పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు | Telangana Government Increses Age Limit For Police Jobs | Sakshi
Sakshi News home page

పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

Published Thu, Jun 7 2018 4:47 PM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM

Telangana Government Increses Age Limit For Police Jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల విడుదలైన పోలీసు ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌కు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పోలీసు శాఖ సవరణ నోటిఫికేషన్‌కు విడుదల చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా 18,428 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖలకు సంబంధించిన పోస్టులను ఇందులో భర్తీ చేస్తున్నారు. వీటన్నింటికి మూడేళ్ల వయో పరిమితిని పెంచతున్నట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేర్కొంది.

కాగా, గత గురువారం నోటిఫికేషన్‌ అనంతరం ఆరేళ్ల పాటు వయో పరిమితి పెంచాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులు రోడ్లు ఎక్కిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం మూడేళ్ల పాటు వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బోర్డు వెబ్‌సైట్‌ (www.tslprb.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునే ప్రతి పోస్టుకు కూడా వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

పోస్టులు, అర్హతలు ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement