డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం, హాలీవుడ్ స్టార్.. ది రాక్(డ్వేన్ జాన్సన్) తల్లి ఆటా జాన్సన్ కారు ప్రమాదానికి గురవ్వడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. రాక్ తల్లి ఆటా జాన్సన్ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు ముందు బాగం బాగా దెబ్బతిన్నప్పటికి సకాలంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆటా జాన్సన్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎమర్జన్సీ బృందం ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని.. ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న రాక్(డ్వేన్ జాన్సన్) తల్లిని చూసేందుకు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. ఆమె క్షేమంగా ఉందని తెలుసుకొని సంతోషించిన రాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లికి జరిగిన ప్రమాదంపై ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ''దేవుని దయ వల్ల నా తల్లి బాగానే ఉంది. సకాలంలో స్పందించిన ఎమర్జెన్సీ సర్వీస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. యాక్సిడెంట్‌లో కారు ముందు భాగంలో డ్యామేజ్ ఎక్కువగా జరగడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయేమోనని ఆందోళన పడ్డాను. సకాలంలో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో నా తల్లికి ప్రాణాపాయం తప్పింది.
నా తల్లి(అటా జాన్సన్)తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి బయటపడిన ఆమె.. తర్వాత నాన్నతో కష్టాలు పడింది. ఒక సందర్భంలో సూసైడ్ వరకు వెళ్లింది. కానీ నాపై ప్రేమతో అవన్నీ చేయలేకపోయింది. నా తల్లి ఒక యోధురాలు.. జీవితంలో కష్టాలన్ని చూసి కూడా ఇవాళ నిబ్బరంగా ఉంది. ఇవాళ జరిగిన పెద్ద యాక్సిడెంట్‌లో ఆమె ప్రాణాలతో బయటపడింది. థాంక్యూ గాడ్.. నా తల్లిని కాపాడినందుకు'' అంటూ పేర్కొన్నాడు.
డబ్ల్యూడబ్ల్యూఈలో దిగ్గజంగా పేరు పొందిన రాక్ పీపుల్స్ స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెజ్లింగ్‌లో ఎనిమిదిసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత రాక్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం రాక్(డ్వేన్ జాన్సన్) హాలీవుడ్ సూపర్‌స్టార్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈకి దూరంగా ఉంటున్న రాక్.. ఈసారి జరగబోయే రెసల్‌మేనియా(Wrestlemania)aలో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment