Who is Sky Daily? Meet Hulk Hogan's fiance! - Sakshi
Sakshi News home page

Hulk Hogan: రెండు పెళ్లిళ్లు పెటాకులు! 69 ఏళ్ల వయసులో మూడోసారి! ఎవరీ బ్యూటీ?

Published Wed, Jul 26 2023 3:01 PM | Last Updated on Wed, Jul 26 2023 3:14 PM

Hulk Hogan 69 Get Engaged Who Is Sky Daily Meet His Fiance - Sakshi

Meet Hulk Hogan's fiancé!: డబ్ల్యుడబ్ల్యుఈ లెజెండ్‌ హల్క్‌ హోగన్‌ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. 69 ఏళ్ల వయసులో తన చిరకాల ప్రేయసి స్కై డైలీని వివాహమాడనున్నాడు. అంతకంటే ముందు తామిద్దరం ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు హల్క్‌ హోగన్‌ వెల్లడించాడు. కాగా 45 ఏళ్ల స్కై డైలీ అకౌంటెంట్‌గా పనిచేస్తూనే.. యోగా ఇన్‌స్ట్రక్టర్‌గానూ బిజీగా ఉంది.

ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా అమెరికాలోని జార్జియాలో సాధారణ కుటుంబంలో జన్మించిన టెర్రీ జీనీ బొలియా డబ్ల్యుడబ్ల్యుఈ స్టార్‌గా ఎదిగాడు. తన రింగ్‌నేమ్‌ హల్క్‌ హోగన్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు.

ముచ్చటగా మూడోసారి
హల్క్‌ హోగన్‌ 1983లో లిండా క్లారిడ్జ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో అభిప్రాయభేదాలు రావడంతో 2009లో విడాకులిచ్చాడు. ఆ మరుసటి ఏడాదే జెన్నిఫర్‌ మెక్‌డేనియల్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టాడు.

పదకొండేళ్లలోనే వీరి బంధం కూడా ముగిసిపోయింది. 2021లో జెన్నిఫర్‌కి విడాకులిచ్చిన హల్క్‌ హోగన్‌ గతేడాది నుంచి స్కై డైలీతో రిలేషన్‌ కొనసాగిస్తున్నాడు. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అతడు తాజాగా.. తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపాడు.

ఆమె పిల్లలతోనూ ప్రేమలో పడ్డాను
స్కై డైలీ పిల్లలతో కూడా తాను ప్రేమలో పడిపోయానని, వారిని తండ్రిలా చూసుకుంటానని పేర్కొన్నాడు. కాగా గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హల్క్‌ హోగన్‌కు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిద్దరు నటులే! 

ఇక ప్రొఫెషనల్‌ రెజ్లర్‌గా రిటైర్‌ అయిన హల్క్‌ హోగన్‌ సైతం నటుడిగా కొనసాగుతున్నాడు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అతడికి ఇన్‌స్టాలో దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో స్కై డైలీతో దిగిన ఫొటోలు షేర్‌ చేయగా.. కొంతమంది నెటిజన్లు ట్రోల్‌ చేశారు. 

నా జీవితం.. నా ఇష్టం
ఇందుకు బదులిచ్చిన అతడు.. ‘‘నేను చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాను. నా ఎంగేజ్‌మెంట్‌ గురించి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. నా స్కై బేబీ.. నా జీవితం నా ఇష్టం’’ అని బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో అవును.. నిజమే కదా అంటూ అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు.

ఏదేమైనా హల్క్‌- స్కై ఎంగేజ్‌మెంట్‌ న్యూస్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఆల్‌టైమ్‌ డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన హల్క్‌ హోగన్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

చదవండి: 'హర్మన్‌ప్రీత్‌ ప్రవర్తన మరీ ఓవర్‌గా అనిపించింది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement