డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సూపర్‌ స్టార్‌ మృతి | WWE Super Star Bray Wyatt Passes Away | Sakshi
Sakshi News home page

#Bray Wyatt: డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సూపర్‌ స్టార్‌ మృతి

Published Fri, Aug 25 2023 9:01 AM | Last Updated on Fri, Aug 25 2023 10:59 AM

WWE Super Star Bray Wyatt Passes Away - Sakshi

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్మెంట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌, మాజీ ఛాంపియన్‌ బ్రే వ్యాట్ (36)  మృతి చెందాడు. గతకొంత కాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యాట్‌.. గురువారం రాత్రి గుండె పోటుతో మరణించాడు.ఈ విషయాన్నిడబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ట్రిపుల్ హెచ్ అధికారికంగా దృవీకరించాడు. కాగా బ్రే వ్యాట్ అసలు పేరు విండామ్ రొటుండా. 

"డబ్ల్యూడబ్ల్యూఈ హాల్‌ ఆప్‌ ఫేమర్‌ మైక్ రోటుండా నుంచి ఇప్పుడే ఫోన్‌ వచ్చింది. మా డబ్ల్యూడబ్ల్యూ కుటుంబ సభ్యుడు విండామ్ రొటుండా(బ్రాడ్‌ వ్యాట్‌) మరణించారనే విషాద వార్తను మాకు తెలియజేశాడు. ఈ వార్త మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. వ్యాట్‌ కుటంబానికి మా ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నాము.

ఇటువంటి విషాద సమయంలో ప్రతీ ఒక్కరూ వారి కుటంబానికి అండగా ఉండాలని, వారికి తగినంత  ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ట్రిపుల్ హెచ్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు. బ్రాడ్‌ మరణవార్తను డబ్ల్యూడబ్ల్యూఈ కూడా దృవీకరించింది. కాగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గత కొంతకాలంగా డబ్ల్యూడబ్ల్యూఈకు దూరంగా ఉన్నాడు.

అతడు చివరగా ఈ ఏడాది జనవరిలో జరిగిన రాయల్ రంబుల్ రెజ్లింగ్‌ ఈవెంట్‌లో కన్పించాడు. 2009లో మొదలైన వ్యాట్‌ కుస్తీ ప్రయాణం.. 2023తో శాశ్వతంగా ముగిసింది. వ్యాట్‌ తన కెరీర్‌లో ఒక డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌ షిప్‌, రెండుసార్లు యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement