‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్‌!’ కట్‌ చేస్తే..! | Thief enters house in Lucknow, falls asleep in AC cops wake him up | Sakshi
Sakshi News home page

‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్‌!’ కట్‌ చేస్తే..!

Published Mon, Jun 3 2024 1:51 PM | Last Updated on Mon, Jun 3 2024 1:55 PM

Thief enters house in Lucknow, falls asleep in AC cops wake him up

దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి.  ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా  ఉండలేని పరిస్థితి.  ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్‌గా మారింది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి  చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు,  ఏసీ చూడగానే మైమరిచిపోయాడు.  ఏసీ ఆన్‌ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని  హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. 

తెల్లవారేక  ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో  వారణాసిలో విధులు నిర్వహిస్తున్న  సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది.  

సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు.  చేతిలో  మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్‌గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement