మాజీ మిస్‌వరల్డ్, నటి సుస్మితాసేన్ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్ వేశారు. దీంతో ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే తన తాజా ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు సుస్మితాసేన్. ‘‘ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యాను. ప్రధాన రక్తనాళం 95 శాతం క్లోజ్ అయ్యింది.
వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. హాస్పిటల్ సిబ్బందికి, నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. నా గొంతు ఇప్పుడు సరిగ్గాలేదు. కానీ భయడాల్సిన పనేంలేదు. చిన్న ఇన్‌ఫెక్షన్ మాత్రమే. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి.
జిమ్‌కు వెళ్లడం వల్ల ఏం ఉపయోగం లేదని కొందరు భావిస్తుంటారు. కానీ, నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ఓ యాక్టివ్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నందునే ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగాను. నా ఆరోగ్యం గురించి వైద్యులు ఓకే చెప్పగానే ‘ఆర్య’ లేటెస్ట్ సీజన్ కోసం జైపూర్ వెళ్తాను. ‘తాలి’ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది’’ అన్నారు సుస్మితాసేన్.
Comments
Please login to add a commentAdd a comment