మళ్లీ పుట్టానంటున్న స్టార్‌ హీరోయిన్.. అసలేం జరిగిందంటే? | Bollywood actress Sushmita Sen add second date of birth on Instagram | Sakshi
Sakshi News home page

Sushmita Sen: ఏడాది క్రితమే మళ్లీ పుట్టానంటోన్న మాజీ విశ్వసుందరి!

Published Fri, Jun 28 2024 8:39 PM | Last Updated on Fri, Jun 28 2024 9:02 PM

Bollywood actress Sushmita Sen add second date of birth on Instagram

బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తెలియనివారు ఉండరు. 1990ల్లో స్టార్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత ప్రతిష్టను పెంచింది. మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సుస్మిత రికార్డ్‌ క్రియేట్‌ చేసింది​. సుస్మిత సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేసింది.

అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా బయోలో కీలక మార్పులు చేసింది. ఏకంగా తన రెండో పుట్టినరోజు అంటూ బయోలో రాసుకొచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అదేేంటని నెటిజన్స్‌ తెగ ఆరా తీస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి.

అయితే గతేడాది సుస్మితా సేన్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2023లో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆమె... ఆ తర్వాత కోలుకుంది. అందుకే తాజాగా ఆమె తన ఇన్‌స్టా బయోలో బర్త్‌ డే తేదీని రాసుకొచ్చింది. నా రెండో పుట్టిన రోజు ఇదేనంటూ.. 27 ఫిబ్రవరి 2023 అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు షాక్‌ అవుతున్నారు. అయితే గుండెపోటు నుంచి కోలుకున్న సుస్మితా.. తనకు పునర్జన్మగా భావించి ఆ తేదీని అలా రాసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ss

కాగా..  1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో  సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్‌ సేన్‌ భారత వైమానిక దళంలో వింగ్‌ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్‌ నగల డిజైనర్‌. సుస్మిత హైదరాబాద్‌లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్‌ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్‌ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్‌ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. 2015 లోనే సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన సుస్మితా సేన్‌.. ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్‌ సీరిస్‌లలో నటించింది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన సుస్మితా సేన్ చివరిసారిగా ఆర్య సీజన్ 3లో కనిపించింది.

dob
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement