Dominik Attacks On His Own Father WWE Star Rey Mysterio During Thanksgiving Dinner - Sakshi
Sakshi News home page

Rey Mysterio: కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్న రెజ్లింగ్‌ స్టార్‌

Published Fri, Nov 25 2022 7:08 PM | Last Updated on Fri, Nov 25 2022 8:09 PM

Dominik Attacks Own Father WWE Star Rey Mysterio Thanksgiving Dinner - Sakshi

డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) అంటేనే ఫేక్‌ అని పిలుస్తారు చాలా మంది అభిమానులు. ఈ గేమ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్‌ అంతా ఫేక్‌ గేమ్‌ ఆడినప్పటికి వారిపై ఉన్న క్రేజ్‌ మాత్రం ఎప్పటికి పోదు. రోమన్‌ రెయిన్స్‌(Roman Reigns), బ్రాన్‌ స్ట్రోమన్‌(Braun Strowman), బాబీ లాష్లే(Bobby Lashley), అండర్‌ టేకర్‌(Undertaker), త్రిబుల్‌ హెచ్‌(HHH), ది రాక్‌(Rock), షాన్‌ మైకెల్స్‌(Shawn Michales).. ఇలా చెప్పుకుంటే పోతే లెక్కలేనంత మంది సూపర్‌స్టార్స్‌ ఉంటారు. వీరికి బయట ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది.

ఇక రే మిస్టీరియో(Rey Misterio) కూడా ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌. ఇతనికి ముద్దు పేరు 619. కాగా రే-మిస్టిరియో కొడుకు డొమినిక్‌ మిస్టీరియో కూడా డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగుపెట్టాడు. ఇదంతా పక్కనబెడితే.. కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్నాడు రే మిస్టీరియో. విషయంలోకి వెళితే.. డొమినిక్‌ మిస్టీరియో థ్యాంక్స్‌ గివింగ్‌ డే సందర్భంగా తన పేరెంట్స్‌ ఇంటికి వచ్చాడు. అయితే తన వెంట RAW-ట్యాగ్‌ టీమ్‌ ఛాంపియన్‌... కో స్టార్‌ రిప్లేను తీసుకొచ్చాడు.

తన పేరెంట్స్‌ ఇంటికి వెళ్లి డోర్‌ కొట్టగా.. డొమినిక్‌ తల్లి యాంజీ తలుపు తీసింది. రిప్లేను పరిచయం చేస్తూ ఈమె నాకు మామీ అని చెప్పాడు. అయితే ఏంజీ మాత్రం..''​ ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో.. నీ తం‍డ్రి ఇంట్లోనే ఉన్నాడు..'' అని చెప్పింది. కానీ ఇది వినకుండా డొమినిక్‌ మరోసారి తలుపు తట్టాడు. ఈసారి రే మిస్టిరియో తలుపు తీశాడు.'' వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. అనవసరంగా గొడవ చేయొద్దు'' అని డోర్‌ మూశాడు.

దీంతో రిప్లే ఒక్క తన్ను తన్ని డోర్‌ను నెట్టింది. దీంతో రే మిస్టీరియో కింద పడిపోయాడు. ఆ తర్వాత డొమినిక్‌ తండ్రిని ఇష్టం వచ్చినట్లుగా చితకబాదాడు. ఆ తర్వాత బ్రూమ్‌ స్టిక్‌తో కొడుతూ రే మిస్టీరియో కాలును గాయపరిచాడు. ప్రేమతో ఇంటికి వస్తే అవమానిస్తావా అంటూ మిస్టిరియోను కొడుతూనే తన పేరేంట్స్‌తో దిగిన ఫోటోను రిప్లేకు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఇదంతా డబ్ల్యూడబ్ల్యూఈ జడ్జిమెంట్‌ డే కోసం ముందే ప్లాన్‌ చేసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ అధికారిక ట్విటర్‌ ఈ వీడియోనూ షేర్‌ చేస్తూ పేర్కొంది. మరి కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్న రే మిస్టీరియో జడ్జిమెంట్‌ డే రోజున ప్రతీకారం తీర్చుకుంటాడా లేదా కామెంట్‌ చేయండి అని పేర్కొనడం కొసమెరుపు.

చదవండి: తప్పు చేశారు.. ప్రపంచకప్‌కు ఎంపిక చేసి ఉంటే

FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement