నిజామాబాద్ అర్బన్: గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎన్నో ప్రయాసలు పడు తున్నారు. కొత్త రాష్ట్రంలో కొలువుల జాతర మొదలవడం, వయోపరిమితి కలిసి రావడం తో ఉద్యోగాల కోసం పోటీ పెరుగనుంది. జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏటా 14 వేల నుంచి 15 వేల మంది విద్యార్థులు ఇంటర్, 16 వేల మంది డిగ్రీ, ఐదు వేల మంది పీజీ పూర్తి చేస్తున్నారు.
కొందరు ఇంకా ఉన్నత స్థాయి చదువుల కోసం వెళ్తున్నా, దాదాపు అన్ని స్థాయిల లోనూ ఉద్యోగాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే 66 వేల మంది నిరుద్యోగులు ఉపా ధి కల్పనా కార్యాలయాలలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 40 సంవత్సరాలపై బడినవారు సుమారు 30 వేల మం ది వరకు ఉన్నారు. కొందరు బీఈడీ, టీటీసీ శిక్షణలో ఉన్నారు. మరికొందరు కోచింగ్ సెం టర్లలో శిక్షణ పొందుతున్నారు.
వీరంతా వయోపరిమితి సడలింపుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుల్, బ్యాంకు సిబ్బంది, ప్రభుత్వంలోని వివి ధ శాఖల అధికారులు, సిబ్బంది ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. ప్రయివేటు ఉద్యోగాలపైన కూడా వారి దృష్టి ఉంది. వీరంతా, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశించినవారే. సీఎం ప్రటన వారి ఆశలకు ఊపిరి పోస్తోంది.
సడలింపుపై హర్షం
దాదాపు అన్ని కేటగిరీలలో వయోపరిమితిని ఐదేళ్ల వరకు పెంచారు. నేడో, రేపో వయస్సు మించిపోతుందేమోనని బెంగపడేవారికి ఇది ఎంతగానో ఊరటనిచ్చింది. దాదాపు అన్ని రకాల ఉద్యోగాలూ వయోపరిమితిని సడలించడంపైన కూడా వారం తా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖలలలో ఖాళీల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీటి భర్తీ జరిగితే ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులు అందుబాటులోకి రావడమే కాకుం డా నిరుద్యోగులకు ఉపాధి కూడా లభించే అవకాశాలున్నాయి. జిల్లా అధికార యం త్రాంగం కూడా ఖాళీల భర్తీకి సమాయత్తమవుతోంది.
వయోపరిమితి సడలింపుతో యువతలో ఆనందం
Published Wed, Nov 26 2014 3:31 AM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
Advertisement