ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త | Age limit for APPSC exams increased to 42 years, ap government GO issued | Sakshi
Sakshi News home page

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

Published Sat, Nov 5 2016 4:05 PM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త - Sakshi

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త

విజయవాడ:  ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.  ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. అర్హత వయస్సును 42ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. అన్ని ఉద్యోగాల ప్రవేశ పరీక్షలకు (ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల నోటిఫికేషన్లు) ఈ వయో పరిమితి పెంపు ఉత్తర్వులు వర్తించనున్నాయి. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు.. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచారు. 2017 సెప్టెంబర్ 30వ తేదీ వరకు భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే ఈ పరిమితి వర్తించనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement