కొత్తగూడెం క్లూస్ విభాగానికి చెందిన శీలం రమణారెడ్డిగా గుర్తింపు
ఉదయం నుంచి సాయంత్రం వరకూ గాలింపు.. అయినా దొరకని ఆచూకీ
భద్రాచలం అర్బన్: వంతెన పైనుంచి గోదావరి నదిలోకి దూకిన పోలీస్ కానిస్టేబుల్ శీలం నాగ రమణారెడ్డి గల్లంతయ్యాడు. శుక్రవారం ఉదయం ఆయన భద్రాచలంలోని బ్రిడ్జి వద్ద నదిలో దూకుతుండగా గమనించిన స్థానికు లు.. ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో భద్రాచలం టౌన్ పోలీ సులు అప్రమత్తమై గజ ఈతగాళ్లు, బోటు సా యంతో ఉదయం నుంచి రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. తల్లాడ మండలం కర్ణపల్లి గ్రామానికి చెందిన నాగరమణారెడ్డి కొత్తగూడెం జిల్లా క్లూస్ విభాగంలో పనిచేస్తూ పాల్వంచలో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
సెల్ఫీ వీడియో..: తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు నాగరమణారెడ్డి తన ఫోన్లో రికార్డు చేసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. గత నెల 24న పాల్వంచలో రమణారెడ్డి ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. అప్పటి నుంచి తాను మానసిక ఒత్తిడికి గుర య్యానని, గాయాల కారణంగా ప్రశాంతంగా నిద్ర కూడా పోలేని పరిస్థితి నెలకొందని వీడియోలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment