన్సన్) తల్లిని చూసేందుకు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. ఆమె క్షేమంగా ఉందని తెలుసుకొని సంతోషించిన రాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లికి జరిగిన ప్రమాదంపై ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ''దేవుని దయ వల్ల నా తల్లి బాగానే ఉంది. సకాలంలో స్పందించిన ఎమర్జెన్సీ సర్వీస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. యాక్సిడెంట్లో కారు ముందు భాగంలో డ్యామేజ్ ఎక్కువగా జరగడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయేమోనని ఆందోళన పడ్డాను. సకాలంలో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో నా తల్లికి ప్రాణాపాయం తప్పింది. నా తల్లి(అటా జాన్సన్)తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి బయటపడిన ఆమె.. తర్వాత నాన్నతో కష్టాలు పడింది. ఒక సందర్భంలో సూసైడ్ వరకు వెళ్లింది. కానీ నాపై ప్రేమతో అవన్నీ చేయలేకపోయింది. నా తల్లి ఒక యోధురాలు.. జీవితంలో కష్టాలన్ని చూసి కూడా ఇవాళ నిబ్బరంగా ఉంది. ఇవాళ జరిగిన పెద్ద యాక్సిడెంట్లో ఆమె ప్రాణాలతో బయటపడింది. థాంక్యూ గాడ్.. నా తల్లిని కాపాడినందుకు'' అంటూ పేర్కొన్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో దిగ్గజంగా పేరు పొందిన రాక్ పీపుల్స్ స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెజ్లింగ్‌లో ఎనిమిదిసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత రాక్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం రాక్(డ్వేన్ జాన్సన్) హాలీవుడ్ సూపర్స్టార్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈకి దూరంగా ఉంటున్న రాక్.. ఈసారి జరగబోయే రెసల్మేనియా(Wrestlemania)aలో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. View this post on Instagram A post shared by Dwayne Johnson (@therock) -
Hulk Hogan: అసభ్యకర ట్వీట్ చేసిన రెజ్లింగ్ స్టార్.. ఆపై తొలగింపు
డబ్ల్యూడబ్ల్యూఈ(WWE) ఫాలో అయ్యేవారికి హల్క్ హోగన్(Hulk Hogan) గురించి పరిచయం అక్కర్లేదు. ఆల్‌టైమ్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన హల్క్ హోగన్ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోనూ ఉన్నాడు. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హల్క్ హోగన్‌కు ట్విటర్లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. హల్క్ హోగన్‌కు ట్విటర్లో దాదాపు రెండు మిలియన్‌కి పైగా ఫాలోవర్స్ ఉండడం విశేషం. అలాంటి హల్క్ హోగన్‌కు ట్విటర్లో వింత అనుభవం ఎదురైంది. పొరపాటుగా చేసిన ఒక అసభ్యకరమైన ట్వీట్‌కు వినూత్న రీతిలో కామెంట్లు రావడం హల్క్ హోగన్‌ను చిక్కుల్లో పడేసింది. అయితే తప్పును గుర్తించి వెంటనే ట్వీట్‌ను తొలగించినప్పటికి స్క్రీన్షాట్ల రూపంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తన బ్రదర్‌కు చెప్పాల్సిన ప్రైవేటు మెసేజ్‌ను పొరపాటున ట్విటర్లో పెట్టేశాడు. ''టాయిలెట్ పేపర్స్ అయిపోయాయి.. ఎలా తుడుచుకోవాలి.. కాస్త సహాయం చెయ్యు బ్రదర్'' అంటూ ట్వీట్ చేశాడు. హల్క్ హాగన్ ఏంటి పిచ్చి ట్వీట్ ఏదో పెట్టాడని అభిమానులు అనుకునేలోపే తప్పును గుర్తించి దానిని తొలగించాడు. తన బ్రదర్‌తో మాట్లాడాల్సిన మాటలు పొరపాటున ఫోన్ రికార్డర్లో రికార్డయి ట్విటర్లో కాప్షన్‌గా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో హల్క్ హోగన్‌కు ఇబ్బంది తప్పలేదు. అయితే హల్క్ హోగన్ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదులెండి. ఇంతకముందు కూడా చాలాసార్లు అతను తప్పుడు ట్వీట్స్‌తో ఇబ్బందులు కొనితెచ్చుకున్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజాల్లో ఒకడిగా గుర్తింపు పొందిన హల్క్ హోగన్ 1977 నుంచి 2012 వరకు రెజ్లింగ్‌లో స్టార్‌గా కొనసాగాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్తో పాటు టీఎన్ఏలోనూ తన హవా కొనసాగించిన హల్క్ హోగన్ పలుమార్లు చాంపియన్‌షిప్‌లు కైవసం చేసుకున్నాడు. 1980లలో టాప్‌స్టార్‌గా వెలుగొందిన హల్క్ హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లో కొన్నేళ్ల పాటు నెంబర్‌వన్ స్థానంలో కొనసాగాడు. చదవండి: టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' 'త్వరలో షోలే-2 రాబోతుంది.. సిద్ధంగా ఉండండి' Goodnight HULKAMANIACS and jabronie marks without a life that don’t know it a work when you work a work and work yourself into a shit, marks pic.twitter.com/9GHA5cbn3g — David Bixenspan (@davidbix) January 25, 2023 what in the world pic.twitter.com/qvD76IqG9s — David Bixenspan (@davidbix) January 25, 2023 -
WWE: అంతుచిక్కని వ్యాధితో మాజీ రెజ్లింగ్ స్టార్ కన్నుమూత
మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ(WWE), ఏఈడబ్ల్యూ(AEW) స్టార్ జైసిన్ స్ట్రిఫే(37) కన్నుమూశాడు. కొంతకాలంగా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న జైసిన్ స్ట్రిఫే గురువారం అర్థరాత్రి కన్నుమూసినట్లు అతని సోదరుడు ప్రకటించాడు. జైసిన్కు ఏ రకమైన వ్యాధి సోకిందనేది వైద్యులు కూడా నిర్థారించేలేకపోయారని.. వైరస్ రూపంలో రోజు రోజుకు శరీరాన్ని తినేస్తూ బలహీనంగా తయారు చేసేదని.. మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడడంతోనే మృతి చెందినట్లు పేర్కొన్నాడు. ఇక 2004లో ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో అడుగుపెట్టిన జైసిన్ డబ్ల్యూడబ్ల్యూఈ, ఆల్ ఎలైట్ రెజ్లింగ్(AEW)లో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2010లో మాగ్నమ్ ప్రో రెజ్లింగ్‌కు ప్రమోటర్‌గా పనిచేశాడు. ఇక జైసన్ చివరిసారి గతేడాది నవంబర్‌లో ఆల్ ఎలైట్ రెజ్లింగ్‌లో పవర్‌హౌస్ హాబ్స్‌తో ఆడాడు. -
కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్న రెజ్లింగ్ స్టార్
డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) అంటేనే ఫేక్ అని పిలుస్తారు చాలా మంది అభిమానులు. ఈ గేమ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్ అంతా ఫేక్ గేమ్ ఆడినప్పటికి వారిపై ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికి పోదు. రోమన్ రెయిన్స్(Roman Reigns), బ్రాన్ స్ట్రోమన్(Braun Strowman), బాబీ లాష్లే(Bobby Lashley), అండర్ టేకర్(Undertaker), త్రిబుల్ హెచ్(HHH), ది రాక్(Rock), షాన్ మైకెల్స్(Shawn Michales).. ఇలా చెప్పుకుంటే పోతే లెక్కలేనంత మంది సూపర్‌స్టార్స్ ఉంటారు. వీరికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇక రే మిస్టీరియో(Rey Misterio) కూడా ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్. ఇతనికి ముద్దు పేరు 619. కాగా రే-మిస్టిరియో కొడుకు డొమినిక్ మిస్టీరియో కూడా డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగుపెట్టాడు. ఇదంతా పక్కనబెడితే.. కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్నాడు రే మిస్టీరియో. విషయంలోకి వెళితే.. డొమినిక్ మిస్టీరియో థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా తన పేరెంట్స్ ఇంటికి వచ్చాడు. అయితే తన వెంట RAW-ట్యాగ్ టీమ్ ఛాంపియన్... కో స్టార్ రిప్లేను తీసుకొచ్చాడు. తన పేరెంట్స్ ఇంటికి వెళ్లి డోర్ కొట్టగా.. డొమినిక్ తల్లి యాంజీ తలుపు తీసింది. రిప్లేను పరిచయం చేస్తూ ఈమె నాకు మామీ అని చెప్పాడు. అయితే ఏంజీ మాత్రం..'' ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో.. నీ తండ్రి ఇంట్లోనే ఉన్నాడు..'' అని చెప్పింది. కానీ ఇది వినకుండా డొమినిక్ మరోసారి తలుపు తట్టాడు. ఈసారి రే మిస్టిరియో తలుపు తీశాడు.'' వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. అనవసరంగా గొడవ చేయొద్దు'' అని డోర్ మూశాడు. దీంతో రిప్లే ఒక్క తన్ను తన్ని డోర్‌ను నెట్టింది. దీంతో రే మిస్టీరియో కింద పడిపోయాడు. ఆ తర్వాత డొమినిక్ తండ్రిని ఇష్టం వచ్చినట్లుగా చితకబాదాడు. ఆ తర్వాత బ్రూమ్ స్టిక్‌తో కొడుతూ రే మిస్టీరియో కాలును గాయపరిచాడు. ప్రేమతో ఇంటికి వస్తే అవమానిస్తావా అంటూ మిస్టిరియోను కొడుతూనే తన పేరేంట్స్‌తో దిగిన ఫోటోను రిప్లేకు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇదంతా డబ్ల్యూడబ్ల్యూఈ జడ్జిమెంట్ డే కోసం ముందే ప్లాన్ చేసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ అధికారిక ట్విటర్ ఈ వీడియోనూ షేర్ చేస్తూ పేర్కొంది. మరి కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్న రే మిస్టీరియో జడ్జిమెంట్ డే రోజున ప్రతీకారం తీర్చుకుంటాడా లేదా కామెంట్ చేయండి అని పేర్కొనడం కొసమెరుపు. OH NO! 😲😲😲@RheaRipley_WWE & @DomMysterio35 crashed Thanksgiving at the Mysterio household and brutally attacked @reymysterio! pic.twitter.com/Rwrb39QPGh — WWE (@WWE) November 24, 2022 చదవండి: తప్పు చేశారు.. ప్రపంచకప్‌కు ఎంపిక చేసి ఉంటే FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి -
'ధోని రికార్డులను రోమన్ రెయిన్స్ బద్దలు కొట్టగలడు'
డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) చూసేవారికి ''పాల్ హీమన్''(Paul Heyman) అనే వ్యక్తి పరిచయం అక్కర్లేని పేరు. బ్రాక్ లెస్నర్(Brock Lesnar), రోమన్ రెయిన్స్(Roman Reigns)కు మేనేజర్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ యునివర్సల్ చాంపియన్ రోమన్ రెయిన్స్కు అడ్వైజర్ అండ్ కౌన్సిల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న పాల్ హీమన్ .. టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో ఎంఎస్ ధోని నెలకొల్పిన రికార్డులు, నెంబర్స్‌ను మా రోమన్ రెయిన్స్ బద్దలు కొడతాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. అదేంటి అసలు ధోనికి, రోమన్ రెయిన్స్కు సంబంధం ఏంటి. వీరిద్దరు వేర్వేరు విభాగాలకు చెందిన వాళ్లు కదా. ధోని రికార్డులను రోమన్ రెయిన్స్ బద్దలు కొట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. కేవలం సరదా కోసమే పాల్ హీమన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే.. సెప్టెంబర్ 12న పాల్ హీమన్ 57వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పాల్ హీమన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీనికి బదులుగా పాల్ హీమన్ థ్యాంక్స్ చెప్పి 2019లో వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఎంఎస్ ధోనిని ఉద్దేశించి ఐసీసీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఎంఎస్ ధోనిని ఐసీసీ.. ''ఈట్.. స్లీప్.. ఫినిష్ గేమ్స్.. రిపీట్ @ MS Dhoni'' అంటూ పేర్కొంది. వాస్తవానికి ఐసీసీ ఉపయోగించిన పదాలు పాల్ హీమన్వే. 2019లో బ్రాక్ లెస్నర్కు మేనేజర్‌గా వ్యవహరించిన పాల్ హీమన్.. లెస్నర్ను ఉద్దేశించి ''ఈట్.. స్లీప్.. కాంక్వర్.. రిపీట్'' అంటూ డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లోకి అడుగుపెట్టిన ప్రతీసారి చెప్పేవాడు. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తాజాగా ఐసీసీ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన పాల్ హీమన్..''మా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రోమన్ రెయిన్స్ క్రికెట్లో అడుగుపెడితే ధోని రికార్డులను, నెంబర్స్‌ను బద్దలు కొట్టడం గ్యారంటీ. ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం'' అంటూ పేర్కొన్నాడు. My most (in)sincere compliments to @cricketworldcup for promoting the amazing @msdhoni by paraphrasing my mantra for @WWE #UniversalChampion @BrockLesnar #EatSleepConquerRepeat. Our royalties may be paid in cash, check, stock or cryptocurrency. https://t.co/sGtIALzso1 — Paul Heyman (@HeymanHustle) January 18, 2019 చదవండి: టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా.. -
డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్
మార్క్ క్యాలవే అనే పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. అదే అండర్ టేకర్ అంటే తెలియని రెజ్లింగ్ అభిమాని ఉండరు. ముఖ్యంగా డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు ద డెడ్ మ్యాన్ (అండర్ టేకర్) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా రెజ్లింగ్ అభిమానులను తన ప్రదర్శనతో అలరిస్తున్న ఈ వెటరన్ రెజ్లర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. డబ్ల్యూడబ్ల్యూఈ విడుదలచేసిన అండర్ టేకర్ బయోపిక్ ‘ద లాస్ట్ రైడ్’ డ్యాక్యూమెంటరీ చివరి ఎపిసోడ్లో అండర్ టేకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘ఇక సాధించాల్సింది ఏమీ లేదు. మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాలని అనుకోవడం లేదు. ఇది చాలా మంచి సమయం. ఇలాంటిది మళ్లీ రాదు. నా కెరీర్‌కు ముగింపు పలకడానికి ఏదైనా మంచి సమయం ఉందంటే.. అది ఇదే’ అని ఆ డ్యాక్యుమెంటరీలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ట్విటర్లో కూడా తాజాగా అధికారికంగా వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చాంపియన్ షిప్ బెల్ట్ పట్టుకొని ఉన్న రోహిత్ శర్మ ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ థ్యాంక్యూ అండర్ టేకర్ అని ట్వీట్ చేసింది. 52 ఏళ్ల అండర్ టేకర్ 1987లో వరల్డ్ క్లాస్ ఛాంపియన్షిప్ రెజ్లింగ్‌తో కెరీర్‌ను ఆరంభించారు. 1990ల్లో టెడ్ డిబియాస్ మిలియన్ డాలర్ టీంలో చివరి సభ్యుడిగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఆయన అడుగుపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు క్రేజ్ ఉన్నప్పటికీ జాన్ సీనా, ద రాక్ మాదిరి సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. అండర్టేకర్ తన చివరి మ్యాచ్‌లో ఏజే స్టైల్స్‌తో తలపడ్డారు. కాగా, తనతో జరిగిన మ్యాచ్చే అండర్టేకర్కు చివరిదైతే తనకెంతో గర్వంగా ఉంటుందని ఏజే స్టైల్స్ పేర్కొన్నారు. #ThankYou pic.twitter.com/6D1th4wZlA — Undertaker (@undertaker) June 23, 2020 You can never appreciate how long the road was until you’ve driven to the end. #TheLastRide @WWENetwork pic.twitter.com/JW3roilt9a — Undertaker (@undertaker) June 21, 2020 -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ రెజ్లర్
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్కు(డబ్ల్యూడబ్ల్యూఈ) ప్రఖ్యాత రెజ్లర్ ది అండర్టేకర్ రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు 30 ఏళ్లుగా రెజ్లింగ్‌లో ఫీల్డ్‌లో ఉన్న అండర్టేకర్.. ది లాస్ట్ రైడ్ డాక్యూ సిరీస్ చివరి ఎపిసోడ్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నాకు మరోసారి రెజ్లింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టాలనే కోరిక లేదు. నేను గెలవడానికి ఏమి లేదు. నేను సాధించేది కూడా ఏమి లేదు. ప్రస్తుతం ఆట మారింది. ఇది కొత్తవారు రావడానికి సరైన సమయం. ఈ డాక్యూమెంటరీ నాకు చాలా సాయం చేసిందని భావిస్తున్నాను. ఇది ఒక రకంగా నా కళ్లు తెరిపించింద’ని పేర్కొన్నారు.(చదవండి : ‘ద్రవిడ్ కెప్టెన్సీకి క్రెడిట్ దక్కలేదు’) ఇదే విషయాన్ని అండర్టేకర్ ట్విటర్ ద్వారా కూడా వెల్లడించారు. రెజ్లింగ్‌లో తన ప్రయాణం ముగిసిందని పేర్కొన్నారు. ఇక మిగిలిన జీవితంలో తన శ్రమకు దక్కిన ఫలాలను అస్వాదించనున్నట్టు తెలిపారు. మరోవైపు అండర్టేకర్ రిటైర్మెంట్పై డబ్ల్యూడబ్ల్యూఈ నెట్వర్క్ సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు చేసింది. అండర్టేకర్కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. కాగా, అండర్టేకర్ తన చివరి మ్యాచ్‌లో ఏజే స్టైల్స్‌తో తలపడ్డారు. వాస్తవానికి అండర్టేకర్ అసలు పేరు మార్క్ కాలవే.(చదవండి : దిమిత్రోవ్‌కు కరోనా.. జొకోవిచ్‌లో ఆందోళన) థాంక్యూ టేకర్.. అండర్టేకర్ రిటైర్మెంట్పై ముంబై ఇండియన్స్ జట్టు స్పందించింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ హేవీ వెయిట్ చాంపియన్‌షిప్ బెల్ట్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 30 అద్భుతమైన సంవత్సరాలు పేర్కొన్న ముంబై ఇండియన్స్.. థాంక్యూ టేకర్ అని పేర్కొంది. -
చరిత్ర సృష్టించిన కవిత.. వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో భారతనారి సంచలనం సృష్టించారు. సల్వార్ కమీజ్ ధరించి మరీ ఆమె చేసిన పోరాటం అభిమానులను కట్టిపడేసింది. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె పోరాటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గతంలో గ్రేట్ ఖాలీ సంచలనం సృష్టించాడు. హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలిచి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు హరియాణాకు చెందిన రెజ్లర్ కవితా దేవీ అదే పనిచేశారు. ఈ రింగ్‌లో అడుగుపెట్టిన భారత తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన మే యంగ్ క్లాసిక్ టోర్నీలో న్యూజిలాండ్ రెజ్లర్ డకోటా కైతో ఆమె తలపడి తన ప్రతాపం చూపించారు. ప్రత్యర్థిని తన కండబలంతో పలుమార్లు పైకి ఎగరేసి కింద పడేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కవిత ఓడినా తన పోరాటంతో మెప్పించారు. ఇక్కడ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది ఆమె వస్త్రధారణ. కాషాయ రంగు సల్వార్ కమీజ్ ధరించిన కవిత నడుం చుట్టూ దుపట్టా కట్టుకొని కుస్తీ పట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ వీడియోను 35 లక్షల మంది వీక్షించారు. వెయిట్ లిఫ్టర్ అయిన కవితా దేవి 2016 ఏసియా గేమ్స్‌లో 75 కేజీల విభాగంలో స్వర్ణాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.