![Wearing Short Clothes In Public Places Is Ok Court](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/court2.jpg.webp?itok=9ihHGmu7)
న్యూఢిల్లీ:ఒళ్లు కనిపించేలా పబ్లిక్ ప్లేసుల్లో చిన్న దుస్తులు వేసుకోవడంపై ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు తాజాగా కీలక తీర్పు చెప్పింది. అదేమీ నేరం కాదని స్పష్టం చేసింది. బార్‌లో చిన్న దుస్తులు వేసుకుని డ్యాన్సులు చేసిన ఏడుగురు బార్ డ్యాన్సర్లపై ఉన్న కేసును కొట్టేసింది. ఇక ముందు కేవలం డ్యాన్సులు చేసినందుకు కాకుండా డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురైతేనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది.
ఢిల్లీలోని ఓ బార్‌లో యువతులు చిన్న దుస్తులు వేసుకుని అశ్లీల నృత్యాలు చేశారని అదే సమయంలో బార్ వైపు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురయ్యాయ అన్నదానిని పోలీసులు నిరూపించలేకపోయాడని కోర్టు పేర్కొంది.
పోలీసుల ఫిర్యాదు,వాంగ్మూలాలకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షులు కూడా బార్‌కు ఎంజాయ్ చేయడానికి వెళ్లామే తప్ప తమకు ఏమీ తెలియదని చెప్పారని కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment