date of birth
-
మారిన పాస్‌పోర్ట్ రూల్స్..
పాస్‌పోర్టుల (Passport) జారీకి సంబంధించిన నిబంధనలలో భారత ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. పాస్‌పోర్టుల జారీ కోసం సమర్పించే పుట్టినరోజు తేదీ రుజువుకు సంబంధించిన నిబంధనలకు సవరణలు ప్రకటిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. పాస్‌పోర్ట్ (సవరణ) నిబంధనలు, 2025 లో భాగమైన ఈ మార్పులు పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అవసరమైన డాక్యుమెంటేషన్‌లో ఏకరూపతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.నిబంధనల్లో కీలక మార్పులు2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలకు జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన, మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న ఏదైనా ఇతర అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం మాత్రమే పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువు అని కొత్త నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ మార్పు శిశువులకు జనన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అలాగే పుట్టిన తేదీని అధికారిక రికార్డులలో ఖచ్చితంగా నమోదు చేసేలా చేస్తుంది.2023 అక్టోబర్ 1 కంటే ముందు పుట్టినవారికి..2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించిన వారికి పుట్టిన తేదీకి సంబంధించి అనుమతించదగిన రుజువులు మరింత సరళంగా ఉంటాయి. ఈ కింది డాక్యుమెంట్లను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆమోదిస్తారు.జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న మరేదైనా అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం.దరఖాస్తుదారు పుట్టిన తేదీని కలిగి ఉన్న గుర్తింపు పొందిన పాఠశాల లేదా గుర్తింపు పొందిన విద్యా బోర్డు జారీ చేసిన బదిలీ లేదా స్కూల్ లీవింగ్ లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు.దరఖాస్తుదారు పుట్టిన తేదీ ఉండే సర్వీస్ రికార్డ్ ఎక్స్ట్రాక్ట్ లేదా వేతన పెన్షన్ ఆర్డర్ కాపీలు (ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి). వీటికి సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా దరఖాస్తుదారు అడ్మినిస్ట్రేషన్ ఇన్‌ఛార్జి అధికారి ధ్రువీకరణ ఉండాలి.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో కూడిన ఎన్నికల సంఘం జారీ చేసిన ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా ప్రభుత్వ కంపెనీలు జారీ చేసే పాలసీ బాండ్. ఇందులో బీమా పాలసీ హోల్డర్ పుట్టిన తేదీ ఉంటుంది.దరఖాస్తుదారులపై ప్రభావంకొత్త నిబంధనలు ప్రధానంగా 2023 అక్టోబర్ 1 లేదా తరువాత జన్మించిన పిల్లల తల్లిదండ్రులను ప్రభావితం చేస్తాయి. వారు పాస్‌పోర్ట్ దరఖాస్తులకు పుట్టిన తేదీ ఏకైక రుజువుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఈ మార్పు డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రామాణీకరించడం, పుట్టిన తేదీ రికార్డులలో వ్యత్యాసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించినవారిపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. పాస్‌పోర్ట్ కోసం వారు ఎప్పటిలాగే వివిధ రకాల డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌లను సమర్పించవచ్చు. -
మళ్లీ పుట్టానంటున్న స్టార్ హీరోయిన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తెలియనివారు ఉండరు. 1990ల్లో స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత ప్రతిష్టను పెంచింది. మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సుస్మిత రికార్డ్ క్రియేట్ చేసింది. సుస్మిత సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేసింది.అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా బయోలో కీలక మార్పులు చేసింది. ఏకంగా తన రెండో పుట్టినరోజు అంటూ బయోలో రాసుకొచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అదేేంటని నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి.అయితే గతేడాది సుస్మితా సేన్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2023లో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆమె... ఆ తర్వాత కోలుకుంది. అందుకే తాజాగా ఆమె తన ఇన్‌స్టా బయోలో బర్త్ డే తేదీని రాసుకొచ్చింది. నా రెండో పుట్టిన రోజు ఇదేనంటూ.. 27 ఫిబ్రవరి 2023 అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే గుండెపోటు నుంచి కోలుకున్న సుస్మితా.. తనకు పునర్జన్మగా భావించి ఆ తేదీని అలా రాసుకొచ్చినట్లు తెలుస్తోంది.కాగా.. 1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్‌లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. 2015 లోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సుస్మితా సేన్.. ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్ సీరిస్‌లలో నటించింది. స్టార్ హీరోయిన్గా ఎదిగిన సుస్మితా సేన్ చివరిసారిగా ఆర్య సీజన్ 3లో కనిపించింది. -
ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు!
ప్రపంచం మొత్తం దాదాపు 800 కోట్ల జనాభా ఉంది. ఇందులో నాలుగోవంతు భారత్, చైనాల్లోనే నివసిస్తోంది. ప్రస్తుతం చైనా జనాభా 141.7 కోట్లు, ఇండియా జనాభా 141.2 కోట్లు. ఈ ఏడాదిలోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. చైనా జనాభా 1990 నుంచి క్రమంగా తగ్గుతోంది. భారత్ జనసంఖ్య మాత్రం 2050 వరకు పెరుగుతూ 166.8 కోట్లకు చేరుతుందని సమాచారం. 2022-2050 మధ్య 46 పేద దేశాల్లో జనాభా పెరుగుతూ ఉంటే 61 దేశాల్లో ఏటా ఒకశాతం చొప్పున తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అనేక ఐరోపా దేశాల్లో జనాభా పెరుగుదల రేటు ఇప్పటికే బాగా క్షీణించింది. మున్ముందు మరింత క్షీణిస్తుందని సమాచారం. ఇదీ చదవండి: ‘రూ.1.8 లక్షలు చెల్లిస్తే రూ.5 కోట్లు’.. సీఈఓ ఏమన్నారంటే.. ప్రపంచంలో ప్రతిసెకనుకు దాదాపు నలుగురు, అంటే ప్రతి నిమిషానికి 259 మంది శిశువులు పుడుతున్నారని కొన్నిసర్వేల ద్వారా తెలుస్తోంది. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ అండ్ సోషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం.. ఏడాదిలో కొన్ని రోజుల్లోనే అధికంగా, మరికొన్ని రోజుల్లో తక్కువగా జననాలు నమోదవుతున్నాయని తెలుస్తోంది. అందుకు సంబంధించిన సర్వే వివరాలు ఆసక్తిగా మారాయి. సర్వే ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మంది సెప్టెంబర్‌లోనే పుడుతున్నారట.. నవంబర్, డిసెంబర్, జనవరి, జులై, ఫిబ్రవరిలోని ప్రత్యేక తేదీల్లో చాలా తక్కువ జననాలు నమోదవుతున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 9న చాలా మంది, ఫిబ్రవరి 29న తక్కువ మంది పుడుతున్నారని సర్వే వివరించింది. Most & least common day to be born: 1. Sept 9 2. Sept 19 3. Sept 12 4. Sept 17 5. Sept 10 6. July 7 7. Sept 20 8. Sept 15 9. Sept 16 10. Sept 18 357. Nov 25 358. Nov 23 359. Nov 27 360. Dec 26 361. Jan 2 362. July 4 363. Dec 24 364. Jan 1 365. Dec 25 366. Feb 29 According to… — World of Statistics (@stats_feed) November 25, 2023 -
'యాక్సిడెంట్ నాకు రెండో లైఫ్'.. 'డేట్ ఆఫ్ బర్త్' మార్చుకున్న పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పలు సర్జరీల అనంతరం ఎన్సీఏలో రీహాబిలిటేషన్‌లో ఉన్న పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఎలాగైనా జట్టులో చోటు సంపాదించాలని పంత్ ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే స్టెప్స్ ఎక్కుతున్న వీడియోను షేర్ చేసిన పంత్ పెద్దగా ఇబ్బంది పడినట్లు అనిపించలేదు. అంతేకాదు ఇటీవలే టీమిండియా క్రికెటర్స్ పలువురు పంత్‌ను కలిశారు. ఆ ఫోటోలను కూడా పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇక కారు యాక్సిడెంట్లో ప్రాణాల నుంచి బయటపడిన పంత్‌కు ఇది నిజంగా రెండో జీవితమని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. తాజాగా పంత్ ఇన్‌స్టాగ్రామ్‌ను గమనిస్తే అతని బయోడేటాలో డేట్ ఆఫ్ బర్త్ మారినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి 25 ఏళ్ల పంత్ జన్మదినం అక్టోబర్ 4, 1997. బయోడేటా ఎలా ఉందంటే.. రిషబ్ పంత్ అథ్లెట్ ఇండియా సెకండ్ D.O.B-: 05/01/2023 అని రాసి ఉంది. పంత్ కారు ప్రమాదానికి గురైంది డిసెంబర్ 30, 2022 రోజున.కానీ తొలి ఆరు రోజులు పంత్ ఆరోగ్య పరిస్థితి డేంజర్లోనే ఉంది. జనవరి 5వ తేదీన పంత్ పూర్తిగా డేంజర్ నుంచి బయటపడ్డాడు. అందుకే పంత్.. జనవరి 5, 2023ను తనకు రెండో డేట్ ఆఫ్ బర్త్‌గా పరిగణించి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ తన డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. చదవండి: #Bairstow: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో బాల్‌గర్ల్‌గా బ్రిటన్ యువరాణి.. మెళుకువలు నేర్పిన ఫెదరర్ -
Cambodia: పుట్టిన తేదీని మార్చుకున్న ప్రధాని.. కారణం ఏంటో తెలుసా?
పరిస్థితులు అనుకూలించడం లేదనో, ఏ పని చేసిన కలిసి రావడం లేదనో కొంతమంది పేరు మార్చుకోవడం, పేరులో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం చూసి ఉంటాం. అయితే ఇక్కడ ఓ దేశానికి ప్రధాని కేవలం అదృష్టాన్నే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది. అందుకోసం కోసం.. ఏకంగా పుట్టినతేదీనే మార్చుకున్నాడు. పైగా అంత అత్యున్నతి పదవిలో ఉండి ఆ పని చేయడమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు!. కంబోడియా ప్రధాన మంత్రి హన్ సెన్.. పుట్టిన తేది ఏప్రిల్ 4, 1951. కానీ ఆయన ఆ తేదీని ఆగస్టు 5, 1952కి చట్టబద్ధంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఇందుకు ఓ బలమైన కారణం ఉందన్నది ఆయన వాదన. హన్సెన్ సోదరుడు.. సింగపూర్‌లో వైద్యం చేయించుకుని కంబోడియాకు తిరిగి వచ్చిన పదిరోజులకే చనిపోయాడు. దీంతో హన్ సెన్.. అత్యవసరంగా తన డేట్ ఆఫ్ బర్త్ను మార్చేసుకోవాలనుకున్నాడు. ఈ అనుహ్యమైన నిర్ణయం వెనుక.. తన సోదరుడి రెండు పుట్టిన రోజుల దోషం కూడా ఉందన్నది ఆయన వాదన. వాస్తవానికి కంబోడియా 1975 నుంచి 1979 వరకు ఖైమర్ రూజ్ పాలన కాలంలో ఉండేది. ఆ సమయంలో చాలామంది అధికారిక రికార్డుల కోల్పోయినందున వల్ల 50 ఏళ్లు పైబడ్డ కంబోడియన్లందరికీ రెండేసి పుట్టిన రోజులు ఉండిపోయాయి. అలా తన సోదరుడికి రెండు పుట్టినరోజులు ఉండడం, రాశిచక్రం దోషం వల్ల చనిపోయి ఉంటాడని హన్ సెన్ నమ్ముతున్నాడు. తన వరకు అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు.. ఒకే పుట్టినరోజు ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకే చట్టబద్ధంగా.. తన పుట్టిన తేదీని మార్చుకునే అంశంపై.. న్యాయ శాఖ మంత్రి కోయుట్ రిత్తో చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తన కొత్త పుట్టిన తేదీని చట్టబద్ధంగా రిజిస్ట్రర్ చేసుకుని.. ప్రకటించే అవకాశం ఉంది. (చదవండి: మాతృభాషకు అసలైన గౌరవం... ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా..ఎల్లప్పుడూ కన్నడిగే!) -
5 నిమిషాల్లో పాన్కార్టులోని పేరు, పుట్టిన తేదీని మార్చుకోండి ఇలా..!
ఆధార్ కార్డుతో పాటు పాన్‌కార్టు ఇప్పుడు తప్పనిసరిగా కలిగి ఉండాల్సి వస్తుంది. ఆర్థికపరమైన లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల కోసం, ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి పాన్‌కార్డు కచ్చితంగా ఉండాలి. అయితే ఒక్కసారి పాన్‌కార్టు తీసుకున్నామంటే పాన్ నంబర్‌ను ఎప్పటికీ మార్చలేం. అయితే పాన్‌కార్టులో పేరు, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని అప్డేట్ చేసుకునే అవకాశం ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. పాన్‌కార్టులో పేరు, పుట్టిన తేదీ వంటి పలు వివరాలను ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా మార్చుకోవచ్చు. అయితే ప్రస్తుతం అందరూ సులభమైన పద్దతి ఆన్లైన్లోనే మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, ఈ సేవలు ఉచితం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎన్ఎస్డిఎల్ పోర్టల్‌లో తెలిపిన వివరాల ప్రకారం రూ.100 వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. పాన్‌కార్టులో పేరు, పుట్టిన తేదీని ఎలా సరిచేయాలి? ముందుగా ఎన్ఎస్డిఎల్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ పేజిలో Application Typeపై క్లిక్ చేసి Changes or Correction in existing PANS Data/Reprint of PAN Card ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత Individual పై క్లిక్ చేసి పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ పూర్తిచేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ నమోదు చేయండి. కొత్త పేజిలో టోకెన్ నంబర్ వస్తుంది. దాన్ని సేవ్ చేసుకోండి. Submit digitally through e-KYC & e-sign (paperless) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దాని తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసి వ్యక్తిగత వివరాలను నింపి Next బటన్ మీద క్లిక్ చేయాలి. అందులో మీరు మార్చాలనుకుంటున్న వ్యక్తిగత వివరాలు, అడ్రస్‌ను తప్పులు లేకుండా నింపాలి. మీ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని మార్చాలని అనుకున్నా దీనిలో మార్చుకోవచ్చు. అడ్రస్, కాంటాక్ట్ డిటైల్స్ అన్ని సరిగ్గా ఇచ్చిన తర్వాత పేజి కింద ఉన్న next బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజిలో ఐడెంటిటీ, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అలాగే ఫొటో, సంతకం కూడా మార్చాలనుకున్నా.. స్కాన్ చేసి jpeg ఫార్మట్‌లో అప్లోడ్ చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ కాగానే.. అకనాలెడ్జ్మెంట్ స్లిప్ జనరేట్ అవుతుంది. ఫోన్ నెంబర్‌కు, మెయిల్‌కు మెస్సెజ్ కూడా వస్తుంది. అనంతరం ఆ స్లిప్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్‌ను ప్రింట్ తీసి, మీరు ప్రూఫ్ కింద సబ్మిట్ చేసిన వాటిని ఎన్ఎస్డిఎల్ ఆఫీస్((Building-1, 409-410, 4th Floor, Barakhamba Road, New Delhi, PIN: 110001))కు పంపించాలి. (చదవండి: దేశంలోనే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్.. ఎక్కడో తెలుసా?) -
Aadhar Card: పుట్టినతేదీని ఆన్లైన్లో ఇలా సవరించండి!
దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నాయి. ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డులో మమూలుగా ఎవైనా మార్పులు చేయాలంటే ఆధార్ సెంటర్లకు జనాలు పరుగులు తీస్తారు. కాగా ప్రస్తుతం ఆధార్ తెచ్చిన సదుపాయంతో పుట్టినతేదిని మార్చడం మరింత సులువుకానుంది. నేరుగా యుఐడిఎఐ వెబ్సైట్లో పుట్టినతేదీలో మార్పులు చేయవచ్చును. యుఐడిఎఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ లింక్ https://ssup.uidai.gov.in/ssup/ ద్వారా ఆన్లైన్లో మీ పుట్టినతేదీని మార్చుకోవచ్చును. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సవరించడానికి అవసరమైన పత్రాలు: జనన ధృవీకరణ పత్రం ఎస్ఎస్ఎల్సి బుక్ / సర్టిఫికేట్/ ఎస్ఎస్సీ లాంగ్ మెమో పాస్‌పోర్ట్ గుర్తింపుపొందిన విద్యా సంస్థ జారీ చేసిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఫోటో ఐడి కార్డ్. పాన్ కార్డ్ ఆధార్‌కార్డులో పుట్టినతేదీని ఇలా సవరించండి: ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ లింకును ఓపెన్ చేయాలి. అందులో ఫ్రోసిడ్ టూ ఆప్డేట్ ఆధార్‌ను క్లిక్ చేయాలి. ఆప్డేట్ ఆధార్ ఆన్‌లైన్‌ను క్లిక్ చేసిన తరువాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. తరువాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ ఐనా ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. మొబైల్‌కు వచ్చిన 6 అంకెల వన్ టైం పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ ఐనా తరువాత మీకు సంబంధించిన ఆధార్ వివరాల వెబ్ పేజ్ ప్రత్యక్షమవుతుంది. ఈ వెబ్ పేజీలో మీకు పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్ కనిపిస్తుంది. పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్ క్లిక్ చేసిన తరువాత వెబ్‌పేజీలో పుట్టినరోజుకు సంబంధించిన స్కాన్డ్ సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్‌ను నొక్కండి. విజయవంతంగా వేరిఫికేషన్ జరిగిన తరువాత మీ మొబైల్ ఫోన్‌కు కన్ఫర్మెషన్ వస్తుంది. కాగా ఆధార్‌కార్డులో పుట్టినతేదీని మార్చినందుకుగాను రూ.50 సర్వీస్ ఛార్జ్‌ను వసూలు చేస్తుంది. ఇలా చేయాలంటే ఆధార్ కార్డుకు కచ్చితంగా మొబైల్ ఫోన్ నంబర్ రిజస్ట్రేషన్ తప్పనిసరి. #AadhaarOnlineServices Update your DoB online through the following link - https://t.co/II1O6Pnk60, upload the scanned copy of your original document and apply. To see the list of supportive documents, click https://t.co/BeqUA0pkqL #UpdateDoBOnline #UpdateOnline pic.twitter.com/QPumjl6iFr — Aadhaar (@UIDAI) June 16, 2021 చదవండి: పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డు పొందండి ఇలా..? -
కుటుంబంలో ఒక్కరికే పింఛన్
సాక్షి, మానవపాడు: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ వయస్సు 57 ఏళ్లకు తగ్గించడంతో అర్హులైన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి రూ.2 వేల పింఛన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వృద్ధుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పింఛన్ల వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండల నిరుపేదలు ఊరట చెందుతున్నారు. నూతన పింఛన్ విధానంతో మండలంలో లబ్ధిదారుల సంఖ్య బాగానే పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక్కరే పింఛన్‌కు అర్హులని ఆదేశాలు చేయడంతో వృద్ధులు ఉసూరుమంటున్నారు. ఇప్పటి వరకు ఇంట్లో ఒకరికి పింఛన్ ఉండగా నూతన విధానంతో ఇంట్లో మరొకరికి పింఛన్ వస్తుందని ఆశపడిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. ఎన్నికల సమయంలో 57 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పింఛన్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ హామీ అమలు చేయడంలో షరతులు విధించడం సమంజసంగా లేదంటున్నారు. నూతన పింఛన్ విధానంపై.. ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి అందించనున్న రూ.2 వేల పింఛన్ పథకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న సమాజంలో 60 ఏళ్లు దాటితే పనిచేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గుర్తించి వృద్ధాప్యం సమీపిస్తుండగానే వారికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్హతలివే.. మండలంలో అర్హులైన లబ్ధిదారులు తమ ఆదాయం రూ.1.50 లక్షలోపు ఉన్నట్లు ధ్రువపత్రం, తమ వయస్సు 57 ఏళ్లు పూర్తయినట్లు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేదా ఓటరు కార్డు కలిగి ఉండాలి. మూడెకరాల తరి భూమి, 7 ఎకరాల్లోపు మెట్ట భూమి కలిగి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. ఇందుకు సంబంధించిన షరతులతో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కరికే ఇవ్వడం సరికాదు ఇంటికి ఒక్కరికే పింఛన్ ఇవ్వడం సరికాదు. ఇంట్లో 57 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉంటే అందరికీ ఇవ్వాలి. 60 ఏళ్లు నిండాయంటే లేవడం, కూర్చోవడానికి సైతం ఇబ్బందులు పడుతుంటారు. ఈ వయస్సులో ఏ పని చేయలేని పరిస్థితి. ప్రభుత్వం పింఛన్ ఇస్తే ఆ డబ్బులు మందులు, తిండి ఖర్చులకు పనికొస్తాయి. – సంజీవ నాయుడు, చెన్నిపాడు అర్హుల వివరాలు సేకరిస్తున్నాం.. మండలంలో 57 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ప్రతిఒక్కరి వివరాలు సేకరిస్తున్నాం. కుటుంబానికి ఒక్క పింఛన్ మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. కొత్త పింఛన్ పథకం కోసం ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తాం. – ముషాయిదాబేగం -
వయసు తగ్గె.. లెక్క పెరిగె..!
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో పింఛన్‌దారులు మరింత పెరగనున్నారు. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారనే దానిపై లెక్కలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు పూర్తికాగానే.. వారిలో అర్హులను గుర్తించి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ వృద్ధాప్య పింఛన్‌దారుల వయసు కుదిస్తామని, ఇక 57 ఏళ్ల వయసు నుంచి పింఛన్ అందిస్తామని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందడం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో దీనికి సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత హామీల అమలుపై దృష్టి సారించిన సీఎం.. ఆసరా పింఛన్లపై వెనువెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆసరా పింఛన్లను అందించేందుకు అర్హులను గుర్తించే పనిని ముమ్మరం చేశారు. ఆసరా పింఛన్లు అందుకుంటున్న 63,655 మంది.. జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లను 63,655 మంది పొందుతున్నారు. గతంలో ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారికి పింఛన్లు అందజేస్తున్నారు. ప్రతినెలా వీరికి పింఛన్లు సకాలంలో అందుతుండడంతో వీరికి ఎంతో కొంత ఆసరాగా ఉంటోంది. వారి మందులు, ఇతర అవసరాలు తీరుతుండడంతో వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ పొందేందుకు 57 ఏళ్ల వయసును అర్హతగా పేర్కొనడంతో మరింత మందికి పింఛన్లు అందనున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇతర కారణాలతో పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. 60 ఏళ్లలోపే వృద్ధాప్యంతో అనేక మంది తమ పనులు తాము చేసుకోలేని స్థితికి చేరుతున్నారు. పింఛన్ తీసుకునే వయసు 65 ఏళ్లు చేయడంతో ఆ కింద వయసు కలిగిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల్లోని వృద్ధులకు కనీస ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో జీవనం కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ వయసు 57 ఏళ్లకు తగ్గించడం.. అలాగే ఆసరా పింఛన్ కూడా పెంచడంతో వారికి ఈ డబ్బు ఎంతో ఉపయోగకరంగా మారనున్నది. ఇప్పటివరకు వృద్ధాప్య పింఛన్ రూ.1000 ఇచ్చే వారు. అయితే ఇప్పుడు ఆ పింఛన్ కూడా రెట్టింపు కావడంతో వృద్ధులకు మందులు, వారికి ఉండే ఇతర అవసరాలకు సొమ్ము చేతిలో ఉండే పరిస్థితి ఉంది. ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పింఛన్ రూ.2,016 చొప్పున అందించనున్నారు. లెక్కలు కట్టే పనిలో అధికారులు.. కొత్తగా వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసేందుకు అధికారులను కసరత్తు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో అందుకు సంబంధించిన పనుల్లో కిందిస్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. 2018 నవంబర్ ఓటర్ల జాబితా ప్రకారం 57 నుంచి 64 ఏళ్లలోపు వృద్ధులు ఎంతమంది ఉన్నారనేది లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 90,959మంది ఉన్నారు. అయితే 56 ఏళ్లు దాటినవారు 1,81,442 మంది ఉన్నారు. అయితేఅధికారులు 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు ఉన్న వారి లెక్కలను తీసుకుని.. అందులో అర్హులను గుర్తించనున్నారు. అర్హులకు ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పింఛన్లు అందజేసే అవకాశం ఉంది. అర్హులను గుర్తిస్తున్నాం.. వృద్ధాప్య పింఛన్లకు అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. వృద్ధాప్య పింఛన్ అందుకునే వారి వయసు 57 ఏళ్లకు కుదించడంతో ఆ వయసు కలిగిన అర్హులైన లబ్ధిదారులు జిల్లాలో ఎంతమంది ఉన్నారనే దానిపై లెక్కలు తీస్తున్నాం. ఓటరు జాబితాను అనుసరించి మొదట 57 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు వారు ఎంతమంది ఉన్నారనేది గుర్తిస్తున్నాం. అందులో నుంచి అర్హుల జాబితాను తయారు చేసి.. ఉన్నతాధికారులకు అందజేస్తాం. – ఇందుమతి, డీఆర్డీఓ -
సివిల్స్‌కు 27 ఏళ్లే!
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్ష వయో పరిమితి తగ్గింపుతోపాటు దిగువ కోర్టుల్లో జడ్జీల ఎంపికపై కేంద్ర ప్రభుత్వ ‘థింక్ ట్యాంక్’ నీతి ఆయోగ్ పలు కీలక చర్యలను ప్రతిపాదించింది. 2022–23 సంవత్సరానికి సాధించాల్సిన లక్ష్యాలను, చేపట్టాల్సిన చర్యలతో కూడిన ‘స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియాః75’ పత్రాన్ని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసింది. ‘సివిల్ సర్వీసెస్ జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 30 ఏళ్ల నుంచి 2022–23కల్లా దశలవారీగా 27 ఏళ్లకు తగ్గించాలి. ప్రస్తుతమున్న 60కి పైగా కేంద్ర, రాష్ట్ర సర్వీసులను హేతుబద్ధీకరణ ద్వారా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ అవసరాలు, కావల్సిన నైపుణ్యాన్ని బట్టి సెంట్రల్ పూల్ నుంచే అభ్యర్థుల కేటాయింపు జరగాలి. దీనివల్ల సివిల్ సర్వీసెస్‌లో ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ఒక్క పరీక్ష నిర్వహిస్తే సరిపోతుంది. ఈ సెంట్రల్ పూల్‌ను వినియోగించుకునేలా రాష్ట్రాలను ప్రోత్సహించాలి. అంతేకాకుండా, సివిల్ సర్వీసెస్‌లో సంస్కరణలు నిరంతరం కొనసాగాలి. ఈ దిశగా ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది’ అని నీతి ఆయోగ్ ఆ పత్రంలో తెలిపింది. జడ్జీల ఎంపికకు ఆల్ ఇండియా పరీక్ష దిగువ కోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి దేశ వ్యాప్తంగా ఒకే ఎంపిక నిర్వహించాలని నీతి ఆయోగ్ సూచించింది. ప్రతిభావంతులైన యువ న్యాయ అధికారులను ప్రోత్సహించేందుకు, వారిలో జవాబుదారీతనం పెంచేందుకు ఈ చర్య దోహదపడుతుందని అభిప్రాయపడింది. ‘అఖిల భారత స్థాయిలో నిర్వహించే ర్యాంకింగ్ ఆధారిత పరీక్ష వల్ల న్యాయవ్యవస్థలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పవచ్చు. దిగువ స్థాయి కోర్టుల్లో జడ్జీలకు, కేంద్ర, రాష్ట్ర న్యాయ సేవల విభాగాలు, ప్రాసిక్యూటర్లు, న్యాయ సలహాదారులు తదితర అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిష¯Œ (యూపీఎస్సీ)కు అప్పగించాలి. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకుగాను ఆయా పోస్టులకు ఎంపికైన వారంతా సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది’ అని ఆ పత్రంలో నీతి ఆయోగ్ పేర్కొంది. జడ్జీల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసేందుకు రాష్ట్రాలవారీగా సూచికలు తయారు చేయాలంది. సత్వర న్యాయం కోసం కోర్టుల్లో వీడి యో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, వినియోగం కూడా పెరగాల్సిన అవసరం ఉందని తెలిపింది.ప్రస్తుతం జడ్జీల ఎంపిక కోసం వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు, సివిల్ సర్వీస్ కమిషన్లు పరీక్షలు చేపడుతుండగా అఖిల భారత స్థాయిలో ఈ పరీక్షలను చేపట్టాలన్న ప్రతిపాదన 1960ల నుంచే ఉంది. అయితే, దీనిని తొమ్మిది హైకోర్టులు తిరస్కరించగా 8 హైకోర్టులు పలు మార్పులను ప్రతిపాదించాయి. అయితే, నీట్ లాగానే దేశవ్యాప్తంగా జడ్జీల ఎంపిక పరీక్ష చేపట్టాలన్న ఆలోచనను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న దిగువస్థాయి న్యాయస్థానాల్లో 20,502 పోస్టులకు గాను 2015 నాటికి 16,050మంది మాత్రమే పనిచేస్తున్నారు. -
ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రస్తుత తరుణంలో ఉమ్మడి పౌరస్మృతి(అందరికీ ఒకే చట్టం) అవసరం గానీ, దానివల్ల ప్రయోజనం గానీ లేదని కేంద్ర న్యాయ కమిషన్ పేర్కొంది. వివాహం, విడాకులు, జీవనభృతి, పురుషులు, మహిళలకు చట్టబద్ధ వివాహ వయస్సు తదితర అంశాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు అవసరమని ఉమ్మడి పౌరస్మృతిపై విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో అభిప్రాయపడింది. స్త్రీ, పురుషులకు వివాహ వయసును 18 ఏళ్లుగా మార్చాలంది. వివాహ చట్టాల్లో మార్పులు చేయాలి.. మహిళలకు సమాన హక్కులపై స్పందిస్తూ.. ‘ఒక మహిళ సంపాదనతో నిమిత్తం లేకుండా ఇంట్లో ఆమె పాత్రను గుర్తించాలి. వివాహం తర్వాత సంపాదించుకున్న ఆస్తిలో విడాకుల సమయంలో మహిళకు సమాన వాటా అందాలి’ అని తెలిపింది. ఇందుకోసం హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954, పార్సీ వివాహ, విడాకుల చట్టం యాక్ట్ 1936, క్రైస్తవ వివాహ చట్టం 1972, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939లను సవరించవచ్చని పేర్కొంది. పురుషులకు, మహిళలకు కనిష్ట వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండాలని, వేర్వేరు వివాహ వయస్సుల్ని రద్దు చేయాలంది. ప్రస్తుతం వివాహానికి పురుషుడికి 21 ఏళ్లు, మహిళకు 18 ఏళ్లు చట్టబద్ధ వయసుగా ఉంది. వితంతు హక్కులు, వివాహం అనంతరం సొంతంగా సంపాదించుకునే ఆస్తులపై చట్టాలు, సరిదిద్దలేనంతగా వివాహ జీవితం విచ్చిన్నం కావడాన్ని విడాకులను ప్రామాణికంగా తీసుకోవడం వంటి అంశాలపై సూచనలు చేసింది. పార్సీలకు సంబంధించి ఆ మతానికి చెందిన మహిళ వేరే మతస్తుడ్ని వివాహం చేసుకున్నా వారసత్వ ఆస్తిలో ఆమెకు భాగం ఉండాలంది. పిల్లల సంరక్షణ బాధ్యతల అప్పగింతలో వ్యక్తిగత చట్టాలకన్నా ఆ చిన్నారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషన్ పేర్కొంది. మతం ముసుగులో.. మత సంప్రదాయాల ముసుగులో ట్రిపుల్ తలాఖ్, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలు అమలుకాకుండా చూడాల్సి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి చాలా విస్తృతమైందని, దాని పరిణామాల ప్రభావంపై ఎలాంటి అధ్యయనం జరగలేదు అని పేర్కొంది. రెండేళ్ల పాటు విస్తృత పరిశోధన, సంప్రదింపుల అనంతరం భారతదేశంలోని కుటుంబ చట్టాలపై సంప్రదింపుల పత్రం సమర్పిస్తున్నామని తెలిపింది. విభేదించడం రాజద్రోహం కాదు ప్రభుత్వాన్ని విమర్శించడం, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అంశాలతో విభేదించడం రాజద్రోహం కాదని, ఉద్దేశ పూర్వకంగా చట్టవిరుద్ధంగా, హింసాత్మకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టే చర్యలకు పాల్పడినప్పుడే ఆ నేరం రాజద్రోహంగా పరిగణిస్తారని పేర్కొంది. ఐపీసీ 124ఏ సెక్షన్‌ను సమీక్షించాలని, దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన రాజద్రోహం సెక్షన్‌ని పదేళ్ళ క్రితమే బ్రిటన్‌లో రద్దుచేసిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది. ప్రజాస్వామ్య మనుగడకు భావప్రకటనా స్వేచ్ఛ ఎంతో అవసరమని, జాతి సమగ్రతను కాపాడాలనుకుంటే దానిని హరించకూడదని స్పష్టం చేసింది. -
జడ్జీల వయోపరిమితి పెంపు లేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంచే యోచన లేదని న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయోపరిమితిని రెండేళ్ల చొప్పున పెంచేందుకు ప్రభుత్వం బిల్లు రూపొందిస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆయన ఈ వివరణ ఇచ్చారు. జస్టిస్ రంజన్ గొగోయ్‌కు ప్రమోషన్ రాకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లకు పెంచుతోందంటూ మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ట్విట్టర్లో అంతకు కొద్దిసేపటి ముందే ఆరోపించారు. ప్రస్తుతం సుప్రీం, హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులు వరుసగా 65, 62 ఏళ్లు. హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు 62 నుంచి 65కు పెంచుతూ 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం బిల్లు రూపొందించి, లోక్‌సభలో కూడా ప్రవేశపెట్టింది. అయితే, చర్చ జరగలేదు. అనంతరం 2014లో లోక్‌సభ రద్దు కావటంతో ఈ బిల్లు కాలపరిమితి ముగిసిపోయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 31 జడ్జీలకు గాను 22 మంది.. దేశవ్యాప్తంగా ఉన్న 24 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తులకు గాను 673 మందే ఉన్నారు. -
పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల విడుదలైన పోలీసు ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌కు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పోలీసు శాఖ సవరణ నోటిఫికేషన్‌కు విడుదల చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా 18,428 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖలకు సంబంధించిన పోస్టులను ఇందులో భర్తీ చేస్తున్నారు. వీటన్నింటికి మూడేళ్ల వయో పరిమితిని పెంచతున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది. కాగా, గత గురువారం నోటిఫికేషన్ అనంతరం ఆరేళ్ల పాటు వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు రోడ్లు ఎక్కిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం మూడేళ్ల పాటు వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బోర్డు వెబ్సైట్ (www.tslprb.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునే ప్రతి పోస్టుకు కూడా వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. పోస్టులు, అర్హతలు ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఆందోళన చేపట్టిన ఓయూ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో శుక్రవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పోలీస్ రిక్రూట్మెంట్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఓయూ లైబ్రరీ నుంచి భారీ ర్యాలీగా వచ్చిన విద్యార్థులు గన్‌పార్క్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం నిన్న విడుదల చేసిన కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో గరిష్ట వయోపరిమితి ఆరు సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగులు ధర్నా చేశారు. అలాగే ఇంగ్లీష్ మీడియం మెరిట్ విధానం వల్ల తెలుగు మీడియం విద్యార్థులు నష్ట పోతున్నారని.. దాన్ని వెంటనే తొలగించి వయోపరిమితి పెంచాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతా రాయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వయో పరిమితి పెంచక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెపడుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆందోళన చేపడుతున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. -
గాంధీలో సమ్మె విరమించిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో వైద్యులు సమ్మె విరమించారు. వైద్య ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపును వ్యతిరేకిస్తూ.. గాంధీ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్లు ధర్నాకు దిగారు. ప్రొఫెసర్ల వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచొద్దంటూ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఆందోళన చేపడుతున్నారు. దీంతో స్పందించిన వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి డాక్టర్లతో చర్చలు జరిపారు. వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తుందని, సమ్మె విరమించాలని కోరారు. వైద్యులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి మరోసారి ప్రకటన చేస్తామని తెలిపారు. వైద్యులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైద్యుల సమస్యలపై పునరాలోచన చేస్తామన్న మంత్రి హామీతో వైద్యులు సమ్మె విరమించారు. ఈ సందర్బంగా డాక్టర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. మంత్రి హామీ ఇచ్చారని, పదవీ విరమణ వయస్సు పెంపుపై పునరాలోచన చేస్తామని భరోసా ఇవ్వడంతో విధుల్లో పాల్గొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం మాట తప్పితే మళ్ళీ సమ్మె చేస్తామని వైద్యుల వెల్లడించారు. -
ఆ రైతుల పుట్టినతేదీ.. జూలై ఒకటి
సాక్షి, హైదరాబాద్: రైతు బీమాకు సంబంధించి పుట్టినతేదీని పేర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో.. ఆధార్‌కార్డులో పుట్టినతేదీ లేని రైతులందరికీ ప్రభుత్వమే ఒక తేదీని నిర్ధారించింది. ఆధార్‌కార్డులో పుట్టిన సంవత్సరం తప్ప తేదీ నమోదు కాకుంటే.. ఆ రైతులందరికీ ‘జూలై 1వ తేదీ’ని పుట్టినతేదీగా పరిగణించేలా నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. చదువుకోకపోవడం, పలు ఇతర కారణాలతో పెద్ద సంఖ్యలో రైతుల ఆధార్ కార్డుల్లో పుట్టినతేదీ నమోదు కాలేదు. కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే నమోదైంది. అయితే పుట్టినతేదీ నమోదుకాని రైతులు ఎంతమంది ఉంటారన్న దానిపై స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. ఇక రైతు బీమా కోసం ఆధార్ నంబర్ నమోదును తప్పనిసరి చేశారు. దీనివల్ల ఒకటికి మించి పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతుల విషయంలో క్రమబద్ధీకరణ చేయడానికి వీలవుతుందని చెబుతున్నారు. ‘రైతు బంధు గ్రూప్ బీమా’ పథకం రైతు బీమాకు ‘తెలంగాణ రాష్ట్ర గ్రూప్ రైతుబంధు బీమా పథకం’గా నామకరణం చేశారు. రైతులకు పెట్టుబడి సొమ్ము ఇచ్చే పథకానికి ‘రైతుబంధు’గా పేరు పెట్టిన విషయం తెలిసిందే. అదే పేరును బీమా పథకానికి కూడా పెట్టడం గమనార్హం. ఈ పథకాన్ని కేవలం పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతులకే వర్తింపజేస్తారు. పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవసాయశాఖ వ్యవహరిస్తుంది. వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల నుంచి నామినీ నమోదు పత్రాలను సేకరిస్తారు. బీమా ధ్రువపత్రాలను ఆగస్టు 15 నుంచి రైతులకు అందజేయనున్నారు. ఆగస్టు 15 నుంచి బీమా.. ఏటా ఆగస్టు 15 నుంచి తదుపరి ఏడాది ఆగస్టు 14వ తేదీ వరకు బీమా కాలంగా పరిగణిస్తారు. బీమా ప్రీమియాన్ని ఏటా సవరిస్తారు. ఎవరైనా రైతు చనిపోతే.. పది రోజుల్లోగా వారి నామినీలకు ఆన్లైన్ పద్ధతిన సొమ్ము అందుతుంది. ఇక ఇప్పటివరకు భూములు లేకుండా.. కొత్తగా భూములు కొనుగోలు చేసి, పాస్ పుస్తకం పొందిన రైతుల పేర్లతో ప్రతీ నెల జాబితా తయారుచేస్తారు. పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ ఆ జాబితాలను ఎల్ఐసీకి అందజేస్తుంది. ప్రభుత్వం ఇలా అదనంగా చేరే రైతులకు సంబంధించి బీమా ప్రీమియాన్ని ప్రతి మూడు నెలలకోసారి ఎల్ఐసీకి చెల్లిస్తుంది. ప్రీమియం సొమ్మును వ్యవసాయశాఖ కమిషనర్ ద్వారా ఏటా ఆగస్టు ఒకటో తేదీలోపు ఎల్ఐసీకి చెల్లించాల్సి ఉంటుంది. తొలి ఏడాదికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై వ్యవసాయ శాఖ అధికారులకు అవసరమైన సమాచారాన్ని, శిక్షణను ఎల్ఐసీ ఇస్తుంది. ఇక బీమా నమూనా ధ్రువీకరణ పత్రాలను ఎల్ఐసీ వర్గాలు వ్యవసాయశాఖకు అందజేశాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులకూ ఇదేనా? రైతులు ఏ కారణంతో చనిపోయినా.. వారి కుటుంబాలకు బీమా పరిహారం అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే కూడా వర్తిస్తుందన్న అర్థం వస్తుందని అధికారవర్గాలు అంటున్నాయి. కానీ బీమా నిబంధనల ప్రకారం ఆత్మహత్యకు పాల్పడితే.. బీమా పరిహారం ఇవ్వరు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునే రైతులకు సంబంధించి ఎలా పరిహారం చెల్లిస్తారనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు. ఒకవేళ రైతులెవరైనా ఆత్మహత్య చేసుకుంటే... కొత్త రైతు బీమా పథకం కింద పరిహారం ఇస్తారా, లేక పాత విధానంలా ప్రభుత్వమే పరిహారం ఇస్తుందా? అన్నది తేలలేదు. ఒకసారి ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించాక.. రైతు ఎలా చనిపోయాడో నిర్ధారణ చేయాల్సిన బాధ్యత సర్కారుకు ఉండదు. అది ఎల్ఐసీకి, రైతు కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అవుతుంది. అయితే ఒకవేళ ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకున్నా.. సాధారణ మరణంగానే ధ్రువీకరణ ఇచ్చి బీమా పరిహారం చెల్లించే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఇది అత్యంత సున్నితమైన అంశం కావడంతో అధికారులెవరూ బహిరంగంగా వ్యాఖ్యానించడానికి సిద్ధంగా లేరు. రైతు బీమా కింద అందజేసే ధ్రువపత్రం నమూనా -
ఆర్టీసీలో 60 ఏళ్ల చిచ్చు!
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉద్యోగుల్లో చిచ్చు రాజేసింది. అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయి పైచేయి కోసం ప్రయత్నాలు ఆరంభించారు. ఓ వర్గం ఈ ఏడాది ప్రారంభం నుంచి పదవీ విరమణ చేసిన వారికి 60 ఏళ్ల వయో పరిమితి నిబంధన వర్తింపచేయాలని లాబీయింగ్ చేస్తుంటే మరో వర్గం ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన వారందరికీ 60 ఏళ్ల ప్రయోజనం కలిగించాలని పట్టుబడుతోంది. ప్రయోజనం అనేది అందరికీ ఒకేలా ఉండాలని, అలా కాకుండా కొందరికే లబ్ధి కలిగేలా వ్యవహరించడం సరికాదని మరో వర్గం అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందరికీ అమలు చేస్తే నోషనల్ ఇంక్రిమెంట్లు ఆర్టీసీలో 60 ఏళ్ల వయో పరిమితి నిబంధన వర్తింప చేస్తే 2014 జూన్ నుంచి అమలు చేయాలి. 2014 నుంచి ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు 8,200 మంది వరకు ఉన్నారని ఆర్టీసీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే 2014 జూన్ నుంచి 2016 జూన్ లోగా పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం ఉండదు. అందరికీ 60 ఏళ్ల నిబంధన అమలు చేస్తే నోషనల్ ఇంక్రిమెంట్లు మాత్రం అందుతాయి. మొత్తం రూ.60 కోట్ల వరకు ఈ భారం ఉంటుందని అంచనా. 2016 జూన్ తర్వాత రిటైర్ అయిన వారు నెలల వ్యవధిలో సర్వీసులో చేరి విధులు నిర్వహిస్తారు. 2016 జూన్ నుంచి ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన వారు 4 వేల మంది ఉన్నట్లు అంచనా. వీరు కూడా నెలల వ్యవధి వరకే విధులు నిర్వహించే వీలుంది. గతేడాది పదవీ విరమణ చేసిన వారు మాత్రమే ఏడాది వరకు సర్వీసులో కొనసాగుతారు. ఆర్టీసీలో 4,500కిపైగా ఖాళీలు రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీలో ఇంతవరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ట్రాఫిక్ సూపర్ వైజర్లు, గ్యారేజీ సూపర్ వైజర్లు, ఆఫీసు క్లర్లు్కలు, సెక్యూరిటీ గార్డులు ఇలా మొత్తం 4,500కి పైగా ఖాళీలున్నాయి. ఆర్టీసీలో 60 ఏళ్ల వయో పరిమితి అమలు చేస్తే 70 శాతం ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. భారం రూ.వెయ్యి కోట్లన్న యాజమాన్యం ఇటీవల జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో 60 ఏళ్ల వయో పరిమితి అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీలో 60 ఏళ్ల వయో పరిమితి అంశంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఆర్టీసీ బోర్డులో ఈ అంశంపై చర్చించి న్యాయ సలహా కోరాలని తీర్మానించారు. వయో పరిమితి భారం ఆర్టీసీయే భరిస్తే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆర్టీసీ అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అయితే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున 60 ఏళ్ల వయో పరిమితి అమలు చేస్తే సంస్థపై రూ.వెయ్యి కోట్ల భారం పడుతుందని ప్రభుత్వానికి యాజమాన్యం నివేదిక ఇచ్చింది. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ శుక్రవారం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. -
65 ఏళ్లు దాటిన అర్చకులపై టీటీడీ వేటు
-
70 ఏళ్ల వరకు రైతు బీమా!
సాక్షి, హైదరాబాద్: రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు బీమా’కు వయో పరిమితి 70 ఏళ్ల వరకు నిర్ణయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సాధారణంగా బీమా వయోపరిమితి 55 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది. కానీ రైతుల కోసం ఈ వయోపరిమితిని 70 ఏళ్ల వరకు పెంచేలా సర్కారు ఎల్ఐసీ వర్గాలతో సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రావతరణ దినోత్సవం రోజున రైతు బీమాను ప్రారంభించాలన్న యోచన మేరకు.. వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు వెంటనే సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. ప్రీమియం ఎక్కువైనా సరే.. రైతు బీమా కోసం ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ బీమా కింద రైతులు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది. సాధారణ మరణం పొందినా, ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదంలో చనిపోయినా ఆయా రైతుల కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందజేస్తారు. సాధారణంగా బీమా వయో పరిమితి 55 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ ‘రైతు బీమా’కింద ప్రత్యేకంగా రైతులకు 70 ఏళ్ల వరకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఎల్ఐసీని కోరనున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రీమియం అధికమైనా సరే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎల్ఐసీకి సూచించనున్నారు. రైతు బీమా అంశంపై ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో ఇదే విషయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. రైతు బీమా ప్రీమియం సగటున రూ.800 నుంచి రూ.1,100 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 58 లక్షల మందికి ప్రయోజనం భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులు ఉన్నట్టు సర్కారు గుర్తించింది. ఆ ప్రకారమే ప్రస్తుతం ‘రైతు బంధు’ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది. ఆ రైతులందరినీ బీమా పరిధిలోకి తీసుకొస్తారు. ఒకవేళ ఎవరైనా రైతులు ఇప్పటికే బీమా సదుపాయం కలిగి ఉంటే, వ్యవసాయ భూమి ఉన్న ఉద్యోగులు బీమా కలిగి ఉంటే.. వారిని ఈ పథకం పరిధిలోంచి మినహాయిస్తారు. ఇక పట్టాదారు పాస్ పుస్తకమున్న 18 ఏళ్లలోపు మైనర్లకు బీమా కల్పించాలా వద్దా అన్న విషయంపై వ్యవసాయశాఖ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఇక 70 ఏళ్లు పైబడిన వారు ఉంటే.. వారికి రైతు బీమా వర్తించదు. ఇప్పుడున్న లెక్క ప్రకారం 58.33 లక్షల మందిలో 58 లక్షల మందికి బీమా ప్రయోజనం అందుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కొక్కరికి సగటున రూ.వెయ్యి ప్రీమియంగా లెక్కిస్తే.. ప్రభుత్వం ఏటా ఎల్ఐసీకి ఏటా రూ.580 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే అర్హుల జాబితా తయారయ్యాక రైతుల సంఖ్య మారే అవకాశముందని చెబుతున్నారు. కాగా ఆత్మహత్య, సాధారణ మరణం ఏదైనా కూడా రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల మేర బీమా పరిహారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితా తయారు చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. కౌలు రైతులకు బీమా ఉండదు రాష్ట్రంలో భూమిలేని కౌలు రైతులు 15 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబీమాను వర్తింపజేస్తున్నందున కౌలు రైతులను ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే రైతుబంధు పథకం కింద కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. దీనితోపాటు రైతు బీమా కూడా అందకుంటే విమర్శలు వచ్చే అవకాశముందన్న చర్చ కూడా జరుగుతోంది. -
టీటీడీ అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల వయోపరిమితిపై ధర్మకర్తల మండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని నిర్ణయించింది. ఎండోమెంట్ యాక్టు ప్రకారం అర్హత గల మిరాశీ, నాన్ మిరాశీ కుటుంబాలకు చెందిన వేద పండితులను ఖాళీ పోస్టుల్లో అర్చకులుగా నియమి స్తామని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. బుధవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్లో మండలి తొలి సమావేశం జరిగింది. మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌లు వివరాలను వెల్లడించారు. ఎజెండాలో పొందుపరిచిన 200 అంశాలపై సభ్యుల ఆమోదం తీసుకోవాల్సి ఉండగా కేవ లం 2 అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపా రు. టీటీడీలో ఉన్న శ్రీవారి కానుకలను బ్యాంకుల్లో డిపాజిట్లు వేసే వ్యవహారంపై మంచీచెడులను విశ్లే షించి తగిన సూచనలు ఇచ్చేందుకు త్వరలో ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. రమణ దీక్షితులుకు నోటీసు మంగళవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీ పాలక మండలి, అధికారులు, ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు నోటీసు జారీ చేస్తున్నామని ఈవో అనిల్ కుమార్‌సింఘాల్ వెల్లడించారు. దీక్షితులు మీడియా ముందు ప్రస్తా వించిన అంశాలపై వివరణ కోరుతున్నామన్నారు. 65 ఏళ్లు పైబడి 16 మంది.. తిరుమలలో మిరాశీ కుటుంబాలకు చెందిన వంశపారంపర్య అర్చకత్వ సేవల్లో 52 మంది ఉన్నారు. ఇందులో 65 ఏళ్ల పైబడిన వారు 16 మంది ఉన్నారు. మార్గదర్శకాలు అమల్లోకి వస్తే వీరి తొల గింపు అనివార్యమవుతుంది. ఆలయ ప్రధానార్చక కుటుంబాలకు చెందిన రమణ దీక్షి తులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస, నారాయణ దీక్షితులు సైతం ఉద్యోగ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది. చట్టబద్ధంగా ఎదుర్కొంటాం: రమణ దీక్షితులు అరవై ఐదేళ్లు దాటిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. వంశ పారంపర్య అర్చకత్వంలో వేలు పెట్టే అధికారం టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న తప్పులను మీడియా ముందు ఎత్తిచూపినందుకే ప్రతీకార చర్యగా టీటీడీ అర్చకుల వయోపరిమితిపై నిర్ణయం తీసుకుందని దీక్షితులు ఆరోపించారు. టీటీడీ అధికారులు అజ్ఞానంతో తీసుకునే నిర్ణయాలపై మాట్లాడాల్సి రావడం బాధగా ఉందంటూ.. అర్చకులకు న్యాయస్థానం కల్పించిన హక్కులను వివరించారు. 1996లో మిరాశీలను రద్దు చేసినప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన విషయాలను ఉటంకించారు. బహు మానాలు, మర్యాదల్లో టీటీడీ వంశపారంపర్య అర్చకులకు ఆటంకం కలిగించ కూడదన్నారు. సంభావన ఏర్పాటుపై కూడా కోర్టు స్పష్టంగా ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు టీటీడీ అర్చకులను ఉద్యోగులుగా చూపుతూ ఉద్యోగ విరమణ వర్తింపజేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. స్వామివారి కైంకర్యాలకు వెళ్లిన అర్చకులను దుర్భాషలాడుతూ, సిబ్బంది చేత అవమానకరంగా మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. -
రైల్వే ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
న్యూఢిల్లీ: బిహార్‌లో నిరసనల నేపథ్యంలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని రైల్వే బోర్డు రెండేళ్లు పెంచింది. తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించేందుకు ఓకే చెప్పింది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, ట్రాక్‌మెన్ తదితర కేటగిరీల్లో దాదాపు 90 వేల ఉద్యోగాల భర్తీకి రైల్వే ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయోపరిమితిని తొలుత రైల్వే బోర్డు జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లుగా (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంది) నిర్ణయించింది. ఆందోళనల నేపథ్యంలో అన్ని కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు పెంచింది. -
శబరిమల ప్రవేశానికి మహిళలకు నిబంధన
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలు ఇకపై వయసు నిర్ధారణ పత్రాన్ని తప్పనిసరిగా తీసుకొని రావాలని ది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) స్పష్టం చేసింది. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు దేవస్థాన ప్రవేశం నిషేధించిన నేపథ్యంలో బోర్డు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఏదైనా వయసు నిర్ధారణ పత్రం లేదా ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందని టీడీబీ చైర్మన్ ఏ. పద్మాకుమార్ తెలిపారు. -
మద్యం సేవించేందుకు వయోపరిమితి
తిరువనంతపురం : మద్యం సేవించేందుకు వయోపరిమితిని పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది కూడా. మద్యం సేవించే యువత సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంతో ఏం ఒరగకపోవచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కాగా, 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రయత్నించగా.. అది కుదరలేదు. దీంతో కేవలం ఫైవ్‌స్టార్ హోటళ్లకు మాత్రమే లైసెన్సులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవటంతో వందలాది పబ్‌లు, బార్లు మూతపడ్డాయి. ఉద్యమకారులు ఆ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ పబ్, బార్ యజమానుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అంతేగాక పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఇప్పుడు ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేరుగా మళ్లీ లైసెన్సులు జారీ చేయటం ప్రారంభించింది. అందులో భాగంగా ముందుగా త్రీస్టార్‌హోటళ్లతోపాటు రిసార్ట్స్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అయితే యువతను కట్టడి చేసేందుకు మాత్రం వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఓ జిమిక్కుగా అభివర్ణిస్తోంది. మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కి.. కంటి తుడుపు చర్యగా వయో పరిమితిని పెంచిందని విమర్శిస్తోంది. -
నిరుద్యోగులకు జెన్కో షాక్
సాక్షి, ప్రొద్దుటూరు : ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. ‘బాబు వస్తే జాబు’ వస్తుందని నినాదాలతో అధికారం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం జెన్కో నోటిఫికేషన్లో వయో పరిమితి కుదించడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. ఏడేళ్ల నుంచి అకౌంట్స్ విభాగంలో జూనియర్ అకౌంట్స్ అఫీసర్ల కోసం ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. ఇటీవల 22 జేఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితో పాటు మరో 4 పోస్టులను బ్యాక్ లాగ్ కింద భర్తీ చేయనుంది. జనరల్ కేటగిరీ వారికి గరిష్ట వయసు అర్హతను 34 ఏళ్లుగా పేర్కొనడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది మార్చిలో అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో గరిష్ట వయో పరిమితి 42 ఏళ్లుగా పేర్కొన్న జెన్కో ఏడు నెలల్లోనే ఏకంగా 8 ఏళ్లు తగ్గించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. చాలా మంది గత కొద్ది రోజులుగా సీఎం, విద్యుత్‌శాఖాధికారులకు, జెన్కో ఉన్నతాధికా రులకు మెయిల్స్, ఫ్యాక్స్‌లు పెడుతున్నారు. ఏడేళ్ల తరువాత వచ్చిన నోటిఫికేషన్‌కు వయసును 42 ఏళ్లకు పొడగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జూనియర్ అసిస్టెంట్(ఎల్డీసీ) ఉద్యోగాలకు జెన్కో నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే ప్రథమం. ఎన్నో ఏళ్లుగా జెన్కోలో ఎల్డీసీ పోస్టులు భర్తీ చేస్తారని ఎదురుచూసిన నిరుద్యోగలకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జెన్కో అధికారులు అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్లు పెంచాలని నిరుద్యోగులు విన్నవిస్తున్నారు. గందరగోళంగా సిలబస్ ఈ పోస్టులకు ఇచ్చిన సిలబస్ కూడా గందరగోళంగా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నాలుగు సెక్షన్లలో వివిధ అంశాలపై పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నాలుగు సెక్షన్లలో దేనికింద ఎన్ని మార్కులు ఉంటాయన్న విషయం నోటిఫికేషన్లో ఇవ్వలేదు. దీంతో కొద్ది సమయంలోనే ఏయే అంశంపై అధిక ప్రాధాన్యం ఇవ్వాలనేది నిర్ణయించుకోలేక పోతున్నారు. సాధారణంగా బ్యాంకు, రైల్వే ఉద్యోగాలకు ఇచ్చే నోటిఫికేషన్‌ల్లో కూడా ప్రతి సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు, ఎన్ని మార్కులు ఉంటాయో స్పష్టంగా పేర్కొంటారు. కానీ ఇందులో సెక్షన్లకు సంబంధించి మార్కులను తెలపక పోవడంపై నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీని బదులు 2010లో విడుదల చేసిన జేఏఓ నోటిఫికేషన్‌లోని సిలబస్‌నే ఉంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. రెండు పరీక్షలు ఒకే రోజు జూనియర్ అసిస్టెంట్(ఎల్డీసీ), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 2 వరకు గడువు విధించారు. వీటికి డిసెంబర్ 30న పరీక్షలు నిర్వహిస్తుండటంతో రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు నష్టపోవాల్సి వస్తోంది. ఏదో ఒక పరీక్షే రాయాల్సి వస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని వారు కోరుతున్నారు. -
జాతీయ పెన్షన్ పథకం: ఒక ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పి ఎస్) లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ పెన్షన్ పథకానికి సంబంధించి వయో పరిమితి 65 సంవత్సరాలకు పెంచింది. ఈ మేరకు పెన్షన్ రెగ్యులేటరీ బోర్డు ఆమోదించిందనీ పిఎఫ్ఆర్డీఏ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. ఇప్పటివరకు ఇది 60 ఏళ్లుగా ఉంది. నేషనల్ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) లో చేరిన ఉన్నత వయస్సు పరిమితి ప్రస్తుత 60 ఏళ్లకు 65 ఏళ్లుగా పెంచిందని సోమవారం ప్రకటించింది. పెన్షన్ రెగ్యులేటర్ బోర్డు ఇప్పటికే సవరణను ఆమోదించిందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డీఏ) ఛైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ ప్రకటించారు. దీనిపై త్వరలోనే నోటిఫై చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 18-60 మధ్య వయసు పరిమితిని తాజా సవరణ ప్రకారం గరిష్టంగా 65 సం.రాలుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇదే లో-కాస్ట్ పెన్షన్ పథకమని చెప్పారు. తాజా సవరణ ద్వారా వేలాదిమందికి లాభం కలిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వయసు చెల్లిన నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలను సులభంగా అందించేందుకు పీఎఫ్ఆర్డీఏ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న 85 శాతం మంది ఉద్యోగులకు కూడా పెన్షన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హేమంత్ వెల్లడించారు. -
‘పదేళ్లు’.. మరో రెండేళ్లు
గరిష్ట వయోపరిమితి సడలింపు మరోసారి పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నిరుద్యోగులకు ప్రయోజనంగా ఉండేందుకు మరో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిర్దేశించిన గరిష్ట వయో పరిమితి 34 ఏళ్లు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూలైలో ప్రభుత్వం ఈ వయో పరిమితిని సడలించింది. అదనంగా పదేళ్లపాటు గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచింది. ఈ వెసులుబాటు ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రకటించింది. 2016 జూలైలో మరో ఏడాది పొడిగించింది. గతనెలలో ఈ గడువు ముగిసింది. దీంతో తాజాగా మరో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై 26 వరకు 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితి పొడిగింపు ఉత్తర్వులు అమలు కానున్నాయి. -
ఈ అవ్వకు 102 ఏళ్లు!
హాయ్ ఫ్రెండ్స్... ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలోని అవ్వ పేరు బోయ సుంకమ్మ. కూడేరు మండలం అంతరగంగ గ్రామానికి చెందిన ఈమె వయసు ఎంతనుకున్నారు... 102 ఏళ్లు! అబ్బో అని ఆశ్చరపోతున్నారా? నిజమేనండీ బాబూ.. ఆ గ్రామస్తులు చెబుతున్నదానిని బట్టి చూస్తే అవ్వకు 102 ఏళ్లు అనేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఇంత వయసు వచ్చిన ఇంకా ఆరోగ్యంగానే ఉన్న ఈ అవ్వకు తోడుగా ఓ మనవడు ఉన్నాడు. అతను కూడా ఉద్యోగరీత్య మరో ప్రాంతానికి వెళ్లి వస్తుంటాడు. ఇక అవ్వకు బీపీ లేదు.. షుగరూ లేదు! ఇక కంటి చూపు సమస్యలంటరా? కళ్లకు అద్దాలు పెట్టుకున్న సందర్భాన్ని తామెన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఇంటి, వంట పనులూ అవ్వనే చేస్తుంటుంది. ఒకరి సాయం లేకుండా నడుస్తుంది. ఇక అవ్వ దగ్గర బోలెడు కథలు వినేందుకు పిల్లలతో పాటు పెద్దలూ ఆసక్తి చూపుతుంటారు. ఇంతకు అవ్వ ఆరోగ్య రహస్యమేమిటంటారా? అయితే ఈ విషయంగా అవ్వనే అడిగితే.. ‘కొర్ర అన్నం, రాగిముద్ద, జొన్న రొట్టెలు ఆహారంగా తీసుకోవడంతో పాటు వయసు పైబడే వరకూ నిరంతర వ్యవసాయ పనులు చేయడమేనని చెబుతున్నారు. ఔరా! భలే అవ్వరా!! అని కితాబునిస్తున్నారా.. అయితే ఓకే. - కూడేరు (ఉరవకొండ) -
వయోపరిమితి పెంచినా ఉపయోగమేదీ?
• రెండేళ్లుగా వయోపరిమితి పెంచుతున్నా.. నోటిఫికేషన్లు లేవు • గ్రూపు–2 మినహా సాధారణ డిగ్రీతో పోస్టులను భర్తీ చేయలేదు • అదనంగా మరో రెండేళ్లు వయోపరిమితి పెంచాలంటున్న నిరుద్యోగులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులకు వయో పరిమితి తంటాలు తప్పడం లేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత సాధారణ డిగ్రీతో భర్తీ చేసే గ్రూప్–2 మినహా మరే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాలేదు.దాదాపు 5లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇంతవరకు మోక్షం లభించలేదు. ప్రస్తుతం డిసెంబరు నెలాఖరు వచ్చేసింది. అయినా నోటిఫికేషన్లు జారీ కాలేదు. దీంతో ప్రభుత్వం 2015 నుంచి పెంచుతూ వచ్చిన గరిష్ట వయో పరిమితి ప్రయోజనం లక్షల మందికి అంద కుండా పోతోంది. గతంలోనూ పెద్దగా ఉద్యో గాల భర్తీ లేనందున 2015లో తెలంగాణ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచింది. దీంతో 2015 జూలై 1 నాటికి 44 ఏళ్లు ఉన్న వారికి కూడా అవకాశం వచ్చింది కానీ టీచర్ పోస్టుల భర్తీకి, గ్రూప్–1, గ్రూప్–3, గ్రూప్–4 వంటి నోటిఫికేషన్లు ఆ సంవత్సరంలో వెలువడలేదు. దీంతో జనరల్ అభ్యర్థులకు వయోపరిమితి పెంచినా ఆ ప్రయోజనం చేకూరలేదు. ఇక 2016 జూలైలో నూ ఆ పదేళ్ల వయోపరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ జీవో 264ను జారీ చేసింది. కానీ గ్రూప్–2 మినహా సాధారణ డిగ్రీతో భర్తీ చేసే గ్రూప్–1,3,4 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కాలేదు. అలాగే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాదిలో నూ లక్షల మందికి వయో పరిమితి పెంపు ప్రయోజనం చేకూరని పరిస్థితి. టీచర్ పోస్టుల భర్తీకోసం ఎదురుచూస్తున్న వారిలో దాదాపు లక్ష మంది 43, 44 ఏళ్లు వయస్సు ఉన్న వారు ఉంటారని, గ్రూప్–1, గ్రూప్–3, గ్రూప్–4 కోసం ఎదురుచూస్తున్న వారిలోనూ అలాంటి వారు మరో లక్ష వరకు ఉంటారని అంచనా. దీంతో వారందరికి గరిష్ట వయో పరిమితి పెంపు ప్రయోజనం చేకూరని పరిస్థితి నెలకొందని నిరుద్యోగులు వాపోతు న్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందిం చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే నెలాఖరు, లేదా ఫిబ్రవరిలో పాఠశాలల్లో టీచర్, గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పదేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపును మరో రెండేళ్లు కలిపి 12 ఏళ్లకు పెంచాలని, అప్పుడే నష్టపోయిన తమకు ప్రయోజనం చేకూరు తుందని కోరుతున్నారు. సీఎం కేసీఆర్‌కు విజ్ఞాపనలు ఈ పరిస్థితుల నేపథ్యంలో గరిష్ట వయో పరిమితి 12 ఏళ్లకు పెంచాలని, త్వరలో జారీ చేసే నోటిఫికేషన్లలో 46 ఏళ్ల వయసు వరకు అనుమతించాలని నిరుద్యోగులు కోరుతు న్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞాపనలు అందజేశారు. ప్రభుత్వం పదే ఏళ్లు గరిష్ట వయోపరిమితి పెంచినా, నోటిఫి కేషన్లు జారీ కాకపోవడంతో ఆ ప్రయో జనం చేకూరలేదని నిరుద్యోగులు చెబుతున్నారు. కేలండర్ ఇయర్‌కే కటాఫ్ టీఎస్పీఎస్సీ వంటి ఉద్యోగ నియా మక ఏజెన్సీలు ఏ నోటిఫికేషన్‌ను కేలండర్ ఇయర్లో ఎప్పుడు జారీ చేసినా గరిష్ట వయోపరిమితిని ఆ సంవత్సరపు జూలై 1వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించి నోటిఫికే షన్లు ఇస్తాయి. అంటే ఒక కేలండర్ ఇయర్ లోని జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చినా, డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చినా ఆ సంవ త్సరపు జూలై 1నే వయోపరిమితి కటాఫ్ తేదీగా పరిగణనలోకి తీసుకుంటారు. సద రు కేలండర్ ఇయర్‌లోని డిసెంబర్ దాటితే కనుక ఆ కటాఫ్ తేదీ మారిపోతుంది. దీంతో కటాఫ్ తేదీ ప్రకారం గరిష్ట వయోపరిమితి కలిగిన వారందరికీ అన్యాయం తప్పదు. -
పెళ్లి ఘడియలు వచ్చాయా?
నటి అనుష్కకు కల్యాణ ఘడియలు తోసుకొస్తున్నాయా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే హీరోలకు ఏజ్ బార్ అవుతున్నా వారి పెళ్లిళ్ల గురించి మీడియా పెద్దగా పట్టించుకోదుగానీ, హీరోరుున్లకు మూడు పదుల వయసు రాగానే పెళ్లెప్పుడు, ప్రేమ వివాహమా? పెద్దలు నిశ్చరుుంచిన పెళ్లా అంటూ విలేకరుల నుంచి, పరిశ్రమకు చెందిన వారి వరకూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. ఇక వందతుల పర్వం సరే సరి. అరుుతే వదంతుల్లో కొంత నిజం ఉంటుందనే వారి భావనను పరిగణలోకి తీసుకోకుండా ఉండలేం. కాగా దక్షిణాదిలో మూడు పదుల వయసు దాటిన వారిలో ముఖ్యంగా నయనతార, త్రిష, అనుష్కల గురించి ప్రచారం చాలానే జరుగుతోంది. నటి త్రిష మూడున్నర దశాబ్దాల వయసుకు చేరుకున్నారు. ఈమె ఆ మధ్య పెళ్లికి సిద్ధమై నిర్మాత వరుణ్ మణియన్‌తో వివాహ నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.అరుుతే పెళ్లిని మాత్రం రద్దు చేసుకున్నారు. ఇప్పుడు తనకు పెళ్లి ఆలోచన లేదని స్పష్టంగా చెబుతున్నారు.నటి నయనతార విషయానికి వస్తే ప్రేమ, పెళ్లి విషయాల్లో ఈమె చాలా సంచలనాలనే సృష్టించారు.శింబుతో ప్రేమాయణం వివాదాలతో ముగిసింది.ప్రభుదేవాతో పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోరుుంది.తాజాగా యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమ కలాపాలను సోషల్ మీడియా హాట్‌గానే ప్రచారం చేస్తోంది.ఇక పెళ్లి చేసుకునే విషయం గురించి ఆ లవ్బర్డ్సగా ప్రచారంలో ఉన్న వారిద్దరే చెప్పాల్సి ఉంటుంది. ఇక నటి అనుష్క విషయానికి వస్తే నయనతార, త్రిషల కంటే రీల్ ఏజ్ తక్కువే అరుునా, రియల్ ఏజ్ కాస్త ఎక్కువే. ఇటీవలే 36వ పుట్టిన రోజును జరుపుకున్న అనుష్క పెళ్లి వార్తలు చాలా కాలం వదంతుల రూపంలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ యోగా సుందరి పెళ్లి గురించి వార్తలు ప్రచారం అవుతున్నారుు.అనుష్కకు పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.వచ్చే ఏడాది అనుష్కకు పీపీపీ..డుండుండుం ఖాయం అంటున్నారు.అందుకే అనుష్క కొత్తగా చిత్రాలేమీ ఒప్పుకోవడం లేదని చిత్ర వర్గాల టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ సూర్యతో ఎస్ 3 చిత్రాన్ని పూర్తి చేసి బాహుబలి 2, తెలుగులో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస కథా చిత్రం నమో వెంకటేశాయ చిత్రంలో నటిస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త
విజయవాడ: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. అర్హత వయస్సును 42ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. అన్ని ఉద్యోగాల ప్రవేశ పరీక్షలకు (ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల నోటిఫికేషన్లు) ఈ వయో పరిమితి పెంపు ఉత్తర్వులు వర్తించనున్నాయి. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు.. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచారు. 2017 సెప్టెంబర్ 30వ తేదీ వరకు భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే ఈ పరిమితి వర్తించనుంది. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఏలూరు అర్బన్ : పట్టాలు దాటుతుండగా, ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు గ్రామానికి చెందిన దత్తి శ్రీను (55) చాలా కాలంగా భార్యాబిడ్డలకు దూరంగా ఏలూరులో ఒంటరిగా జీవిస్తున్నాడు. తాపీ పనులు చేసుకుంటూ స్థానిక పవర్‌పేట రైల్వే స్టేషన్లోనే కాలం వెళ్లబుచ్చుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీను గురువారం రాత్రి స్థానిక శ్రీనివాసా థియేటర్ సమీపంలో పట్టాలు దాటుతుండగా సత్రాగంజ్‌సికింద్రాబాద్ రైలు ప్రమాదవశాత్తూ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి. జాన్సన్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతుని జేబులో లభించిన ఫోన్ బుక్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
భట్లమగుటూరు (పెనుమంట్ర) : పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మార్టేరు నుంచి పెనుమంట్ర వైపు వెళ్తున్న ఆటోలో ఆచంటకు చెందిన పలువురు మహిళలు వెళ్తున్నారు. భట్లమగుటూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న మినీలారీ ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ఉన్న ఆచంటకు చెందిన కె.సీత, ఎం.చిట్టి సుందరమ్మ(55)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిట్టిసుందరమ్మæ మృతి చెందింది. ఇదే ప్రమాదంలో మరో నలుగురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆటో దెబ్బతింది. మినీలారీ డ్రైవర్ కునికిపాట్లు పడడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పెనుమంట్ర ఎస్ఐ జి.జె.ప్రసాద్ తెలిపారు. -
వయోపరిమితి పెంపు మరో ఏడాది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పెంచిన (34 ఏళ్ల నుంచి 40 ఏళ్లు) వయోపరిమితి గడువును మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈమేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ సోమవారం జీవో నంబర్ 381ను జారీచేసింది. దీంతో వయోపరిమితి గడువు పెంపు 2017 సెప్టెంబర్ 30 వరకూ అమల్లో ఉంటుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గత కొన్నేళ్లుగా నిలిచిపోవడంతో ఉద్యోగార్హత కోల్పోతామని, వయోపరిమితి గడువు పెంచాలని లక్షలాది మంది నిరుద్యోగులు గతంలో ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచారు. ఆ పెంపు రెండేళ్లు అమల్లో ఉండేలా 2014 సెప్టెంబర్ 23న జీవో 295 విడుదలైంది. ఆ జీవో గడువు 2016 సెప్టెంబర్ 30తో ముగిసింది. దీనిపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విడుదలను పెండిం గ్లో పెట్టి వయోపరిమితి పెంపు జీవో పొడిగింపుపై స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ వయోపరిమితి పెంపును మరో ఏడాది అమలయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. ఇలా ఉండగా వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఏడీఈ మృతి
వర్ధన్నపేట టౌన్ (వరంగల్) : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆకేరు వాగు బ్రిడ్జిపై ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టగా గాయపడిన ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రాంతానికి చెందిన ధూళిపాల జగన్మోహన్రావు (55) అక్కడ విద్యుత్ సంస్థలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఏలూరు నుంచి భార్య రోహిణి, కుమారుడు జయకృష్ణతో కలిసి కారులో సిద్ధిపేటలోని బంధువుల ఇంటికి బయల్దేరారు. జయకృష్ణ కారు నడుపుతున్న క్రమంలో వర్ధన్నపేట ఆకేరువాగు బ్రిడ్జిపై అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారు నుజ్జునుజ్జయి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా జగన్మోహన్రావు కొంతసేపటికే మృతిచెందారు. అతడి కుమారుడు జయకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. జగన్మోహన్రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శనివారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జగన్మోహన్రావు భార్యకు గుండె జబ్బు ఉండటంతో ఆయన మరణించిన విషయాన్ని ఆమెకు తెలియజేయలేదు. తండ్రికి తలకొరివి పెట్టాల్సిన తనయుడి పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. -
ఏపీ నిరుద్యోగుల మహాగర్జన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో చేపట్టనున్న పోలీస్ రిక్రూట్మెంట్లో అభ్యర్థుల వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం జరుగుతున్న ఏపీ నిరుద్యోగ మహగర్జనలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఐదేళ్ల వయోపరిమితి ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య గరిష్టంగా పెంచాలని, ఎస్సై పోస్టులను 1,500 చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించనుండటంతో..అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పాముకాటుకు బాలిక మృతి
బుట్టాయగూడెం : పాముకాటుకు ఓ బాలిక దుర్మరణం పాలైన ఘటన బుట్టాయగూడెం మండలం ఉప్పరిల్ల గ్రామ సమీపంలోని అడ్డమెట్ట కొండరెడ్డి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పట్ల మంగప్రియ(8) బుధవారం ఉదయం పాముకాటుకు గురైంది. ఏదో కరిచిందని బాలిక ఏడుస్తుంటే తల్లి విజయలక్ష్మి ఆమెను పట్టించుకోలేదు. బాలికను కొట్టి బుట్టాయగూడెం వెళ్లిపోయింది. తిరిగి వచ్చి చూసేసరికి పాప నురగలు కక్కుకుని మరణించింది. ఈ ఘటన గురించి తెలుసుకుని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో వంశీలాల్ రాథోడ్ ఆ గ్రామం వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులు ఇంకా మూడనమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్నారని, మంగప్రియను పాము కాటు వేస్తే తల్లి గమనించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గిరిజనులకు ఆరోగ్యం, ప్రమాదాలు, ఆస్పత్రుల్లో అందిస్తున్న సేవల గురించి కళాజాతాల ద్వారా అవగాహన కల్పిస్తామని వివరించారు. -
కానిస్టేబుల్ అభ్యర్థుల వయో పరిమితి పెంచాలి
ఉప ముఖ్యమంత్రికి విన్నవించిన వైఎస్సార్‌ఎస్‌యూ అనంతపురం ఎడ్యుకేషన్ : కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని కలిసి శనివారం వినతిపత్రం అందించారు. నాయకులు మాట్లాడుతూ వయో పరిమితి 22 ఏళ్లకు కుదించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోతారన్నారు. తెలంగాణలో 25 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి,అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచినా ఏ ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పించలేదన్నారు. అన్ని శాఖల్లోనూ దాదాపు లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. సలాంబాబు, ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, ప్రధానకార్యదర్శులు బాబాసలాం, రాఘవేంద్రరెడ్డి, సుధీర్‌రెడ్డి, చంద్రశేఖర్, ఎస్కేయూ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, క్రాంతికిరణ్, శ్రీనివాసరెడ్డి, మోహన్, గోకుల్ తదితరులు ఉన్నారు. -
మద్యం దుకాణం వద్ద గలాటా.. వ్యక్తి మృతి
ములపర్రు (పెనుగొండ) : పాతకక్షల నేపథ్యంలో ములపర్రు గ్రామంలో మద్యం దుకాణం వద్ద జరిగిన గలాటాలో ఓ వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం.. కొల్లి ఆశీర్వాదం(55), వడ్లపాటి ల క్ష్మణరావు మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కొల్లి ఆశీర్వాదం ములపర్రు మద్యం దుకాణం వద్ద మద్యం సేవిస్తుండగా లక్ష్మణరావు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు ఆశీర్వాదంను కాకినాడ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. -
చిన్న వయసులోనే పెద్ద కష్టం
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య వీధిన పడిన కుటుంబం జనగామ రూరల్ : 25 ఏళ్లకే నూరేళ్లు నిండాయి ఈ రైతుకు. తల్లిదండ్రుల నుంచి తనకు వచ్చిన రెండెకరాల్లో సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన కొత్తపల్లి భాస్కర్(25) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు రెండెకరాల భూమి తో పాటు ఉమ్మడి కుటుంబంలో చేసిన అప్పులో భాస్కర్ వాటాకు వచ్చిన రూ.3 లక్షల అప్పు కూడా ఉంది. అయితే రెండేళ్లుగా సరైన దిగుబడి లేక, అప్పు తీర్చే మార్గం లేక మనో వేదనకు గురవుతున్నాడు. వ్యవసాయం కాకుండా వేరే పని చేసుకుందామని కొన్ని రోజుల క్రితం కుటుంబంతో జనగామ వస్తే అక్కడా భం గపాటే ఎదురైంది. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. రెండేళ్ల క్రితమే పెళ్లయిన భాస్కర్‌కు భార్య మహాలక్ష్మి, ఆరునెలల కూతురు ఉన్నారు. ఇప్పుడు వారిద్దరూ వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. -
‘పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచాలి’
ఏలూరు: పోలీసు నియామకాల్లో వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమకు అన్యాయం జరిగిందని.. తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా నియామకాల్లో ఐదేళ్లు సడలింపు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకన్న నిరుద్యోగులు వయోపరిమితి పెంచాలని నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు అభ్యర్థులు అదుపులోకి తీసుకున్నారు. -
రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
భీమవరం టౌన్ : నాగర్సోల్–నర్సాపురం రైలు ఎస్–5 కోచ్‌లో మంగళవారం ప్రయాణిస్తూ అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. భీమవరం జీఆర్పీ ఎస్సై జి.ప్రభాకర్ కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తిని నర్సాపురం రైల్వే స్టేషన్లో ఉన్న పుష్కర వైద్య శిబిరం బృందం 108 అంబులెన్సులో నర్సాపురం ప్రభుత్వాస్పత్రికి పంపించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండొచ్చు. ఎత్తు 5.6 అడుగులు, నలుపు రంగులో ఉన్నాడు. ముక్కుపొడి రంగు ఫ్యాంటు, క్రీమ కలర్ చొక్కా ధరించి ఉన్నాడు. -
బస్సు ఢీకొని పెరవలి ఏఎస్సై మృతి
పెరవలి : ఓ ప్రయివేటు బస్సు ఢీకొన్న ఘటనలో పెరవలి హైవే పెట్రోలింగ్ ఏఎస్సై జొన్నాడ ధనరాజ్(59) అక్కడికక్కడే మతిచెందారు. పెరవలి అభయాంజనేయస్వామి సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైవే పెట్రోలింగ్ డ్యూటీలో రాత్రి 11 గంటలకు ధనరాజ్ అన్నవరప్పాడు నుంచి జీప్‌లో బయలు దేరి పెరవలి సెంటర్‌కు వచ్చారు. కారును రోడ్డు పక్క నిలుపుదల చేసి రోడ్డుకి రెండో వైపున ఉన్న బీట్ కానిస్టేబుళ్లకు సూచనలు ఇచ్చేందుకు రోడ్డు దాటుతున్నారు. ఇదే సమయంలో వేగంగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ధనరాజ్‌ను ఢీకొంది. ధనరాజ్ 50 మీటర్లు ఎగిరి పడడంతో తల నేలకు గుద్దుకుని అక్కడికక్కడే మృతి చెందారు. బస్సును నిలుపుదల చేయకుండా వేగంగా వెళ్లిపోవడంతో కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు తణుకు సమీపంలో పోలీసులు బస్సును పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రయాణికులను వేరే బస్సులో పంపించేశారు. పెరవలి ఎస్సై నాగరాజు, తణుకు సీఐ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బస్సు వచ్చి ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్ డ్రై వర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధనరాజ్ భార్య మంగతాయారు భర్త మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. మరో ఏడాదిలో ఉద్యోగం నుంచి రిటైరై హాయిగా విశ్రాంతి తీసుకుందామనకుంటుండగా మృత్యువు కబళించిందని ఆమె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. 1979లో ఉద్యోగంలో చేరిన ధనరాజ్ పెనుమంట్ర గ్రామానికి చెందిన ధనరాజ్ 1980లో కానిస్టేబుల్‌గా నరసాపురం టౌన్‌స్టేషన్‌లో తన తొలి పోస్టింగ్ పొందారు. ఈయనకు భార్య మంగతాయారుతో పాటు కుమారుడు రామాంజనేయులు, కుమార్తె ధరణి ఉన్నారు. కుమార్తెకు మూడేళ్ల క్రితం వివాహం చేశారు. కుమారుడు దుబాయ్‌లో ఉంటున్నాడు. ధనరాజ్ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఏఎస్సై స్థాయికి చేరుకున్నారు. -
అది మంచి పరిణామం
అండర్-19 ప్రపంచకప్‌లో ఎవరైనా ఒక్కసారి మాత్రమే పాల్గొనేలా బీసీసీఐ నిబంధన విధించడం మంచి పరిణామమని భారత ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయ పడ్డారు. తప్పుడు వయో ధ్రువీకరణ పత్రాలతో ఎక్కువ కాలం అండర్-19 స్థాయిలోనే ఆడుతున్నవారిని దీని ద్వారా నిరోధించే అవకాశం ఉందని ఆయన అన్నారు. కుర్రాళ్లనుంచి ఫలితాలు ఆశించడం కంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించడం ముఖ్యమని, అందు కోసం ఈ వయో విభాగంలో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను సిద్ధంగా ఉంచాలని ద్రవిడ్ సూచించారు. -
పదేళ్లకే 192 కిలోల బరువు...
ప్రపంచంలోనే అత్యంత బరువు ఉన్న బాలుడిగా రికార్డుల్లోకెక్కిన ఆర్య పర్మానా(10) తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. వయస్సుకు తగ్గ బరువుకన్నా మరీ అధికంగా ఉండటంతో బాలుడి ప్రాణానికేమైనా ప్రమాదముందేమోనని బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పదేళ్లకే 192 కిలోల బరువు పెరగడంతో బాలుడికి వేయడానికి దుస్తులు కూడా లభించడం లేదు. దీంతో లుంగిలాంటి వస్త్రాలనే ధరిస్తున్నాడు. 'ఆర్య రోజుకు ఐదుసార్లు ఆహారం తీసుకుంటాడు. అన్నం, బీఫ్, చేపలు, కూరగాయల సూప్ వంటివి ఎక్కువగా తింటాడని' తల్లి రోకయ తెలిపింది. రోకయ(35)కి ఆర్య రెండో సంతానం. తండ్రి సోమంత్రి(45) వ్యవసాయం చేస్తూ కుటుంబపోషణ చూసుకుంటున్నాడు. ఇండోనేషియాలోని పశ్చిమ జవ ప్రావిన్స్‌కు చెందిన ఆర్య ఊబకాయంతో నడవడం ఇబ్బందికరంగా మారడంతో ఆఖరికి స్కూల్‌కి కూడా వెళ్లడం లేదని అతని తల్లి రోకయ తెలిపింది. బాలుడు నిరంతరం ఆకలితోనే ఉంటాడని ..దీంతో చేసేదేమీలేక బరువు తగ్గడం కోసం క్రాష్ డ్రైటింగ్లో భాగంగా ఆర్యకు బ్రౌన్ రైస్‌ను మాత్రమే పెడుతూ, రోజువారి ఆహారంలో కోత పెడుతున్నామని తల్లిదండ్రులు తెలిపారు. 'నార్మల్ డెలివరీ ద్వారానే జన్మించిన ఆర్య పుట్టినప్పుడు మాములుగానే 3.8 కిలోలతో జన్మించాడు. కానీ, రెండేళ్లు పూర్తవగానే ఆర్య బరువు అసాధారణంగా పెరగడం ప్రారంభమైంది. మొదటి కుమారుడు ఆర్దీ కన్నా ఆర్యనే బరువు ఎక్కువ...గ్రామంలో కూడా మిగతా పిల్లలకన్నా ఎక్కువ బరువున్నా ఏమీ కాదులే అనుకున్నాం. కానీ, ఏకంగా మరీ ఎక్కువ బరువు పెరగడంతో ఆందోళన మొదలైంది. ఆర్యను మా గ్రామం సిపువార్సిలోని చాలా మంది వైద్యుల దగ్గరికి తీసుకు వెళ్లాం. కానీ, వారందరూ ఆర్య ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పారు. అవసరం అనుకుంటే మెరుగైన వైద్యం కోసం పట్నం లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు' అని తండ్రి సోమంత్రి తెలిపారు. 'ఆర్య ఎప్పుడూ అలసిపోయినట్టు ఉంటాడు. నడవలేకపోతున్నాను, నడుస్తుంటే ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అంటూంటాడు. తినడం పడుకోవడం మాత్రమే చేస్తాడు. ఇవి రెండు కాకుండా బాత్ టబ్‌లో దూకి గంటలకొద్ది అందులోనే ఉంటాడు. ఇద్దరు పెద్దవాళ్లు ఒక పూటకు తినే ఆహారాన్ని అతను ఒకేసారి తింటాడు. ఆర్య అలా ఇబ్బందిపడుతుంటే తట్టుకోలేక పోతున్నాం. నా కుమారుడు అందరిలా స్కూల్‌కు వెళ్లి తొటి విద్యార్థులతో చదువుకుంటూ, ఆటల్లో కూడా ముందుండాలని కోరుకుంటున్నా' అని తల్లి రోకయ ఆవేదనతో ఆంటోంది. 'నేను ఒక సాధారణమైన రైతును. నా స్తోమతకు మించి బాబును పెద్ద ఆసుపత్రుల్లో చూపించాను. అప్పు తెచ్చిన డబ్బుతో వాడి ఆకలి తీర్చుతున్నానని వాడికోసం నాకు చేతనైనంత చేసి అలసిపోయాను. ఖరీదైన ఆసుపత్రుల్లో వైద్యం అందించలేకపోతున్నాను..కానీ, నా కుమారుడు తప్పకుండా ఏదో ఒకరోజు అందరిలానే మామూలువాడిలా అవుతాడని ఆశిస్తున్నాను అని' తండ్రి సోమంత్రి అంటున్నాడు. -
మారణాయుధాలను విక్రయిస్తున్న అమెజాన్!
మారణాయుధాల అమ్మకాలపై ఆంక్షలు ఉండగా.. వాటిని పట్టించుకోకుండా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ విచ్చలవిడిగా కత్తులను అమ్ముతున్నట్టు తేలింది. 18 ఏళ్ల వయస్సు నిండిన వారికి మాత్రమే పలు ఆంక్షలతో కత్తుల వంటి మారణాయుధాలు అమ్మాల్సి ఉంటుంది. కానీ, అమెజాన్ మాత్రం బ్రిటన్‌లో ఓ 16 ఏళ్ల బాలుడికి పెద్ద కత్తిని అమ్మింది. మడుచుకోవడానికి వీలుండి.. 8.5 సెంటీమీటర్ల పొడవు బ్లేడ్ ఉన్న కత్తిని ఆ బాలుడు 40 పౌండ్లకు అమెజాన్‌లో కొనుగోలు చేశాడు. ఆ కత్తితో స్కూలుకు వెళ్లిన అతను సహచర విద్యార్థిని పొడిచి చంపాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఈ కేసులో నిందితుడైన బాలుడిపై హత్య అభియోగాలను కోర్టు ఎత్తివేసినప్పటికీ, మృతికి కారణమైన అభియోగాలతో అతన్ని విచారించాలని నిర్ణయించింది. 18 ఏళ్ల లోపు ఉన్నవారికి మూడు అంగుళాల కన్నా పొడవు ఉన్న కత్తిని అమ్మడం బ్రిటన్‌లో చట్టవిరుద్ధం. అయితే ఆ బాలుడు మాత్రం తాను మేజర్ అని పేర్కొంటూ అమెజాన్‌లో కత్తిని కొనుగోలు చేశాడు. అతని వయస్సు నిర్ధారించుకోకుండానే అమెజాన్ అతడికి కత్తిని డెలివరీ చేసింది. తన వయస్సు గురించి ఆరా తీయకుండా ఉండేందుకు ఆ బాలుడు తెలివిగా డెలివరీని ఇక్కడ ఉంచి వెళ్లండి అంటూ తన ఇంటి డోర్‌కు ఓ లేఖను అంటించాడు. డెలవరీ బాయ్ అదేవిధంగా చేయడంతో అక్రమంగా కొనుగోలుచేసిన కత్తితో అతడు ఘాతుకానికి ఒడిగట్టాడు. తాజాగా గార్డియన్ పత్రిక తమ ఆపరేషన్‌లో భాగంగా ఓ ఇంటి చిరునామాతో అమెజాన్‌లో కత్తిని ఆర్డర్ చేసి.. ఆ బాలుడి మాదిరిగా ఆ ఇంటి డోర్‌కు ఓ లేఖను అంటించింది. ఆ లేఖ ప్రకారం కత్తిని డెలివరీ బాయ్ ఆ చిరునామాలో వదిలేసి వెళ్లాడు. దీంతో కత్తుల వంటి మారణాయుధాల అమ్మకాల్లో అమెజాన్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదని, పిల్లలకు విచ్చలవిడిగా మారణాయుధాలు అమ్ముతున్నదని తాజా ఉదంతం రుజువు చేస్తున్నదని గార్డియన్ పత్రిక వ్యాఖ్యానించింది. -
మరో ఏడాది వయోపరిమితి సడలింపు
కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు వర్తింపు సాక్షి, హైదరాబాద్: పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితి మరో ఏడాది పెంచుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు పోస్టులకు సంబంధించి ఇప్పటికే మూడేళ్లు వయో పరిమితి సడలించిన ప్రభుత్వం... తాజాగా మరో ఏడాది పెంచింది. దీంతో జనరల్ కేటగిరీలో 26 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు కూడా నిబంధనలను అనుసరించి ఈ వయోపరిమితి వర్తిస్తుంది. కమ్యూనికేషన్ విభాగంలో మొత్తం 332 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రభుత్వం గతంలో సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు వయో పరిమితిని ఏడాది పెంచిన విషయం తెలిసిందే. తాజాగా కమ్యూనికేషన్ విభాగంలోని పోస్టులకూ దానిని వర్తింపజేశారు. -
సివిల్ సర్వీసెస్ వయోపరిమితి కుదింపు?
♦ జనరల్ అభ్యర్థులకు 32 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు తగ్గింపు ♦ ఎప్పట్నుంచి వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత లేమి సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చేదువార్త! ఇప్పటివరకు జనరల్ అభ్యర్థులకు ఉన్న 32 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లకు కుదించింది. ఈ మేరకు గురువారం upsc.govt.in వెబ్సైట్లో ఓవర్వ్యూ ఆఫ్ సివిల్ సర్వీసెస్ కేటగిరీ కింద వయోపరిమితి అంశంలో దీన్ని పొందుపరిచింది. అయితే ఈ కుదింపు ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందన్న విషయాన్ని అందులో తెలపలేదు. 2015 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి (జనరల్)ను 32 ఏళ్లుగా పేర్కొంది. మరోవైపు 2016లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల టైం టేబుల్లో.. వచ్చే ఏప్రిల్ 23న సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేస్తామని యూపీఎస్సీ ప్రకటించింది. మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 7న ప్రిలిమ్స్, డిసెంబర్ 3 నుంచి ఐదురోజుల పాటు మెయిన్ పరీక్షలు ఉంటాయని వివరించింది. అయితే ఈ వయోపరిమితి కుదింపు ఏప్రిల్ 23న జారీ కాబోయే సివిల్స్ నోటిఫికేషన్‌కు వర్తిస్తుందా లేదా అన్నది యూపీఎస్సీ తన వెబ్సైట్లో ఎక్కడా తెలపలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో చేరి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తీవ్ర ఆవేదన లో పడ్డారు. -
రాతియుగం నుంచి ప్లాస్టిక్ యుగానికి..
పాత రాతి యుగం.. కొత్త రాతి యుగం.. ఇలాంటి దశల నుంచి క్రమంగా మనం ప్లాస్టిక్ యుగం వైపు వెళ్లిపోతున్నామట. దీని గురించి పరిశోధకులు మానవాళిని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ అంత తొందరగా నశించకపోవడం, భూమిలో కలవకపోవడం వల్ల భూగ్రహంపై తీవ్ర ప్రభావం, అది కూడా దీర్ఘ కాలం పాటు చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్వత శిఖరాల నుంచి సముద్ర అంతర్భాగాల వరకు ఎక్కడ చూసినా ప్లాస్లిక్ కనపడుతోందని, భవిష్యత్తుకు ఇది చాలా ముప్పుగా పరిణమిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన జియాలజీ శాఖలోని పాలియోబయాలజీ ప్రొఫెసర్ జాన్ జలాసియావిజ్ హెచ్చరించారు. ప్రతి మూడేళ్లకు వంద కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారుచేస్తున్నామని, ఇది మొత్తం భూమ్మీద ఒక పొరలా వేసేందుకు సరిపడ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ శతాబ్ది మధ్యనాటికి అలాంటి పొరలు చాలా ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. సముద్రాల్లో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా దూరం పాటు ప్రయాణిస్తాయని, మధ్యలో ఏమాత్రం పాడవ్వవని, చివరకు ఏదో ఒక బీచ్‌లో అవి తేలుతాయని వివరించారు. వీటివల్ల జలచరాలకు కూడా తీవ్ర స్థాయిలో ముప్పు ఉంటుందన్నారు. -
ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులకు వయోపరిమితి పెంపు లేదా?
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయో పరిమితి సమస్య వచ్చి పడింది. ఎస్సై, కానిస్టేబుల్ వంటి యూనిఫాం పోస్టులకు గరిష్ట వయోపరిమితిపై మూడేళ్ల సడలింపు ఇచ్చిన ప్రభుత్వం ఎక్సైజ్ ఎస్ఐ పోస్టుల విషయంలో ఇవ్వలేదు. ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి గరిష్ట వయోపరిమితి సడలింపు కోసం ప్రతిపాదనలు అందకపోవడం వల్లే ప్రభుత్వం ఇవ్వలేదని సమాచారం. ఫలితంగా ఇటీవల టీఎస్పీఎస్సీ జారీ చేసిన గ్రూపు-2 పోస్టుల నోటిఫికేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లుగానే పేర్కొంది. దీంతో తమకు అన్యాయం జరుగుతుందని అనేక మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ ఎస్ఐ పోస్టుల భర్తీకి ఆరేళ్ల తరువాత చర్యలు చేపట్టినా సంబంధిత శాఖ వయో పరిమితి పెంపును పట్టించుకోలేదని, అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తే ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉండేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008, 2009 తరువాత ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులను భర్తీ చేయలేదు. -
సర్కార్‌కు రెండేళ్ల పిల్లాడి సవాల్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో నర్సరీలో ప్రవేశాల కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కనీస వయసు పరిమితిని విధించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రాథమిక విద్యలో భాగమైన ప్రి-స్కూల్లో ప్రవేశాల కోసం నాలుగేళ్లు, ప్రైమరీ స్కూల్‌కి ఐదేళ్లు, ఒకటో తరగతికి ఆరేళ్లు కనీస వయస్సుగా నిర్ధారిస్తూ ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) డిసెంబర్ 18న సర్క్యులర్ జారీచేసింది. జనవరి 1 నుంచి 22 తేదీ వరకు హస్తినలో ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెండున్నరేళ్ల బాలుడు ఉదయ్‌ప్రతాప్ సింగ్ కపూర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాలుడి తరఫున న్యాయవాది అఖిల్ సచార్ వాదనలు వినిపిస్తూ డీవోఈ జారీచేసిన సర్క్యులర్‌ను కొట్టివేయాలని, ఈ సర్క్యులర్ వల్ల 2017 వరకు తన క్లయింట్ ప్రి-స్కూల్లో ప్రవేశం పొందే అవకాశం ఉండదని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా మార్చి 31లోపు మూడేళ్ల వయస్సు పూర్తి చేసుకోని పిల్లలకు కూడా ప్రి-స్కూల్లో అడ్మిషన్స్ పొందకుండా ఈ సర్క్యులర్ అడ్డుకుంటోందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ రాజీవ్ శక్ధర్ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వం, డీవోఈ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసులు జారీచేసింది. పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. -
16 ఏళ్ల పిల్లలు సోషల్ వెబ్సైట్లు ఉపయోగించాలంటే..
బ్రసెల్స్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్‌చాట్ లాంటి సామాజిక వెబ్సైట్లను 16 ఏళ్ల లోపు పిల్లలు ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ యూరోపియన్ యూనియన్ తాజా ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రస్తుతం యూరప్ దేశాల్లో 13 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక వెబ్సైట్లను ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరే అని చట్టం అమల్లో ఉంది. ఈ చట్టంలో పేర్కొన్న పిల్లల వయస్సును 13 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు పెంచాలన్నది తాజా ప్రతిపాదన. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అతుతున్నప్పటికీ ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న వారి వాదన ఇలా ఉంది...... 1. ఇప్పటికే 13 ఏళ్ల నిబంధన వల్ల యూరప్ దేశాల్లో పిల్లలు విద్యలో, మానసిక వికాసంలో పాశ్చాత్య దేశాల పిల్లలకన్నా వెనకబడి ఉన్నారు. 2. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇప్పటికే ఎంతో మంది పిల్లలు సోషల్ వెబ్సైట్లను ఉపయోగిస్తున్నారు. కొన్ని సార్లు ఏజ్‌ను తప్పుగా చూపిస్తున్నారు. 3. ఇప్పుడు ఏజ్ పెంచినా ప్రయోజనం ఉండదు. వారు కూడా ఇలాంటి తప్పు దారుల్లో ఉపయోగిస్తారు. 4. ఏజ్‌ను ధ్రువీకరించుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తల్లిదండ్రుల అనుమతిని దొడ్డిదారిన పొందే అవకాశం ఎలాగూ ఉంటుంది. 5. పిల్లల కెరీర్ నిపుణులను సంప్రదించకుండానే ఇలాంటి నిర్ణయం యూరోపియన్ యూనియన్ తీసుకోవడం శోచనీయమని ఫేస్బుక్, స్నాప్‌చాట్ యాజమాన్యాలు విమర్శించాయి. కాకపోతే ఎడల్ట్ మెటీరియల్ పిల్లలకు అందుబాటులో లేకుండా రక్షణ చర్యలు తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని ఆ సంస్థలు చెబుతున్నాయి. చట్టం సవరణకు సంబంధించిన తాజా బిల్లును ఇంకా యూరోపియన్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. -
'పద్నాలుగేళ్లప్పుడే నాపై లైంగిక దాడి'
లాస్ ఎంజెల్స్: తనపై పద్నాలుగేళ్ల వయసులోనే లైంగికంగా వేధింపులు జరిగాయని ప్రముఖ గాయని రీతా ఓరా తెలిపింది. లండన్ లోని సిల్వియా యంగ్ థియేటర్ స్కూల్ లో డ్రామా స్టూడెంట్ గా విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు 26 ఏళ్ల వ్యక్తి తనపై లైంగిక పరమైన దాడి చేసి లోబర్చుకున్నాడని తెలిపింది. అయితే, అదంతా బలవంతంగా జరిగిందని తాను చెప్పలేనని అని మరోమాట అంటూ సంచలనం రేపింది. అయితే, అలాంటి పనులు ఆ వయసులో సరైనవి కావని మాత్రం చెప్పగలనని వివరించింది. గతంలో విషయాలు పట్టించుకోవడం లేదని, ప్రస్తుతంపైనే దృష్టిని సారించి తనను తాను తెలుసుకుంటున్నానని పేర్కొంది. గతంలో జరిగిన పొరపాట్లకు తన ప్రమేయం కూడా ఉందని, ఆ వ్యక్తిని మాత్రమే నిందించలేనని వివరణ ఇచ్చింది. -
ఇరవై ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు!
పెద్దేముల్: పన్నెండేళ్ల వయసులో ఉన్న ఊరు.. కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి బతుకుదెరువు కోసం వెళ్లిన ఓ బాలుడు ఇరవై ఏళ్ల తర్వాత భార్యాపిల్లలతో సొంత గ్రామానికి వచ్చాడు. కొడుకు ఇక రాడేమోనని దిగులుతో ఉన్న తల్లిదండ్రులు.. తమ కుమారుడు భార్యాబిడ్డలతో రావడంతో ఉద్వేగంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సోదరి రాఖీ కట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం మన్సాన్పల్లిలో ఆదివారం వెలుగుచూసింది. వివరాలు..గ్రామానికి చెందిన లింబ్యానాయక్, సోనాబాయి దంపతులకు కూతురు కిమ్నీబాయి, కుమారులు దుర్గ్యానాయక్, హర్యానాయక్, సురేష్ ఉన్నారు. దుర్గ్యానాయక్ 12 ఏళ్ల వయసులో ఉండగా.. పని కోసం పుణే వెళ్లాడు. అక్కడ పని దొరక్కపోవడంతో ఓ లారీపై క్లీనర్‌గా పనిచేయసాగాడు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ వెళ్తుండగా మార్గంమధ్యలో దుమ్ముగూడ తండాకు చెందిన అనూషబాయి పరిచయమైంది. అనంతరం కొంతకాలానికి ఆమె చెల్లెలు చాలుబాయిని దుర్గ్యానాయక్ వివాహం చేసుకున్నాడు. అక్కడే ఉంటూ స్థానికంగా ఇస్లామ్పూర్ దగ్గర ఓ దాబాలో పనిచేయసాగాడు. ఇతడికి పిల్లలు సోను (7), అభిషేక్ (5), హరిత (1) ఉన్నారు. దుర్గ్యానాయక్ (32) ఇరవై ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను గుర్తుచేసుకొని స్వగ్రామానికి శనివారం భార్యాపిల్లలతో కలసి వచ్చాడు. తమ కుమారుడు ఇక రాడేమోననే బెంగతో ఉన్న తల్లిదండ్రులు దుర్గ్యానాయక్తో పాటు కోడలు, మనవలు, మనవరాలిని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శనివారం రాఖీ పండుగ సందర్భంగా దుర్గ్యా నాయక్‌కు సోదరి కిమ్నీబాయి రాఖీ కట్టింది. -
యుక్తవయస్సు బాలికలపై శ్రద్ధ అవసరం: కలెక్టర్
విశాఖపట్నం (మహారాణిపేట): యుక్త వయసున్న బాలికలను గుర్తించి వారికి అవసరమైన హిమోగ్లోబిన్ , పౌష్టికాహారం తదితర కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఎన్.యువరాజ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన యుక్తవయసు బాలబాలికల కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 10-19 వయస్సున్న వారు 8.8 లక్షల మంది ఉన్నారన్నారు. వీరికోసం ప్రత్యేకంగా యునిసెఫ్ ప్రాజెక్ట్ తీసుకున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వ,ప్రైవేటు ఆశ్రమ, రెసిడెన్షియల్ , కస్తూర్భా గాంధీ పాఠశాలలను పరిశీలించి అక్కడ పిల్లల ఆరోగ్య విషయాల గురించి తెలుసుకోవాలన్నారు. ఇందుకు వైద్యారోగ్యం, అంగన్వాడీ, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు ఒక కమిటీగా ఏర్పడి సంవత్సరానికి సంబంధించిన యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. యుక్తవయసు బాలబాలికలందరికి ఏడాదికి రెండుసార్లు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలన్నారు. ఆ రిపోర్ట్‌లను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచాలన్నారు. బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, శానిటరీ నాప్కిన్ల వినియోగం పై అవగాహన కల్పించాలన్నారు. టీంలు మండలాల వారీగా ఏర్పడి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రెడ్‌క్రాస్ సొసైటీ వారి సహకారాన్ని కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్, ఐసీడీఎస్ పీడీ చిన్మయిదేవి, డీఎల్ఓ డాక్టర్ రమేశ్, సహాయ గిరిజన సంక్షేమ అధికారి శ్రీదేవి, గ్రీన్ వ్యాలీ సంస్థ ప్రతినిధి ప్రభాకర్, యునిసెఫ్ కోఆర్టినేటర్ సీమా కుమార్, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు నరేశ్, అబ్దుల్ రఖీద్ పాల్గొన్నారు. -
వయోపరిమితి సడలింపు పదేళ్లు?
ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఆలోచన యూనిఫాం సర్వీసులకు ఐదేళ్లు సడలింపు! హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయో పరిమితి సడలింపును పదేళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ దిశగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో భర్తీ చేసే పోస్టుల గరిష్ట వయోపరిమితికి పదేళ్లు సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ టీఎస్పీఎస్సీ పరీక్షల విధానం, వయోపరిమితి సడలింపు తదితర అంశాలపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. అందులో ఐదేళ్ల సడలింపును ప్రతిపాదించింది. గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు రానందున.. ఐదేళ్ల సడలింపు సరిపోతుందని, పదేళ్లు పెంచితే కొన్ని కేటగిరీల్లో ఉద్యోగి సర్వీసు కాలం తగ్గిపోతుందని పేర్కొంది. కానీ నిరుద్యోగులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి గరిష్ట వయోపరిమితిని పదేళ్లు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పదేళ్ల సడలింపునకు సీఎం అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు యూనిఫాం (పోలీసు వంటి) సర్వీసుల్లో ఇంతకుముందు గరిష్ట వయోపరిమితిని పెంచలేదు. కానీ ఈసారి వాటిల్లోనూ గరిష్ట వయోపరిమితికి ఐదేళ్లు సడలింపు ఇవ్వాలన్న యోచనకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. -
కేంద్ర ఉద్యోగాల్లో వయో పరిమితి సడలింపు పెంపు
-
కొలువుల ఫైళ్లు నత్తనడక
ఉద్యోగ నియామకాల ఫైళ్లన్నీ ఎక్కడివక్కడే కీలకాంశాలపై స్పష్టత కరువు వయో పరిమితి పెంపుపై సందిగ్ధత పరీక్ష విధానం, జోన్ల వ్యవస్థ, టీఎస్పీఎస్సీ భర్తీ చేసే పోస్టులపై రాని స్పష్టత కమిటీలు, పరిశీలనతోనే కాలం వెళ్లబుచ్చుతున్న సర్కారు జూలై వచ్చినా జాడ లేని నోటిఫికేషన్లు ఆందోళనలో నిరుద్యోగులు సాక్షి, హైదరాబాద్: 'త్వరలోనే 25 వేల ఉద్యోగాల భర్తీ...' అంటూ సర్కారు వెలువరించిన ప్రకటన నిరుద్యోగులను ఊరిస్తున్నా నియామకాలకు సంబంధించిన కసరత్తు నత్తనడకన సాగుతోంది. జూలై నుంచి నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది. నోటిఫికేషన్లకు ఎంచుకున్న ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఫైళ్లన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. శాఖల వారీగా ఖాళీల గుర్తింపు మినహా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. కీలకమైన నిర్ణయాలన్నీ సీఎం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అభ్యర్థుల వయో పరిమితి ఎంత మేరకు సడలిస్తారు? జోనల్ విధానంలో మార్పుచేర్పులు ఉండబోతున్నాయా? అసలు పరీక్షల విధానం ఎలా ఉండబోతోంది? వీటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. మూడు వారాలు గడచినా.. సీఎం ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేసి మూడు వారాలైంది. తొలి వారంలో 24 గంటల వ్యవధిలో ఖాళీల సమాచారం ఇవ్వాలని హడావుడి చేసిన సర్కారు.. ఆ తర్వాత వేగం తగ్గించింది. ఇంకా ఖాళీల గుర్తింపు ప్రక్రియే కొనసాగుతోంది. ఖాళీల వివరాలు కోరటం.. ప్రాధాన్యతా క్రమంలో ఏయే పోస్టులు భర్తీ చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. 56 వేల ఖాళీలున్నట్టు వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు సమాచారం అందింది. నాలుగో తరగతి పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. కానీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మించి ఎక్స్క్యూటివ్ పోస్టుల జాబితా సిద్ధం చేయాలని సర్కారు సూచింది. దీంతో ఆర్థికశాఖ తమ దగ్గరున్న ఖాళీల వివరాలను వడస్తోంది. తొలి విడతలో విద్య, వైద్యారోగ్యం, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, హోంశాఖలోని ఖాళీలు భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ అయిదు విభాగాల్లోని ఖాళీలపైనే సీఎస్ ఇటీవల ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించటం గమనార్హం. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి పోస్టులు మినహా జోనల్, జిల్లా స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వయో పరిమితిపై సందిగ్ధత అభ్యర్థుల వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం ఇప్పటికీ మార్గదర్శకాలు విడుదల చేయలేదు. జూన్ 10న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలోనూ దీనిపై చర్చించారు. 'అయిదేళ్లు పెంచాలా.. పదేళ్లా.. అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. చీఫ్ సెక్రెటరీ సారథ్యంలోని కార్యదర్శుల కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. వారం రోజుల్లో నాకు నివేదిక ఇస్తుంది' అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదు. ఉద్యోగ నియామకాలకు ప్రస్తుతమున్న సాధారణ వయో పరిమితి 34 ఏళ్లు. యూనిఫాం సర్వీసులకు 28 ఏళ్లు. నిరుద్యోగులకు మాత్రమే వయోపరిమితి సడలింపు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అభ్యర్థులకు గతంలో ఉన్న అయిదేళ్ల సడలింపు మాత్రమే వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. టీఎస్పీఎస్సీ పోస్టులేవీ ? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఏయే పోస్టులు భర్తీ చేయాలన్న లెక్క తేలలేదు. టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది? ఏయే పోస్టులు భర్తీ చేస్తారనేది సర్కారు వెల్లడించలేదు. ప్రభుత్వం భర్తీ చేయదలిచిన 25 వేల ఉద్యోగాల్లో వేటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు.. వేటిని డిపార్టుమెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేస్తారో తేలాల్సి ఉంది. చీఫ్ సెక్రెటరీలు, డిపార్టుమెంట్ సెక్రెటరీలు చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం చెప్పినా.. ఇప్పటికీ ఆ దిశగా తుది కసరత్తు జరగలేదు. పరీక్ష విధానంపై సందిగ్ధత టీఎస్పీఎస్సీ అధ్వర్యంలో నిర్వహించే పరీక్షల విధానం ఎలా ఉండబోతుందన్నది ఇప్పటికీ తేలలేదు. ఉద్యోగాల ప్రకటన అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సారథ్యంలో ముగ్గురు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలు, టీఎస్పీఎస్సీ చేసిన సిఫారసులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శుల కమిటీ ఇచ్చిన సలహాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన సబ్ కమిటీ ఎప్పుడు తమ నివేదిక ఇస్తుందో వేచి చూడాల్సిందే! జోనల్ వ్యవస్థపై మల్లగుల్లాలు జోనల్ వ్యవస్థపై అనేక సందేహాలు నిరుద్యోగులను పట్టి పీడిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 371(డీ) కింద ఆరు జోన్ల వ్యవస్థ ఉంది. విభజన అనంతరం తెలంగాణలో రెండే జోన్లు ఉన్నాయి. వీటిని రద్దు చేసి ఒక్కటిగా విలీనం చేయాలా లేదా నాలుగు జోన్లుగా పునర్వ్యవస్థీకరించాలా అన్నది చర్చనీయాంశంగానే ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ జోన్ల విధానం అమల్లో ఉంది. దీనికి మార్పులు చేర్పులు చేయాలంటే కేంద్రం అనుమతి పొందడంతోపాటు ప్రస్తుతమున్న చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. -
కేంద్ర ఉద్యోగాల్లో వయో పరిమితి సడలింపు పెంపు
వికలాంగులకు 10 ఏళ్లు * ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు * ఓబీసీ వర్గాలకు 13 ఏళ్లు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నేరుగా నియామకాలు జరిపే అన్ని పోస్టుల్లోనూ.. అంధులు, బధిరులు సహా ఇతరత్రా శారీరక వైకల్యం గల వ్యక్తులకు గరిష్ట వయో పరిమితిలో పదేళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే.. షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ) వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో 15 ఏళ్ల సడలింపు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ) వారికి 13 ఏళ్ల సడిలింపు ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర శిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) సోమవారం కొత్త నిబంధనలను రూపొందించింది. అయితే.. దరఖాస్తుదారు వయసు గరిష్టంగా 56 సంవత్సరాలకు మించరాదన్న నిబంధనకు లోబడి పై సడలింపులు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇంతకుముందు.. గ్రూప్ ఎ, గ్రూప్ బి పోస్టుల నియామకాల్లో వికలాంగులకు గరిష్ట వయో పరిమితిలో ఐదు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 10 సంవత్సరాలు, ఓబీసీలకు 8 సంవత్సరాలు సడలింపు ఉంది. -
‘కన్ఫర్డ్’ వయసు 56కు పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ: రాష్ట్ర కేడర్ అధికారులకు శుభవార్త. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల్లోకి ప్రవేశం కల్పించేందుకు రాష్ట్ర కేడర్ అధికారుల వయసును 54 ఏళ్ల నుంచి 56 ఏళ్లకు పెంచారు. కన్ఫర్డ్ పదోన్నతి వయసు పెంపుపై కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) ఈమేరకు నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం యూపీఎస్సీ.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల్లోకి రాష్ట్రాల అధికారులను ఎంపిక చేస్తుంది. ప్రతి ఏటా జనవరి 1నాటికి 56 సంవత్సరాలు దాటిన అధికారులను ఈ మూడు సర్వీసుల్లోకి పరిగణించరు. ఇంతకుముందు ఈ పరిమితి 54 సంవత్సరాలు ఉండేది. -
ఓటేసిన పాపానికా..!
మాకు ఓటేస్తే రూ.1000 వృద్ధాప్య పింఛను ఇస్తామని హామీనిచ్చిన టీడీపీ.. అధికారంలోకొచ్చాక ఏకంగా పింఛన్లకే ఎసరు పెట్టింది. పింఛన్ అందుకోవడానికి సరైన వయసు లేదంటూ వేలాది మంది పింఛన్లకు కోతపెట్టింది. ఇలాగే అనంతపురం జిల్లాలో పింఛన్లు కోల్పోయిన వందలాది మంది వృద్ధులు తమ వయసుకు ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం కోసం మంగళవారమిలా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన ప్రత్యేక క్యాంపునకు తరలివచ్చారు. గార్లదిన్నె, రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లోని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో వృద్ధులు రావడంతో తోపులాట చోటుచేసుకుంది. ఇక్కడ తగిన భద్రత ఏర్పాట్లు లేక, మెట్లు ఎక్కి పైకి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతూ, తొక్కిసలాటలో ఊపిరాడక వారు నలిగిపోయారు. ఈ వయసులో ఈ కష్టమేంటిరా దేవుడా అనుకుంటూ కొందరు కన్నీటి పర్యంతమయ్యూరు. -
వయోపరిమితి సడలింపుతో యువతలో ఆనందం
నిజామాబాద్ అర్బన్: గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎన్నో ప్రయాసలు పడు తున్నారు. కొత్త రాష్ట్రంలో కొలువుల జాతర మొదలవడం, వయోపరిమితి కలిసి రావడం తో ఉద్యోగాల కోసం పోటీ పెరుగనుంది. జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏటా 14 వేల నుంచి 15 వేల మంది విద్యార్థులు ఇంటర్, 16 వేల మంది డిగ్రీ, ఐదు వేల మంది పీజీ పూర్తి చేస్తున్నారు. కొందరు ఇంకా ఉన్నత స్థాయి చదువుల కోసం వెళ్తున్నా, దాదాపు అన్ని స్థాయిల లోనూ ఉద్యోగాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే 66 వేల మంది నిరుద్యోగులు ఉపా ధి కల్పనా కార్యాలయాలలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 40 సంవత్సరాలపై బడినవారు సుమారు 30 వేల మం ది వరకు ఉన్నారు. కొందరు బీఈడీ, టీటీసీ శిక్షణలో ఉన్నారు. మరికొందరు కోచింగ్ సెం టర్లలో శిక్షణ పొందుతున్నారు. వీరంతా వయోపరిమితి సడలింపుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుల్, బ్యాంకు సిబ్బంది, ప్రభుత్వంలోని వివి ధ శాఖల అధికారులు, సిబ్బంది ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. ప్రయివేటు ఉద్యోగాలపైన కూడా వారి దృష్టి ఉంది. వీరంతా, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశించినవారే. సీఎం ప్రటన వారి ఆశలకు ఊపిరి పోస్తోంది. సడలింపుపై హర్షం దాదాపు అన్ని కేటగిరీలలో వయోపరిమితిని ఐదేళ్ల వరకు పెంచారు. నేడో, రేపో వయస్సు మించిపోతుందేమోనని బెంగపడేవారికి ఇది ఎంతగానో ఊరటనిచ్చింది. దాదాపు అన్ని రకాల ఉద్యోగాలూ వయోపరిమితిని సడలించడంపైన కూడా వారం తా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖలలలో ఖాళీల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీటి భర్తీ జరిగితే ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులు అందుబాటులోకి రావడమే కాకుం డా నిరుద్యోగులకు ఉపాధి కూడా లభించే అవకాశాలున్నాయి. జిల్లా అధికార యం త్రాంగం కూడా ఖాళీల భర్తీకి సమాయత్తమవుతోంది. -
కొలువుల ఆశ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నిరుద్యోగులకు పట్టలేనంత ఆనందం. ఉద్యోగాల భర్తీ కోసం వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం చేసిన ప్రకటనతో వారిలో సరికొత్త ఉత్సాహం. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలుడిగిన నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఊరట. వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టులను గత కొన్ని సంవత్సరాలుగా భర్తీ చేయడం లేదు. సంవత్సరాల తరబడి ఉద్యోగాల భర్తీ కోసం ఎలాంటి నోటిఫికేషన్ వెలవడకపోవడంతో జిల్లాలోని యువకులు నిరుద్యోగులుగానే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమ తలరాతలు మారుతాయనే ఆశతో ఉన్న నిరుద్యోగుల కల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ఫలించినట్టయింది. వేలాది మంది నిరుద్యోగులు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఆ 20వేల మందిలో.. జిల్లాలో వేల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. వారిలో 34 ఏళ్లకు పైబడిన వారు 20వేలకు పైగా ఉంటారని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే గరిష్ట వయసును 34 నుంచి 5 సంవత్సరాలు పెంచడంతో 39 ఏళ్లకు చేరింది. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదు. రిటైర్మెంట్పోస్టులను సైతం యథావిధిగా ఖాళీగానే ఉంచుతున్నారు. పలు ప్రభుత్వ శాఖలు సిబ్బంది కొరతతో ప్రజల సమస్యలను తీర్చలేక సతమతమవుతున్నాయి. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇప్పటి వరకు ఈ ఖాళీలను భర్తీ చేయకలేక పోయింది. త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఈ వయో పరిమితి సడలింపు జిల్లాలోని నిరుద్యోగులకు వరంగా మారనుంది. నాలుగైదు సంవత్సరాలుగా రాష్ట్రస్థాయిలోనూ చెప్పుకోతగ్గ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయలేదు. పెద్దగా నోటిఫికేషన్లు సైతం వెలువడలేదు. నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షలకు సంవత్సరాల నుంచి కోచింగ్సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. వికలాంగులు, వివిధ సామాజిక వర్గాలు, ఇన్ సర్వీస్ ఉద్యోగులకు సైతం ఈ వయో పరిమితి సడలింపు వర్తిస్తుండటంతో వారందరిలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. భారీగా ఖాళీలు.. జిల్లాలో ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) స్థాయి ఉద్యోగుల నుంచి సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగాలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగాలు గత కొన్ని సంవత్సరాలుగా భర్తీకి నోచుకోవడం లేదు. జిల్లాలో ప్రధాన ప్రభుత్వశాఖగా ఉండి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన రెవెన్యూ శాఖలో సైతం భారీగానే ఉద్యోగ ఖాళీలున్నాయి. ఆరు తహశీల్దార్ పోస్టులు, నాలుగు సీనియర్అసిస్టెంట్ పోస్టులు, ఏడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 30 వీఆర్వో పోస్టులు, 8 అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ విభాగంలో రెండు ఎంపీడీవో పోస్టులు, ఒక సూపరింటెండెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, 160 అటెండర్ పోస్టులు, ఒక డీఈఈ, 34 మంది సెక్షన్ ఆఫీసర్లు, ఒక టెక్నికల్ అధికారి, రెండు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక జిల్లాలోని గ్రామస్థాయిలో పాలన వ్యవహారాలను చూడాల్సిన జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో ఏకంగా ఆరునెలలుగా జిల్లా పంచాయతీ అధికారి పోస్టు ఖాళీగా ంటోంది. 388 మంది పంచాయతీ సెక్రటరీలు, ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖజానా శాఖలో అన్ని విభాగాల్లో కలిపి 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్అండ్బీ శాఖలో ఏడు ఏఈ , ఐదు జేటీవో, ఒక సూపరింటెండెంట్ , ఐదు సీనియర్ అసిస్టెంట్, ఏడు టైపిస్ట్, ఆరు అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం నగర పాలక సంస్థ పరిస్థితి సైతం ఉద్యోగాల విషయంలో పేరుగొప్ప అన్న సామెతను తలపిస్తోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరం చెందినా అందుకు తగ్గ సిబ్బందిని మాత్రం ఇప్పటి వరకు నియమించలేదు. అంతేకాదు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో ఉండాల్సిన పూర్తిస్థాయి సిబ్బంది ఇక్కడ లేకపోవడం గమనార్హం. ఈ శాఖలో సైతం కీలకమైన మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, సెక్రటరీ, అసిస్టెంట్ కమిషనర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గత నాలుగు నెలలుగా ఖమ్మం నగర పాలక సంస్థకు కమిషనర్ లేకపోవడంతో మెప్మా పీడీని ఇన్చార్జి కమిషనర్‌గా నియమించారు. నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయి. భద్రాచలం ఐటీడీఏలో.. భద్రాచలం ఐటీడీఏలో కీలక శాఖలకు ప్రస్తుతం అధికారులు లేరు. వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, ఉద్యాన శాఖ, ఉపాధి కార్యాలయం, మత్స్యశాఖ, మొబైల్ కోర్టు, ఎన్ఆర్ఈజీఎస్, గురుకుల సెల్, ఏటీడబ్ల్యూవో విభాగాలకు అధికారులు లేరు. ఇవి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఏజెన్సీ డీఈవోకు బదిలీ అయింది. ఈయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు. -
వయోపరిమితి ఐదేళ్లు సడలింపు
ఆదిలాబాద్ టౌన్/రిమ్స్ : నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ కొలువుల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ వార్తతో నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు. ఆయా కేటగిరీలకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి కూడా ఐదేళ్లు సడలింపునిస్తూ పెంచడంతో వారికి ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో యువత ఉద్యోగాలు వస్తాయన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో నిరుద్యోగులు 65 వేలకు పైనే.. డిగ్రీలు, పీజీలు పట్టాలు పొంది ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు జిల్లాలో 66,346 మంది ఉన్నారు. కేవలం విద్యా, పోలీసు శా ఖల్లో మాత్రమే పోస్టులను భర్తీ చేస్తూ మిగతా శా ఖల్లో పోస్టులను గత ప్రభుత్వాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగు తూ వచ్చింది. ఉన్నత చదువులు చదివిన వారు సై తం చిన్నచిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతూ దరఖాస్తు చేసుకుంటున్నారు. నాలుగేళ్లుగా అరకొరగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో ఈ పరిస్థితి నెల కొం ది. ప్రతినెలా ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండడంతో ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడుతున్నా యి. కొత్త వారిని నియమించకపోవడంతో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకే ఇన్చార్జి బాధ్యత లు అప్పగిస్తున్నారు. దీంతో వారికి కూడా పనిభారం పెరిగి విధులకు న్యాయం చేయలేకపోతున్నారు. వయోపరిమితి పెంపు వరం.. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల అర్హతకు వయసు పరిమితి ముగియడంతో చాలా మంది నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం కోసం తప్ప.. ప్రభుత్వ కొలువు పొందే అవకాశం కోల్పోతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉద్యోగాలకు వయో పరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉద్యోగాలకు అర్హత సాధించనున్నారు. దీంతో వారు పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్.. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి ఇది వరకే ప్రకటించిన విషయం విధితమే. తాజాగా మరోసారి అసెంబ్లీలో దీనిపై స్పష్టత ఇచ్చి ఉద్యోగులకు భరోసా కల్పించారు. దీంతో జిల్లాలో సుమారు వెయ్యికి పైగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. -
నిరుద్యోగులకు వరం
* అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన * నాలుగైదు నెలల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం * రాష్ట్రంలో ఖాళీల సంఖ్య 1,07,744 * ఉద్యోగుల విభజన తర్వాత ఈ సంఖ్యపై మరింత స్పష్టత * విద్యుత్ ప్రాజెక్టులతో మరిన్ని ఉద్యోగావకాశాలు * కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త! ఉద్యోగాల భర్తీ కోసం వయో పరిమితిని ఐదేళ్లు సడలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అలాగే రాష్ర్టంలో లక్షకుపైగా ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు. అసెంబ్లీలో సోమవారం ఈ అంశంపై జరిగిన చర్చకు సీఎం సమాధానమిస్తూ.. నిరుద్యోగులకు వయో పరిమితిని ఐదేళ్లు సడలించి, నాలుగైదు నెలల్లో ఉద్యోగాల భర్తీ చేపడతామని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణలో 1,07,744 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. ఆర్టీసీ, సింగరేణి, ఇతరత్రా కార్పొరేషన్లకు సంబంధించి ఉన్న కొన్ని చిక్కులు తొలగాల్సి ఉందన్నారు. పది వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టును చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే 6 వేల మెగావాట్లతో జెన్కో చేపట్టబోయే ప్రాజెక్టు ద్వారా 10 నుంచి 12 వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అందువల్ల నిరుద్యోగ యువత ఎలాంటి నిరాశకు లోను కా వొద్దని విజ్ఞప్తి చేశారు. నాలుగైదు నెలల్లో నియామకాలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. ఇంకా ఉద్యోగులు, సంస్థల సంఖ్య తేలకపోవడంతో సందిగ్ధత నెలకొన్నదని, విభజన ప్రక్రియను కమల్‌నాథన్ కమిటీ పూర్తి చేశాక ఎంతమంది మిగులుతారో లెక్క తేలుతుందని ఆయన వివరించారు. ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు ఉండేవని, ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటు రంగంలోనూ విరివిగా అవకాశాలు లభిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. కొన్ని శాఖల్లో ఉద్యోగాల సంఖ్యను పెంచుతామని, హేతుబద్ధీకరణ చేయాల్సి ఉందని, కొన్ని శాఖలను కుదించాల్సి ఉందని సభలో వివరించారు. ఏదైనా కమలనాథన్ కమిటీ తేల్చిన తర్వాతే ఖాళీల భర్తీ విషయలో ముందుకు వెళ్తామన్నారు. రాష్ర్టంలో 25 వేల మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. వారిని కూడా క్రమబద్ధీకరిస్తామన్నారు. ఇందులో రూల్ ఆఫ్ రోస్టర్, రిజర్వేషన్ల విధానాన్ని పాటిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని వేశామని, త్వరలోనే ఆ నివేదిక వస్తుందని సీఎం చెప్పారు. అంగన్వాడీ, రాజీవ్ విద్యామిషన్, కస్తూర్బా వంటి కేంద్ర పథకాల్లో పనిచేసే వారు ఉద్యోగులు కారని, గౌరవ వేతనం తీసుకునే వారు మాత్రమేనని పేర్కొన్నారు. ఆ పథకాలుంటే వారుంటారు లేకుంటే పోతారని వ్యాఖ్యానించారు. ఔట్సోర్సింగ్ వ్యవస్థను ఎవరు తెచ్చారో అందరికీ తెలుసన్నారు. పోలీస్ శాఖలో డ్రైవర్లు ఇతరత్రా 3,700 ఉద్యోగాలను భర్తీకి ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. 1985, 1998, 2000, 2002 డీఎస్సీ వివాదాలను గత ప్రభుత్వాలు వారసత్వంగా తీసుకొచ్చాయని విమర్శించారు. ఇన్నాళ్లూ పెంట పెట్టి ఇప్పుడు చిటికెలో కడగేయాలంటే ఎలాగని ప్రశ్నించారు. ఇక నూతన పారిశ్రామిక విధానాన్ని ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. 2.35 లక్షల ఎకరాలను టీఎస్ఐఐసీకి అప్పగించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు. వర్గాలవారీగా వయోపరిమితి వివరాలు జనరల్ పోస్టుల్లో.. జనరల్ వారికి 34+5(సడలింపు)=39 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 34+5(సామాజిక రిజర్వేషన్)+5 (సడలింపు)= 44 ఏళ్లు అన్ని వర్గాల వికలాంగులకు వైకల్యాన్ని బట్టి 3 లేదా ఐదేళ్ల అదనపు వయో పరిమితి ఉంటుంది ఇన్ సర్వీస్ ఉద్యోగుల్లో జనరల్ అభ్యర్థులకు 34+5(సడలింపు)=39 ఏళ్లు+సర్వీసు ను బట్టి గరిష్టంగా ఐదేళ్ల అదనపు పరిమితి ఇన్ సర్వీస్ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 34+5(సామాజిక రిజర్వేషన్)+5(సడలింపు)= 44 ఏళ్లు+ సర్వీసును బట్టి గరిష్టంగా ఐదేళ్ల అదనపు పరిమితి యూనిఫాం పోస్టుల్లో.. డీఎస్పీ వంటి పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 28+5(సడలింపు)= 33 ఏళ్లు ఈ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 28+5(సామాజిక రిజర్వేషన్)+5(సడలింపు)=38 ఏళ్లు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో జనరల్ అభ్యర్థులకు 25+5(సడలింపు) = 30 ఏళ్లు ఈ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25+5(సామాజిక రిజర్వేషన్)+ 5(సడలింపు) = 35 ఏళ్లు ఫైర్ సర్వీసెస్, ఎకై్సజ్ సూపరింటెండెంట్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 26+5(సడలింపు)= 31 ఏళ్లు ఈ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 26+5(సామాజిక రిజర్వేషన్)+5(సడలింపు) = 36 ఏళ్లు ఉపాధ్యాయ పోస్టుల్లో.. జనరల్ అభ్యర్థులకు 39+5(సడలింపు) = 44 ఏళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39+5(సామాజిక రిజర్వేషన్)+5(సడలింపు) = 49 ఏళ్లు వికలాంగులకు 39+5(సామాజిక రిజర్వేషన్)+5(వికలాంగుల రిజర్వేషన్)+ 5(సడలింపు)= 54 ఏళ్లు మేం మద్దతిస్తే.. ఇలా చేస్తారా: ఎంఐఎం ఉద్యోగాల కల్పనపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ కోరగా... 344 కింద నోటీసు ఇచ్చిన సభ్యులే మాట్లాడాలని స్పీకర్ మధుసూదనాచారి సమాధానమిచ్చారు. విద్యుత్‌పై అందరితో ఎలా మాట్లాడించారని అక్బరుద్దీన్ ప్రశ్నించగా... నోటీసు ఇచ్చినవారే మాట్లాడాలని బీఏసీలో నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఏసీలో నిర్ణయించింది నిజమైతే తాను రాజీనామాకు సిద్ధమని అక్బర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి భేషరతుగా మద్దతు ఇస్తుంటే ఇలా చే స్తారా అని నిలదీశారు. -
పెళ్లికి తొందరెందుకంటున్న యువత
కామారెడ్డి: గతంలో పిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకునేవారు. వారు నిర్ణయించిన సమయంలో వివాహం జరిగేది. అయితే మారిన పరిస్థితుల్లో యువతలో చాలా మార్పులు వచ్చాయి. ఎలాంటి సంపాదన లేకుండా వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబా న్ని పోషించలేమని, ఇదే సమయంలో కన్నవారికి భారం కాకూడదన్న భావనతో చాలా మంది పెళ్లికి తొందరపడ డం లేదు. ఎంతో కొంత సంపాదించినపుడే సొంత జీవితాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. గతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. బాల్య వివాహాలను నివారించేందుకుగాను ప్రభుత్వాలు వివాహ వయస్సును పురుషులకు21సంవత్సరాలు, స్త్రీలకు 18సంవత్సరాలుగా నిర్ణయించాయి. నిరక్షరాస్యత ఉన్న కుటుంబాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చదువుకున్న కుటుం బాల్లో మాత్రం చాలా వరకు బాల్యవివాహాలు జరుగడం లేదు. పిల్లల పె ళ్లిళ్లతో బాధ్యతలు తీర్చుకుందామని తల్లిదండ్రులు భావిస్తున్నా, తాము జీవితంలో స్థిరపడనిదే వివాహం చే సుకోమంటూ పిల్లలు స్పష్టం చేస్తున్నా రు. దీంతో చాలా మంది 25 యేళ్లు దాటిన తరువాతనే వివాహం చేసుకుంటున్నారు. ఉద్యోగం తరువాతే.. చదువుకున్న యువకులు ఉద్యోగం వచ్చిన తరువాతనే వివాహం చేసుకోవాలనే భావన పెంచుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడానికి బీఈడీ, డీఈడీ చదివిన వారు డీఎస్సీల కోసం ఎదురు చూస్తున్నారు. డీఎస్సీలో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని, తరువాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఎన్ని సంబంధాలు వచ్చినా ఉద్యోగం తరువాతనే సిగ్నల్స్ పంపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల మాటను కాదనలేకపోతున్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నా సరే స్థిరపడ్డ తరువాతనే వివాహం అంటుండడంతో పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. చదువును మధ్యలో వదిలేసి, వివిధ వృత్తులు, వ్యాపారాలవైపు చూస్తున్నవారు సైతం స్థిరపడ్డ తరువాతనే పెళ్లంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోనైతే ఇటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అమ్మాయిలైతే.. చదువుకున్న అమ్మాయిలైతే ఉద్యోగాలు వచ్చినా కొంతకాలం ఆగుతామనే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. తమ చదువులకు లక్షలు ఖర్చు చేసిన తల్లిదండ్రులు, పెళ్లి కట్నాలు, ఇతర ఖర్చులకు కూడా అప్పులు చేస్తున్నారని, ఉద్యోగం రాగానే వివాహం చేసుకుంటే కన్నవారికి ఏమీ చేయలేమన్న భావన వారిలో ఉంది. కూతురి వివాహం చేసి తమ బాధ్యత తీర్చుకుందామనే తల్లిదండ్రులకు, కొంతకాలం తరువాత చేసుకుంటామంటూ వారిని సముదాయిస్తున్నారు. తమ ఉద్యోగ వేతనం తల్లిదండ్రులు ఎంతో కొంత అనుభవించాలని కూతుళ్లు కోరుకుంటున్నారు. -
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు దసరా పండుగకు తీపి కబురు అందించారు. నిరుద్యోగుల వయో పరిమితి పెంచుతూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు సడలింపు ఇచ్చింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వయోపతిమితికి దగ్గరగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు మళ్లీ చిగురించినట్లే. రాష్ట్రంలో నిరుద్యోగులకు వివిధ ఉద్యోగ పరీక్షలకు వయోపరిమితి పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
సంపూర్ణ ఆరోగ్యానికి 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్
జబ్బు చేసినప్పుడు చికిత్స ఇవ్వడం వైద్యం... జబ్బు రాకుండా నివారించే పద్ధతిలో చికిత్స అందించి, పదేళ్ల వయసు తగ్గిస్తే.. అదే ఏజ్ మేనేజ్మెంట్ మెడిసిన్. అరవైలో కూడా యవ్వనపు ఆరోగ్యాన్ని తీసుకొచ్చే ఈ వైద్య విభాగం మొదటిసారిగా మన దేశంలో అయిదేళ్ల క్రితం రేవా హెల్త్ సెంటర్లో అందుబాటులోకి వచ్చింది. దీనిలో భాగమే 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్. ఒక జబ్బు, ఒక భాగం అని కాకుండా శరీరం మొత్తాన్ని పరిశీలించి, ఆరోగ్యాన్ని సమీక్షించి చికిత్స అందించడమే ఈ 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్ ఉద్దేశం. గతి తప్పే ఆరోగ్యం, జీవనశైలి వ్యాధులకు ఉత్తమ పరిష్కారం 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగామ్ చిన్నవయస్సులో బాధ్యతలు తక్కువ కాబట్టి ఒత్తిడి తక్కువ. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి బాధ్యతలు, ఉద్యోగపరమైన ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆహారం తీసుకోవడం క్రమం తప్పుతుంది. మహిళల్లో కూడా పని ఒత్తిడి పెరగడంతోపాటు, ఉపవాసాలు, ప్రెగ్నెన్సీ, హార్మోన్ల మార్పులు... ఇవన్నీ శరీర ఫిజియాలజీలో మార్పులకు కారణం అవుతాయి. వీటన్నింటికి తోడు కాలుష్యం. సహజసిద్ధమైన ఆహారం లేకపోవడం ఆరోగ్యం గతి తప్పడానికి దోహదం చేస్తుంది. ఈ అంశాలన్నింటినీ సమతుల్యం చేసి, అనుకూల స్థితికి రావడమే 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్ ఉద్దేశం. ఈ చికిత్స తరువాత శరీర పనితీరు యవ్వనదశలో లాగ మెరుగుపడుతుంది. ఈ చికిత్సలో భాగంగా వ్యక్తి శరీరతత్వాన్ని, సమస్యల్ని అన్నింటికి సంబంధించిన హిస్టరీ తీసుకుంటారు. అవసరమైన అన్ని పరీక్షలూ చేస్తారు. అప్పుడు తదనుగుణమైన చికిత్స మొదలవుతుంది. డైట్ ద్వారా కొంత, న్యూట్రసుటికల్స్ (న్యూట్రిషన్ సప్లిమెంట్స్) ద్వారా మరికొంత, అవసరాన్ని బట్టి మందులు వాడుతూ ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. ఆరువారాలకు, నాలుగు, ఎనిమిది నెలలకు ఆరోగ్యాన్ని తిరిగి సమీక్షిస్తారు. జెనెటిక్మ్యాపింగ్ ద్వారా జబ్బు రాగల అవకాశాన్ని కూడా ఇప్పుడు ముందే తెలుసుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. వివరాలకు 800 800 1225 800 800 1235 040 4454 4330 మెయిల్: ksrgopal@revami.com వెబ్సైట్: www.revami.in/ అడ్రస్: రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్ జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా రోడ్ నెం.4, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఆ ‘మాట’లన్నీ నీటిమూటలేనా!?
-
ఆ ‘మాట’లన్నీ నీటిమూటలేనా!?
ఉద్యోగులకు ఎన్నికల్లో హామీలు గుప్పించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఊసెత్తని సీఎం చంద్రబాబు పదో పీఆర్సీ అమలు ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణ హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఉద్యోగ వర్గాలకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విస్మరిం చింది. అధికారం చేపట్టి మూడు నెలలు కావస్తున్నప్పటికీ కేవలం ఉద్యోగుల వయోపరిమితిని పెంచి చేతులు దులుపుకుంది. పైగా ఆ పెంపు కూడా అయోమయంగానే ఉంది. ఏపీలో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు వర్తింపుపై గందరగోళం నెలకొంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వల్ల పదవీ విరమణకు దగ్గరగా ఉన్న అతి స్వల్ప ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం కలిగింది. మెజారిటీ ఉద్యోగులకు ఈ పెంపు వల్ల ప్రయోజనం కలగకపోగా పదోన్నతుల కోసం అదనంగా రెండేళ్లపాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉద్యోగుల పదో వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) సిఫారసుల అమలు గురించి గానీ, ఐదు రోజుల పని దినాల గురించి గానీ, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ గురించి గానీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి గానీ చంద్రబాబు సర్కారు అసలు పట్టించుకోవడం లేదని.. ఆ హామీలన్నిటినీ విస్మరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదికను చూశారా..? పీఆర్సీసిఫారసులను కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే యథాతథంగా అమలు చేస్తామని టీడీపీ ఎన్నికల హామీల్లో స్పష్టం చేసింది. అయితే రాష్ట్రం విడిపోకముందే రాష్ట్రపతి పాలనలోనే గవర్నర్ నరసింహన్‌కు పీఆర్సీ తన నివేదికను సమర్పించింది. అనంతరం రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడగానే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు పీఆర్సీ నివేదికలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు లక్షల మంది ఉద్యోగులు, 3.60 లక్షల మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7.60 లక్షల మంది పీఆర్సీ నివేదిక అమలు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కారు అధికారం చేపట్టి మూడు నెలలు కావస్తోంది.. కానీ ఇంతవరకూ పీఆర్సీ నివేదికను సర్కారు విప్పి చూసింది లేదు. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది జూలై నుంచి పీఆర్సీ సిఫారసుల అమలును వర్తింపజేయాల్సి ఉంది. గత ప్రభుత్వం పీఆర్సీ నివేదిక రాకముందే ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చింది. దానితోనే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తోందని, పీఆర్సీ నివేదిక అమలును విస్మరిస్తోందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 5 రోజుల పని దినాల హామీ ఊసేదీ? ఇక ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాల విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ.. అధికారం లోకి వచ్చాక ఇంతవరకూ ఆ ఊసే ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం పెంపును కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని పేర్కొం టున్నాయి. మరోపక్క ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని ఎన్నికల హామీ ల్లో పేర్కొన్న టీడీపీ.. సర్కారు పగ్గాలు చేపట్టాక ఆ హామీ అమలు దిశగా ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని ఉద్యోగ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1.45 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. కాంట్రాక్టు క్రమబద్ధీకరణ మాటేది? కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చిం ది. మొత్తం నాలుగు లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ హామీ అమలైతే జీవితాలు కొంతైనా మెరుగుపడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. క్రమబద్ధీకరణ మాట అటుంచి ఉపాధి హామీ పథకంలోని 2,900 మంది క్షేత్రస్థాయి సహాయకులను ఉద్యోగాల నుంచి తొలగించడానికి బాబు సర్కారు ఆదేశాలిచ్చింది. దీంతో కాంట్రాక్టు, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. -
ఆధార్‌లో తప్పుల సవరణ ఇలా..
అద్దంకి: ఆధార్‌కార్డు బాధలు తప్పాయిరా దేవుడా అనుకుంటున్న లోపే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆధార్ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. దీంతో ఎక్కడివారు అక్కడ ఆధార్ కార్డు నమోదు కోసం పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కార్డుల్లో వివిధ వివరాలు తప్పులుగా నమోదవుతున్నాయి. అయితే వీటిని సవరించుకొనేందుకు అవకాశం ఉంది. కానీ కార్డులో ఫొటో మాత్రం మార్పు చేయలేం. పేరు, స్త్రీ పురుష లింగాలు, పుట్టిన తేదీ, చిరుమనా, ఫోన్ నంబర్లను తిరిగి మార్పు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం... htpp:uidai.gov.in/updateyouradhaardata.htmను క్లిక్ చేయాలి. తరువాత కొన్ని ముఖ్య సూచనలు వస్తాయి. వాటిని బాగా చదవాలి. అనంతరం అప్డేట్, కరెక్షన్, రిక్వెస్ట్ ప్లీజ్ ఆప్షన్ల మీద క్లిక్ చేయాలి. మీకు నచ్చిన ఆప్షన్లో ఆధార్ కార్డు నంబరును ఎంటర్ చేయాలి. ఇప్పుడు దాని కింద ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి. ఈ సమయంలో మీ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీనిని ఎంటర్ చేయగానే మీరు కార్డులో ఏమి మార్పు చేయదలచుకున్నారో ఆ వివరాలపై క్లిక్ చేయాలి. తరువాత సంబంధించిన ఫారం డిస్ప్లే అవుతుంది. ఆ ఫారాన్ని పూర్తి చేశాక సబ్మిట్, అప్డేట్, రిక్వెస్ట్ ఆప్షన్లను క్లిక్ చేయాలి. డాక్యుమెంటేషన్ ఆప్షన్లో మార్పు చేయాలనుకుంటున్న పత్రాలను అప్లోడ్ చేయాలి. మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకుని ఎంటర్ చేయాలి. ఇప్పడు మీకు అప్డేట్ రిక్వెస్ట్ నంబరు వస్తుంది. ఈ నంబరులో మీ ఆధార్ కార్డులో ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానం (పోస్ట్ ద్వారా) htpp:uidai.gov.in/images/applicationform11102012pdfను క్లిక్ చేస్తే సంబంధిత ఫార ం వస్తుంది. దానిలో మీ వివరాలు నమోదు చేసి సంబంధిత దరఖాస్తును జతచేయాలి. నిర్దేశిత కాలంలో ప్రాంతీయ భాషలో కూడా పూరించాలి. ఒక ఎన్వోలప్పై రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అప్డేట్ అండ్ కరక్షన్ అని రాసి పాంతీయ కార్యాలయానికి పోస్ట్‌లో పంపాలి. ఆన్ లైన్ విధానంలో ఫారం పూరించే సమయంలో కొన్ని ఆప్షన్లు, గ్రామం, పిన్‌కోడ్, టౌన్, సిటీ, జిల్లా, రాష్ట్రం వివరాలు రాకుంటే పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అటెస్ట్ చేయాల్సిన విషయంలో రెండు విధానాలూ ఒకేరకంగా ఉంటాయి. సూచనలు- జాగ్రత్తలు వన్‌టైమ్ పాస్‌వర్డ్‌కు కేవలం 15 నిముషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ప్రాంతీయ భాషకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. ఫారం పూర్తి చేసేటప్పుడు ప్రాంతీయ భాషలో తప్పులు వస్తుంటే, సంబంధిత ఆప్షన్ వద్ద కర్సర్ పెట్టి కీ బోర్డులోని ట్యాబ్బార్ను ప్రెస్ చేయాలి. ఇప్పడు కొన్ని ఆప్షన్లు వస్తాయి. వీటిలో సరైనది సెలక్ట్ చేసుకోవచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల్లో ఒకరి సంతకం సరిపోతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు రిఫ్రెష్ చేయకూడదు. పేరుకు ముందు ఎలాంటి హోదాలు, వివరాలు చేర్చకూడదు. ఉదాహరణకు, డాక్టర్, శ్రీ, శ్రీమతి వంటివి. అడ్రెస్ స్పష్టంగా ఉండాలి. పుట్టిన తేదీ మార్చుకోవడానికి ఒక్కసారే అవకాశం ఉంటుంది. మొబైల్ నంబరు మార్పు మాత్రం ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుంది. -
వయసు మీరినా వీర్యదానానికి ఓకే!!
వీర్యదానం చేయడానికి వయసుతో సంబంధం లేదని భారత సంతతికి చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఒకరు చెబుతున్నారు. 45 ఏళ్ల వయసులో ఉన్నవాళ్లు కూడా 20 ఏళ్లవారిలాగే వీర్యదానం చేయొచ్చని, దాంతో కూడా పిల్లలు పుట్టడానికి సమానమైన అవకాశాలు ఉంటాయని తేల్చిచెబుతున్నారు. ఇందుకోసం లండన్‌లోని న్యూ కేజిల్ ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ మీనాక్షి చౌదరి బృందం ఏకంగా 2.30 లక్షల వీర్యం నమూనాలను పరిశీలించింది. సాధారణంగా పురుషుల వయసు 40 ఏళ్లు దాటితే ఐవీఎఫ్ పద్ధతిలో కృత్రిమ గర్భోత్పత్తి చికిత్స చేసేటప్పుడు 20 నుంచి 35 ఏళ్లలోపు వారినుంచే వీర్యం సేకరిస్తుంటారు. అలా అయితేనే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇన్నాళ్లూ భావించారు. కానీ, మీనాక్షి చౌదరి బృందం చేసిన పరిశోధనలో, 45 ఏళ్లు దాటినవారి నుంచి వీర్యదానం స్వీకరించినా కూడా పిల్లలు పుట్టే అవకాశం ఏమాత్రం తగ్గలేదని తేలింది. -
ఏపీలో జూన్ 30 తర్వాతే పదవీ విరమణ వయసు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 30వ తేదీ తరువాత నుంచి అమల్లోకి రానుంది. ఆ తేదీ తరువాత పదవీవిరమణ చేయబోయేవారికే ఈ పెంపును వర్తింపచేయాలన్న అభిప్రాయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం సచివాలయంలో తెలిపారు. రిటైర్మెంట్ వయసును పెంచుతూ సీఎం చంద్రబాబు సంతకం చేసినా దానిపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల శాశ్వత పంపిణీలో సమస్యలు ఎదురవుతుండడంతో వాటన్నిటినీ సర్దుబాటు చేసుకున్నాకే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత విధివిధానాలను ఖరారు చేసి ఆర్డినెన్స్ తేనున్నారు. -
వయోపరిమితి పెంపు రెండేళ్లే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఐదేళ్లు పెంచాలని నిరుద్యోగుల డిమాండ్‌ను పక్కనబెట్టి రెండేళ్ల పెంపునకే సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. 2011లో గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు పెంచాలని కోరినా ప్రభుత్వం రెండేళ్లకే పరిమితం చేసింది. 2012లో గ్రూపు-1, గ్రూపు-2 వంటి కీలక నోటిఫికేషన్లు ఇవ్వలేదు. జారీ చేసిన కొన్నింటికి వయోపరిమితి పెంపును విస్మరించింది. 2012 డిసెంబరులో ఉద్యోగ పరీక్షల వార్షిక కేలండర్‌కు, గ్రూపు-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూపు-1లో విలీనం (గ్రూపు-1బీగా) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2013లో నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 36 ఏళ్లు చేస్తూ (రెండేళ్లు పెంచుతూ) ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ 65 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వీఆర్ఏ మినహా మరే నోటిఫికేషన్ జారీ కాలేదు. డిసెంబరు 31తో ఆ ఉత్తర్వుల గడువు ముగిసిపోయింది. ప్రస్తుతం గ్రూపు-1, జోనల్ వ్యవస్థ కలిగిన పోస్టులు మినహా మిగతా పోస్టుల భర్తీ కోసం నియామక సంస్థలు ఇండెంట్లు తెప్పిస్తున్నాయి. ప్రభుత్వం రెండేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపునకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. -
ఏజ్ బారాయే..కొలువు రాదాయే
రేపటితో ముగిసిపోతున్న గడువు..లక్షలాది మంది నిరుద్యోగుల్లో నిరాశ ఆర్భాటపు ప్రకటనలు తప్ప జాడ లేని నోటిఫికేషన్లు ఒక్క రంగంలోనూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వని ఏపీపీఎస్సీ డీఎస్సీల ద్వారా నియమించాల్సిన పోస్టులనూ పట్టించుకోని ప్రభుత్వం వేలకు వేలు పోసి శిక్షణ తీసుకున్నా లాభం లేకుండా పోయిందని నిరుద్యోగుల ఆవేదన చేసేది లేక వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న పీజీ, బీటెక్ పట్టభద్రులు సాక్షి, హైదరాబాద్:ఇదిగో గ్రూప్-1 ఉద్యోగాలు.. అదిగో టీచర్ కొలువులు.. అల్లదిగో పోలీసు జాబ్‌లు అంటూ నిరుద్యోగులను ఊరించిన రాష్ట్ర సర్కారు చివరికి వారి నోట్లో మట్టి కొట్టింది! వేల కొద్దీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఆర్భాటపు ప్రకటనలతో లక్షలాది మందిలో ఆశలు రేపి వారి జీవితాలతో చెలగాటమాడింది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా.. ప్రకటనలు జారీ చేసిందే తప్ప వాటి భర్తీపై చేతులెత్తేసింది. ఒకటి కాదు రెండు కాదు.. 60 వేలకుపైగా పోస్టులు భర్తీ చేస్తామంటూ జీవోల సాక్షిగా చెప్పిన మాటలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. చివరికి వయోపరిమితి సడలింపు సైతం నీటి మూటే అయింది. 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని నిరుద్యోగుల డిమాండ్ మేరకు 36 ఏళ్లకు పెంచినా ఈ రెండేళ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగులు గరిష్ట వయోపరిమితిని దాటనున్నారు. రెండేళ్ల వయోపరిమితి సడలింపు 31-12-2013 వరకు జారీ అయ్యే నోటిఫికేషన్లకే వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. రేపటితో ఈ గడువు పూర్తవుతోంది. అంటే వయో పరిమితిని పెంచినా నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నమాట! ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన లు నమ్మి.. వయసు మీరుతున్న అభ్యర్థులెందరో కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు పోసి శిక్షణ తీసుకున్నారు. చివరి ప్రయత్నంలో అయినా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కష్టపడ్డారు. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రాకుండానే గడువు ముగిసిపోతుండడంతో వారంతా నిరాశలో మునిగిపోయారు. ఈ రెండేళ్ల వయసు సడలింపు ఇటీవల వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు రెవెన్యూ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌కు మాత్రమే వర్తించనుండడంతో.. పీజీలు చేసిన వారు సైతం దిక్కులేని పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించారు: వివిధ శాఖలతోపాటు ఏపీపీఎస్సీ ద్వారా పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేస్తామని ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్యలో ప్రభుత్వం ఊరించింది. ఆర్థికశాఖ 60,841 పోస్టుల భర్తీకి అనుమతి తెలుపుతూ జీవోలు జారీ చేసింది. ఇది ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నవారిలో ఆశలు రేపింది. గరిష్ట వయోపరిమితిని సడలించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో 34 ఏళ్ల వయోపరిమితి 36 సంవత్సరాలకు పెంచుతూ 29-06-2013న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జీవో 518 జారీ చేశారు. అందులో రెండేళ్ల వయోపరిమితి పెంపు 31-12-2013 నాటికి జారీ చేసే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేశారు. కానీ ఈ రెండేళ్ల వ్యవధిలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. ఈ గడువు మరొక్క రోజులో పూర్తి కానుంది. ఈ నెల 31లోగా అంటే.. మరో 24 గంటల్లో ఏపీపీఎస్సీ గానీ లేదా రిక్రూట్మెంట్ శాఖలు గానీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తే ఈ పెంపు వర్తిస్తుంది. లేదంటే వయసు మీరిన లక్షలాది మంది కోసం ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. 2013లో ఖాళీ పోస్టులు నోటిఫై చే సి, వాటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ముందుగానే సంవత్సర క్యాలెండర్ విడుదల చేశారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 13న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యూ జీవో 5691 జారీ చేశారు. అనంతరం ఆర్థిక శాఖ గ్రూప్-1, గ్రూప్-2, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టెక్నికల్‌కు చెందిన 33,738 పోస్టుల భర్తీకి అనుమతి తెలుపుతూ 2013 జూన్‌లో 132 జారీ చేసింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 11,250 పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 11,623 పోస్టులు, వివిధ శాఖల ద్వారా 10,865 పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఆర్థిక శాఖ మరో 24,078 పోస్టుల భర్తీకి అనుమతి తెలుపుతూ జూలైలో జీవో 183 జారీ చేసింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 1,127 పోస్టులు, వివిధ శాఖల ద్వారా 2,443 పోస్టులు, విద్యాశాఖ ద్వారా 20,508 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. అనంతరం సెప్టెంబర్‌లో పలు శాఖల్లో మరో 3,025 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపుతూ ఆర్థికశాఖ జీవో 262 విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తున్నట్లు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం నోటిఫికేషన్ల సంగతిని మాత్రం గాలికొదిలేసింది. దీంతో లక్షలాది మంది కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి పీజీ, బీటెక్‌లు పూర్తి చేసిన యువత కూడా ఇప్పుడు వీఆర్వో పోస్టుల నోటిఫికేషన్ రావడంతో వాటికి దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధం లేకున్నా.. రాష్ట్ర విభజనకు ఈ పోస్టుల భర్తీకి సంబంధం లేకపోయినప్పటికీ ఏపీపీఎస్సీ గానీ ఇతర శాఖలు గానీ నోటిఫికేషన్లు జారీ చేయడంలేదు. ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోల్లో రాష్ట్ర కేడర్ పోస్టులు వెయ్యికి మించి ఉండవని, మిగతా పోస్టులన్నీ జిల్లా, జోనల్ పోస్టులేనని, వాటి భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయకపోవడం శోచనీయమని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం ఇటీవలే ఏపీపీఎస్సీకి మాత్రం సభ్యులను నియమించడం విచిత్రంగా ఉందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2011లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.