![Women, you will have to carry age proof for visiting Sabarimala temple - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/5/shabarimala.jpg.webp?itok=YD-6n578)
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలు ఇకపై వయసు నిర్ధారణ పత్రాన్ని తప్పనిసరిగా తీసుకొని రావాలని ది ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) స్పష్టం చేసింది. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు దేవస్థాన ప్రవేశం నిషేధించిన నేపథ్యంలో బోర్డు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఏదైనా వయసు నిర్ధారణ పత్రం లేదా ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందని టీడీబీ చైర్మన్ ఏ. పద్మాకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment