
వయసు మీరినా వీర్యదానానికి ఓకే!!
వీర్యదానం చేయడానికి వయసుతో సంబంధం లేదని భారత సంతతికి చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఒకరు చెబుతున్నారు.
వీర్యదానం చేయడానికి వయసుతో సంబంధం లేదని భారత సంతతికి చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఒకరు చెబుతున్నారు. 45 ఏళ్ల వయసులో ఉన్నవాళ్లు కూడా 20 ఏళ్లవారిలాగే వీర్యదానం చేయొచ్చని, దాంతో కూడా పిల్లలు పుట్టడానికి సమానమైన అవకాశాలు ఉంటాయని తేల్చిచెబుతున్నారు. ఇందుకోసం లండన్లోని న్యూ కేజిల్ ఫెర్టిలిటీ సెంటర్కు చెందిన డాక్టర్ మీనాక్షి చౌదరి బృందం ఏకంగా 2.30 లక్షల వీర్యం నమూనాలను పరిశీలించింది.
సాధారణంగా పురుషుల వయసు 40 ఏళ్లు దాటితే ఐవీఎఫ్ పద్ధతిలో కృత్రిమ గర్భోత్పత్తి చికిత్స చేసేటప్పుడు 20 నుంచి 35 ఏళ్లలోపు వారినుంచే వీర్యం సేకరిస్తుంటారు. అలా అయితేనే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇన్నాళ్లూ భావించారు. కానీ, మీనాక్షి చౌదరి బృందం చేసిన పరిశోధనలో, 45 ఏళ్లు దాటినవారి నుంచి వీర్యదానం స్వీకరించినా కూడా పిల్లలు పుట్టే అవకాశం ఏమాత్రం తగ్గలేదని తేలింది.