shabarimala
-
Makara jyothi: దర్శనమిచ్చిన మకర జ్యోతి.. పరవశించిన అయ్యప్ప భక్తులు
తిరువనంతపురం: కోట్లాది మంది భక్తులు ఏడాది పాటు ఎదురు చూసే క్షణం రానే వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన సోమవారం సాయంత్రం 6.47 గంటలకు కేరళలోని శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడుపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మొత్తం మూడుసార్లు జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు ట్రావెన్కోర్ బోర్డు అనుమతిచ్చినప్పటికీ సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించారు. భక్తులు జ్యోతిని దర్శించుకునేందుకు ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్‌లో కొన్ని కోట్ల మంది జ్యోతి దర్శనం చేసుకున్నారు. జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యాప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. Makara jyothi sighted.. worshiped by pilgrims at Sabarimala Temple in Kerala Swamiye Saranam Ayyappa...🙏 @TigerRajaSingh @bandisanjay_bjp @BJP4Telangana @narendramodi @myogiadityanath pic.twitter.com/r01oVSwcWg — Dinesh kumar 🇮🇳 (@Dineshdinnu86) January 15, 2024 హరిహర తనయుడు అయ్యప్పస్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి/మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. ఇదీచదవండి.. రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకు రాడట -
కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల..
సూర్యపేట: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్‌జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. ఇవి చదవండి: New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం! -
కేరళ సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణసహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయ్యప్పస్వామి భక్తులు 40 రోజులపాటు చేసే ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష ఆ తర్వాత.. శబరిమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం హిందూ ధర్మంపట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటిమందికిపైగా భక్తులు వివిధ రాష్ట్రాలనుంచి మండలదీక్షను పూర్తిచేసుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుంది. అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. భక్తుల ద్వారా, పత్రికలు, చానళ్లలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. ఇటీవలే.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో.. దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లులేక తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధకలిగింది. శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో.. ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరని కోరుతున్నాను. శబరిమలపై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయగలరని మనవి చేస్తున్నాను. అయ్యప్పస్వామి మండల దీక్షలో ఉన్న భక్తులకు శబరిమల యాత్ర సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించడం, వారి యాత్ర భక్తిప్రద్రంగా, శుభప్రదంగా జరిగేలా చూడడం అత్యంత అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం భక్తులకు సౌకర్యార్థం అందించేందుకు సిద్ధంగా ఉంది. భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థల (NGO)ను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో మీరు వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
శబరిమలైలో కమెడియన్ యోగిబాబు సినిమా ప్రారంభం
తమిళసినిమా: నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సన్నిదానం పో చిత్ర షూటింగ్‌కు శబరిమలైలో శ్రీకారం చుట్టారు. సర్వదా సినీ గ్యారేజ్, షీమోన్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు మధుసూదన్, షబీర్ బదాన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. యోగిబాబు, ప్రమోద్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ చిత్రానికి రాజీవ్ వైద్య దర్శకత్వం వహిస్తున్నారు. అయ్యప్పమాల ధరించి శబరిమలైకి వెళ్లిన దర్శకుడు, నటి నయనతార భర్త విఘ్నేశ్‌శివన్ ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. చిత్రం శబరిమలై నేపథ్యంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. శబరిమలై సన్నిధానం, అక్కడ డోలీ మోసే వారు, సన్నిధానంలో ఏర్పాటు చేసిన పోస్టాఫీస్ వంటి పలు అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయని తెలిపారు. -
రోజుకు 25 వేల మందికి అయ్యప్ప దర్శనం
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రతి రోజూ గరిష్టంగా 25 వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకోవచ్చని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. ఈ ఏడాది కరోనా ఉధృతిలో తగ్గుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. శబరిమల దర్శనాలకు సంబంధించి దక్షిణాది ఐదు రాష్ట్రాల అధికారులతో కేరళ ప్రభుత్వ అధికారులు మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా ఉధృతి చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులకు అనుమతిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం నుంచి శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు తెలిసేలా విస్త్రత ప్రచారం కల్పించాలని కేరళ ప్రభుత్వం కోరింది. శబరిమల యాత్రికులకు కేరళ ప్రభుత్వం సూచనలు: ► శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ► రెండు డోసుల కరోనా టీకా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం వెంట తీసుకురావాలి. లేదా దర్శనానికి 72 గంటల ముందుగా పరీక్ష చేయించుకుని, కోవిడ్ నెగిటివ్ ధృవీకరణ పత్రాన్ని వెంట తెచ్చుకోవాలి. ► శబరిమల ఆలయ పరిసరాలలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులనూ అనుమతించరు. ► పంబా నదిలో స్నానాలపై ఆంక్షలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయి. నదీ స్నానాలకు బదులు కేవలం నది వెంబడి షవర్ స్నానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. -
సైద్ధాంతిక అయోమయంలో ఆ రెండు పార్టీలు
చకరక్కల్: సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు సైద్ధాంతికపరంగా అయోమయంలో పడ్డాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కేరళలో కత్తులు దూసుకుంటున్న ఈ రెండు పార్టీలు.. బెంగాల్లో కలిసికట్టుగా పోరాడుతుండటం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సమయంలో గమనించదగ్గ విషయమని ఆయన అన్నారు. కేరళలోని ధర్మదామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి సీకే పద్మనాభన్ తరఫున ఆయన శనివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ సీపీఎం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ బరిలో ఉన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశ విషయమై వెల్లువెత్తిన ఆందోళనలను అణచివేసేందుకు అధికార సీపీఎం అణగదొక్కేందుకు యత్నించగా, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హామీ ఇస్తోందన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో పోరాటం చేస్తోందని చెప్పారు. బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన సీఎం విజయన్.. విచారణ అధికారులు ఆయన కార్యాలయానికి వెళ్లగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తోందంటూ ఎదురుదాడికి దిగారన్నారు. కేరళ ప్రజలు ప్రధాని మోదీ వెంటే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం కేరళకు భారీ ప్రాజెక్టులు మంజూరు చేసేలా తమ పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. -
అందరికీ అవే నియమాలు
కార్తీక మాసం వచ్చిందంటే ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. కార్తీక దీపాలు వెలుతురు నింపుకుంటాయి. అయ్యప్ప మాలధారులు ఎటు చూసినా కనిపిస్తారు. సూర్యోదయం కంటే ముందుగానే మేల్కొని,వణికే చలిలో చన్నీళ్లతో స్నానం చేసి, ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకుంటూ, కాళ్లకు పాదరక్షలు లేకుండా 41 రోజుల పాటు నియమాలన్నీ పాటిస్తూ, ఆత్మప్రక్షాళన చేసుకుంటారు. అయ్యప్ప దీక్షలో ఈ నియమాలు అందరికీనా?ఆడవాళ్లకేమైనా సడలింపు ఉందా? సృష్టిలోని ప్రాణులన్నీ పరమాత్ముని సంతానమే. తన బిడ్డలు క్రమశిక్షణలో పెరగాలని, ఆరోగ్యంగా ఉండాలని, మంచి మార్గంలో నడచుకోవాలని పరమాత్ముడు ఆశిస్తాడు. హైందవ ధర్మంలో ఇతర దీక్షలతో పోలిస్తే అయ్యప్పస్వామి దీక్షలో భక్తులంతా క్రమశిక్షణ, భక్తి విశ్వాసాలతో మెలగాల్సి ఉంటుంది. దీక్ష స్వీకరించిన ప్రతి ఒక్కరూ 41 రోజులు పూర్తయ్యాక, అడవిమార్గం గుండా కాలినడకన అయ్యప్పను దర్శించుకుంటారు. కొండ మీద కొలువైన స్వామిని కొలవడానికి ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని భక్తుల నమ్మకం. అయ్యప్ప దీక్షలో బాహ్యంగా కనిపించే నియమాల కన్నా ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలను తెలుసుకోవడం మంచిది. దీక్షలో సందేహాలు... అయ్యప్ప దీక్షలో ఉన్నవారికి మాంసాహారం నిషేధం. అలాగని మాంసం విక్రయించే వారు దీక్ష తీసుకోరాదన్న నియమమేమీ లేదు. శుభ్రత ముఖ్యం. పారిశుద్ధ్య వృత్తిలో ఉన్నవారు సైతం స్వామి మాల వేసుకోవచ్చు. మాల వేసుకున్నవారు మైల, అంటు ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. కాని మైలబట్టలను ఉతికి శుభ్రం చేసే వృత్తిలోని వారు అయ్యప్ప దీక్ష తీసుకోరాదనే నిబంధన ఏమీ లేదు. స్వామిని సేవించుకోవాలన్న కోరిక ఉన్న ప్రతివారు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే స్వామి మాల ధరించవచ్చు. ఋతుధర్మం ఉన్న స్త్రీలు మాత్రం మాల ధరించడానికి వీలు లేదు. ఋతుక్రమం ఇంకా మొదలు కాని బాలికలు, శారీరకంగా ఆ ధర్మం దాటిపోయిన వారు మాలధారణ చేయవచ్చు. అంతరార్థం...అయ్యప్పదీక్షలోని ప్రతి నియమం ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఏర్పరచినవే. చన్నీటి స్నానం – మానసిక ప్రశాంతత lమెడలో ధరించే తులసి లేదా రుద్రాక్ష మాల –రక్తపోటు, మధుమేహం, మానసిక శారీరక రుగ్మతలను దూరం చేయడం ∙ఆహార నియమం – కోరికలను దూరం చేయడం, జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచడం ∙పాదరక్షలను విడిచిపెట్టడం – కష్టాలను ఓర్చుకునే శక్తి ∙నల్ల దుస్తులు – సౌందర్య పిపాస మీద మమకారం పోగొట్టడం ∙విభూతి గంధం ధరించడం – చక్కటి వర్చస్సు, ధైర్యం, బలం ∙భూశయనం – వెన్నెముక గట్టిపడుతుంది. వెన్నుపూస జారడం, వీపునొప్పి వంటి రుగ్మతలను దూరం చేయడం ∙బ్రహ్మచర్య దీక్ష – దంపతుల మధ్య అనురాగం. ఈ నలభై ఒక్క రోజుల దీక్షలో సమయపాలన, ఏకాగ్రత, స్థిరచిత్తం, భగవంతుని మీద దృఢమైన భక్తి విశ్వాసాలు, నిరాడంబరత, మృదుభాషణ వంటి మంచిlలక్షణాలు అలవడతాయి. పూర్ణ సంఖ్య అయిన 18 పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం. స్త్రీలకు కేరళ ప్రభుత్వం ప్రాధాన్యం శబరిమల వచ్చిన భక్తులలో కేరళ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఆడవారికి కల్పిస్తోంది. స్త్రీలకి ఇక్కడ గౌరవ ప్రదంగా ఉంటుంది. కేరళ ప్రభుత్వం నవంబరు 16 నుంచి డిసెంబరు 25 వరకు మండలపూజ ఏర్పాటు చేస్తుంది. జ్యీతి దర్శనం జనవరి 14 వ తారీకు. ఇప్పుడు అక్కడ అన్నసంతర్పణ తగ్గింది. నేను 18 సంవత్సరాలుగా శబరిమల వెళ్తున్నాను. మా పిల్లలిద్దరికీ పది సంవత్సరాలు వచ్చేవరకు తీసుకువెళ్లాను. 50 సంవత్సరాలు దాటిన వాళ్లని కూడా తీసుకువెళ్లాను. సాధారణంగా ఒక బృందంలో పెద్దవాళ్లు, పిల్లలు, ఆడవారు సుమారు పదిహేను మంది దాకా ఉంటారు. వాళ్ల కోసం గదులు బుక్ చేస్తుంటాం. వాళ్లు దీక్ష తీసుకునేటప్పుడు నల్ల చీర, మాల ధరించి వస్తారు. స్త్రీలలో 62 సంవత్సరాల వాళ్లు 11 రోజులుగానీ, 21 రోజులుగానీ దీక్ష తీసుకుంటారు. ఇందులో బ్రహ్మచర్యం ప్రధానం. కొద్దిగా పెద్ద వయసు మహిళలు తెల్లవారుజామునే చన్నీళ్ల స్నానం చేయడానికి ఇబ్బంది పడతారు. కాని వాళ్లకి దేవుణ్ని చూడాలనే కోరిక బలంగా ఉంటుంది. ఇప్పటికి నేను 40 సార్లు వెళ్లాను. అన్నిసార్లు కొత్తవారు తప్పనిసరిగా ఉంటారు. ఇదొక వైజ్ఞానిక, ఆధ్యాత్మిక యాత్ర. తక్కువ ఖర్చుతో వెళ్లేలా చూసుకుంటాను. మాకు వంటవాళ్లు ఉండరు. మేమే చేసుకుంటాం. భయం మనసులో ఉంటే అడుగు వేయలేము. అడవిదారిలో లోయలోకి వెళ్లి చూద్దామంటే భయం వేస్తుంది. జాగ్రత్తగా వెళితే దోమ కూడా కుట్టదు. నాకు భాష రాకపోయినా కూడా తేలికగా తీసుకువెళ్తాను. ఆడపిల్లలను తీసుకువెళ్లడం తప్పు కాదు. నోట్లోకి ముద్ద వెళ్తోందంటే ఆడపిల్లే కారణం. నా భార్యను కిందటి సంవత్సరం తీసుకువెళ్లాను. ఆడపిల్లలు రోజూ తలస్నానం చేయలేకపోతారు. అందువలన కూడా కొందరు ఆడవాళ్లు రాలేకపోతున్నారు. నేను ఒక సంవత్సరమైతే ప్రతి నెలా వెళ్లాను. ప్రతి నెలా ఐదు రోజులు ఈ దేవాలయాన్ని తెరుస్తారు. పంబాలో స్నానం చేస్తే చాలా బావుంటుంది. మళ్లీ రావాలనిపిస్తుంది. ప్రకృతిలో నడిచినప్పుడు వనమూలికల వాసన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆ వాసన పీలుస్తూ వెళ్తాం. పారిజాతాల కంటె ఇక్కడి ప్రకృతి మూలికల వాసన చాలా బాగుంటుంది. – వల్లభజోస్యుల వెంకటరత్నం గురుస్వామి, మచిలీపట్నం మా అమ్మాయిలను కూడా తీసుకెళ్లాను నేను ఇప్పటికి 12 సార్లు దీ„ý లోను, నాలుగైదుసార్లు దీక్ష లేకుండానూ శబరిమల అయ్యప్పను దర్శించుకున్నాను. మా అక్కయ్య సుభాషిణి (55), మా పిల్లలు చిన్మయి, శ్రీమణి ఇద్దరూ తొమ్మిది సంవత్సరాలు వచ్చేవరకు నాతోనే వచ్చారు.నేనే గురుస్వామిని కావడం వల్ల ఇరుముడులు కట్టడం, పూజలు చేయడం, అన్నీ మా ఇంట్లోనే. నియమాలలో ఆడవారు, మగవారు అనే తేడా ఉండదు. అక్కడకు వచ్చేవారిలో 90 శాతం మగవారు, కేవలం 10 శాతం మాత్రమే ఆడవారు ఉంటారు. ఆడవారితో వెళ్లేటప్పుడు కనీస సౌకర్యాలు ఉండే రూమ్స్ బుక్ చేసుకుంటాం. పంబ నదికి స్నానానికి వెళ్లినప్పుడు ఆడవారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. మనలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం, స్వామిని దర్శించుకోవడం, పెడత్రోవలు పట్టకుండా దీక్షగా ఉండటం ఈ నియమాల లక్ష్యం. – మొక్కపాటి మురళీకృష్ణ,గురుస్వామి, హైదరాబాద్ -
242 కేసులు.. నాలుగు పేజీల ప్రకటన!
కేరళలోని పత్తనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ సమర్పించిన అఫిడవిట్ చూసి ఎన్నికల అధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తనపై ఏకంగా 242 క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. వాటిలో 222 కేసులు శబరిమల ఆందోళనకు సంబంధించినవేనట. వందల సంఖ్యలో కేసులుండటం ఒక విశేషమైతే, ఆ కేసుల వివరాలను ప్రకటించడానికి వార్తా పత్రికలో నాలుగు పూర్తి పేజీలు కేటాయించాల్సి వచ్చిందట. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలను మూడు సార్లు పత్రికల్లో ప్రకటించాలి. టీవీల్లో కూడా మూడుసార్లు ప్రసారం చేయాలి. సురేంద్రన్ కేసుల వివరాలను పార్టీ పత్రిక ‘జన్మభూమి’లో ప్రకటించారు. అన్ని కేసుల వివరాలు ప్రకటించడానికి నాలుగు పేజీలు కావలసి వచ్చింది. ఇక టీవీ విషయానికి వస్తే మామూలుగా ఒక అభ్యర్థి కేసుల ప్రసారానికి ఎక్కువలో ఎక్కువ ఏడు సెకన్లు పడుతుంది. అయితే, మన హీరోగారి కేసులన్నీ చదవడానికి 60 సెకన్లు పట్టిందట. టీవీ ప్రకటన కూడా పార్టీకి చెందిన ‘జనం టీవీ’లోనే ఇచ్చారు. పార్టీ పత్రిక కాబట్టి సరిపోయింది కాని అదే వేరే వార్తా పత్రికలో ఆ ప్రకటన ఇవ్వాలంటే ఒకసారి ఇవ్వడానికే రూ.60 లక్షలకు పైగా చెల్లించాల్సి వచ్చేదని, ఇది ఎన్నికల సంఘం అభ్యర్థికి కేటాయించిన ఎన్నికల ఖర్చుకంటే ఎక్కువని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక టీవీ ప్రకటన ఖర్చుకూడా కలిపితే సురేంద్రన్ పరిమితికి మించి ఖర్చు చేసినందుకు కచ్చితంగా అనర్హుడవుతారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, సురేంద్రన్‌పై ఉన్న కేసులేవీ కోర్టులో నిలబడేవి కావని కేరళ బీజేపీ శాఖ ప్రతినిధి ఎంఎస్ కుమార్ అన్నారు. చాలా కేసులు ఎన్నికలకు కొన్ని రోజుల ముందే నమోదయ్యాయని తెలిపారు. శబరిమల ఆందోళన సందర్భంగా గత ఏడాది డిసెంబర్లో సురేంద్రన్ 22 రోజులు జైల్లో ఉన్నారు. -
పినరయి విజయన్ (కేరళ సీఎం) రాయని డైరీ
మాధవ్ శింగరాజు స్టేట్‌లో ఉన్నది ఒకటే సీటైనా, స్టేటంతా తమదే అన్నట్లు కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు బీజేపీ భక్తులు. ‘బీజేపీని ఆపగలుగుతున్నాం కానీ, బీజేపీలోని భక్తిని ఆపలేకపోతున్నాం సర్..’ అన్నాడు లోక్‌నాథ్ బెహెరా ఫోన్ చేసి! ఒక డీజీపీ అనవలసిన మాట కాదు. ‘‘బీజేపీ, భక్తి రెండూ ఒకటే అయినప్పుడు బీజేపీని ఆపితే ఆటోమేటిగ్గా బీజేపీలోని భక్తి కూడా ఆర్డర్‌లోకి రావాలి కదా లోక్‌నాథ్’’ అని అడిగాను. ‘‘కానీ సర్, బీజేపీ కన్నా, బీజేపీలోని భక్తే ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంది. పట్టలేకపోతున్నాం. దాన్నే పట్టగలిగితే బీజేపీని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. అందుకోసమే ట్రయ్ చేస్తున్నాం సర్’’ అన్నాడు. ‘‘ఎందుకోసం?’’ అన్నాను. ‘‘అదే సర్, బీజేపీలోని భక్తిని పట్టుకోవడం కోసం’’ అన్నాడు. భక్తినెలా పట్టుకుంటాడో అర్థం కాలేదు! ‘‘లోక్‌నాథ్, మీరు భక్తిని పట్టుకునే ప్రయత్నంలో మిమ్మల్ని భక్తి పట్టుకోకుండా జాగ్రత్త పడండి’’ అని చెప్పాను. ‘‘సర్, శబరిమల నుంచి ఫోన్’’ అంటూ గాభరాగా వచ్చాడు టామ్ జోస్. ‘‘ఎవరికొచ్చింది? ఎవరు చేశారు?’’ అని అడిగాను. ‘‘కనుక్కుంటాను సర్’ అని, నాకివ్వబోయిన ఫోన్‌ని మళ్లీ తన చెవి దగ్గర పెట్టుకున్నాడు! టామ్ జోస్ కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ. పాల్ ఆంటోని ప్లేస్‌లో వచ్చాడు. పాల్ ఆంటోని రిటైర్ అయ్యాడని టామ్ జోస్‌ని తెచ్చుకుంటే, టామ్ జోస్ రిటైర్ కాకుండానే ‘ఆషా థామస్‌ని తెప్పించుకోండి నేను పోతున్నా..’ అనేసేలా ఉన్నాడు. ఆషా థామస్.. అతడి తర్వాత లైన్లో ఉన్న చీఫ్ సెక్రటరీ. శబరిమల నుంచి ఫోన్ వచ్చిన ప్రతిసారీ, శబరిమల ఇంకే స్టేట్‌లోనైనా ఎందుకు లేకపోయిందా అన్నట్లు ఫీలింగ్ పెట్టేస్తున్నాడు టామ్ జోస్. రెండు వేల ఇరవై వరకు ఉంది అతడి టెన్యూర్. ఈ మకరజ్యోతి కాకుండా, ఇంకో మకరజ్యోతిని కూడా చూడాలి అతడు. ఇద్దరు మహిళలు గుడిలోకి ఎంటర్ అవడంతో గుడిని శుద్ధి చేశారనే వార్త వచ్చిన వెంటనే అతడికో ఆలోచన వచ్చింది. ‘‘ఈసారి మకరజ్యోతి కనిపించదేమో సర్’’ అన్నాడు సడన్‌గా! ‘‘ఎందుకని?’’ అన్నాను. ‘‘గుడిని అపవిత్రం చేస్తుంటే సీపీఎం చూస్తూ కూర్చున్నందుకు అయ్యప్పకు కోపం వచ్చిందని ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు మకరజ్యోతిని కనిపించనీయకుండా చెయ్యొచ్చు కదా సర్’’ అన్నాడు!! షాక్ తిన్నాను. సీపీఎంకి ఐడియాలు ఇచ్చేందుకు చీఫ్ సెక్రెటరీగా పెట్టుకుంటే బీజేపీవాళ్లకు ఐడియాలు ఇచ్చేలా ఉన్నాడు టామ్ జోస్. మకరజ్యోతికి ఇంకో వారమే ఉంది. ఈలోపు ఏవైతే జరగకూడదో వాటన్నిటినీ గొప్ప భక్తి పారవశ్యంతో దగ్గరుండి మరీ జరిపించేలా ఉంది బీజేపీ. మోదీకి ఫోన్ చేశాను. ‘‘బోలియే.. విజయన్‌జీ.. ఎప్పుడో వరదల్లో కలిశారు, మళ్లీ ఇన్నాళ్లకు!’’ అన్నాడు. ‘‘ఇప్పుడూ వరదలే మోదీజీ. భక్తి వరద’’ అన్నాను. ‘‘నేనేం చేయగలను విజయన్‌జీ.. పేద భక్తుడిని’’ అన్నాడు! ‘‘భక్తిని, పేదరికాన్ని దాచిపెట్టుకోవాలి మోదీజీ. ప్రదర్శనకు పెట్టకూడదు. భక్తిని ప్రదర్శిస్తే భక్తిలోని లేమి మాత్రమే బయటికి కనిపిస్తుంది. పేదరికాన్ని ప్రదర్శిస్తే ‘లేని సంపన్నత’పై భక్తిగా మాత్రమే లోకం దాన్ని చూస్తుంది. లోపల ఉంచుకోవడమే నిజమైన భక్తి. లేమిని దాచుకోవడమే నిజమైన సంపన్నత’’ అన్నాను. అన్నానే కానీ, లైన్ ఎప్పుడు కట్ అయిందో చూసుకోలేదు. -
త్వరగా వచ్చేయ్..మరో పార్టీ ఉంది
శబరిమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఈ సంఘటన మదనపల్లె బైపాస్‌రోడ్డులో చోటుచేసుకుంది. చిత్తూరు , మదనపల్లె సిటీ : అనంతపురం జిల్లా ఓబుళదేవలచెరువు (ఓడిసి), గోరంట్ల, నల్లమాడ మండలాలకు చెందిన 18 మంది అయ్యప్ప భక్తులతో పాటు వారి కుటుంబసభ్యులు 27 మంది శబరిమలకు ప్రైవేటు బస్సులో ఈనెల 20న ఓడిసి నుంచి బయలుదేరి వెళ్లారు. 22న అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కన్యాకుమారి, రామేశ్వరంలోని ఆలయాలను సందర్శించారు. గురువారం వేలూరు సమీపంలోని స్వర్ణదేవాలయం దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. మదనపల్లె బైపాస్‌రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. అప్పుడు సమయం ఉదయం 3.30 గంటలు. బస్సు ముందరి అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. భక్తుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. బస్సులో ప్రయాణిస్తున్న గోర్లంట మండలం పాలసముద్రం పంచాయతీ లింగొల్లపల్లెకు చెందిన వంటమాస్టర్ సిద్ధిరెడ్డిగారి తిరుపాల్‌రెడ్డి (40) రెండు కాళ్లు విరిగిపోయాయి. అలాగే రామాంజులమ్మ (40), చంద్ర (30), సాలమ్మ (70) బాలనాగమ్మ(70), లలితమ్మ(70), ఆంజనమ్మ (65), నాగలక్ష్మి(62), వెంకట్రమణప్ప(65), లావణమ్మ(46), ఆదిలక్ష్మమ్మ (65), వెంకటశివారెడ్డి (65), సవరమ్మ (45), వెంకటలక్ష్మి(70), బి.రమణప్ప(55) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే రూరల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తిరుపాల్‌రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం పుట్టపర్తిలోని సత్యసాయి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. గాయపడిన వారిలో పలువురిని 108లో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. స్వల్పంగా గాయపడిన వారిని పోలీసులు మరో బస్సులో స్వగ్రామాలకు తరలించారు. రూరల్ పోలీçసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐచర్ వ్యాను ఢీకొని మోటార్ సైక్లిస్టు.. పీలేరు రూరల్ : ఐచర్ వ్యాను ఢీకొనడంతో మోటార్ సైక్లిస్టు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. సో మల మండలం నెల్లిమందకు చెందిన ఓంకార్ (23) మోటార్ సైకిల్లో పీలేరు నుంచి వాల్మీకిపురానికి బయలుదేరాడు. కలికిరి నుంచి పీలేరుకు ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం జంగంపల్లె అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓంకార్‌ను చికిత్స నిమిత్తం 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఓంకార్ మృతి చెందాడు. పీలేరు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని వైఎస్సార్ జిల్లా వాసి... పుత్తూరు: రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సం ఘటన పుత్తూరులో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ కథనం.. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం చెర్లోపల్లెకు చెందిన ఎస్.లక్ష్మీనారాయణ (33)కొన్నేళ్లుగా కూలీ ప నులు చేసుకుంటూ బొజ్జనెత్తంలో నివాసముంటున్నా డు. శుక్రవారం ఉదయం అతడు పుత్తూరు– తడుకు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. లక్ష్మీనారా యణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హెడ్‌కానిస్టేబుల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత హెచ్ఎం.. కార్వేటినగరం: గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం..ముస్లిం కాలనీకి చెందిన రిటైర్డ్ హెచ్ఎం పీ.ఎండీ షఫీఉల్లాఖాన్(72) సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో పుత్తూరుకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, సురేంద్రనగరం పెద్ద కనుమ వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. గతంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘంలో నాయకుడిగా, ప్రస్తుతం మండల విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘానికి మండల అ«ధ్యక్షుడిగా షఫీ వ్యవహరిస్తున్నారు. పలువురు పెన్షనర్ల సంఘ నాయకులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. త్వరగా వచ్చేయ్..మరో పార్టీ ఉంది ‘త్వరగా..త్వరగా వచ్చేయ్..మరో పార్టీ ఉంది’ అన్న బస్సు ఓనర్ మాటలే కొంపముంచాయి. వాస్తవానికి తాము గోల్డెన్ టెంపుల్ దర్శించుకున్న అనంతరం కాణిపాకం దేవాలయాన్ని సందర్శించాల్సి ఉందని, అయితే బస్సు ఓనర్ అర్జెంట్‌గా రమ్మన్నాడని, మరో పార్టీని తీసుకెళ్లాలని ఆదేశించాడని, అందుకే కాణిపాకానికి తీసుకెళ్లలేనంటూ డ్రైవర్ నేరుగా అనంతబాట పట్టాడని భక్తులు చెప్పారు. అంతేకాకుండా సుదీర్ఘమైన ప్రయాణానికి ఇద్దరు డ్రైవర్లకు బదులు ఒక్కడినే పంపడం, ఏకధాటిగా ఒకడే రేయింబవళ్లూ బస్సు నడుపుతుండడం.. నిద్రలేక కునుకుతీయడం వలనే ఈ ఘోర ప్రమాదం సంభవించిందని భక్తులు ‘సాక్షి’కి చెప్పారు. -
పటిష్ట భద్రత మధ్య పూజలు
తిరువనంతపురం/శబరిమల: సాయుధ కమాండోలు.. భారీ సంఖ్యలో పోలీసులు.. అడుగడుగునా నిఘా కెమెరాలు.. కీలకప్రాంతాల్లో మొబైల్ జామర్లు..వంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో స్వామి అయ్యప్ప కొలువైన శబరిమల సోమవారం దుర్భేద్యమైన కోటగా మారింది. శ్రీచిత్ర తిరునాళ్‌ను పురస్కరించుకు ని నేడు జరిగే ప్రత్యేక పూజలకు గాను శబరిమల గుడిని పూజారులు సోమవారం సాయం త్రం 5 గంటలకు తెరిచారు. దీంతో స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ముందుకు కదిలారు. ఓ మహిళ (30) స్వామి దర్శనం కోసం రావడంతో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ముఖ్యుల చాంబర్ల వద్ద జామర్లు గత నెలలో శబరిమలలో పూజల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న కేరళ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. 20 మంది సభ్యుల సాయుధ కమాండోల బృందాన్ని, 100 మంది మహిళా పోలీసులను కలిపి దాదాపు 2,300 మంది పోలీసులను ప్రధాన ఆలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో మోహరించింది. ఆలయ సముదాయంలో కూడా 50ఏళ్ల పైబడిన మíß ళా పోలీసులను నియమించింది. ముఖ్య పూజారి కందరారు రాజీవరుతోపాటు ఇతర అధికారులు మీడియాతో మాట్లాడే అవకాశం లేకుండా సెల్‌ఫోన్ జామర్లు ఏర్పాటు చేసింది. మహిళాప్రవేశంపై నిరసన.. ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు సుమారు 5వేల మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున వారిని బృందాలుగా లోపలికి అనుమతిస్తున్నారు. అలప్పుజ జిల్లా చెర్తాల ప్రాంతానికి చెందిన అంజు(30) తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి పంబ వద్దకు చేరుకుని స్వామి దర్శనం కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కొందరు మహిళా జర్నలిస్టులు కూడా భద్రత మధ్య పంబ వద్దకు చేరుకున్నారు. దీంతో హిందూ ఐక్య వేదిక నాయకురాలు శశికళ నేతృత్వంలో పంబ గణపతి ఆలయం వద్ద భక్తులు కొండపైకి వెళ్లే మార్గాన్ని దిగ్బంధించారు. రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నందున భక్తులెవరినీ అక్కడ ఉండేందుకు అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అది బీజేపీ అధ్యక్షుడి సలహాయే..! కోజికోడ్‌లో ఆదివారం జరిగిన యువమోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై మాట్లాడిన వివాదాస్పద ప్రసంగం వీడియో కలకలం రేపుతోంది. గత నెలలో ఆలయం తెరిచిన సమయంలో 50ఏళ్లలోపు మహిళలెవ్వరినీ లోపలికి రానివ్వబోనని, అవసరమైతే ఆలయ ద్వారాలను మూసివేస్తానని ఆలయ ముఖ్య పూజారి కందరారు రాజీవరు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆయన ఈ నిర్ణయానికి తానిచ్చిన సలహాయే కారణమని హైకోర్టు లాయర్ కూడా అయిన శ్రీధరన్ ఆ సమావేశంలో అన్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆలయాన్ని మూసివేస్తే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందా అని రాజీవరు అడగ్గా అలాంటిదేమీ ఉండదు.. భక్తులంతా మీ వెనుకే ఉన్నారంటూ పిళ్లై ఆయనకు భరోసా ఇచ్చారు. అయితే, ఈ విషయాన్ని ముఖ్య పూజారి రాజీవరు ఖండించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఈ వివాదం బంగారంలాంటి అవకాశం అని పిళ్లై కార్యకర్తలతో అన్నారు. దీనిపై సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. ‘బీజేపీ ఆడు తున్న నాటకాన్ని భక్తులు అర్థం చేసుకోవాలి. శబరిమలలో సమస్యలు సృష్టించాలనే బీజేపీ నేతల కుట్రలపై తగు ఆధారాలు మా వద్ద ఉన్నాయి’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. సోమవారం శబరిమల ఆలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులు -
మతం కన్నా సమానత్వం ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రార్థనా ప్రదేశాల్లో స్త్రీ పురుష భేదం లేకుండా అందరీకి సమాన హక్కులు కల్పించేందుకు ఈ తీర్పు దోహద పడుతోందని మహిళలు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మతం కన్నా, సమానత్వం ముఖ్యం.. సుప్రీం తీర్పుపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అద్భుతమైనదిగా ఆమె వర్ణించారు. హిందుత్వంలో స్త్రీ, పురుష భేదం లేదని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు తనకెంతో ఆనందం కలిగించిందని అన్నారు. మతం కన్నా, సమానత్వం ముఖ్యమైనదని సుప్రీంకోర్టు రుజువు చేసిందని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. ఆలయంలోకి మహిళ ప్రవేశంతో అందరికీ సమాన హక్కుని కల్పించిందన్నారు. తమ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ అంబేద్కర్ నిజంగా గొప్పవాడు.. రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇన్నేళ్లకు మహిళలకు న్యాయం జరిగిందని కర్ణాటక మహళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి జయమాల సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంతో ఇంతగా సంతోష పడిన రోజు ఇంకోకటి లేదని.. రాజ్యాంగాన్ని నిర్మించి మహిళల హక్కులు గుర్తించిన అంబేద్కర్ నిజంగా గొప్పవాడని గుర్తు చేసుకున్నారు. వీరే కాకుండా అనేక మంది మహిళా ఉద్యమ నేతలు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము పోరాడుతున్న దానికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
శబరిమల దారిలో..
-
శబరిమల ప్రవేశానికి మహిళలకు నిబంధన
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలు ఇకపై వయసు నిర్ధారణ పత్రాన్ని తప్పనిసరిగా తీసుకొని రావాలని ది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) స్పష్టం చేసింది. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు దేవస్థాన ప్రవేశం నిషేధించిన నేపథ్యంలో బోర్డు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఏదైనా వయసు నిర్ధారణ పత్రం లేదా ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందని టీడీబీ చైర్మన్ ఏ. పద్మాకుమార్ తెలిపారు. -
తెరుచుకున్న శబరిమల ఆలయం
శబరిమల: వార్షిక మండలం–మకరజ్యోతి ఉత్సవాల కోసం ప్రఖ్యాతిగాంచిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. బుధవారం సాయంత్రం తంత్రి (ఆలయ ప్రధాన పూజారి) మహేశ్ మొహన్నరు గుడి తలుపులను తెరిచారు. విరీచికం (మలయాళ నెల తొలి రోజు) సందర్భంగా గురువారం ఉదయం తంత్రి అష్టద్రవ్య మహా గణపతి హోమం నిర్వహించి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆలయం తెరవడంతో దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. 41 రోజులపాటు నిర్వహించే మండల పూజ కార్యక్రమం డిసెంబర్ 26న పూర్తికానుంది. అదే రోజు పూజ తర్వాత గుడి తలుపులు మూసి డిసెంబర్ 30న తెరుస్తారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం అయిన వారం తర్వాత ఆలయ తలుపులు మూసేస్తారు. -
'పంబలో దుస్తులు వేస్తే కఠిన చర్యలు'
కేరళ: శబరిమల యాత్రికులకులు పంబలో తమ వస్త్రాలను పడేయడం పట్ల కేరళ హై కోర్టు తీవ్రంగా స్పందించింది. నదీ జలాలను కలుషితం చేసే చర్యలను సమర్థించబోమని తెలిపింది. వస్త్రాలను, ఇతర వస్తువులను నదిలో పడేసినట్లయితే వారికి చట్ట ప్రకారం శిక్షల ఉంటాయని తెలిపింది. దీని ప్రకారం ఈ చర్యలకు పాల్పడిన వారికి గరిష్టంగా ఆరేళ్ల శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు. హైకోర్టు తీర్పుపై శబరిమల స్పెషల్ కమీషనర్ బాబు మాట్లాడుతూ.. శబరిమల యాత్రికులు పుణ్యం కోసం లేదా మరే ఇతర కారణాల చేతనైనా తమకు సంబంధించిన తమ దుస్తులు, ఇతర వస్తువులను పంబ నదిలో వేసి నదిని కలుషితం చేసే చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలుంటాయన్నారు.