WWE Stars
-
క్రికెట్ ఫీవర్.. వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మద్దతుగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్
వన్డే వరల్డ్‌కప్ ఫీవర్ డబ్ల్యూడబ్ల్యూఈ (World Wrestling Entertainment)ని తాకింది. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ఒకరు టీమిండియాకు మద్దతుగా నిలిచారు. తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్లో స్టార్ రెజ్లర్ డ్రూ మెక్ఇన్టైర్ (Drew McIntyr) టీమిండియా జెర్సీ ధరించి రింగ్‌లోకి దిగాడు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. భారత క్రికెట్ అభిమానులు తమ జట్టు జెర్సీని ధరించిన డ్రూ మెక్ఇన్టైర్ను చూసి మురిసిపోతున్నారు. అప్పటివరకు జాన్ సీనా, ద రాక్ లాంటి పాశ్యాత్య దేశ రెజ్లర్లకు అభిమానులుగా ఉన్న భారతీయులు డ్రూ మెక్ఇన్టైర్ తాజా చర్య తర్వాత అతని అభిమానులుగా మారిపోయారు. డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక్కసారిగా మెక్ఇన్టైర్కు క్రేజ్ పెరిగిపోయింది. సోషల్‌మీడియాలో అతన్ని ఫాలో అయ్యే భారతీయుల సంఖ్య ఒక్కసారిగా రెండింతలయ్యింది. డ్రూ మెక్ఇన్టైర్ ఇటీవల భారత్‌లో పర్యటించినప్పడు కూడా ఇక్కడి వారిని ఆకట్టుకున్నాడు. WWE Superstar Drew McIntyre is supporting India in the 2023 World Cup....!!! 🇮🇳 pic.twitter.com/AwC1OAQJOn — Mufaddal Vohra (@mufaddal_vohra) September 28, 2023 కొద్ది రోజుల కిందట ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన మెక్ఇన్టైర్ భారతీయులతో మమేకమైపోయాడు. స్టార్ ఇమేజ్ కలిగిన మెక్ఇన్టైర్ హైదరాబాద్ నగర వీధుల్లో సాధారణ వ్యక్తిలా తిరుగుతూ భారతీయులకు, ముఖ్యంగా హైదరాబాదీలకు బాగా చేరువయ్యాడు. తాజా చర్యతో (వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మద్దతుగా భారత జెర్సీ ధరించడం) అతను భారతీయులకు మరింత దగ్గరయ్యాడు. 38 ఏళ్ల మెక్ఇన్టైర్ స్కాట్లాండ్కు చెందిన ప్రొఫెషనల్ రెజ్లర్ అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్‌కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. -
భారత్‌లో నాకు ప్రత్యేక అభిమానులున్నారు : 'సూపర్‌స్టార్ జాన్ సినా'
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిష్టను చాటుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్‌నకు వేదికగా నిలిచింది. సమరాన్ని తలపించేలా శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’ పోరు జరిగింది. దేశంలో రెండోసారి, నగరంలో తొలిసారిగా పోటీలు జరగడంతో సందడి నెలకొంది. ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’లో పదమూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ‘జాన్ సినా’ రావడంతో అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. జాన్ సినాతో పాటు సేథ్ ‘ఫ్రీకిన్’ రోలిన్స్, జిందర్ మహల్, నటల్య, ‘ది రింగ్ జనరల్’ గుంథర్, డ్రూ మెక్‌ఇంటైర్, కెవిన్ ఓవెన్స్, సమీ జైన్ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్స్టార్లు తలపడేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో వచ్చిన వీరికి ఎయిర్‌పోర్టులో అభిమానులు ఘనస్వాగతం పలికారు. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌కు హాజరైన జాన్ సినాను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్, ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ రాజేష్ కౌల్ ఆహ్వానించి అభినందనలు తెలిపారు. ఇటీవల డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ కెవిన్ ఓవెన్స్, సామి జైన్‌లతో సీక్రెట్‌గా ఓ ప్రాజెక్ట్ చిత్రీకరణలో కనిపించి అలరించిన దక్షిణాది హీరో కార్తీ శుక్రవారం జాన్ సినాను ప్రత్యేకంగా కలిసి ఫొటోలు దిగారు. గొప్ప అనుభూతి.. ► ఈ సందర్భంగా జాన్ సినా మాట్లాడుతూ.. భారత్‌లో తనకు ప్రత్యేక అభిమానులున్నారని, ఇన్నేళ్ల తర్వాత భారత్ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతిగా నిలిచిపోతుందన్నారు. ► పోటీల్లో పాల్గొంటున్న భారతీయ ఫైటర్లు వీర్ మహాన్, సంగా, జిందర్ మహల్లు హైదరాబాద్ నగరాన్ని మరోసారి ఆస్వాదించామన్నారు. ప్రత్యేకంగా చార్మినార్‌ను సందర్శించామని, ఇక్కడి ఫేమస్ బిర్యానీ తిన్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ► స్పెక్టాకిల్‌లో పాల్గొన్న లేడీ ఫైటర్ నటల్య ‘భారతీయ అభిమానుల ప్రేమలో తడవటం గొప్ప అనుభూతి అని’ అభివర్ణించింది. ఇక్కడి మూలాల్లోనే పోటీతత్వం ఇమిడి ఉందని కితాబిచ్చింది. -
HYD: నేడు డబ్ల్యూడబ్ల్యూఈ పోరు
హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మక వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోరుకు రంగం సిద్ధమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగే ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. 16 సార్లు ప్రపంచ చాంపియన్, రెజ్లింగ్ ఆల్‌టైమ్ గ్రేట్ జాన్ సినా ఇక్కడ బరిలోకి దిగనుండటమే అందుకు కారణం. అతని ఫైట్ చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఎగబడటంతో చాలా ముందుగానే ‘బుక్ మై షో’లో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. జాన్ సినా భారత్‌లో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. 2017లో భారత్‌లో చివరిసారిగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరగ్గా.. ఆరేళ్ల తర్వాత మన దేశంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా రెజ్లింగ్ ఫ్యాన్స్ ఈ ఫైట్‌ను తిలకించేందుకు వస్తున్నారు. ‘సూపర్ స్టార్ స్పెక్టకిల్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫైట్‌లో జాన్ సినాతో పాటు పలువురు ప్రముఖ రెజ్లర్లు పాల్గొంటున్నారు. ఫిన్ బాలర్, రియా రిప్లీ, సేట్ రోలిన్స్ ఈ జాబితాలో ఉన్నారు. టీమ్ ఈవెంట్లో ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ రోలిన్స్‌తో కలిసి జాన్ సినా.. గియోవానీ విన్సీ, లుడ్విగ్ కై సర్ద్ జోడీతో తలపడతారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ రియా రిప్లీ ప్రధాన ఆకర్షణ కానుంది. రాత్రి 7.30నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైట్‌ను ‘సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్’లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సూపర్ స్టార్ మృతి
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్ (36) మృతి చెందాడు. గతకొంత కాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యాట్.. గురువారం రాత్రి గుండె పోటుతో మరణించాడు.ఈ విషయాన్నిడబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ట్రిపుల్ హెచ్ అధికారికంగా దృవీకరించాడు. కాగా బ్రే వ్యాట్ అసలు పేరు విండామ్ రొటుండా. "డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆప్ ఫేమర్ మైక్ రోటుండా నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. మా డబ్ల్యూడబ్ల్యూ కుటుంబ సభ్యుడు విండామ్ రొటుండా(బ్రాడ్ వ్యాట్) మరణించారనే విషాద వార్తను మాకు తెలియజేశాడు. ఈ వార్త మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. వ్యాట్ కుటంబానికి మా ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నాము. ఇటువంటి విషాద సమయంలో ప్రతీ ఒక్కరూ వారి కుటంబానికి అండగా ఉండాలని, వారికి తగినంత ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ట్రిపుల్ హెచ్ ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. బ్రాడ్ మరణవార్తను డబ్ల్యూడబ్ల్యూఈ కూడా దృవీకరించింది. కాగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గత కొంతకాలంగా డబ్ల్యూడబ్ల్యూఈకు దూరంగా ఉన్నాడు. అతడు చివరగా ఈ ఏడాది జనవరిలో జరిగిన రాయల్ రంబుల్ రెజ్లింగ్ ఈవెంట్లో కన్పించాడు. 2009లో మొదలైన వ్యాట్ కుస్తీ ప్రయాణం.. 2023తో శాశ్వతంగా ముగిసింది. వ్యాట్ తన కెరీర్లో ఒక డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ షిప్, రెండుసార్లు యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. Just received a call from WWE Hall of Famer Mike Rotunda who informed us of the tragic news that our WWE family member for life Windham Rotunda - also known as Bray Wyatt - unexpectedly passed earlier today. Our thoughts are with his family and we ask that everyone respect their… — Triple H (@TripleH) August 24, 2023 -
69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా..
Meet Hulk Hogan's fiancé!: డబ్ల్యుడబ్ల్యుఈ లెజెండ్ హల్క్ హోగన్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. 69 ఏళ్ల వయసులో తన చిరకాల ప్రేయసి స్కై డైలీని వివాహమాడనున్నాడు. అంతకంటే ముందు తామిద్దరం ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు హల్క్ హోగన్ వెల్లడించాడు. కాగా 45 ఏళ్ల స్కై డైలీ అకౌంటెంట్‌గా పనిచేస్తూనే.. యోగా ఇన్‌స్ట్రక్టర్‌గానూ బిజీగా ఉంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా అమెరికాలోని జార్జియాలో సాధారణ కుటుంబంలో జన్మించిన టెర్రీ జీనీ బొలియా డబ్ల్యుడబ్ల్యుఈ స్టార్‌గా ఎదిగాడు. తన రింగ్నేమ్ హల్క్ హోగన్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ముచ్చటగా మూడోసారి హల్క్ హోగన్ 1983లో లిండా క్లారిడ్జ్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో అభిప్రాయభేదాలు రావడంతో 2009లో విడాకులిచ్చాడు. ఆ మరుసటి ఏడాదే జెన్నిఫర్ మెక్డేనియల్తో వివాహ బంధంలో అడుగుపెట్టాడు. పదకొండేళ్లలోనే వీరి బంధం కూడా ముగిసిపోయింది. 2021లో జెన్నిఫర్‌కి విడాకులిచ్చిన హల్క్ హోగన్ గతేడాది నుంచి స్కై డైలీతో రిలేషన్ కొనసాగిస్తున్నాడు. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అతడు తాజాగా.. తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపాడు. ఆమె పిల్లలతోనూ ప్రేమలో పడ్డాను స్కై డైలీ పిల్లలతో కూడా తాను ప్రేమలో పడిపోయానని, వారిని తండ్రిలా చూసుకుంటానని పేర్కొన్నాడు. కాగా గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హల్క్ హోగన్‌కు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిద్దరు నటులే! ఇక ప్రొఫెషనల్ రెజ్లర్‌గా రిటైర్ అయిన హల్క్ హోగన్ సైతం నటుడిగా కొనసాగుతున్నాడు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అతడికి ఇన్‌స్టాలో దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో స్కై డైలీతో దిగిన ఫొటోలు షేర్ చేయగా.. కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేశారు. నా జీవితం.. నా ఇష్టం ఇందుకు బదులిచ్చిన అతడు.. ‘‘నేను చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాను. నా ఎంగేజ్మెంట్ గురించి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. నా స్కై బేబీ.. నా జీవితం నా ఇష్టం’’ అని బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో అవును.. నిజమే కదా అంటూ అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. ఏదేమైనా హల్క్- స్కై ఎంగేజ్మెంట్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఆల్‌టైమ్ డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన హల్క్ హోగన్ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. చదవండి: 'హర్మన్‌ప్రీత్ ప్రవర్తన మరీ ఓవర్‌గా అనిపించింది' -
ఆమె పేరిట ఒకటి, రెండు కాదు!..ఏకంగా ఆరు ప్రపంచ రికార్డులు
ప్రముఖ రెజ్లర్ పేరిటి ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు ప్రపంచ రికార్డుల ఉన్నాయి. 2007 నుంచి రెజ్లర్‌గా కెరియర్ ప్రారంభించిన ఆమె వరుస గిన్నిస్ రికార్డులతో తన సత్తా చాటుతోంది. ఆమె పేరే నటాల్య. ప్రోఫెషన్ రెజ్లర్ అయిన ఆమె ఇటీవలే మూడు గిన్నిస్ రికార్డులను సాధించి. అంతకు మునుపు మూడు గిన్నిస్ రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. దీంతో ఇప్పుడు ఆ సంఖ్య కాస్త ఆరుకి చేరుకుంది. మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్ రెజ్టింగ్ మ్యాచ్‌లు) మ్యాచ్‌లు 1,514 ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెజ్లర్‌గా ఓక గిన్నిస్ రికార్డును సైతం దక్కించుకుంది. వాటిలో మొత్తం 663 మ్యాచ్‌లను గెలుచుకుంది. దీంతో ఆమె కెరీర్లో అత్యధిక డబ్ల్యూడబ్ల్యూఈ విజయాలు సాధించిన మహిళగా మరో గిన్నిస్ రికార్డు కైవసం చేసుకునేలా చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..నేను ఒక వ్యక్తిపై గెలిచినట్లుగా కాకుండా నా ప్రతిభను సానబెట్టుకునేలా ఎఫెర్ట్ పెట్టడమే చేశానని, తన కుటుంబం తనకు నేర్పింది అదేనని చెబుతోంది. అదే తనకు ఈ రికార్డులను తెచ్చిపట్టిందని నటాల్య ఆనందంగా చెబుతోంది. ఆమె 2021లో తొలిసారి గిన్నిస్ రికార్డు టైటిల్‌ని గెలిచింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా రాకెట్ మాదిరిగా దూసుకుపోతూ వరుస విజయాలను నమోదు చేసింది. కాగా, నటాల్య తాను గెలుచుకున్న ఆరు గిన్నిస్ రికార్డు టైటిళ్లతో దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ..వీటన్నింటినీ తీసుకువెళ్లడానికి పెద్ద లగేజ్ కావలంటూ చమత్కరించింది. These kinds of stats paint the picture that I want for my legacy, long after I’m done. Each one of these records was attained while trying my hardest to build a division, not a person. That’s what my family has taught me. Wrestling is a singles sport you can’t do on your own. https://t.co/S9MYC4FDLC pic.twitter.com/LFFrRvvL85 — Nattie (@NatbyNature) July 2, 2023 (చదవండి: అచ్చం మనుషుల్లా..పక్షలు కూడా విడాకులు తీసుకుంటున్నాయట!) -
ఆ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్‌ది ఆత్మహత్యే
2022, అక్టోబర్ 5న టెక్సాస్‌లోని (అమెరికా) తన స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్ సారా లీ (30)కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని స్థానిక మెడికల్ అధికారులు తాజాగా వెల్లడించారు. సారా డెడ్ బాడీపై గాయాలు ఉండటంతో తొలుత పలు అనమానాలు వ్యక్తం చేసిన అధికారులు, తాజాగా విడుదల చేసిన అటాప్సీ రిపోర్ట్‌లో సారాది ముమ్మాటికీ ఆత్మహత్యేనని నిర్ధారించారు. చదవండి: ధోని క్రేజ్.. ఐపీఎల్ ఫాలో అవుతున్నాడా? బెక్సార్ కౌంటీ మెడికల్ ఆఫీసర్ నివేదిక ప్రకారం.. యాంఫటమైన్స్, డాక్సిలామైన్, ఆల్కహాల్ కలిపి సేవించడం వల్ల సారా మరణించిందని, ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని, సారా శరీరంపై ఉన్న గాయాలు ఆమె మరణానికి ముందు కింద పడటం వల్ల ఏర్పడ్డవేనని నిర్ధారించబడింది. దీంతో సారా మృతిపై గత కొద్ది రోజులుగా ఉన్న అనుమానాలకు తెరపడినట్లైంది. WWE is saddened to learn of the passing of Sara Lee. As a former "Tough Enough" winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7 — WWE (@WWE) October 7, 2022 అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సారాను ఎవరు ఏమీ చేయలేదు.. మరి అంత చిన్న వయసులో (30) ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందోనని డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సారా 2015 మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ (World Wrestling Entertainment) ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఆమె రెజ్లింగ్ ఛాంపియన్‌గానే కాకుండా అమెరికన్ టీవీ పర్సనాలిటీగా కూడా అందరికీ సుపరిచితం. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001, మెయిల్: roshnihelp@gmail.com -
కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్న రెజ్లింగ్ స్టార్
డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) అంటేనే ఫేక్ అని పిలుస్తారు చాలా మంది అభిమానులు. ఈ గేమ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్ అంతా ఫేక్ గేమ్ ఆడినప్పటికి వారిపై ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికి పోదు. రోమన్ రెయిన్స్(Roman Reigns), బ్రాన్ స్ట్రోమన్(Braun Strowman), బాబీ లాష్లే(Bobby Lashley), అండర్ టేకర్(Undertaker), త్రిబుల్ హెచ్(HHH), ది రాక్(Rock), షాన్ మైకెల్స్(Shawn Michales).. ఇలా చెప్పుకుంటే పోతే లెక్కలేనంత మంది సూపర్‌స్టార్స్ ఉంటారు. వీరికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇక రే మిస్టీరియో(Rey Misterio) కూడా ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్. ఇతనికి ముద్దు పేరు 619. కాగా రే-మిస్టిరియో కొడుకు డొమినిక్ మిస్టీరియో కూడా డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగుపెట్టాడు. ఇదంతా పక్కనబెడితే.. కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్నాడు రే మిస్టీరియో. విషయంలోకి వెళితే.. డొమినిక్ మిస్టీరియో థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా తన పేరెంట్స్ ఇంటికి వచ్చాడు. అయితే తన వెంట RAW-ట్యాగ్ టీమ్ ఛాంపియన్... కో స్టార్ రిప్లేను తీసుకొచ్చాడు. తన పేరెంట్స్ ఇంటికి వెళ్లి డోర్ కొట్టగా.. డొమినిక్ తల్లి యాంజీ తలుపు తీసింది. రిప్లేను పరిచయం చేస్తూ ఈమె నాకు మామీ అని చెప్పాడు. అయితే ఏంజీ మాత్రం..'' ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో.. నీ తండ్రి ఇంట్లోనే ఉన్నాడు..'' అని చెప్పింది. కానీ ఇది వినకుండా డొమినిక్ మరోసారి తలుపు తట్టాడు. ఈసారి రే మిస్టిరియో తలుపు తీశాడు.'' వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. అనవసరంగా గొడవ చేయొద్దు'' అని డోర్ మూశాడు. దీంతో రిప్లే ఒక్క తన్ను తన్ని డోర్‌ను నెట్టింది. దీంతో రే మిస్టీరియో కింద పడిపోయాడు. ఆ తర్వాత డొమినిక్ తండ్రిని ఇష్టం వచ్చినట్లుగా చితకబాదాడు. ఆ తర్వాత బ్రూమ్ స్టిక్‌తో కొడుతూ రే మిస్టీరియో కాలును గాయపరిచాడు. ప్రేమతో ఇంటికి వస్తే అవమానిస్తావా అంటూ మిస్టిరియోను కొడుతూనే తన పేరేంట్స్‌తో దిగిన ఫోటోను రిప్లేకు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇదంతా డబ్ల్యూడబ్ల్యూఈ జడ్జిమెంట్ డే కోసం ముందే ప్లాన్ చేసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ అధికారిక ట్విటర్ ఈ వీడియోనూ షేర్ చేస్తూ పేర్కొంది. మరి కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్న రే మిస్టీరియో జడ్జిమెంట్ డే రోజున ప్రతీకారం తీర్చుకుంటాడా లేదా కామెంట్ చేయండి అని పేర్కొనడం కొసమెరుపు. OH NO! 😲😲😲@RheaRipley_WWE & @DomMysterio35 crashed Thanksgiving at the Mysterio household and brutally attacked @reymysterio! pic.twitter.com/Rwrb39QPGh — WWE (@WWE) November 24, 2022 చదవండి: తప్పు చేశారు.. ప్రపంచకప్‌కు ఎంపిక చేసి ఉంటే FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి -
'ది గ్రేట్ ఖలీ' ఏందయ్యా ఇదీ.. టోల్గేట్ సిబ్బందితోనా..!
చండీగఢ్: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా మరోమారు వార్తల్లో నిలిచారు. పంజాబ్, లుధియానాలోని ఓ టోల్గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ కార్మికుడిపై ఖలీ చేయి చేసుకున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపించారు. టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఖలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఆ వీడియోలో టోల్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు.. లాధోవాల్ టోల్ ప్లాజా సిబ్బంది తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు దలిప్ సింగ్ రాణా. ఈ సంఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ నుంచి హరియాణాలోని కర్నాల్‌కు ఖలీ తన కారులో వెళ్తున్న క్రమంలో టోల్గేట్ వద్ద ఈ సంఘటన ఎదురైనట్లు చెప్పారు. ధ్రువీకరణ పత్రం అడిగిన తమ సిబ్బందిని ఎందుకు కొట్టారని ఖలీని టోల్ సిబ్బంది అడుగుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. 'మిమ్మల్ని ఐడీకార్డు చూపించాలని అడిగారు. ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది అడగగా.. మీరు నన్ను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు ఖలీ. దానికి 'మిమ్మల్ని మేము బ్లాక్మెయిల్ చేయటం లేదు.. అతడిని ఎందుకు కొట్టారు? మీ దగ్గర ఉంటే ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే.. తన వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేదని ఖలీ వారితో చెప్పారు. WWE wrestler #GreatKhali clashes with toll plaza staff at #Ludhiana#TheGreatKhali #ViralVideo #Punjab #Khali #ludhiana #WWE pic.twitter.com/XYJEhsdVtL — Vineet Sharma (@Vineetsharma906) July 12, 2022 ది గ్రేట్ ఖలీ వాహనం టోల్గేట్ దాటి వెళ్లకుండా ముందు బారికేడ్ పెట్టారు అక్కడి సిబ్బంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఖలీ దానిని తీసి పక్కన పడేశారు. టోల్ సిబ్బంది ఖలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరువురు తమ వాదనలు పోలీసులకు వినిపించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన క్రమంలో వివరణ ఇచ్చారు ఖలీ. 'నిన్న పంజాబ్‌లోని లాధోవాల్ టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది నా కారును అడ్డుకుని సెల్ఫీ కోసం నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను అందుకు అంగీకరించకపోవటం వల్ల జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని బూతులు మాట్లాడారు.' అని ఖలీ చెప్పారు. ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్ హైవే'.. దేశంలోనే తొలిసారి! -
‘డెడ్‌మ్యాన్’ రిటైర్డ్
మార్క్ విలియమ్ కాలవే.. అంటే ఎవరో తెలియకపోవచ్చు. కానీ అండర్ టేకర్ అంటే తెలియని వాళ్లు అరుదు. కొందరు ముద్దుగా డెడ్ మ్యాన్ అని కూడా పిలుచుకుంటారు. ముఖ్యంగా ‘90ల్లో పుట్టిన తరానికి, అందునా రెజ్లింగ్ ఇష్టంగా చూసేవారికి ఇది చాలా సుపరిచితమైన పేరు. అతనికి అతీత శక్తులుంటాయని, ఏడు జన్మలున్నాయని పిల్లల సర్కిల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కెరీర్లో బరిలోకి దిగిన మ్యాచుల్లో 70 శాతం విజయాలతో వల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యుడబ్ల్యుఈ) లోనే ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో ఉన్నాడు. చీకట్లో చర్చి గంట శబ్దంతో, నీలి మెరుపులతో, నిప్పురవ్వలతో రింగులోకి వచ్చే తీరుతోనే ప్రత్యర్థిని బెదరగొట్టి అక్కడే సగం గెలిచేస్తాడు టేకర్. బలమైన ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తిని పడిపోతే ఇక అతని పని ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా లేచి నిలబడతాడు. రెట్టించిన శక్తితో ప్రత్యర్థిపై విరుచుకుపడి మ్యాచ్ గెలుస్తాడు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పేశాడు ఈ లెజెండ్. ఆదివారం సర్వైవర్ సిరీస్‌లో తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఫేర్వెల్ సందర్భంగా డబ్ల్యుడబ్ల్యుఈ సీయీవో విన్సెంట్ మెక్‌మహోన్ రింగు మధ్యలోకి వచ్చి అండర్ టేకర్ రాకను ప్రకటించాడు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైన మెక్‌మహోన్ ‘‘30 ఏళ్లుగా అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్న ఒక కెరీర్ ముగిసిపోబోతుంది. ఏదీ శాశ్వతం కాదంటారు చాలామంది. కానీ నా వరకూ అది అబద్ధం. రెజ్లింగ్‌పై టేకర్ వేసిన ముద్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచుంటుంది. ఈ ఆట ముఖచిత్రాన్నే మార్చివేసిన పోరాట యోధుడు అండర్ టేకర్’’ అన్నారు. ఆ వెంటనే తనకు మాత్రమే ప్రత్యేకమైన స్టైల్లో రింగులోకి ఎంటరైన టేకర్ అభిమానుల కేరింతల మధ్య మైకందుకుని ‘‘అండర్ టేకర్‌కు విశ్రాంతినివ్వాల్సిన సమయమొచ్చింది’’ అన్నాడు. తన మాజీ మేనేజర్ బిల్ మూడీ హాలోగ్రామ్ ప్రదర్శించి మూడీపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అండర్ టేకర్ ఇమేజ్ను నిర్మించడంలో మూడీది కీలకపాత్ర. ‘‘అది ఇంకెక్కడా దొరకదు’’ ‘‘మనం ఏదైనా సాధించినప్పుడు కేరింతలు, ఒవేషన్ రూపంలో ప్రేక్షకుల నుంచి తిరిగొచ్చే శక్తి ఇంకెక్కడా దొరకదు. బహుశా ఇందుకే కొందరు (‘ది రాక్’ లాంటివారు) రిటైరైన తర్వాత కూడా రీ ఎంట్రీ ఇస్తుంటారు. నా వరకు రెజ్లింగ్ అనేది అత్యుత్తమ క్రీడ. ప్రేక్షకులు ప్రత్యక్షంగా సినిమా చూస్తున్న అనుభూతికి లోనవుతారిక్కడ. ఆటగాళ్లలో ఉండే ఎమోషన్ కూడా చాలా ఎక్కువే. అదే సమయంలో కొన్ని హద్దులు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. ఎంతో ఒత్తిడితో కూడుకున్న ఈ ఆటలో మా ప్రతిభకు తగినంత గుర్తింపు లభిస్తుందా? అని అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటాను. నిజంగా ఈ 30 ఏళ్లు చాలా వేగంగా గడిచిపోయాయి.’’ - అండర్ టేకర్ (డబ్ల్యుడబ్ల్యుఈ రూపొందించిన డాక్యుమెంటరీలో..) ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన సహచర రెజ్లర్లు.. ‘‘తన జీవితంలో 30 ఏళ్లు డబ్ల్యుడబ్ల్యుఈ కి అంకితం చేసిన ఓ అత్యుత్తమ ఆటగాడికి వీడ్కోలు చెప్పాల్సిన సమయమొచ్చింది. తోటి ఆటగాడిగా రింగులో నాతో కొన్ని క్షణాలు పంచుకున్నందుకు థాంక్యూ టేకర్!’’ - జాన్ సీనా ‘‘30 ఏళ్ల క్రితం ఈ రోజున మా అందరిలాగే అరంగేట్రం చేశాడతను. నా కెరీర్ ప్రారంభంలో ఓ సాయంత్రం డ్రెసింగ్ రూములోకొచ్చి నన్ను ప్రోత్సహించేలా మాట్లాడిన మాటలు నేనెప్పటికీ మర్చిపోలేను. నీతో కలిసి రింగ్ పంచుకోవడం ఒక గౌరవం.’’ - ది రాక్ ‘‘మనిద్దరం ప్రతీ ఫార్మట్‌లో తలపడ్డాం. కొన్ని ప్రత్యేకానుభూతుల్ని సృష్టించుకున్నాం. రింగులో ఉన్నప్పుడు నువ్వొచ్చేముందు వినిపించే ఆ బెల్ శబ్దం నన్ను భయపెట్టేది. అయినా చివరిసారిగా దాన్ని వినేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.’’ - షాన్ మైఖేల్స్ -
క్వారంటైన్లో ‘కోల్డ్ స్టోన్ సింగ్’: జాన్సెనా
రెజ్లింగ్ స్టార్ జాన్సెనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతోంది. రణ్వీర్ డ్రిడ్‌లుక్(చెట్టు వేళ్లలా తలపై జుట్టు ఇరుపైపులా వేలాడుతూ ఉండటం)తో ఉన్న ఫొటోను జాన్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి ప్రముఖ మాజీ రెజ్లర్ స్టార్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టీన్ పేరును క్వారంటైన్లో ‘కోల్డ్ స్టోన్ సింగ్’ అంటూ ఫొటోపై రాసి పోస్టు చేశాడు. ఇది చూసిన రణ్వీర్ హహ్హాహ్హా... అంటూ స్మైలీ ఎమోజీకి చేతులు కట్టుకుని ఉన్న ఎమోజీని జత చేసి కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by John Cena (@johncena) on May 29, 2020 at 5:28am PDT కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన మరోసారి పోడగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రణ్వీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ లాక్డౌన్ నా రూపం చూడండి అంటూ డ్రిడ్లుక్తో ఉన్న ఫొటోను ఇటీవల షేర్ చేసిన విషయ తెలిసిందే. కాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ టైటిల్‌ను జాన్సెనా 16 సార్లు గెలుచుకున్న అతడు రెజ్లింగ్మానియా 36 ఇంతవరకు రింగ్‌లో పోరాడలేదు. ఫైర్ప్లె ఫన్ హౌజ్ మ్యాచ్‌లో ది ఫైండ్ గా ప్రసిద్దీ చెందిన బ్రే వ్యాట్‌తో రింగ్‌లో తలపడి గెలిచాడు. -
సెహ్వాగ్ వారికి క్రికెట్ రుచి చూపించాడు
న్యూఢిల్లీ: ఒకప్పటి భారత్ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ స్టార్స్‌ని కలిశారు. కుస్తీ యోధులకు సరదాగా కాసేపు క్రికెట్‌ను చవి చూపించారు. తన ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ లను తీసుకుని సెహ్వాగ్ శుక్రవారం డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్ స్టార్ డాల్ఫ్ జిగ్లర్, డబ్ల్యుడబ్ల్యుఈ దివాస్ చాంపియన్ చార్లెట్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరూ వారికి క్రికెట్ పాఠాలు నేర్పారు. బౌలింగ్ చేయడం, క్యాచ్ పట్టడం, బ్యాటింగ్ లోని మెళకువలను వివరించారు. వీరంతా కలిసి ఓ చిన్న సైజ్ మ్యాచ్ కూడా ఆడారు. సెహ్వాగ్ తమకు మొదటిసారి క్రికెట్ ఆటను రుచి చూపించారని, ఇది మర్చిపోలేని అనుభూతి అని డాల్ఫ్, చార్లెట్ పేర్కొన్నారు. సెహ్వాగ్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడాన్ని తాను చాలా ఎంజాయ్ చేశానంటూ డాల్ఫ్ చెప్పారు. కాకపోతే సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తుండగా బాల్‌ను బౌండరీ దాటకుండా చూసేందుకు తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. సెహ్వాగ్ నిజంగా ఓ అద్భుతమైన క్రికెటర్ అంటూ చార్లెట్ కితాబునిచ్చారు. శుక్ర, శనివారాల్లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో జరుగనున్న 'వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ రోమన్' తోపాటు పలు విభాగాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈ అమెరికన్ రెజ్లింగ్ స్టార్లను వీరూ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా వీరూ కుమారులు ఆర్యవీర్, వేదాంత్‌లు తమ ఫేవరెట్ స్టార్లతో ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు.