పొట్టి స్కర్ట్‌, హై హీల్స్‌తో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌.. 'మాకేంటీ కర్మ' | WWE Star John Cena Spotted Wearing Skirt-High Heels Movie Promotion | Sakshi
Sakshi News home page

John Cena: పొట్టి స్కర్ట్‌, హై హీల్స్‌తో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌.. 'మాకేంటీ కర్మ'

Published Sat, Feb 11 2023 9:56 PM | Last Updated on Sat, Feb 11 2023 9:57 PM

WWE Star John Cena Spotted Wearing Skirt-High Heels Movie Promotion - Sakshi

జాన్‌ సీనా(John-Cena).. డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు. తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ సూపర్‌స్టార్‌. 13సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌ అయిన దిగ్గజం.. మరో మూడుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్‌ హెవీవెయిట్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. సినిమాలతో బిజీ అయిన జాన్‌ సీనా కొంతకాలంగా రెజ్లింగ్‌కు దూరమయ్యాడు. తాజాగా వ్రెసల్‌మేనియా ద్వారా డబ్ల్యూడబ్ల్యూఈలో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. 20 ఏళ్ల రెజ్లింగ్‌ కెరీర్‌లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న జాన్‌ సీనా ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు.

ఇక జాన్‌ సీనా తన రెజ్లింగ్‌ కెరీర్‌లో చాలావరకు బ్యాగీ షార్ట్స్‌, పెద్ద చైన్‌లు, క్యాప్‌లతోనే కనిపించాడు. అయితే, తాజాగా అతను తొడల వరకే ఉండే పొట్టి లంగా, హై హీల్స్‌ చెప్పులతో దర్శనమిచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసిన ఆయన అభిమానులు ఎలా స్పందించాలో తెలియక.. '' మా సూపర్‌స్టార్‌కు ఇదేం కర్మరా బాబు'' అనుకుంటూ తల పట్టుకున్నారు.

అయితే జాన్‌ సీనా మహిళలా పొట్టి లంగా, ఎత్తు మడమల చెప్పులు, మోకాళ్లదాకా సాక్షులు ఎందుకు ధరించాడని అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆయన ప్రస్తుతం ''రికీ స్టానికి'' అనే ఓ హాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నారు. ఆ కామెడీ సినిమాలో తను పోషించబోయే పాత్ర కోసం జాన్‌ సినా మూవీ సెట్‌లో అలా విచిత్ర వేషధారణలో కనిపించాల్సి వచ్చింది. అదీ అసలు విషయం.

చదవండి: హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా-ఈ రేసింగ్‌.. విజేత ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement