ప్రయాగ్‌రాజ్:ప్రధాని మోదీ తాను ధరించే దుస్తుల ప్రత్యేకత గురించి వేరే చెప్పనవసరం లేదు. దుస్తుల విషయంలో ఆయన ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్‌ను అనుసరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించే సందర్భం ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదాయానికి తగట్టు వ్యవహరిస్తూనే ఫ్యాషన్‌ను ఫాలో అవుతుంటారు.
బుధవారం(ఫిబ్రవరి5) ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఏకంగా మూడు రకాల దుస్తులు ధరించారు. అరాలీ ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి బోట్‌లో వెళుతున్న సమయంలో సంప్రదాయ కుర్తా,పైజామా పైన నెహ్రూ జాకెట్ ధరించారు.
ఇక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించే సమయంలో మాత్రం ప్రధాని సంప్రదాయానికి భిన్నంగా అథ్లీజర్ దుస్తులను ధరించారు. మెడలో నీలిరంగు స్కార్ఫ్ వేసుకుని మణికట్టుకు రుద్రాక్ష మాల చుట్టుకున్నారు.
స్నానం పూర్తయి హారతి ఇచ్చే సమయంలో కుర్తా,చుడీదార్ పైజామా వేసుకున్నప్పటికీ కుర్తాపై పఫ్ఫర్ జాకెట్ ధరించారు.తలపై రంగురంగుల పహారీ టోపీ ధరించారు. ప్రధాని కుంభమేళా పర్యటన సమయంలో ధరించిన దుస్తుల విషయంలో సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment