టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పలు సర్జరీల అనంతరం ఎన్‌సీఏలో రీహాబిలిటేషన్‌లో ఉన్న పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఎలాగైనా జట్టులో చోటు సంపాదించాలని పంత్ ప్రయత్నిస్తున్నాడు.
ఇటీవలే స్టెప్స్ ఎక్కుతున్న వీడియోను షేర్ చేసిన పంత్ పెద్దగా ఇబ్బంది పడినట్లు అనిపించలేదు. అంతేకాదు ఇటీవలే టీమిండియా క్రికెటర్స్ పలువురు పంత్‌ను కలిశారు. ఆ ఫోటోలను కూడా పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇక కారు యాక్సిడెంట్‌లో ప్రాణాల నుంచి బయటపడిన పంత్‌కు ఇది నిజంగా రెండో జీవితమని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు.
తాజాగా పంత్ ఇన్‌స్టాగ్రామ్‌ను గమనిస్తే అతని బయోడేటాలో డేట్ ఆఫ్ బర్త్ మారినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి 25 ఏళ్ల పంత్ జన్మదినం అక్టోబర్ 4, 1997. బయోడేటా ఎలా ఉందంటే..
రిషబ్ పంత్
అథ్లెట్
ఇండియా
సెకండ్ D.O.B-: 05/01/2023 అని రాసి ఉంది.
పంత్ కారు ప్రమాదానికి గురైంది డిసెంబర్ 30, 2022 రోజున.కానీ తొలి ఆరు రోజులు పంత్ ఆరోగ్య పరిస్థితి డేంజర్‌లోనే ఉంది. జనవరి 5వ తేదీన పంత్ పూర్తిగా డేంజర్ నుంచి బయటపడ్డాడు. అందుకే పంత్.. జనవరి 5, 2023ను తనకు రెండో డేట్ ఆఫ్ బర్త్‌గా పరిగణించి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ తన డేట్ ఆఫ్ బర్త్‌ను మార్చుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
చదవండి: #Bairstow: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో
Comments
Please login to add a commentAdd a comment