
ఓటేసిన పాపానికా..!
మాకు ఓటేస్తే రూ.1000 వృద్ధాప్య పింఛను ఇస్తామని హామీనిచ్చిన టీడీపీ.. అధికారంలోకొచ్చాక ఏకంగా పింఛన్లకే ఎసరు పెట్టింది.
మాకు ఓటేస్తే రూ.1000 వృద్ధాప్య పింఛను ఇస్తామని హామీనిచ్చిన టీడీపీ.. అధికారంలోకొచ్చాక ఏకంగా పింఛన్లకే ఎసరు పెట్టింది. పింఛన్ అందుకోవడానికి సరైన వయసు లేదంటూ వేలాది మంది పింఛన్లకు కోతపెట్టింది. ఇలాగే అనంతపురం జిల్లాలో పింఛన్లు కోల్పోయిన వందలాది మంది వృద్ధులు తమ వయసుకు ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం కోసం మంగళవారమిలా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన ప్రత్యేక క్యాంపునకు తరలివచ్చారు.
గార్లదిన్నె, రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లోని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో వృద్ధులు రావడంతో తోపులాట చోటుచేసుకుంది. ఇక్కడ తగిన భద్రత ఏర్పాట్లు లేక, మెట్లు ఎక్కి పైకి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతూ, తొక్కిసలాటలో ఊపిరాడక వారు నలిగిపోయారు. ఈ వయసులో ఈ కష్టమేంటిరా దేవుడా అనుకుంటూ కొందరు కన్నీటి పర్యంతమయ్యూరు.