'పంబలో దుస్తులు వేస్తే కఠిన చర్యలు' | Discarding of clothes in Pampa river never a practice | Sakshi
Sakshi News home page

'పంబలో దుస్తులు వేస్తే కఠిన చర్యలు'

Published Mon, Nov 9 2015 2:39 PM | Last Updated on Sun, Sep 3 2017 12:17 PM

Discarding of clothes in Pampa river never a practice

కేరళ: శబరిమల యాత్రికులకులు పంబలో తమ వస్త్రాలను పడేయడం పట్ల కేరళ హై కోర్టు తీవ్రంగా స్పందించింది. నదీ జలాలను కలుషితం చేసే చర్యలను సమర్థించబోమని తెలిపింది. వస్త్రాలను, ఇతర వస్తువులను నదిలో పడేసినట్లయితే వారికి చట్ట ప్రకారం శిక్షల ఉంటాయని తెలిపింది. దీని ప్రకారం ఈ చర్యలకు పాల్పడిన వారికి గరిష్టంగా ఆరేళ్ల శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు.

హైకోర్టు తీర్పుపై శబరిమల స్పెషల్ కమీషనర్ బాబు మాట్లాడుతూ.. శబరిమల  యాత్రికులు పుణ్యం కోసం లేదా మరే ఇతర కారణాల చేతనైనా తమకు సంబంధించిన తమ దుస్తులు, ఇతర వస్తువులను పంబ నదిలో వేసి నదిని కలుషితం చేసే చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలుంటాయన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement