bar dancers
-
బార్లలో మహిళా డ్యాన్సర్లు, సప్లయర్లు..
కర్ణాటక, బనశంకరి: ఉద్యాన నగరిలో నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న మూడు బార్ అండ్ రెస్టారెంట్లపై ఆదివారం రాత్రి సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడిచేసి 100 మందికిపైగా యువతులను కాపాడి, సిబ్బందిని అరెస్ట్ చేశారు. అశోకనగరలోని రెసిడెన్సీరోడ్డులో గల పేజ్ త్రీ బార్‌పై దాడిచేసిన సీసీబీ పోలీసులు 17 మంది సిబ్బందిని అరెస్ట్ చేసి 67 మంది యువతులను కాపాడారు. యువతులందరూ బార్లో డ్యాన్సర్లుగా, సప్లయర్లుగా పనిచేసేవారు. బార్లో ఉన్న 27 మంది కస్టమర్లను పంపించేశారు. పరారీలో ఉన్న యజమాని సంతోష్, రాజు కోసం గాలిస్తున్నామని డీసీపీ చేతన్‌సింగ్ తెలిపారు. టైమ్స్ బార్‌పై దాడిచేసిన పోలీసులు 27 మంది యువతులను కాపాడి 16 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యజమాని మహేశ్, పాయల్ కోసం గాలిస్తున్నారు. కబ్బన్‌పార్కు సమీపంలోని డయట్ బార్‌పై దాడిచేసిన పోలీసులు ముగ్గురు సిబ్బందిని అరెస్ట్ చేసి 15 మంది మహిళా ఉద్యోగుల్ని కాపాడారు. మూడు బార్లలోనూ పెద్ద శబ్ధంతో మ్యూజిక్ పెట్టడం, ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసిందని డీసీపీ చేతన్‌సింగ్ తెలిపారు. అశోక్‌నగర, కబ్బన్ పార్కు పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. -
డ్యాన్స్ బార్లలో నోట్ల వర్షం
కర్ణాటక, బనశంకరి: ఐటీ సిటీలో పబ్బులు, డ్యాన్సింగ్ బార్లు, అటాచ్డ్ బార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిని సంపన్నులు, అధికాదాయ యువకులు తదితరులు వెల్లువలా సందర్శిస్తుంటారు. బ్రిగేడ్‌రోడ్, ఎంజీరోడ్తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో పదులసంఖ్యలోనున్న పబ్బులు,డ్యాన్సింగ్ బార్లలో డ్యాన్స్ లు చేసే యువతులపై ప్రతి రోజూ రూ.5 కోట్లకు పై గా నోట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది అతిశయోక్తి అనిపించినా నిజం. దేశ విదేశీ మద్యం మత్తులో వినుసొంపైన మ్యూజిక్‌లో నగరవాసులు బార్డ్యాన్సర్ల పై నోట్లను విచ్చలవిడిగా వెదజల్లుతుంటారు. బెంగళూరులో తామరతంపర రాష్ట్రంలో ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులో ఈ మాఫియా అధికంగా ఉంది. బెంగళూరులో అంచనా ప్రకారం 100కు పైగా లైవ్‌బ్యాండ్, డాన్స్బార్లు ఉన్నాయి. 325 అటాచ్డ్ బార్లు కలిగిన పబ్‌లు 61 ఇండిపెండెంట్ పబ్‌లు ఉన్నాయి. అనేక బార్లు, పబ్‌లో ఎలాంటి అనుమతులు లేని డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఉత్తరాది నుంచి డ్యాన్సర్ల రాక ⇔ బీహార్, నేపాల్, పశ్చిమ బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్, ముంబయిల నుంచి అమ్మాయిలు ఇక్కడకు డ్యాన్సర్లుగా వస్తున్నారు. ⇔ కొన్ని బార్లు, పబ్‌లలో కస్టమర్లను ఆకర్షించడానికి విదేశీ యువతులను రప్పిస్తున్నారు. ⇔ నగదు, ఉద్యోగం పేరుతో యువతులకు ఆశచూపించి నగరానికి రప్పించే మధ్యవర్తులు పీజీ, లాడ్జ్‌లు, లేదా రింగ్‌రోడ్డులో ఉండే అపార్టుమెంట్లులో వసతి కల్పిస్తారు. ⇔ నిత్యం సాయంత్రం ప్రత్యేక వాహనాల్లో బౌన్సర్లభద్రత మధ్య వాహనాల్లో డ్యాన్సర్లను బార్లకు తరలిస్తారు. ⇔ నృత్యాలను వీక్షించడానికి రోజూ బార్‌కు విచ్చేసే పర్మినెంట్ గిరాకీలు ఉంటారు. ఇలాంటి వారికి రాయితీ , ఇతరత్రా సౌలభ్యాలూ ఉంటుంది. గొడవలు జరిగితే అదుపుచేయడానికి వస్తాదులూ ఉంటారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? ⇔ మ్యూజిక్ వేయడానికి స్థానిక పోలీసులతో అనుమతి తీసుకోవాలి ⇔ డ్యాన్స్బార్లలో యువతులతో అసభ్య అశ్లీల నత్యాలు ప్రదర్శించరాదు యువతులపై నోట్లు చల్లరాదు, నిర్ణయించిన యూనిఫారాల్నే డ్యాన్సర్లు ధరించాలి. ఎక్కడెక్కడ ఎక్కువంటే.. ⇔ మెజస్టిక్, అశోకనగర, కోరమంగల, ఇందిరానగర, గాంధీనగర, బ్రిగేడ్‌రోడ్, డబుల్‌రోడ్, శేషాద్రిపుర, మైసూరురోడ్డు, దుమ్మలూరు, ఎలక్ట్రానిక్ సిటీ, మినర్వా సర్కిల్, జేసీ.రోడ్డు, రెసిడెన్సీ రోడ్డుతో పాటు నగరంలోని హైఫై ఏరియాల్లో నృత్యాలు నిత్యకృత్యం. ⇔ ప్రతి పబ్‌లో నిత్యం రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్దరాత్రి 1 గంట వరకు యువతులతో డ్యాన్స్‌లు నిర్వహిస్తారు. ఈ ఐదు గంటల అవధిలో వచ్చే గిరాకీలు ప్రతినిత్యం లక్ష నుంచి రూ.5 లక్షల వరకు యువతులపై డబ్బు విసురుతుంటారు. ఒకరోజు సేకరణ అయ్యే డబ్బులో మొత్తాన్ని పబ్,బార్ల నిర్వాహకులే తీసుకుంటారు. డ్యాన్సర్లకు, మధ్యవర్తులకు నామమాత్రంగా ఇస్తారు. -
బీజేపీ పరివర్తన్ యాత్రలో అశ్లీల నృత్యాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్‌లో నిర్వహించిన బీజేపీ పరివర్తన్ యాత్ర వివాదాస్పదం అయ్యింది. బహిరంగ సభకు విచ్చేసిన జనాన్నిఅలరించేందుకు స్థానిక నేతలు మంగళవారం బార్ డాన్సర్‌తో అశ్లీల నృత్యాలు చేయించారు. భాగ్‌పత్‌లో బీజేపీ పరివర్తన్ యాత్ర ఏర్పాటు చేయగా.. కేంద్రమంత్రి సంజీవ్ బలయాన్, ఎంపీ సత్యపాల్ సింగ్ దీనికి హాజారు కావాల్సి ఉంది. అయితే సీనియర్ నేతలు సభాస్థలికి చేరుకోవడం కాస్త ఆలస్యం అయ్యింది. ఈలోపు వేదిక వద్దకు చేరుకున్న జనాన్ని అలరించేందుకు ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. బీజేపీ నిర్వాకంపై మిగిలిన రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. -
సెక్స్ రాకెట్ ముఠాకు విద్యార్థులు చెక్!
కోల్ కతా: టెన్త్, ఇంటర్ చదివే విద్యార్థులు అంతర్జాతీయ సెక్స్ రాకెట్ నడుపుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. పశ్చిమబెంగాల్-నేపాల్ సరిహద్దుల్లో డార్జీలింగ్ కు చెందిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. మెంబర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇన్ యాక్షన్ ఫర్ రూల్ గ్రోత్ (మార్గ్), ఎన్జీవో సంస్థ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. డార్జీలింగ్, ఢిల్లీ, హర్యానా పోలీసులు బృందాలుగా ఏర్పడి సెక్స్ రాకెట్ ముఠాకు అడ్డుకట్ట వేశారు. ప్రధాన నిందితుడు గగన్ వర్మను గుర్గావ్ లోని డీఎల్ఎఫ్ ఫేజ్ 2లోని ఇంట్లో హర్యానా పోలీసుల సహాయంతో డార్జీలింగ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. బాలికలు, యువతులను కిడ్నాప్ చేసి వారిని బార్లలో డ్యాన్స్ చేస్తే డబ్బులు ఇప్పిస్తానని ఆశ కల్పిస్తుంటాడు. ఒప్పుకోని వారిపై ఒత్తిడి తెస్తుంటాడు. ముఖ్యంగా డార్జీలింగ్, నేపాల్, సిక్కిం ప్రాంతాల నుంచి అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటారు. గుర్గావ్, ఢిల్లీ ఏరియాలకు వీరిని అక్రమ రవాణా చేస్తుంటారు. ఆ తర్వాత వ్యభిచారం చేయించడం, ఇతర ప్రాంతాలకు అక్రమరవాణా చేస్తుంటారు. మరో నిందితుడు సున్నీ తమాంగ్ పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు మహిళా, ఇద్దరు పురుష కానిస్టేబుల్స్ టీమ్ లో ఉన్నారు. సిలిగురిలో అడిషనల్ చీఫ్ జస్టిస్ ఎదుట సున్నీ తమాంగ్ ను హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. టెన్త్, ఇంటర్ చదివే 12 మంది విద్యార్థులు ఎన్జీవోలో పనిచేస్తున్నారు. ఓ బాలిక ఎన్జీవో సంస్థకు చెందిన కొందరు విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తామని అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ముఠా సభ్యుడికి పరిచయం చేసింది. జాబ్ కావాలని అడిగిన వాళ్లను ఫొటోలు పంపించమని అడిగారు. 20 నిమిషాల్లోపే వారి పేర్లతో ఫేక్ ఆధార్ కార్డులు, వాటితో పాటు జాబ్ అపాయింట్ మెంట్ లెటర్స్ ను మెయిల్ చేశారు. విద్యార్థులు నిందితుల వివరాలను, ఈ ఆధారాలను పోలీసులకు అందజేశారు. జూన్ 8న తొలిసారి పోలీసులకు సమాచారం అందించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయించినట్లు ఛెత్రి తెలిపాడు. రెండోసారి ఇలాగే చేసి జూన్ 9న ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా పశ్చిమబెంగాల్ కు చెందిన ప్రణిత ముఖియా అనే మహిళను అరెస్ట్ చేశారు. తాజాగా శనివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మొత్తం ఎంత మందిని అదుపులోనికి తీసుకున్న వివరాలపై స్పష్టత లేదు.