అలాంటి పదాలు వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు: సుస్మితా సేన్ | Sushmita Sen recalls her parents told her not to use the word | Sakshi
Sakshi News home page

Sushmita Sen: 'నా 18 ఏళ్ల వయసులో ఆ పదాన్ని ఉపయోగించా.. కానీ'

Published Mon, Jul 22 2024 6:49 PM | Last Updated on Mon, Jul 22 2024 7:12 PM

Sushmita Sen recalls her parents told her not to use the word

బాలీవుడ్‌ నటి సుష్మితా సేన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాజీ విశ్వసుందరి సినిమాల కంటే ఎక్కువగా ఎఫైర్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. పలువురితో ప్రేమాయణం కొనసాగించిన ముద్దుగుమ్మ చివరిసారిగా ఆర్య మూడవ సీజన్‌ వెబ్ సిరీస్‌లో కనిపించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన భామ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానంటూ వెల్లడించింది. తాను 18 ఏళ్ల వయసులో ఉండగా తల్లిదండ్రులు ఇచ్చిన సలహాను గుర్తు చేసుకుంది. రియా చక్రవర్తి ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్‌కు మొదటి అతిథిగా సుస్మితా సేన్ హాజరయ్యారు.

సుస్మిత మాట్లాడుతూ...' ఆ రోజుల్లో సమాజం ఇప్పటిలా ఓపెన్‌గా లేదు. ఏదైనా చెప్పాలంటే సంకోచించే వాళ్లు. నాకు 18 ఏళ్ల వయసులో శోభా దేతో ఇంటర్వ్యూ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే సెక్స్ అనే పదాన్ని తీసుకొచ్చా. ఎందుకంటే నేను ఒక మనిషిగా,  నిజంగా స్వేచ్ఛ ఉండాలని కోరుకున్నా. కాబట్టి ఆ ప్రయత్నంలో నేను భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ అయ్యా. కానీ సెక్స్ అనే పదం వాడినందుకు అమ్మ, నాన్న నన్ను హెచ్చరించారు. నీ భూజాలపై పెద్ద బాధ్యత ఉంది.  ఆ పదాన్ని ఇంటర్వ్యూలో ఎందుకు ఉపయోగించావ్? శోభా దే మీ గురించి చెడుగా రాస్తున్నారు.' అని చెప్పారని వెల్లడించింది.

కాగా.. సుస్మితా సేన్‌ 1975లో బెంగాల్‌లో జన్మించింది. ఆమె 2000వ సంవత్సరంలో రెనీని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement